మీరు సురక్షితంగా డ్రైవ్ చేస్తారా?
మీరు కారు స్టీరింగ్ వెనుక కూర్చున్నప్పటి మీ దృక్పథం మీ డ్రైవింగ్ సామర్థ్యాన్ని బాగా ప్రభావితం చేయగలదు. బ్రిటీష్ ఆటోమొబైల్ అసోషియేషన్ చేసిన అధ్యయనం బయల్పరచినదేమంటే, 17 నుండి 20 ఏండ్ల ప్రాయమున్న బ్రిటీష్ పురుషుల్లో ప్రతి సంవత్సరం 22 శాతం మంది కనీసం ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
సురక్షితం కాని వారి డ్రైవింగ్ అలవాట్లకు ముఖ్య కారణాలేంటి? మద్యం, అస్థిర మానసిక స్థితి, బిగ్గరగా వినపడే సంగీతాలు మాత్రమే కాక, “తోటివారి వలన కూడా అనేకులు ప్రమాదకరంగా నడిపే ప్రభావానికి లోనయ్యారు,” అని ఆటోమొబైల్ అసోసియేషన్ యొక్క డిప్యూటి డైరెక్టర్ జనరల్, కెనెత్ ఫార్క్లోత్ అంటున్నాడు. దాని ఫలితంగా, ఆటోమొబైల్ అసోసియేషన్ సిఫారసు చేసేదేమంటే, డ్రైవింగ్ చేసే విధానాల మీది కన్నా, డ్రైవర్కుండవలసిన మనోదృక్పథాలపై శిక్షణనివ్వడానికి ఎక్కువ శ్రద్ధను కేంద్రీకరించాలి.
ఉదాహరణకు, మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి: ‘ఉదాసీనంగా అపాయాలకు తావిస్తూ, నేను నా కారులో ఉన్న ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నానా? నా మానసిక స్థితి స్టీరింగ్‌కు వెనుకనున్న నా ప్రవర్తనను తీర్మానిస్తుందా? రోడ్డుమీది ఇతర డ్రైవర్లను, అధిగమించవలసిన ఆటంకాలుగా నేను దృష్టిస్తానా? ఈ ప్రశ్నల జవాబులు మీరెలాంటి డ్రైవరో బయల్పరుస్తాయి.
పురుషుడైనా, స్త్రీయైనా, యువకుడైనా, వృద్ధుడైనా డ్రైవ్ చేసేటప్పుడు, సహానుభూతి కలిగి ఉండాలనే మనోదృక్పథాన్ని పెంపొందించుకోండి. “మనుష్యులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు ఇష్టపడతారో మీరు కూడా వారితో ఖచ్చితంగా అలాగే వ్యవహరించండి.” (మత్తయి 7:12, ఫిలిప్స్) ఆ విధంగా చేయడం మీరు సురక్షితంగా డ్రైవ్ చేయడానికి మీకు తోడ్పడుతుంది.