కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 4/8 పేజీ 16
  • ఏనుగులు—మిత్రులా లేక శత్రువులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏనుగులు—మిత్రులా లేక శత్రువులా?
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • మందమైన చర్మంగల శాంతియుత ఏనుగులను సంరక్షించుట
    తేజరిల్లు!—1993
  • చోబీ నదిలో పడవ ప్రయాణానికి మాతోరండి
    తేజరిల్లు!—1992
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2005
  • ధైర్యం గురించి సృష్టి మనకేం నేర్పిస్తుంది?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 4/8 పేజీ 16

ఏనుగులు—మిత్రులా లేక శత్రువులా?

దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! ప్రతినిధి

ఏనుగులు అనేక కారణాల వల్ల ప్రశస్తమైనవిగా ఎంచబడుతున్నాయి, మరి కొన్ని కారణాల వల్ల ద్వేషించబడుతున్నాయి. అవి పెద్ద మొద్దులను యీడ్వడానికి, వాటిని వరుసగా పేర్చడానికి నిపుణులైనందువల్ల కొందరి దృష్టిలో అవి విలువైన పనివారు. మరికొందరు ఏనుగుల దంతములను బట్టి, చర్మమును బట్టి, మాంసమునుబట్టి వాటిని విలువైనవిగా ఎంచుతారు. అయితే, వాటిని మరికొందరు తమ పొలాలకు, పంటకు హానికరమైనవని పరిగణిస్తారు.

అయినా చాలామంది పరిశోధకులు, వినోదం కల్గించే వాటి చలనాలనుబట్టి ఏనుగులను విలువైనవిగా చూస్తారు. కెన్యాలోని అంబోసెలెలోని అడవి మృగాల పార్క్‌లో ఏనుగులను గూర్చి అధ్యయనం చేయడంలో సింథియా మోస్‌ 13 సంవత్సరాలు గడిపారు. ఎలిఫెంట్‌ మెమరీస్‌ అనే తన పుస్తకంలో ఆమె యిలా వ్రాస్తున్నారు: “హుందాగా ఉండే ఆడ ఏనుగులు యజమానులుగా ఉండి తమ కుటుంబాలను నడిపిస్తూ, సంరక్షిస్తూ ఉండడం చూశాను, అవి తమ హుందాతనాన్ని విడిచిపెట్టినట్లు, తమ తోకలను పైకెత్తి తమ చుట్టూ తిప్పుకుంటూ ఆడుతూ గుండ్రంగా తిరగడం, క్షణకాలం వాటి కళ్ళు ఉన్మత్తంగా జిగేలుమనడం కూడా చూశాను.”

కెన్యాలోని డేఫ్‌నీ షెల్‌డ్రిక్‌ అనేక అనాథలైన ఏనుగులను పెంచి, వాటిని తిరిగి అడవిలో వదిలేశారు. గెటెవే అనే పత్రికతో జరిగిన సంభాషణలో ఆమె యిలా వివరించారు. “వచ్చిన గున్న ఏనుగులన్నిటికీ, మానవ పిల్లల్లాగే విభిన్న లక్షణాలున్నాయి. . . . అవి కొద్దిగా పోటీపడతాయి, అసూయపడతాయి, మీరు వాటిని చీవాట్లు పెట్టినప్పుడు అవి ముఖం మాడ్చుకోవచ్చు. . . . వాటిలో కొన్ని ఉద్దేశపూర్వకంగా తుంటరిగా ప్రవర్తిస్తాయి, లేదా అవిధేయత చూపిస్తాయి. మీరు మానవ పిల్లలను గద్దించినట్లు, వాటిని కూడా మనం గద్దించాల్సి ఉంది.”

ఏనుగులు వినోదభరితంగా ఉండడమే కాకుండా, ప్రకృతిలో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తాయి. ఊరి పొలిమేర్లలో మితంగా ఉన్న ఏనుగులు అనేక రకాల మొక్కలను వృద్ధిచేస్తాయి. ఎలిఫెంట్స్‌, ఎకనామిక్స్‌, అండ్‌ ఐవరీ అనే పుస్తకం కొత్త పచ్చికబయళ్ళు మొలకెత్తడం, విత్తనాలను వెదజల్లడం, “రెండు రెక్కల కీటకాల అభివృద్ధిని” క్షీణింపజేయడం వంటి అమూల్యమైన యితర ధర్మాలను పేర్కొంటుంది. “ఆఫ్రికాలోని పచ్చికబయళ్ళలోను, వనాల్లోను ఏనుగులు జీవ్యావరణ సంబంధమైన ప్రముఖ పాత్రను వహిస్తాయి,” అని రచయితలు నిర్థారిస్తున్నారు.

అయినా, మరీ ఎక్కువ ఏనుగులున్నట్లయితే, అవి పంటలకు హాని కలిగిస్తాయి. అలాంటప్పుడే అవి కొందరికి శత్రువులౌతాయి. ఇందువల్లనే కొన్ని మారుమూల ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఏనుగులను, బలహీనమైన ఏనుగులను వన సంరక్షకులు చంపుతూనే ఉన్నారు. ఆఫ్రికాలోని యితర భాగాల్లో యిప్పటికీ ఏనుగులు అధికంగా ఉన్న చోట వాటిని చంపడం వాటి పూర్వ స్థితికి తేలేకపోయింది. దీనివల్ల లాభాలున్నాయి. న్యూ సైంటిస్ట్‌ అనే మ్యాగజిన్‌ యిలా వివరిస్తుంది, “కెన్యాలోని అంబోసెలె అడవి మృగాల పార్క్‌లో ఏనుగులను చంపడంలేదు, అవి మనుష్యులను భయపడకుండా వారి మధ్య స్వతంత్రంగా తిరుగుతున్నాయి.”

ఏనుగుల జననాల రేటును తగ్గించడానికి శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ లోపుగా మానవుడు ఎంత ఎక్కువగా ఏనుగుల గురించి నేర్చుకుంటాడో, ఏనుగులను స్నేహితులుగా ఎంచడానికి అన్ని ఎక్కువ కారణాలను కనుగొంటాడు.

[Picture Credit Line on page 16]

Animals/Jim Harter/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి