ప్రపంచ జనాభా పెరుగుదల—ఒక ప్రధాన సమస్య
“ఐదువందల కోటొవ పాప.” జూలై 11, 1987 మధ్యరాత్రి బీజింగ్‌లోని ఆసుపత్రిలో పుట్టిన వాన్ హి అనే ఆడపిల్లను చైనా ప్రభుత్వం అలా పిలిచింది. ఆ అమ్మాయి పుట్టిన ఆ సమయానికి ప్రపంచ జనాభా ఐదువందల కోట్లకు చేరిందో లేదో ఎవ్వరికి తెలియదు. అయినను, ప్రపంచ జనాభా ఆ సంఖ్యకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి చెప్పిన క్షణంలోనే ఆ అమ్మాయి పుట్టింది. చైనా ప్రభుత్వం మాత్రం చైనాకు మరియు ప్రపంచానికి తీవ్ర సమస్యగా పరిణమిస్తున్న జనాభా పెరుగుదలను గూర్చి వివరించడానికి ఆ సంఘటనను ఆధారంగా తీసుకుంది.
కొందరు నిపుణులు విస్మయ మొందునంత వేగంగా భూమిమీద ప్రజల సంఖ్య పెరిగిపోతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నవి. ప్రస్తుత పెరుగుదలనుబట్టి చూస్తే, వచ్చే 40 ఏండ్లలోనే ప్రపంచ జనాభా ఇంతకు రెట్టింపు అవుతుంది. నిపుణులు తెల్పేదేమనగా జనాభా ఇలా పెరుగుతూ పోతే ఆహారోత్పత్తికంటె ప్రపంచ జనాభా ఎక్కువై, ప్రపంచంలో కరువు తాండవిస్తుంది. అంతేగాక ప్రపంచంలో సహజవనరులు పరిమితంగా వున్నందువల్ల పెరిగే జనాభాకు అవి సరిపోక ఇక లోకమంతట వినాశనం రావచ్చును. ఒకవేళ ఆహారం, వనరుల కొరతవల్ల మనకు నాశనం రాకపోతే పర్యావరణానికి మనం కలిగించే ముప్పు నిశ్చయంగా నాశనం తెస్తుందని నిపుణులంటున్నారు. మనం గాలి, నీరు, భూమికి చేసేదాన్నిబట్టి నిజంగా మనకు మనం ప్రాణ హాని కల్గించుకుంటున్నాం, ఇక జనాభా పెరుగుదల అట్టి హానిని త్వరితగతిన సంభవింపజేస్తుంది. ఇదంతా చూస్తే వినాశనం రాబోతున్నట్లుంది.
మరి దీని కేమి చేయగలం? ఈ విషయమై అనేక అభిప్రాయాలున్నవి. జనాభా పెరుగుదలను అరికట్టుటకు గట్టి చర్య తీసుకొనకపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లునని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయమేమంటే, గతంలో జరిగినట్లే ఇప్పుడు కూడ ఆహారం, వనరులు, జనాభా మరియు ఏ యితర విషయంలోనైన సమస్యలు తీర్చుటకు క్రొత్త మార్గాలు కనుగొనవచ్చును. ఇంకా యితరులు అనుకునే దేమంటే ప్రపంచ జనాభా చివరికి పెరుగుట మానేస్తుంది గనుక దాని విషయంలో కంగారుపడనక్కర్లేదు. వాస్తవానికి, ఈ విషయం యొక్క ప్రతి అంశం మీద బలమైన అభిప్రాయాలు దృక్పథాలున్నవి. స్పష్టంగా చూస్తే, ప్రపంచ జనాభా పెరుగుదల ఒక ప్రాముఖ్యమైన వివాదాంశమైయున్నది.
అయినను, గమనించదగిన విషయమేమంటే నిజానికి యింకా విశాల ప్రాంతములున్న దేశాల్లో జీవించేవారే, ధనవంతులే సాధారణంగా యీ రాబోవు నాశనాన్ని గూర్చి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. వారి జీవన ప్రమాణం లేక భవిష్యత్ బంగారుబాట ప్రమాదములో ఉందని గుర్తించి, వారు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే అభివృద్ధిచెందని అధిక జనాభాగల, పేదదేశాల్లో నివసించే వారి గతేమిటి? జనాభా సవాలును గూర్చి వారేమి భావిస్తున్నారు? ప్రపంచంలో క్రిక్కిరిసిన జనాభాతో నిండిన ప్రాంతాల్లో జీవితమెలా వుంటుంది?
అవేక్! పత్రిక నిన్ను ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభాగల కొన్ని ప్రాంతాలకు తీసికొని వెళ్లి, జనసందోహముగల ప్రాంతాల్లోని వత్తిడితో జీవించుట ఎలా వుంటుందో చూపించుటకు మరియు ఇందులో యిమిడియున్న వివాదాంశములను గ్రహించుటకు నీకు సహాయపడుతుంది. (g91 11/8)