ఒక ఆధునికదిన మంచి సమరయుడు
కెనడా నందు ఒక స్త్రీ మోటారువాహన ప్రమాదానికి గురైంది. ఆమె సహాయార్థమై ఒక ఆధునిక దిన సమరయుడొచ్చాడు. (లూకా 10:29-37) అతను చూపిన కనికరంతో కదిలింపబడినదై, ది జార్జిటౌన్ ఇండిపెండెంట్‌కు ఆమె ఈ క్రింది విధంగా రాసింది:
‘ప్రియమైన సంపాదకునికి:
‘రెండు కారణాలను బట్టి నేను రాస్తున్నాను. మొదటిగా, క్రిందటి వారాంతాన నా కారు అదుపు తప్పిన తరువాత కందకంలో పడిన్నప్పుడు నాకు సహాయం చేసిన జార్జ్‌టౌన్‌లోని ఒక నివాసికి కృతజ్ఞతలు తెల్పాలనుకుంటున్నాను.
‘జాన్ సాండర్స్ గారు వాహనాన్ని నడుపుకెళ్తూ, ఆపుజేశారు. ఆయన ప్రథమ చికిత్స మొదలు పెట్టారు, ఎంతో ఓదార్పునిచ్చారు. అంబులెన్సు డ్రైవర్లు, పోలీసులు వచ్చి తీసుకెళ్ళేంత వరకు ఆయన నాతోనే ఉన్నారు. మీ సమాజంలో ఉన్న సాండర్స్‌గారి వంటి మంచి సమరయుడిని కల్గి ఉన్నందున మీ సమాజం ఆశీర్వదింపబడింది.
‘నేను బాగానే ఉన్నానని నిశ్చయ పర్చుకోడానికి, ఆసుపత్రి నందు నన్ను, నా భర్తని చూడడానికే సాండర్స్‌గారు వచ్చారు. జార్జిటౌన్ నందు యెహోవా సాక్షుల ప్రధాన కార్యాలయమందు సాండర్స్‌గారు పని చేస్తున్నారని కనుగొనగానే నేను దిగ్భ్రాంతి చెందాను. ఆ ప్రజలు వైద్యాన్ని నమ్మరని నేనెల్లప్పుడు అనుకొనేదాన్ని, ఇక్కడ వారిలో ఒకరు నా కోసం ప్రథమ చికిత్సా పద్ధతిని ఉపయోగించారు. నేను వ్రాయడానికిగల రెండవ కారణంకూడా ఉంది.
‘నన్ను సందర్శించడానికి మాయింటికి వచ్చిన యెహోవా సాక్షుల యెడల నేను చూపిన అసభ్య ప్రవర్తననుబట్టి వారందరిని నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మీరు మత మూఢులని నేనెల్లవేళలా నమ్మేదాన్ని. ఈ భయంకరమైన ఊహ పొరపాటని సాండర్స్ గారు రుజువు పర్చారు. మీరు మంచిదని భావించేదాన్ని చేయ ప్రయత్నించే సాధారణమైన ప్రజలే మీరంతా.
‘సాండర్స్ గారికి మరొకసారి, కృతజ్ఞతలు. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు.
‘టి. ఎమ్., టొరొన్‌టో’ (g94 5/8)
‘నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను’ అనే దానిని యెహోవాసాక్షులు నమ్ముతారు. (లూకా 10:27) యెహోవా సాక్షులను గూర్చి మీరు ఎక్కువగా నేర్చుకోవాలని కోరినట్లయితే లేక ఉచిత గృహబైబిలు పఠనం కావాలనుకుంటే, దయచేసి Watchtower, H-58, Old Khandala Road, Lonavla, 410 401 Mah., లేదా 5వ పేజీలోని మీకు తగిన చిరునామాకు వ్రాయండి.