“ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశానికి వెళ్ళకుండా ఉండకండి
బైబిలు ఉపదేశాలతో కూడిన మూడు ప్రతిఫలదాయకమైన రోజులు మీ కొరకు వేచి ఉన్నాయి. శుక్రవారం 9:40 నిమిషాలకు కార్యక్రమం మొదలయ్యేవేళకు అక్కడ హాజరై ఉండండి. “ఆనందమయ స్తుతికర్తలారా మీకు స్వాగతం!” అనే ప్రారంభ ప్రసంగానికి, అలాగే “ప్రపంచవ్యాప్త ఆనందమయ స్తుతికర్తలుగా వేరైవుండడం” అనే ముఖ్యాంశ ప్రసంగానికి అవధానమివ్వండి.
శుక్రవారం మధ్యాహ్న కార్యక్రమం యౌవనస్థులపై, వారి తల్లిదండ్రులపై, వారి విద్యాభ్యాసంపై శ్రద్ధ నిలుపుతుంది. అనేకులు వినడానికి ఇష్టపడే “నేను వివాహం చేసుకొనేందుకు సిద్ధమైవున్నానా?” అనే ప్రసంగం. “తమ పిల్లలయందు సంతోషాన్ని పొందే తల్లిదండ్రులు” అనే చర్చను తల్లిదండ్రులు శ్రద్ధగా వినాలి. “విద్య—దానిని యెహోవాను స్తుతించేందుకు వినియోగించండి” అనే ప్రసంగంతో మధ్యాహ్న కార్యక్రమం ముగుస్తుంది. ఇవ్వబడే సమాచారం యౌవనస్థులు పాఠశాలలో విజయవంతంగా కొనసాగడానికి సహాయపడుతుంది.
శనివారం ఉదయాన “యెహోవాను స్తుతించండనే పిలుపుకు ప్రత్యుత్తరమివ్వడం” అనే గోష్ఠి అనేకులను ప్రోత్సాహపరుస్తుంది. ఉదయ కార్యక్రమం బాప్తిస్మ ప్రసంగంతో ముగుస్తుంది. అనాది కాలం నుండే ప్రజలను ఉరిలో వేయడానికి సాతాను లైంగిక కోరికలను ఎలా ఉపయోగించాడో మధ్యాహ్న కార్యక్రమంలో నిర్మొహమాటంగా చర్చించబడుతుంది. దేవుని ప్రజలు తమ పరిచర్యను మరింత ఫలవంతంగా నిర్వహించడానికి సంసిద్ధులను చేసే సమాచారాన్నందించడంతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది.
ఆదివారం ఉదయ కార్యక్రమంలో, ఆలస్యం చేయకుండా “మహా శ్రమల” నుండి తప్పించుకునేందుకు పారిపోవలసిన ఆవశ్యకాన్ని గూర్చి తెలుపుతూ పురికొల్పే సమాచారం అందించబడుతుంది. (మత్తయి 24:21) “అర్హులైన వృద్ధులను గౌరవించడం” అనే ప్రాముఖ్యమైన నాటకంతో ఆ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం, “సకలయుగములలో రాజైయున్న వానిని స్తుతించుడి!” అనే బహిరంగ ప్రసంగం, సమావేశం యొక్క మరొక ముఖ్యాంశమై ఉంటుంది.
ఇండియాలోనే 16 సమావేశాల కొరకు ఏర్పాటు చేయబడింది గనుక, మీకు దగ్గరలో కూడా ఒక సమావేశం ఉంటుంది. మీకు దగ్గరలో జరిగే సమావేశ సమయాన్ని, స్థలాన్ని గూర్చి తెలుసుకోవడానికి స్థానిక యెహోవాసాక్షులను అడిగి తెలుసుకోండి.