‘మా కుమార్తెలు సన్నిహితులగుటకు సహాయము చేసినది’
గత సంవత్సరము వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయమునకు వ్రాయుచూ జింబాబ్వే నందలి మురేవాలోని ఒక పాఠశాల ఉపాధ్యాయిని మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ దానిని సాధించెనని తెల్పెను. ఆ సాహిత్యమును తనతోటి ఉపాధ్యాయునినుండి ఆమె పొంది యిలా నివేదించెను:
“ఆ పుస్తకమునుండి ఎట్లు ప్రయోజనము పొందవచ్చునో అను దానిపై అతని సలహాను నేను పాటించితిని, మొదటిగా నా 8 ఏండ్ల చిన్న కుమార్తె అటుపిమ్మట స్థానిక సెకండరీ బోర్డింగ్ స్కూలునందున్న 16, 18 సంవత్సరముల వయస్సున్న యిద్దరు కుమార్తెలతో చర్చించాను. నా ముగ్గురు కుమార్తెలనుండి స్పందన నిజంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నదని మీకు తెలియజేయుటకు సంతసించుచున్నాను. అప్పటినుండి వారి నైతిక ప్రవర్తన గుర్తించదగిన రీతిగా శ్రేష్ఠమైన మార్పుచెందినది.” తల్లి యింకా యిట్లనెను: “మా కుమార్తెలు, తలిదండ్రులైన మాతో మునుపటికంటె ఎక్కువ సన్నిహితులగుటకు ఆ పుస్తకము విజయవంతంగా సహాయపడినది.”
ఈ పత్రిక సైజులోనే ఉన్న ఈ 256 పేజీల సాహిత్యమును, ఈ కూపను నింపి పోస్టుచేస్తు దానితోపాటు రూ. 40.00 పంపి పొందవచ్చును. ఈ పుస్తకమునందలి 116 బైబిలు వృత్తాంతములు బైబిలు అంతయు ఏమిటో అనే విషయాన్నిగూర్చి పాఠకునికి క్లుప్తీకరించును. చరిత్రలో సంభవించిన సంఘటనల క్రమము చొప్పున ఈ కథలు ఉండును. చరిత్రలో జరిగిన యితర సంఘటనలతోబాటు ఇవెప్పుడు సంభవించినవో నేర్చుకొనుటకు ఇది నిజంగా సహాయకరమైనదని మీరు కనుగొనగలరు. ఈ పుస్తకము అతిచక్కని వర్ణచిత్రాలతో, పెద్ద అచ్చులో ఉన్నది.
దయచేసి మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ అను గట్టి అట్టల పుస్తకమును పోస్టు ఖర్చులు భరించి పంపుము, అందుకొరకు నేను రూ. 40.00 పంపుచున్నాను.