కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 11/8 పేజీలు 22-23
  • ఈ అందమైన సీతాకోకచిలుకలు విషపూరితమైనవా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ అందమైన సీతాకోకచిలుకలు విషపూరితమైనవా?
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • వలస వెళ్లే మోనార్క్‌ సీతాకోకచిలుక
    సృష్టిలో అద్భుతాలు
  • సీతాకోక చిలుక జీవితం
    తేజరిల్లు!—1994
  • పాఠం 1
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • నాజూకైనదే కానీ సాహసియైన ప్రయాణికురాలు
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 11/8 పేజీలు 22-23

ఈ అందమైన సీతాకోకచిలుకలు విషపూరితమైనవా?

దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! ప్రతినిధి

సీతాకోకచిలుక రెక్కలు కొట్టుకొంటూ ఎగరటం చూసి మీరు ఎప్పుడైనా పరవశించి పోయారా? దాని అందం, దాని తీరు, దాని రంగులు మిమ్మల్ని ముగ్ధులను చేశాయా? అది ఒక పుష్పమునుండి మరొక పుష్పానికి ఎగిరేటప్పుడు, మీకు ఆశను పుట్టించేదిగాను, తీయని కోరికను కలిగించినట్లుంటుంది. మీరు దాన్ని దగ్గరగా చూడాలని యిష్టపడినా, అది కనీసం ఫోటోగ్రాఫ్‌ అయినాసరే, అది ఎప్పుడూ ఒక పువ్వు దగ్గరే ఎక్కువసేపు ఉండలేదు—అది దాని రెక్కలను పైకి క్రిందకి ఎల్లప్పుడు రెపరెపలాడిస్తూనేవుంటుంది. కాని రమ్యమైన ప్రాణుల్లో కొన్ని విషపూరితమైనవని విశ్వసింపబడుతున్నాయని మీకు తెలుసా?

ఈ పేజీల్లోవున్న రెండింటిని చూద్దాము—మొనార్క్‌ సీతాకోకచిలుక (కుడివైపున), నారింజ రంగు, గోధుమ రంగు కలగలిసిన వర్ణములతో మరియు నలుపుతో పెద్ద రెక్కలతోను, మరొకటి వైస్‌రాయ్‌ (పైన) సాధారణముగా చిన్నదిగా వున్నప్పటికీ, యిది చాలావరకు మొనార్క్‌ సీతాకోకచిలుకలాగానే కనబడుతుంది. ఏది వాటిని విషపూరితమైనవిగా తయారుచేస్తుంది, అది ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది?

సుమారుగా 15,000 కంటె ఎక్కువ రకాలున్న సీతాకోకచిలుకలు, క్రమముగా నాలుగు దశలనుండి వృద్ధి చెందుతూ, సున్నితమైన రెక్కలు కలిగిన ఆ చోద్యములైన సీతాకోకచిలుకలవ్వటం మనం మనతోటల్లో చూస్తుంటాము. ఆ దశల్లో క్రిమిదశ, లేదా గొంగళిపురుగు ఒకటి. ఈ మొనార్క్‌ గొంగళిపురుగు పాలు వచ్చే కలుపు మొక్కలను తింటుంది, తద్వారా “దాన్ని తిని, వాంతి చేయని ఏ పక్షికైన అది మరణకరమైన, నిజంగా విషపూరితమైన సీతాకోకచిలుక అవుతుందని,” టిమ్‌ వాకర్‌, సైన్సు న్యూస్‌లో వ్రాస్తున్నాడు. ఆ విషం కార్‌డినోలిడి, గుండెకు విషముగా ఉంటుంది. మరి వైస్‌రాయ్‌ సీతాకోకచిలక విషయమేమిటి?

వాకర్‌ వివరిస్తున్నాడు: “ఒక శతాబ్దముకంటె ఎక్కువకాలముగా, డెన్యెస్‌ ప్లేక్సిపస్‌ అనే విషపూరిత మొనార్క్‌ సీతాకోకచిలుక రంగులుగల తన రెక్కలక్రింద రుచికరమైన క్రిమి శరీరాన్ని దాచుకొందని “సహజముగా నమ్మేవారు.” వీటిని మీరు ఫోటోలో చూస్తున్నట్లుగా, వైస్‌రాయ్‌ సీతాకోకచిలుక క్రింది రెక్కలపై సన్నని నల్లని గీత తప్ప, యీ రెండునుకూడ ఒకేమాదిరియైన తీరులతో ఉంటాయి. ఏ పక్షులైతే రుచిలేని సీతాకోకచిలుకకు దూరంగా ఉండడానికి నేర్చుకున్నాయో, ఆ పక్షుల బారినుండి తప్పించుకునే ప్రయత్నంలో వైస్‌రాయ్‌ సీతాకోకచిలుక ఆ విషపూరితమైన మొనార్క్‌ సీతాకోకచిలుక రెక్కల డిజైన్‌లోకి పరిణమించిందని గత నూరు సంవత్సరాలనుండి పరిణామవాదులు నమ్ముతున్నారు. ఈ ఒకటి తప్ప, వైస్‌రాయ్‌ సీతాకోకచిలుక పక్షులకు రుచికరంగా వుంటుందని విశ్వసిస్తున్నారు.

ఇటీవలకాలములో పరిశీలకులు దేనిని కనుగొన్నారు? వాకర్‌ యిలా వ్రాస్తున్నారు: “ఏమైనప్పటికి, క్రొత్త పరిశీలన తెలియజేయునదేమనగా, ఆ వైస్‌రాయ్‌ సీతాకోకచిలుక సఫలీకృతమైనది పక్షులను మోసగించటంలో కాదు, వైజ్ఞానికులనే . . . విషపూరితమైన మొనార్క్‌ సీతాకోకచిలుక రుచిలాగే, వైస్‌రాయ్‌ సీతాకోకచిలుక రుచికూడా వివేచించగల పక్షులకు వెగటుగా ఉంటుందని ఇద్దరు జంతుశాస్త్రనిపుణులు నిరూపించారు.” ప్రత్యేకంగా, దాని లార్వా విషపూరితమైన మొక్కలనుండి కాకుండ, విషములేని గుల్మజాతి మొక్కలను తింటూన్నప్పటికీ వైస్‌రాయ్‌ ఎందుకు రుచిలేనిదిగా ఉంటుంది? వాకర్‌ యిలా రాస్తున్నారు: “యీ వైస్‌రాయ్‌ సీతాకోకచిలుకలు తమ రక్షణకొరకు ఏదో ఒక విధమైన రసాయనాన్ని స్వంతంగా తయారుచేసుకుంటాయని యిది సూచిస్తుంది.”

నిజానికి, కీటకశాస్త్రపు ప్రస్తుతస్థితి సూచించినదేమనగా, నిపుణులు చాలా నేర్చుకోవల్సివుంది, అంతేకాకుండా, బహుశా వారు “సహజ నమ్మకము”పై తక్కువ ఆధారపడాలి. మొనార్క్‌ సీతాకోకచిలుకను గూర్చి యిటీవల ప్రచురించబడిన పుస్తకమును గూర్చి ఒక విమర్శకుడు యీవిధంగా వ్రాశాడు: “ఈ ప్రఖ్యాతిగాంచిన పుస్తకము తెలుపునది ఏమిటంటే, మొనార్క్‌ సీతాకోకచిలుకను గూర్చి ఎక్కువగా నేర్చుకొంటున్నకొలది దానిని గూర్చి మనకు ‘తెలిసింది’ కొంతే అన్పిస్తుందని నమ్మకముతో మనము చెప్పగలము.”

మరెక్కువగా, దానినిగూర్చి బైబిలు వివరిస్తుంది: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను.”—ప్రకటన 4:11.

భూమిపైనున్న అన్ని రకాల ప్రాణులనుగూర్చి మానవుడు నేర్చుకోవలసింది యింకా చాలావుందని స్పష్టముగా కన్పిస్తుంది. ఖచ్చితమైన జ్ఞానానికి గల ఒక ప్రధానమైన అవరోధమేదనగా చాలమంది వైజ్ఞానికులు సృష్టికర్తయును రూపనిర్ణేతయును అయినవాని చురుకైన పాత్రను, అతని ఉనికిని అంగీకరించటానికి తిరస్కరించటమే. గణితశాస్త్ర అధ్యాపకుడైన, పాల్‌ డేవిస్‌, ది మైన్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అను తన పుస్తకములో: “చాలామంది వైజ్ఞానికులు ఎటువంటి రీతుల ఆధ్యాత్మికమైన . . . వాదములనైనా స్వాభావికంగా వ్యతిరేకిస్తారనుటకు ఎలాంటి సందేహములేదు. . . . వ్యక్తిగతముగా నేను వాళ్ల తిరస్కారములో భాగము వహించటంలేదు. . . . ఈ విశ్వములో మన ఉనికి అనేది కేవలం విధియొక్క వక్రోక్తివల్ల, చరిత్రలో ప్రమాదం ఏర్పడటం వల్ల, గొప్ప విశ్వతత్త్వములోని నాటకములో అనుకోని భ్రంశమువల్ల ఏర్పడిందని నేను నమ్మడంలేదు.”

కీర్తన రచయితయైన దావీదు వ్రాశాడు: “‘దేవుడు లేడని’ బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు.” మరొక ప్రక్కన, జ్ఞానముగల వ్యక్తి వినయముతో సృష్టికర్త ఉన్నాడని ఒప్పుకొంటాడు, ప్రవక్తయైన యెషయాకూడ అట్లే చెప్పాడు: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చునదేమనగా—‘యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు’.”—కీర్తన 14:1; యెషయా 45:18.

[22,23వ పేజీలోని చిత్రాలు]

మొనార్క్‌ (పైన), వైస్‌రాయ్‌, (పేజీ 22). ముఖ్యమైన వ్యత్యాసము వైస్‌రాయ్‌ క్రింది రెక్కలపై నిటారుగా ఉన్న నల్లని చారలే. (ఈ బొమ్మలు వాటి అసలు సైజులు కావు.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి