మనమెక్కడికి వెళ్తున్నాం?
మీరు క్రితమెన్నడూ చూడని ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నారని ఊహించుకోండి. మీరిప్పుడు మీ గమ్యస్థానానికి చేరుకుని ఉండాలి, కాని వీధి బోర్డులు, నగరం పేర్లు, సరిహద్దు గుర్తులు మీరనుకున్నట్లు కాదు. ‘నేనెక్కడున్నాను?’ ‘నేను సరైన చోటికి వెళ్తున్నానా?’ అని మీరు ఆశ్చర్యపడవచ్చు.
నేటి లోకం ఇలాంటి సంకటమైన పరిస్థితిలో ఉంది. ముందెన్నడూ చూడనంత ఎక్కువగా సమాజం క్షీణించిపోతున్నదని మానవుడు గమనిస్తున్నట్లుగానే, అతడు పరిచయం లేని ప్రాంతంలో ఉంటున్నాడు. విజ్ఞానశాస్త్రంలోను, సాంకేతిక శాస్త్రంలోను ఉన్న ప్రగతి వల్ల, ఈ పాటికి మనం శ్రేష్ఠమైన లోకంలో ఉంటామని అనిపిస్తుంది. గ్రేట్ ఏజెస్ ఆఫ్ మ్యాన్‌లో సంపాదకుడైన రస్సల్ బోర్న్ 20వ శతాబ్దంలో మాత్రమే “భూవ్యాప్త సహోదరత్వం అనే పాత తలంపు వాస్తవమైంది” అని పేర్కొన్నాడు.
అయినప్పటికీ, “భూవ్యాప్త సహోదరత్వం” అనే ఆ గమ్యాన్ని చేరుకోలేదు. ఆర్థిక భద్రత, చాలినంత ఆహారం, మెరుగైన ఆరోగ్యం మరియు సంతోషకరమైన కుటుంబ జీవితం అనే వాగ్దానాలు ఎక్కడా కనిపించడం లేదు. “విధ్వంసకాండకు, క్రూరమైన పనులకు విజ్ఞాన శాస్త్ర పురోగతి అనేక విధాల్లో నేరుగా ఉపయోగించబడింది” అని మైల్‌స్టోన్స్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తకం చెబుతుంది.
అవును, మానవుడు నేడు సరైన స్థానం నుండి వైదొలగి, ఈ శతాబ్దారంభంలో కలలుగన్న శాంతి భద్రతలకు దూరంగా, అపరిచిత ప్రాంతంలో విడువబడ్డాడు. కాబట్టి, “మనమీ పరిస్థితులకు ఎలా దిగజారాం? లోకం ఎక్కడికి పయనిస్తోంది? మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామా?” అని మార్గనిర్దేశాల కొరకు నేడు అనేకులు ప్రశ్నిస్తున్నారు.
మనమెక్కడనున్నామని కనుక్కోవడానికి, మనం మొదట మన ప్రస్తుత పరిస్థితులను నిర్ధారించుకోవాలి. మనం క్రొత్తలోకం వాకిట ఉన్నామని కొందరు అంటారు; మనం నాశనానికి సమీపంలో ఉన్నామని మరి కొందరు అంటారు. మనమెక్కడ ఉన్నాం, మనమెక్కడికి వెళ్తున్నాం అని గ్రహించడానికి రహదారి పటంలా బైబిలు మనకు తోడ్పడుతుంది.
మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీ ప్రాంతాన్ని సూచించే ఆనవాల్లను గమనించడం ప్రాముఖ్యం. అలాగే, చరిత్రలో “అంత్య దినములు” అని పిలువబడే కాలాన్ని సూచించే లక్షణాలను—లోక పరిస్థితులను, మనోభావాలను—బైబిలు వర్ణిస్తుంది. (2 తిమోతి 3:1-5) “అంత్య దినములు” అనే ఈ పదం అక్షరార్థ భూమ్యాకాశముల అంతాన్ని సూచించడంలేదు. బదులుగా, అది “ఈ విధానాంతాన్ని” లేదా ఒక బైబిలు అనువాదం చెబుతున్నట్లు, “యుగాంతాన్ని” గూర్చి తెలియజేస్తుంది.—మత్తయి 24:3; టుడేస్ ఇంగ్లీషు వర్షన్.
‘అంత్యదినములలో వ్యవహరించనశక్యమైన అపాయకరమైన కాలములు వచ్చును’ అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:1) నిజమే, ఇది చరిత్రలోని ఇతర కాలాలకు కూడా వర్తించగలదని అనిపించవచ్చు. వాస్తవానికి, ప్రతి కాలం దాని వంతు కష్టాలను కలిగి ఉంది.
అలాంటప్పుడు, ఈ మాటలు మన దినాలను సూచిస్తున్నాయని నమ్మడానికి ఏ కారణముంది?
[Picture Credit Line on page 3]
Tom Haley/Sipa Press