హబక్కూకు
1 హబక్కూకు* ప్రవక్త ఒక దర్శనంలో పొందిన సందేశం:
2 యెహోవా, ఎంతకాలం సహాయం కోసం నేను నీకు మొరపెట్టాలి?
ఎప్పుడు నా మొర వింటావు?+
సహాయం కోసం ఎంతకాలం నేను వేడుకోవాలి?
దౌర్జన్యం నుండి నన్ను ఎప్పుడు కాపాడతావు?*+
3 నన్నెందుకు దుష్టత్వాన్ని చూడనిస్తున్నావు?
అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు?
నాశనం, దౌర్జన్యం ఎందుకు నా కళ్లముందు ఉన్నాయి?
గొడవలు, కొట్లాటలు ఎందుకు ఎక్కువౌతున్నాయి?
4 ధర్మశాస్త్రం బలహీనమైపోయింది,
న్యాయం అనేది ఎప్పుడూ జరగట్లేదు.
దుష్టులు నీతిమంతుల్ని చుట్టుముడుతున్నారు;
అందుకే న్యాయం పక్కదారి పడుతోంది.+
5 “దేశాల వైపు చూడండి, మనసుపెట్టండి!
నోళ్లు వెళ్లబెట్టి ఆశ్చర్యంతో చూస్తూ ఉండండి;
మీ రోజుల్లో ఒకటి జరగబోతుంది,
దాని గురించి మీకు చెప్పినా మీరు నమ్మరు.+
తమవికాని ఇళ్లను ఆక్రమించుకోవడానికి
వాళ్లు విశాలమైన భూభాగాల గుండా సంచరిస్తారు.+
7 వాళ్లు భయంకరులు, భీకరులు.
వాళ్లు తమ సొంత న్యాయాన్ని, అధికారాన్ని* స్థాపిస్తారు.+
8 వాళ్ల గుర్రాలు చిరుతపులుల కన్నా వేగంగా పరుగెత్తుతాయి.
అవి రాత్రిపూట తిరిగే తోడేళ్ల కన్నా భయంకరమైనవి.+
వాళ్ల గుర్రాలు దౌడు తీస్తూ ముందుకు సాగుతాయి;
అవి చాలా దూరం నుండి వస్తాయి.
ఎరను పట్టుకోవడానికి గద్ద దూసుకొచ్చినట్టు వాళ్లు అకస్మాత్తుగా దూసుకొస్తారు.+
9 వాళ్లంతా దౌర్జన్యం చేయడానికే వస్తారు.+
వాళ్లు సూటిగా చూస్తూ బలమైన తూర్పు గాలిలా దూసుకొస్తారు,+
ఇసుక రేణువులంత మందిని చెరపట్టుకుపోతారు.
ప్రాకారమున్న ప్రతీ చోటును చూసి నవ్వుకుంటారు;+
మట్టిదిబ్బలు వేసి వాటిని ఆక్రమిస్తారు.
12 యెహోవా, నువ్వు అనాది కాలం నుండి ఉన్నావు కదా?+
నా దేవా, పవిత్రుడివైన నా దేవా, నువ్వు ఎప్పటికీ చనిపోవు.*+
యెహోవా, తీర్పు అమలుచేయడానికే నువ్వు వాళ్లను నియమించావు;
నా ఆశ్రయదుర్గమా,*+ మమ్మల్ని శిక్షించడానికే* వాళ్లను నియమించావు.+
అలాంటిది, మోసగాళ్లను నువ్వెందుకు సహిస్తున్నావు?+
దుష్టుడు తనకన్నా నీతిమంతుణ్ణి మింగేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నావు?+
14 నువ్వు ఎందుకు మనుషుల్ని సముద్రంలోని చేపల్లా చేశావు?
ఎందుకు నాయకుడు లేని సముద్రప్రాణుల్లా చేశావు?
15 అతను* వాళ్లందర్నీ గాలం వేసి లాగుతాడు,
తన వల వేసి పట్టుకుంటాడు,
చేపలు పట్టే తన వలలో వాళ్లను సమకూర్చి
సంతోషంతో గంతులేస్తాడు.+
16 అందుకే అతను తన వలకు బలులు అర్పిస్తాడు.
చేపలు పట్టే తన వలకు బలులు అర్పిస్తాడు;*
ఎందుకంటే వాటి వల్లే అతనికి పుష్టికరమైన ఆహారం,
శ్రేష్ఠమైన ఆహారం దొరుకుతుంది.
17 అతను ఇలాగే తన వలను నింపుకుంటూ ఖాళీ చేస్తూ ఉంటాడా?*
కనికరం లేకుండా దేశాల్ని వధిస్తూ ఉంటాడా?+
ఆయన నా ద్వారా ఏం చెప్తాడో చూడడానికి,
నన్ను గద్దించినప్పుడు ఏం చెప్పాలో తెలుసుకోవడానికి నేను కనిపెట్టుకొని ఉంటాను.
2 అప్పుడు యెహోవా నాకు ఇలా చెప్పాడు:
“దర్శనంలోని విషయాల్ని రాయి, పలకల మీద వాటిని స్పష్టంగా చెక్కు,+
చదివి వినిపించే వ్యక్తి సులభంగా* చదవగలిగేలా వాటిని స్పష్టంగా రాయి.+
ఒకవేళ ఆలస్యమైనా,* దానికోసం కనిపెట్టుకొని ఉండు!*+
ఎందుకంటే, అది తప్పకుండా నెరవేరుతుంది.
ఆలస్యం అవ్వదు!
4 ఇదిగో! గర్వంతో ఉప్పొంగిపోయినవాణ్ణి చూడు;
అతని హృదయంలో నిజాయితీ లేదు.
అయితే నీతిమంతుడు తన నమ్మకత్వం* వల్ల జీవిస్తాడు.+
5 నిజమే, ద్రాక్షారసం మోసకరమైనది;
అందుకే, అహంకారి తన లక్ష్యాన్ని చేరుకోలేడు.
అతను దేశాలన్నిటినీ సమకూర్చుకుంటూ ఉంటాడు,
తనకోసం ప్రజలందర్నీ పోగుచేసుకుంటూ ఉంటాడు.+
6 వాళ్లంతా అతన్ని ఎగతాళి చేస్తూ సామెతల్ని, పొడుపు కథల్ని చెప్పుకుంటారు.+
వాళ్లు ఇలా అంటారు:
‘తనదికాని దాన్ని పోగుచేసుకుంటున్న వాడికి,
తన అప్పును మరింత ఎక్కువ చేసుకుంటున్న వాడికి శ్రమ!
ఇలా ఇంకెంతకాలం?
7 నీకు అప్పిచ్చినవాళ్లు ఉన్నట్టుండి నీ మీదికి లేవరా?
వాళ్లు నిద్రలేచి నిన్ను గట్టిగా కుదిపేస్తారు.
వాళ్లు నిన్ను కొల్లగొడతారు.+
8 నువ్వు ఎన్నో దేశాల్ని కొల్లగొట్టావు కాబట్టి
మిగిలిన ప్రజలంతా నిన్ను కొల్లగొడతారు.+
ఎందుకంటే, నువ్వు మనుషుల రక్తాన్ని చిందించావు,
భూమంతటికీ, నగరాలకు, వాటి నివాసులందరికీ
దౌర్జన్యం చేశావు.+
9 విపత్తుకు చిక్కకుండా తన గూడును ఎత్తైన చోట కట్టుకోవాలని
తన ఇంటివాళ్ల* కోసం అక్రమ లాభం సంపాదించేవాడికి శ్రమ!
10 నీ కుతంత్రాల వల్ల నీ ఇంటివాళ్లకు అవమానం తీసుకొచ్చావు.
ఎన్నో దేశాల ప్రజల్ని తుడిచిపెట్టి పాపం మూటగట్టుకున్నావు.+
11 గోడలో నుండి రాయి కేకలు వేస్తుంది,
పైకప్పులో నుండి దూలం దానికి జవాబిస్తుంది.
12 రక్తపాతంతో నగరాన్ని కట్టేవాడికి శ్రమ!
దుష్టత్వంతో పట్టణాన్ని స్థాపించేవాడికి శ్రమ!
13 ప్రజలు పడిన కష్టమంతా మంటలపాలు అయ్యేది సైన్యాలకు అధిపతైన యెహోవా వల్ల కాదా?
దేశాలు పడిన ప్రయాసంతా వ్యర్థమయ్యేది ఆయన వల్ల కాదా?+
15 తన పొరుగువాళ్ల మానం చూడాలని
మద్యంలో కోపాన్ని, ఆగ్రహాన్ని కలిపి,
మత్తెక్కేదాకా వాళ్లతో తాగించేవాడికి శ్రమ!
16 నువ్వు ఘనతకు బదులు అవమానంతో నిండిపోతావు.
నువ్వు కూడా తాగి, నీ సున్నతి లేని స్థితిని బయటపెట్టుకుంటావు.*
యెహోవా కుడిచేతిలో ఉన్న గిన్నె నీ దగ్గరికి కూడా వస్తుంది,+
అవమానం నీ ఘనతను కప్పేస్తుంది.
17 లెబానోనుకు చేసిన దౌర్జన్యం నిన్ను కప్పేస్తుంది,
మృగాల్ని వణికించిన నాశనం నీ మీదికి వస్తుంది,
ఎందుకంటే, నువ్వు మనుషుల రక్తాన్ని చిందించావు,
భూమంతటికీ, నగరాలకు, వాటి నివాసులందరికీ
దౌర్జన్యం చేశావు.+
18 చెక్కిన ప్రతిమ వల్ల ఏం ప్రయోజనం?
దాన్ని చెక్కేది శిల్పే కదా!
పోత* విగ్రహం వల్ల, అబద్ధాలు బోధించేదాని వల్ల ఏం ప్రయోజనం?
ఆ వ్యర్థమైన దేవుళ్లను తయారుచేసే వ్యక్తి వాటిమీద నమ్మకం ఉంచుతాడు,
కానీ అవి కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేవు.+
19 చెక్కతో, “మేలుకో!” అని చెప్పే వ్యక్తికి శ్రమ.
మాట్లాడలేని రాయితో, “నిద్రలే! మాకు ఉపదేశమివ్వు!” అని చెప్పే వ్యక్తికి శ్రమ.
20 అయితే యెహోవా తన పవిత్ర ఆలయంలో ఉన్నాడు.+
భూమంతా ఆయన ముందు మౌనంగా ఉండాలి!’ ”+
3 హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన, శోకగీతాలు:
2 యెహోవా, నీ గురించిన వార్త విన్నాను.
యెహోవా, నీ పనుల్ని చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయాను.
మా కాలంలో* మళ్లీ వాటిని చేయి!
మా కాలంలో* వాటిని తెలియజేయి.
కోప్పడుతూనే కరుణ చూపించడం మర్చిపోకు.+
ఆయన మహిమ ఆకాశాన్ని కప్పేసింది;+
భూమి ఆయన కీర్తితో నిండిపోయింది.
4 ఆయన తేజస్సు వెలుగు లాంటిది.+
ఆయన చేతి నుండి రెండు కిరణాలు ప్రసరించాయి,
అక్కడే ఆయన శక్తి దాగివుంది.
6 ఆయన స్థిరంగా నిలబడి భూమిని కుదిపేశాడు.+
ఒక్క చూపుతో దేశాలు ఉలిక్కిపడి లేచేలా చేశాడు.+
అనాది నుండి ఉన్న పర్వతాలు బద్దలయ్యాయి,
ప్రాచీనకాలం నుండి ఉన్న కొండలు మోకరిల్లాయి.+
ఇవి ఆయన పురాతన మార్గాలు.
7 కూషీయుల డేరాల్లో విపత్తును చూశాను.
మిద్యానీయుల డేరాల తెరలు వణికిపోయాయి.+
8 యెహోవా, నీకు కోపం వచ్చింది నదుల మీదనా?
నీ కోపం మండుతున్నది నదుల మీదనా?
లేదా నీ ఆగ్రహం సముద్రం మీదనా?+
9 నువ్వు నీ విల్లును తీసి ఎక్కుపెట్టావు.
కర్రలు* ప్రమాణపూర్వకంగా నియమించబడ్డాయి.* (సెలా)
నువ్వు నదులతో భూమిని చీలుస్తున్నావు.
10 నిన్ను చూసి పర్వతాలు నొప్పితో మెలికలు తిరిగిపోయాయి.+
కుండపోతగా కురిసిన నీళ్లు దేశంలో ప్రవహించాయి.
అగాధ జలాలు బిగ్గరగా గర్జించాయి.+
అవి ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
11 సూర్యుడు, చంద్రుడు తమ ఉన్నత నివాసాల్లో ఉండిపోయారు.+
నీ బాణాలు వెలుగులా దూసుకెళ్లాయి.+
నీ ఈటె తళతళ మెరిసింది.
12 విపరీతమైన కోపంతో నువ్వు భూమ్మీద సంచరించావు.*
ఆగ్రహంతో దేశాల్ని అణగదొక్కావు.*
13 నీ ప్రజల్ని రక్షించడానికి, నీ అభిషిక్తుణ్ణి కాపాడడానికి నువ్వు బయల్దేరావు.
దుష్టుల ఇంటి నాయకుణ్ణి చితగ్గొట్టావు.
పునాది నుండి పైకప్పు* వరకు అది ధ్వంసమైంది. (సెలా)
14 నన్ను చెదరగొట్టడానికి వాళ్లు తుఫానులా వచ్చినప్పుడు,
నువ్వు అతని యోధుల తలల్ని అతని ఆయుధాలతోనే* నరికేశావు.
కష్టాల్లో ఉన్నవాణ్ణి రహస్యంగా మింగేయడం వాళ్లకెంతో ఇష్టం.
15 నువ్వు నీ గుర్రాలతో
సముద్రం గుండా, ఉప్పొంగుతున్న విస్తార జలాల గుండా వచ్చావు.
నా ఎముకలు కుళ్లిపోసాగాయి.+
నా కాళ్లు గజగజలాడాయి.
అయినా నేను, వేదన కలిగించే ఆ రోజు కోసం మౌనంగా ఎదురుచూస్తాను,+
ఎందుకంటే, అది మా మీద దాడిచేసే వాళ్లమీదికి వస్తోంది.
17 అంజూర చెట్టు పూత వేయకపోయినా,
ద్రాక్షతీగలు ఫలించకపోయినా;
ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా,
పొలాల్లో పంట పండకపోయినా;
దొడ్డిలో గొర్రెలు లేకుండాపోయినా,
సాలల్లో పశువులు లేకపోయినా;
18 నేను మాత్రం యెహోవాను బట్టి ఆనందిస్తాను;
నా రక్షకుడైన దేవుణ్ణి బట్టి సంతోషిస్తాను.+
నన్ను ఎత్తైన స్థలాల్లో నడిచేలా చేస్తాడు,+
సంగీత నిర్దేశకునికి; నా తంతివాద్యాలతో.
బహుశా “భావోద్వేగంతో హత్తుకోవడం” అనే అర్థం ఉండవచ్చు.
లేదా “ఎప్పుడు జోక్యం చేసుకుంటావు?”
లేదా “ఘనతను.”
లేదా “వాళ్ల శక్తే వాళ్ల దేవుడు” అయ్యుంటుంది.
లేదా “మేము చనిపోము” అయ్యుంటుంది.
అక్ష., “బండరాయీ.”
లేదా “గద్దించడానికే.”
అంటే, శత్రువైన కల్దీయుడు.
లేదా “ధూపం వేస్తాడు.”
లేదా “తన కత్తిని దూస్తూ ఉంటాడా?” అయ్యుంటుంది.
లేదా “అనర్గళంగా.”
లేదా “ముగింపు కోసం.”
లేదా “ఆలస్యమౌతున్నట్టు అనిపించినా.”
లేదా “ఆత్రంగా ఎదురుచూడు!”
లేదా “విశ్వాసం; నమ్మకం” అయ్యుంటుంది.
పదకోశంలో “ప్రాణం” చూడండి.
లేదా “షియోల్,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “జనం.”
లేదా “తూలతావు” అయ్యుంటుంది.
లేదా “లోహపు.”
అక్ష., “సంవత్సరాల మధ్యలో.”
అక్ష., “సంవత్సరాల మధ్యలో.”
పదకోశం చూడండి.
లేదా “రక్షణను.”
లేదా “బాణాలు” అయ్యుంటుంది.
లేదా “ఒట్టేసి చేసిన గోత్రాల ప్రమాణాలు చెప్పబడ్డాయి” అయ్యుంటుంది.
లేదా “కవాతు చేశావు.”
అక్ష., “నూర్చావు.”
అక్ష., “మెడ.”
అక్ష., “కర్రలతోనే.”
అక్ష., “నా కడుపు.”