కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 11/8 పేజీలు 16-18
  • నేను బానిసనైపోయాను! నేనెలా జూదం మానగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను బానిసనైపోయాను! నేనెలా జూదం మానగలను?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జూదమాడే వ్యసనం—దాని ఫలితాలు
  • విడిచిపెట్టాలనే మనోనిబ్బరం
  • సమస్యకు మూల కారణం తెలుసుకొనుట
  • “శ్రేష్ఠమైనది ఒకటుంది”
  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!
    తేజరిల్లు!—1995
  • జూదం క్రైస్తవులకు తగునా?
    తేజరిల్లు!—1994
  • బానిసలైన జూదగాళ్లు—తుదకు నష్టపోయేవారే
    తేజరిల్లు!—1995
  • జూదం నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 11/8 పేజీలు 16-18

యౌవనస్థులు ఇట్లడుగుదురు

నేను బానిసనైపోయాను! నేనెలా జూదం మానగలను?

“నేను 13వ యేటనే రంగుచక్రాలాట (నాణాలతో ఆడే ఒక రకమైన జూదం) ఆడేవాణ్ని,” అంటూ డేవిడ్‌ ఒప్పుకుంటున్నాడు. “వినోద ప్రదర్శనశాల వైపు వెళ్లానంటే, లోనికి ప్రవేశించి రంగుచక్రాలాట ఆడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నాను.” “నేను నా అలవాటును తీర్చుకోడానికి స్నేహితులు, కుటుంబం, తోటిపనివాళ్ల వద్దనుండి డబ్బు దొంగిలించేవాణ్ని కూడా. నేను ఏ రకమైన జూదమైనా ఆడేవాణ్ని” అంటూ జూదమాడటం మానుకున్న మరొక జూదగాడైన థామస్‌ ఒప్పుకుంటున్నాడు.

డేవిడ్‌, థామస్‌ యిద్దరూ కూడ క్రైస్తవ కుటుంబంలోనే ఎదిగారు. ఇద్దరూ జూదానికి బానిసలై, దాని వ్యసనానికి దాసులైపోయారు. యౌవనులను జూదమాడుటకు ఆశపెట్టి వంచించే మోసపూరిత మానసిక మాయోపాయాలకు ఎంతోమంది యౌవనులు బలైపోయారని పరిశోధకులు చెబుతున్నారు. టైమ్‌ పత్రిక యిలా చెబుతున్నది: “జూదానికి సంబంధించిన పరిశోధకులు, అమెరికాలో తప్పనిసరిగా జూదమాడే 80 లక్షలమందిని గూర్చి చెప్పేదేమంటే, పదిలక్షలమంది పూర్తిగా యౌవనులే.” కొంతమంది నమ్మేదేమంటే, అమెరికాలో 4 నుండి 6 శాతం యౌవనులు జూదమాడే రోగమున్నవారే.

యౌవనులు యిలాంటి అనేక మాయోపాయాలను వెంబడిస్తున్నారు. జపానులో, మైనరుపిల్లలు పందాల్లో పాలుపంచుకోకూడదని గట్టి చట్టాలున్నప్పటికి, యౌవనులు “పందెపు రంగంలోను, బయటకూడా పందెపు వ్యవస్థల దగ్గర అనేకులు జూదరులుగా కన్పించడం, కలతకల్గించే రీతిలో పెరుగుతోందని” మినిచి డైలీ న్యూస్‌ చెబుతున్నది. లాటరీకట్టడం, ఆటల్లో పందెంకాయడం, పేకాట ఆడటం కూడా పందెపు ప్రేరణల వశమౌతున్న యౌవనుల్లో పేరుగాంచిన పద్ధతులు.

జూదమాడే వ్యసనం—దాని ఫలితాలు

జూదమాడే వ్యసనం నుండి కోలుకోడానికి సహకరించే సంస్థకు చెందిన గోర్డెన్‌ మూడీ యిలా చెబుతున్నాడు: “ఒక క్రొత్త అన్వేషణ చేస్తున్నట్లుగా లేదా ప్రేమలో పడుతున్నట్లుగా అవి తొలిసారి [జూదం] ఒక అద్భుతమైన అనుభవం. . . . అదృష్టం పలుకుతుందని ఆడటం నిజంగా ఉల్లాసంగా, మరల్కొలిపేదిగా ఉంటుంది.” (క్విట్‌ కంపల్సివ్‌ గేంబ్లింగ్‌) ఔను, చాలామంది ప్రజలకు పందెంలో గెలిచే స్థానాన్ని అనుభవించడం, దానితోపాటు వచ్చే హృదయంగమం ఆకట్టుకొనేదిగా ఉంటుంది. ఎల్లప్పుడూ అదృష్టాన్ని మీరే గెలుచుకోలేరు. చివరకు, జూదమాడే వ్యక్తి నష్టపోతాడు. అప్పులు, ఆర్థికనష్టం అనేవి ఇక అతనికొచ్చే సమస్యల్లో ఆరంభం మాత్రమే.

గతంలో వ్యసనానికి లోబడటం అనేది, మాదకద్రవ్యం వలే లెక్కలేనన్ని ఆత్మీయ, మానసిక, నైతిక నష్టాల్ని కల్గించగలదు. గోర్డెన్‌ మూడీ చెప్పినట్లు, “చివరకు అది నిన్ను దాసునిగా తయారుచేస్తుంది. . . . అది మోసపూరితం. ఈ సందర్భంలో మనం అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుందాం: “లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావునిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?” (రోమీయులు 6:16) జె. బి. ఫిలిప్స్‌ ఈ వచనాన్ని ఈ విధంగా అనువదించాడు: “మీరు లోబడాలని ఎన్నుకున్న శక్తికే మీరు చెందిన వారు.” ఊహించండి, మీరు ఒక అలవాటుతో పీడించబడుతుంటే దానిని అదుపులో పెట్టలేరు!

ఒక యౌవనుడు తన అలవాటును పోషించేందుకు అబద్ధమాడటానికి, మోసానికి, దొంగతనం చేయడానికి తరచూ ఆలోచిస్తూంటాడు, తన కుటుంబంతో గల సంబంధం కూడ నిజంగా కోల్పోతాడు. బ్రిటీష్‌ పత్రికైన యంగ్‌ పీపుల్‌ నవ్‌ యిలా తెల్పుతున్నది: “మీరు ప్రేమించే ప్రజలకు, మిమ్మును ప్రేమించే వారికి మీరు ఒక దొంగలా, అబద్ధికుడిలా, జవాబుదారిగా ఉన్నట్లు మీరు గుర్తించినప్పుడు, మీ స్వగౌరవం దెబ్బతింటుంది.” ది హార్వార్డ్‌ మెంటల్‌ హెల్త్‌ లెటర్‌ నివేదించేదేమంటే, తప్పనిసరిగా జూదమాడేవాళ్లు “గంభీరమైన నిరాశ, మనస్తాప లోపాలకు,” లోనౌతారు, మరియు “జీర్ణవ్యాధులు, నిద్రలేమి, తలనొప్పులు, రక్తపోటు, ఆస్త్మా, వెన్నునొప్పులు, ఛాతినొప్పులు” మొదలైన భౌతిక ఇబ్బందులకు గురౌతారు.

అయినప్పటికి, అత్యంత నాశనకర ఫలితమేమంటే, ఒక వ్యక్తి ఆత్మీయతకు వాటిల్లే నాశనమే. బైబిలు దురాశను, ధనాపేక్షను ఖండిస్తుంది. (1 కొరింథీయులు 5:10, 11; 1 తిమోతి 6:10) మరితర వ్యసనం వలెనే, తప్పనిసరి పందెంలో పాల్గొనడం “శరీరమునకును, ఆత్మకును” కల్మషం వంటిది. మీరు ఎంత ఎక్కువగా పందెంలో పాల్గొంటే, అంత ఎక్కువగా మీ మనస్సాక్షిని, దేవునితో మీకున్న సంబంధాన్ని పాడుచేసుకుంటారు.

విడిచిపెట్టాలనే మనోనిబ్బరం

కొక్కెం వలే పట్టివున్న ఈ అలవాటును ఎలా మానుకోగలవు? మొట్టమొదటిగా, మీరు నిజంగా దాన్ని విడిచిపెట్టాలని కోరుకోవాలి. “వ్యసనానికి లోనైన వ్యక్తి నిజంగా మార్పుచెందాలని కోరుకుంటేనే తప్ప, ఏ వ్యసనాన్ని కూడ జయించడం జరగదని,” లిజ్‌ హాడ్జ్‌కిన్సన్‌ తన పుస్తకమైన ఎడిక్షన్స్‌లో చెబుతుంది. జూదాన్ని అసహ్యించుకోవాలంటే, “చెడుతనమును అసహ్యించుకోవడం” నేర్చుకోవడమే దీని భావం. (కీర్తన 97:10) ఎలా? దీని వలన వచ్చే ఆనందాలను గూర్చి కాదుగాని, దీని ఫలితంగా వచ్చే వాటినిగూర్చి ఆలోచించడం ద్వారా. “పాపం యొక్క తాత్కాలిక ఆనందం”—ఏదొక ఆటలో గెలిచామనే ఉల్లాసం—నిత్యజీవాన్ని కోల్పోవడంతో సమానమైందా? (హెబ్రీయులు 11:25) ఈ విధంగా ఆలోచించడమనేది విడిచిపెట్టాలనే తీర్మానాన్ని మీరు వృద్ధిచేసుకొనుటలో సహాయం చేయగలదు.

అయినను, పరిశోధకురాలైన లిజ్‌ హాడ్జ్‌కిన్సన్‌ యిలా వ్రాస్తుంది: “ఏవిధమైన వ్యసనాలైనా ఎంత నాటుకుపోతాయంటే వాటిని తీసివేయడమంటే, ఒక అవయవాన్ని తీసివేయడం లాంటిదే.” కాని యేసు యిలా చెప్పాడు: “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.” (మత్తయి 5:29) దేవునితో మీ సంబంధాన్ని అపాయంలో పడవేసే దేనినైనా మీ జీవితం నుండి పెరికివేయాల్సి ఉంటుంది!

ఆశానిగ్రహాన్ని వృద్ధిచేసుకోవడమే దీని భావం. అపొస్తలుడైన పౌలు తనకు పునరావృతమయ్యే కోరికలకు తాను దాసుడగునట్లు అనుమతించి యుండవలసింది, కాని ఆయన తన కోరికలకు దాసుడగుటకు అనుమతించలేదు ఆయన యిలా చెప్పాడు: “నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 9:27) మీరు కూడా మీ కోరికలు మిమ్మును అదుపులో పెట్టకుండా మీకై మీరు కఠినంగా వ్యవహరించడం నేర్చుకోవాలి.

సమస్యకు మూల కారణం తెలుసుకొనుట

అయినను, ఈ పోరాటంలో విజయం సాధించాలంటే, మానుకోవాలనే మానసిక నిబ్బరంకంటే ఎక్కువ అవసరం. తరచు వ్యసనాలు యింకా లోతైన సమస్యల్లోకి దించేస్తాయి. తప్పనిసరిగా జూదమాడే అలవాటున్న డిక్‌ యిలా అంటున్నాడు: “నా బాల్యజీవితం చాలా విచిత్రంగా ఉండేది. ఏమైనప్పటికి, నా కుటుంబంలో ప్రేమ లేదు. . . . నన్నెప్పుడూ కించపరచేవారు. నాయెడల నేను చాలా నీచమైన దృక్పథం కల్గియుండేవాణ్ని.” అలాంటి ఒత్తిడి ఫలితంగా, జూదమే అతని పర్యవసానమైంది.

మానసిక ఆరోగ్య క్షేత్రాల్లో పనిచేసే చాలామంది ఇప్పుడు చెప్పేదేమంటే రకరకాల వ్యసనాలనేవి పిల్లలను కొట్టడం, నిర్లక్ష్యం చేయడంవల్ల వస్తున్నాయి. ఏవిధమైనదైనా, మీ సమస్యకున్న మూలకారణాన్ని తెలుసుకోవడమనేది మీరు దానిని జయించుటకు సహాయం చేయగలదు. కీర్తనల గ్రంథకర్త యిలా ప్రార్థించాడు: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్యమార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తనలు 139:23, 24) అనుభవం కల్గిన ఒక క్రైస్తవునితో, బహుశ ఒక సంఘపెద్దతో, కలతచెందించే మీ ఆలోచనలను చర్చించడంవల్ల మీరెందుకు జూదమాడతారో, మీ ఆలోచనను, ప్రవర్తనా సరళిని మార్చుకోడానికి మీరేం చేయాల్సి వుంటుందో అర్థం చేసుకొనుటకు ఒకవేళ సహాయపడవచ్చు.a

“శ్రేష్ఠమైనది ఒకటుంది”

క్విట్‌ కంపల్సివ్‌ గాంబ్లింగ్‌ అనే పుస్తకం ప్రకారం, కేవలం విడిచిపెట్టడమే “సమస్యకు వ్యతిరేకంగా పోరాడటంలో తీసుకోవలసిన మొట్టమొదటి చర్య. మీ జీవితవిధానంలో బలమైన మార్పులు చేసుకోవాల్సొస్తుంది కూడ. మరలా దానికి లోబడకుండా అడ్డుకోడానికి, మీరు జూదమాడే పాత సహవాసులను విడిచిపెట్టాలి, జూదశాలలకు, పందెంవేసి దంతపుగుండ్లాట ఆడే ప్రదేశాల్లాంటి జూదమాడే పాత ప్రదేశాలన్నింటికీ దూరంగా ఉండాలి. (సామెతలు 13:20) మీకై మీరు వేరుగా ఒంటరిగా ఉండమని దీని భావం కాదు. (సామెతలు 18:1) క్రైస్తవ సంఘంలో మంచి మద్దతుతో కూడిన స్నేహితులను కలిగియుండటానికి కృషిచేయండి. మీకై మీరు ఫలవంతమైన పనుల్లో, ఆత్మీయ కార్యకలాపాల్లో, మంచి వినోదంలో పనిరద్దీ కల్గివుండండి.

అయినను, హాడ్జ్‌కిన్సన్‌ మనకు గుర్తుచేసేదేమంటే, వ్యసనానికి లోనైనవాడు కేవలం అతడు “వ్యసనాన్ని తృప్తిపరచుకోడానికి చేసే ప్రయత్నం కంటే జీవితంలో యింకా చాలా వుందని—అది ఈ వ్యసనం కంటే చాలా శ్రేష్ఠమైనదని గ్రహించినప్పుడే” తన పోరాటంలో విజయం సాధించగలడు. అయితే, బైబిలు అందించే నిరీక్షణకంటే శ్రేష్ఠమైనదేముంది?

రాడే అను పేరుగల వ్యక్తి యిది నిజమని కనుగొన్నాడు. ఆయన తన యౌవనంలో ఆరంభించి, 25 సంవత్సరాలుగా పూర్తిగా వ్యసనానికి లోనైన జూదగాడుగా తననుతాను వర్ణిస్తున్నాడు. రాడే గుర్రపుపందాలు, కుక్కల పందాలు, ఫుట్‌బాల్‌ ఆటల ఫలితాలపై పందాలు, జూదశాలల్లో జూదాలు మొదలైన అన్ని రకాల జూదాలు ఆడేవాడు. కాని తర్వాత ఆయన యెహోవాసాక్షుల నుండి నేర్చుకున్న దేవుని వాక్యంలోని సత్యాలను అన్వయించుకోవడం మొదలుపెట్టాడు. రాడే చెప్పేదేమంటే, “కేవలం మూడు మాసాల్లోనే పూర్ణపరివర్తన జరిగింది.” ఆయన జూదం మానేశాడు, మరి ఈనాడు ఆయన క్రైస్తవ సంఘంలో సంఘపెద్దగా సేవచేస్తున్నాడు.

బహుశ, ఒకవేళ మీకు కొంచెం బైబిలు బోధకు సంబంధించిన జ్ఞానం వుండవచ్చు. ఆరంభంలో వివరించిన డేవిడ్‌, థామస్‌ల వలే, మీరొకవేళ యిప్పటికీ కూడ బైబిలు సత్యాలను మీ స్వంతం చేసుకొనుటలో విఫలులయ్యుండవచ్చు. అలాగైతే, ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు,’ నిజమైన బైబిలు అధ్యయనం ఎందుకు చేయకూడదు? (రోమీయులు 12:2) ఒకనాడు డేవిడ్‌ మరియు థామస్‌లు తాము క్రితం నేర్చుకొన్న వాటిని అన్వయించుకోవడం ఆరంభించి, నిజమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వృద్ధిచేసుకుని, తప్పనిసరిగా ఆడే జూదం మానుకున్నారు. మీరు కూడా అలా చేయగలరు!

బైబిలు అధ్యయనానికి మీ అవధానమిచ్చి, భవిష్యత్తుకు బైబిలిచ్చే నిరీక్షణను పొందండి—అది మీకు జూదంకంటే శ్రేష్ఠమైనది—నిజమైనది. అదే సమయంలో, అది దేవునితో వ్యక్తిగత సంబంధం పెంచుకొనుటలో సహాయం చేస్తుంది. తద్వారా మీరు ఆయన సహాయం కొరకు “ఎడతెగక ప్రార్థన చేయుటకు” మొహమాట పడరు, ఆయన మీ భావాలను అర్థం చేసుకుంటాడనే నమ్మకం మీకుంటుంది. (1 థెస్సలొనీకయులు 5:15; కీర్తనలు 103:14) తప్పనిసరిగా ఆడే జూదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో విజయం సాధించడానికి అవసరమైన శక్తి మీకివ్వడం ద్వారా ఆయన మీ గట్టి ప్రయత్నాలకు ప్రతిఫలమిస్తాడు.—గలతీయులు 6:9; ఫిలిప్పీయులు 4:13. (g93 8/8)

[అధస్సూచీలు]

a వ్యసనానికి లోనయ్యే ప్రవర్తనను మీరు తెగతెంపులు చేసుకోవాలంటే, నిపుణత కల్గిన సలహా అవసరమని మానసిక ఆరోగ్య రంగంలో చాలామంది నమ్ముతున్నారు. ఒకవేళ క్రైస్తవుడు బైబిలు నియమాలకు విరుద్ధంకాని చికిత్స పొందడానికి ఎన్నుకుంటే, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే.

[17వ పేజీలోని చిత్రం]

జూదగాళ్లు జూదమాడే అలవాటును కొనసాగించడానికి తరచు అబద్ధమాడటానికి, దొంగతనం చేయడానికి ఆలోచిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి