జెఫన్యా
1 ఆమోను+ కుమారుడైన యోషీయా+ యూదాను పరిపాలిస్తున్న రోజుల్లో యెహోవా వాక్యం జెఫన్యా* దగ్గరికి వచ్చింది. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియా కుమారుడు.
2 యెహోవా ఇలా అంటున్నాడు: “నేను భూమ్మీదున్న ప్రతీదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను.”+
3 “నేను మనుషుల్ని, జంతువుల్ని తుడిచిపెట్టేస్తాను.
ఆకాశపక్షుల్ని, సముద్ర చేపల్ని తుడిచిపెట్టేస్తాను;+
దుష్టుల్ని, వాళ్లతోపాటు పాపపు ఉచ్చుల్ని*+ తుడిచిపెట్టేస్తాను;
మనుషులందర్నీ భూమ్మీద ఉండకుండా తుడిచిపెట్టేస్తాను” అని యెహోవా అంటున్నాడు.
4 “నేను యూదాకు వ్యతిరేకంగా,
యెరూషలేము నివాసులందరికీ వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతాను.
ఈ స్థలంలో బయలు ఆనవాళ్లే లేకుండా చేస్తాను.+
అన్య దేవుళ్ల పూజారుల పేరుప్రతిష్ఠల్ని, అలాగే యాజకుల్ని తుడిచిపెట్టేస్తాను.+
5 ఇళ్ల పైకప్పుల మీద ఆకాశ సైన్యానికి మొక్కేవాళ్లను,+
ఒకవైపు యెహోవాకు మొక్కి, ఆయనకు విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేస్తూనే+
మరోవైపు మల్కాముకు విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేసేవాళ్లను+ తుడిచిపెట్టేస్తాను.
6 యెహోవాను అనుసరించడం మానేసినవాళ్లను,+
యెహోవాను వెదకనివాళ్లను, ఆయన దగ్గర విచారణ చేయనివాళ్లను+ తుడిచిపెట్టేస్తాను.”
7 సర్వోన్నత ప్రభువైన యెహోవా ముందు మౌనంగా ఉండండి, ఎందుకంటే యెహోవా రోజు దగ్గర్లో ఉంది.+
యెహోవా ఒక బలిని సిద్ధం చేశాడు; తాను ఆహ్వానించినవాళ్లను ఆయన పవిత్రపర్చాడు.
8 “నేను సిద్ధం చేసిన బలిని అర్పించే రోజున యెహోవానైన నేను యువరాజుల్ని,
రాకుమారుల్ని, విదేశీ వస్త్రాలు వేసుకునే వాళ్లందర్నీ లెక్క అడుగుతాను.+
9 ఆ రోజున వేదిక* మీదికి ఎక్కే ప్రతీ ఒక్కర్ని,
తమ యజమాని ఇంటిని హింసతో, మోసంతో నింపేవాళ్లను నేను లెక్క అడుగుతాను.”
10 యెహోవా ఇలా అంటున్నాడు: “ఆ రోజున,
చేపల ద్వారం+ దగ్గర నుండి కేకలు వినిపిస్తాయి,
నగరపు రెండో భాగం+ నుండి ఏడ్పులు,
కొండల నుండి పెళపెళ ధ్వని వినిపిస్తాయి.
11 మక్తేషు* నివాసులారా, ప్రలాపించండి,
ఎందుకంటే, వర్తకులందరూ నాశనమయ్యారు;
వెండిని తూచేవాళ్లంతా నాశనమయ్యారు.
12 ఆ సమయంలో నేను దీపాలు పట్టుకొని యెరూషలేమును జాగ్రత్తగా సోదా చేస్తాను,
‘యెహోవా మంచీ చేయడు, చెడూ చేయడు’ అని తమ హృదయంలో అనుకుంటూ+
ఉదాసీనంగా ఉన్నవాళ్లను* నేను లెక్క అడుగుతాను.
13 వాళ్ల ఆస్తి కొల్లగొట్టబడుతుంది, వాళ్ల ఇళ్లు ధ్వంసం అవుతాయి.+
వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు కానీ వాటిలో నివసించరు;
ద్రాక్షతోటలు నాటుకుంటారు కానీ వాటి ద్రాక్షారసం తాగరు.+
14 యెహోవా మహారోజు దగ్గరపడింది!
అది సమీపంగా ఉంది, చాలా వేగంగా దూసుకొస్తోంది!*+
యెహోవా రోజు శబ్దం భయంకరంగా* ఉంటుంది.+
ఆ రోజున యోధులు కేకలు వేస్తారు.+
వేదన, దుఃఖం కలిగించే రోజు,+
ఉపద్రవం,* నాశనం తెచ్చే రోజు,
చీకటి, అంధకారం కమ్ముకునే రోజు,
మేఘాలు, గాఢాంధకారం కమ్ముకునే రోజు,+
16 ప్రాకారాలుగల నగరాలకు, మూలల్లో ఉండే ఎత్తైన బురుజులకు వ్యతిరేకంగా+
17 నేను మనుషులకు వేదన కలిగిస్తాను,
వాళ్లు గుడ్డివాళ్లలా నడుస్తారు,+
ఎందుకంటే వాళ్లు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.+
వాళ్ల రక్తం ధూళిలా,
వాళ్ల పేగులు పేడలా పారేయబడతాయి.+
18 యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, వాళ్ల బంగారం గానీ వాళ్లను కాపాడలేవు;+
ఎందుకంటే ఆయన రోషాగ్ని భూమంతటినీ కాల్చేస్తుంది,+
ఆయన భూమ్మీదున్న నివాసులందర్నీ సమూలంగా నాశనం చేస్తాడు, ఆ నాశనం భయంకరంగా ఉంటుంది.”+
2 దేవుని తీర్పు అమలు కాకముందే,
ధాన్యం పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు ఆ రోజు గడిచిపోకముందే,
యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే,+
యెహోవా ఉగ్రత రోజు మీ మీదికి రాకముందే,
3 భూమ్మీదున్న సాత్వికులారా,* ఆయన నీతియుక్తమైన శాసనాల్ని* పాటిస్తున్న ప్రజలారా,
మీరంతా యెహోవాను వెదకండి.+
నీతిని వెదకండి, సాత్వికాన్ని* వెదకండి.
అలాచేస్తే, యెహోవా ఉగ్రత రోజున బహుశా* మీరు దాచబడతారు.+
4 ఎందుకంటే, గాజా విడవబడిన నగరం అవుతుంది,
అష్కెలోను నిర్మానుష్యం అవుతుంది,+
5 “సముద్ర తీరాన నివసించే కెరేతీయులారా, మీకు శ్రమ!+
యెహోవా తీర్పు మీకు వ్యతిరేకంగా ఉంది.
ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నేను నిన్ను నాశనం చేస్తాను,
నీలో ఒక్క నివాసి కూడా మిగిలి ఉండడు.
6 సముద్ర తీరం మేత స్థలం అవుతుంది,
అక్కడ కాపరుల కోసం బావులు, గొర్రెల కోసం రాతిదొడ్లు ఉంటాయి.
7 ఆ ప్రదేశం యూదా ఇంటివాళ్లలో మిగిలినవాళ్లది అవుతుంది;+
అక్కడ వాళ్లు పోషించబడతారు.
సాయంత్రం వాళ్లు అష్కెలోను ఇళ్లలో పడుకుంటారు.
8 “మోయాబు వేసిన నిందల్ని,+ అమ్మోనీయులు అవమానిస్తూ మాట్లాడిన మాటల్ని+ నేను విన్నాను,
వాళ్లు నా ప్రజల్ని నిందించి, వాళ్ల ప్రాంతానికి వ్యతిరేకంగా ప్రగల్భాలు పలికారు.+
9 కాబట్టి నా జీవం తోడు” అని ఒట్టేసి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
“మోయాబు అచ్చం సొదొమలా అవుతుంది,+
అమ్మోనీయులు గొమొర్రాలా అవుతారు,+
వాళ్ల ప్రదేశం దురదగొండి చెట్లతో, ఉప్పు గోతులతో ఎప్పటికీ పాడుబడ్డ స్థలంగా ఉంటుంది.+
నా ప్రజల్లో మిగిలినవాళ్లు వాళ్లను కొల్లగొడతారు,
నా జనంలో మిగిలినవాళ్లు వాళ్లను ఆక్రమించుకుంటారు.
10 వాళ్ల గర్వం+ వల్ల వాళ్లు పొందబోయేది అదే,
ఎందుకంటే వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రజల మీద నిందలు వేసి, వాళ్లమీద తమను తాము హెచ్చించుకున్నారు.
11 యెహోవా వాళ్లకు భయంకరుడిగా* ఉంటాడు;
ఎందుకంటే, భూమ్మీదున్న దేవుళ్లందర్నీ ఆయన నాశనం చేస్తాడు,*
జనాల దీవులన్నీ వాటివాటి స్థానాల నుండి
12 ఇతియోపీయులారా, నా ఖడ్గం మిమ్మల్ని కూడా హతం చేస్తుంది.+
13 ఆయన ఉత్తరం వైపు తన చెయ్యి చాపి అష్షూరును నాశనం చేస్తాడు,
నీనెవెను నిర్మానుష్యం చేస్తాడు,+ ఎడారిలా ఎండిపోయేలా చేస్తాడు.
14 మందలు, అన్నిరకాల అడవి జంతువులు దానిలో పడుకుంటాయి.
కూలిపోయిన దాని స్తంభాల మధ్య గూడబాతు,* ముళ్లపంది రాత్రి గడుపుతాయి.
కిటికీ దగ్గర పక్షుల* శబ్దం వినిపిస్తుంది.
గడప దగ్గర శిథిలాలు కనిపిస్తాయి;
ఎందుకంటే దేవదారుతో చేసిన దాని దూలాల్ని ఆయన బయటికి కనిపించేలా చేస్తాడు.
15 ‘నాలాంటి నగరం ఇంకొకటి లేనేలేదు’ అని తన హృదయంలో అనుకుంటూ
నిశ్చింతగా కూర్చున్న గర్విష్ఠి నగరం ఇదే.
ఇప్పుడు దాని పరిస్థితి భయంకరంగా ఉంది,
అది అడవి జంతువులు పడుకునే చోటుగా మారిపోయింది!
దాన్ని దాటి వెళ్లేవాళ్లు ఈలలు వేస్తూ, చెయ్యి చూపిస్తూ దాన్ని ఎగతాళి చేస్తారు.”+
3 తిరుగుబాటు, భ్రష్టత్వం, అణచివేత నిండిన నగరానికి శ్రమ!+
2 అది ఎవ్వరి మాటా వినలేదు;+ ఏ క్రమశిక్షణనూ స్వీకరించలేదు.+
అది యెహోవాపై నమ్మకం ఉంచలేదు;+ తన దేవుని దగ్గరికి రాలేదు.+
3 దాని రాకుమారులు గర్జించే సింహాలు.+
దాని న్యాయమూర్తులు రాత్రిపూట వేటాడే తోడేళ్లు;
అవి ఉదయం వరకు ఒక్క ఎముకను కూడా మిగల్చవు.
4 దాని ప్రవక్తలు గర్విష్ఠులు, మోసగాళ్లు.+
5 యెహోవా దాని మధ్య నీతిమంతుడిగా ఉన్నాడు;+ ఆయన ఏ తప్పూ చేయడు.
ప్రతీ ఉదయం ఆయన తన న్యాయనిర్ణయాల్ని తెలియజేస్తాడు,+
తెల్లవారడం ఎంత ఖచ్చితమో అదీ అంతే ఖచ్చితం.
కానీ అనీతిమంతులకు సిగ్గు రావట్లేదు.+
6 “నేను జనాల్ని నాశనం చేశాను; మూలల్లో ఉండే బురుజులు నిర్జనమైపోయాయి.
వాళ్ల వీధుల గుండా ఎవ్వరూ వెళ్లకుండా నేను వాటిని ధ్వంసం చేశాను.
ఒక్క మనిషి కూడా లేకుండా వాళ్ల నగరాలు శిథిలమైపోయాయి.+
7 ‘నువ్వు ఖచ్చితంగా నాకు భయపడతావు, క్రమశిక్షణను* స్వీకరిస్తావు’ అని నేను అన్నాను.+
అలా దాని నివాస స్థలం నాశనం కాకుండా ఉండాలన్నది నా ఉద్దేశం.+
ఎందుకంటే, వీటన్నిటిని బట్టి నేను దాన్ని లెక్క అడగాలి.*
కానీ వాళ్లు ఇంకా ఆత్రంగా అవినీతి పనులు చేస్తూ వచ్చారు.+
8 ‘కాబట్టి, నేను దోపుడుసొమ్ము తీసుకోవడానికి లేచే* రోజు వరకు,
నా కోసం కనిపెట్టుకొని* ఉండండి’+ అని యెహోవా అంటున్నాడు.
‘నా ఆగ్రహాన్ని, నా కోపాగ్ని అంతటినీ కుమ్మరించడానికి+
దేశాల్ని, రాజ్యాల్ని సమకూర్చాలన్నది నా న్యాయనిర్ణయం.
ఎందుకంటే నా రోషాగ్ని భూమంతటినీ కాల్చేస్తుంది.+
9 అప్పుడు నేను దేశదేశాల ప్రజలకు స్వచ్ఛమైన భాష నేర్పిస్తాను.
దానివల్ల వాళ్లందరూ యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తారు,
10 ఇతియోపియ నదుల ప్రదేశం నుండి
నన్ను వేడుకునే నా ప్రజలు, అంటే చెదిరిపోయిన నా ప్రజల కూతురు నాకు కానుక తీసుకొస్తుంది.+
11 నువ్వు నాకు ఎదురుతిరిగి చేసిన పనుల వల్ల
ఆ రోజున నువ్వు సిగ్గుపర్చబడవు.
ఎందుకంటే గర్వంతో గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లను నేను నీ మధ్య ఉండకుండా నిర్మూలిస్తాను;
నా పవిత్ర పర్వతం మీద నువ్వు మళ్లీ ఎన్నడూ గర్వం చూపించవు.+
13 ఇశ్రాయేలీయుల్లో మిగిలినవాళ్లు+ ఎలాంటి అవినీతి పనులూ చేయరు;+
వాళ్లు అబద్ధం ఆడరు, తమ నాలుకతో ఇతరుల్ని మోసం చేయరు;
14 సీయోను కూతురా, సంతోషంతో కేకలు వేయి!
ఇశ్రాయేలూ, విజయోత్సాహంతో కేకలు వేయి!+
యెరూషలేము కూతురా,+ నిండు హృదయంతో సంతోషించు, ఆనందించు!
15 నువ్వు అనుభవిస్తున్న శిక్షను యెహోవా తీసేశాడు.+
ఆయన నీ శత్రువును వెళ్లగొట్టాడు.+
ఇశ్రాయేలు రాజైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.+
విపత్తు వస్తుందని ఇకమీదట నువ్వు భయపడవు.+
16 ఆ రోజున యెరూషలేముతో ఇలా అంటారు:
“సీయోనూ, భయపడకు.+
నీ చేతుల్ని బలహీనం కానివ్వకు.
17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.+
శక్తిమంతుడైన యోధునిలా ఆయన నిన్ను కాపాడతాడు.
ఆయన నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు.+
నీ మీద ప్రేమ చూపించడం వల్ల సంతృప్తితో విశ్రాంతి తీసుకుంటాడు.
ఆయన నీ గురించి సంతోషించి, ఆనందంతో కేకలు వేస్తాడు.
18 నీ పండుగలకు రాలేకపోయినందువల్ల దుఃఖపడుతున్నవాళ్లను నేను సమకూరుస్తాను;+
దాని నిందను భరిస్తున్నందువల్ల వాళ్లు ఇంతకాలం నీ దగ్గరికి రాలేకపోయారు.+
19 ఇదిగో! నిన్ను అణచివేస్తున్న వాళ్లందరి మీద అప్పుడు నేను చర్య తీసుకుంటాను.+
కుంటుతున్న వాళ్లను కాపాడతాను,+
చెదిరిపోయిన వాళ్లను ఒక్కచోటికి తెస్తాను.+
వాళ్లు ఏ దేశాల్లో సిగ్గుపర్చబడ్డారో,
వాటన్నిట్లో వాళ్లకు కీర్తి ప్రతిష్ఠలు* వచ్చేలా చేస్తాను.
20 ఆ సమయంలో నేను మిమ్మల్ని స్వదేశానికి తీసుకొస్తాను,
అవును, అప్పుడు మిమ్మల్ని ఒక్కచోటికి తెస్తాను.
చెరలోకి వెళ్లినవాళ్లను మీ కళ్ల ముందే వెనక్కి తీసుకొచ్చినప్పుడు
భూమ్మీదున్న జనాలన్నిటి మధ్య మీకు కీర్తి ప్రతిష్ఠలు* వచ్చేలా చేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.+
“యెహోవా భద్రం చేశాడు (దాచిపెట్టాడు)” అని అర్థం.
లేదా “అడ్డురాళ్లను.” విగ్రహపూజకు సంబంధించిన వస్తువులు, పనులు అని స్పష్టమౌతోంది.
లేదా “గడప.” రాజు సింహాసనం ఉన్న వేదిక కావచ్చు.
యెరూషలేములోని చేపల ద్వారం దగ్గర ఉన్న భాగం అని తెలుస్తోంది.
లేదా “ద్రాక్షతొట్టిలో మడ్డి మీద పేరుకున్న చిక్కని ద్రాక్షారసంలా ఉన్నవాళ్లను.”
లేదా “త్వరపడుతోంది!”
అక్ష., “చేదుగా.”
అక్ష., “తుఫాను.”
అక్ష., “కొమ్ము.”
లేదా “వినయస్థులారా.”
అక్ష., “ఆయన తీర్పును.”
లేదా “వినయాన్ని.”
లేదా “ఒకవేళ.”
లేదా “మిట్టమధ్యాహ్నం.”
లేదా “వాళ్లమీద శ్రద్ధ చూపిస్తాడు.”
లేదా “సంభ్రమాశ్చర్యాలు పుట్టించే వ్యక్తిగా.”
లేదా “కృశించిపోయేలా చేస్తాడు.”
లేదా “ఆయన్ని ఆరాధిస్తాయి.”
అంటే, పెలికన్.
బహుశా అది గాలి శబ్దం లేదా అడవి జంతువుల శబ్దం కూడా కావచ్చు.
లేదా “దిద్దుబాటును.”
లేదా “శిక్షించాలి.”
లేదా “సాక్షిగా లేచే” అయ్యుంటుంది.
లేదా “ఓపిగ్గా ఎదురుచూస్తూ.”
లేదా “ఆరాధిస్తారు.”
లేదా “మేత మేసి.”
అక్ష., “పేరు.”
అక్ష., “పేరు.”