ప్రపంచ పరిశీలన
మంత్రగాళ్లను చీల్చిచెండాడటం యింకా కొనసాగుతున్నది
ఇండియాలో కొండజాతి పృష్టభూముల్లో రెండు మాసాల వ్యవధిలోనే ఉన్మాదగుంపులు డజనుకంటే ఎక్కువమంది స్త్రీలను మంత్రసానులుగా నిందించి చంపారని ఇండియా టుడే నివేదిస్తుంది. “అనేకమంది యితర స్త్రీలను కూడ కొట్టి, హింసించి, నగ్నంగా ఊరేగించి, అతి కౄరమైన పద్ధతిలో కించపరచి, వారి గ్రామాలనుండి వారిని వెళ్లగొట్టారు.” హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన గ్రామగ్రామాలకూ తిరిగిన మతసంబంధ ఊరేగింపుతో మొదలైంది. ఈ అలవాటు సమాజోద్ధరణ ఉద్యమానికి, నేరం తగ్గించడానికి నడిపింది. కాని ఆ తర్వాత ఈ ఊరేగింపులో భాగం వహిస్తూన్న కొందరు స్త్రీలు “అతీతశక్తితో నిండి,” ప్రాంతీయ సమస్యలకు బాధ్యులైన మంత్రసానులని మరితర స్త్రీలను గుర్తించనారంభించారు. ఎవరినైనా చంపిందని నిందించబడినట్లైతే, ఆమె చనిపోయిన వ్యక్తిని లేపడమనే అమాయక “పరీక్ష”లో విఫలులైతే, తక్షణ శిక్ష దొరుకుతుందనే దాని భావం. మంత్రతంత్రాలపై విశ్వాసముంచడమనే దానికి మూలకారణమనేది, మానవ శాస్త్రజ్ఞుడొకడు చెప్పినట్లుగా, “మానవాతీత శక్తులను అదుపులోపెట్టి ఉపయోగించాలని, హాని తలపెట్టే దిష్టికి వ్యతిరేకంగా శక్తిపొందాలని, యితరులపై వారి అభీష్టాన్ని అమలుచేయటానికిని, వారి కోరికలు నెరవేర్చుకొనడానికి శక్తిని సాధించాలనే కొండజాతి ప్రజల్లోనున్న ఉద్బోధనుండి ఆవిర్భవించింది.” (g93 7/22)
అపరాధ పరిశోధకులైన స్త్రీలు
“తర్వాత కాబోయే షెర్లాక్ హామ్స్ (ప్రఖ్యాత కల్పిత ఇంగ్లీషు నాయకుడు) బహుశా ఒక ఆడదేమో” అంటూ జపానులోని ఆసాహి ఈవెనింగ్ న్యూస్ చెబుతున్నది. టోక్యోలోని ఒక క్రొత్త పాఠశాలలో, అపరాధ పరిశోధకులగుటకు మూడు వందలమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు, వారిలో రెండువందల కంటే ఎక్కువమంది స్త్రీలే, వారంతా దాదాపు 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సున్నవారే. గూఢచారి పని వారికి వివిధ కారణాలనుబట్టి మంచిదనిపించింది. ఒక 46 సం. ల గృహిణి ఈ పాఠశాల్లో చేరుతూ “పూలను ఎలా సర్దిపెట్టాలి, బట్టలెలా ధరించాలి, గౌను ఎలా వేసుకోవాలి అనే వాటిని బోధించే సాంప్రదాయిక చదువులతో ఆమె సంతృప్తి పొందలేదని” రిపోర్టు చేసింది. అయినను, కొందరికైతే, ఈ చదువు సరదాపనికంటే ఎక్కువే. ఈ పాఠశాలల్లో చేరిన గృహిణుల్లో సగం కంటే ఎక్కువమంది వారి భర్తలకు ఆ విషయం చెప్పలేదు. వారిలో కొందరు తమను మోసగించే తమ భర్తలను పరీక్షించేందుకు నైపుణ్యతలను సంపాదించుకుంటున్నారు. (g93 8/8)
తండ్రులను కూడ నిందించవలసిందే
ఈనాటి వరకూ, తల్లులు కాబోయేవారు సంతాన లోపాలు కలుగజేయగలిగే ఆల్కహాలు, సిగరెట్లు త్రాగడంలాంటి వాటిని విసర్జించాలనీ పోషకాహారాన్ని భుజించాలని హెచ్చరించబడుతునే ఉన్నారు. “ప్రస్తుతం, అదేవిధమైన ముందుజాగ్రత్తలు తండ్రులు కూడ తీసుకోవాలని హెచ్చరించబడుతున్నారు” అంటూ యు. ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ చెబుతున్నది. “క్రొత్త పరిశోధనలు చెప్పేదేమంటే, పురుషుడు రసాయనాలకు లోనవ్వడంవల్ల పిల్లవానికి తండ్రికాబోయే తన సామర్థ్యతపై, అలాగే పుట్టబోయే బిడ్డయొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపుతాడు.” ఆధారం చూపెట్టేదేమంటే, పురుషులు “వారి భార్యల్లో గర్భవిచ్చిత్తికి, వికృతరూపాలు కల్గుటకు, వారి పిల్లల్లో క్యాన్సరు రావడానికి, పెరుగుదల క్షీణించడానికి యీ రెండింటికి ముందనుకున్న దానికంటె రెండింతలు కారణం పురుషులే.” ప్రస్తుతం మందులు, మరితర రసాయనాలు (సిగరెట్టు పొగ ఫలితంగా వచ్చే పదార్ధాలతో సహా), అలాగే తగినన్ని కాయగూరలు, సి విటమిన్ అధికంగాలేని ఫలాలున్న ఆహారం వీర్యానికి హానిచేస్తున్నట్లుగా కన్పిస్తుంది. మత్తుపదార్థాలకు సంబంధించిన శాస్త్రవేత్త డివ్రే లీ డేవిస్ యిలా చెబుతుంది: “మనం చాలాకాలం కేవలం తల్లులపైనే దృష్టి కేంద్రీకరించాం. ఆరోగ్యవంతమైన శిశువులను తయారుచేయుటలో తండ్రుల ప్రాముఖ్యత తక్కువగా గుణగ్రహించబడింది.” (g93 7/22)
మరొక విషజ్వరం వ్యాపిస్తుందా?
“బహుశ రానున్న కొన్ని సంవత్సరాల్లో పెల్లుబికివచ్చే ఇన్‌ఫ్లూయెంజా, దాదాపు అనుమానం లేకుండా, ఒక గొప్ప తెగులు కాగలదని,” ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజిన్ వివరిస్తుంది. శాస్త్రజ్ఞుల ప్రకారం, 1918లో 2 నుండి 4 కోట్లమందిని చంపిన అంటువ్యాధిలాంటి మరో విషజ్వరం అనే అంటువ్యాధి రావడానికి సమయమాసన్నమైంది. “ఇది ఒకసారి వచ్చిందంటే, మరలా యిది రాగలదని ఎదురు చూడవలసి వుందని,” అంటువ్యాధులకు సంబంధించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్లీగరీ అండ్ ఇన్‌ఫెక్సియస్ డిసీజెస్ ఇన్ బెతెస్దా, మేరీలేండ్‌లో ముఖ్య ప్రతినిధియైన జాన్ ఆర్. లా మంటేగ్నే చెబుతున్నాడు. అయినను, వైరస్ మార్పులవల్ల ఆవేశపెట్టే రీతిలో వచ్చే విషజ్వరం రావడం చాలా అరుదు. అవి ఈ శతాబ్దంలో కేవలం మూడుసార్లు మాత్రమే సంభవించాయి: 1918లో వచ్చిన స్పానిస్ విషజ్వరం; 1957లో వచ్చిన ఆసియన్ విషజ్వరం; 1968లో వచ్చిన హాంగ్‌కాంగ్ విషజ్వరం; చివరగా వచ్చిన రెండూ సాపేక్షంగా అంతపెద్దవికావు. ఈ విషజ్వరపు క్రిమి తదేకంగాను, ఊహించని విధంగాను మారుతుంది గనుక, ఖచ్ఛితమైన వాక్సీన్ కనుగొనక ముందే దారుణ మారణకాండ జరగవచ్చు. ఈ శీర్షిక ముగింపులో యిలా చెబుతున్నది: “చరిత్రను మార్గదర్శకంగా పెట్టుకున్నట్లయితే,—అతి బాధాకరమైన విషజ్వరం ప్రపంచాన్నంతా తుడిచిపెట్టకముందే—ఈ శతాబ్దం ముగియకముందే—బహుశ ఆ రోగనిరోధకమందుల్లో గొప్పమార్పులు రాగలవని ఆశించవచ్చును.” (g93 7/22)
చెవిపోగులు మార్చుకోవడం—ఆరోగ్యానికి ప్రమాదం
“రక్తంతో కలుషితమైన చెవిపోగులు హెపటైటిస్ బి మరియు మానవ రోగనిరోధకతను క్షీణింపచేసే వైరస్‌తో [సహా] అనేక రకాలైన జీవులతో కూడిన అంటురోగాలు రావడానికి మూలమని,” ఓహాయో స్టేట్ యూనివర్శిటీ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ నందు వైద్యులైన ఫిలిప్ డి. వాల్‌సన్, మిఖాయెల్ టి. బ్రేడీ అనువారు చెబుతున్నారు. పెడియాట్రిక్స్ అనే అమెరికా వైద్య సంబంధ పత్రికలో ప్రచురించిన సంయుక్త లేఖలో, బహుశ బాగా వ్యాప్తిలోనున్న పరిశుభ్రం చేయని చెవిపోగులను మార్చుకునే అలవాటు విషయంలో చింతను వ్యక్తం చేశారు. చెవిపోగులు మార్చుకునే కౌమారదశలోనున్నవారు, యౌవనులు ఒకవేళ లైంగిక కార్యకలాపాలవల్ల, ఒకరికి ఉపయోగించిన సూదులు వేరొకరి కుపయోగించడం వల్ల సంక్రమించే వ్యాధులను ఎరిగే ఉండవచ్చు—కాని ఈ అలవాటువల్ల వచ్చే వ్యాధులతో మాత్రంకాదు. ఈ యిద్దరు వైద్యులు కూడా చెప్పేదేమంటే, “రక్తంద్వారా వచ్చే వ్యాధులను సంక్రమింపజేసే శక్తి” దీనికి ఉంది. వారు ప్రోత్సహించేదేమంటే, వైద్యులు “వారి రోగులను ఈ అలవాటునుండి తప్పించాలి.” (g93 8/8)
కావల్సినంత ఆహారముంది, కాని కుపోషణ కొనసాగుతూనేవుంది
ఆకస్మికంగా ప్రపంచ జనాబా వృద్ధియైనప్పటికి, బీదదేశాల్లో యిప్పుడున్న 15 కోట్ల కంటే ఎక్కువగానున్న పోషకాహారలోపం గల ప్రజలు, 20 సంవత్సరాల క్రితం ఉన్నప్పటి సంఖ్యకంటే తక్కువే. “వాస్తవంగా ఆహార సరఫరా మరియు రైతులు జనసంఖ్య పెరుగుతున్నట్లుగానే ఆహారోత్పత్తి పెరిగి, మించిపోతుంది,” అని యు యన్ ఆహారము, వ్యవసాయశాఖ అధ్యక్షుడైన జాన్ లూపియన్ అంటున్నాడు. “నిజంగా అది అవసరమైన ప్రజలకు చేరితే, యిప్పటికే, ప్రతిఒక్కరినీ పోషించడానికి తగిన ఆహారముంది.” “బీదదేశాల్లోని ప్రజలు ఉజ్జాయింపుగా 78 కోట్లమంది, వాటి జనాబాలో ఐదింటిలో ఒకవంతు ప్రజలు, తినడానికి సరైన ఆహారం పొందడంలేదు. షుమారు 200 కోట్లమంది ప్రజలకు కడుపునిండా ఆహారం దొరికినప్పటికి, వారికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు కొరతగానున్నవి. . . . ప్రతిదినమూ షుమారు 40,000 మంది యౌవన బాలలు చనిపోతున్నారు, ఎందుకంటే కుపోషణ వారిని అన్ని రకాల వ్యాధులకు గురిచేస్తుంది.” మరొక విధంగా, అధిక పోషణ కూడా, సంపన్న వర్గాల ప్రజల్లో హృద్రోగాలు, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి రుగ్మతలతో సహా, హానికర ప్రభావాలను కల్గివుంది. (g93 7/22)
నాణాలు తినేవాళ్లు
ప్రతి సంవత్సరం వేలకొద్దీ పిల్లలు నాణాలు మ్రింగడం వల్ల, అత్యవసర విభాగాల్లో ఖరీదైన ఎక్స్‌రేలు తీయించడానికి ఆసుపత్రుల పాలౌతున్నారు. వీటిలో చాలా నాణాలు శరీరంగుండా బయటకు వచ్చేస్తాయి, కాని అప్పుడప్పుడు నాణెం గొంతులో అడ్డుపడ్డంవల్ల, శరీరంలో రక్తం స్రవించడం, పుండుపడటం, కొన్నిసార్లు ఇది గొంతును చీల్చినప్పుడు చనిపోవడానికి కారణమౌతుంది. విమానదళ భద్రతా సిబ్బంది కొన్నిసార్లు ఉపయోగించే సామాన్యమైన, పూర్తిగా క్షేమమైన చేతితో చూచి లోహ ఆచూకీ గుర్తించే సాధనంలాంటిదే తయారు చేయబడింది, తద్వారా మ్రింగిన నాణెం ఎక్కడుందో శిశువైద్యులు గుర్తించగలరు. “నాణెం ఆచూకీ తెలుసుకోడానికి 300 డాలర్లు ఖర్చుపెట్టవలసిన” ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలకు వెళ్లేపనిలేకుండా ఈ సాధనం ఉపయోగపడుతుందని అమెరికాలో ఇల్లినోయిస్ రాష్ట్రంలో శిశు అత్యవసర మందులకు అధ్యక్షుడును, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధిచేసేవారిలో ఒకరైన డా. సైమన్ రాస్ చెబుతున్నాడు. దీనికున్న సామర్థ్యతవల్లనూ తక్కువ ఖర్చుతో కూడినందువల్లను ఈ సాంకేతిక పరిజ్ఞానం బహుశ విస్తృతంగా ఉపయోగించబడుతుందని జర్నల్ ఆఫ్ పెడియాట్రిక్స్ అండ్ పెడియాట్రిక్ ఎమర్జెన్సీ కేర్ అనే పత్రిక నివేదించింది. (g93 8/8)
హానికర వినోదం
“అశుద్ధత, నగ్నత, లైంగికత, హింసాకాండ, హత్యలతో నిండిన చిత్రాలు కోకొల్లలుగా రావడమనేది హాలీవుడ్ చిత్రపరిశ్రమకు సిగ్గుచేటు.” ఈ వ్యాఖ్యానం ఇటీవల ప్రచురించిన యు ఎస్ ఎ టుడే అనే వార్తాపత్రికలో ఒక పేజీ నిండుగా యిచ్చిన ప్రకటనలో భాగమైయుంది. ఈ ప్రకటన ప్రకారం, ఒక ప్రఖ్యాత టివీ నెట్‌వర్క్ “హస్తప్రయోగం గురించిన వెకిలి సన్నివేశాలు, కాటికాపరి శవాలతో శృంగారించడం,” మరితర అభ్యంతరకర విషయాలతో కూడిన కార్యక్రమాలను అనుమతించింది. టివీ కార్యక్రమాల ద్వారా, “సరాసరి 16 సంవత్సరాల వయస్సున్న పిల్లలు 2,00,000 హింసాత్మకమైన, 33,000 హత్యా సన్నివేశాల కంటే ఎక్కువ చూశారు.” (g93 8/8)
కెఫీన్‌ను నిందించడం
మితిమీరి కాఫీ త్రాగేవాళ్లు ఒకేసారి వారి అలవాటును మానేస్తే, తరచూ తలపోటు, నిరాశ, ఆయాసం, చింత, అంతేకాకుండా ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు వస్తాయి. ప్రస్తుతం, ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ లేదా టీ, లేదా కొన్ని డబ్బాల కెఫీన్ (మత్తుపదార్థం) వున్న మధురపానీయాలు త్రాగే అలవాటునుండి, రెండురోజులు త్రాగకుండా ఉన్నవాళ్లలో కూడ యివే సూచనలు కన్పించాయని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీలో పరిశోధకులు కనుగొన్నారు. త్రాగడం మానివేస్తే వచ్చే పరిణామాలు చాలా బాధతో కూడినవని గనుక వాళ్లు కచ్చితంగా వైద్యునియొద్దకు వెళ్లాలని తలుస్తారు. వారాంతంలో ఆఫీసులో త్రాగే కాఫీకి దూరమైనవాళ్లు, కెఫీన్ లేని సోడాలు త్రాగడం మొదలుపెట్టినవాళ్లు, లేదా శస్త్రచికిత్సకు ముందు ఆహారం తీసుకోకుండా పస్తుండవలసినవాళ్లు కూడా వీటికి బాధితులే కావచ్చు. తలపోటు మరియు కాఫీ త్రాగడం మానేసిన వాళ్లనుభవించే సూచనలున్న రోగులను వారెంత కాఫీ తీసుకుంటున్నారో తెలుసుకోమని వైద్యులకు సలహాయివ్వబడింది. కెఫీన్ తీసుకోవడం తగ్గించే వాళ్లు నెమ్మదిగా తగ్గించాలని సలహాయివ్వబడింది. కాఫీలో కెఫీన్ ఉంది గనుక, దీన్ని మాదకపదార్థాల్లో చేర్చాలా వద్దాయనే ప్రశ్నకూడ ఈ అధ్యయనం లేవనెత్తింది. (g93 7/22)
కొలంబియాలో గర్భస్రావాలు
కొలంబియాలో, దాదాపు ఒక కోటిన్నరమంది స్త్రీలు కనీసం ఒక్కసారైనా గర్భస్రావం చేయించుకున్నారు. దానిలో షుమారు 20 శాతంమంది స్త్రీలు పిల్లలుకనే వయస్సున్నవారే. చాలామంది స్త్రీలు గర్భస్రావం ఫలితంగా వచ్చిన వ్యాధులతో మరణిస్తున్నారు. కొలంబియా పత్రికైన సెమానా చెప్పేదేమంటే, “మెటర్నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బగోటాలో గర్భస్రావాలు గొప్ప సంఖ్యలో మాతృసంబంధ మరణాలను సృష్టిస్తున్నాయి.” కొలంబియాలో ప్రతిసంవత్సరం దాదాపు 4,00,000 గర్భస్రావాలు చేయబడుతున్నాయని అంచనా వేయబడింది. అంటే గంటకు సరాసరి 45 వరకూ గర్భస్రావాలు చేయబడుతున్నాయి. (g93 8/8)