కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 5/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రక్త మార్పిడి దూషణ
  • దౌర్జన్యంగావింపబడ్డ పిల్లలు
  • ఘాటైన మిరియాల ప్రియులు
  • ఆత్మహత్యను అరికట్టుట
  • వ్యవస్థీకరింపబడిన నేరం
  • మిడతలు తిరిగి వచ్చుట
  • కావలెను: బౌద్ధ సన్యాసులు
  • రుతుస్రావస్తంభన తరువాత గర్భధారణ?
  • స్థూలదేహంతో వచ్చిన చిక్కు
  • త్రాగే సమస్యగల యౌవనులు
  • న్యాయమిదేనా?
  • నమ్ముటకు విజ్ఞానశాస్త్ర ఆధారం
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2004
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2000
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 5/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

రక్త మార్పిడి దూషణ

ఏ దేశం కన్నా, ఒక్కొక్క వ్యక్తిపై అత్యధిక రక్తోత్పత్తులను ఖర్చుచేసే జర్మనీ, “ప్రపంచంలో నమ్మదగిన వైద్య శాఖలలో ఒకదానిని విమర్శకు గురిచేసిన” దూషణతో కదిలింపబడిందని సూడెయిస్టి జెయిటంగ్‌ వార్తాపత్రిక నివేదించింది. కొన్ని సంవత్సరాలుగా, సరిగా పరీక్షింపని రక్తోత్పత్తులను పెద్దమొత్తంలో ఆసుపత్రులకు అమ్మిన, ఒక బ్లడ్‌ ప్రోసెసింగ్‌ కంపెనీ ఈ దూషణ ప్రచారమందు ఇమిడి ఉంది. తద్వారా, ఈ ఉత్పత్తులను వినియోగించిన వేలాదిమంది ఆస్పత్రి రోగులు హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ అపాయానికి గురయ్యారు. “శస్త్రచికిత్సా సమయమున కలుషిత రక్తం లేక రక్తోత్పత్తుల ద్వారా హెచ్చ్‌ఐవి సోకలేదని ఎవరైనా నిశ్చయ పర్చుకోవాలంటే” తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని ఫెడరల్‌ హెల్త్‌ మినిష్టర్‌ హాస్ట్‌ షిహోఫర్‌ సలహానిచ్చారు. “ఇప్పుడు జనాబాలో 71 శాతం మంది రక్తమార్పిడి తిత్తి నుంచి పొందబోయే ఎయిడ్స్‌కు భయపడ్తున్నార”ని డై జిట్‌ నివేదిస్తుంది. (g94 4/22)

దౌర్జన్యంగావింపబడ్డ పిల్లలు

“పిల్లలకు ప్రతికూలంగా దౌర్జన్యం అత్యున్నత స్థాయికి చేరుకుందని,” బ్రెజిలియన్‌ వార్తాపత్రిక అయిన ఓ ఇష్టాడో డి సావో పౌలో రిపోర్టు చేసింది. అది లైంగిక సంబంధంకాని దురాక్రమణ క్రిందికి వచ్చినప్పుడు, కక్షసాధింపబడిన బాలుర శాతం, కక్షసాధింపబడిన బాలికల శాతం దాదాపు అంతే ఉంది. అయినా లైంగిక దౌర్జన్యం విషయంలో అది నిజం కాదు. లైంగిక బలాత్కారానికి గురైన యవ్వనులలో, 77 శాతం ఆడవారుండగా సుమారు 23 శాతం మగవారున్నారు. గృహసంబంధ బలాత్కారాన్ని చిన్న పిల్లలు సహితం తప్పించు కోలేకపోయారు. సావో పౌలో విశ్వవిద్యాలయమందు విధ్వాంసురాలైన మిరియమ్‌ మెస్‌కీటా చెప్పిన ప్రకారంగా, “పదిసంవత్సరాల వయస్సులోపల ఉన్న హత్యగావింపబడిన బాధితులలో 30 శాతం కంటె ఎక్కువ మంది, కుటుంబ సభ్యుల చేత హత్య చేయబడ్డారు.” ఒక తండ్రి, ఒక మావయ్య, ఒక సోదరుడు, లేక ఒక మారుటి తండ్రి చేత హత్యచేయబడిన సుమారు 29 శాతం మంది పిల్లలు, చనిపోక మునుపు అత్యాచారం చేయబడ్డారు. బ్రెజిల్‌ నందు పిల్లలపై జరిగే గృహసంబంధ దౌర్జన్యాల కేసులన్నింటిలో సుమారు 90 శాతం రిపోర్టు చేయబడలేదని ఓ ఇష్టాడో డి సావో పౌలో నివేదిస్తుంది. (g94 5/8)

ఘాటైన మిరియాల ప్రియులు

అనేకమంది ప్రజలు ఘాటైన మిరియాలు తింటున్నారు. ఘాటైన మిరియాలను ఇష్టపడని అనేకమంది అవి కేవలం ఆహార పదార్థాల సహజ రుచిని అణచి వేస్తాయని నమ్ముతున్నారు. అయినా ఘాటైన మిరియాల ప్రియులు వాస్తవం నుంచి అది దూరంగా ఉందని వాదిస్తారు. రీడర్స్‌ డైజెస్ట్‌ పత్రిక ప్రకారం, మిరియాలను గూర్చిన ఇటీవల పుస్తకం చెప్పేదేమంటే నోటిలోని ఇంద్రియ కణాలతో కలిసి, ఆహార రుచికి వాటిని శీఘ్ర గ్రాహ్యకం చేసే సుగంధ రహిత రసాయనిక పదార్థాన్ని ఘాటైన మిరియాలు కల్గివున్నాయి. ఘాటైన మిరియాలు మీ ఆరోగ్యానికి మంచిదేనని కొంతమంది వాదిస్తారు. మిరియపు గింజలో ఒక నారింజకన్న మరింత ఎక్కువ సి విటమిన్‌ ఉంటుంది. అతి ఘాటైన మిరియాలు మెక్సికో నందలి యుకటాన్‌ నుండి వచ్చిన ఆబానెరో. ఆబానెరోలను తింటుంటే మీ దేహం నుండి మీ తల వేరవుతున్నట్లు మీరు భావించేటట్లు చేస్తాయని చెప్పబడినవి. అయితే ఏ ఇతర విధంగానైనా కొందరికి అలా ఉండక పోవచ్చును. (g94 5/8)

ఆత్మహత్యను అరికట్టుట

“యవ్వనులు ఆత్మహత్య చేసుకొనడం పెరుగుతుండడాన్ని,” బ్రెజిల్‌ పత్రిక అయిన ఓ ఇష్టాడో డి సాన్‌ పౌలో నివేదిస్తూంది. “ప్రేమ వైఫల్యం, మద్యపానం, ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల కృంగుదలలను అనుసరించి వచ్చిన, అస్వస్థతే ఆత్మహత్య కొరకైన ప్రధాన కారణమని,” బ్రెజిల్‌ న్యాయ మంత్రిత్వ శాఖ చేత నిర్వహింపబడిన ఒక అధ్యయనం చూపుతోంది. ఆత్మహత్యను అరికట్టుట యందు కుటుంబ సభ్యుల, స్నేహితుల సహకారం అవసరమై యున్నందున, మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన క్రిష్టియన్‌ గాడీరర్‌ ఇలా సలహా ఇచ్చాడు: ఆత్మహత్యచేసుకొనే “సాధ్యతను తక్కువ అంచనా వేయవద్దు.” మరియు పరస్పరసంభాషణ, ఉద్రిక్తతకు ఉపశమనం కలిగించగలదు. కాబట్టి “నిరుత్సాహానికిగల కారణాలను, తనను చంపుకోవాలని ఆ వ్యక్తి ఎందుకు ఆలోచిస్తున్నాడు, దానిని అతను ఎలా చేయాలని ఉద్దేశిస్తున్నాడో అడగండి.” (g94 4/22)

వ్యవస్థీకరింపబడిన నేరం

“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేర సంస్థల యొక్క విస్తృతపర్చబడిన కార్యక్రమం భయంకరమైన రీతిలో వ్యవస్థీకరింపబడిన నేరం, దాని ప్రభావాన్ని వ్యాపింపజేసిందని,” ఇటలీ ప్రభుత్వ మాఫీయా నిర్మూలనా చర్యల డైరక్టరైన, జిన్నా డి జెన్నారే నొక్కి చెప్పారు. ఇటాలియన్‌ మాఫియా, చైనీస్‌ ట్రయాడ్‌లు, ఉత్తర అమెరికా మోటారు సైకిలు గ్యాంగ్‌లు, మరియు మునుపటి కమ్యూనిష్టు దేశాలలోని నేర వర్గాల వంటి నేర గుంపుల విస్తరణ విషయమై సమాజం నిజంగా చింతించాల్సి ఉంది. సమస్యలను ఎదుర్కొనడాన్ని చట్టాన్ని అమలుపర్చే సంస్థలకు కష్టతరం చేసే శ్రేష్టమైన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణా కౌశల్యాలను సంపాదించడానికి నేరస్థులకు చట్టరహితమైన లాభాలు అనుమతించాయి. (g94 5/8)

మిడతలు తిరిగి వచ్చుట

ఐగుప్తీయుల ఎనిమిదవ తెగులు అయిన, మిడతలు, “ఆఫ్రికాపై దాడికి మరలా సిద్ధమయ్యాయని” ది వీక్లీ మెయిల్‌ & గార్డియన్‌ వార్తాపత్రిక నివేదించింది. ఇప్పటికే 2,00,000 ఎకరాలు (80,000 హెక్టార్లు) యెమెన్‌ నందు కొల్లగొట్టబడగా, చాడ్‌, నైజర్‌, మరియు మాలి ప్రదేశాలను గుంపులు సమీపించాయి. ఉత్తర ఆఫ్రికానందలి 28 దేశాలలోని పంటలను నాశనము చేసిన 1986-87 నాటి తీవ్రమైన తెగులు కన్నా అత్యధికమైన స్థాయిలో జరిగే నాశనం భయపెడుతుందని వ్యవసాయ పరిశోధనా యూనిట్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆయనింకా ఇలా అన్నారు: “పరిసరాల పరిస్థితి అనుకూలంగానే ఉన్నట్లయితే, దండు ఒకే తరంలో (45 రోజులలో) పదొంతులు పెరగవచ్చును.” షాహెల్‌ పంటలన్నింటిపైన 1994 నందు మిడతలు దాడి చేయవచ్చును. (g94 4/22)

కావలెను: బౌద్ధ సన్యాసులు

జపాన్‌ మత చరిత్రలోనే మొదటి సారిగా, సన్యాసులు బాహాటంగా నియమింపబడ్తున్నారు. “లౌకిక దిశలో లేని సదాచారం గల వారెవరైనా ముఖ్య గురువు అవ్వొచ్చునని,” టెన్‌డి శాఖకు చెందిన ఉన్నతశ్రేణి బౌద్ధ సన్యాసి చెప్పాడు. దరఖాస్తుధారుల కొరకు 1995 ఆరంభమున “ప్రవేశిక పరీక్ష” పెట్టడానికి ఆ మత శాఖ యోచన చేస్తుంది. ఆ మత శాఖలోని ఒక అధికారి ప్రకారం, పరీక్షలో ఉత్తీర్ణులగుటకు కొద్దిపాటి మత పరిజ్ఞానం సరిపోతుంది. పారంపర్యంగా, దేవాలయ యాజకులుగా తమ తండ్రుల స్థానాన్ని యాజకుల కుమారులు చేజిక్కించు కుంటారు. “అయినప్పటికిని, ఇటీవల, అన్ని మత శాఖలలోని యాజకుల కుమారులు సన్యాసులుగా నుండుటను గురించి తమ అసమ్మతిని తెల్పారని,” మినిచి డైలీ న్యూస్‌ నివేదించింది. ఈ ధోరణిపై వ్యాఖ్యానిస్తూ, హీరో టెకాగె, అనే ఒక మతప్రవీణుడు, ఇలా చెప్పాడు: “ఇప్పుడా వారసత్వ విధానం పతనమవుతుంది, యాజకులయ్యేందుకు ఇష్టపడే యవ్వనుల కొరత గురించి బౌద్ధ శాఖలు కలత చెందాయి.” (g94 4/22)

రుతుస్రావస్తంభన తరువాత గర్భధారణ?

రుతుస్రావస్తంభన తరువాత గర్భధారణ సాధ్యమేనా? పారిస్‌ వార్తాపత్రికయైన లి ఫిగారొ నందలి వైద్య నివేదిక ప్రకారం, జవాబు అవునని అన్పిస్తుంది. “రుతుస్తంభన నిర్ధారణ అయిన తరువాత గర్భవతులైన స్త్రీల సంఖ్య పెరుగుతున్నట్టు కన్పడుతుందని” నివేదిక చెబుతుంది. 6,000 మంది స్త్రీవ్యాధి నిపుణులు, ప్రసూతి నిపుణులు ఇమిడియున్న ఒక ఫ్రెంచి అధ్యయనం ఒక స్త్రీ హెచ్‌ఆర్‌టి (హార్మోనుల స్థానభ్రంశ చికిత్స) తీసికొంటున్నట్టయితే, రుతుస్తంభన తరువాత గర్భధారణ కోసం ప్రాముఖ్యంగా శ్రేష్ఠమైన సామర్థ్యాన్ని ఆమె కల్గి ఉంటుందని వెల్లడి చేసింది. లెక్కలప్రకారం, ఈ స్త్రీలకు సగటున రెండు సంవత్సరాలుగా రుతుస్రావం నిలిచిపోగా, అధికులకు సాపేక్షంగా మొదట్లోనే రుతుస్రావం నిలిచిపోయింది. మరి 71 శాతం మంది హెచ్‌ఆర్‌టిని పొందుతున్నారు. ఆసక్తిదాయకంగా, ఈ అధ్యయన అధికారియైన డా క్రిష్టియన్‌ జామిన్‌, రుతుస్రావస్తంభన తరువాత సహితం ఒక బిడ్డను పొందే సామర్థ్యం ప్రతి స్త్రీకి ఉందని చెప్పారు. (g94 4/22)

స్థూలదేహంతో వచ్చిన చిక్కు

“ప్రపంచంలో స్థూలకాయులున్న దేశం అమెరికా,” అని ది  యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోస్‌ న్యూట్రిషన్‌ అండ్‌ వెయిట్‌ కంట్రోల్‌ క్లినిక్‌ డైరక్టర్‌ అయిన డా. రాబర్ట్‌ కుష్‌నర్‌ అంటున్నారు. “పదిహేడు సంవత్సరములు దాటిన స్థూలదేహంగల అమెరికన్ల సంఖ్య 1985 నందున్న జనాబాలో 24 శాతం నుండి 1990 నందు 28 శాతానికి పెరిగిందని,” ది టొరొన్‌టొ స్టార్‌ నివేదించింది. కారణమేమిటి? అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడం, మరియు జన్యుకణాలు ప్రధానమైన కారణాలని క్రొత్త పరిశోధన తెల్పుతుంది. “ప్రజలు బరువెక్కుతున్నారు, అది పరిశీలించాల్సిన విషయమని,” నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌కు చెందిన షార్లెట్‌ షోన్‌బోర్న్‌ చెప్పారు. రక్తపోటు, మధుమేహం, మరితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు స్థూలదేహం దారితీయగలదు. జవాబులు కనుగొనడమంత సులభం కాదు. జీవన స్థాయిలో మార్పుకావాలని వైద్యులు సలహా యిస్తున్నారు. “తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం చెయ్యండి. ఒకసారి బరువు తగ్గితే, దానినలాగే ఉంచుకోడానికి నిజంగా సహాయపడేది భౌతికంగా పనిచేయడమేనని,” స్టార్‌ తెల్పింది. (g94 5/8)

త్రాగే సమస్యగల యౌవనులు

జపాన్‌ నందు సుమారు 14,000 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులపై సర్వే చేయగా, 17.3 శాతం మంది త్రాగే సమస్యగల వారిగా పరిగణింపబడ్డారని, ఆసాహి ఈవెనింగ్‌ న్యూస్‌ నివేదించింది. మానసిక, భౌతిక, మరియు సామాజిక సమస్యలకు కారణమయ్యే త్రాగే అలవాట్లుగల 24.8 శాతం మంది, మగపిల్లల్లో హెచ్చు నిష్పత్తి ఉంది. త్రాగేసమస్యగల ఈ యవ్వనులలో ఎక్కువ మంది తాము రుచిని ఇష్టపడ్తున్నందుననే త్రాగుతున్నామని చెప్పారు. ప్రతి నలుగురిలో ఒకరు తాను విచారంగా లేదా ఒంటరిగా ఉన్నందున త్రాగుతున్నానని తెల్పారు. సర్వేని నిర్వహించిన, డా. కెన్జి సుజుకి “సమస్య యెడల గంభీరంగా అవధానాన్ని ఇవ్వనారంభించుటకు విద్యార్థులతో ఇమిడి ఉన్నవారి కొరకు సమయం వచ్చిందని,” తెల్పుతూ, “పాఠశాలయందు గృహమందు విద్యార్థులు సరిగా బోధింపబడాలి,” అని ఆయన అన్నారు. ఇరవైయేండ్లలోపున్న వారికి త్రాగుడు నిషేధ చట్టం జపాన్‌లో ఉంది. (g94 5/8)

న్యాయమిదేనా?

“ఉత్తర కేరొలినా నందు నలుగురు వ్యక్తులను మైఖేల్‌ చార్లెస్‌ హేయ్స్‌ తీవ్రమైన ఉద్రేకంతో కాల్చి చంపగా—ఇప్పుడు, అతనికి బలైనవారి కుటుంబ సభ్యులు, పన్ను చెల్లించేవారి ఖర్చులతో అతను మునుపెన్నడూ జీవించనంత శ్రేష్ఠమైన జీవితాన్ని జీవిస్తున్నాడని, ఫిర్యాదు చేసినదానిని” ఒక అసోసియెటెడ్‌ ప్రెస్‌ డిస్‌పేచ్‌ చెబుతుంది. పిచ్చివాడని తీర్పుచెప్పి, రాష్ట్రీయ మానసిక ఇన్‌స్టిట్యూట్‌కి అప్పగించగా, హేయ్స్‌ సామాజిక అంగవైకల్య భద్రతా ఉపకారాలు పొందనర్హుడయ్యాడు మరియు ఒక నెలకి 536 డాలర్లు పొందుతున్నాడు. ఆహారం, నివాసం అతను అప్పటికే పొందుచున్నందున, అంగవైకల్య ఉపకార వేతనం మోటారుసైకిలు పెద్ద బీరువా, మరియు గదినిండా ఖరీదైన స్టీరియో, వీడియో పరికరాలను కొనడాన్కి అనుమతించింది. నేరస్థులైన పిచ్చివాళ్ల కోసం సంవత్సరానికి 48 మిలియన్ల డాలర్లను ప్రభుత్వమిస్తుంది. ప్రాసిక్యూటర్‌ విన్‌సెన్ట్‌ రబిల్‌ “తప్పుదారి పట్టించే న్యాయమని” దానిని పిలుస్తూ, ఇంకా ఇలా అంటున్నారు: “పన్నులు చెల్లించువారు హంతకునికి చెల్లిస్తున్నారు. అది అంత మంచి అభిప్రాయాన్ని కలుగజేయదు.” (g94 4/22)

నమ్ముటకు విజ్ఞానశాస్త్ర ఆధారం

“ఒక విజ్ఞానశాస్త్రవేత్తగా ఉండి దేవుడున్నాడని నమ్ముట సాధ్యమేనని,” దక్షిణాఫ్రికా వార్తా పత్రిక అయిన ది స్టార్‌ తెల్పుతుంది. జొహేన్స్‌ బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ విట్‌వాటర్‌స్రేన్డ్‌ నందలి ఖగోళశాస్త్రజ్ఞుడైన, ప్రొఫెసర్‌ డేవిడ్‌ బ్లాక్‌ చేత ఇవ్వబడిన 90 నిమిషముల ప్రసంగాన్ని ఆ శీర్షిక నివేదించింది. విశ్వం ఎంత “బాగా సమకూర్చబడిందో, సమతౌల్యం చేయబడిందో”నని విజ్ఞాన శాస్త్రం నిర్ధారించే దానిని బ్లాక్‌ వివరించారు. బ్లాక్‌ మరి అనేకమంది ఇతర శాస్త్రజ్ఞులకు ఒక సంకల్పవంతమైన నిర్మాణాన్నిది విశదంగా తెలియజేస్తుంది, ఇది ఒక నిర్మాణకున్ని దృఢంగా సూచిస్తుంది. ది స్టార్‌ ప్రకారంగా దేవుడున్నాడనుటకు అలాంటి ఆధారం ఉంది కాబట్టే, “[సృష్ఠికర్త నందు నమ్మకముంచే] వ్యక్తి కన్నా నమ్మకముంచని వ్యక్తే మరింత విశ్వాసాన్ని కల్గి ఉండాలని” బ్లాక్‌ ముగించారు. (g94 4/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి