యెహెజ్కేలు
1 30వ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున, నేను చెరలో ఉన్న ప్రజల+ మధ్య కెబారు నది పక్కన+ ఉన్నప్పుడు ఆకాశం తెరుచుకుంది, నేను దేవుని దర్శనాలు చూశాను. 2 ఆ నెల ఐదో రోజున (అంటే, యెహోయాకీను రాజు+ చెరలోకి వెళ్లిన ఐదో సంవత్సరంలో) 3 యెహోవా వాక్యం యాజకుడైన బూజీ కుమారుడు యెహెజ్కేలు* దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో అతను కల్దీయుల+ దేశంలోని కెబారు నది పక్కన ఉన్నాడు. అక్కడ యెహోవా చెయ్యి అతని మీదికి వచ్చింది.+
4 నేను చూస్తుండగా, ఉత్తరం వైపు నుండి భయంకరమైన గాలి+ వీచింది; ఒక పెద్ద మేఘం, అగ్నిమయమైన మెరుపులు+ కనిపించాయి, ఆ మేఘం చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఆవరించి ఉంది. ఆ అగ్ని మధ్యలో మెరుస్తున్న లోహం* లాంటిది ఒకటి కనిపించింది.+ 5 దానిలో నాలుగు జీవుల లాంటివి కనిపించాయి,+ వాటిలో ప్రతీదాని రూపం మనిషి రూపంలా ఉంది. 6 ప్రతీదానికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.+ 7 వాటి పాదాలు నిలువుగా ఉన్నాయి, వాటి అరికాళ్లు దూడ అరికాళ్లలా ఉన్నాయి, అవి మెరుగుపెట్టిన రాగిలా మెరుస్తున్నాయి.+ 8 వాటి నాలుగు పక్కల్లో, రెక్కల కింద మనిషి చేతులు ఉన్నాయి; ఆ నాలుగిటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి. 9 వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతున్నాయి. ప్రతీది పక్కకు తిరగకుండా తిన్నగా ముందుకు సాగుతోంది.+
10 వాటి ముఖాలు ఇలా ఉన్నాయి: ఆ నాలుగిటిలో ప్రతీదానికి మనిషి ముఖం, దాని కుడివైపున సింహం+ ముఖం, ఎడమవైపున ఎద్దు+ ముఖం ఉన్నాయి; ఆ నాలుగిటిలో ప్రతీదానికి గద్ద+ ముఖం కూడా ఉంది.+ 11 వాటి ముఖాలు అలా ఉన్నాయి. వాటి రెక్కలు వాటికి పైగా చాపివున్నాయి. ప్రతీదాని రెక్కల్లో రెండు ఒకదానికొకటి తాకుతున్నాయి; మరో రెండు రెక్కలు వాటి శరీరాల్ని కప్పుతున్నాయి.+
12 వాటిలో ప్రతీది తిన్నగా ముందుకు సాగుతోంది, పవిత్రశక్తి* ఎటు నడిపిస్తే అవి అటు వెళ్తున్నాయి.+ వెళ్లేటప్పుడు అవి పక్కకు తిరగవు. 13 ఆ జీవుల రూపం మండుతున్న నిప్పుల్లా ఉంది, ఆ జీవుల మధ్య దివిటీల లాంటివి అటూఇటూ కదులుతూ ఉన్నాయి, ఆ దివిటీల అగ్ని ప్రకాశవంతంగా ఉంది, ఆ అగ్నిలో నుండి మెరుపులు వస్తున్నాయి.+ 14 ఆ జీవులు అటూఇటూ వెళ్తున్నప్పుడు వాటి కదలికలు మెరుపు తీగల్లా ఉన్నాయి.
15 నేను ఆ జీవుల్ని చూస్తుండగా, నాలుగు ముఖాలున్న ఆ జీవుల్లో ప్రతీదాని పక్కన భూమ్మీద ఒక చక్రం కనిపించింది.+ 16 ఆ చక్రాలు, వాటి ఆకారం లేతపచ్చ రాయిలా మెరుస్తున్నట్టు కనిపించింది, చూడడానికి ఆ నాలుగూ ఒకేలా ఉన్నాయి. వాటి ఆకారం, నిర్మాణం ఒక చక్రంలో ఇంకో చక్రం ఉన్నట్టు కనిపించింది.* 17 అవి కదిలేటప్పుడు, పక్కకు తిరగకుండానే నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్లగలవు. 18 ఆ చక్రాలు సంభ్రమాశ్చర్యాలు పుట్టించేంత ఎత్తుగా ఉన్నాయి, ఆ నాలుగు చక్రాల బయటి అంచుల చుట్టూ అంతటా కళ్లు ఉన్నాయి.+ 19 ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితోపాటు ఆ చక్రాలు కూడా కదిలేవి, ఆ జీవులు భూమ్మీద నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా పైకి లేచేవి.+ 20 పవిత్రశక్తి వాటిని ఎక్కడికి నడిపిస్తుందో, అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అవి అక్కడికి వెళ్తాయి. ఆ జీవులు పైకి లేచిన ప్రతీసారి, వాటితోపాటు ఆ చక్రాలు కూడా పైకి లేచేవి, ఎందుకంటే వాటిమీద పనిచేసే పవిత్రశక్తే ఆ చక్రాల్లో కూడా ఉంది. 21 అవి కదిలినప్పుడు ఇవి కూడా కదిలేవి; అవి కదలకుండా ఉన్నప్పుడు ఇవి కూడా కదలకుండా ఉండేవి; అవి భూమ్మీద నుండి పైకి లేచినప్పుడు, వాటితోపాటు ఆ చక్రాలు కూడా పైకి లేచేవి, ఎందుకంటే ఆ జీవుల మీద పనిచేసే పవిత్రశక్తే ఆ చక్రాల్లో కూడా ఉంది.
22 ఆ జీవుల తలల పైన, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే మంచులాంటి తళతళలాడే విశాలం ఒకటి కనిపించింది, అది వాటి తలలకు పైగా వ్యాపించివుంది.+ 23 ఆ విశాలం కింద వాటి రెక్కలు ఒకదానికొకటి నిటారుగా ఉన్నాయి.* ప్రతీ జీవి రెండు రెక్కలతో తన శరీరం ఒక వైపును, రెండు రెక్కలతో మరో వైపును కప్పుకునివుంది. 24 నేను వాటి రెక్కల చప్పుడు విన్నాను, అది జలప్రవాహాల శబ్దంలా, సర్వశక్తిమంతుని స్వరంలా ఉంది.+ అవి కదిలినప్పుడు ఆ శబ్దం సైన్యం శబ్దంలా ఉంది. అవి కదలకుండా ఉన్నప్పుడు, తమ రెక్కల్ని దించుతాయి.
25 వాటి తలల పైన ఉన్న విశాలం మీద ఒక స్వరం వినిపించింది. (అవి కదలకుండా ఉన్నప్పుడు, తమ రెక్కల్ని దించుతాయి.) 26 వాటి తలల పైన ఉన్న విశాలం మీద నీలం రాయి లాంటిది ఒకటి కనిపించింది,+ అది సింహాసనంలా ఉంది.+ ఆ సింహాసనం మీద ఒకాయన కూర్చుని ఉన్నాడు, ఆయన రూపం మనిషి రూపంలా ఉంది.+ 27 ఆయన నడుము నుండి పైవరకు, చుట్టూ అగ్ని ఉన్న మెరిసే లోహంలా* నాకు కనిపించాడు;+ నడుము నుండి కింది వరకు ఆయన అగ్నిలా కనిపించాడు.+ ఆయన చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది, 28 అది వర్షం పడే రోజున మేఘంలో కనిపించే ఇంద్రధనుస్సు కాంతిలా ఉంది.+ ఆయన చుట్టూ ఉన్న ప్రకాశవంతమైన కాంతి అలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది.+ అది చూసినప్పుడు నేను సాష్టాంగపడ్డాను, మాట్లాడుతున్న ఒక వ్యక్తి స్వరం నాకు వినిపించింది.
2 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా,* లేచి నిలబడు, నేను నీతో మాట్లాడాలి.”+ 2 ఆయన నాతో మాట్లాడినప్పుడు, పవిత్రశక్తి* నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది. అప్పుడు నేను ఆయన నాతో మాట్లాడుతున్న మాటలు విన్నాను.
3 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, నా మీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటుదారులైన జనాల+ దగ్గరికి పంపిస్తున్నాను.+ వాళ్లూ, వాళ్ల పూర్వీకులూ ఈ రోజు వరకు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు.+ 4 మొండివాళ్లూ, కఠిన హృదయులూ అయిన ప్రజల+ దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; నువ్వు వాళ్లతో, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పాలి. 5 వాళ్ల విషయానికొస్తే, వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు+ కాబట్టి వాళ్లు విన్నా, వినకపోయినా తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు.+
6 “అయితే మానవ కుమారుడా, నీ చుట్టూ ముళ్లపొదలు, ముళ్లు ఉన్నా,*+ నువ్వు తేళ్ల మధ్య నివసిస్తున్నా వాళ్లకు గానీ వాళ్ల మాటలకు గానీ భయపడకు.+ వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు, అయినా వాళ్ల మాటలకు భయపడకు,+ వాళ్ల ముఖాల్ని చూసి బెదిరిపోకు.+ 7 వాళ్లు విన్నా, వినకపోయినా నువ్వు నా మాటల్ని వాళ్లకు చెప్పాలి, ఎంతైనా వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+
8 “కానీ మానవ కుమారుడా, నేను నీకు చెప్పేది విను. నువ్వు తిరుగుబాటు చేసే ఈ ప్రజల్లా తయారవ్వకు. నీ నోరు తెరిచి, నేను నీకు ఇచ్చేది తిను.”+
9 నేను చూసినప్పుడు, ఒక చెయ్యి నా దగ్గరికి చాపబడింది,+ రాయబడిన ఒక గ్రంథపు చుట్ట+ ఆ చేతిలో ఉంది. 10 ఆయన దాన్ని నా ముందు విప్పాడు, అది రెండు వైపులా రాయబడి ఉంది.+ అందులో శోకగీతాలు, దుఃఖంతో-రోదనతో నిండిన మాటలు రాసివున్నాయి.+
3 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నీ ముందు ఉన్నదాన్ని* తిను. నువ్వు ఈ గ్రంథపు చుట్టను తిని, వెళ్లి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో మాట్లాడు.”+
2 కాబట్టి నేను నోరు తెరిచాను, ఆయన నాతో ఆ గ్రంథపు చుట్టను తినిపించాడు. 3 తర్వాత ఆయన నాతో, “మానవ కుమారుడా, నేను నీకు ఇస్తున్న ఈ గ్రంథపు చుట్టను తిని దానితో నీ కడుపు నింపుకో” అన్నాడు. నేను దాన్ని తిన్నాను, అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.+
4 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు ఇంటివాళ్ల మధ్యకు వెళ్లి నా మాటలు వాళ్లకు చెప్పు. 5 నేను నిన్ను కష్టమైన భాష, తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరికి కాదుగానీ ఇశ్రాయేలు ఇంటివాళ్ల దగ్గరికి పంపిస్తున్నాను. 6 నీకు అర్థంకాని కష్టమైన భాష, తెలియని భాష మాట్లాడే అనేక జనాల దగ్గరికి నిన్ను పంపట్లేదు. ఒకవేళ వాళ్ల దగ్గరికి నేను నిన్ను పంపిస్తే, వాళ్లు నువ్వు చెప్పేది వింటారు.+ 7 అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు నువ్వు చెప్పేది వినరు, ఎందుకంటే నేను చెప్పేది వినడం వాళ్లకు ఇష్టం లేదు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ మొండివాళ్లు, కఠిన హృదయులు.+ 8 ఇదిగో! నేను నీ ముఖాన్ని వాళ్ల ముఖమంత కఠినంగా చేశాను, నీ నుదురును వాళ్ల నుదురంత కఠినంగా చేశాను.+ 9 నేను నీ నుదురును చెకుముకి రాయి కంటే గట్టిగా, వజ్రంలా చేశాను.+ వాళ్లకు భయపడకు, వాళ్ల ముఖాలు చూసి బెదిరిపోకు,+ ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.”
10 ఆయన నాతో ఇంకా ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నీకు చెప్పే మాటలన్నిటినీ మనసుపెట్టి విను. 11 చెరలో ఉన్న నీ ప్రజల మధ్యకు వెళ్లి వాళ్లతో మాట్లాడు.+ వాళ్లు విన్నా, వినకపోయినా,+ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పు.”
12 అప్పుడు ఒక శక్తి* నన్ను తీసుకెళ్లింది;+ నా వెనక ఒక గొప్ప స్వరం వినిపించింది, అది “యెహోవా మహిమకు ఆయన స్థలంలో స్తుతి కలగాలి” అని అంది. 13 ఆ జీవుల రెక్కలు ఒకదానికొకటి తాకుతున్న శబ్దం,+ వాటి పక్కనున్న చక్రాల శబ్దం,+ ఒక గొప్ప స్వరం నాకు వినిపించాయి. 14 ఆ శక్తి* నన్ను పట్టుకుని తీసుకెళ్తుండగా నేను దుఃఖంతో, కోపంతో వెళ్లాను; యెహోవా చెయ్యి నా మీద బలంగా ఉండిపోయింది. 15 కాబట్టి నేను కెబారు నది పక్కన+ తేలాబీబులో నివసిస్తున్న బందీలైన ప్రజల దగ్గరికి వెళ్లి, వాళ్లు నివసిస్తున్న చోటే ఉండిపోయాను; నేను నిర్ఘాంతపోయిన స్థితిలో+ ఏడురోజులు వాళ్ల మధ్య ఉన్నాను.
16 ఏడురోజుల తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
17 “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటివాళ్లకు కావలివాడిగా నియమించాను;+ నువ్వు నా నోటి నుండి ఏదైనా మాట విన్నప్పుడు, నా హెచ్చరికను వాళ్లకు చెప్పాలి.+ 18 ‘నువ్వు ఖచ్చితంగా చనిపోతావు’ అని నేను దుష్టుడితో అన్నప్పుడు, నువ్వు అతన్ని హెచ్చరించకపోతే, అతను తన తప్పుడు మార్గం నుండి పక్కకుమళ్లి బ్రతికుండేలా+ అతనికి హెచ్చరిక చేయకపోతే, అతను దుష్టుడు కాబట్టి తన దోషాన్ని బట్టి చనిపోతాడు,+ కానీ అతని రక్తానికి నేను నిన్ను బాధ్యునిగా ఎంచుతాను.*+ 19 అయితే నువ్వు దుష్టుణ్ణి హెచ్చరించినా, అతను తన దుష్టత్వం నుండి, చెడ్డ మార్గం నుండి పక్కకు మళ్లకపోతే, అతను తన దోషాన్ని బట్టి చనిపోతాడు; నువ్వు మాత్రం తప్పకుండా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.+ 20 అయితే నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి తప్పు* చేస్తే, నేను అతని మార్గంలో అడ్డంకుల్ని పెడతాను, అతను చనిపోతాడు.+ నువ్వు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతను తన పాపాన్ని బట్టి చనిపోతాడు, అతని నీతికార్యాల్ని నేను గుర్తు చేసుకోను; అయితే అతని రక్తానికి నేను నిన్ను బాధ్యునిగా ఎంచుతాను.*+ 21 ఒకవేళ, పాపం చేయొద్దని నువ్వు నీతిమంతుణ్ణి హెచ్చరించినప్పుడు అతను పాపం చేయకుండా ఉంటే, అతను హెచ్చరిక స్వీకరించాడు కాబట్టి ఖచ్చితంగా బ్రతికుంటాడు;+ నువ్వు కూడా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”
22 అక్కడ యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది. ఆయన నాతో, “లేచి, లోయ మైదానానికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అన్నాడు. 23 కాబట్టి నేను లేచి లోయ మైదానానికి వెళ్లాను. ఇదిగో! యెహోవా మహిమ అక్కడ ఉంది,+ అది కెబారు నది పక్కన నేను చూసిన మహిమలా ఉంది.+ దాన్ని చూసి నేను సాష్టాంగపడ్డాను. 24 అప్పుడు పవిత్రశక్తి నాలోకి ప్రవేశించి నన్ను నిలబెట్టింది;+ ఆయన నాతో ఇలా అన్నాడు:
“నువ్వు నీ ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసుకో. 25 మానవ కుమారుడా, నువ్వు వాళ్ల మధ్యకు వెళ్లకుండా వాళ్లు నిన్ను తాళ్లతో కట్టేస్తారు. 26 నేను నీ నాలుకను నీ అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను; నువ్వు మూగవాడివి అవుతావు, వాళ్లను సరిదిద్దలేవు, ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు. 27 అయితే నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను, అప్పుడు నువ్వు వాళ్లతో, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పాలి.+ వినేవాళ్లను విననీ,+ విననివాళ్లను వినకపోనీ, ఎంతైనా వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+
4 “మానవ కుమారుడా, నువ్వు ఒక ఇటుక తీసుకుని నీ ముందు పెట్టుకో. దానిమీద యెరూషలేము నగరాన్ని చెక్కు. 2 దానికి ముట్టడి వేయి.+ దానికి ఎదురుగా ముట్టడిగోడ కట్టు,+ ముట్టడిదిబ్బ నిలబెట్టు,+ దాని ముందు శిబిరాలు వేయి, దాని చుట్టూ యుద్ధ యంత్రాలు ఉంచు.+ 3 ఒక ఇనుప రేకు* తీసుకుని, దాన్ని నీకూ నగరానికీ మధ్య ఇనుప గోడలా నిలబెట్టు. దానివైపు నీ ముఖం తిప్పి ఉంచు, అది ముట్టడి కింద ఉన్నట్టు అవుతుంది; నువ్వు దాన్ని ముట్టడించాలి. ఇది ఇశ్రాయేలు ఇంటివాళ్లకు సూచనగా ఉంటుంది.+
4 “తర్వాత, నువ్వు నీ ఎడమపక్కకు తిరిగి పడుకుని ఇశ్రాయేలు ఇంటివాళ్ల దోషాన్ని నీ మీద* వేసుకోవాలి.+ నువ్వు ఎన్ని రోజులు ఆ పక్కకు తిరిగి పడుకుంటావో అన్ని రోజులు వాళ్ల దోషాన్ని భరిస్తావు. 5 వాళ్లు దోషం చేస్తూ వచ్చిన సంవత్సరాల ప్రకారం+ నేను నీకు 390 రోజులు నియమిస్తాను, నువ్వు ఇశ్రాయేలు ఇంటివాళ్ల దోషాన్ని భరిస్తావు. 6 నువ్వు ఆ రోజుల్ని పూర్తిచేయాలి.
“ఆ తర్వాత నువ్వు నీ కుడిపక్కకు తిరిగి పడుకుని, సంవత్సరానికి ఒక రోజు చొప్పున 40 రోజులు యూదా ఇంటివాళ్ల దోషాన్ని+ భరిస్తావు. సంవత్సరానికి ఒక రోజు చొప్పున నేను నీకు నియమించాను. 7 నువ్వు నీ చెయ్యి మీద ఉన్న చొక్కాను పైకి మడిచి, యెరూషలేము ముట్టిడివైపు+ నీ ముఖం తిప్పుకుని దానికి వ్యతిరేకంగా ప్రవచించాలి.
8 “ఇదిగో! నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నువ్వు ఒక పక్క నుండి మరో పక్కకు తిరగకుండా నేను నిన్ను తాళ్లతో కట్టేస్తాను.
9 “నువ్వు గోధుమలు, బార్లీ, పెద్ద చిక్కుళ్లు, చిక్కుడు గింజలు, సజ్జలు, పొడుగు గోధుమలు* తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసుకుని, వాటితో నీ కోసం రొట్టెలు చేసుకోవాలి. నువ్వు పక్కకు తిరిగి పడుకునే 390 రోజులూ వాటిని తింటావు.+ 10 నువ్వు కొలత ప్రకారం రోజుకు 20 షెకెల్‌ల* ఆహారం తింటావు. నువ్వు దాన్ని నిర్ణీత సమయాల్లో తింటావు.
11 “అలాగే నువ్వు కొలత ప్రకారం ఒక హిన్‌లో ఆరో వంతు* నీళ్లు తాగుతావు. నువ్వు ఆ నీళ్లను నిర్ణీత సమయాల్లో తాగుతావు.
12 “నువ్వు దాన్ని గుండ్రటి బార్లీ రొట్టెను తిన్నట్టు తినాలి; నువ్వు మనుషుల మలాన్ని వంటచెరకుగా ఉపయోగించి వాళ్లు చూస్తుండగా ఆ రొట్టెను కాల్చాలి.” 13 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “నేను వాళ్లను చెదరగొట్టే దేశాల మధ్య ఇశ్రాయేలీయులు ఇలా అపవిత్రంగా తమ రొట్టెలు తింటారు.”+
14 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా, అలా కాదు! నేను చిన్నప్పటి నుండి చనిపోయిన జంతువు మాంసాన్ని గానీ, చీల్చబడిన జంతువు మాంసాన్ని గానీ తినడం వల్ల అపవిత్రుణ్ణి కాలేదు,+ అపవిత్రమైన మాంసమే ఎప్పుడూ నా నోట్లోకి వెళ్లలేదు.”+
15 అప్పుడు ఆయన నాతో, “సరే, మనుషుల మలానికి బదులుగా పశువుల పేడను ఉపయోగించుకో, దానిమీద నీ రొట్టెలు కాల్చుకో” అని అన్నాడు. 16 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇదిగో నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపేస్తున్నాను,*+ వాళ్లు ఎంతో ఆందోళనతో తమ ఆహారాన్ని కొలత ప్రకారం తింటారు,+ తమ నీళ్లను భయంభయంగా కొలుచుకొని తాగుతారు.+ 17 రొట్టెలకు, నీళ్లకు కొరత ఏర్పడడం వల్ల వాళ్లు నిర్ఘాంతపోయి ఒకరినొకరు చూసుకుంటారు, తమ దోషంవల్ల కృశించిపోతారు.
5 “మానవ కుమారుడా, నువ్వు మంగలికత్తిలా వాడడానికి ఒక పదునైన కత్తి తీసుకో. దానితో నీ తలను, గడ్డాన్ని క్షౌరం చేసుకో; తర్వాత ఒక త్రాసు తీసుకుని ఆ వెంట్రుకల్ని తూచి వాటిని మూడు భాగాలు చేయి. 2 ముట్టడి రోజులు పూర్తయినప్పుడు+ నువ్వు ఒక భాగాన్ని తీసుకుని నగరం* లోపల అగ్నితో కాల్చేయి. తర్వాత రెండో భాగాన్ని తీసుకొని నగరం చుట్టూ కత్తితో వాటిని నరుకు,+ ఆ తర్వాత మూడో భాగాన్ని గాల్లోకి విసిరేయి, నేను ఖడ్గం తీసి వాటిని తరుముతాను.+
3 “నువ్వు వాటిలో కొన్ని వెంట్రుకల్ని తీసుకొని నీ వస్త్రం మడతల్లో* కట్టుకో. 4 ఇంకొన్ని వెంట్రుకలు తీసుకుని వాటిని అగ్నిలో వేసి కాల్చేయి. దానినుండి అగ్ని బయల్దేరి ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ వ్యాపిస్తుంది.+
5 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇది యెరూషలేము. నేను దాన్ని జనాల మధ్య ఉంచాను, దాని చుట్టూ దేశాలు ఉన్నాయి. 6 కానీ అది నా న్యాయనిర్ణయాలకు, శాసనాలకు ఎదురుతిరిగి తన చుట్టూ ఉన్న జనాల కన్నా, దేశాల కన్నా చెడ్డగా ప్రవర్తించింది.+ ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు, నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు.’
7 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘మీరు నా శాసనాల ప్రకారం నడుచుకోకుండా, నా న్యాయనిర్ణయాల్ని పాటించకుండా మీ చుట్టూ ఉన్న జనాల న్యాయనిర్ణయాల్ని అనుసరించి వాటి కన్నా ఘోరంగా తయారయ్యారు+ కాబట్టి, 8 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నగరమా, నేను నీకు విరోధిని అయ్యాను,+ జనాలు చూస్తుండగా నేను నీకు తీర్పు తీరుస్తాను.+ 9 నువ్వు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెప్పుడూ చేయనిది నీకు చేస్తాను, అలాంటిది ఇంకెప్పుడూ చేయను కూడా.+
10 “ ‘ “కాబట్టి నీలో ఉన్న తండ్రులు తమ కుమారుల్ని తింటారు,+ కుమారులు తమ తండ్రుల్ని తింటారు; నేను నీకు తీర్పుతీర్చి నీలో మిగిలిన వాళ్లందర్నీ అన్నివైపులకు* చెదరగొడతాను.” ’+
11 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు నీ హేయమైన విగ్రహాలన్నిటితో, నీ అసహ్యమైన పనులన్నిటితో నా పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చావు+ కాబట్టి, నా జీవం తోడు, నేను కూడా నిన్ను తిరస్కరిస్తాను;* నా కన్ను జాలిపడదు, నేను కనికరం చూపించను.+ 12 నీలో మూడోవంతు మంది నీ మధ్య తెగులు వల్ల చనిపోతారు లేదా కరువువల్ల నశించిపోతారు. ఇంకో మూడోవంతు మంది నీ చుట్టూ ఖడ్గం వల్ల చనిపోతారు.+ చివరి మూడోవంతు మందిని నేను అన్నివైపులకు* చెదరగొడతాను, ఖడ్గం తీసి వాళ్లను తరుముతాను.+ 13 అప్పుడు నా కోపం చల్లారుతుంది, వాళ్లమీద నా ఆగ్రహం తగ్గిపోతుంది, నాకు ఉపశమనం కలుగుతుంది.+ నేను వాళ్ల మీద నా ఆగ్రహం పూర్తిగా వెళ్లగక్కిన తర్వాత, సంపూర్ణ భక్తిని కోరుకునే యెహోవానైన+ నేను వాళ్లతో మాట్లాడానని వాళ్లు తెలుసుకుంటారు.
14 “ ‘నేను నిన్ను పాడుబడ్డ స్థలంగా మారుస్తాను, చుట్టుపక్కల దేశాల మధ్య, దారిలో వెళ్లే వాళ్లందరి కళ్లకు నిందగా చేస్తాను.+ 15 నేను కోపంతో, ఆగ్రహంతో, కఠినమైన శిక్షలతో నీకు తీర్పు తీర్చినప్పుడు నువ్వు చుట్టుపక్కల దేశాలకు నిందగా, ఎగతాళిగా, హెచ్చరికగా, భయంకరంగా తయారౌతావు.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.
16 “ ‘నేను మిమ్మల్ని నాశనం చేయడానికి కరువు అనే ప్రాణాంతకమైన బాణాల్ని మీ మీదికి పంపిస్తాను. నేను పంపించే బాణాలు మిమ్మల్ని నాశనం చేస్తాయి.+ నేను మీ ఆహార సరఫరాను నిలిపేసి* మీ కరువును తీవ్రతరం చేస్తాను.+ 17 నేను మీ మీదికి కరువును, క్రూరమృగాల్ని పంపిస్తాను,+ అవి మీ పిల్లల్ని చంపేస్తాయి. తెగులు, రక్తపాతం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తాను.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.’ ”
6 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల వైపు నీ ముఖం తిప్పి వాటికి వ్యతిరేకంగా ప్రవచించు. 3 నువ్వు ఇలా అనాలి, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేది వినండి: పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఇదిగో! నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ ఉన్నత స్థలాల్ని నాశనం చేస్తాను. 4 మీ బలిపీఠాలు పడగొట్టబడతాయి, మీ ధూపస్తంభాలు విరగ్గొట్టబడతాయి,+ మీలో చంపబడినవాళ్లను నేను మీ అసహ్యమైన విగ్రహాల* ముందు పడేస్తాను.+ 5 నేను ఇశ్రాయేలు ప్రజల శవాల్ని వాళ్ల అసహ్యమైన విగ్రహాల ముందు పడేస్తాను, మీ ఎముకల్ని మీ బలిపీఠాల చుట్టూ విసిరేస్తాను.+ 6 మీరు నివసించే ప్రాంతాలన్నిట్లో నగరాలు పాడైపోతాయి,+ ఉన్నత స్థలాలు పడగొట్టబడి పాడుబడిన స్థితిలో ఉంటాయి.+ మీ బలిపీఠాలు పడగొట్టబడి ముక్కలుముక్కలు చేయబడతాయి, మీ అసహ్యమైన విగ్రహాలు నశించిపోతాయి, మీ ధూపస్తంభాలు విరగ్గొట్టబడతాయి, మీ చేతుల పనులు తుడిచిపెట్టుకుపోతాయి. 7 చంపబడినవాళ్లు మీ మధ్య పడివుంటారు,+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+
8 “ ‘ “అయితే నేను మీలో కొంతమంది మిగిలేలా చేస్తాను, మీరు ఆయా దేశాల్లోకి చెదిరిపోయినప్పుడు ఆ జనాల మధ్య మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.+ 9 అలా తప్పించుకున్నవాళ్లు తాము బందీలుగా వెళ్లిన జనాల మధ్య నన్ను గుర్తుచేసుకుంటారు.+ నన్ను విడిచిపెట్టిన తమ వ్యభిచార హృదయాన్ని బట్టి, తమ అసహ్యమైన విగ్రహాల్ని ఎంతో కోరుకున్న తమ కళ్లను బట్టి+ నా హృదయం ముక్కలైందని+ వాళ్లు గ్రహిస్తారు. తాము చేసిన అసహ్యమైన చెడ్డ పనులన్నిటిని బట్టి వాళ్లు సిగ్గుపడతారు, వాటిని అసహ్యించుకుంటారు.+ 10 నేను యెహోవానని, వాళ్ల మీదికి ఈ విపత్తు తీసుకొస్తానని నేను చెప్పిన మాట వట్టి మాట కాదని వాళ్లు తెలుసుకుంటారు.” ’+
11 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లు చేసిన అసహ్యమైన చెడ్డ పనులన్నిటిని బట్టి నీ చేతులు చరుచుకొని, నీ పాదంతో నేలను తన్ని, ఏడువు; ఎందుకంటే వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు.+ 12 దూరంగా ఉన్నవాళ్లు తెగులు వల్ల చనిపోతారు, దగ్గర్లో ఉన్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు; వీటిని తప్పించుకుని మిగిలినవాళ్లు కరువు వల్ల చనిపోతారు. వాళ్ల మీద నాకున్న ఆగ్రహాన్ని నేను పూర్తిగా వెళ్లగక్కుతాను.+ 13 వాళ్లలో చంపబడినవాళ్లు తమ అసహ్యమైన విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూ, ప్రతీ ఎత్తైన కొండ మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, పచ్చని ప్రతీ చెట్టు కింద, పెద్దపెద్ద చెట్ల కొమ్మల కింద పడినప్పుడు, అంటే తమ అసహ్యమైన విగ్రహాలన్నిటినీ సంతోషపెట్టడానికి వాళ్లు పరిమళ అర్పణలు+ అర్పించిన ప్రతీచోట వాళ్ల శవాలు పడినప్పుడు+ నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.+ 14 నేను వాళ్లకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, ఆ దేశాన్ని నిర్జనంగా చేస్తాను; వాళ్ల నివాస స్థలాలన్నీ దిబ్లా దగ్గరున్న ఎడారి* కన్నా నిర్మానుష్యంగా తయారౌతాయి. అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”
7 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశం గురించి ఇలా అంటున్నాడు: ‘అంతం వచ్చింది! దేశం నలుమూలల మీదికి అంతం వచ్చేసింది. 3 అంతం ఇప్పుడు నీ మీదికి వచ్చేసింది, నేను నీ మీద నా ఆగ్రహాన్ని పూర్తిగా వెళ్లగక్కుతాను, నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను. 4 నా కన్ను నీ మీద జాలిపడదు, నేను కనికరపడను.+ నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను, నీ అసహ్యమైన పనుల పర్యవసానాల్ని నువ్వు అనుభవిస్తావు.+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’+
5 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇదిగో! ఒక విపత్తు, ఒక అసాధారణ విపత్తు వస్తోంది.+ 6 ఒక అంతం రాబోతుంది; అది వస్తుంది; అది హఠాత్తుగా నీ మీదికి వస్తుంది. ఇదిగో! అది వస్తోంది. 7 దేశ నివాసీ, నీ వంతు* వచ్చేసింది. ఆ సమయం వస్తోంది, ఆ రోజు దగ్గరపడింది.+ పర్వతాల మీద సంతోష కేకలకు బదులు అల్లకల్లోలం వినిపిస్తోంది.
8 “ ‘అతి త్వరలో నేను నీ మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను,+ నీ మీద నా ఆగ్రహాన్ని పూర్తిగా వెళ్లగక్కుతాను,+ నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను. 9 నా కన్ను జాలిపడదు, నేను కనికరపడను.+ నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను, నీ అసహ్యమైన పనుల పర్యవసానాల్ని నువ్వు అనుభవిస్తావు. అప్పుడు యెహోవానైన నేను నిన్ను శిక్షిస్తున్నానని నువ్వు తెలుసుకుంటావు.+
10 “ ‘ఇదిగో, ఆ రోజు! ఇదిగో, అది వస్తోంది!+ నీ వంతు* వచ్చేసింది; దండం మొగ్గ తొడిగింది, అహంకారం మొలకెత్తింది. 11 దౌర్జన్యం దుష్ట దండంగా మారింది.+ వాళ్లు గానీ, వాళ్ల సంపద గానీ, వాళ్ల సమూహాలు గానీ, వాళ్ల ఘనత గానీ మిగలవు. 12 ఆ సమయం వస్తుంది, ఆ రోజు వస్తుంది. కొనేవాడు సంతోషించకూడదు, అమ్మేవాడు ఏడ్వకూడదు, ఎందుకంటే వాళ్ల సమూహమంతటి మీద నా ఆగ్రహం రగులుకుంది.*+ 13 అమ్మినవాడు ప్రాణాలతో తప్పించుకున్నా తాను అమ్మినదాని దగ్గరికి తిరిగిరాడు, ఎందుకంటే ఈ దర్శనంలోని విషయాలు సమూహమంతటి మీదికి వస్తాయి. ఎవ్వరూ తిరిగిరారు, తన దోషం కారణంగా* ఎవ్వరూ ప్రాణాలు కాపాడుకోలేరు.
14 “ ‘వాళ్లు బాకా ఊదారు,+ ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవ్వరూ యుద్ధానికి వెళ్లడం లేదు; ఎందుకంటే నా ఆగ్రహం సమూహమంతటి మీద రగులుకుంది.+ 15 బయట ఖడ్గం ఉంది,+ లోపలేమో తెగులు, కరువు ఉన్నాయి. పొలంలో ఉన్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, నగరంలో ఉన్నవాళ్లను కరువు, తెగులు మింగేస్తాయి.+ 16 ఏదోరకంగా తప్పించుకున్నవాళ్లు పర్వతాలకు వెళ్తారు, లోయల్లో నివసించే పావురాల్లా ప్రతీ వ్యక్తి తన దోషాన్ని బట్టి మూల్గుతాడు.+ 17 వాళ్లందరి చేతులు చచ్చుబడిపోతాయి, వాళ్లందరి మోకాళ్ల మీదుగా నీళ్లు కారతాయి.*+ 18 వాళ్లు గోనెపట్ట కట్టుకున్నారు,+ వాళ్లకు భయం పట్టుకుంది. ప్రతీ ఒక్కరు అవమానాలపాలు అవుతారు, ప్రతీ తల బోడి అవుతుంది.*+
19 “ ‘వాళ్లు తమ వెండిని వీధుల్లో పడేస్తారు, తమ బంగారాన్ని అసహ్యించుకుంటారు. యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, బంగారం గానీ వాళ్లను రక్షించలేదు.+ వాళ్లకు తృప్తి ఉండదు, వాళ్ల కడుపు నిండదు, ఎందుకంటే అది* వాళ్లకు అడ్డుగా తయారై వాళ్ల దోషానికి కారణమైంది. 20 వాళ్లు తమ ఆభరణాల అందాన్ని చూసుకొని గర్వపడ్డారు, వాటితో* తమ అసహ్యమైన ప్రతిమల్ని, హేయమైన విగ్రహాల్ని చేసుకున్నారు.+ అందుకే వాళ్లు దాన్ని అసహ్యించుకునేలా చేస్తాను. 21 నేను దాన్ని* విదేశీయులకు దోపుడుసొమ్ముగా, భూమ్మీది దుష్టులకు కొల్లసొమ్ముగా ఇస్తాను, వాళ్లు దాన్ని అపవిత్రపరుస్తారు.
22 “ ‘నేను వాళ్ల నుండి నా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాను,+ వాళ్లు నా చాటైన చోటును* అపవిత్రపరుస్తారు, దోపిడీదారులు దానిలోకి ప్రవేశించి దాన్ని అపవిత్రపరుస్తారు.+
23 “ ‘సంకెళ్లు*+ తయారుచేయండి; ఎందుకంటే దేశం రక్తసిక్తమైన తీర్పులతో,+ నగరం దౌర్జన్యంతో నిండిపోయాయి.+ 24 జనాలన్నిట్లో అత్యంత ఘోరమైనవాళ్లను నేను రప్పిస్తాను,+ వాళ్లు దేశ నివాసుల ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు,+ నేను బలాఢ్యుల గర్వాన్ని పూర్తిగా అణచివేస్తాను, వాళ్ల పవిత్రమైన స్థలాలు అపవిత్రపర్చబడతాయి.+ 25 వేదన వచ్చినప్పుడు వాళ్లు శాంతి కోసం వెదుకుతారు, కానీ అది దొరకదు.+ 26 ఒక విపత్తు తర్వాత మరో విపత్తు, ఒక నివేదిక తర్వాత మరో నివేదిక వస్తుంటాయి, ప్రజలు ప్రవక్త దగ్గర దర్శనం కోసం చూస్తారు,+ అయితే యాజకుల దగ్గర ఉపదేశం,* పెద్దల దగ్గర సలహా* లేకుండా పోతాయి.+ 27 రాజు ఏడుస్తుంటాడు,+ ప్రధానుడు నిరాశలో మునిగిపోతాడు, దేశ ప్రజల చేతులు భయంతో వణికిపోతాయి. నేను వాళ్ల మార్గాల ప్రకారం వాళ్లతో వ్యవహరిస్తాను, వాళ్లు తీర్పు తీర్చినట్టే వాళ్లకు తీర్పు తీరుస్తాను. అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”+
8 ఆరో సంవత్సరం, ఆరో నెల, ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చొని ఉన్నాను, యూదా పెద్దలు నా ముందు కూర్చొని ఉన్నారు, అప్పుడు సర్వోన్నత ప్రభువైన యెహోవా చెయ్యి అక్కడ నన్ను పట్టుకుంది. 2 నేను చూస్తుండగా, అగ్ని లాంటి ఆకారం నాకు కనిపించింది; ఆయన నడుము నుండి కింది వరకు అగ్నిలా కనిపించింది,+ నడుము నుండి పైవరకు మెరుస్తున్న లోహంలా* ప్రకాశవంతంగా కనిపించింది.+ 3 తర్వాత ఆయన, చెయ్యిలా కనిపించినదాన్ని చాపి, నా జుట్టు పట్టుకున్నాడు, అప్పుడు ఒక శక్తి* నన్ను భూమ్యాకాశాల మధ్యకు ఎత్తి దేవుని దర్శనాల ద్వారా యెరూషలేముకు తీసుకొచ్చింది; ఆలయానికి ఉత్తరం వైపున్న లోపలి ద్వార ప్రవేశం దగ్గరికి,+ రోషం పుట్టించే రోష విగ్రహం ఉన్న చోటికి+ తీసుకొచ్చింది. 4 ఇదిగో! ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది,+ అది నేను లోయ మైదానంలో చూసిన మహిమలా ఉంది.+
5 అప్పుడు ఆయన నాతో, “మానవ కుమారుడా, దయచేసి తల ఎత్తి ఉత్తరం వైపు చూడు” అని అన్నాడు. నేను తల ఎత్తి ఉత్తరం వైపు చూశాను; ఇదిగో అక్కడ, అంటే బలిపీఠం ద్వారానికి ఉత్తరం వైపున ప్రవేశ మార్గంలో ఆ రోష విగ్రహం ఉంది. 6 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నా పవిత్రమైన స్థలం నుండి దూరంగా వెళ్లేలా+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఇక్కడ ఎలాంటి ఘోరమైన, అసహ్యమైన పనులు చేస్తున్నారో+ చూస్తున్నావు కదా? అయితే ఇంతకన్నా ఘోరమైన, అసహ్యమైన వాటిని నువ్వు చూస్తావు.”
7 తర్వాత ఆయన నన్ను ప్రాంగణం ప్రవేశం దగ్గరికి తీసుకొచ్చాడు, నేను చూసినప్పుడు గోడలో ఒక రంధ్రం కనిపించింది. 8 ఆయన, “మానవ కుమారుడా, దయచేసి ఆ రంధ్రాన్ని పెద్దది చేయి” అని నాతో అన్నాడు. నేను ఆ రంధ్రాన్ని పెద్దది చేశాను, అప్పుడు నాకు ఒక ప్రవేశ మార్గం కనిపించింది. 9 ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు లోపలికి వెళ్లి, వాళ్లు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన చెడ్డపనుల్ని చూడు.” 10 కాబట్టి నేను లోపలికి వెళ్లి చూశాను, అప్పుడు నాకు పాకే జీవుల, హేయమైన జంతువుల+ అన్నిరకాల రూపాలు, ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాలన్నీ*+ కనిపించాయి; అవి చుట్టూ గోడ మీద చెక్కి ఉన్నాయి. 11 ఇశ్రాయేలు ఇంటివాళ్ల 70 మంది పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు, వాళ్లలో షాఫాను+ కుమారుడైన యజన్యా కూడా ఉన్నాడు. ప్రతీ ఒక్కరి చేతిలో ఒక ధూపపాత్ర ఉంది, పరిమళ ధూపం పొగ పైకి లేస్తూ ఉంది.+ 12 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల పెద్దల్లో ప్రతీ ఒక్కరు చీకట్లో, తమ విగ్రహాలు ఉన్న లోపలి గదుల్లో ఏంచేస్తున్నారో చూస్తున్నావా? వాళ్లు, ‘యెహోవా మమ్మల్ని చూడట్లేదు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టేశాడు’ అని చెప్పుకుంటున్నారు.”+
13 ఆయన నాతో ఇంకా ఇలా అన్నాడు: “వాళ్లు చేస్తున్న ఇంతకన్నా ఘోరమైన, అసహ్యమైన పనుల్ని నువ్వు చూస్తావు.” 14 ఆయన నన్ను యెహోవా మందిర ఉత్తర ద్వార ప్రవేశం దగ్గరికి తీసుకొచ్చాడు, అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని తమ్మూజు దేవుడి గురించి ఏడ్వడం నేను చూశాను.
15 ఆయన నాతో ఇంకా ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు దీన్ని చూస్తున్నావు కదా? ఇంతకన్నా ఘోరమైన, అసహ్యమైన వాటిని నువ్వు చూస్తావు.”+ 16 అప్పుడు ఆయన నన్ను యెహోవా మందిర లోపలి ప్రాంగణానికి+ తీసుకొచ్చాడు. అక్కడ యెహోవా ఆలయ ప్రవేశం దగ్గర, వసారాకీ బలిపీఠానికీ మధ్య సుమారు 25 మంది పురుషులు ఉన్నారు; వాళ్ల వీపులు యెహోవా ఆలయం వైపుకు, వాళ్ల ముఖాలు తూర్పు వైపుకు తిరిగివున్నాయి; వాళ్లు తూర్పున ఉన్న సూర్యునికి వంగి నమస్కారం చేస్తున్నారు.+
17 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు ఇది చూస్తున్నావు కదా? యూదా ఇంటివాళ్లు ఈ అసహ్యమైన పనులు చేయడం, దేశాన్ని దౌర్జన్యంతో నింపేయడం,+ నాకు కోపం తెప్పిస్తూ ఉండడం అంత చిన్న విషయమా? ఇదిగో, వాళ్లు నా ముక్కు దగ్గరికి కొమ్మను* తెస్తున్నారు. 18 కాబట్టి నేను తీవ్రమైన కోపంతో చర్య తీసుకుంటాను. నా కన్ను జాలిపడదు, నేను కనికరపడను.+ వాళ్లు నా చెవుల్లో ఎంత గట్టిగా మొరపెట్టినా నేను వినను.”+
9 తర్వాత ఆయన బిగ్గరగా ఇలా అన్నాడు: “నగరాన్ని శిక్షించేవాళ్లను పిలిపించండి, వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ చేతిలో నాశనం చేసే ఆయుధం తీసుకొని రావాలి!”
2 అప్పుడు ఆరుగురు మనుషులు ఉత్తర దిక్కున ఉన్న పైద్వారం+ వైపు నుండి రావడం నేను చూశాను, ప్రతీ ఒక్కరి చేతిలో నలగ్గొట్టే ఆయుధం ఉంది; వాళ్ల మధ్య నారవస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని నడుముకు కార్యదర్శి* సిరాబుడ్డి* ఉంది; వాళ్లు లోపలికి వచ్చి, రాగి బలిపీఠం+ దగ్గర నిలబడ్డారు.
3 అప్పుడు ఇశ్రాయేలు దేవుని మహిమ+ కెరూబుల పైనుండి లేచి, మందిర గడప దగ్గరికి వచ్చింది;+ ఆయన, నారవస్త్రాలు ధరించి నడుముకు కార్యదర్శి సిరాబుడ్డి కట్టుకున్న వ్యక్తిని పిలిచాడు. 4 యెహోవా ఆ వ్యక్తికి ఇలా చెప్పాడు: “నువ్వు యెరూషలేము నగరమంతటా తిరిగి, నగరంలో జరుగుతున్న అసహ్యమైన పనులన్నిటిని బట్టి+ ఎవరైతే నిట్టూరుస్తూ, మూల్గుతూ ఉన్నారో+ వాళ్ల నొసళ్ల మీద గుర్తు వేయి.”
5 మిగతావాళ్లకు ఆయన ఇలా చెప్పాడు: “మీరు అతని వెంట నగరంలోకి వెళ్లి ప్రజల్ని హతం చేయండి. మీ కన్ను జాలిపడకూడదు, మీరు కనికరపడకూడదు.+ 6 వృద్ధుల్ని, యౌవనుల్ని, కన్యల్ని, చిన్నపిల్లల్ని, స్త్రీలను అందర్నీ చంపేయండి.+ అయితే ఆ గుర్తు ఉన్న వాళ్ల జోలికి వెళ్లకండి.+ మీరు నా పవిత్రమైన స్థలం నుండి మొదలుపెట్టాలి.”+ దాంతో వాళ్లు మందిరం ఎదుట ఉన్న పెద్దలతో+ మొదలుపెట్టారు. 7 అప్పుడు ఆయన వాళ్లతో, “మందిరాన్ని అపవిత్రపర్చండి, ప్రాంగణాల్ని చనిపోయినవాళ్లతో నింపండి.+ వెళ్లండి!” అన్నాడు. కాబట్టి వాళ్లు వెళ్లి నగరంలోని ప్రజల్ని చంపేశారు.
8 వాళ్లు ప్రజల్ని చంపుతున్నప్పుడు, నేనొక్కడినే మిగిలిపోయాను, అప్పుడు నేను సాష్టాంగపడి, “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! నువ్వు యెరూషలేము మీద నీ కోపాన్ని కుమ్మరిస్తూ, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్లందర్నీ నాశనం చేస్తావా?”+ అని అరిచాను.
9 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా ఇంటివాళ్ల దోషం చాలాచాలా ఎక్కువగా ఉంది.+ దేశం రక్తపాతంతో నిండిపోయింది,+ నగరం అవినీతితో నిండిపోయింది. వాళ్లు, ‘యెహోవా దేశాన్ని విడిచిపెట్టేశాడు, యెహోవా చూడట్లేదు’ అని చెప్పుకుంటున్నారు.+ 10 అయితే నా కన్ను జాలిపడదు, నేను కనికరం చూపించను.+ వాళ్ల మార్గాల పర్యవసానాల్ని నేను వాళ్ల తలల మీదికి తీసుకొస్తాను.”
11 అప్పుడు, నారవస్త్రాలు ధరించి నడుముకు సిరాబుడ్డి కట్టుకున్న వ్యక్తి తిరిగొచ్చి, “నువ్వు నాకు ఆజ్ఞాపించినట్టే చేశాను” అని చెప్పాడు.
10 నేను చూస్తుండగా, కెరూబుల తలల పైనున్న విశాలం మీద నీలం రాయి లాంటిది ఒకటి కనిపించింది, అది సింహాసనంలా ఉంది.+ 2 అప్పుడు ఆయన నారవస్త్రాలు ధరించిన వ్యక్తితో,+ “కెరూబుల కిందున్న తిరిగే చక్రాల+ మధ్యకు ప్రవేశించి, కెరూబుల మధ్య ఉన్న నిప్పుల్ని రెండు చేతుల నిండా తీసుకొని+ నగరం మీద చల్లు”+ అన్నాడు. కాబట్టి నేను చూస్తుండగా ఆ వ్యక్తి ప్రవేశించాడు.
3 ఆ వ్యక్తి ప్రవేశించినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడ్డారు, అప్పుడు లోపలి ప్రాంగణమంతా మేఘం కమ్ముకుంది. 4 యెహోవా మహిమ+ కెరూబుల నుండి లేచి మందిరం గడప దగ్గరికి వచ్చింది, దాంతో మెల్లమెల్లగా మందిరమంతా మేఘం కమ్ముకుంది,+ ప్రాంగణం యెహోవా మహిమ తేజస్సుతో నిండిపోయింది. 5 కెరూబుల రెక్కల చప్పుడు బయటి ప్రాంగణం వరకు వినిపించింది, ఆ శబ్దం సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడినట్టు ఉంది.+
6 అప్పుడు ఆయన నారవస్త్రాలు ధరించిన వ్యక్తికి ఇలా ఆజ్ఞాపించాడు: “తిరిగే చక్రాల మధ్య నుండి, కెరూబుల మధ్య నుండి నిప్పు తీసుకో.” దాంతో ఆ వ్యక్తి ప్రవేశించి చక్రం పక్కన నిలబడ్డాడు. 7 అప్పుడు ఒక కెరూబు, ఆ కెరూబుల మధ్యవున్న నిప్పు వైపు చెయ్యి చాపి కొన్ని నిప్పుల్ని+ తీసుకుని నారవస్త్రాలు ధరించిన వ్యక్తి+ రెండు చేతుల్లో పెట్టాడు, ఆ వ్యక్తి వాటిని తీసుకొని బయటికి వెళ్లాడు. 8 కెరూబుల రెక్కల కింద మనిషి చేతుల లాంటివి ఉన్నాయి.+
9 నేను చూస్తుండగా, కెరూబుల పక్కన నాలుగు చక్రాలు కనిపించాయి, ఒక్కో కెరూబు పక్కన ఒక్కో చక్రం ఉంది; ఆ చక్రాలు లేతపచ్చ రాయిలా మెరుస్తున్నట్టు కనిపించాయి.+ 10 ఆ నాలుగు చక్రాలు చూడడానికి ఒకేలా ఉన్నాయి, అవి ఒక చక్రంలో ఇంకో చక్రం ఉన్నట్టు కనిపించాయి. 11 అవి కదిలినప్పుడు పక్కకు తిరగకుండానే నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్లగలవు. ఎందుకంటే అవి పక్కకు తిరగకుండానే, ముఖం ఏ వైపు ఉంటే ఆ వైపుకు వెళ్తాయి. 12 కెరూబుల శరీరాల నిండా, వీపుల నిండా, చేతుల నిండా, రెక్కల నిండా కళ్లు ఉన్నాయి, అలాగే ఆ నాలుగు కెరూబుల పక్కన ఉన్న చక్రాలు కూడా చుట్టూ కళ్లతో నిండివున్నాయి.+ 13 చక్రాల విషయానికొస్తే, ఒక స్వరం వాటిని, “తిరిగే చక్రాలు!” అని పిలవడం నేను విన్నాను.
14 ప్రతీ కెరూబుకు నాలుగు ముఖాలు ఉన్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం, రెండో ముఖం మనిషి ముఖం, మూడో ముఖం సింహం ముఖం, నాలుగో ముఖం గద్ద ముఖం.+
15 అప్పుడు కెరూబులు లేచారు, కెబారు నది+ దగ్గర నేను చూసింది ఆ జీవుల్నే.* 16 కెరూబులు కదిలినప్పుడు వాళ్ల పక్కన చక్రాలు కూడా కదిలేవి; కెరూబులు భూమ్మీద నుండి పైకి లేవడానికి తమ రెక్కల్ని ఎత్తినప్పుడు, చక్రాలు పక్కకు తిరిగేవి కావు, వాళ్ల నుండి దూరంగా వెళ్లేవి కావు.+ 17 వాళ్లు కదలకుండా ఉన్నప్పుడు చక్రాలు కూడా కదలకుండా ఉండేవి; వాళ్లు లేచినప్పుడు వాళ్లతోపాటు చక్రాలు కూడా లేచేవి; ఎందుకంటే ఆ జీవుల* మీద పనిచేస్తున్న పవిత్రశక్తే* ఆ చక్రాల్లో కూడా ఉంది.
18 అప్పుడు యెహోవా మహిమ+ మందిరం గడప దగ్గర నుండి బయల్దేరి కెరూబుల మీద నిలిచింది.+ 19 నేను చూస్తుండగా ఆ కెరూబులు తమ రెక్కలు పైకెత్తి భూమ్మీద నుండి పైకి లేచారు. వాళ్లు బయల్దేరినప్పుడు వాళ్ల పక్కన చక్రాలు కూడా పైకి లేచాయి. వాళ్లు యెహోవా మందిర తూర్పు ద్వార ప్రవేశం దగ్గర ఆగారు, ఇశ్రాయేలు దేవుని మహిమ వాళ్ల పైన ఉంది.+
20 కెబారు నది పక్కన, ఇశ్రాయేలు దేవుని కింద ఉన్నట్టు నేను చూసింది ఈ జీవుల్నే,*+ కాబట్టి వాళ్లు కెరూబులు అని నాకు అర్థమైంది. 21 ఆ నాలుగు కెరూబుల్లో ప్రతీ కెరూబుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు, అలాగే ఆ రెక్కల కింద మనిషి చేతుల లాంటివి ఉన్నాయి.+ 22 వాళ్ల ముఖాలు నేను కెబారు నది పక్కన చూసిన ముఖాల్లా కనిపించాయి.+ ప్రతీ కెరూబు తిన్నగా ముందుకు వెళ్తున్నాడు.+
11 తర్వాత ఒక శక్తి* నన్ను ఎత్తి, యెహోవా మందిర తూర్పు ద్వారం దగ్గరికి, అంటే తూర్పు వైపు ఉన్న ద్వారం+ దగ్గరికి తీసుకొచ్చింది. అక్కడ ఆ ద్వార ప్రవేశం దగ్గర 25 మంది పురుషులు నాకు కనిపించారు, వాళ్లలో అజ్జూరు కుమారుడు యజన్యా, బెనాయా కుమారుడు పెలట్యా ఉన్నారు; వాళ్లు ప్రజల అధిపతులు.+ 2 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, కుట్రలు పన్నుతూ, ఈ నగరంలో* చెడ్డ సలహా ఇస్తున్నది వీళ్లే. 3 వీళ్లు, ‘ఇది ఇళ్లు కట్టుకునే సమయం కాదా?+ ఈ నగరం* వంటపాత్ర,*+ మనం అందులోని మాంసం’ అని చెప్పుకుంటున్నారు.
4 “కాబట్టి వీళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు. మానవ కుమారుడా, ప్రవచించు.”+
5 అప్పుడు యెహోవా పవిత్రశక్తి* నా మీదికి వచ్చింది.+ ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు సరిగ్గానే చెప్పారు; మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. 6 మీరు ఈ నగరంలో చాలామంది చనిపోయేలా చేశారు, దీని వీధుల్ని శవాలతో నింపేశారు.” ’ ”+ 7 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నగరంలో మీరు పారేసిన శవాలే ఆ మాంసం, ఈ నగరమే వంటపాత్ర.+ కానీ మీరు అందులో నుండి తీసేయబడతారు.’ ”
8 “ ‘మీరు ఖడ్గానికి భయపడ్డారు కదా,+ ఖడ్గాన్నే మీ మీదికి రప్పిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 9 ‘నేను మిమ్మల్ని దానిలో నుండి బయటికి తీసుకొచ్చి, పరదేశులకు అప్పగించి, మీకు తీర్పు తీరుస్తాను.+ 10 మీరు ఖడ్గం వల్ల చనిపోతారు.+ నేను ఇశ్రాయేలు సరిహద్దు దగ్గర మీకు తీర్పు తీరుస్తాను,+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 11 ఈ నగరం మీకు వంటపాత్రగా ఉండదు, మీరు అందులో మాంసంగా ఉండరు; నేను ఇశ్రాయేలు సరిహద్దు దగ్గర మీకు తీర్పు తీరుస్తాను, 12 అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు నా నియమాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు,+ బదులుగా మీ చుట్టూ ఉన్న జనాల న్యాయనిర్ణయాల ప్రకారం ప్రవర్తించారు.’ ”+
13 నేను ప్రవచించగానే, బెనాయా కుమారుడు పెలట్యా చనిపోయాడు, అప్పుడు నేను సాష్టాంగపడి బిగ్గరగా ఇలా అరిచాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! నువ్వు ఇశ్రాయేలులో మిగిలినవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తావా?”+
14 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 15 “మానవ కుమారుడా, యెరూషలేము నివాసులు నీ సహోదరులతో, తిరిగి కొనే హక్కు ఉన్న నీ సహోదరులతో, ఇశ్రాయేలు ఇంటివాళ్లందరితో, ‘యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాది; ఇది మాకు ఆస్తిగా ఇవ్వబడింది’ అని అన్నారు. 16 కాబట్టి నువ్వు ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే: “నేను వాళ్లను దూరంగా జనాల మధ్యకు పంపించేశాను, దేశాల మధ్యకు వాళ్లను చెదరగొట్టాను,+ అయినా వాళ్లు వెళ్లిన దేశాల్లో నేను కొంతకాలం పాటు వాళ్లకు పవిత్రమైన స్థలంగా ఉంటాను.” ’+
17 “కాబట్టి ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే: “నేను మిమ్మల్ని ఆయా ప్రజల మధ్య నుండి సమకూరుస్తాను, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని పోగుచేసి ఇశ్రాయేలు దేశాన్ని మీకు ఇస్తాను.+ 18 వాళ్లు అక్కడికి తిరిగొచ్చి, దానిలోని అసహ్యమైన, హేయమైన వాటిని తీసేస్తారు.+ 19 నేను వాళ్లకు ఒకే* హృదయాన్ని,+ కొత్త మనోవైఖరిని ఇస్తాను;+ వాళ్ల శరీరాల్లో నుండి రాతి గుండె తీసేసి+ వాళ్లకు మాంసం గుండె* ఇస్తాను,+ 20 అప్పుడు వాళ్లు నా శాసనాల ప్రకారం నడుస్తూ, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ వాటికి లోబడతారు. వాళ్లు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను.” ’
21 “ ‘ “అయితే తమ అసహ్యమైన వాటిని, హేయమైన పనుల్ని అంటిపెట్టుకునేవాళ్ల విషయానికొస్తే, నేను వాళ్ల మార్గాల పర్యవసానాల్ని వాళ్ల తలల మీదికి రప్పిస్తాను” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.’ ”
22 అప్పుడు కెరూబులు తమ రెక్కల్ని పైకి ఎత్తారు, చక్రాలు వాళ్లకు దగ్గరగా ఉన్నాయి,+ ఇశ్రాయేలు దేవుని మహిమ వాళ్ల పైన ఉంది.+ 23 అప్పుడు యెహోవా మహిమ+ నగరం నుండి పైకి లేచి నగరానికి తూర్పున ఉన్న పర్వతం+ మీద నిలిచింది. 24 అప్పుడు ఒక శక్తి,* దేవుని పవిత్రశక్తి దర్శనం ద్వారా నన్ను పైకి ఎత్తి, కల్దీయ దేశంలో చెరగా ఉన్న ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది. తర్వాత నేను చూసిన ఆ దర్శనం నన్ను విడిచి వెళ్లింది. 25 అప్పుడు నేను, యెహోవా నాకు చూపించిన వాటన్నిటినీ చెరలో ఉన్న ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాను.
12 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, నువ్వు తిరుగుబాటు చేసే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లు కళ్లు ఉన్నా చూడరు, చెవులు ఉన్నా వినరు,+ ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+ 3 మానవ కుమారుడా, నువ్వు చెరలోకి వెళ్లడానికి నీ సామాను సర్దుకో. పగలు వాళ్లు చూస్తుండగా నువ్వు చెరలోకి వెళ్లాలి. వాళ్లు చూస్తుండగా నీ ఇంటి నుండి ఇంకో చోటికి చెరగా వెళ్లు. వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలే అయినా, బహుశా దాని అర్థాన్ని గ్రహిస్తారేమో. 4 పగలు వాళ్లు చూస్తుండగా, చెరలోకి వెళ్లడానికి సర్దుకున్న నీ సామాను బయటికి తీసుకురా; సాయంత్రం వాళ్లు చూస్తుండగా, చెరలోకి వెళ్తున్నవాడిలా నువ్వు అక్కడి నుండి బయల్దేరాలి.+
5 “వాళ్లు చూస్తుండగా గోడకు కన్నం చేసి, దాని గుండా నీ సామాను బయటికి తీయి.+ 6 వాళ్లు చూస్తుండగా నీ సామాను భుజం మీద వేసుకొని చీకట్లో దాన్ని మోసుకెళ్లు. నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో, ఎందుకంటే నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఒక సూచనగా చేస్తున్నాను.”+
7 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను చేశాను. పగలు నేను చెరలోకి వెళ్తున్నవాడిలా నా సామాను బయటికి తెచ్చాను, సాయంత్రం నా చేతితో గోడకు ఒక కన్నం చేశాను. చీకటి పడినప్పుడు, వాళ్లు చూస్తుండగా నా సామాను తీసుకొని, భుజం మీద పెట్టుకుని బయల్దేరాను.
8 ఉదయం యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 9 “మానవ కుమారుడా, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ఇంటివాళ్లు, ‘నువ్వు ఏం చేస్తున్నావు?’ అని నిన్ను అడిగారు కదా. 10 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ సందేశం యెరూషలేములో ఉన్న ప్రధానుడికి,+ నగరంలో ఉన్న ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ సంబంధించినది.” ’
11 “ఇలా చెప్పు, ‘నేను మీకు సూచనగా ఉన్నాను.+ నేను ఏం చేశానో అదే వాళ్లకు జరుగుతుంది. వాళ్లు బందీలుగా చెరలోకి వెళ్తారు.+ 12 వాళ్ల మధ్య ఉన్న ప్రధానుడు తన వస్తువుల్ని భుజం మీద పెట్టుకుని చీకట్లో బయల్దేరతాడు. అతను గోడకు ఒక కన్నం చేసి దాని గుండా తన వస్తువుల్ని తీసుకెళ్తాడు.+ నేల కనబడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.’ 13 నేను అతని మీదికి నా వల విసురుతాను, అతను దానిలో చిక్కుకుంటాడు.+ తర్వాత నేను అతన్ని బబులోనుకు అంటే కల్దీయుల దేశానికి తీసుకెళ్తాను, కానీ అతను ఆ దేశాన్ని చూడడు; అక్కడే అతను చనిపోతాడు.+ 14 అతని చుట్టూ ఉండేవాళ్లను అంటే అతని సహాయకుల్ని, అతని సైన్యాల్ని అన్ని దిక్కులకు చెదరగొడతాను;+ కత్తి తీసి వాళ్లను తరుముతాను.+ 15 నేను వాళ్లను జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొట్టినప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 16 అయితే వాళ్లలో కొంతమంది ఖడ్గాన్ని, కరువును, తెగులును తప్పించుకునేలా చేస్తాను; వాళ్లు తమ అసహ్యమైన పనులన్నిటి గురించి తాము వెళ్లే జనాలకు చెప్పడానికి అలా చేస్తాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.”
17 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18 “మానవ కుమారుడా, నువ్వు భయంతో వణికిపోతూ నీ రొట్టె తినాలి; కంగారుతో, ఆందోళనతో నీ నీళ్లు తాగాలి.+ 19 దేశ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేము నివాసులతో సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లు ఆందోళనతో తమ రొట్టె తింటారు, భయంభయంగా తమ నీళ్లు తాగుతారు; ఎందుకంటే దేశంలో నివసిస్తున్న వాళ్లందరి దౌర్జన్యం కారణంగా+ దేశం పూర్తిగా నిర్జనమౌతుంది.+ 20 ప్రజలు నివసించే నగరాలు నాశనమౌతాయి, దేశం పాడుబడ్డ భూమిలా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”+
21 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 22 “మానవ కుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఏ దర్శనం నెరవేరట్లేదు’ అని ఇశ్రాయేలులో సామెత చెప్పుకుంటున్నారేంటి?+ 23 కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇక ఇశ్రాయేలులో ఎవరూ ఈ సామెతను చెప్పుకోకుండా నేను దాన్ని తీసేస్తాను.” ’ అయితే వాళ్లతో ఇలా చెప్పు: ‘రోజులు దగ్గరపడ్డాయి,+ ప్రతీ దర్శనం నెరవేరుతుంది.’ 24 ఎందుకంటే ఇక నుండి ఇశ్రాయేలు ప్రజల్లో అబద్ధ దర్శనాలు గానీ, సోదె చెప్పేవాళ్ల మోసపు మాటలు గానీ ఉండవు.+ 25 ‘ “ఎందుకంటే, యెహోవానైన నేను మాట్లాడతాను. నేను చెప్పే ప్రతీ మాట ఏమాత్రం ఆలస్యం లేకుండా నెరవేరుతుంది.+ తిరుగుబాటు చేసే ప్రజలారా, మీ రోజుల్లో+ నేను ఒక మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.’ ”
26 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 27 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు,* ‘అతను చూసే దర్శనం ఎప్పటికో నెరవేరుతుంది, అతను చాలాకాలం తర్వాత జరిగే విషయాల గురించి ప్రవచిస్తున్నాడు’ అని చెప్పుకుంటున్నారు.+ 28 కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పే ప్రతీది జరుగుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” ’ ”
13 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించు,+ సొంత ఆలోచనల్ని ప్రవచనాలుగా చెప్పేవాళ్లతో+ ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేది వినండి. 3 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఏ దర్శనం చూడకపోయినా, సొంత ఆలోచనల ప్రకారం ప్రవచించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ!+ 4 ఇశ్రాయేలూ, నీ ప్రవక్తలు శిథిలాల మధ్య ఉన్న నక్కల్లా తయారయ్యారు. 5 యెహోవా రోజున జరిగే యుద్ధంలో+ ఇశ్రాయేలు స్థిరంగా నిలబడేలా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల కోసం మీరు రాతి గోడల్లోని పగుళ్ల దగ్గరికి వెళ్లి వాటిని బాగుచేయరు.”+ 6 “వాళ్లు వ్యర్థమైన దర్శనాలు చూసి, అబద్ధాన్ని ప్రవచించారు; యెహోవా వాళ్లను పంపకపోయినా, ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్లు అంటున్నారు; అంతేకాదు తమ మాటలు నెరవేరతాయని ఎదురుచూశారు.+ 7 నేను ఏమీ చెప్పకపోయినా, మీరు ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని అంటున్నప్పుడు మీరు చూసిన దర్శనాలు వ్యర్థమైన దర్శనాలు కావా? మీరు ప్రవచించింది అబద్ధాన్ని కాదా?” ’
8 “ ‘అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘మీ మాటలు, మీ దర్శనాలు అబద్ధం కాబట్టి నేను మీకు వ్యతిరేకంగా ఉన్నాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”+ 9 వ్యర్థమైన దర్శనాలు చూసే, అబద్ధాన్ని ప్రవచించే ప్రవక్తలకు+ వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతాను. నా సన్నిహిత ప్రజల గుంపులో వాళ్లు ఉండరు; ఇశ్రాయేలు ఇంటివాళ్ల జాబితాలో వాళ్ల పేర్లు ఉండవు; వాళ్లు ఇశ్రాయేలు దేశానికి తిరిగిరారు; అప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 10 శాంతి లేకపోయినా, “శాంతి ఉంది!” అని చెప్తూ+ వాళ్లు నా ప్రజల్ని తప్పుదారి పట్టించారు కాబట్టే ఇదంతా జరుగుతుంది. బలహీనమైన మధ్యగోడ కట్టబడినప్పుడు, వాళ్లు దానికి సున్నం పూస్తున్నారు.’*+
11 “అది పడిపోతుందని సున్నం పూసేవాళ్లకు చెప్పు. కుండపోత వర్షం కురుస్తుంది, వడగండ్లు పడతాయి, బలమైన ఈదురు గాలులు దానిని పడగొడతాయి.+ 12 గోడ పడిపోయినప్పుడు, ‘మీరు పూసిన సున్నం పూత ఏమైంది?’ అని మిమ్మల్ని అడుగుతారు.+
13 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నేను ఆగ్రహంతో బలమైన ఈదురు గాలుల్ని, కోపంతో కుండపోత వర్షాన్ని, ఉగ్రతతో నాశనం చేసే వడగండ్లను రప్పిస్తాను. 14 మీరు సున్నం పూసిన గోడను నేను పడగొట్టి నేలమట్టం చేస్తాను, దాని పునాదులు బయటికి కనిపిస్తాయి. నగరం నాశనమైనప్పుడు మీరు దానిలోనే నశించిపోతారు; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’
15 “ ‘నేను గోడమీద, దానికి సున్నం పూసినవాళ్ల మీద నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కినప్పుడు, నేను మీతో ఇలా అంటాను: “గోడా లేదు, దానికి సున్నం పూసినవాళ్లూ లేరు.+ 16 యెరూషలేము గురించి ప్రవచించి, దానికి శాంతి లేకపోయినా శాంతి ఉన్నట్టు దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రవక్తలు+ ఇక లేరు” ’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
17 “మానవ కుమారుడా, సొంత ఆలోచనల్ని ప్రవచనాలుగా చెప్పే నీ ప్రజల్లోని స్త్రీలకు వ్యతిరేకంగా ముఖం తిప్పుకొని, వాళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు. 18 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ప్రజల ప్రాణాల్ని వేటాడడానికి, ప్రతీ ఒక్కరి చేతికి తగ్గట్టుగా తాయెత్తులు, రకరకాల తలలకు సరిపోయేలా ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ! మీరు నా ప్రజల ప్రాణాల్ని వేటాడుతూ, మీ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారా? 19 మీరు మీ అబద్ధాల్ని వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పడం ద్వారా బ్రతకాల్సినవాళ్లను చంపుతూ, బ్రతకకూడనివాళ్లను సజీవంగా ఉంచుతూ గుప్పెడు బార్లీ గింజల కోసం, రొట్టె ముక్కల కోసం+ నా ప్రజల మధ్య నన్ను అపవిత్రపరుస్తారా?” ’+
20 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘స్త్రీలారా, పక్షుల్ని వేటాడినట్టు ప్రజల్ని వేటాడడానికి మీరు ఉపయోగించే మీ తాయెత్తులకు నేను వ్యతిరేకంగా ఉన్నాను; నేను వాటిని మీ చేతుల నుండి తెంచేసి, మీరు పక్షుల్ని వేటాడినట్టు వేటాడుతున్న వాళ్లను విడిపిస్తాను. 21 మీ ముసుగుల్ని చించేసి, మీ చేతిలో నుండి నా ప్రజల్ని రక్షిస్తాను; మీరిక వాళ్లను వేటాడి పట్టుకోలేరు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 22 నీతిమంతునికి బాధ కలిగించాలనే ఉద్దేశం నాకు లేకపోయినా మీరు అతనికి అబద్ధాలు చెప్పి+ అతని ధైర్యాన్ని పోగొట్టారు; మీరు దుష్టుడి చేతుల్ని బలపర్చారు,+ అలా అతను తన చెడు మార్గం నుండి పక్కకుమళ్లి, జీవించకుండా చేశారు.+ 23 కాబట్టి స్త్రీలారా, మీరు ఇక అబద్ధ దర్శనాలు చూడరు, సోదె చెప్పరు;+ నేను నా ప్రజల్ని మీ చేతుల్లో నుండి రక్షిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
14 తర్వాత ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమంది వచ్చి నా ముందు కూర్చున్నారు.+ 2 అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 3 “మానవ కుమారుడా, ఈ మనుషులు తమ అసహ్యమైన విగ్రహాల్ని* అనుసరించాలని నిశ్చయించుకున్నారు, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యే అడ్డురాయిని నిలబెట్టారు. నేను వాళ్లను నా దగ్గర విచారణ చేయనివ్వాలా?+ 4 కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఒక ఇశ్రాయేలీయుడు తన అసహ్యమైన విగ్రహాల్ని అనుసరించాలని నిశ్చయించుకొని, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యే అడ్డురాయిని నిలబెట్టి, తర్వాత ప్రవక్త దగ్గర విచారణ చేయడానికి వస్తే, యెహోవానైన నేను అతని లెక్కలేనన్ని అసహ్యమైన విగ్రహాలకు తగినట్టు అతనికి జవాబిస్తాను. 5 నేను ఇశ్రాయేలు ఇంటివాళ్ల హృదయాల్లో భయం పుట్టిస్తాను, ఎందుకంటే వాళ్లంతా నన్ను విడిచిపెట్టి తమ అసహ్యమైన విగ్రహాల వెంట వెళ్లారు.” ’+
6 “కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా దగ్గరికి తిరిగిరండి, మీ అసహ్యమైన విగ్రహాల్ని విడిచిపెట్టండి, మీ హేయమైన పనులన్నిటి నుండి మీ ముఖం పక్కకు తిప్పుకోండి.+ 7 ఒక ఇశ్రాయేలీయుడు గానీ, ఇశ్రాయేలులో నివసించే పరదేశి గానీ నన్ను విడిచిపెట్టి, తన అసహ్యమైన విగ్రహాల్ని అనుసరించాలని నిశ్చయించుకొని, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యే అడ్డురాయిని నిలబెట్టి, తర్వాత నా ప్రవక్త దగ్గర విచారణ చేయడానికి వస్తే,+ యెహోవానైన నేనే స్వయంగా అతనికి జవాబిస్తాను. 8 నేను నా ముఖాన్ని అతనికి వ్యతిరేకంగా తిప్పుకుంటాను; అతన్ని ఒక హెచ్చరికగా, సామెతగా చేస్తాను, నా ప్రజల్లో నుండి అతన్ని కొట్టివేస్తాను;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’
9 “ ‘అయితే ఆ ప్రవక్త మోసపోయి ఒక జవాబు చెప్తే, యెహోవానైన నేనే అతన్ని వెర్రివాణ్ణి చేసినట్టు.+ అప్పుడు నేను అతనికి వ్యతిరేకంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో నుండి అతన్ని పూర్తిగా నాశనం చేస్తాను. 10 వాళ్లు తమ దోషాన్ని భరించాలి; ప్రవక్త దోషం ఎంతో, విచారణ చేసినవాడి దోషం కూడా అంతే; 11 అప్పుడే ఇశ్రాయేలు ఇంటివాళ్లు నన్ను విడిచి అటూఇటూ తిరగకుండా, తమ అపరాధాలన్నిటితో తమను మలినం చేసుకోకుండా ఉంటారు. వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్ల దేవునిగా ఉంటాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”
12 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 13 “మానవ కుమారుడా, ఒక దేశం నమ్మకద్రోహంగా ప్రవర్తించి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే, నేను దానికి వ్యతిరేకంగా నా చెయ్యి చాపి దాని ఆహార సరఫరాను నాశనం చేస్తాను;*+ దానిమీదికి కరువు రప్పించి+ అందులో మనిషి గానీ, జంతువు గానీ లేకుండా చేస్తాను.”+ 14 “ ‘నోవహు,+ దానియేలు,+ యోబు+ అనే ముగ్గురు మనుషులు దానిలో ఉన్నా, వాళ్లు తమ నీతి వల్ల కేవలం తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
15 “ ‘ఒకవేళ నేను ఆ దేశం గుండా క్రూరమృగాల్ని పంపించినప్పుడు, అవి దానిలోని ప్రజల్ని* చంపి, దాన్ని పాడుబడ్డ భూమిగా మారిస్తే, వాటివల్ల ఎవరూ దానిలో సంచరించకపోతుంటే,+ 16 నా జీవం తోడు, ఈ ముగ్గురు మనుషులు ఆ దేశంలో ఉన్నా, వాళ్లు తమ కుమారుల్ని గానీ, కూతుళ్లను గానీ రక్షించుకోలేరు; తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు; దేశం నిర్జనంగా మారుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
17 “ ‘ఒకవేళ నేను, “ఈ దేశమంతటా ఖడ్గం తిరగాలి” అని అంటూ దేశం మీదికి ఖడ్గం రప్పించి,+ అందులోని మనుషుల్ని, జంతువుల్ని చంపేస్తే,+ 18 ఈ ముగ్గురు మనుషులు ఆ దేశంలో ఉన్నా, నా జీవం తోడు, వాళ్లు తమ కుమారుల్ని గానీ, కూతుళ్లను గానీ రక్షించుకోలేరు; తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
19 “ ‘ఒకవేళ నేను ఆ దేశంలోకి తెగులును పంపి,+ నా ఆగ్రహాన్ని దానిమీద కుమ్మరించి, అందులోని మనుషుల్ని, జంతువుల్ని చంపి రక్తపాతం సృష్టిస్తే, 20 నోవహు,+ దానియేలు,+ యోబు+ అందులో ఉన్నా, నా జీవం తోడు, వాళ్లు తమ కుమారుల్ని గానీ, కూతుళ్లను గానీ రక్షించుకోలేరు; వాళ్లు తమ నీతితో తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
21 “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను యెరూషలేములోని మనుషుల్ని, జంతువుల్ని చంపడానికి+ దాని మీదికి నా నాలుగు శిక్షల్ని+ అంటే ఖడ్గాన్ని, కరువును, క్రూరమృగాన్ని, తెగులును+ పంపించినప్పుడు ఇలా జరుగుతుంది. 22 అయితే వాళ్లలో కొంతమంది కుమారులు, కూతుళ్లు మిగులుతారు; వాళ్లు బయటికి తీసుకురాబడతారు.+ వాళ్లు మీ దగ్గరికి వస్తారు; మీరు వాళ్ల మార్గాల్ని, పనుల్ని చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన విపత్తును బట్టి, నేను దానికి చేసిన దానంతటిని బట్టి మీరు తప్పకుండా ఓదార్పు పొందుతారు.’ ”
23 “ ‘మీరు వాళ్ల మార్గాల్ని, పనుల్ని చూసినప్పుడు మీకు ఊరట కలుగుతుంది; నేను దానికి ఏదైతే చేయాల్సి వచ్చిందో, అది సరైన కారణాన్ని బట్టే చేశానని అప్పుడు మీరు తెలుసుకుంటారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
15 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర వేరే చెట్ల కర్ర కన్నా, అడవిలోని చెట్ల కొమ్మల కన్నా శ్రేష్ఠమైనదా? 3 దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? దాంతో ఎవరైనా వస్తువుల్ని వేలాడదీసే మేకును తయారుచేస్తారా? 4 ఇదిగో! దాన్ని వంటచెరకుగా అగ్నిలో వేస్తే, దాని రెండు కొనలు నిప్పులో కాలిపోతాయి, దాని మధ్యభాగం మాడిపోతుంది. అప్పుడది దేనికైనా పనికొస్తుందా? 5 అగ్నిలో వేయకముందే అది ఎందుకూ పనికిరానిదిగా ఉంటే, అగ్ని దాన్ని కాల్చేసి, మాడ్చేసిన తర్వాత అది ఇక దేనికి పనికొస్తుంది?”
6 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అడవిలోని చెట్ల మధ్య ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలాగైతే వంటచెరకుగా ఇచ్చానో, యెరూషలేము నివాసుల్ని కూడా అలాగే ఇచ్చాను.+ 7 నేను నా ముఖాన్ని వాళ్లకు వ్యతిరేకంగా తిప్పుకున్నాను. వాళ్లు అగ్ని నుండి తప్పించుకున్నారు, కానీ అగ్ని వాళ్లను కాల్చేస్తుంది. నేను నా ముఖాన్ని వాళ్లకు వ్యతిరేకంగా తిప్పుకున్నప్పుడు, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”+
8 “ ‘వాళ్లు నమ్మకద్రోహం చేశారు+ కాబట్టి నేను దేశాన్ని నిర్జనంగా చేస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
16 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, యెరూషలేముకు దాని అసహ్యమైన పనుల గురించి తెలియజేయి.+ 3 నువ్వు ఇలా చెప్పాలి: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా యెరూషలేముతో ఇలా అంటున్నాడు: “నువ్వు కనానీయుల దేశంలో పుట్టావు, అక్కడే మొదలయ్యావు. నీ తండ్రి అమోరీయుడు,+ నీ తల్లి హిత్తీయురాలు.+ 4 నీ పుట్టుక విషయానికొస్తే, నువ్వు పుట్టిన రోజున ఎవరూ నీ బొడ్డుతాడు కోయలేదు, నిన్ను నీళ్లతో శుభ్రంగా కడగలేదు, నీకు ఉప్పు రాయలేదు, నిన్ను పొత్తిగుడ్డల్లో చుట్టలేదు. 5 వీటిలో ఏ ఒక్కటైనా నీకు చేసేంతగా ఎవరూ నీ మీద జాలి పడలేదు, ఎవరికీ నీ మీద కనికరం కలగలేదు. నువ్వు పుట్టిన రోజున నువ్వు ద్వేషించబడ్డావు కాబట్టి నిన్ను బయట పొలంలో పారేశారు.
6 “ ‘ “నేను ఆ దారిలో వెళ్తూ, రక్తంలో తన్నుకుంటున్న నిన్ను చూశాను; రక్తంలో పడివున్న నిన్ను చూసి, ‘బ్రతుకు!’ అని అన్నాను. అవును, రక్తంలో పడివున్న నిన్ను చూసి, ‘బ్రతుకు!’ అన్నాను. 7 పొలంలో మొలకెత్తే మొక్కల్లా నేను నిన్ను ఒక గొప్ప సమూహంగా చేశాను; నువ్వు పెరిగి పెద్దదానివై, శ్రేష్ఠమైన నగలు ధరించావు. నీ స్తనాలు దృఢంగా తయారయ్యాయి, నీ తలవెంట్రుకలు పెరిగాయి; కానీ అప్పటికీ నువ్వు బట్టలు లేకుండా, దిగంబరంగా ఉన్నావు.” ’
8 “ ‘నేను అటుగా వెళ్తూ నిన్ను చూసి, నీకు ప్రేమించే వయసు వచ్చిందని గమనించాను. కాబట్టి నేను నా వస్త్రాన్ని* నీ మీద పరిచి,+ నీ మానాన్ని కప్పి, ప్రమాణపూర్వకంగా నీతో ఒక ఒప్పందం* చేసుకున్నాను, నువ్వు నా దానివి అయ్యావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 9 ‘అంతేకాదు నేను నిన్ను నీళ్లతో కడిగి, నీ మీదున్న రక్తాన్ని శుభ్రం చేసి, నీకు నూనె రాశాను.+ 10 తర్వాత నీకు బుట్టాపని* చేసిన వస్త్రాన్ని, నాణ్యమైన తోలు* చెప్పుల్ని తొడిగాను, నీకు సన్నని నారవస్త్రం చుట్టి, ఖరీదైన బట్టలు వేశాను. 11 నిన్ను నగలతో అలంకరించాను, నీ చేతులకు గాజులు తొడిగి, నీ మెడకు హారం పెట్టాను. 12 నీకు ముక్కుపోగును, చెవిపోగుల్ని, నీ తల మీద అందమైన కిరీటాన్ని పెట్టాను. 13 నువ్వు వెండిబంగారాలతో నిన్ను అలంకరించుకుంటూ, సన్నని నారవస్త్రాన్ని, ఖరీదైన బట్టల్ని, బుట్టాపని చేసిన బట్టల్ని వేసుకుంటూ వచ్చావు. మెత్తని పిండి, తేనె, నూనె నీకు ఆహారంగా ఉండేవి; నువ్వు ఎంతో సౌందర్యవతిగా,+ రాజరికానికి తగినట్టుగా* తయారయ్యావు.’ ”
14 “ ‘నేను నా వైభవాన్ని నీ మీద ఉంచడం వల్ల నువ్వు పరిపూర్ణ సౌందర్యవతివి అయ్యావు;+ నీ సౌందర్యాన్ని బట్టి నీ ఖ్యాతి* దేశదేశాలకు వ్యాపిస్తూ వచ్చింది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
15 “ ‘కానీ నువ్వు నీ అందాన్ని నమ్ముకోవడం మొదలుపెట్టావు,+ నీ ఖ్యాతి వల్ల వేశ్యవి అయ్యావు.+ దారినపోయే ప్రతీ ఒక్కరితో విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తూ,+ నీ అందాన్ని వాళ్లకు సమర్పించుకున్నావు. 16 నువ్వు నీ రంగురంగుల బట్టల్లో కొన్ని తీసుకొని, వాటితో నీ ఉన్నత స్థలాల్ని అలంకరించి అక్కడ వ్యభిచారం చేశావు;+ అలాంటివి జరగకూడదు, ఎప్పటికీ జరగకూడదు. 17 నేను నీకు ఇచ్చిన అందమైన వెండిబంగారు నగల్ని తీసుకొని, వాటితో పురుష రూప విగ్రహాలు* చేసుకొని వాటితో వ్యభిచారం చేశావు.+ 18 బుట్టాపని చేసిన నీ బట్టలు తీసి వాటిమీద కప్పావు, నా తైలాన్ని, నా ధూపాన్ని వాటికి అర్పించావు.+ 19 నువ్వు తినడానికి నేను నీకు ఇచ్చిన రొట్టెను, అంటే మెత్తని పిండితో, నూనెతో, తేనెతో చేసిన రొట్టెను ఇంపైన* సువాసనగా వాటికి అర్పించావు.+ నువ్వు సరిగ్గా అలాగే చేశావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
20 “ ‘నువ్వు నాకు కన్న నీ కుమారుల్ని, కూతుళ్లను+ తీసుకుని విగ్రహాలకు బలి ఇచ్చావు.+ నువ్వు చేసిన వ్యభిచార క్రియలు సరిపోలేదా? 21 నువ్వు నా పిల్లల్ని వధించి, వాళ్లను అగ్నిలో వేసి కాల్చావు.*+ 22 నువ్వు నీ హేయమైన పనులన్నిటినీ, వ్యభిచార క్రియలన్నిటినీ చేస్తున్నప్పుడు, నువ్వు నీ చిన్ననాటి రోజుల్ని, అంటే నువ్వు బట్టలు లేకుండా, దిగంబరంగా ఉండి రక్తంలో తన్నుకుంటున్న రోజుల్ని గుర్తుచేసుకోలేదు. 23 నువ్వు ఈ చెడ్డపనులన్నీ చేశావు కాబట్టి నీకు శ్రమ, నీకు శ్రమ’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 24 ‘నువ్వు పూజా స్థలాన్ని కట్టి, ప్రతీ సంతవీధిలో నీ కోసం ఒక ఉన్నత స్థలాన్ని నిర్మించుకున్నావు. 25 నువ్వు ప్రతీ వీధి మలుపు దగ్గర ఉన్నత స్థలాలు కట్టుకున్నావు, దారినపోయే ప్రతి ఒక్కరికీ నిన్ను నువ్వు అర్పించుకుంటూ+ నీ అందాన్ని అసహ్యించుకునేలా చేసుకున్నావు, నీ వ్యభిచార క్రియలు ఎక్కువౌతూ వచ్చాయి.+ 26 కామంతో నిండిన నీ పొరుగువాళ్లతో అంటే ఐగుప్తీయులతో నువ్వు వ్యభిచారం చేశావు,+ నీ లెక్కలేనన్ని వ్యభిచార క్రియలతో నాకు కోపం తెప్పించావు. 27 ఇప్పుడు నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి నీకు ఆహారం తక్కువయ్యేలా చేస్తాను;+ నిన్ను ద్వేషించే స్త్రీల ఇష్టానికి అంటే నీ అశ్లీల ప్రవర్తనను+ బట్టి సిగ్గుపడ్డ ఫిలిష్తియ స్త్రీల ఇష్టానికి నిన్ను అప్పగిస్తాను.+
28 “ ‘అప్పటికీ నువ్వు తృప్తి పడకుండా, అష్షూరీయులతో వ్యభిచారం చేశావు;+ వాళ్లతో వ్యభిచారం చేసినా నీకు తృప్తి అనిపించలేదు. 29 కాబట్టి నువ్వు వర్తకుల* దేశంలో, అలాగే కల్దీయులతో విపరీతంగా వ్యభిచారం చేస్తూ వచ్చావు,+ కానీ అప్పటికీ నీకు తృప్తి అనిపించలేదు. 30 నువ్వు సిగ్గుమాలిన వేశ్యలా ప్రవర్తిస్తూ+ ఈ పనులన్నీ చేసినప్పుడు నీ హృదయం ఎంత బలహీనంగా ఉంది!’* అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 31 ‘నువ్వు ప్రతీ వీధి మలుపు దగ్గర పూజా స్థలాన్ని, ప్రతీ సంతవీధిలో ఉన్నత స్థలాన్ని కట్టినప్పుడు నువ్వు వేశ్యలా ప్రవర్తించలేదు, ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకోలేదు. 32 నువ్వు భర్తతో కాకుండా వేరేవాళ్లతో తిరిగే తిరుగుబోతు భార్యవి.+ 33 సాధారణంగా ప్రజలు వేశ్యలకు కానుకలిస్తారు,+ కానీ నువ్వు అలా కాదు; కామంతో నీ వెంటపడ్డ వాళ్లందరికీ నువ్వే కానుకలు ఇచ్చావు;+ నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచారం చేయడానికి నువ్వు వాళ్లకు డబ్బులిస్తావు.+ 34 నువ్వు మిగతా వేశ్యల్లాంటి దానివి కాదు, నీలా ఎవరూ వ్యభిచారం చేయరు! ఎందుకంటే వాళ్లు నీకు డబ్బులివ్వరు, నువ్వే వాళ్లకు డబ్బులిస్తావు. నీ పద్ధతే వేరు.’
35 “కాబట్టి, ఓ వేశ్యా,+ యెహోవా చెప్పేది విను. 36 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు విపరీతమైన వాంఛతో ప్రవర్తించావు; నీ ప్రియులతో, నువ్వు నీ కుమారుల రక్తాన్ని కూడా అర్పించిన నీ హేయమైన, అసహ్యమైన విగ్రహాలన్నిటితో*+ వ్యభిచారం చేసి+ నీ మానాన్ని వెల్లడిచేసుకున్నావు, 37 కాబట్టి, నువ్వు సుఖం అందించిన నీ ప్రియులందర్నీ, అంటే నువ్వు ప్రేమించిన వాళ్లందర్నీ నువ్వు ద్వేషించిన వాళ్లందర్నీ నేను పోగుచేస్తాను. నేను వాళ్లందర్నీ అన్నివైపుల నుండి నీకు వ్యతిరేకంగా పోగుచేసి నీ మానాన్ని వాళ్లకు కనబరుస్తాను, వాళ్లు నిన్ను పూర్తిగా దిగంబరంగా చూస్తారు.+
38 “ ‘వ్యభిచారులకు, రక్తం చిందించే స్త్రీలకు విధించే శిక్ష+ నీకు విధిస్తాను;+ ఆగ్రహంతో, రోషంతో నీ రక్తం చిందించబడుతుంది.+ 39 నేను నిన్ను వాళ్ల చేతికి అప్పగిస్తాను, వాళ్లు నీ పూజా స్థలాల్ని పడగొడతారు, నీ ఉన్నత స్థలాల్ని కూలగొడతారు;+ నీ బట్టల్ని తీసేసి,+ నీ అందమైన నగల్ని లాక్కొని,+ నిన్ను బట్టలు లేకుండా, దిగంబరంగా వదిలేస్తారు. 40 వాళ్లు నీ మీదికి ఒక సమూహాన్ని తీసుకొస్తారు,+ వాళ్లు నిన్ను రాళ్లతో కొట్టి,+ ఖడ్గాలతో వధిస్తారు.+ 41 నీ ఇళ్లను అగ్నితో కాల్చేస్తారు,+ చాలామంది స్త్రీలు చూస్తుండగా నీకు తీర్పు విధిస్తారు; నేను నీ వ్యభిచారాన్ని అంతం చేస్తాను, నువ్వు ఇక డబ్బులు ఇవ్వవు. 42 అప్పుడు నీ మీద నా కోపం చల్లారుతుంది, నా ఆగ్రహం నీ మీది నుండి పక్కకు మళ్లుతుంది;+ నేను ఇక కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటాను.’
43 “ ‘నువ్వు నీ చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసుకోకుండా,+ ఇవన్నీ చేస్తూ నాకు కోపం పుట్టించావు కాబట్టి, ఇప్పుడు నేను నీ మార్గాల పర్యవసానాల్ని నీ తల మీదికి రప్పిస్తాను; నువ్వు నీ అశ్లీల ప్రవర్తనను, నీ హేయమైన పనుల్ని మానేస్తావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
44 “ ‘ఇదిగో సామెతల్ని చెప్పుకునే ప్రతీ ఒక్కరు నీ గురించి, “తల్లిలాగే బిడ్డ!” అనే సామెత చెప్పుకుంటారు.+ 45 నువ్వు తన భర్తను, పిల్లల్ని నీచంగా చూసిన మీ అమ్మలా; తమ భర్తల్ని, పిల్లల్ని నీచంగా చూసిన నీ అక్కాచెల్లెళ్లలా ఉన్నావు. మీ అమ్మ హిత్తీయురాలు, మీ నాన్న అమోరీయుడు.’ ”+
46 “ ‘నీ అక్క, నీకు ఉత్తరాన* తన కూతుళ్లతో* పాటు నివసిస్తున్న+ సమరయ.+ నీ చెల్లి, నీకు దక్షిణాన* తన కూతుళ్లతో పాటు నివసిస్తున్న+ సొదొమ.+ 47 నువ్వు వాళ్ల మార్గాల్లో నడవడం, వాళ్ల హేయమైన పనుల్ని అనుసరించడమే కాదు, కొద్దికాలంలోనే నీ ప్రవర్తనంతట్లో వాళ్లకన్నా ఘోరంగా తయారయ్యావు.+ 48 నా జీవం తోడు, నువ్వూ నీ కూతుళ్లూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ, ఆమె కూతుళ్లు చేయలేదు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 49 ‘నీ చెల్లెలు సొదొమ చేసిన తప్పేమిటంటే: ఆమె, ఆమె కూతుళ్లు+ గర్విష్ఠులు;+ వాళ్లకు సమృద్ధిగా ఆహారం ఉండేది,+ వాళ్లు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండేవాళ్లు;+ అయినా వాళ్లు కష్టాల్లో ఉన్నవాళ్లకు, పేదవాళ్లకు సహాయం చేయలేదు.+ 50 వాళ్ల అహంకారం+ ఎప్పుడూ తగ్గలేదు, వాళ్లు నా దృష్టిలో హేయమైన పనులు చేశారు,+ అందుకే వాళ్లను తొలగించడం అవసరమని నాకు అనిపించింది.+
51 “ ‘సమరయ+ కూడా నువ్వు చేసిన పాపాల్లో సగమైనా చేయలేదు. నువ్వు వాళ్లకన్నా ఎంత ఎక్కువగా హేయమైన పనులు చేస్తూ వచ్చావంటే, నీ హేయమైన పనులన్నిటి వల్ల నీ అక్కాచెల్లెళ్లు నీతిమంతుల్లా కనిపించారు.+ 52 నువ్వు ఇప్పుడు నీ అవమానాన్ని భరించాలి, ఎందుకంటే నువ్వు నీ అక్కాచెల్లెళ్ల ప్రవర్తనను సమర్థించావు. నువ్వు వాళ్లకన్నా అసహ్యంగా ప్రవర్తించి పాపం చేశావు కాబట్టి, వాళ్లు నీ కన్నా నీతిమంతులుగా ఉన్నారు. నీ అక్కాచెల్లెళ్లను నీతిమంతులుగా కనిపించేలా చేసినందుకు సిగ్గుపడు, అవమానం భరించు.’
53 “ ‘నేను వాళ్ల బందీలను అంటే సొదొమ బందీలను, ఆమె కూతుళ్ల బందీలను, సమరయ బందీలను, ఆమె కూతుళ్ల బందీలను సమకూరుస్తాను; వాళ్లతోపాటు నీ బందీలను కూడా సమకూరుస్తాను.+ 54 అలా నువ్వు నీ అవమానాన్ని భరిస్తావు; వాళ్లను ఓదార్చినందుకు సిగ్గుపడతావు. 55 నీ అక్కాచెల్లెళ్లు అంటే సొదొమ, సమరయ, వాళ్ల కూతుళ్లతో పాటు తమ పూర్వస్థితికి వస్తారు. నువ్వు, నీ కూతుళ్లు మీ పూర్వస్థితికి వస్తారు.+ 56 నువ్వు పొగరుబోతుగా తయారైన రోజున, నీ చెల్లెలు సొదొమ పేరును ఎత్తడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. 57 అప్పటికింకా నీ దుష్టత్వం వెల్లడి చేయబడలేదు.+ ఇప్పుడు సిరియా కూతుళ్లు, ఆమె పొరుగువాళ్లు, అలాగే ఫిలిష్తీయుల కూతుళ్లు+ నిన్ను నిందిస్తున్నారు; నీ చుట్టూ ఉన్న వాళ్లంతా నిన్ను హేళన చేస్తున్నారు. 58 నువ్వు నీ అశ్లీల ప్రవర్తన పర్యవసానాల్ని, నీ హేయమైన పనుల పర్యవసానాల్ని భరిస్తావు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
59 “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నేనిప్పుడు నువ్వు చేసినట్టే నీకు చేస్తాను,+ ఎందుకంటే నువ్వు నా ఒప్పందాన్ని మీరి నా ప్రమాణాన్ని నీచంగా చూశావు.+ 60 అయితే నేను, నీ యౌవనకాలంలో నీతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటాను, నేను నీతో ఒక శాశ్వత ఒప్పందం చేస్తాను.+ 61 నువ్వు నీ అక్కాచెల్లెళ్లను ఆహ్వానించేటప్పుడు నీ ప్రవర్తనను గుర్తుచేసుకొని సిగ్గుపడతావు;+ నేను వాళ్లను నీకు కూతుళ్లుగా ఇస్తాను, అయితే నీతో ఒప్పందం చేసినందువల్ల కాదు.’
62 “ ‘నేను నీతో నా ఒప్పందాన్ని స్థిరపరుస్తాను; అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. 63 నువ్వు ఇంత చేసినా నేను నీ కోసం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు,+ నువ్వు చేసింది గుర్తుచేసుకొని, నీ అవమానం వల్ల సిగ్గుతో నోరు కూడా తెరవవు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
17 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల గురించి ఒక పొడుపు కథ, సామెత చెప్పు.+ 3 నువ్వు ఇలా అనాలి: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, “పొడవైన పెద్దపెద్ద రెక్కలు, రంగురంగుల దట్టమైన ఈకలు ఉన్న ఒక గొప్ప గద్ద+ లెబానోనుకు వచ్చి,+ దేవదారు చెట్టు పైకొమ్మను పట్టుకుంది.+ 4 దాని చిటారుకొమ్మను తుంచి, వర్తకుల* దేశానికి తీసుకొచ్చి, వర్తకుల నగరంలో దాన్ని నాటింది.+ 5 తర్వాత అది ఆ దేశ విత్తనాల్లో కొన్ని తీసుకెళ్లి+ సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీళ్ల పక్కన నిరవంజి చెట్టులా* దాన్ని నాటింది. 6 అది చిగిర్చి, ద్రాక్షవల్లి అయ్యి నేలమీద పాకింది;+ దాని ఆకులు అక్కడక్కడే వ్యాపించాయి, దాని వేళ్లు దానికింద పెరిగాయి. అలా అది ఒక ద్రాక్షచెట్టు అయ్యి కొమ్మలు, రెమ్మలు వేసింది.+
7 “ ‘ “తర్వాత పొడవైన పెద్దపెద్ద రెక్కలు+ ఉన్న మరో గొప్ప గద్ద+ వచ్చింది. అప్పుడు ఆ ద్రాక్షచెట్టు తాను నాటబడిన చోటు నుండి దూరంగా ఆ పక్షి వైపు ఆత్రంగా తన వేళ్లను చాపింది, ఆ పక్షి తనను సాగుచేసేలా దానివైపు తన కొమ్మల్ని, ఆకుల్ని తిప్పింది.+ 8 ఆ ద్రాక్షవల్లి కొమ్మలు వేసి, ఫలించి, పెద్ద ద్రాక్షచెట్టు అయ్యేలా అది అప్పటికే నీళ్లు సమృద్ధిగా ఉన్న మంచి పొలంలో నాటబడింది.” ’+
9 “నువ్వు ఇలా చెప్పు: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, “అది వర్ధిల్లుతుందా? ఎవరో ఒకరు దాని వేళ్లను పెకిలించరా?+ అప్పుడు దాని పండ్లు కుళ్లిపోతాయి, దాని కొమ్మలు వాడిపోతాయి.+ అది ఎంతగా ఎండిపోతుందంటే, దాన్ని పీకేయడానికి ఎక్కువ బలం గానీ, ఎక్కువమంది మనుషులు గానీ అవసరం లేదు. 10 దాన్ని వేరే చోట నాటినా అది వర్ధిల్లుతుందా? తూర్పుగాలి వీచినప్పుడు అది పూర్తిగా ఎండిపోదా? అది నాటబడిన చోటే ఎండిపోతుంది.” ’ ”
11 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 12 “తిరుగుబాటుదారులైన ఈ ప్రజలతో దయచేసి ఇలా చెప్పు, ‘వీటి అర్థాన్ని మీరు గ్రహించారా? ఇదిగో! బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చి, దాని రాజును, అధిపతుల్ని తనతోపాటు బబులోనుకు తీసుకెళ్లాడు.+ 13 అంతేకాదు, అతను రాజవంశంలో ఒకతన్ని తీసుకుని,+ అతనితో ఒప్పందం చేసి, అతనితో ప్రమాణం చేయించాడు.+ తర్వాత ఆ దేశంలోని ప్రముఖుల్ని తీసుకెళ్లిపోయాడు.+ 14 రాజ్యం దీనస్థితికి వచ్చి మళ్లీ వృద్ధి అవ్వకుండా ఉండాలని, తన ఒప్పందానికి కట్టుబడివుండడం ద్వారా మాత్రమే దాని ఉనికిని కాపాడుకోవాలని అలా చేశాడు.+ 15 కానీ చివరికి ఆ రాజు బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.+ గుర్రాల కోసం, పెద్ద సైన్యం కోసం+ ఐగుప్తుకు* సందేశకుల్ని పంపించాడు.+ అతను వర్ధిల్లుతాడా? ఇలాంటి పనులు చేసే వ్యక్తి శిక్షను తప్పించుకుంటాడా? అతను ఒప్పందాన్ని మీరి కూడా తప్పించుకోగలుగుతాడా?’+
16 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, “నా జీవం తోడు, అతను బబులోనులోనే చనిపోతాడు; అంటే ఎవరైతే అతన్ని* రాజుగా చేశారో, ఎవరి ప్రమాణాన్ని అతను నీచంగా చూశాడో, ఎవరి ఒప్పందాన్ని మీరాడో ఆ రాజు* నివసించే స్థలంలోనే అతను చనిపోతాడు.+ 17 యుద్ధం జరిగేటప్పుడు, అంటే చాలామందిని చంపడానికి ముట్టడిదిబ్బలు వేసినప్పుడు, ముట్టడిగోడలు కట్టినప్పుడు ఫరో గొప్ప సైన్యం, అతని లెక్కలేనన్ని దండ్లు ఏమాత్రం సహాయం చేయలేవు.+ 18 అతను ప్రమాణాన్ని నీచంగా చూసి, ఒప్పందాన్ని మీరాడు. అతను మాట ఇచ్చి కూడా ఇవన్నీ చేశాడు కాబట్టి తప్పించుకోలేడు.” ’
19 “ ‘కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “అతను నా ప్రమాణాన్ని నీచంగా చూసి, నా ఒప్పందాన్ని మీరాడు కాబట్టి, నా జీవం తోడు, నేను ఆ పర్యవసానాల్ని అతని తల మీదికి రప్పిస్తాను.+ 20 నేను అతని మీదికి నా వల విసురుతాను, అతను దానిలో చిక్కుకుంటాడు.+ నేను అతన్ని బబులోనుకు తీసుకొచ్చి, అతను నాకు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి అక్కడే అతనికి తీర్పు తీరుస్తాను.+ 21 అతని సైనికుల్లో పారిపోతున్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, మిగిలినవాళ్లు అన్నివైపులకు* చెదిరిపోతారు.+ అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్పానని మీరు తెలుసుకుంటారు.” ’+
22 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను ఎత్తైన దేవదారు చెట్టు చిటారుకొమ్మను తీసి+ దాన్ని నాటతాను; దాని పైకొమ్మల నుండి ఒక లేత రెమ్మను తుంచి,+ నేనే దాన్ని ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీద నాటతాను.+ 23 నేను దాన్ని ఇశ్రాయేలు దేశంలోని ఒక గొప్ప పర్వతం మీద నాటతాను; అది కొమ్మలు వేసి, ఫలించి, గొప్ప దేవదారు చెట్టు అవుతుంది. అన్నిరకాల పక్షులు దానికింద నివసిస్తాయి, దాని కొమ్మల నీడలో గూళ్లు కట్టుకుంటాయి. 24 అప్పుడు, ఎత్తైన చెట్టును కింద పడేసింది, కింద ఉన్న చెట్టును హెచ్చించింది యెహోవానైన నేనే అని పొలంలోని చెట్లన్నీ తెలుసుకుంటాయి;+ నేను పచ్చని చెట్టును ఎండిపోజేశాను, ఎండిన చెట్టును చిగురింపజేశాను.+ యెహోవానైన నేను ఆ మాట చెప్పాను, దాన్ని నెరవేర్చాను.” ’ ”
18 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “ ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్లు పులిశాయి’ అని మీరు ఇశ్రాయేలు దేశంలో చెప్పుకుంటున్న సామెతకు+ అర్థం ఏమిటి?
3 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నా జీవం తోడు, ఇకమీదట మీరు ఇశ్రాయేలులో ఈ సామెత చెప్పుకోరు. 4 ఇదిగో! ప్రాణులందరూ* నా వశంలో ఉన్నారు. తండ్రులు, కుమారులు అందరూ నా వశంలో ఉన్నారు. ఏ వ్యక్తి* పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు.
5 “ ‘ఒక వ్యక్తి నీతిమంతుడై ఉండి న్యాయంగా, సరిగ్గా నడుచుకుంటున్నాడని అనుకోండి. 6 అతను పర్వతాల మీద విగ్రహాలకు+ అర్పించిన వాటిని తినడు; ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాల* వైపు చూడడు; తన పొరుగువాడి భార్యను అపవిత్రపర్చడు,+ రుతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోడు;+ 7 ఎవరికీ కీడు చేయడు,+ అతను అప్పు తీసుకున్నవాడు తాకట్టు పెట్టినదాన్ని తిరిగిచ్చేస్తాడు;+ అతను ఎవర్నీ దోచుకోడు,+ బదులుగా ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం,+ బట్టలులేని వాళ్లకు బట్టలు ఇస్తాడు;+ 8 అతను తన డబ్బును వడ్డీకి ఇవ్వడు, దానితో లాభం సంపాదించడు,+ అతను అన్యాయం చేయడు;+ నిష్పక్షపాతంగా న్యాయం చేస్తాడు;+ 9 అతను నా శాసనాల ప్రకారం నడుచుకుంటూ, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ నమ్మకంగా ప్రవర్తిస్తాడు. అలాంటి వ్యక్తి నీతిమంతుడు, అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.
10 “ ‘ఒకవేళ అతనికి ఒక కుమారుడు పుట్టి, వాడు దోచుకునేవాడు గానీ,+ హంతకుడు గానీ+ ఈ పనులన్నిట్లో ఏదైనా చేసేవాడు గానీ అయితే, 11 (అతని తండ్రి వీటిలో ఏ ఒక్కటీ చేయకపోయినా) అతను పర్వతాల మీద విగ్రహాలకు అర్పించిన వాటిని తింటాడు, తన పొరుగువాడి భార్యను అపవిత్రపరుస్తాడు, 12 అవసరంలో ఉన్నవాళ్లను, పేదవాళ్లను బాధిస్తాడు,+ దోచుకుంటాడు, తాకట్టు సొమ్మును తిరిగివ్వడు, అసహ్యమైన విగ్రహాల+ వైపు చూస్తాడు, అసహ్యమైన పనులు చేస్తాడు,+ 13 వడ్డీ వసూలు చేస్తూ లాభం సంపాదిస్తాడు;+ అప్పుడు ఆ కుమారుడు బ్రతకడు. అతను చేసిన ఈ అసహ్యమైన పనులన్నిటిని బట్టి అతను మరణశిక్ష పొందుతాడు. అతని చావుకు* అతనే బాధ్యుడు.
14 “ ‘ఒకవేళ ఒక వ్యక్తికి కుమారుడు ఉండి, అతను తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసినా, అతను అలాంటి పనులు చేయట్లేదు అనుకోండి. 15 అతను పర్వతాల మీద విగ్రహాలకు అర్పించిన వాటిని తినడు; ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాల వైపు చూడడు; తన పొరుగువాడి భార్యను అపవిత్రపర్చడు; 16 ఎవరికీ కీడు చేయడు, తాకట్టు పెట్టినదాన్ని లాక్కోడు; ఏదీ దోచుకోడు; ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం, బట్టలులేని వాళ్లకు బట్టలు ఇస్తాడు; 17 పేదవాళ్లను అణచివేయడు; తన డబ్బును వడ్డీకి ఇవ్వడు, దానితో లాభం సంపాదించడు; అతను నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుచుకుంటాడు. అలాంటి వ్యక్తి తన తండ్రి దోషాన్ని బట్టి చనిపోడు. అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు. 18 అయితే అతని తండ్రి మోసం చేస్తూ, తన సహోదరుణ్ణి దోచుకుంటూ, తన ప్రజల మధ్య చెడు చేశాడు కాబట్టి అతను తన దోషాన్ని బట్టి చనిపోతాడు.
19 “ ‘కానీ మీరు, “తండ్రి దోషాన్ని కుమారుడు ఎందుకు భరించడు?” అని అంటారు. కుమారుడు న్యాయంగా, నీతిగా నడుచుకున్నాడు; నా శాసనాలన్నీ పాటిస్తూ వాటి ప్రకారం జీవించాడు కాబట్టి అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు.+ 20 ఏ వ్యక్తి* పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు.+ తండ్రి దోషాన్ని కుమారుడు ఏమాత్రం భరించడు, కుమారుడి దోషాన్ని తండ్రి ఏమాత్రం భరించడు. నీతిమంతుడి నీతి అతనికే చెందుతుంది, దుష్టుని దుష్టత్వం అతనికే చెందుతుంది.+
21 “ ‘ఒకవేళ ఒక దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచిపెట్టి, నా శాసనాల్ని పాటిస్తూ న్యాయంగా, నీతిగా నడుచుకుంటే అతను ఖచ్చితంగా బ్రతికేవుంటాడు. అతను చనిపోడు.+ 22 అతను చేసిన దోషాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు.+ అతను నీతిగా నడుచుకుంటున్నందుకు ఖచ్చితంగా బ్రతికేవుంటాడు.’
23 “ ‘దుష్టుడు చనిపోవడం వల్ల నాకేమైనా సంతోషమా?’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు. ‘అతను తన మార్గాల నుండి పక్కకుమళ్లి, బ్రతకడమే నాకు ఇష్టం.’+
24 “ ‘అయితే ఒక నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి దుష్టులు చేసే అసహ్యమైన పనులన్నీ చేస్తూ చెడుగా ప్రవర్తిస్తే,* అతను బ్రతుకుతాడా? అతను చేసిన నీతికార్యాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు.+ తన అవిధేయతను బట్టి, తాను చేసిన పాపాల్ని బట్టి అతను చనిపోతాడు.+
25 “ ‘అయితే మీరు, “యెహోవా మార్గం సరిగ్గా లేదు” అని అంటారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, దయచేసి వినండి! నా మార్గం సరిగ్గా లేదా?+ మీ మార్గాలే కదా సరిగ్గా లేనిది?+
26 “ ‘నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి తప్పులు చేసి వాటివల్ల చనిపోతే, అతను చనిపోవడానికి అతని తప్పులే కారణం.
27 “ ‘అయితే దుష్టుడు తాను చేసిన దుష్టత్వాన్ని విడిచిపెట్టి న్యాయంగా, నీతిగా నడుచుకోవడం మొదలుపెడితే, అతను తన ప్రాణాన్ని* కాపాడుకుంటాడు.+ 28 అతను తాను తప్పు చేస్తున్నానని గ్రహించి, తన అపరాధాలన్నిటినీ విడిచిపెడితే ఖచ్చితంగా బ్రతికేవుంటాడు. అతను చనిపోడు.
29 “ ‘అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు, “యెహోవా మార్గం సరిగ్గా లేదు” అని అంటారు. ఇశ్రాయేలు ఇంటివాళ్లారా! నా మార్గాలు సరిగ్గా లేవా?+ మీ మార్గాలే కదా సరిగ్గా లేనిది?’
30 “ ‘కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీలో ప్రతీ ఒక్కరికి మీ మీ మార్గాల్ని బట్టి తీర్పు తీరుస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. ‘తిరిగిరండి, మీ అపరాధాలన్నీ విడిచిపెట్టి తిరిగిరండి, అప్పుడు అవి అడ్డురాయిగా తయారై, మీ మీదికి దోషం తీసుకురాకుండా ఉంటాయి. 31 మీరు చేసిన అపరాధాలన్నీ విడిచిపెట్టి,+ కొత్త హృదయాన్ని, కొత్త మనోవైఖరిని సంపాదించుకోండి;+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఎందుకు చనిపోవాలి?’+
32 “ ‘ఏ ఒక్కరైనా చనిపోవడం నాకు అస్సలు ఇష్టంలేదు,+ కాబట్టి తిరిగొచ్చి బ్రతకండి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
19 “ఇశ్రాయేలు ప్రధానుల గురించి నువ్వు శోకగీతం పాడుతూ 2 ఇలా అను:
‘మీ అమ్మ ఎలాంటిది? ఆమె సింహాల మధ్య ఆడసింహం లాంటిది.
ఆమె బలమైన కొదమ సింహాల మధ్య పడుకుంది, అక్కడే తన పిల్లల్ని పెంచింది.
3 ఆమె పెంచిన పిల్లల్లో ఒకటి బలమైన కొదమ సింహం అయింది.+
అది వేటాడడం నేర్చుకుని,
చివరికి మనుషుల్ని కూడా మింగేసింది.
4 జనాలు దాని గురించి విని, దాన్ని తమ గోతిలో చిక్కించుకున్నాయి,
దానికి కొక్కేలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లాయి.+
5 దాని తల్లి దానికోసం ఎదురుచూసీ చూసీ, అది ఇక రాదని గ్రహించి,
తన పిల్లల్లో ఇంకొకదాన్ని తీసుకొని, దాన్ని బలమైన కొదమ సింహంలా తయారుచేసింది.
6 అది కూడా సింహాల మధ్య తిరుగుతూ, బలమైన కొదమ సింహం అయింది.
అది వేటాడడం నేర్చుకుని చివరికి మనుషుల్ని కూడా మింగేసింది.+
7 అది వాళ్ల పటిష్ఠమైన బురుజుల మధ్య తిరుగుతూ వాళ్ల నగరాల్ని నాశనం చేసింది,
అలా నిర్జనమైన ఆ దేశమంతా దాని గర్జనతో నిండిపోయింది.+
8 చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు దానిమీదికి వచ్చి తమ వలను విసిరాయి,
అది వాళ్ల గోతిలో చిక్కింది.
9 వాళ్లు దానికి కొక్కేలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకెళ్లారు.
అక్కడ దాన్ని బంధించి, ఇశ్రాయేలు పర్వతాల మీద ఇక దాని స్వరం వినిపించకుండా చేశారు.
10 మీ అమ్మ, నీళ్ల పక్కన నాటబడిన ద్రాక్షవల్లిలా* ఉండేది.+
నీళ్లు సమృద్ధిగా ఉండడంవల్ల అది ఫలించింది, దాని నిండా తీగలు వచ్చాయి.
11 దానికి బలమైన కొమ్మలు వచ్చాయి, అవి పాలకుల రాజదండాలకు తగినవి.
అది పెరిగి మిగతా చెట్లకన్నా ఎత్తుగా ఎదిగింది,
అది ఎత్తుగా ఉండడం వల్ల, దానికి విస్తారమైన ఆకులు, కొమ్మలు ఉండడం వల్ల దూరం నుండి కూడా కనిపించేది.
12 అయితే అది, కోపంతో పెకిలించబడి+ నేలమీదికి విసిరేయబడింది,
దాని పండ్లు తూర్పు గాలికి వాడిపోయాయి.
దాని బలమైన కొమ్మలు తెగిపోయి, ఎండిపోయాయి;+ అగ్ని వాటిని కాల్చేసింది.+
13 ఇప్పుడు అది ఎడారిలో
నీళ్లులేని, ఎండిపోయిన దేశంలో నాటబడింది.+
14 దాని కొమ్మల నుండి అగ్ని వ్యాపించి, దాని రెమ్మల్ని, పండ్లను కాల్చేసింది;
ఒక్క బలమైన కొమ్మ గానీ, పరిపాలించడం కోసం రాజదండం గానీ మిగల్లేదు.+
“ ‘ఇది శోకగీతం, ఇది శోకగీతంలా వాడుకలోకి వస్తుంది.’ ”
20 ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజున కొంతమంది ఇశ్రాయేలు పెద్దలు యెహోవా దగ్గర విచారణ చేయడానికి నా దగ్గరికి వచ్చి నా ముందు కూర్చున్నారు. 2 అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 3 “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు నా దగ్గరికి విచారణ చేయడానికి వచ్చారా? ‘నా జీవం తోడు, నేను మీకు జవాబు ఇవ్వను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” ’
4 “వాళ్లకు తీర్పు తీర్చడానికి* నువ్వు సిద్ధంగా ఉన్నావా? మానవ కుమారుడా, వాళ్లకు తీర్పు తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాళ్ల పూర్వీకులు చేసిన హేయమైన పనుల్ని వాళ్లకు తెలియజేయి.+ 5 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలును ఎంచుకున్న రోజున,+ యాకోబు ఇంటివాళ్ల సంతానంతో* ఒక ప్రమాణం చేశాను; ఐగుప్తు దేశంలో నన్ను నేను వాళ్లకు వెల్లడిచేసుకున్నాను.+ అవును, ‘నేను మీ దేవుడైన యెహోవాను’ అంటూ వాళ్లతో ప్రమాణం చేశాను. 6 వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి, నేను వాళ్లకోసం వెదికిపెట్టిన* దేశానికి, అంటే పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాళ్లను తీసుకొస్తానని ఆ రోజు వాళ్లకు ప్రమాణం చేశాను.+ అది దేశాలన్నిట్లో అతి సుందరమైన దేశం.* 7 అప్పుడు నేను వాళ్లకు ఇలా చెప్పాను, ‘మీలో ప్రతి ఒక్కరూ మీ కళ్ల ముందున్న హేయమైనవాటిని తీసిపారేయండి; ఐగుప్తు అసహ్యమైన విగ్రహాలతో* మిమ్మల్ని అపవిత్రపర్చుకోకండి.+ నేను మీ దేవుడైన యెహోవాను.’+
8 “ ‘ “కానీ వాళ్లు నాకు ఎదురుతిరిగారు, నా మాట వినడానికి ఇష్టపడలేదు. తమ కళ్ల ముందున్న అసహ్యమైనవాటిని తీసిపారేయలేదు, ఐగుప్తు హేయమైన విగ్రహాల్ని విడిచిపెట్టలేదు.+ కాబట్టి ఐగుప్తు దేశంలో వాళ్లమీద నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తానని, నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కుతానని నేను చెప్పాను. 9 అయితే వాళ్లు ఎవరి మధ్య నివసిస్తున్నారో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ ఎందుకంటే నేను వాళ్లను* ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ జనాల ముందు నన్ను నేను వాళ్లకు* వెల్లడిచేసుకున్నాను.+ 10 కాబట్టి నేను వాళ్లను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చి ఎడారిలోకి నడిపించాను.+
11 “ ‘ “తర్వాత నేను వాళ్లకు నా శాసనాల్ని ఇచ్చాను, నా న్యాయనిర్ణయాల్ని తెలియజేశాను;+ ఎందుకంటే వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు.+ 12 అంతేకాదు, యెహోవానైన నేనే వాళ్లను పవిత్రపరుస్తున్నానని వాళ్లు తెలుసుకునేలా నాకూ వాళ్లకూ మధ్య సూచనగా విశ్రాంతి రోజుల్ని*+ కూడా వాళ్లకు ఇచ్చాను.+
13 “ ‘ “అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఎడారిలో నాకు ఎదురుతిరిగారు.+ వాళ్లు నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు; నిజానికి వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు. వాళ్లు నా విశ్రాంతి రోజుల్ని ఘోరంగా అపవిత్రపర్చారు. కాబట్టి ఎడారిలో వాళ్లమీద నా ఉగ్రతను కుమ్మరించి వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తానని అన్నాను.+ 14 కానీ, నేను ఎవరి కళ్లముందు వాళ్లను* బయటికి తీసుకొచ్చానో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ 15 అంతేకాదు, నేను వాళ్లకు ఇచ్చిన దేశానికి, అంటే దేశాలన్నిట్లో అతి సుందరమైన* దేశానికి, పాలుతేనెలు ప్రవహించే దేశానికి+ వాళ్లను తీసుకెళ్లనని ఎడారిలో వాళ్లతో ప్రమాణం చేశాను.+ 16 ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు, నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు; ఎందుకంటే వాళ్ల మనసు తమ అసహ్యమైన విగ్రహాల పైనే ఉంది.+
17 “ ‘ “అయితే నేను* వాళ్లమీద జాలిపడ్డాను, అందుకే వాళ్లను నాశనం చేయలేదు; ఎడారిలో వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేయలేదు. 18 ఎడారిలో నేను వాళ్ల పిల్లలతో+ ఇలా చెప్పాను, ‘మీ పూర్వీకుల కట్టుబాట్ల ప్రకారం నడుచుకోకండి,+ వాళ్ల న్యాయనిర్ణయాల్ని పాటించకండి, వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. 19 నేను మీ దేవుడైన యెహోవాను. నా శాసనాల్ని అనుసరించండి, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ వాటి ప్రకారం జీవించండి.+ 20 నా విశ్రాంతి రోజుల్ని పవిత్రంగా ఎంచండి,+ నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి నాకూ మీకూ మధ్య సూచనగా ఉంటాయి.’+
21 “ ‘ “కానీ వాళ్ల పిల్లలు కూడా నాకు ఎదురుతిరగడం మొదలుపెట్టారు.+ వాళ్లు నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు, వాటి ప్రకారం జీవించలేదు; నిజానికి వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు. వాళ్లు నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు. కాబట్టి ఎడారిలో వాళ్లమీద నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తానని, నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కుతానని చెప్పాను.+ 22 కానీ నేను అలా చేయలేదు;+ నేను ఎవరి కళ్లముందు వాళ్లను* బయటికి తీసుకొచ్చానో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ 23 అంతేకాదు, నేను వాళ్లను జనాల మధ్యకు చెదరగొడతానని, దేశాల మధ్యకు వెళ్లగొడతానని ఎడారిలో వాళ్లతో ప్రమాణం చేశాను.+ 24 ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు, నా శాసనాల్ని తిరస్కరించారు,+ నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు, తమ పూర్వీకుల అసహ్యమైన విగ్రహాల్ని అనుసరించారు.+ 25 అంతేకాదు, నేను వాళ్లను మంచివికాని కట్టుబాట్లను, జీవాన్ని ఇవ్వలేని న్యాయనిర్ణయాల్ని అనుసరించనిచ్చాను.+ 26 తమ బలుల ద్వారా, అంటే తమ మొదటి సంతానాన్ని అగ్నిలో వేసి కాల్చడం* ద్వారా+ వాళ్లను అపవిత్రం కానిచ్చాను; నేను యెహోవానని వాళ్లు తెలుసుకునేలా వాళ్లను నాశనం చేయడానికి అలా జరగనిచ్చాను.” ’
27 “కాబట్టి మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ పూర్వీకులు కూడా ఇదే విధంగా, నాపట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తించడం ద్వారా నన్ను దూషించారు. 28 నేను వాళ్లకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి వాళ్లను తీసుకొచ్చాను.+ అయితే వాళ్లు ప్రతీ ఎత్తైన కొండను, ప్రతీ పచ్చని చెట్టును+ చూసి బలులు, అర్పణలు అర్పించడం మొదలుపెట్టి నాకు కోపం తెప్పించారు. వాళ్లు అక్కడ తమ బలుల ఇంపైన* సువాసనల్ని, పానీయార్పణల్ని అర్పించారు. 29 కాబట్టి నేను వాళ్లను ఇలా అడిగాను: ‘మీరు ఈ ఉన్నత స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? (అది ఈ రోజు వరకు ఉన్నత స్థలం అని పిలవబడుతోంది.)’ ” ’+
30 “ఇప్పుడు ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ పూర్వీకుల అసహ్యమైన విగ్రహాల్ని పూజించడానికి* వాటి వెంట వెళ్తూ వాళ్లలాగే+ మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? 31 మీ అసహ్యమైన విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ, మీ పిల్లల్ని అగ్నిలో వేసి కాలుస్తూ,*+ మీరు ఈ రోజు వరకు మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఇలా చేస్తున్నా, మీరు విచారణ చేసినప్పుడు నేను జవాబివ్వాలా?” ’+
“ ‘నా జీవం తోడు, నేను మీకు జవాబివ్వను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.+ 32 ‘మీరు మీ మనసుల్లో, “మనం చెక్కలనూ రాళ్లనూ పూజించే జనాల్లా, వేరే దేశాల ప్రజల్లా తయారౌదాం” అని అనుకుంటున్నారు కదా?+ అది ఎప్పటికీ జరగదు.’ ”
33 “ ‘నా జీవం తోడు, నేను బలమైన చేతితో, చాచిన బాహువుతో, కోపాన్ని కుమ్మరిస్తూ+ మీ మీద రాజుగా పరిపాలిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 34 ‘నేను మిమ్మల్ని ఆయా జనాల మధ్య నుండి బయటికి తీసుకొస్తాను, మీరు చెదిరిపోయిన దేశాల మధ్య నుండి మిమ్మల్ని బలమైన చేతితో, చాచిన బాహువుతో, కోపాన్ని కుమ్మరిస్తూ సమకూరుస్తాను.+ 35 మిమ్మల్ని జనాల ఎడారిలోకి తీసుకొచ్చి అక్కడ ముఖాముఖిగా మీతో వాదిస్తాను.+
36 “ ‘నేను ఐగుప్తు దేశ ఎడారిలో మీ పూర్వీకులతో వాదించినట్టే మీతో కూడా వాదిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 37 ‘మిమ్మల్ని కాపరి కర్ర కింద నుండి వెళ్లేలా చేసి,+ మిమ్మల్ని ఒప్పందం కిందికి తెస్తాను. 38 అయితే మీలో నుండి తిరుగుబాటుదారుల్ని, నాకు వ్యతిరేకంగా పాపం చేసేవాళ్లను తీసేస్తాను.+ తాము పరదేశులుగా నివసిస్తున్న దేశం నుండి వాళ్లను బయటికి రప్పిస్తాను, కానీ వాళ్లు ఇశ్రాయేలు దేశంలో అడుగుపెట్టరు;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’
39 “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీలో ప్రతి ఒక్కరూ వెళ్లి, మీ అసహ్యమైన విగ్రహాల్ని పూజించుకోండి.+ కానీ ఆ తర్వాత మీరు నా మాట వినకపోతే, ఇకమీదట మీ బలుల ద్వారా, మీ అసహ్యమైన విగ్రహాల ద్వారా మీరు నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చలేరు.’+
40 “ ‘ఎందుకంటే, నా పవిత్ర పర్వతం మీద, అంటే ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతం+ మీద ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ దేశంలో నన్ను సేవిస్తారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. ‘అక్కడ నేను వాళ్లను బట్టి సంతోషిస్తాను; మీ కానుకల్ని, మీ అర్పణల్లోని ప్రథమఫలాల్ని, మీ పవిత్రమైన వాటన్నిటినీ స్వీకరిస్తాను.+ 41 నేను మిమ్మల్ని ఆయా జనాల మధ్య నుండి బయటికి తీసుకొచ్చి, మీరు చెదిరిపోయిన దేశాల మధ్య నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు+ మీ బలుల ఇంపైన* సువాసనను బట్టి నేను మీ విషయంలో సంతోషిస్తాను; జనాల కళ్లముందు, మీ మధ్య నన్ను నేను పవిత్రపర్చుకుంటాను.’+
42 “ ‘నేను మిమ్మల్ని ఇశ్రాయేలు దేశంలోకి అంటే మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి తీసుకొచ్చినప్పుడు+ నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 43 అక్కడ మీరు మీ ప్రవర్తనను, మిమ్మల్ని అపవిత్రపర్చిన మీ పనుల్ని గుర్తుచేసుకుంటారు,+ మీరు చేసిన చెడ్డ పనులన్నిటిని బట్టి మీ మీద మీకే అసహ్యం వేస్తుంది.+ 44 ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ దుష్ట ప్రవర్తన బట్టో, మీ తప్పుడు పనుల బట్టో కాకుండా, నా పేరు కోసం నేను చర్య తీసుకున్నప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”+
45 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 46 “మానవ కుమారుడా, దక్షిణ భాగం వైపు తిరిగి, దక్షిణం వైపు ప్రకటించు; దక్షిణం వైపున్న అడవి ప్రాంతానికి ప్రవచించు. 47 దక్షిణం వైపున్న అడవితో ఇలా అను, ‘యెహోవా చెప్పేది విను. సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను నీలో అగ్ని రాజేస్తున్నాను,+ అది నీలో ఉన్న ప్రతీ పచ్చని చెట్టును, ఎండిన చెట్టును దహించేస్తుంది. ఆ మంటలు ఆరిపోవు,+ దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు వరకు ప్రతి ఒక్కరికీ ఆ సెగ తగులుతుంది. 48 యెహోవానైన నేనే దానికి ఆరిపోని నిప్పు అంటించానని మనుషులందరూ తెలుసుకుంటారు.” ’ ”+
49 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! వాళ్లు నా గురించి, ‘ఇతను పొడుపు కథలు చెప్తున్నాడు’ అని మాట్లాడుకుంటున్నారు.”
21 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, యెరూషలేము వైపు తిరిగి, పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా ప్రకటించు, ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ప్రవచించు. 3 ఇశ్రాయేలు దేశంతో ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నా ఖడ్గాన్ని ఒరలో నుండి తీసి,+ నీలో ఉన్న నీతిమంతుల్నీ దుష్టుల్నీ చంపేస్తాను. 4 నేను నీలో ఉన్న నీతిమంతుల్నీ దుష్టుల్నీ చంపేస్తాను కాబట్టి దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు మనుషులందర్నీ చంపడానికి నా ఖడ్గం ఒరలో నుండి తీయబడుతుంది. 5 యెహోవానైన నేను నా ఖడ్గాన్ని ఒరలో నుండి తీశానని ప్రజలందరూ తెలుసుకుంటారు. అది మళ్లీ ఒరలోకి వెళ్లదు.” ’+
6 “మానవ కుమారుడా, నువ్వు వణుకుతూ నిట్టూర్చు; అవును, వాళ్ల ముందు విపరీతంగా నిట్టూర్చు.+ 7 ‘నువ్వు ఎందుకు నిట్టూరుస్తున్నావు?’ అని వాళ్లు నిన్ను అడిగితే, ‘ఒక వార్తను బట్టి నిట్టూరుస్తున్నాను’ అని చెప్పు. ఎందుకంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, భయంతో ప్రతీ గుండె నీరుగారిపోతుంది, ప్రతీ చెయ్యి చచ్చుబడిపోతుంది, ప్రతీ హృదయం కృంగిపోతుంది, ప్రతీ మోకాలు మీదుగా నీళ్లు కారతాయి.*+ ‘ఇదిగో! అది తప్పకుండా వస్తుంది, జరిగి తీరుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
8 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 9 “మానవ కుమారుడా, ఇలా ప్రవచించు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నువ్వు ఇలా చెప్పు, ‘ఇదిగో ఒక ఖడ్గం! ఒక ఖడ్గం+ పదునుచేయబడి, మెరుగుపెట్టబడింది. 10 అది ఘోరంగా హతం చేయడానికి పదునుపెట్టబడింది; మెరుపులా మెరవడానికి మెరుగుపెట్టబడింది.’ ” ’ ”
“మనం సంతోషించాలి కదా?”
“ ‘ప్రతీ కర్రను* తిరస్కరించినట్టు, అది* నా కుమారుడి రాజదండాన్ని+ కూడా తిరస్కరిస్తుందా?
11 “ ‘చేతితో పట్టుకునేలా దాన్ని మెరుగుపెట్టడానికి ఇచ్చారు. హతం చేసే వ్యక్తి చేతిలో పెట్టడం కోసం ఆ ఖడ్గానికి పదునుపెట్టారు, మెరుగుపెట్టారు.+
12 “ ‘మానవ కుమారుడా, కేకలు వేస్తూ ఏడువు,+ ఎందుకంటే అది నా ప్రజల మీదికి వచ్చింది; అది ఇశ్రాయేలు ప్రధానులందర్నీ చంపుతుంది.+ నా ప్రజలతో పాటు వాళ్లు కూడా ఖడ్గం బారినపడతారు. కాబట్టి దుఃఖంతో తొడ చరుచుకో. 13 ఎందుకంటే ఖడ్గాన్ని పరీక్షించడం జరిగింది,+ ఆ ఖడ్గం రాజదండాన్ని తిరస్కరిస్తే ఏమౌతుంది? ఆ దండం లేకుండా పోతుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
14 “మానవ కుమారుడా, ప్రవచించు; నీ చేతులు చరుచుకొని, ‘ఒక ఖడ్గం!’ అని మూడుసార్లు అను. అది హతం చేసే ఖడ్గం, ఘోరంగా హతం చేసే ఖడ్గం, అన్నివైపులా సంహరించే ఖడ్గం.+ 15 వాళ్ల గుండెలు భయంతో నీరుగారిపోతాయి,+ చాలామంది తమ నగర ద్వారాల దగ్గర కూలతారు; నేను ఖడ్గంతో హతం చేస్తాను. అవును, అది మెరుపులా మెరుస్తుంది, హతం చేయడానికి మెరుగుపెట్టబడింది! 16 ఖడ్గమా, కుడివైపు నరుకు! ఎడమవైపుకు తిరుగు! నీ అంచు ఎటు ఉంటే అటు వెళ్లు! 17 నేను కూడా నా చేతులు చరుచుకుంటాను, నా ఆగ్రహం చల్లారుతుంది.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.”
18 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 19 “మానవ కుమారుడా, బబులోను రాజు ఖడ్గం రావడానికి రెండు దారులు గీయి. రెండు దారులూ ఒకే దేశం నుండి మొదలవ్వాలి. అవి రెండూ రెండు నగరాలకు వెళ్తాయి, అవి విడిపోయే చోట ఒక దారిగుర్తు పెట్టు. 20 ఖడ్గం కోసం నువ్వు అమ్మోనీయుల రబ్బాకు ఒక దారి,+ యూదాలోని ప్రాకారాలుగల యెరూషలేముకు+ ఒక దారి గీయి. 21 ఎందుకంటే, బబులోను రాజు ఆ రెండు దారులు విడిపోయే చోట ఆగి శకునం చూస్తాడు. బాణాల్ని అటూఇటూ ఆడిస్తాడు. తన విగ్రహాల* దగ్గర విచారణ చేస్తాడు; జంతు కాలేయాన్ని పరిశీలిస్తాడు. 22 అతని కుడిచేతిలోని శకునం యెరూషలేము వైపు చూపిస్తుంది; యుద్ధ యంత్రాలు నిలబెట్టమని, హతం చేయమనే ఆజ్ఞ ఇవ్వమని, యుద్ధకేక వినిపించమని, ద్వారాల ఎదురుగా యుద్ధ యంత్రాలు ఉంచమని, ముట్టడిదిబ్బ నిలబెట్టమని, ముట్టడిగోడ కట్టమని+ అది సూచిస్తుంది. 23 అయితే వాళ్లతో ప్రమాణాలు చేసుకున్నవాళ్లకు*+ అది తప్పుడు శకునంలా కనిపిస్తుంది. కానీ అతను వాళ్ల దోషాన్ని గుర్తుచేసుకుని, వాళ్లను పట్టుకుంటాడు.+
24 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘మీరు మీ అపరాధాల్ని బట్టబయలు చేసుకున్నారు, మీ పనులన్నిట్లో మీ పాపాలు కనబడేలా చేశారు; అలా మీరు మీ దోషాన్ని గుర్తుచేసుకునేలా చేశారు. ఇప్పుడు మీరు గుర్తుచేసుకోబడ్డారు కాబట్టి మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తారు.’
25 “తీవ్రంగా గాయపడ్డ ఇశ్రాయేలు దుష్ట ప్రధానుడా,+ నీ రోజు వచ్చేసింది, నీ చివరి శిక్షకు సమయం వచ్చేసింది. 26 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘తలపాగా తీసి పక్కనపెట్టు, కిరీటం తీసేయి.+ ఇప్పుడున్నట్టు ఇక ముందు ఉండదు.+ కింద ఉన్నవాణ్ణి* హెచ్చించు,+ పైన ఉన్నవాణ్ణి కిందికి దించు.+ 27 నేను దాన్ని పడదోస్తాను, పడదోస్తాను, పడదోస్తాను. చట్టబద్ధమైన హక్కుదారుడు* వచ్చే వరకు అది ఎవరికీ చెందదు,+ అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.’+
28 “మానవ కుమారుడా, నువ్వు ఇలా ప్రవచించు, ‘అమ్మోనీయుల గురించి, వాళ్లు చేసిన అవమానాల గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. ఖడ్గం! హతం చేయడానికి ఒక ఖడ్గం దూయబడి ఉంది. అది మెరుపులా మెరవడానికి, చంపడానికి మెరుగుపెట్టబడింది. 29 నీ గురించి అబద్ధ దర్శనాలు చూశారు, తప్పుడు సోదె చెప్పారు; అయినాసరే నువ్వు చంపబడినవాళ్ల మీద, అంటే తమ రోజు, తమ చివరి శిక్షా సమయం వచ్చిన దుష్టులమీద కుప్పగా వేయబడతావు. 30 ఖడ్గం దాని ఒరలోకి తిరిగెళ్లాలి. నువ్వు సృష్టించబడిన స్థలంలోనే, నువ్వు పుట్టిన దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను. 31 నా ఉగ్రత నీమీద కుమ్మరిస్తాను. నా కోపాగ్ని నీమీద వెళ్లగక్కుతాను, నాశనం చేయడంలో ఆరితేరిన కిరాతకుల చేతికి నిన్ను అప్పగిస్తాను.+ 32 నువ్వు నిప్పుకు కట్టె అవుతావు;+ దేశంలో నీ రక్తం చిందించబడుతుంది, ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోబడవు; యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.’ ”
22 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, రక్తపాతంతో నిండిన నగరానికి+ తీర్పు ప్రకటించడానికి, దాని అసహ్యమైన పనులన్నిటినీ+ దానికి తెలియజేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 3 నువ్వు ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “రక్తపాతంతో నిండిన నగరమా, అసహ్యమైన విగ్రహాలతో* అపవిత్రమైన నగరమా,+ నీ సమయం వస్తోంది.+ 4 నీ రక్తపాతం వల్ల నువ్వు దోషివి అయ్యావు,+ నీ అసహ్యమైన విగ్రహాల వల్ల అపవిత్రం అయ్యావు.+ నువ్వు నీ ఆయుష్షును తగ్గించుకున్నావు, నీ అంతం వచ్చేసింది. అందుకే నిన్ను జనాలకు నిందగా, దేశాలన్నిటికీ ఎగతాళిగా చేస్తాను.+ 5 అపవిత్రమైన పేరుగల నగరమా, అల్లరితో నిండిన నగరమా, దగ్గరగా ఉన్నవాళ్లు, దూరంగా ఉన్నవాళ్లు నిన్ను హేళన చేస్తారు. 6 ఇదిగో! నీలో ఉన్న ఇశ్రాయేలు ప్రధానుల్లో ప్రతీ ఒక్కరు తమ అధికారాన్ని రక్తం చిందించడానికి ఉపయోగిస్తున్నారు.+ 7 నీలో ప్రజలు తమ తండ్రిని, తల్లిని నీచంగా చూస్తున్నారు.+ పరదేశిని మోసం చేస్తున్నారు, తండ్రిలేని పిల్లవాణ్ణి,* విధవరాలిని బాధిస్తున్నారు.” ’ ”+
8 “ ‘నా పవిత్ర స్థలాన్ని నీచంగా చూస్తున్నారు, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపరుస్తున్నారు.+ 9 రక్తం చిందించడానికి లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు+ నీలో ఉన్నారు. పర్వతాల మీద బలి ఇచ్చిన వాటిని తినేవాళ్లు, అసభ్యమైన పనులు చేసేవాళ్లు+ నీ మధ్య ఉన్నారు. 10 తమ తండ్రి భార్యతో పడుకునేవాళ్లు,*+ రుతుస్రావం వల్ల అపవిత్రమైన స్త్రీతో పడుకునేవాళ్లు+ నీ మధ్య ఉన్నారు. 11 నీలో, ఒకడు తన పొరుగువాడి భార్యతో అసహ్యమైన పనులు చేస్తాడు,+ ఇంకొకడు తన కోడలితో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను అపవిత్రపరుస్తాడు,+ మరొకడు స్వయాన తన తండ్రికి పుట్టిన తన సహోదరిని చెరుస్తాడు.+ 12 రక్తం చిందించడానికి లంచం తీసుకునేవాళ్లు నీలో ఉన్నారు.+ నువ్వు వడ్డీ కోసం, లాభం* కోసం అప్పిస్తావు,+ నీ పొరుగువాళ్లను దోచుకుంటావు.+ అవును, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
13 “ ‘ఇదిగో! నీ అక్రమ సంపాదనను బట్టి, నీలో జరిగిన రక్తపాతాన్ని బట్టి నేను అసహ్యంతో చేతులు చరుచుకుంటున్నాను. 14 నేను నీ మీద చర్య తీసుకున్నప్పుడు నీ గుండె నిబ్బరంగా ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా?+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను, నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. 15 నేను నిన్ను జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను,+ నీ అపవిత్రత అంతమయ్యేలా చేస్తాను.+ 16 నువ్వు జనాల ఎదుట అవమానాలపాలు అవుతావు, అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’ ”+
17 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లు నా దృష్టికి పనికిరాని మష్టులా తయారయ్యారు. వాళ్లందరూ కొలిమిలో ఉన్న రాగి, తగరం, ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్లు వెండి మష్టులా తయారయ్యారు.+
19 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘మీరంతా పనికిరాని మష్టులా తయారయ్యారు+ కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము లోపల సమకూరుస్తున్నాను. 20 వెండిని, రాగిని, ఇనుమును, సీసాన్ని, తగరాన్ని కొలిమిలో పోగుచేసి, వాటిమీద నిప్పు రగిలించి వాటిని కరిగించినట్టే, నేను కోపంతో, ఉగ్రతతో మిమ్మల్ని సమకూర్చి, మీ మీద అగ్ని ఊది మిమ్మల్ని కరిగిస్తాను.+ 21 మిమ్మల్ని పోగుచేసి మీ మీద నా కోపాగ్నిని ఊదుతాను,+ మీరు మీ నగరం లోపల కరిగిపోతారు.+ 22 వెండిని కొలిమిలో వేసి కరిగించినట్టు, మీరు దాని లోపల కరిగించబడతారు; అప్పుడు, యెహోవానైన నేను నా ఉగ్రతను మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.’ ”
23 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 24 “మానవ కుమారుడా, దానితో ఇలా చెప్పు, ‘నువ్వు శుభ్రంకాని దేశానివి, ఉగ్రత రోజున నీ మీద వర్షం కురవదు. 25 గర్జించే సింహం జంతువును చీల్చేసినట్టు+ దాని ప్రవక్తలు దాని మధ్య కుట్రలు పన్నుతున్నారు.+ వాళ్లు ప్రజల్ని మింగేస్తున్నారు. వాళ్లు సంపదను, విలువైనవాటిని లాక్కుంటున్నారు. వాళ్లు దానిలో చాలామందిని విధవరాళ్లుగా చేశారు. 26 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని మీరారు,+ వాళ్లు నా పవిత్ర స్థలాల్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు.+ వాళ్లు పవిత్రమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా చూడరు; ఏవి అశుద్ధమైనవో, ఏవి శుద్ధమైనవో ప్రజలకు తెలియజేయరు;+ నా విశ్రాంతి రోజుల్ని పాటించడం వాళ్లకు ఇష్టంలేదు, వాళ్ల మధ్య నేను అపవిత్రపర్చబడుతున్నాను. 27 దానిలోని అధిపతులు జంతువుల్ని చీల్చేసే తోడేళ్ల లాంటివాళ్లు; వాళ్లు అక్రమ లాభం కోసం రక్తం చిందిస్తారు, ప్రజల్ని చంపేస్తారు.+ 28 దాని ప్రవక్తలేమో వాళ్ల పనులమీద సున్నం పూసి కప్పేస్తారు. వాళ్లు అబద్ధపు దర్శనాలు చూస్తారు, తప్పుడు సోదె చెప్తారు;+ యెహోవా ఏమీ చెప్పకపోయినా, “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు” అని వాళ్లు అంటారు. 29 ప్రజలు మోసం చేశారు, దోచుకున్నారు;+ అవసరంలో ఉన్నవాళ్లను, పేదవాళ్లను బాధపెట్టారు; పరదేశుల్ని మోసం చేసి వాళ్లకు న్యాయం జరగకుండా చేశారు.’
30 “ ‘దేశం నాశనం కాకుండా రాతిగోడను బాగుచేసేవాడు గానీ, దాని తరఫున నా ముందు గోడబీటలో నిలబడేవాడు గానీ వాళ్లమధ్య ఉన్నాడేమో అని నేను వెతుకుతూ వచ్చాను,+ కానీ అలాంటివాళ్లు ఒక్కరు కూడా కనిపించలేదు. 31 కాబట్టి నా ఉగ్రతను వాళ్లమీద కుమ్మరించి, నా కోపాగ్నితో వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. వాళ్ల మార్గాల పర్యవసానాల్ని వాళ్ల తలల మీదికే రప్పిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”
23 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు ఉండేవాళ్లు.+ 3 వాళ్లు ఐగుప్తులో వేశ్యలు అయ్యారు;+ తమ యౌవనకాలం నుండి వాళ్లు వేశ్యల్లా ప్రవర్తిస్తూ వచ్చారు. అక్కడ వాళ్ల రొమ్ముల్ని నొక్కారు, వాళ్ల కన్యాత్వపు రొమ్ముల్ని నలిపారు. 4 వాళ్లలో పెద్దదాని పేరు ఒహొలా,* ఆమె చెల్లి పేరు ఒహొలీబా.* ఇద్దరూ నాకు సొంతమై, కుమారులనూ కూతుళ్లనూ కన్నారు. ఒహొలా సమరయ,+ ఒహొలీబా యెరూషలేము.
5 “ఒహొలా నాకు భార్యగా ఉంటూనే వ్యభిచారం చేసింది.+ ఆమె తన ప్రియుల్ని అంటే తన పొరుగువాళ్లయిన అష్షూరీయుల్ని+ మోహించింది.+ 6 వాళ్లు ఎవరంటే, నీలంరంగు బట్టలు వేసుకున్న అధిపతులు, ఉప పాలకులు; వాళ్లందరూ తమ గుర్రాల మీద తిరిగే అందమైన యువకులు. 7 ఆమె అష్షూరీయుల్లో శ్రేష్ఠులైన వాళ్లందరితో వ్యభిచారం చేస్తూ వచ్చింది, తాను మోహించిన వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో* తనను తాను అపవిత్రపర్చుకుంది.+ 8 తాను ఐగుప్తులో నేర్చుకున్న వేశ్యాతనాన్ని ఆమె విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఆమె యౌవనంలో వాళ్లు ఆమెతో పడుకున్నారు, వాళ్లు ఆమె కన్యాత్వపు రొమ్ముల్ని నలిపి తమ కామోద్రేకాన్ని ఆమె మీద కుమ్మరించారు.+ 9 కాబట్టి నేను ఆమెను ఆమె ప్రియుల చేతికి అంటే ఆమె మోహించిన అష్షూరీయుల చేతికి అప్పగించాను.+ 10 వాళ్లు ఆమె మానాన్ని బట్టబయలు చేసి,+ ఆమె కుమారులనూ కూతుళ్లనూ పట్టుకొని,+ ఆమెను కత్తితో చంపేశారు. అలా ఆమె స్త్రీలలో అపకీర్తి పాలైంది, వాళ్లు ఆమెను శిక్షించారు.
11 “అది చూసి, ఆమె చెల్లి ఒహొలీబా ఇంకా దిగజారిపోయింది; ఆమె తన అక్క కన్నా ఘోరంగా వ్యభిచారం చేసింది.+ 12 ఆమె తన పొరుగువాళ్లయిన అష్షూరీయుల్ని అంటే వాళ్లలోని అధిపతుల్ని, ఉప పాలకుల్ని మోహించింది.+ వాళ్లందరూ శ్రేష్ఠమైన బట్టలు వేసుకుని, గుర్రాల మీద తిరిగే అందమైన యువకులు. 13 ఆమె తనను తాను అపవిత్రపర్చుకున్నప్పుడు, వాళ్లిద్దరూ ఒకే దారిలో నడిచారని+ నేను గ్రహించాను. 14 అయితే ఆమె ఇంకా ఎక్కువగా వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చింది. గోడమీద చెక్కబడిన పురుషుల బొమ్మల్ని, ఎర్రరంగు వేసిన కల్దీయుల చెక్కడాల్ని ఆమె చూసింది. 15 వాళ్ల నడుము చుట్టూ దట్టీలు, తలల మీద పొడవాటి తలపాగాలు ఉన్నాయి; వాళ్లు యోధుల్లా కనిపిస్తున్నారు, వాళ్లంతా కల్దీయుల దేశంలో పుట్టిన బబులోనీయుల్లా ఉన్నారు. 16 వాటిని చూడగానే ఆమె వాళ్లను మోహించి, వాళ్ల కోసం కల్దీయ దేశానికి సందేశకుల్ని పంపించింది.+ 17 దాంతో బబులోనీయులు ఆమెతో పడుకోవడానికి రావడం మొదలుపెట్టారు, తమ కామోద్రేకంతో ఆమెను అపవిత్రపర్చారు. వాళ్లు తనను అపవిత్రపర్చాక ఆమె అసహ్యంతో అక్కడి నుండి వెళ్లిపోయింది.
18 “ఆమె సిగ్గులేకుండా వ్యభిచారం చేస్తూ, తన మానాన్ని వెల్లడి చేసుకుంటున్నప్పుడు+ నేను ఆమె అక్క దగ్గర నుండి అసహ్యంతో వెళ్లిపోయినట్టే ఆమె దగ్గర నుండి కూడా అసహ్యంతో వెళ్లిపోయాను.+ 19 అయితే ఆమె ఐగుప్తు దేశంలో వ్యభిచారం చేసిన తన యౌవన రోజుల్ని గుర్తుచేసుకుంటూ,+ ఇంకా ఎక్కువగా వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చింది. 20 గాడిదలకు, గుర్రాలకు ఉన్నలాంటి జననేంద్రియాలు గల పురుషుల ఉంపుడుగత్తెల్లా ఆమె వాళ్లను మోహించింది. 21 నువ్వు యౌవనంలో ఉండగా ఐగుప్తీయులు నీ యౌవనకాల రొమ్ముల్ని నలిపినప్పటి+ అసభ్య పనుల కోసం నువ్వు ఎంతో తపించావు.+
22 “కాబట్టి ఒహొలీబా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు ఎవరి దగ్గరి నుండైతే అసహ్యంతో వెళ్లిపోయావో ఆ ప్రియుల్ని నీ మీదికి రేపుతున్నాను,+ వాళ్లను అన్నివైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను;+ 23 బబులోనీయుల్ని,+ కల్దీయులందర్నీ,+ పెకోదు,+ శోయ, కోయ ప్రాంతాల వాళ్లను, అష్షూరీయులందర్నీ నీ మీదికి రప్పిస్తాను; వాళ్లందరూ అందమైన యువకులు, అధిపతులు, ఉప పాలకులు, యోధులు, ఎంపిక చేయబడ్డవాళ్లు, గుర్రాల మీద తిరిగేవాళ్లు. 24 వాళ్లు అనేక యుద్ధ రథాలతో, చక్రాలతో, సైన్యాలతో, పెద్ద డాళ్లతో, చిన్న డాళ్లతో,* శిరస్త్రాణాలతో* వచ్చి నీ మీద దాడి చేస్తారు. వాళ్లు నిన్ను చుట్టుముడతారు; నేను వాళ్లకు తీర్పు తీర్చే అధికారం ఇస్తాను, వాళ్లు తమ పద్ధతిలో నీకు తీర్పు తీరుస్తారు. 25 నా ఉగ్రతను నీ మీద చూపిస్తాను, వాళ్లు విపరీతమైన కోపంతో నీ మీదికి వస్తారు. వాళ్లు నీ ముక్కును, చెవుల్ని కోసేస్తారు; నీలో మిగిలినవాళ్లు కత్తి వల్ల చనిపోతారు. వాళ్లు నీ కుమారుల్ని, కూతుళ్లను తీసుకెళ్లిపోతారు, నీలో మిగిలినవాళ్లను అగ్ని దహించేస్తుంది.+ 26 వాళ్లు నీ బట్టల్ని ఊడదీసి,+ నీ అందమైన నగల్ని లాక్కుంటారు.+ 27 ఐగుప్తు దేశంలో మొదలైన నీ అసభ్య ప్రవర్తనను, నీ వేశ్యాతనాన్ని+ నేను అంతం చేస్తాను.+ నువ్వు వాళ్లవైపు చూడడం మానేస్తావు, ఐగుప్తును ఇక గుర్తుచేసుకోవు.’
28 “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు ఎవరినైతే ద్వేషించావో, ఎవరి దగ్గర నుండి అసహ్యంతో వెళ్లిపోయావో వాళ్ల చేతికి నిన్ను అప్పగించబోతున్నాను.+ 29 వాళ్లు ద్వేషంతో నీ మీద చర్య తీసుకుంటారు, నీ కష్టార్జితమంతా లాగేసుకుని+ నిన్ను బట్టలు లేకుండా దిగంబరంగా వదిలేస్తారు. నీ అవమానకరమైన దిగంబరత్వం, నీ అసభ్య ప్రవర్తన, నీ వ్యభిచారం బట్టబయలౌతాయి.+ 30 నువ్వు ఒక వేశ్యలా జనాల వెంటపడి,+ వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో నిన్ను అపవిత్రపర్చుకున్నావు+ కాబట్టి నీకు ఇలా జరుగుతుంది. 31 నువ్వు నీ సహోదరి నడిచిన దారిలోనే నడిచావు+ కాబట్టి, నేను ఆమె గిన్నెను నీ చేతిలో పెడతాను.’+
32 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘లోతుగా, వెడల్పుగా ఉన్న నీ సహోదరి గిన్నెలోనిది నువ్వు తాగుతావు,+
ప్రజలు నిన్ను చూసి నవ్వుతారు, ఎగతాళి చేస్తారు;+ ఆ గిన్నె నిండా అవే ఉన్నాయి.
33 నువ్వు నీ సహోదరి సమరయ గిన్నెలోనిది తాగి,
మత్తులో, దుఃఖంలో మునిగిపోతావు,
నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు, నువ్వు నిర్జనంగా తయారౌతావు.
34 నువ్వు దానిలోనిది పూర్తిగా తాగి,+ దాని మట్టి పెంకుల్ని కొరుకుతావు,
తర్వాత దుఃఖంతో నీ రొమ్ముల్ని కోసేసుకుంటావు.
“ఎందుకంటే నేనే ఈ మాట చెప్పాను” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.’
35 “కాబట్టి, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు+ కాబట్టి, నీ అసభ్య ప్రవర్తన పర్యవసానాల్ని, నీ వ్యభిచార క్రియల పర్యవసానాల్ని అనుభవిస్తావు.’ ”
36 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు ఒహొలా మీద, ఒహొలీబా+ మీద తీర్పు ప్రకటించి, వాళ్ల హేయమైన పనుల్ని వాళ్లకు చెప్తావా? 37 వాళ్లు వ్యభిచారం* చేశారు,+ వాళ్ల చేతులకు రక్తం అంటుకుంది. వాళ్లు తమ అసహ్యమైన విగ్రహాల్ని పూజించడమే* కాదు, వాళ్లు నాకు కన్న కుమారుల్ని తమ విగ్రహాలకు ఆహారంగా అగ్నిలో వేసి కాల్చారు.*+ 38 అంతేకాదు, వాళ్లు నా విషయంలో ఇలా చేశారు: ఆ రోజున వాళ్లు నా పవిత్రమైన స్థలాన్ని మలినం చేసి, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు. 39 వాళ్లు తమ కుమారుల్ని తమ అసహ్యమైన విగ్రహాలకు బలి ఇచ్చాక,+ అదే రోజున నా పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చడానికి దానిలోకి వచ్చారు.+ నా మందిరంలో వాళ్లు అదే చేశారు. 40 దూరం నుండి మనుషుల్ని రప్పించడానికి వాళ్లు ఒక సందేశకుణ్ణి కూడా పంపించారు.+ వాళ్లు వస్తున్నప్పుడు, నువ్వు స్నానం చేసి, కళ్లకు కాటుక పెట్టుకొని, నగలతో అలంకరించుకున్నావు.+ 41 ఒక అందమైన మంచం మీద కూర్చున్నావు,+ నీ ముందున్న బల్ల+ మీద నా ధూపద్రవ్యాన్ని,+ నా తైలాన్ని పెట్టావు.+ 42 జల్సా చేసే పురుషుల గుంపు సందడి అక్కడ వినిపించింది, వాళ్లలో ఎడారి నుండి తీసుకొచ్చిన తాగుబోతులు ఉన్నారు. వాళ్లు ఈ స్త్రీల చేతులకు గాజులు తొడిగి, వాళ్ల తలల మీద అందమైన కిరీటాలు పెట్టారు.
43 “అప్పుడు నేను, వ్యభిచారం వల్ల నీరసించిపోయిన స్త్రీ గురించి ఇలా అన్నాను: ‘ఇప్పటికీ ఆమె వ్యభిచారం చేయడం మానదు.’ 44 వాళ్లు ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నట్టుగా ఆమె దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. అసభ్యంగా ప్రవర్తించే ఆ స్త్రీల దగ్గరికి అంటే ఒహొలా దగ్గరికి, ఒహొలీబా దగ్గరికి వాళ్లు అలాగే వెళ్లారు. 45 అయితే నీతిమంతులు వ్యభిచారం చేసేవాళ్లకు,+ రక్తం చిందించేవాళ్లకు+ విధించే శిక్షను ఆమెకు విధిస్తారు; ఎందుకంటే వాళ్లు వ్యభిచారం చేసే స్త్రీలు, వాళ్ల చేతులకు రక్తం అంటుకుంది.+
46 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్ల మీదికి ఒక సైన్యం వస్తుంది; ఆ సైనికులు వాళ్లను భయంకరంగా మారుస్తారు; వాళ్ల వస్తువులు దోచుకోబడతాయి.+ 47 ఆ సైనికులు వాళ్ల మీదికి రాళ్లు రువ్వి,+ వాళ్లను కత్తులతో నరికేస్తారు. వాళ్ల కుమారుల్ని, కూతుళ్లను చంపేసి+ వాళ్ల ఇళ్లను అగ్నితో కాల్చేస్తారు.+ 48 నేను దేశంలోని అసభ్య ప్రవర్తనను అంతం చేస్తాను, అప్పుడు స్త్రీలందరూ గుణపాఠం నేర్చుకొని, మీలా అసభ్యంగా ప్రవర్తించకుండా ఉంటారు.+ 49 మీ అసభ్య ప్రవర్తన పర్యవసానాల్ని, మీ అసహ్యమైన విగ్రహాలతో మీరు చేసిన పాపాల పర్యవసానాల్ని వాళ్లు మీ మీదికి రప్పిస్తారు; అప్పుడు, నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”+
24 తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఈ రోజు తేదీని రాసిపెట్టు. ఈ రోజే బబులోను రాజు యెరూషలేము మీద తన దాడిని మొదలుపెట్టాడు.+ 3 తిరుగుబాటుదారులైన ఈ ప్రజల గురించి ఒక సామెత* చెప్పు, వాళ్ల గురించి ఇలా అను:
“ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
“ఒక వంటపాత్రను* పొయ్యి మీద పెట్టి, దానిలో నీళ్లు పోయి.+
4 దానిలో మంచిమంచి మాంసం ముక్కలు,
తొడ ముక్క, జబ్బ ముక్క వేయి;+ శ్రేష్ఠమైన ఎముకలతో దాన్ని నింపు.
5 మందలోని శ్రేష్ఠమైన గొర్రెను తీసుకో,+ పాత్ర కింద చుట్టూ కట్టెలు పెట్టు.
దానిలోని ముక్కల్ని, ఎముకల్ని బాగా ఉడికించు.” ’
6 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
‘రక్తపాతంతో నిండిన నగరానికి శ్రమ,+ అది తుప్పు పట్టిన వంటపాత్రలా ఉంది, దాని తుప్పు పోవడం లేదు!
దానిలోని ముక్కలన్నీ ఒక్కొక్కటిగా తీసేయి;+ వాటికోసం చీట్లు* వేయకు.
7 ఎందుకంటే, అది చిందించిన రక్తం దానిలోనే ఉంది;+ అది ఆ రక్తాన్ని చదునైన బండమీద పోసింది.
మట్టితో కప్పబడేలా అది ఆ రక్తాన్ని నేలమీద పోయలేదు.+
8 దానిమీద ప్రతీకారం తీర్చుకునేలా కోపం రగలాలని,
అది చిందించిన రక్తం కప్పబడకుండా ఉండేలా
దాన్ని మెరిసే, చదునైన బండమీద ఉంచాను.’+
9 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
‘రక్తపాతంతో నిండిన నగరానికి శ్రమ!+
నేను కట్టెల్ని ఎత్తుగా పోగుజేస్తాను.
10 చాలా కట్టెలు పెట్టి, నిప్పు రాజెయ్యి,
మాంసాన్ని బాగా ఉడికించు, పులుసును పారబోసి, ఎముకల్ని బాగా మాడనివ్వు.
11 ఖాళీ పాత్రను నిప్పుల మీద పెట్టి
దాని రాగి ఎర్రబడేలా బాగా వేడి చేయి.
దాని అపవిత్రత దానిలో కరిగిపోతుంది,+ అగ్ని దాని తుప్పును దహించేస్తుంది.
12 ఈ పని ఎంతో చిరాకు, అలసట తెప్పిస్తుంది,
ఎందుకంటే విస్తారమైన తుప్పు పోవడం లేదు.+
తుప్పుతో పాటు పాత్రను అగ్నిలో పారేయి!’
13 “ ‘నీ అపవిత్రత నీ అసభ్యమైన ప్రవర్తన వల్లే కలిగింది.+ నేను నిన్ను శుద్ధి చేయాలని ప్రయత్నించాను, కానీ నీ అపవిత్రత పోలేదు. నీ మీద నాకున్న ఆగ్రహం చల్లారే వరకు నువ్వు శుద్ధి అవ్వవు.+ 14 యెహోవానైన నేను ఈ మాట చెప్పాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఏమాత్రం సంకోచించకుండా, బాధపడకుండా, విచారపడకుండా చర్య తీసుకుంటాను.+ వాళ్లు నీ మార్గాల్ని బట్టి, నీ పనుల్ని బట్టి నీకు తీర్పు తీరుస్తారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
15 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 16 “మానవ కుమారుడా, నేను అకస్మాత్తుగా నీ ప్రియమైన భార్యను నీకు దూరం చేస్తాను.+ నువ్వు దుఃఖపడకూడదు,* ఏడ్వకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు. 17 మౌనంగా మూలుగు, చనిపోయినవాళ్ల కోసం దుఃఖించేటప్పుడు చేసే ఎలాంటి ఆచారాలు చేయకు.+ నీ తలపాగా చుట్టుకొని,+ చెప్పులు వేసుకో.+ నువ్వు నీ మీసాన్ని* కప్పుకోవద్దు,+ వేరేవాళ్లు నీ కోసం తెచ్చే రొట్టెను తినకు.”+
18 నేను పొద్దున ప్రజలతో మాట్లాడాను, సాయంత్రం నా భార్య చనిపోయింది. తర్వాతి ఉదయం, నాకు ఆజ్ఞాపించబడినట్టే చేశాను. 19 అప్పుడు ప్రజలు నాతో, “నువ్వు చేస్తున్నవాటికీ మాకూ సంబంధం ఏంటో మాకు చెప్తావా?” అని అన్నారు. 20 నేను వాళ్లతో ఇలా అన్నాను: “యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది, 21 ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీకు గర్వకారణంగా, ఎంతో ప్రియంగా ఉన్న, మీ హృదయాలు ఎంతో కోరుకున్న నా పవిత్రమైన స్థలాన్ని నేను అపవిత్రపర్చబోతున్నాను.+ మీరు వదిలేసి వచ్చిన మీ కుమారులు, కూతుళ్లు కత్తివల్ల చనిపోతారు.+ 22 అప్పుడు మీరు నేనిప్పుడు చేసినట్టే చేస్తారు. మీరు మీ మీసాన్ని కప్పుకోరు, వేరేవాళ్లు మీ కోసం తెచ్చిన రొట్టెను మీరు తినరు.+ 23 మీ తలల మీద తలపాగాలు, మీ కాళ్లకు చెప్పులు ఉంటాయి. మీరు దుఃఖపడరు, ఏడ్వరు. బదులుగా మీ దోషాల్లోనే మీరు కుళ్లిపోతారు,+ ఒకర్ని చూసి ఒకరు మూల్గుతారు. 24 యెహెజ్కేలు మీకు ఒక సూచనగా ఉన్నాడు.+ అతను చేసినట్టే మీరు చేస్తారు. అది జరిగినప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” ’ ”
25 “మానవ కుమారుడా, నేను వాళ్ల కుమారులూ కూతుళ్లతో పాటు వాళ్ల కోటను, అంటే వాళ్లకు సంతోషాన్నిచ్చిన అందమైనదాన్ని, ప్రియమైనదాన్ని, వాళ్ల హృదయం కోరుకున్నదాన్ని వాళ్ల దగ్గర నుండి తీసేసినప్పుడు,+ 26 పారిపోయివచ్చిన ఒక వ్యక్తి ఆ విషయం గురించి నీకు చెప్తాడు.+ 27 ఆ రోజు నువ్వు నీ నోరు తెరిచి, పారిపోయివచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడతావు, ఇక మౌనంగా ఉండవు.+ నువ్వు వాళ్లకు ఒక సూచనగా ఉంటావు, అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.”
25 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, అమ్మోనీయుల+ వైపు ముఖం తిప్పి, వాళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు.+ 3 అమ్మోనీయుల గురించి నువ్వు ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేది వినండి. సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా పవిత్రమైన స్థలం అపవిత్రపర్చబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం నిర్జనంగా పడివున్నప్పుడు, యూదా ఇంటివాళ్లు చెరలోకి వెళ్లినప్పుడు నువ్వు ఎగతాళిగా, ‘ఆహా!’ అని అన్నావు, 4 కాబట్టి నేను నిన్ను తూర్పు ప్రజలకు సొత్తుగా ఇస్తున్నాను. వాళ్లు నీ మధ్య శిబిరాలు* ఏర్పాటు చేసుకుని, డేరాలు వేసుకుని నివసిస్తారు. వాళ్లు నీ పంట తింటారు, నీ పాలు తాగుతారు. 5 నేను రబ్బాను+ ఒంటెల మేత స్థలంగా, అమ్మోనీయుల దేశాన్ని మందలు పడుకునే చోటుగా చేస్తాను; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”
6 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు ఇశ్రాయేలు దేశ పరిస్థితి చూసి చప్పట్లు కొట్టి,+ పాదాలతో నేలను తన్ని, ఎగతాళి చేస్తూ సంతోషించావు కాబట్టి,+ 7 నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, నిన్ను జనాలకు దోపుడుసొమ్ముగా ఇస్తాను. నువ్వు జనాల్లో ఉండకుండా కొట్టేస్తాను, దేశాల్లో నుండి నిన్ను నాశనం చేస్తాను.+ నిన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను, అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’
8 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ “యూదా ఇంటివాళ్లు ఇతర జనాల్లాగే ఉన్నారు” అని మోయాబు,+ శేయీరు+ అన్నాయి కాబట్టి, 9 నేను మోయాబు సరిహద్దు నగరాలు అంటే దాని శ్రేష్ఠమైన నగరాలైన* బేత్యేషిమోతు, బయల్మెయోను, చివరికి కిర్యతాయిము+ కూడా దాడికి గురయ్యేలా చేస్తాను. 10 నేను అమ్మోనీయులతో పాటు మోయాబును తూర్పు ప్రజలకు సొత్తుగా ఇస్తాను,+ ఇక అమ్మోనీయుల్ని జనాల మధ్య గుర్తుచేసుకోరు.+ 11 నేను మోయాబుకు శిక్ష విధిస్తాను,+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’
12 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఎదోము యూదా ఇంటివాళ్ల మీద పగతో చర్య తీసుకుంది, వాళ్లమీద ప్రతీకారం తీర్చుకొని గొప్ప దోషం మూటగట్టుకుంది;+ 13 అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను కూడా ఎదోముకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, దానిలోని మనుషుల్నీ పశువుల్నీ చంపేసి దాన్ని నిర్మానుష్యం చేస్తాను.+ తేమాను నుండి దెదాను వరకు ప్రజలు కత్తివల్ల కూలతారు.+ 14 ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్వారా నేను ఎదోము మీద ప్రతీకారం తీర్చుకుంటాను.+ వాళ్లు ఎదోము మీద నా కోపాన్ని, నా ఉగ్రతను చూపిస్తారు; అలా ఎదోము నా ప్రతీకారాన్ని రుచిచూస్తుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” ’
15 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఫిలిష్తీయులు తమ శాశ్వత శత్రుత్వాన్ని బట్టి దుర్బుద్ధితో పగతీర్చుకోవాలని, నాశనం చేయాలని చూశారు.+ 16 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతున్నాను;+ నేను కెరేతీయుల్ని నిర్మూలించి,+ సముద్రతీర నివాసుల్లో మిగిలినవాళ్లను నాశనం చేస్తాను.+ 17 తీవ్రమైన కోపంతో వాళ్లను శిక్షించి వాళ్లమీద గొప్ప ప్రతీకార చర్యలు తీసుకుంటాను, నేను వాళ్లమీద ప్రతీకారం తీర్చుకునేటప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” ’ ”
26 11వ సంవత్సరం, నెల మొదటి రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, తూరు నగరం యెరూషలేము గురించి,+ ‘ఆహా! జనాలకు ద్వారంలా ఉన్న నగరం పడగొట్టబడింది!+ ఇప్పుడు అన్నీ నా దగ్గరికే వస్తాయి, నేను ధనవంతురాల్ని అవుతాను, ఎందుకంటే అది పాడైపోయింది’ అని అనుకుంది; 3 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘తూరూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను; సముద్రం అలల్ని ఉప్పొంగజేసినట్టు నేను అనేక జనాల్ని నీ మీదికి రప్పిస్తాను. 4 వాళ్లు తూరు ప్రాకారాల్ని నాశనం చేస్తారు, దాని బురుజుల్ని పడగొడతారు,+ నేను దాని మట్టిని తుడిచేసి, దాన్ని మెరిసే బండగా చేస్తాను. 5 అది సముద్రం మధ్యలో వలలు ఆరబెట్టుకునే చోటుగా తయారౌతుంది.’+
“ ‘స్వయంగా నేనే ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు, ‘అది జనాలకు దోపుడుసొమ్ము అవుతుంది. 6 దాని చుట్టుపక్కల పట్టణాలు* కత్తిపాలౌతాయి, అప్పుడు నేను యెహోవానని ప్రజలు తెలుసుకుంటారు.’
7 “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇదిగో నేను తూరు మీదికి ఉత్తరం నుండి బబులోను రాజైన నెబుకద్నెజరును* రప్పిస్తున్నాను;+ అతను గుర్రాలు,+ యుద్ధ రథాలు,+ గుర్రపురౌతులు, ఎంతోమంది సైనికుల* సైన్యం ఉన్న రాజాధిరాజు.+ 8 అతను నీ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్ని కత్తితో నాశనం చేస్తాడు; నీ ఎదురుగా ముట్టడిగోడ కడతాడు, ముట్టడిదిబ్బ వేస్తాడు, డాళ్లతో ఒక పెద్ద కవచం ఏర్పాటుచేస్తాడు. 9 తన యుద్ధ* యంత్రంతో నీ ప్రాకారాల్ని పడగొడతాడు, గొడ్డళ్లతో* నీ బురుజుల్ని కూలగొడతాడు. 10 అతని విస్తారమైన గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పేస్తుంది; ప్రాకారాలు బీటలువారిన నగరం మీద సైనికులు విరుచుకుపడినట్టు అతను నీ ద్వారాల్లో ప్రవేశించినప్పుడు గుర్రపురౌతుల, చక్రాల, రథాల శబ్దానికి నీ ప్రాకారాలు కంపిస్తాయి. 11 అతని గుర్రాల డెక్కలు నీ వీధులన్నిటినీ తొక్కేస్తాయి;+ అతను నీ ప్రజల్ని కత్తితో చంపుతాడు, నీ బలమైన స్తంభాలు నేలమట్టం అవుతాయి. 12 వాళ్లు నీ సంపదల్ని దోచుకుంటారు, నీ వ్యాపారాన్ని కొల్లగొడతారు,+ నీ ప్రాకారాల్ని పడగొడతారు, నీలోని శ్రేష్ఠమైన ఇళ్లను కూలగొడతారు; తర్వాత నీ రాళ్లను, కలపను, మట్టిని సముద్రంలో పడేస్తారు.’
13 “ ‘నేను నీలో పాటలు వినబడకుండా చేస్తాను, వీణల* శబ్దం ఇక నీలో వినిపించదు.+ 14 నిన్ను మెరిసే బండగా చేస్తాను, నువ్వు వలలు ఆరబెట్టుకునే చోటువి అవుతావు.+ నువ్వు మళ్లీ ఎప్పటికీ కట్టబడవు, యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
15 “సర్వోన్నత ప్రభువైన యెహోవా తూరుతో ఇలా అంటున్నాడు: ‘నువ్వు కూలిపోతున్న శబ్దం వినిపించినప్పుడు, చనిపోతున్నవాళ్లు మూలుగుతున్నప్పుడు, నీలో ప్రజలు చంపబడుతున్నప్పుడు ద్వీపాలు భయంతో వణికిపోవా?+ 16 సముద్ర అధిపతులందరూ* తమ సింహాసనాల మీద నుండి దిగి, తమ అంగీల్ని,* బుట్టాపని* చేసిన వస్త్రాల్ని తీసేసి భయంతో వణికిపోతారు. వాళ్లు నేలమీద కూర్చొని, భయంతో వణికిపోతూ నీ వైపు ఆశ్చర్యంగా చూస్తారు.+ 17 వాళ్లు నీ గురించి ఒక శోకగీతం పాడి,+ నీతో ఇలా అంటారు:
“సముద్ర ప్రజలు నివసించే నగరమా, ఖ్యాతిగల నగరమా, నువ్వు నాశనం అయ్యావేంటి?+
నువ్వూ, నీ నివాసులూ సముద్రం మీద బలవంతులు,+
మీరు భూమ్మీది ప్రజలందరికీ భయం పుట్టించారు!
18 నువ్వు కూలిపోయిన రోజున ద్వీపాలు భయంతో వణుకుతాయి,
నువ్వు లేకుండా పోయినప్పుడు సముద్రంలోని దీవులు కలవరపడతాయి.” ’+
19 “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను పాడుచేసి, నివాసులు లేని నగరాల్లా చేసినప్పుడు, ఉప్పొంగే జలాలతో నిన్ను ముంచెత్తి, విస్తార జలాలతో నిన్ను కప్పేసినప్పుడు,+ 20 నేను నిన్నూ నీతోపాటు గోతిలోకి* దిగిపోతున్న వాళ్లనూ ప్రాచీనకాల ప్రజల దగ్గరికి చేరుస్తాను; నాశనమైన ఇతర ప్రాచీన నగరాల్లా నిన్ను అత్యంత అడుగున ఉన్న స్థలంలో నివసించేలా చేస్తాను, నువ్వు గోతిలోకి దిగిపోతున్న వాళ్లతో పాటు ఉంటావు;+ దానివల్ల ఇక నీలో ఎవరూ నివసించరు. తర్వాత నేను సజీవుల దేశాన్ని మహిమపరుస్తాను.*
21 “ ‘నీ మీదికి అకస్మాత్తుగా భయం రప్పిస్తాను, నువ్వు ఇక ఉండవు.+ వాళ్లు నీ కోసం వెదుకుతారు కానీ నువ్వు ఇంకెప్పటికీ కనిపించవు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
27 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, నువ్వు తూరు గురించి ఒక శోకగీతం పాడు,+ 3 తూరుతో ఇలా చెప్పు,
‘సముద్ర ద్వారాల దగ్గర నివసించేదానా,
అనేక ద్వీపాల ప్రజలతో వ్యాపారం చేసేదానా,
సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“తూరూ, ‘నేను పరిపూర్ణ సౌందర్యవతిని’ అని నువ్వు చెప్పుకుంటున్నావు.+
4 నీ ప్రాంతాలు సముద్రం మధ్యలో ఉన్నాయి,
నిన్ను కట్టినవాళ్లు నీ అందాన్ని పరిపూర్ణం చేశారు.
5 వాళ్లు నీ పలకలన్నిటినీ శెనీరుకు+ చెందిన సరళవృక్షాలతో* చేశారు,
నీ ఓడ కొయ్యను లెబానోను దేవదారు మ్రానుతో చేశారు.
6 నీ తెడ్లను బాషానుకు చెందిన సింధూర వృక్షాలతో చేశారు,
నీ ముందు భాగాన్ని కిత్తీము+ దీవులకు చెందిన తమాల వృక్షంతో చేసి, దంతంతో పొదిగారు.
7 నీ తెరచాపను ఐగుప్తుకు చెందిన రంగురంగుల నారవస్త్రంతో చేశారు,
నీ తెరల్ని ఎలీషా+ ద్వీపాల నుండి వచ్చిన నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో చేశారు.
8 సీదోను, అర్వదు నివాసులు+ నీ తెడ్లు వేసేవాళ్లు.
తూరూ, నీలోని నిపుణులే నీ నావికులు.+
9 అనుభవం, నైపుణ్యం ఉన్న గెబలు+ పురుషులు నీ ఓడల్ని బాగుచేసేవాళ్లు.+
సముద్రంలోని ఓడలన్నీ, వాటి నావికులందరూ వ్యాపారం కోసం నీ దగ్గరికి వచ్చేవాళ్లు.
10 పారసీక,* లూదు, పూతు+ ప్రాంతాలవాళ్లు నీ సైన్యంలో ఉన్నారు, వాళ్లు నీ యుద్ధ శూరులు.
వాళ్లు తమ డాళ్లను, శిరస్త్రాణాల్ని నీలో తగిలించి, నీకు వైభవం తెచ్చారు.
11 నీ సైన్యంలోని అర్వదు మనుషులు నీ ప్రాకారాల మీద చుట్టూ నిలబడేవాళ్లు,
ధైర్యవంతులు నీ బురుజుల్ని కాపలాకాసేవాళ్లు.
వాళ్లు నీ ప్రాకారాల చుట్టూ గుండ్రటి డాళ్లను వేలాడదీసి
నీ అందాన్ని పరిపూర్ణం చేశారు.
12 “ ‘ “నీ విస్తారమైన సంపద వల్ల తర్షీషు+ నీతో వ్యాపారం చేసింది.+ వాళ్లు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు.+ 13 యావాను, తుబాలు,+ మెషెకు+ వాళ్లు నీతో వ్యాపారం చేశారు; వాళ్లు బానిసల్ని, రాగి వస్తువుల్ని ఇచ్చి నీ సరుకులు కొనుక్కున్నారు.+ 14 తోగర్మా ఇంటివాళ్లు+ గుర్రాల్ని, యుద్ధ గుర్రాల్ని, కంచర గాడిదల్ని ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు. 15 దెదాను+ ప్రజలు నీతో వ్యాపారం చేశారు; అనేక ద్వీపాల్లోని వర్తకులు నీ కోసం పనిచేసేవాళ్లు; వాళ్లు ఏనుగు దంతాల్ని,+ కోవిదారు మ్రానుల్ని నీకు కప్పంగా ఇచ్చేవాళ్లు. 16 నీ విస్తారమైన సరుకుల వల్ల ఎదోము నీతో వ్యాపారం చేసింది. వాళ్లు లేత నీలం రాళ్లు, ఊదారంగు ఉన్ని, బుట్టాపని* చేసిన రంగురంగుల వస్త్రాలు, శ్రేష్ఠమైన వస్త్రాలు, పగడాలు, మాణిక్యాలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కున్నారు.
17 “ ‘ “యూదా, ఇశ్రాయేలు దేశం నీతో వ్యాపారం చేశాయి. అవి మిన్నీతు+ గోధుమల్ని, శ్రేష్ఠమైన ఆహారపదార్థాల్ని, తేనెను,+ నూనెను, సాంబ్రాణిని+ ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నాయి.+
18 “ ‘ “నీ విస్తారమైన వస్తువుల వల్ల, సంపద వల్ల దమస్కు+ నీతో వ్యాపారం చేసింది. అది హెల్బోను ద్రాక్షారసం, జాహరు ఉన్ని* ఇచ్చి నీతో వ్యాపారం చేసింది. 19 ఊజాలుకు చెందిన వదాను, యావాను ఇనుమును,* లవంగిపట్టను,* వసను* ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నాయి. 20 దెదాను+ జీను* వస్త్రాల్ని* ఇచ్చి నీతో వ్యాపారం చేసింది. 21 అరబీయులు, కేదారు+ ప్రధానులందరూ నీతో వ్యాపారం చేశారు; వాళ్లు గొర్రెపిల్లల్ని, పొట్టేళ్లను, మేకల్ని ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు.+ 22 షేబ, రాయమా+ వర్తకులు నీతో వ్యాపారం చేశారు; వాళ్లు అన్నిరకాల శ్రేష్ఠమైన అత్తరులు, రత్నాలు, బంగారం ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు.+ 23 హారాను,+ కన్నే, ఏదెను+ వాళ్లు; షేబ,+ అస్సూరు,+ కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24 వాళ్లు నీ సంతలో అందమైన బట్టల్ని, నీలంరంగు వస్త్రం మీద రంగురంగుల బుట్టాపని చేసిన బట్టల్ని, రంగురంగుల తివాచీల్ని అమ్మేవాళ్లు. వాటన్నిటినీ తాళ్లతో గట్టిగా కట్టి తీసుకొచ్చి వ్యాపారం చేసేవాళ్లు.
26 నీ తెడ్లు వేసేవాళ్లు నిన్ను విస్తార జలాల్లోకి తీసుకెళ్లారు;
సముద్రం మధ్యలో తూర్పు గాలి నిన్ను బద్దలు చేసింది.
27 నువ్వు పతనమయ్యే రోజున
నీ సంపద, నీ వస్తువులు, నీ వ్యాపారం, నీ ప్రయాణికులు, నీ నావికులు,
నీ ఓడల్ని బాగుచేసేవాళ్లు, నీతో వ్యాపారం చేసేవాళ్లు,+ యుద్ధ శూరులందరూ,+
నీ సమూహమంతా నడి సముద్రంలో మునిగిపోతుంది.+
28 నీ నావికులు కేకలు వేసినప్పుడు, తీరప్రాంతాలు వణికిపోతాయి.
29 తెడ్లు వేసేవాళ్లు, ప్రయాణికులు, నావికులు అందరూ
తమ ఓడల నుండి దిగి ఒడ్డున నిలబడతారు.
30 వాళ్లు నీ గురించి బిగ్గరగా ఏడుస్తారు,+
తలల మీద దుమ్ము పోసుకుంటూ, బూడిదలో దొర్లుతారు.
31 తమ తలల్ని బోడి చేసుకొని గోనెపట్ట కట్టుకుంటారు;
నీ గురించి తీవ్రంగా దుఃఖిస్తూ బోరున ఏడుస్తారు.
32 ఏడుస్తూ నీ గురించి ఇలా శోకగీతం పాడతారు:
‘ఇప్పుడు సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా ఉన్న తూరులాంటి నగరమేది?+
33 సముద్రం నుండి నీ సరుకులు వచ్చినప్పుడు, అనేక జనాల వాళ్లు వాటితో తృప్తిపడ్డారు.+
నీ విస్తారమైన సంపద వల్ల, నీ వ్యాపారం వల్ల భూరాజులు ధనవంతులయ్యారు.+
34 కానీ ఇప్పుడు నువ్వు నడి సముద్రంలో, లోతైన జలాల్లో బద్దలయ్యావు,+
నీ వ్యాపారమంతా, నీ ప్రజలంతా నీతోపాటే మునిగిపోయారు.+
35 ద్వీపాల నివాసులందరూ నీవైపు ఆశ్చర్యంతో చూస్తారు,+
వాళ్ల రాజులు భయంతో వణికిపోతారు,+ వాళ్ల ముఖాలు దిగులుగా ఉంటాయి.
36 నీకు జరిగింది చూసి జనాల వ్యాపారులు ఈల వేస్తారు.
నీ అంతం అకస్మాత్తుగా వస్తుంది, అది భయంకరంగా ఉంటుంది,
నువ్వు ఎప్పటికీ లేకుండా పోతావు.’ ” ’ ”+
28 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, తూరు నాయకుడితో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“నీ హృదయానికి పొగరెక్కి,+ ‘నేనొక దేవుణ్ణి,
సముద్రం మధ్యలో దేవుని సింహాసనం మీద కూర్చున్నాను’+
అని నువ్వు అనుకుంటూ ఉన్నావు.
నీ హృదయంలో నువ్వు దేవుడివి అనుకుంటున్నావు,
కానీ నువ్వు కేవలం మనిషివి, దేవుడివి కాదు.
3 ఇదిగో! నువ్వు దానియేలు కన్నా తెలివిగల వాడివని,+
నీకు తెలియని రహస్యం ఏదీ లేదని అనుకుంటున్నావు.
4 నువ్వు నీ తెలివితో, నీ వివేచనతో ధనవంతుడివి అయ్యావు,
నీ ఖజానాల్లో వెండిబంగారాలు పోగుచేసుకుంటూ ఉన్నావు.+
5 నైపుణ్యంతో వ్యాపారం చేసి గొప్ప సంపద పోగుచేసుకున్నావు,+
నీ సంపద వల్ల నీ హృదయానికి పొగరెక్కింది.” ’
6 “ ‘అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“నువ్వు నీ హృదయంలో ఒక దేవుడివని అనుకుంటున్నావు కాబట్టి,
7 నేను నీ మీదికి విదేశీయుల్ని, జనాల్లో అత్యంత కిరాతకుల్ని రప్పిస్తున్నాను,+
నీ తెలివితో నువ్వు సంపాదించిన అందమైన వాటన్నిటినీ వాళ్లు కత్తితో నాశనం చేస్తారు,
నీ మహిమాన్విత వైభవాన్ని అపవిత్రపరుస్తారు.+
9 నిన్ను చంపేవాడితో కూడా, ‘నేనొక దేవుణ్ణి’ అని అంటావా?
నిన్ను అపవిత్రపర్చేవాళ్ల చేతుల్లో నువ్వు కేవలం మనిషివే కానీ దేవుడివి కాదు.” ’
10 ‘విదేశీయుల చేతుల్లో నువ్వు సున్నతి లేనివాళ్లలా చనిపోతావు,
నేనే స్వయంగా ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”
11 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 12 “మానవ కుమారుడా, నువ్వు తూరు రాజు గురించి ఇలా శోకగీతం పాడు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
13 నువ్వు దేవుని తోట అయిన ఏదెనులో ఉండేవాడివి.
నువ్వు అన్నిరకాల విలువైన రత్నాలతో, అంటే
మాణిక్యం, పుష్యరాగం, సూర్యకాంతపు రాయి;
లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చరాయి;
నీలం రాయి, లేత నీలం రాయి,+ మరకతం రాళ్లతో అలంకరించబడ్డావు;
అవన్నీ బంగారు జవల్లో పొదగబడ్డాయి.
నువ్వు సృష్టించబడిన రోజున అవి తయారుచేయబడ్డాయి.
14 నేను నిన్ను అభిషేకించి, కాపాడే కెరూబుగా నియమించాను.
నువ్వు దేవుని పవిత్ర పర్వతం మీద ఉండేవాడివి,+ మండుతున్న రాళ్ల మధ్య తిరిగేవాడివి.
కాబట్టి నేను నిన్ను ఒక అపవిత్రుడిగా దేవుని పర్వతం మీద నుండి విసిరేసి, నాశనం చేస్తాను;+
కాపాడే కెరూబూ, నిన్ను మండుతున్న రాళ్ల మధ్య నుండి వెళ్లగొడతాను.
17 నీ సౌందర్యం వల్ల నీ హృదయానికి పొగరెక్కింది.+
నీ మహిమాన్విత వైభవం వల్ల నువ్వు నీ తెలివిని పాడుచేసుకున్నావు.+
నేను నిన్ను భూమ్మీదికి పడేస్తాను.+
రాజులు నిన్ను ఆశ్చర్యంగా చూసేలా నిన్ను వాళ్ల ముందు ఉంచుతాను.
18 నీ గొప్ప దోషం వల్ల, అక్రమ వ్యాపారం వల్ల నువ్వు నీ పవిత్రమైన స్థలాల్ని అపవిత్రపర్చుకున్నావు.
నేను నీ మధ్య అగ్ని రగులుకునేలా చేస్తాను, అది నిన్ను దహించేస్తుంది.+
నేను భూమ్మీద అందరి కళ్లముందు నిన్ను బూడిద చేస్తాను.
19 జనాల్లో నువ్వు తెలిసినవాళ్లందరూ నిన్ను ఆశ్చర్యంతో చూస్తారు.+
నీ అంతం అకస్మాత్తుగా వస్తుంది, అది భయంకరంగా ఉంటుంది,
నువ్వు ఎప్పటికీ లేకుండా పోతావు.” ’ ”+
20 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 21 “మానవ కుమారుడా, నువ్వు సీదోను వైపుకు నీ ముఖం తిప్పి+ దానికి వ్యతిరేకంగా ప్రవచించు. 22 నువ్వు ఇలా అనాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“సీదోనూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నేను నీ మధ్య మహిమపర్చబడతాను;
నేను దానికి శిక్ష విధించినప్పుడు, నేను దానిలో పవిత్రపర్చబడినప్పుడు నేను యెహోవానని ప్రజలు తెలుసుకుంటారు.
23 నేను దానిలోకి తెగులును పంపిస్తాను, దాని వీధుల్లో రక్తం ప్రవహిస్తుంది.
అన్నివైపుల నుండి దాని మీదికి ఖడ్గం వచ్చినప్పుడు, శవాలు దానిలో పడివుంటాయి;
అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.+
24 “ ‘ “ఇక ఇశ్రాయేలు ఇంటివాళ్ల చుట్టూ హానిచేసే ముళ్లపొదలు, బాధించే ముళ్లు+ అంటే వాళ్లను ఎగతాళి చేసేవాళ్లు ఉండరు; అప్పుడు ప్రజలు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని తెలుసుకుంటారు.” ’
25 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లను వాళ్లు చెదిరిపోయిన జనాల మధ్య నుండి సమకూర్చినప్పుడు,+ నేను జనాల కళ్లముందు వాళ్ల మధ్య పవిత్రపర్చబడతాను.+ వాళ్లు తమ దేశంలో అంటే నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశంలో+ నివసిస్తారు.+ 26 వాళ్లు ఇళ్లు కట్టుకుని, ద్రాక్షతోటలు నాటుకుని+ ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు;+ నేను వాళ్లను ఎగతాళిచేసే చుట్టుపక్కల ప్రజలందర్నీ శిక్షించినప్పుడు వాళ్లు సురక్షితంగా ఉంటారు;+ అప్పుడు వాళ్లు, నేను తమ దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.” ’ ”
29 పదో సంవత్సరం పదో నెల 12వ రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, నువ్వు ఐగుప్తు రాజైన ఫరో వైపుకు నీ ముఖం తిప్పి, అతనికీ ఐగుప్తు అంతటికీ వ్యతిరేకంగా ప్రవచించు.+ 3 నువ్వు ఇలా చెప్పు: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“ఐగుప్తు రాజువైన ఫరో, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను,+
నువ్వు నీ నైలు* కాలువల్లో పడుకొని ఉన్న భారీ సముద్రప్రాణివి.+
నువ్వు, ‘నైలు నది నాది.
నేనే దాన్ని నా కోసం చేసుకున్నాను’ అని చెప్పుకున్నావు.+
4 కానీ నేను నీ దవడలకు కొక్కేలు తగిలించి, నీ నైలు నదిలోని చేపలు నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను.
నీ పొలుసులకు అంటుకున్న నైలు నది చేపలన్నిటితో పాటు నిన్ను నైలు నదిలో నుండి బయటికి లాగుతాను.
5 నిన్నూ నీ నైలు నది చేపలన్నిటినీ నేను ఎడారిలో విడిచిపెడతాను.
నువ్వు బయట నేలమీద చచ్చి పడివుంటావు, ఎవరూ నిన్ను తీసి పాతిపెట్టరు.+
నేను నిన్ను అడవి జంతువులకు, ఆకాశపక్షులకు ఆహారంగా ఇస్తాను.+
6 అప్పుడు ఐగుప్తు నివాసులందరూ నేను యెహోవానని తెలుసుకుంటారు,
ఎందుకంటే వాళ్లు ఇశ్రాయేలు ఇంటివాళ్లకు గడ్డిపోచ* కన్నా ఏమాత్రం అండగా నిలవలేదు.+
7 వాళ్లు* నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు నలిగిపోయావు,
నీ వల్ల వాళ్ల భుజం విరిగిపోయింది.
వాళ్లు నీమీద ఆనుకున్నప్పుడు నువ్వు విరిగిపోయావు,
దాంతో వాళ్ల కాళ్లు తడబడ్డాయి.”+
8 “ ‘కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను నీ మీదికి ఒక ఖడ్గాన్ని రప్పించి,+ నీలో మనుషులు గానీ జంతువులు గానీ లేకుండా చేస్తాను. 9 ఐగుప్తు దేశం నిర్జనంగా, పాడైన స్థలంగా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు; ఎందుకంటే నువ్వు,* ‘నైలు నది నాది. నేనే దాన్ని చేశాను’ అని చెప్పుకున్నావు.+ 10 కాబట్టి నేను నీకూ నీ నైలు నదికీ వ్యతిరేకంగా ఉన్నాను; నేను మిగ్దోలు+ నుండి సెవేనే+ వరకు, ఇతియోపియా సరిహద్దు వరకు ఐగుప్తు దేశాన్ని ఎండిపోయిన పాడుబడ్డ స్థలంగా, పనికిరాని నిర్జన ప్రాంతంగా చేస్తాను.+ 11 మనుషులు గానీ పశువులు గానీ దానిలో తిరగరు,+ 40 సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు. 12 నేను 40 ఏళ్లపాటు ఐగుప్తు దేశాన్ని దేశాలన్నిట్లో అత్యంత నిర్జన దేశంగా చేస్తాను, దాని నగరాలు అత్యంత నిర్మానుష్య నగరాలు అవుతాయి;+ నేను ఐగుప్తీయుల్ని జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను.”+
13 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఆ 40 సంవత్సరాల తర్వాత నేను ఐగుప్తీయుల్ని వాళ్లు చెదిరిపోయిన జనాల మధ్య నుండి తిరిగి సమకూరుస్తాను.+ 14 బందీలుగా వెళ్లిన ఐగుప్తు ప్రజల్ని పత్రోసు+ దేశానికి, తమ స్వదేశానికి తిరిగి తీసుకొస్తాను; అక్కడ వాళ్లు ఏమాత్రం ప్రాముఖ్యతలేని రాజ్యంగా తయారౌతారు. 15 ఐగుప్తు మిగతా రాజ్యాల కన్నా తక్కువగా ఉంటుంది, అది ఇక వేరే జనాల మీద అధికారం చెలాయించదు;+ నేను వాళ్లను ఎంత తక్కువ స్థాయికి తెస్తానంటే వాళ్లు ఇక వేరే జనాల్ని లోబర్చుకోలేరు.+ 16 అది ఇంకెప్పుడూ ఇశ్రాయేలు ఇంటివాళ్లు దానిమీద నమ్మకం పెట్టుకునే స్థితిలో ఉండదు,+ బదులుగా అది కేవలం వాళ్ల తప్పును, అంటే సహాయం కోసం ఐగుప్తీయుల వైపు చూడడం అనే తప్పును వాళ్లకు గుర్తు చేస్తుంది. అప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” ’ ”
17 27వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18 “మానవ కుమారుడా, బబులోను రాజైన నెబుకద్నెజరు*+ తూరు మీద దాడి చేసేటప్పుడు తన సైన్యం చేత చాలా కష్టమైన పని చేయించాడు.+ ప్రతీ తల బోడి అయింది, ప్రతీ భుజం ఒరుచుకుపోయింది. కానీ తూరు విషయంలో పడ్డ కష్టానికి అతనికి గానీ, అతని సైన్యానికి గానీ జీతం దొరకలేదు.
19 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘ఇదిగో, నేను ఐగుప్తు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు* ఇస్తున్నాను,+ అతను దాని సంపదను పట్టుకెళ్లిపోతాడు, దాని నుండి ఎంతో దోపుడుసొమ్మును, కొల్లసొమ్మును తీసుకెళ్తాడు; అది అతని సైన్యానికి జీతం అవుతుంది.’
20 “ ‘తూరును* నాశనం చేసే విషయంలో వాళ్లు నా కోసమే పనిచేశారు కాబట్టి అతను పడ్డ శ్రమకు జీతంగా నేను ఐగుప్తు దేశాన్ని అతనికి ఇస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.
21 “ఆ రోజున ఇశ్రాయేలు ఇంటివాళ్ల కోసం ఒక కొమ్మును మొలిపిస్తాను,*+ వాళ్ల మధ్య మాట్లాడే అవకాశం నీకు ఇస్తాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.”
30 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“ ‘అయ్యో, ఆ రోజు వచ్చేస్తోంది!’ అని ఏడ్వండి.
3 ఎందుకంటే ఆ రోజు దగ్గరపడింది, అవును, యెహోవా రోజు దగ్గరపడింది.+
అది కారుమబ్బులు కమ్ముకునే రోజు,+ జనాలకు తీర్పుతీర్చే రోజు.+
4 ఐగుప్తు మీదికి ఒక ఖడ్గం వస్తుంది, ఐగుప్తులో శవాలు పడివున్నప్పుడు ఇతియోపియాకు భయం పట్టుకుంటుంది;
ఐగుప్తు సంపద దోచుకోబడుతుంది, దాని పునాదులు కూలిపోతాయి.+
5 ఇతియోపియా,+ పూతు,+ లూదు అలాగే ఇతర జనాల ప్రజలందరూ,
కూబు, ఒప్పంద దేశ ప్రజలు*
అందరూ ఖడ్గం వల్ల చనిపోతారు.” ’
6 యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఐగుప్తు మద్దతుదారులు కూడా చనిపోతారు,
గర్వానికి కారణమైన దాని బలం అణచివేయబడుతుంది.’+
“ ‘మిగ్దోలు+ నుండి సెవేనే+ వరకు వాళ్లు దేశంలో ఖడ్గం వల్ల చనిపోతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు. 7 ‘అది దేశాలన్నిట్లో అత్యంత నిర్జన దేశంగా చేయబడుతుంది, దాని నగరాలు అత్యంత నిర్మానుష్య నగరాలు అవుతాయి.+ 8 నేను ఐగుప్తులో అగ్ని రాజేసినప్పుడు, దానితో పొత్తు పెట్టుకున్నవాళ్లంతా నలగ్గొట్టబడినప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 9 ఆ రోజు నేను ఓడల మీద సందేశకుల్ని పంపించి, తనమీద తాను నమ్మకం పెట్టుకున్న ఇతియోపియా భయంతో వణికిపోయేలా చేస్తాను; ఐగుప్తు మీదికి ఆ రోజు వచ్చినప్పుడు వాళ్లకు భయం పట్టుకుంటుంది, ఎందుకంటే అది ఖచ్చితంగా వస్తుంది.’
10 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బబులోను రాజైన నెబుకద్నెజరు* ద్వారా ఐగుప్తు సైన్యాల్ని అంతం చేస్తాను.+ 11 అతనూ, జనాల్లో అత్యంత కిరాతకమైన అతని దండ్లూ+ ఆ దేశంలోకి వచ్చి దాన్ని నాశనం చేస్తారు. వాళ్లు ఐగుప్తు మీదికి కత్తులు దూసి, దేశాన్ని శవాలతో నింపేస్తారు.+ 12 నేను నైలు కాలువల్ని+ ఎండిన నేలగా చేస్తాను, ఆ దేశాన్ని దుష్టుల చేతికి అప్పగిస్తాను.* నేను విదేశీయుల చేత ఆ దేశాన్ని, దానిలోని సమస్తాన్ని నిర్మానుష్యం చేస్తాను.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.’
13 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను అసహ్యమైన విగ్రహాల్ని* కూడా నాశనం చేసి, నోఫులో* ఉన్న వ్యర్థమైన దేవుళ్లను అంతం చేస్తాను.+ ఇక ఐగుప్తు దేశంలో ఒక్క అధిపతి* కూడా ఉండడు, నేను ఐగుప్తు దేశంలో భయం పుట్టిస్తాను.+ 14 పత్రోసును+ నిర్మానుష్యం చేస్తాను, సోయనులో నిప్పు అంటిస్తాను, నో* మీద శిక్ష విధిస్తాను.+ 15 ఐగుప్తుకు బలమైన దుర్గంలా ఉన్న సీను మీద నా ఉగ్రత కుమ్మరిస్తాను, నో జనాభాను నాశనం చేస్తాను. 16 ఐగుప్తులో అగ్ని రాజేస్తాను; సీనుకు భయం పట్టుకుంటుంది, నోలో శత్రువులు చొరబడతారు, నోఫు* పట్టపగలే దాడికి గురౌతుంది! 17 ఓను,* పిబేసెతు యువకులు ఖడ్గం వల్ల చనిపోతారు, ఆ నగరాలు చెరపట్టబడతాయి. 18 నేను తహపనేసులో ఐగుప్తు కాడిని విరగ్గొట్టినప్పుడు పగలే చీకటి అవుతుంది.+ గర్వానికి కారణమైన దాని బలం అంతమౌతుంది,+ మేఘాలు దాన్ని కమ్ముకుంటాయి, దాని పట్టణాలు చెరపట్టబడతాయి.+ 19 నేను ఐగుప్తుకు శిక్ష విధిస్తాను, అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”
20 11వ సంవత్సరం మొదటి నెల ఏడో రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 21 “మానవ కుమారుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో చేతిని విరగ్గొట్టాను; అది బాగయ్యేలా దానికి కట్టుకట్టరు, అది మళ్లీ ఖడ్గం పట్టుకునేంత బలంగా తయారయ్యేలా దానికి పట్టీలు చుట్టరు.”
22 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను ఐగుప్తు రాజైన ఫరోకు వ్యతిరేకంగా ఉన్నాను,+ నేను అతని రెండు చేతుల్నీ అంటే బలమైనదాన్ని, విరిగినదాన్ని విరగ్గొట్టి,+ అతని చేతిలో నుండి ఖడ్గం పడిపోయేలా చేస్తాను.+ 23 తర్వాత నేను ఐగుప్తీయుల్ని జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను.+ 24 నేను బబులోను రాజు చేతుల్ని బలపర్చి,+ నా ఖడ్గాన్ని అతని చేతిలో ఉంచుతాను;+ అయితే ఫరో చేతుల్ని నేను విరగ్గొడతాను, ఫరో అతని ముందు* చనిపోతున్నవాడిలా గట్టిగా మూల్గుతాడు. 25 నేను బబులోను రాజు చేతుల్ని బలపరుస్తాను, అయితే ఫరో చేతులు చచ్చుబడిపోతాయి; నేను బబులోను రాజు చేతిలో నా ఖడ్గాన్ని పెట్టినప్పుడు, అతను ఐగుప్తు దేశం మీదికి దాన్ని దూసినప్పుడు+ నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 26 నేను ఐగుప్తీయుల్ని జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”
31 11వ సంవత్సరం మూడో నెల మొదటి రోజున యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఐగుప్తు రాజైన ఫరోతో, అతని సైన్యాలతో ఇలా చెప్పు,+
‘గొప్పతనం విషయంలో నువ్వు ఎవరిలా ఉన్నావు?
3 నువ్వు ఒక అష్షూరీయుడిలా, లెబానోనులోని దేవదారు చెట్టులా ఉన్నావు,
దానికి అందమైన కొమ్మలు ఉండేవి, అది గుబురుగా ఉండి నీడనిచ్చేది, చాలా ఎత్తుగా ఉండేది;
దాని కొన మేఘాల్లో ఉండేది.
4 నీళ్ల వల్ల అది పెద్దగా పెరిగింది, లోతైన నీటి ఊటల వల్ల ఎత్తుగా ఎదిగింది.
అది నాటబడిన చోట చుట్టూ వాగులు ఉండేవి;
వాటి కాలువలు మైదానంలోని చెట్లన్నిటికీ ప్రవహించేవి.
5 అందుకే అది మైదానంలోని చెట్లన్నిటి కన్నా ఎత్తుగా పెరిగింది.
ఆ వాగుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంవల్ల
దాని శాఖలు విస్తరించాయి, కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.
6 దాని శాఖల్లో ఆకాశపక్షులన్నీ గూళ్లు కట్టుకున్నాయి,
దాని కొమ్మల కింద అడవి జంతువులన్నీ పిల్లల్ని కన్నాయి,
ఎక్కువ జనాభా ఉన్న జనాలన్నీ దాని నీడలో నివసించాయి.
7 దాని వేళ్లు విస్తార జలాల్లోకి వ్యాపించడం వల్ల
అది ఎంతో అందంగా తయారైంది, దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.
8 దేవుని తోటలోని+ ఏ దేవదారు చెట్టూ దానిలా లేదు.
దానిలాంటి శాఖలు ఏ సరళవృక్షానికీ లేవు,
దానిలాంటి కొమ్మలు ఏ సాల చెట్టుకూ లేవు.
దేవుని తోటలోని ఏ చెట్టూ దాని అందంతో పోటీ పడలేదు.
9 నేను దానికి దట్టమైన ఆకులు, కొమ్మలు ఇచ్చి దాన్ని అందంగా చేశాను,
ఏదెను తోటలో అంటే సత్యదేవుని తోటలో ఉన్న చెట్లన్నీ దాన్ని చూసి ఈర్ష్యపడ్డాయి.’
10 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అది* చాలా ఎత్తుగా పెరిగి, తన కొనను మేఘాల్లోకి హెచ్చించుకుంది, దాని ఎత్తు వల్ల దాని హృదయానికి పొగరెక్కింది కాబట్టి, 11 నేను దాన్ని జనాల బలమైన పరిపాలకుడికి అప్పగిస్తాను.+ అతను ఖచ్చితంగా దాన్ని శిక్షిస్తాడు; నేను దాని దుష్టత్వాన్ని బట్టి దాన్ని తిరస్కరిస్తాను. 12 జనాల్లో అత్యంత కిరాతకులైన విదేశీయులు దాన్ని నరికేసి పర్వతాల మీద విడిచిపెడతారు, దాని ఆకులు లోయలన్నిట్లో రాలిపడతాయి, దాని కొమ్మలు దేశంలోని వాగులన్నిట్లో విరిగిపడతాయి.+ భూమ్మీది జనాలన్నీ దాని నీడ నుండి బయటికొచ్చి, దాన్ని విడిచిపెడతాయి. 13 పడిపోయిన దాని మొద్దు మీద ఆకాశపక్షులు, దాని కొమ్మల మీద అడవి జంతువులు నివసిస్తాయి.+ 14 ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇకమీదట నీళ్ల దగ్గరున్న ఏ చెట్టూ అంత ఎత్తు ఎదగకూడదు, దాని కొనను మేఘాల్లోకి హెచ్చించకూడదు, పుష్కలంగా నీళ్లు అందే ఏ చెట్టూ మేఘాల్ని తాకేంత ఎత్తు ఎదగకూడదు. అవన్నీ గోతిలోకి* దిగిపోతున్న మనుషులతో పాటు మరణానికి, కింద ఉన్న దేశానికి అప్పగించబడతాయి.’
15 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అది సమాధిలోకి* దిగిపోయే రోజున, నేను ప్రజలు దుఃఖించేలా చేస్తాను. నేను లోతైన జలాల్ని ఆపి, వాగులకు అడ్డుకట్ట వేసి, విస్తార జలాల్ని అడ్డుకుంటాను. నేను ఆ చెట్టు కారణంగా లెబానోనును చీకటిమయం చేస్తాను, దాంతో మైదానంలోని చెట్లన్నీ వాడిపోతాయి. 16 గోతిలోకి* దిగిపోయే వాళ్లందరితో పాటు నేను దాన్ని సమాధిలోకి* పంపేటప్పుడు, అది పతనమైన శబ్దానికి జనాలు వణికిపోయేలా చేస్తాను; ఏదెనులోని చెట్లన్నీ,+ లెబానోనులోని శ్రేష్ఠమైన మంచిమంచి చెట్లన్నీ, నీళ్లు పుష్కలంగా అందే చెట్లన్నీ, కింద ఉన్న దేశంలో ఊరట పొందుతాయి. 17 అవి అతనితో* పాటు, జనాల మధ్య అతని నీడలో నివసించిన అతని మద్దతుదారులతో* పాటు సమాధిలోకి* అంటే ఖడ్గం వల్ల చనిపోయినవాళ్ల+ దగ్గరికి వెళ్లాయి.’+
18 “ ‘ఘనత విషయంలో, గొప్పతనం విషయంలో ఏదెనులోని ఏ చెట్టు నీలా ఉంది?+ అయితే ఏదెనులోని చెట్లతోపాటు నువ్వు ఖచ్చితంగా కింద ఉన్న దేశానికి తీసుకురాబడతావు. నువ్వు ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు సున్నతిలేనివాళ్ల మధ్య పడుకుంటావు. ఫరోకు, అతని సైన్యాలన్నిటికీ ఇలా జరుగుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”
32 12వ సంవత్సరం 12వ నెల మొదటి రోజున యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఐగుప్తు రాజైన ఫరో గురించి ఒక శోకగీతం పాడి, అతనితో ఇలా చెప్పు,
‘నువ్వు జనాల్లో బలమైన కొదమ సింహంలా ఉండేవాడివి,
కానీ నీ నోరు మూతపడింది.
నువ్వు నీ నదుల్లో దొర్లుతూ, నీ కాళ్లతో జలాల్ని బురద చేస్తూ,
నదుల్ని* మురికిచేస్తున్న భారీ సముద్రప్రాణిలా ఉండేవాడివి.’+
3 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘అనేక జనాల సమూహం ద్వారా నేను నా వలను నీమీద వేస్తాను,
వాళ్లు దానితో నిన్ను బయటికి లాగుతారు.
4 నేను నిన్ను నేలమీద వదిలేస్తాను;
బయటి మైదానంలో నిన్ను పారేస్తాను.
ఆకాశపక్షులన్నీ నీమీద వాలేలా చేస్తాను,
అడవి జంతువులన్నీ నీ మాంసంతో తృప్తిపడేలా చేస్తాను.+
5 నీ మాంసాన్ని పర్వతాల మీద విసిరేస్తాను,
నీ అవశేషాలతో లోయల్ని నింపేస్తాను.+
6 నీ రక్తంతో దేశం పర్వతాల వరకు తడిసిపోయేలా చేస్తాను,
వాగులు నీ రక్తంతో నిండిపోతాయి.’
7 ‘నేను నిన్ను ఆర్పేసినప్పుడు ఆకాశాన్ని కప్పేస్తాను, నక్షత్రాల్ని చీకటిమయం చేస్తాను.
సూర్యుణ్ణి మేఘాలతో కప్పేస్తాను,
చంద్రుడు తన వెలుగు ఇవ్వడు.+
8 నీ కారణంగా నేను ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటిమయం చేస్తాను,
నీ దేశాన్ని చీకటితో కప్పేస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.
9 ‘నేను నీ ప్రజల్ని వేరే దేశాల్లోకి, నీకు తెలియని దేశాల్లోకి బందీలుగా తీసుకెళ్లినప్పుడు+
అనేక జనాల హృదయాల్లో భయం పుట్టేలా చేస్తాను.
10 నేను వాళ్ల రాజుల ఎదుట నా ఖడ్గాన్ని ఆడించినప్పుడు
అనేక జనాలు నిర్ఘాంతపోతాయి, ఆ రాజులు భయంతో వణికిపోతారు.
నువ్వు పతనమైన రోజున
వాళ్లలో ప్రతీ ఒక్కరు ప్రాణ భయంతో గజగజలాడతారు.’
11 ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
‘బబులోను రాజు ఖడ్గం నీ మీదికి వస్తుంది.+
12 నేను బలమైన యోధుల ఖడ్గాల వల్ల నీ సైన్యాలు కూలిపోయేలా చేస్తాను,
వాళ్లందరూ జనాల్లో అత్యంత కిరాతకులు.+
వాళ్లు ఐగుప్తు గర్వకారణాన్ని అణచివేస్తారు, దాని సైన్యాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.+
13 నేను దాని విస్తార జలాల పక్కన ఉన్న దాని పశువులన్నిటినీ నాశనం చేస్తాను,+
మనిషి కాలు గానీ, పశువు గిట్ట గానీ వాటిని మళ్లీ మురికి చేయదు.’+
14 ‘అప్పుడు నేను ఆ దేశ జలాల్ని తేటగా చేస్తాను,
వాళ్ల నదులు నూనెలా ప్రవహించేలా చేస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
15 ‘నేను ఐగుప్తును పనికిరాని నిర్జన స్థలంగా, సమస్తాన్ని కోల్పోయిన దేశంగా చేసినప్పుడు,+
దాని నివాసులందర్నీ నాశనం చేసినప్పుడు,
నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.+
16 ఇది శోకగీతం; ప్రజలు తప్పకుండా దీన్ని పాడతారు;
జనాల కూతుళ్లు దీన్ని పాడతారు.
ఐగుప్తు గురించి, దాని సైన్యాలన్నిటి గురించి వాళ్లు దీన్ని పాడతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
17 12వ సంవత్సరం, నెల 15వ రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18 “మానవ కుమారుడా, ఐగుప్తు సైన్యాల గురించి దుఃఖించు; గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు దాన్నీ, దానితోపాటు బలమైన జనాల కూతుళ్లనూ కిందవున్న దేశానికి పంపించు.
19 “ ‘అందంలో నువ్వు ఎవరికి సాటి? కిందికి దిగిపోయి, సున్నతిలేని వాళ్లతోపాటు పడివుండు!’
20 “ ‘వాళ్లు ఖడ్గంతో చంపబడినవాళ్ల మధ్య పడివుంటారు.+ అది ఖడ్గానికి అప్పగించబడింది; దాని సైన్యాలన్నిటితో పాటు దాన్ని ఈడ్చుకెళ్లండి.
21 “ ‘సమాధి* లోతుల్లో నుండి అత్యంత బలమైన యోధులు అతనితో, అతని సహాయకులతో మాట్లాడతారు. వాళ్లు ఖచ్చితంగా కిందికి దిగిపోయి, ఖడ్గంతో చంపబడిన సున్నతిలేని వాళ్లలా పడివుంటారు. 22 అష్షూరు, దాని సమూహమంతా అక్కడే ఉంది. వాళ్ల సమాధులు అతని చుట్టూ ఉన్నాయి, వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు.+ 23 దాని సమాధులు గొయ్యి* లోతుల్లో ఉన్నాయి, దాని సమూహం దాని సమాధి చుట్టూ ఉంది; వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు. ఎందుకంటే వాళ్లు సజీవుల దేశంలో భయం పుట్టించారు.
24 “ ‘అక్కడే ఏలాము+ ఉంది, దాని సైన్యాలన్నీ దాని సమాధి చుట్టూ ఉన్నాయి; వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు. వాళ్లు సజీవుల దేశంలో భయం పుట్టించారు, వాళ్లు సున్నతి లేకుండా కిందవున్న దేశానికి దిగిపోయారు. గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతో పాటు ఇప్పుడు వాళ్లు తమ అవమానాన్ని భరిస్తారు. 25 చంపబడినవాళ్ల మధ్య దానికోసం ఒక పరుపు సిద్ధం చేయబడింది, దాని సైన్యాలన్నీ దాని సమాధుల చుట్టూ ఉన్నాయి. వాళ్లంతా సున్నతిలేని వాళ్లు, సజీవుల దేశంలో భయం పుట్టించినందుకు ఖడ్గంతో చంపబడినవాళ్లు; గోతిలోకి* దిగిపోతున్నవాళ్లతో పాటు వాళ్లు తమ అవమానాన్ని భరిస్తారు. అతను చంపబడినవాళ్ల మధ్య ఉంచబడ్డాడు.
26 “ ‘అక్కడే మెషెకు, తుబాలు,+ వాళ్ల* సైన్యాలన్నీ ఉన్నాయి. అతని చుట్టూ వాళ్ల* సమాధులు ఉన్నాయి. వాళ్లంతా సున్నతిలేని వాళ్లు, సజీవుల దేశంలో భయం పుట్టించినందుకు ఖడ్గంతో పొడవబడినవాళ్లు. 27 చనిపోయి, తమ యుద్ధాయుధాలతో పాటు సమాధిలోకి* దిగిపోయిన సున్నతిలేని బలమైన యోధులతోపాటు వాళ్లు పడివుంటారు. వాళ్ల తలల కింద వాళ్ల కత్తులు,* వాళ్ల ఎముకల మీద వాళ్ల పాపాలు ఉంచబడతాయి; ఎందుకంటే ఈ బలమైన యోధులు సజీవుల దేశంలో భయం పుట్టించారు. 28 కానీ నువ్వు, సున్నతిలేని వాళ్ల మధ్య నాశనమౌతావు, ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు పడివుంటావు.
29 “ ‘అక్కడే ఎదోము,+ దాని రాజులు, దాని ప్రధానులందరూ ఉన్నారు. వాళ్లంతా బలవంతులే అయినా, ఖడ్గంతో చంపబడినవాళ్ల మధ్య ఉంచబడ్డారు; వాళ్లు కూడా గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు, సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటారు.+
30 “ ‘అక్కడే ఉత్తర దిక్కు అధిపతులందరూ,* సీదోనీయులందరూ+ ఉన్నారు. వాళ్లు తమ బలంతో భయం పుట్టించినా, చంపబడినవాళ్లతో పాటు అవమానంతో కిందికి దిగిపోయారు. వాళ్లు ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు సున్నతి లేకుండా పడివుంటారు, గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు తమ అవమానాన్ని భరిస్తారు.
31 “ ‘ఫరో వీళ్లందర్నీ చూసి, తన సైన్యాలకు జరిగిన దానంతటి విషయంలో ఊరట పొందుతాడు;+ ఫరో, అతని సైన్యమంతా ఖడ్గం వల్ల చనిపోతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.
32 “ ‘ఫరో సజీవుల దేశంలో భయం పుట్టించాడు కాబట్టి, అతనూ అతని సైన్యాలన్నీ సున్నతిలేని వాళ్లతోపాటు, ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు పడుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
33 తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి+ వాళ్లతో ఇలా అను,
“ ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గం రప్పిస్తే,+ ఆ దేశ ప్రజలందరూ ఒక మనిషిని ఎంచుకొని, అతన్ని తమ కావలివాడిగా నియమించుకుంటే, 3 అతను ఆ దేశం మీదికి ఖడ్గం రావడం చూసి, బూర* ఊది ప్రజల్ని హెచ్చరించినప్పుడు,+ 4 ఎవరైనా బూర శబ్దం విని కూడా హెచ్చరికను పట్టించుకోకపోతే,+ ఖడ్గం వచ్చి అతన్ని చంపేస్తే, అతని చావుకు* అతనే బాధ్యుడు.+ 5 అతను బూర శబ్దం విన్నాడు కానీ హెచ్చరికను పట్టించుకోలేదు. అతని చావుకు* అతనే బాధ్యుడు. అతను హెచ్చరికను పట్టించుకునివుంటే ప్రాణాన్ని కాపాడుకునేవాడు.
6 “ ‘అయితే ఆ కావలివాడు ఖడ్గం రావడం చూసి కూడా బూరను ఊదకుండా,+ ప్రజల్ని హెచ్చరించకుండా ఉంటే, ఖడ్గం వచ్చి వాళ్లలో ఒకరి ప్రాణాలు తీసినప్పుడు, ఆ వ్యక్తి తన దోషం వల్ల చనిపోతాడు, అయితే అతని రక్తానికి ఆ కావలివాణ్ణి బాధ్యునిగా ఎంచుతాను.’*+
7 “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటివాళ్లకు కావలివాడిగా నియమించాను; కాబట్టి నువ్వు నా నోటి నుండి ఏదైనా మాట విన్నప్పుడు, నా హెచ్చరికను వాళ్లకు చెప్పాలి.+ 8 నేను దుష్టుడితో, ‘దుష్టుడా, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు!’+ అని అన్నప్పుడు, ఆ దుష్టుడు తన ప్రవర్తన మార్చుకునేలా నువ్వు నోరు తెరిచి అతన్ని హెచ్చరించకపోతే, అతను తన దోషాన్ని బట్టి దుష్టుడిగానే చనిపోతాడు,+ కానీ అతని రక్తానికి నేను నిన్ను బాధ్యునిగా ఎంచుతాను. 9 అయితే, తన ప్రవర్తనను మార్చుకోమని నువ్వు దుష్టుణ్ణి హెచ్చరించినా అతను మారడానికి ఇష్టపడకపోతే, అతను తన దోషాన్ని బట్టి చనిపోతాడు;+ నువ్వు మాత్రం తప్పకుండా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.+
10 “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘ “మేము చేసిన తిరుగుబాట్లు, మా పాపాలు మామీద భారంగా ఉన్నాయి, వాటివల్ల మేము నశించిపోతున్నాం;+ అలాంటప్పుడు మేము ఎలా జీవిస్తూ ఉంటాం?”+ అని మీరు అంటున్నారు.’ 11 వాళ్లతో ఇలా చెప్పు, ‘ “నా జీవం తోడు, దుష్టుడు చనిపోవడం వల్ల నాకు సంతోషం కలగదు,+ కానీ అతను తన ప్రవర్తన మార్చుకుని+ జీవిస్తూ ఉంటేనే నాకు సంతోషం”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. “మీ చెడు మార్గాల్ని విడిచిపెట్టి వెనక్కి తిరగండి;+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఎందుకు చనిపోవాలి?” ’+
12 “మానవ కుమారుడా, నీ ప్రజలతో ఇలా అను, ‘నీతిమంతుడు తిరుగుబాటు చేసినప్పుడు, అతని నీతి అతన్ని రక్షించదు;+ అలాగే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు, అతని దుష్టత్వం అతన్ని తడబడేలా చేయదు;+ అలాగే నీతిమంతుడు పాపం చేసిన రోజున అతను తన నీతిని బట్టి జీవిస్తూ ఉండలేడు.+ 13 నేను నీతిమంతునితో, “నువ్వు తప్పకుండా బ్రతికేవుంటావు” అని చెప్పినప్పుడు, అతను తన నీతిని నమ్ముకుని తప్పు* చేస్తే,+ అతను చేసిన నీతికార్యాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు; తాను చేసిన తప్పును బట్టి అతను చనిపోతాడు.+
14 “ ‘నేను దుష్టునితో, “నువ్వు ఖచ్చితంగా చనిపోతావు” అని అన్నప్పుడు, అతను తన పాపాల్ని విడిచిపెట్టి, నీతిన్యాయాలతో నడుచుకుంటే,+ 15 తాకట్టు సొమ్మును తిరిగిచ్చేస్తే, దోచుకున్నదాన్ని తిరిగి చెల్లిస్తే,+ జీవాన్ని ఇచ్చే శాసనాల ప్రకారం నడుచుకుంటూ ఏ తప్పూ చేయకుండా ఉంటే, అతను తప్పకుండా బ్రతికేవుంటాడు.+ అతను చనిపోడు. 16 అతను చేసిన పాపాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు,+ అతను నీతిన్యాయాలతో నడుచుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా బ్రతికేవుంటాడు.’+
17 “కానీ నీ ప్రజలు, ‘యెహోవా మార్గం సరిగ్గా లేదు’ అని అన్నారు, కానీ నిజానికి సరిగ్గా లేనిది వాళ్ల మార్గమే.
18 “నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి తప్పు చేస్తే, అతను దాన్ని బట్టి చనిపోవాలి.+ 19 అలాగే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి, న్యాయంగా నీతిగా నడుచుకుంటే, అతను అలా నడుచుకుంటున్నందుకు బ్రతికేవుంటాడు.+
20 “కానీ మీరు, ‘యెహోవా మార్గం సరిగ్గా లేదు’ అని అన్నారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీలో ప్రతీ ఒక్కరికి మీ మీ మార్గాల ప్రకారం తీర్పు తీరుస్తాను.”
21 చివరికి, మేము చెరగా వెళ్లిన 12వ సంవత్సరం పదో నెల ఐదో రోజున, యెరూషలేము నుండి పారిపోయిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి,+ “నగరం ఆక్రమించబడింది!”+ అని చెప్పాడు.
22 అతను రావడానికి ముందురోజు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది; ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రావడానికి ముందు ఆయన నా నోరు తెరిచాడు. కాబట్టి నేను మళ్లీ మాట్లాడగలిగాను, ఇక మౌనంగా లేను.+
23 తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 24 “మానవ కుమారుడా, ఈ శిథిలాల మధ్య నివసిస్తున్నవాళ్లు+ ఇశ్రాయేలు దేశం గురించి ఇలా చెప్పుకుంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే అయినా అతను దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు.+ కానీ మనం చాలామందిమి ఉన్నాం; దేశం ఖచ్చితంగా మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది.’
25 “కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు రక్తం ఒలికించని మాంసం తింటున్నారు,+ మీ అసహ్యమైన విగ్రహాల* వైపు చూస్తున్నారు, రక్తం చిందిస్తూ ఉన్నారు.+ అలాంటప్పుడు ఈ దేశం మీకు ఎలా ఇవ్వబడుతుంది? 26 మీరు మీ ఖడ్గాన్ని నమ్ముకుంటున్నారు,+ అసహ్యమైన పనులు చేస్తున్నారు, మీలో ప్రతీ వ్యక్తి తన పొరుగువాడి భార్యను అపవిత్రపర్చాడు.+ అలాంటప్పుడు ఈ దేశం మీకు ఎలా ఇవ్వబడుతుంది?” ’+
27 “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా జీవం తోడు, శిథిలాల మధ్య నివసిస్తున్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు; బయట పొలంలో ఉన్నవాళ్లను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను; కోటల్లో, గుహల్లో నివసించేవాళ్లు రోగాలతో చనిపోతారు.+ 28 నేను దేశాన్ని ఎందుకూ పనికిరాని నిర్జన ప్రదేశంగా మారుస్తాను,+ గర్వానికి కారణమైన దాని బలం అంతమౌతుంది, ఇశ్రాయేలు పర్వతాలు ఎవ్వరూ సంచరించకుండా నిర్మానుష్యంగా తయారౌతాయి.+ 29 వాళ్లు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి+ నేను దేశాన్ని ఎందుకూ పనికిరాని నిర్జన ప్రదేశంగా మార్చినప్పుడు+ నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” ’
30 “మానవ కుమారుడా, నీ ప్రజలు గోడల పక్కన, ఇంటి గుమ్మాల దగ్గర నీ గురించి మాట్లాడుకుంటున్నారు.+ వాళ్లలో ప్రతీ ఒక్కరు తన సహోదరుడితో, ‘రా, యెహోవా ఏం చెప్తాడో విందాం’ అని అంటున్నారు. 31 వాళ్లు ఎప్పటిలా నీ దగ్గరికి వచ్చి, నా ప్రజల్లా నీ ముందు కూర్చుంటారు; నువ్వు చెప్పే మాటలు వింటారు, కానీ వాటిని పాటించరు.+ తమ నోటితో నిన్ను విపరీతంగా పొగుడుతారు, కానీ వాళ్ల హృదయం అక్రమ లాభం కోసం తహతహలాడుతుంది. 32 ఇదిగో! నువ్వు వాళ్లకు, నేర్పుగా తంతివాద్యం వాయిస్తూ, మధురమైన స్వరంతో ప్రణయగీతం పాడే వ్యక్తిలా ఉన్నావు. వాళ్లు నీ మాటలు వింటారు, కానీ ఒక్కరు కూడా వాటిని పాటించరు. 33 అయితే ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరతాయి, అవి నెరవేరినప్పుడు, తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్లు తెలుసుకుంటారు.”+
34 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు. వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “తమ కడుపు నింపుకుంటున్న ఇశ్రాయేలు కాపరులకు శ్రమ!+ కాపరులు మేపాల్సింది మందను కాదా?+ 3 మీరు కొవ్వును తింటారు, ఉన్నితో చేసిన వస్త్రాలు వేసుకుంటారు, కొవ్విన జంతువుల్ని వధిస్తారు,+ కానీ మందను మాత్రం మేపరు.+ 4 మీరు బలహీనంగా ఉన్నవాటిని బలపర్చలేదు, జబ్బుపడిన వాటిని బాగుచేయలేదు, గాయపడిన వాటికి కట్టుకట్టలేదు, దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటిని వెదకలేదు;+ బదులుగా కఠినంగా, క్రూరంగా వాటిమీద పెత్తనం చెలాయించారు.+ 5 కాబట్టి కాపరి లేక అవి చెల్లాచెదురైపోయాయి;+ అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికీ ఆహారమయ్యాయి. 6 నా గొర్రెలు దారితప్పి ప్రతీ పర్వతం మీద, ఎత్తైన ప్రతీ కొండ మీద తిరిగాయి; నా గొర్రెలు భూమంతటా చెదిరిపోయాయి, వాటి కోసం వెదికేవాళ్లు గానీ, వాటిని కనుగొనాలని ప్రయత్నించేవాళ్లు గానీ ఎవరూ లేరు.
7 “ ‘ “కాబట్టి కాపరులారా, యెహోవా చెప్పేది వినండి: 8 ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “కాపరి లేకపోవడం వల్ల, నా కాపరులు నా గొర్రెల కోసం వెదకనందువల్ల అవి అడవి జంతువులన్నిటికీ ఆహారమయ్యాయి; ఆ కాపరులు నా గొర్రెల్ని మేపకుండా తమ కడుపు నింపుకుంటూ ఉన్నారు, కాబట్టి నా జీవం తోడు నేను తప్పకుండా చర్య తీసుకుంటాను.” ’ 9 కాపరులారా, యెహోవా చెప్పేది వినండి. 10 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఆ కాపరులకు వ్యతిరేకంగా ఉన్నాను, నా గొర్రెల గురించి నేను వాళ్లను లెక్క అడుగుతాను, వాళ్లు ఇక నా గొర్రెల్ని కాయకుండా, తమ కడుపు నింపుకోకుండా చేస్తాను.+ నేను వాళ్ల నోళ్ల నుండి నా గొర్రెల్ని రక్షిస్తాను, అవి ఇక వాళ్లకు ఆహారం అవ్వవు.’ ”
11 “ ‘ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో, నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదికి, వాటి బాగోగులు చూసుకుంటాను.+ 12 చెదిరిపోయిన తన గొర్రెల్ని వెదికి, వాటికి మేత పెట్టే కాపరిలా నేను నా గొర్రెల బాగోగులు చూసుకుంటాను.+ కారుమబ్బులు, కటిక చీకటి కమ్ముకునే రోజున+ అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయాయో ఆ స్థలాలన్నిటి నుండి నేను వాటిని రక్షిస్తాను. 13 నేను వాటిని జనాల నుండి తీసుకొచ్చి, దేశాల నుండి వాటిని సమకూరుస్తాను; వాటి స్వదేశానికి వాటిని తోలుకొచ్చి, ఇశ్రాయేలు పర్వతాల మీద వాగుల పక్కన, దేశంలో ప్రజలు నివసించే ప్రాంతాలన్నిటి దగ్గర వాటిని మేపుతాను.+ 14 మంచి మేత స్థలంలో నేను వాటిని మేపుతాను, ఇశ్రాయేలు ఎత్తైన పర్వత ప్రాంతాలు వాటికి మేత స్థలాలు అవుతాయి.+ అవి అక్కడ మంచి పచ్చిక మైదానంలో పడుకుంటాయి,+ ఇశ్రాయేలు పర్వతాల మీదున్న శ్రేష్ఠమైన మేత స్థలాల్లో మేస్తాయి.”
15 “ ‘ “నేనే స్వయంగా నా గొర్రెల్ని మేపుతాను,+ నేనే వాటిని పడుకోబెడతాను”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 16 “నేను తప్పిపోయిన దాన్ని వెదుకుతాను,+ దారితప్పిన దాన్ని వెనక్కి తీసుకొస్తాను, గాయపడిన దానికి కట్టుకడతాను, బలహీనంగా ఉన్నదాన్ని బలపరుస్తాను; అయితే కొవ్వినదాన్ని, బలంగా ఉన్నదాన్ని నేను నాశనం చేస్తాను. దానికి శిక్ష అనే మేత పెడతాను.”
17 “ ‘అయితే నా గొర్రెలారా, మీ గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను గొర్రెకూ గొర్రెకూ మధ్య, పొట్టేళ్లకూ మేకపోతులకూ మధ్య తీర్పు తీర్చబోతున్నాను.+ 18 మీరు శ్రేష్ఠమైన మేత స్థలాల్లో మేస్తున్నారు, అది చాలదా? మిగతా మేత స్థలాల్ని కూడా కాళ్లతో తొక్కేస్తారా? మీరు స్వచ్ఛమైన నీళ్లు తాగి, తర్వాత మీ కాళ్లతో వాటిని మురికి చేస్తారా? 19 ఇప్పుడు నా గొర్రెలు మీరు కాళ్లతో తొక్కేసిన మేత స్థలాల్లో మేయాలా? మీరు మురికి చేసిన నీళ్లను తాగాలా?”
20 “ ‘కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో, నేనే స్వయంగా కొవ్విన గొర్రెకూ, బక్కచిక్కిన గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను, 21 ఎందుకంటే జబ్బుపడ్డ వాటన్నిటినీ మీరు మీ డొక్కతో, భుజంతో నెట్టేస్తూ, మీ కొమ్ములతో పొడుస్తూ వాటిని దూరంగా చెదరగొట్టారు. 22 నేను నా గొర్రెల్ని రక్షిస్తాను, అవి ఇక వేటికీ ఆహారం అవ్వవు;+ నేను గొర్రెకూ గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను. 23 వాటిమీద ఒక్క కాపరిని,+ అంటే నా సేవకుడైన దావీదును నియమిస్తాను,+ అతను వాటిని మేపుతాడు. అతనే స్వయంగా వాటిని మేపి, వాటికి కాపరిగా ఉంటాడు.+ 24 యెహోవానైన నేను వాళ్లకు దేవుడిగా ఉంటాను,+ నా సేవకుడైన దావీదు వాళ్ల మధ్య ప్రధానుడిగా ఉంటాడు.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.
25 “ ‘ “అవి నిర్భయంగా ఎడారిలో నివసించేలా, అడవుల్లో పడుకునేలా+ నేను వాటితో ఒక శాంతి ఒప్పందం చేసి, దేశంలో క్రూరమృగాలే లేకుండా చేస్తాను.+ 26 నేను వాటినీ, నా కొండ చుట్టూ ఉన్న ప్రాంతాన్నీ దీవెనగా చేస్తాను,+ సకాలంలో వర్షాలు పడేలా చేస్తాను. దీవెనలు వర్షంలా కురుస్తాయి.+ 27 మైదానంలోని చెట్లు పండ్లను ఇస్తాయి, నేల పంటను ఇస్తుంది,+ నా ప్రజలు దేశంలో సురక్షితంగా నివసిస్తారు. నేను వాళ్ల కాడిని విరగ్గొట్టి,+ తమను బానిసలుగా చేసుకున్నవాళ్ల నుండి వాళ్లను విడిపించినప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 28 వాళ్లు ఇక జనాలకు దోపుడుసొమ్ముగా ఉండరు, భూమ్మీది అడవి జంతువులు వాళ్లను మింగేయవు, వాళ్లు ఎవరి భయం లేకుండా సురక్షితంగా నివసిస్తారు.+
29 “ ‘ “నేను పేరుపొందిన ఒక తోటను వాళ్లకు ఇస్తాను, వాళ్లు ఇక దేశంలో కరువు వల్ల చనిపోరు,+ జనాల చేతిలో అవమానాలపాలు అవ్వరు. 30 ‘అప్పుడు నేను అంటే వాళ్ల దేవుడైన యెహోవాను వాళ్లతో ఉన్నాననీ, వాళ్లు అంటే ఇశ్రాయేలు ఇంటివాళ్లు నా ప్రజలనీ+ వాళ్లు తెలుసుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’
31 “ ‘నేను కాసే నా గొర్రెలారా,+ మీరు కేవలం మనుషులు, నేను మీ దేవుణ్ణి’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
35 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, శేయీరు+ పర్వత ప్రాంతం వైపు నీ ముఖం తిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించు.+ 3 దానితో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “శేయీరు పర్వత ప్రాంతమా, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. నేను నీ మీదికి నా చెయ్యి చాపి, నిన్ను పనికిరాని నిర్జన ప్రదేశంగా మారుస్తాను.+ 4 నేను నీ నగరాల్ని శిథిలాలుగా మారుస్తాను, నువ్వు పనికిరాని నిర్జన ప్రదేశంగా తయారౌతావు;+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. 5 ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలీయుల మీద ఎడతెగని శత్రుత్వం చూపించావు;+ వాళ్ల మీదికి విపత్తు వచ్చినప్పుడు, వాళ్ల చివరి శిక్షా సమయంలో నువ్వు వాళ్లను ఖడ్గానికి అప్పగించావు.” ’+
6 “ ‘కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతం కోసం సిద్ధం చేస్తాను, అది నిన్ను వెంటాడుతుంది.+ నువ్వు రక్తాన్ని ద్వేషించావు, కాబట్టి రక్తపాతమే నిన్ను వెంటాడుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 7 ‘నేను శేయీరు పర్వత ప్రాంతాన్ని పనికిరాని నిర్జన ప్రదేశంగా చేసి,+ దానిలో ఎవరూ తిరగకుండా, దానిలోకి ఎవరూ తిరిగిరాకుండా చేస్తాను. 8 దాని పర్వతాల్ని శవాలతో నింపేస్తాను; ఖడ్గంతో చంపబడినవాళ్లు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగులన్నిట్లో పడివుంటారు. 9 నువ్వు ఎప్పటికీ నిర్జనంగా పడివుండేలా చేస్తాను, నీ నగరాల్లో ఎవరూ నివసించరు;+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’
10 “యెహోవాయే స్వయంగా అక్కడ ఉన్నా కూడా నువ్వు, ‘ఈ రెండు జనాలు, ఈ రెండు దేశాలు నా సొంతమౌతాయి, మనం వాటిని స్వాధీనం చేసుకుందాం’+ అని అన్నావు కాబట్టి, 11 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నా జీవం తోడు, నువ్వు వాళ్లపట్ల ద్వేషంతో వాళ్లమీద ఎంత కోపం, ఈర్ష్య చూపించావో నేను కూడా నీతో అలాగే వ్యవహరిస్తాను;+ నేను నీకు తీర్పు తీర్చినప్పుడు వాళ్ల మధ్య నన్ను నేను తెలియజేసుకుంటాను. 12 నువ్వు ఇశ్రాయేలు పర్వతాల గురించి, “అవి నిర్జనంగా పడివున్నాయి, వాటిని నాశనం చేసే అవకాశం మనకు దొరికింది” అంటూ పలికిన అవమానకరమైన మాటలన్నిటినీ యెహోవానైన నేనే స్వయంగా విన్నానని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. 13 మీరు అహంకారంతో నాకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు,+ అవన్నీ నేను విన్నాను.’
14 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను పనికిరాని నిర్జన ప్రదేశంగా చేసినప్పుడు భూమంతా సంతోషిస్తుంది. 15 ఇశ్రాయేలు ఇంటివాళ్ల స్వాస్థ్యం నిర్జనంగా పడివున్నప్పుడు నువ్వు సంతోషించావు కాబట్టి నేను కూడా నీతో అలాగే వ్యవహరిస్తాను.+ శేయీరు పర్వత ప్రాంతమా, నువ్వు, అవును ఎదోము అంతా శిథిలాలుగా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”
36 “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాల గురించి ఇలా ప్రవచించు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా చెప్పేది వినండి. 2 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “శత్రువు మీ గురించి, ‘ఆహా! ప్రాచీన ఉన్నత స్థలాలు కూడా మా సొంతమయ్యాయి!’ అని అన్నాడు.” ’+
3 “కాబట్టి నువ్వు ప్రవచించి ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లు మిమ్మల్ని నిర్జనంగా చేసి, అన్నివైపుల నుండి మీ మీద దాడిచేసి, జనాల్లో మిగిలినవాళ్లు మిమ్మల్ని స్వాధీనం చేసుకునేలా, ప్రజలు మీ గురించి లేనిపోనివి చెప్పుకునేలా చేశారు కాబట్టి,+ 4 ఇశ్రాయేలు పర్వతాల్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేది వినండి! పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో, నిర్జనంగా పడివున్న శిథిలాలతో,+ దోచుకోబడి చుట్టుపక్కల జనాల్లో మిగిలినవాళ్ల చేత ఎగతాళి చేయబడిన పాడైన నగరాలతో+ సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు; 5 సర్వోన్నత ప్రభువైన యెహోవా వాటితో ఏమంటున్నాడంటే: ‘నేను రోషాగ్నితో+ జనాల్లో మిగిలినవాళ్లకు, ఎదోము వాళ్లందరికి వ్యతిరేకంగా మాట్లాడతాను; నా దేశంలోని పచ్చికబయళ్లు ఆక్రమించుకోవాలని, దేశాన్ని దోచుకోవాలని వాళ్లు ఎంతో సంతోషంతో, విపరీతమైన ద్వేషంతో+ దాన్ని తమ సొత్తు అని చెప్పుకున్నారు.’ ” ’+
6 “కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచిస్తూ పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు జనాల అవమానాన్ని భరించారు కాబట్టి,+ ఇదిగో! నేను రోషంతో, కోపంతో మాట్లాడతాను.” ’
7 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘చుట్టుపక్కల జనాలు కూడా తమ అవమానాన్ని భరిస్తాయని+ నేను చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. 8 అయితే ఇశ్రాయేలు పర్వతాల్లారా, మీరు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం కొమ్మలు వేసి ఫలాలు ఇస్తారు;+ ఎందుకంటే వాళ్లు త్వరలోనే తిరిగొస్తారు. 9 నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ వైపుకు తిరుగుతాను, మీరు సాగుచేయబడతారు, మీలో విత్తనాలు విత్తుతారు. 10 నేను మీ ప్రజల్ని అంటే ఇశ్రాయేలు ఇంటివాళ్లందర్నీ వృద్ధి చేస్తాను; నగరాల్లో మళ్లీ ప్రజలు నివసిస్తారు,+ శిథిలాలు మళ్లీ కట్టబడతాయి.+ 11 అవును, నేను మీ ప్రజల్ని, పశువుల్ని వృద్ధి చేస్తాను;+ వాళ్ల సంఖ్య, వాటి సంఖ్య ఎక్కువయ్యేలా చేస్తాను. ముందులాగే మళ్లీ మీలో ప్రజలు నివసించేలా,+ మీరు గతంలో కన్నా ఎక్కువగా వృద్ధి అయ్యేలా చేస్తాను;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 12 మళ్లీ మీ మీద ప్రజలు అంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నడిచేలా చేస్తాను, వాళ్లు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు.+ మీరు వాళ్ల సొత్తు అవుతారు, మీరు ఇంకెప్పుడూ వాళ్లను పిల్లలు లేనివాళ్లుగా చేయరు.’ ”+
13 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్లు మీతో, “నువ్వు ప్రజల్ని మింగేసే, నీ జనాల్ని పిల్లలు లేకుండా చేసే దేశానివి” అని అంటున్నారు కాబట్టి’ 14 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నువ్వు ఇక ప్రజల్ని మింగేయవు, నీ జనాల్ని పిల్లలు లేనివాళ్లుగా చేయవు. 15 నేను నిన్ను ఇక జనాల చేతిలో అవమానాలపాలు చేయను, ప్రజల నిందల్ని భరించేలా చేయను,+ నువ్వు ఇక నీ జనాల్ని తడబడేలా చేయవు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
16 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 17 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ దేశంలో నివసించినప్పుడు వాళ్లు తమ మార్గాలతో, పనులతో దాన్ని అపవిత్రం చేశారు.+ వాళ్ల మార్గాలు నా దృష్టిలో రుతుస్రావ అపవిత్రతలా ఉన్నాయి.+ 18 వాళ్లు దేశంలో రక్తం చిందించారు, తమ అసహ్యమైన విగ్రహాలతో* దేశాన్ని అపవిత్రం చేశారు+ కాబట్టి నేను వాళ్లమీద నా ఉగ్రతను కుమ్మరించాను.+ 19 వాళ్లను జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొట్టాను;+ వాళ్ల మార్గాల్ని బట్టి, పనుల్ని బట్టి వాళ్లకు తీర్పు తీర్చాను. 20 అయితే వాళ్లు ఆ జనాల్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు వాళ్ల గురించి, ‘వీళ్లు యెహోవా ప్రజలు, కానీ ఆయన తన దేశం నుండి వీళ్లను చెదరగొట్టాడు’ అని అంటూ నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చారు.+ 21 కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లు తాము వెళ్లిన జనాల మధ్య అపవిత్రపర్చిన నా పవిత్రమైన పేరు కోసం నేను చర్య తీసుకుంటాను.”+
22 “కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ కోసం కాదు, మీరు వెళ్లిన జనాల మధ్య మీరు అపవిత్రపర్చిన నా పవిత్రమైన పేరు కోసం నేను చర్య తీసుకుంటున్నాను.” ’+ 23 ‘జనాల మధ్య అపవిత్రపర్చబడిన, వాళ్ల మధ్య మీరు అపవిత్రపర్చిన నా గొప్ప పేరును నేను ఖచ్చితంగా పవిత్రపర్చుకుంటాను;+ నేను వాళ్ల కళ్లముందు మీ మధ్య పవిత్రపర్చబడినప్పుడు, నేను యెహోవానని ఆ జనాలు తెలుసుకుంటాయి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 24 ‘నేను ఆ జనాల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, ఆ దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ దేశానికి తీసుకొస్తాను.+ 25 నేను మీ మీద శుద్ధీకరించే నీళ్లు చల్లుతాను, మీరు శుద్ధి అవుతారు;+ మీ అపవిత్రత అంతటి నుండి, మీ అసహ్యమైన విగ్రహాలన్నిటి+ నుండి నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను.+ 26 నేను మీకు ఒక కొత్త హృదయాన్ని,+ కొత్త మనోవైఖరిని ఇస్తాను.+ మీ శరీరాల్లో నుండి రాతి గుండె+ తీసేసి మీకు మాంసం గుండె* ఇస్తాను. 27 నా పవిత్రశక్తిని* మీలో ఉంచి, మీరు నా నియమాల ప్రకారం నడుచుకునేలా చేస్తాను,+ మీరు నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ, వాటి ప్రకారం జీవిస్తారు. 28 నేను మీ పూర్వీకులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు, మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవుడిగా ఉంటాను.’+
29 “ ‘మీ అపవిత్రత అంతటి నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, సమృద్ధిగా పండమని మీ ధాన్యానికి ఆజ్ఞాపిస్తాను, నేను మీ మీదికి కరువును రప్పించను.+ 30 చెట్లు ఎక్కువ పండ్లను, భూమి సమృద్ధిగా పంటను ఇచ్చేలా చేస్తాను, మీరు ఇంకెప్పుడూ కరువువల్ల జనాల మధ్య అవమానాలపాలు అవ్వరు.+ 31 అప్పుడు మీరు మీ చెడ్డమార్గాల్ని, చెడ్డపనుల్ని గుర్తుచేసుకుంటారు; మీ దోషాన్ని బట్టి, మీ హేయమైన పనుల్ని బట్టి మీ మీద మీకే అసహ్యం వేస్తుంది.+ 32 అయితే ఈ విషయం తెలుసుకోండి: నేను ఇదంతా చేసేది మీ కోసం కాదు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ మార్గాల్ని బట్టి సిగ్గుపడండి, అవమానంతో బాధపడండి.’
33 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను మీ దోషమంతటి నుండి మిమ్మల్ని శుద్ధి చేసే రోజున, మీ నగరాల్లో మళ్లీ ప్రజలు నివసించేలా,+ శిథిలాలు మళ్లీ కట్టబడేలా చేస్తాను.+ 34 దారిన పోయే వాళ్లందరి కళ్లముందు నిర్జనంగా పడివున్న దేశం మళ్లీ సాగుచేయబడుతుంది. 35 అప్పుడు ప్రజలు ఇలా అంటారు: “నిర్జనంగా ఉన్న దేశం ఏదెను తోటలా+ తయారైంది; పడగొట్టబడి నిర్జనంగా, శిథిలాలుగా ఉన్న నగరాల్లో మళ్లీ ప్రజలు నివసిస్తున్నారు, వాటి చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి.”+ 36 అప్పుడు మీ చుట్టుపక్కల మిగిలిన జనాలు, యెహోవానైన నేనే పడగొట్టబడినదాన్ని తిరిగి కట్టానని, నిర్జనంగా ఉన్నదానిలో చెట్లు నాటానని తెలుసుకుంటాయి. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను, దాన్ని నెరవేర్చాను.’+
37 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అంతేకాదు ఇశ్రాయేలు ఇంటివాళ్లు, తమను గొర్రెల మందలా వృద్ధి చేయమని నన్ను వేడుకోనిస్తాను. 38 శిథిలాలుగా మారిన నగరాలు పవిత్రుల సమూహంలా, యెరూషలేము పండుగ సమయాల్లో+ దాని గొర్రెల మందలా* ప్రజలతో నిండిపోతాయి;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”
37 తర్వాత, యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది, యెహోవా తన పవిత్రశక్తి* ద్వారా నన్ను తీసుకుపోయి ఒక లోయ మైదానం మధ్యలో దించాడు,+ దాని నిండా ఎముకలు ఉన్నాయి. 2 ఆయన వాటికి అన్నివైపులా నన్ను నడిపించాడు, ఆ లోయ మైదానంలో లెక్కలేనన్ని ఎముకలు ఉన్నాయి. అవి బాగా ఎండిపోయి ఉన్నాయి.+ 3 ఆయన నన్ను, “మానవ కుమారుడా, ఈ ఎముకలు మళ్లీ బ్రతకగలవా?” అని అడిగాడు. అందుకు నేను, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.+ 4 అప్పుడు ఆయన నాకు ఇలా చెప్పాడు: “ఈ ఎముకల గురించి ప్రవచించు, వాటితో ఇలా అను, ‘ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా చెప్పేది వినండి.
5 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఈ ఎముకలతో ఇలా అంటున్నాడు: “నేను మీలోకి ఊపిరి వచ్చేలా చేస్తాను, మీరు బ్రతుకుతారు.+ 6 నేను మీకు నరాల్ని, మాంసాన్ని ఇచ్చి చర్మంతో మిమ్మల్ని కప్పుతాను; మీలో ఊపిరి ఊదుతాను, మీరు బ్రతుకుతారు; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”
7 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను ప్రవచించాను. నేను ప్రవచిస్తుండగా, టపటప కొట్టుకుంటున్న శబ్దం వినిపించింది, ఆ ఎముకలు ఒకదాని దగ్గరికి ఒకటి రావడం మొదలుపెట్టాయి. 8 నేను ఇంకా చూస్తుండగా వాటి మీదికి నరాలు, మాంసం వచ్చాయి, చర్మం వాటిమీద కప్పుకుంది. కానీ వాటిలో ఇంకా ఊపిరి లేదు.
9 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “గాలితో ప్రవచించు. మానవ కుమారుడా, గాలితో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “గాలీ,* నలుదిక్కుల నుండి వచ్చి, చంపబడిన ఈ ప్రజలు బ్రతికేలా వాళ్ల మీద వీచు.” ’ ”
10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను ప్రవచించాను, అప్పుడు వాటిలోకి ఊపిరి* వచ్చింది; వాళ్లు బ్రతికి తమ పాదాల మీద నిలబడ్డారు,+ వాళ్లంతా పెద్ద సైన్యంగా ఉన్నారు.
11 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ+ ఈ ఎముకల్లా ఉన్నారు. వాళ్లు ఇలా అనుకుంటున్నారు, ‘మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ నశించిపోయింది.+ మనం పూర్తిగా వేరుచేయబడ్డాం.’ 12 కాబట్టి వాళ్లతో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరిచి,+ మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని లేపి, ఇశ్రాయేలు దేశానికి మిమ్మల్ని తీసుకొస్తాను.+ 13 నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరిచి, మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని లేపినప్పుడు, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’+ 14 ‘నేను నా పవిత్రశక్తిని* మీలో ఉంచుతాను, మీరు బ్రతుకుతారు,+ నేను మిమ్మల్ని మీ దేశంలో స్థిరపడేలా చేస్తాను; అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్పానని, నేనే దాన్ని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
15 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 16 “మానవ కుమారుడా, ఒక కర్ర తీసుకుని దానిమీద, ‘యూదాకు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెందినది’+ అని రాయి. ఇంకో కర్ర తీసుకుని దానిమీద, ‘ఎఫ్రాయిము కర్ర, యోసేపుకు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ చెందినది’+ అని రాయి. 17 తర్వాత, ఆ రెండు కర్రలు నీ చేతిలో ఒక్క కర్ర అయ్యేలా వాటిని కలిపి పట్టుకో.+ 18 నీ ప్రజలు, ‘వీటి అర్థం ఏంటో మాకు చెప్తావా?’ అని నిన్ను అడిగినప్పుడు, 19 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో ఉన్న ఇశ్రాయేలు గోత్రాల్ని తీసుకుని వాళ్లను యూదా కర్రతో కలుపుతాను; నేను వాటిని ఒకే కర్రగా చేస్తాను,+ అవి నా చేతిలో ఒకే కర్ర అవుతాయి.” ’ 20 నువ్వు రాసే కర్రలు వాళ్లు చూడగలిగేలా అవి నీ చేతిలో ఉండాలి.
21 “తర్వాత వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలీయుల్ని వాళ్లు వెళ్లిన జనాల్లో నుండి తీసుకొస్తాను, అన్ని దిక్కుల నుండి వాళ్లను సమకూర్చి వాళ్ల దేశానికి వాళ్లను తీసుకొస్తాను.+ 22 దేశంలో, ఇశ్రాయేలు పర్వతాల మీద వాళ్లను ఒకే జనాంగంగా చేస్తాను,+ వాళ్లందరి మీద ఒకే రాజు పరిపాలిస్తాడు,+ వాళ్లు ఇక రెండు జనాలుగా ఉండరు; రెండు రాజ్యాలుగా విడిపోయి ఉండరు.+ 23 ఇక తమ అసహ్యమైన విగ్రహాలతో,* హేయమైన పనులతో, తమ తప్పులన్నిటితో తమను తాము అపవిత్రపర్చుకోరు.+ వాళ్లు పాపం చేయడానికి కారణమైన వాళ్ల నమ్మకద్రోహం అంతటి నుండి నేను వాళ్లను కాపాడతాను, వాళ్లను శుద్ధి చేస్తాను. వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను.+
24 “ ‘ “నా సేవకుడైన దావీదు వాళ్లకు రాజుగా ఉంటాడు,+ వాళ్లందరికీ ఒకే కాపరి ఉంటాడు.+ వాళ్లు నా న్యాయనిర్ణయాల ప్రకారం నడుచుకుంటారు, నా శాసనాల్ని జాగ్రత్తగా పాటిస్తారు.+ 25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశంలో, అంటే మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్లు నివసిస్తారు; వాళ్లూ, వాళ్ల పిల్లలూ,* వాళ్ల పిల్లల పిల్లలూ ఎప్పటికీ అందులో నివసిస్తారు;+ నా సేవకుడైన దావీదు ఎప్పటికీ వాళ్ల ప్రధానుడిగా* ఉంటాడు.+
26 “ ‘ “నేను వాళ్లతో ఒక శాంతి ఒప్పందం చేస్తాను; అది శాశ్వత ఒప్పందంగా ఉంటుంది. నేను వాళ్లను స్థిరపర్చి, ఎక్కువమందిని చేస్తాను,+ నా పవిత్రమైన స్థలాన్ని ఎప్పటికీ వాళ్లమధ్య ఉంచుతాను. 27 నా డేరా* వాళ్లతోపాటు* ఉంటుంది, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.+ 28 నా పవిత్రమైన స్థలం ఎప్పటికీ వాళ్ల మధ్య ఉన్నప్పుడు, యెహోవానైన నేనే ఇశ్రాయేలును పవిత్రపరుస్తున్నానని జనాలు తెలుసుకుంటాయి.” ’ ”+
38 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, మాగోగు దేశం వాడైన గోగుకు+ అంటే మెషెకు, తుబాలుల+ ముఖ్య ప్రధానుడికి* వ్యతిరేకంగా నీ ముఖం తిప్పి అతనికి వ్యతిరేకంగా ప్రవచించు. 3 ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మెషెకు, తుబాలుల ముఖ్య ప్రధానుడివైన* గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. 4 నేను నిన్ను వెనక్కి తిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి+ నీ సైన్యమంతటితో పాటు, గుర్రాలతో పాటు, ఘనమైన వస్త్రాలు ధరించిన గుర్రపురౌతులతో పాటు, పెద్ద డాళ్లనూ చిన్న డాళ్లనూ* ఖడ్గాల్నీ పట్టుకొనివున్న పెద్ద సమూహంతో పాటు నిన్ను బయటికి తీసుకొస్తాను;+ 5 వాళ్లలో పారసీక, ఇతియోపియా, పూతు+ సైనికులు ఉన్నారు, వాళ్లంతా చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి ఉన్నారు; 6 అలాగే గోమెరు, అతని సైన్యాలన్నీ, ఉత్తరాన సుదూర ప్రాంతాల నుండి తోగర్మా+ ఇంటివాళ్లు, వాళ్ల సైన్యాలన్నీ ఉన్నాయి. చాలా జనాలు నీతో ఉన్నాయి.+
7 “ ‘ “సిద్ధంగా ఉండు. నువ్వూ నీతో పాటు సమకూడిన సైన్యాలన్నీ సిద్ధపడి ఉండండి. నువ్వు వాళ్లకు సైన్యాధికారిగా* ఉంటావు.
8 “ ‘ “చాలా రోజుల తర్వాత నేను నీ మీద దృష్టి పెడతాను.* సంవత్సరాల చివర్లో నువ్వు ఖడ్గం నుండి విడిపించబడి తిరిగి తీసుకురాబడిన ప్రజల దేశం మీద దాడి చేస్తావు; వాళ్లు అనేక జనాల నుండి సమకూర్చబడి, ఎంతోకాలంగా పాడుబడివున్న ఇశ్రాయేలు పర్వతాల మీదికి తీసుకురాబడ్డారు. ఈ దేశ ప్రజలు జనాల నుండి తిరిగి తీసుకురాబడి, సురక్షితంగా నివసిస్తున్నారు.+ 9 నువ్వూ, నీ సైన్యాలన్నీ, నీతో ఉన్న అనేక జనాలూ తుఫానులా వాళ్లమీదికి వస్తారు, మేఘాల్లా ఆ దేశాన్ని కమ్ముకుంటారు.” ’
10 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజున నీ హృదయంలో కొన్ని ఆలోచనలు పుడతాయి, నువ్వు ఒక దుష్ట పన్నాగం పన్నుతావు. 11 నువ్వు ఇలా అనుకుంటావు: “నేను ప్రాకారాలులేని గ్రామాలుగల దేశం మీద దాడి చేస్తాను.+ ప్రాకారాలు గానీ, అడ్డగడియలు గానీ, ద్వారాలు గానీ లేని గ్రామాల్లో సురక్షితంగా, నిశ్చింతగా నివసిస్తున్న వాళ్లందరి మీదికి వెళ్తాను.” 12 నువ్వు విస్తారమైన దోపుడుసొమ్మును, కొల్లసొమ్మును తీసుకోవాలని; ఇంతకుముందు పాడైపోయి ఇప్పుడు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల మీద దాడిచేయాలని;+ జనాల్లో నుండి తిరిగి సమకూర్చబడి,+ సంపదనూ వస్తువుల్నీ పోగుచేసుకుంటూ+ భూమి మధ్యలో నివసిస్తున్న జనాంగం మీద దాడిచేయాలని అనుకుంటావు.
13 “ ‘షేబవాళ్లు,+ దెదానువాళ్లు,+ తర్షీషు+ వర్తకులు, దాని యోధులందరూ* నీతో ఇలా అంటారు: “నువ్వు విస్తారమైన దోపుడుసొమ్ము, కొల్లసొమ్ము కోసం దాడి చేస్తున్నావా? వెండిబంగారాల్ని, సంపదను, వస్తువుల్ని తీసుకెళ్లడానికి, చాలా పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును కొల్లగొట్టడానికి నీ సైన్యాల్ని సమకూర్చావా?” ’
14 “కాబట్టి మానవ కుమారుడా, నువ్వు గోగుతో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులు సురక్షితంగా నివసించే రోజున ఆ విషయం నీకు తెలియకుండా ఉంటుందా?+ 15 అప్పుడు నువ్వూ, నీతో ఉన్న దేశదేశాల ప్రజలంతా నీ స్థలం నుండి, అంటే ఉత్తరాన సుదూర ప్రాంతాల నుండి+ గుర్రాల మీద స్వారీచేస్తూ పెద్ద సమూహంలా, విస్తార సైన్యంలా వస్తారు.+ 16 మేఘాలు దేశాన్ని కప్పేసినట్టు, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తావు. గోగూ, చివరి రోజుల్లో నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను;+ నేను జనాల కళ్లముందు నీ ద్వారా నన్ను నేను పవిత్రపర్చుకున్నప్పుడు అవి నన్ను తెలుసుకుంటాయి.” ’+
17 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా గతంలో మాట్లాడింది నీ గురించి కాదా? నువ్వు వాళ్ల మీదికి రప్పించబడతావని వాళ్లు ఎన్నో సంవత్సరాల పాటు ప్రవచించారు.’
18 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజున అంటే గోగు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసే ఆ రోజున నా గొప్ప ఉగ్రత రగులుకుంటుంది.+ 19 నేను రోషంతో, మండే కోపంతో మాట్లాడతాను; ఆ రోజున ఇశ్రాయేలు దేశంలో గొప్ప భూకంపం వస్తుంది. 20 నన్ను బట్టి సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, అడవి జంతువులు, నేలమీద పాకే ప్రాణులన్నీ,* భూమ్మీదున్న మనుషులంతా భయంతో వణుకుతారు, పర్వతాలు కూలిపోతాయి,+ కొండ పేటులు పడిపోతాయి, ప్రతీ గోడ నేలకూలుతుంది.’
21 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నా పర్వతాలన్నిటి మీద అతనికి వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతీ వ్యక్తి ఖడ్గం అతని సహోదరుడి మీదికి వస్తుంది.+ 22 నేను తెగులుతో,+ రక్తపాతంతో అతనికి తీర్పు తీరుస్తాను; అతని మీద, అతని సైన్యాల మీద, అతనితో ఉన్న అనేక జనాల మీద ప్రచండ వర్షాన్ని, వడగండ్లను,+ అగ్నిగంధకాల్ని+ కురిపిస్తాను.+ 23 అప్పుడు నేను అనేక జనాల కళ్లముందు ఖచ్చితంగా నన్ను నేను మహిమపర్చుకుంటాను, పవిత్రపర్చుకుంటాను, నన్ను నేను తెలియజేసుకుంటాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’
39 “మానవ కుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి+ అతనితో ఇలా అను, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మెషెకు, తుబాలుల+ ముఖ్య ప్రధానుడివైన* గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. 2 నేను నిన్ను వెనక్కి తిప్పి, నడిపించి, ఉత్తరాన సుదూర ప్రాంతాల నుండి ఇశ్రాయేలు పర్వతాల మీదికి తీసుకొస్తాను.+ 3 నేను నీ ఎడమచేతిలో నుండి విల్లు, నీ కుడిచేతిలో నుండి బాణాలు పడిపోయేలా చేస్తాను. 4 నువ్వు, నీ సైన్యాలు, నీతో ఉన్న జనాలు ఇశ్రాయేలు పర్వత ప్రాంతాల మీద కూలిపోతారు.+ నేను నిన్ను అన్నిరకాల వేటపక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను.” ’+
5 “ ‘నువ్వు మైదానంలో కూలిపోతావు,+ ఎందుకంటే నేనే స్వయంగా ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.
6 “ ‘నేను మాగోగు మీదికి, ద్వీపాల్లో సురక్షితంగా నివసిస్తున్న వాళ్లమీదికి అగ్ని రప్పిస్తాను,+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 7 నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నా పవిత్రమైన పేరును తెలియజేసుకుంటాను, ఇకమీదట నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయనివ్వను; అప్పుడు నేను ఇశ్రాయేలులోని పవిత్ర దేవుడైన యెహోవానని+ జనాలు తెలుసుకుంటాయి.’+
8 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘అవును, అది వస్తోంది, అది నెరవేరుతుంది. ఆ రోజు గురించే నేను మాట్లాడాను. 9 ఇశ్రాయేలు నగరాల్లోని ప్రజలు బయటికి వెళ్లి ఆ యుద్ధాయుధాలతో, అంటే చిన్న డాళ్లతో,* డాళ్లతో, విల్లులతో, బాణాలతో, యుద్ధంలో వాడే కర్రలతో,* ఈటెలతో మంట వెలిగించుకుంటారు. వాళ్లు ఏడు సంవత్సరాల పాటు వాటితో మంట వెలిగించుకుంటారు.+ 10 వాళ్లు ఆ ఆయుధాలతో మంట వెలిగించుకుంటారు కాబట్టి వాళ్లు పొలాల్లో నుండి గానీ, అడవుల్లో నుండి గానీ కట్టెలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు.’
“ ‘వాళ్లు తమను కొల్లగొట్టినవాళ్లను కొల్లగొడతారు, తమను దోచుకుంటూ వచ్చినవాళ్లను దోచుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.
11 “ ‘ఆ రోజున, అక్కడే ఇశ్రాయేలు దేశంలో, సముద్రానికి తూర్పున ప్రయాణించేవాళ్ల లోయలో నేను గోగుకు+ ఒక సమాధి స్థలాన్ని ఇస్తాను; అది ప్రయాణికులు వెళ్లకుండా ఆ దారిని మూసేస్తుంది. అక్కడే వాళ్లు గోగును, అతని సైన్యాలన్నిటినీ పాతిపెడతారు, వాళ్లు దాన్ని హమోను-గోగు లోయ*+ అని పిలుస్తారు. 12 వాళ్లను పాతిపెట్టి, దేశాన్ని శుభ్రం చేయడానికి+ ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఏడు నెలలు పడుతుంది. 13 దేశంలోని ప్రజలందరూ వాళ్లను పాతిపెడతారు. దానివల్ల, నన్ను నేను మహిమపర్చుకునే రోజున వాళ్లకు కీర్తి వస్తుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
14 “ ‘దేశాన్ని శుభ్రం చేయడం కోసం, దేశం గుండా ఎప్పుడూ సంచరిస్తూ భూమ్మీద మిగిలివున్న శవాల్ని పాతిపెట్టడానికి కొంతమంది మనుషులు నియమించబడతారు. వాళ్లు ఏడు నెలలపాటు అలా వెదుకుతూ ఉంటారు. 15 దేశం గుండా సంచరించేవాళ్లకు ఎప్పుడైనా ఒక మనిషి ఎముక కనిపిస్తే, వాళ్లు దాని పక్కన ఒక గుర్తును పెడతారు. పాతిపెట్టడానికి నియమించబడినవాళ్లు దాన్ని హమోను-గోగు లోయలో+ పాతిపెడతారు. 16 అంతేకాదు, అక్కడ హమోనా* అనే పేరుగల ఒక నగరం కూడా ఉంటుంది. అలా వాళ్లు దేశాన్ని శుభ్రం చేస్తారు.’+
17 “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రతీ రకమైన పక్షితో, అడవి జంతువులన్నిటితో ఇలా చెప్పు, “మీరంతా కలిసి రండి. నేను మీ కోసం ఇశ్రాయేలు పర్వతాల మీద సిద్ధం చేస్తున్న గొప్ప బలి+ చుట్టూ పోగవ్వండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.+ 18 మీరు బలవంతుల మాంసం తింటారు, భూమ్మీది ప్రధానుల రక్తం తాగుతారు. వాళ్లంతా బాషానులోని కొవ్విన జంతువులు అంటే పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, మేకలు, ఎద్దులు. 19 నేను మీ కోసం సిద్ధం చేసిన బలి కొవ్వును మీరు పీకలదాకా తింటారు, మత్తెక్కే దాకా రక్తం తాగుతారు.” ’
20 “ ‘నా బల్ల దగ్గర మీరు గుర్రాల్ని, గుర్రపురౌతుల్ని, బలవంతుల్ని, అన్నిరకాల యోధుల్ని కడుపునిండా తింటారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
21 “ ‘నేను జనాల మధ్య నా మహిమను చూపిస్తాను, అప్పుడు జనాలన్నీ నేను తీర్చిన తీర్పును, నేను వాళ్ల మధ్య ప్రదర్శించిన నా శక్తిని చూస్తాయి.+ 22 ఆ రోజు నుండి ఇశ్రాయేలు ఇంటివాళ్లు నేను తమ దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు. 23 ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ దోషం వల్లే, వాళ్లు నాకు చేసిన నమ్మకద్రోహం వల్లే చెరలోకి వెళ్లారని జనాలు తెలుసుకుంటాయి.+ అందుకే, నేను నా ముఖాన్ని వాళ్ల నుండి పక్కకు తిప్పుకొని,+ వాళ్లను తమ శత్రువుల చేతికి అప్పగించాను,+ వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు. 24 వాళ్ల అపవిత్రతను బట్టి, వాళ్ల అపరాధాల్ని బట్టి నేను వాళ్లను శిక్షించాను, వాళ్ల నుండి నా ముఖం పక్కకు తిప్పుకున్నాను.’
25 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బందీలుగా వెళ్లిన యాకోబు ప్రజల్ని వాళ్ల దేశానికి తిరిగి తీసుకొస్తాను,+ ఇశ్రాయేలు ఇంటివాళ్లందరి మీద కరుణ చూపిస్తాను;+ నా పవిత్రమైన పేరు విషయంలో ఉత్సాహంతో స్థిరంగా చర్య తీసుకుంటాను.+ 26 నాకు చేసిన నమ్మకద్రోహం అంతటిని బట్టి వాళ్లు అవమానాలపాలైన+ తర్వాత, వాళ్లు ఎవరి భయం లేకుండా తమ దేశంలో సురక్షితంగా నివసిస్తారు.+ 27 నేను వాళ్లను జనాల మధ్య నుండి, వాళ్ల శత్రువుల దేశాల నుండి సమకూర్చి తీసుకొచ్చినప్పుడు,+ అనేక జనాల కళ్లముందు వాళ్లమధ్య నన్ను నేను పవిత్రపర్చుకుంటాను.’+
28 “ ‘నేను వాళ్లను జనాల మధ్యకు చెరగా పంపించి, ఆ తర్వాత వాళ్లలో ఒక్కర్ని కూడా విడిచిపెట్టకుండా అందర్నీ తమ దేశానికి తిరిగి తీసుకొచ్చినప్పుడు,+ నేను తమ దేవుడైన యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 29 నేను ఇక ఎంతమాత్రం ఇశ్రాయేలు ఇంటివాళ్ల నుండి నా ముఖం పక్కకు తిప్పుకోను,+ ఎందుకంటే నేను వాళ్లమీద నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
40 అది మేము చెరలోకి వెళ్లిన 25వ సంవత్సరం.+ ఆ సంవత్సరం ఆరంభంలో, నెల పదో రోజున, అంటే నగరం కూలిపోయిన 14వ సంవత్సరంలో,+ అదే రోజున యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది, ఆయన నన్ను నగరానికి తీసుకెళ్లాడు.+ 2 దేవుని దర్శనాల ద్వారా ఆయన నన్ను ఇశ్రాయేలు దేశంలోకి తీసుకొచ్చి, చాలా ఎత్తైన ఒక పర్వతం మీద ఉంచాడు;+ దానిమీద దక్షిణం వైపున నగరం లాంటి ఒక నిర్మాణం కనిపించింది.
3 ఆయన నన్ను అక్కడికి తీసుకొచ్చినప్పుడు, రాగిలా మెరుస్తున్న ఒక మనిషి నాకు కనిపించాడు.+ అతను చేతిలో కొలనూలు, కొలకర్ర* పట్టుకొని+ ద్వారంలో నిలబడివున్నాడు. 4 అతను నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, జాగ్రత్తగా గమనించు, శ్రద్ధగా విను, నేను చూపించే ప్రతీదాని మీద మనసుపెట్టు; అందుకే నువ్వు ఇక్కడికి తీసుకురాబడ్డావు. నువ్వు చూసే ప్రతీది ఇశ్రాయేలు ఇంటివాళ్లకు చెప్పాలి.”+
5 నేను చూసినప్పుడు, ఆలయం* బయట చుట్టూ ఒక గోడ కనిపించింది. ఆ మనిషి చేతిలో ఆరు మూరల (ప్రతీ మూరకు ఒక బెత్తెడు జతచేయబడింది)* పొడవు ఉన్న ఒక కొలకర్ర ఉంది. అతను ఆ గోడను కొలవడం మొదలుపెట్టాడు, అది ఒక కొలకర్ర మందం, ఒక కొలకర్ర ఎత్తు ఉంది.
6 తర్వాత అతను తూర్పు వైపున్న ద్వారం దగ్గరికి వచ్చి,+ దాని మెట్లు ఎక్కాడు. అతను ఆ ద్వారం గడపను కొలిచినప్పుడు అది ఒక కొలకర్ర వెడల్పు ఉంది, మరో గడప కూడా ఒక కొలకర్ర వెడల్పు ఉంది. 7 కాపలాదారుల గదుల్లో ఒక్కొక్కటి ఒక కొలకర్ర పొడవు, ఒక కొలకర్ర వెడల్పు ఉంది; కాపలాదారుల గదుల్లో+ ఒకదానికీ ఇంకోదానికీ మధ్య ఐదు మూరల దూరం ఉంది. ఆలయం వైపున్న ద్వారం వసారా పక్కన ఉన్న ద్వారం గడప ఒక కొలకర్ర ఉంది.
8 అతను ఆలయం వైపున్న ద్వారం వసారాను కొలిచాడు, అది ఒక కొలకర్ర ఉంది. 9 తర్వాత అతను ద్వారం వసారాను కొలిచాడు, అది ఎనిమిది మూరలు ఉంది; అతను దాని పక్కస్తంభాల్ని కొలిచాడు, అవి రెండు మూరలు ఉన్నాయి; ద్వారం వసారా ఆలయం వైపు ఉంది.
10 తూర్పు ద్వారానికి ఇటువైపు మూడు కాపలాదారుల గదులు, అటువైపు మూడు కాపలాదారుల గదులు ఉన్నాయి. ఆ మూడు గదుల కొలత ఒక్కటే, రెండు వైపులా ఉన్న వాటి పక్కస్తంభాల కొలత కూడా ఒక్కటే.
11 తర్వాత అతను ద్వారప్రవేశం వెడల్పును కొలిచాడు, అది 10 మూరలు ఉంది; ద్వారం పొడవు 13 మూరలు.
12 రెండువైపులా ఉన్న కాపలాదారుల గదుల ముందు చుట్టుగోడ ఉన్న ప్రాంతం ఒక మూర ఉంది. రెండువైపులా ఉన్న కాపలాదారుల గదుల్లో ప్రతీది ఆరు మూరలు ఉంది.
13 తర్వాత అతను, కాపలాదారుల గదుల్లో ఒకదాని పైకప్పు* నుండి మరోదాని పైకప్పు వరకు ద్వారం వెడల్పు కొలిచాడు, అది 25 మూరలు ఉంది; ఆ గదులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి.+ 14 తర్వాత అతను పక్కస్తంభాల్ని కొలిచాడు, వాటి ఎత్తు 60 మూరలు; తర్వాత అతను ప్రాంగణం చుట్టూ ఉన్న ద్వారాల్లోని పక్కస్తంభాల్ని కొలిచాడు. 15 ద్వారప్రవేశం ముందుభాగం నుండి ఆలయం వైపున్న ద్వారం వసారా ముందుభాగం వరకు 50 మూరలు ఉంది.
16 ద్వారం లోపల రెండువైపులా ఉన్న కాపలాదారుల గదులకు, వాటి స్తంభాలకు కిటికీలు*+ ఉన్నాయి. వసారాల లోపల కూడా అన్నివైపులా కిటికీలు ఉన్నాయి, పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు+ ఉన్నాయి.
17 తర్వాత అతను నన్ను బయటి ప్రాంగణంలోకి తీసుకొచ్చాడు; నేను అక్కడ భోజనాల గదుల్ని,+ ప్రాంగణం చుట్టూ రాళ్లు పరిచిన దారిని చూశాను. దానిమీద 30 భోజనాల గదులు ఉన్నాయి. 18 ద్వారాల పక్కన ఉన్న ఈ దారి వెడల్పు, ద్వారాల పొడవుతో సమానం. ఇది దిగువ దారి.
19 తర్వాత అతను, కింది ద్వారం ముందుభాగం నుండి లోపలి ప్రాంగణానికి వెళ్లే ద్వారం వరకు దూరం* కొలిచాడు. అది తూర్పు వైపు, ఉత్తరం వైపు 100 మూరలు ఉంది.
20 బయటి ప్రాంగణానికి ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంది; అతను దాని పొడవును, వెడల్పును కొలిచాడు. 21 దాని రెండువైపులా మూడుమూడు కాపలాదారుల గదులు ఉన్నాయి. దాని పక్కస్తంభాల కొలత, వసారా కొలత మొదటి ద్వారంలోని వాటి కొలతలతో సమానం. ఈ ద్వారం పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 22 దాని కిటికీల కొలత, వసారా కొలత, ఖర్జూర చెట్ల+ కొలత తూర్పు ద్వారంలోని వాటి కొలతతో సమానం. దాన్ని ఎక్కడానికి ఏడు మెట్లు ఉన్నాయి, దాని వసారా వాటికి ఎదురుగా ఉంది.
23 ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ప్రాంగణంలో ఒక ద్వారం ఉంది, అలాగే తూర్పు ద్వారానికి ఎదురుగా కూడా ఒక ద్వారం ఉంది. అతను ద్వారానికీ ద్వారానికీ మధ్య దూరం కొలిచాడు, అది 100 మూరలు ఉంది.
24 తర్వాత అతను నన్ను దక్షిణం వైపుకు తీసుకొచ్చాడు, నాకు దక్షిణం వైపు ఒక ద్వారం+ కనిపించింది. అతను దాని పక్కస్తంభాల్ని, వసారాను కొలిచాడు; వాటి కొలత మిగతావాటి కొలతతో సమానం. 25 దానికి రెండువైపులా, అలాగే దాని వసారాకు మిగతా వాటికున్న కిటికీల లాంటి కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 26 దాన్ని ఎక్కడానికి ఏడు మెట్లు ఉన్నాయి,+ దాని వసారా వాటికి ఎదురుగా ఉంది. రెండువైపులా పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి.
27 లోపలి ప్రాంగణంలో దక్షిణం వైపుకు ఒక ద్వారం ఉంది; అతను దక్షిణం వైపు ద్వారానికీ ద్వారానికీ మధ్య దూరం కొలిచాడు, అది 100 మూరలు ఉంది. 28 ఆ తర్వాత అతను నన్ను దక్షిణ ద్వారం గుండా లోపలి ప్రాంగణంలోకి తీసుకొచ్చాడు; అతను దక్షిణ ద్వారాన్ని కొలిచాడు, దాని కొలత మిగతావాటి కొలతతో సమానం. 29 దాని కాపలాదారుల గదుల, పక్కస్తంభాల, వసారా కొలత మిగతావాటి కొలతతో సమానం. దానికి రెండువైపులా, అలాగే దాని వసారాకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు.+ 30 చుట్టూ ఉన్న ద్వారాలన్నిటికీ వసారాలు ఉన్నాయి; వాటి పొడవు 25 మూరలు, వెడల్పు 5 మూరలు. 31 దాని వసారా బయటి ప్రాంగణం వైపుకు ఉంది, దాని పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి;+ దాన్ని ఎక్కడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి.+
32 అతను తూర్పు దిక్కు నుండి నన్ను లోపలి ప్రాంగణంలోకి తెచ్చినప్పుడు ఆ ద్వారాన్ని కొలిచాడు, దాని కొలత మిగతావాటి కొలతతో సమానం. 33 దాని కాపలాదారుల గదుల, పక్కస్తంభాల, వసారా కొలత మిగతావాటి కొలతతో సమానం. దానికి రెండువైపులా, అలాగే దాని వసారాకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 34 దాని వసారా బయటి ప్రాంగణం వైపుకు ఉంది, దాని రెండు పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి; దాన్ని ఎక్కడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి.
35 తర్వాత అతను నన్ను ఉత్తర ద్వారంలోకి తెచ్చి,+ దాన్ని కొలిచాడు; దాని కొలత మిగతావాటి కొలతతో సమానం. 36 దాని కాపలాదారుల గదుల, పక్కస్తంభాల, వసారా కొలత మిగతావాటి కొలతతో సమానం. దానికి రెండువైపులా కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 37 దాని పక్కస్తంభాలు బయటి ప్రాంగణం వైపుకు ఉన్నాయి, దాని రెండు పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి; దాన్ని ఎక్కడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి.
38 ద్వారాల పక్కస్తంభాలకు దగ్గర్లో ఒక భోజనాల గది ఉంది, దానికి ఒక గుమ్మం ఉంది; అక్కడ సంపూర్ణ దహనబలి జంతువుల మాంసం కడుగుతారు.+
39 ద్వారం వసారాకు రెండువైపులా రెండురెండు బల్లలు ఉన్నాయి, వాటిమీద సంపూర్ణ దహనబలి జంతువుల్ని,+ పాపపరిహారార్థ బలి జంతువుల్ని,+ అపరాధ పరిహారార్థ బలి జంతువుల్ని+ వధిస్తారు. 40 ఉత్తర ద్వారానికి వెళ్లే దారిలో, ద్వారప్రవేశం బయట రెండురెండు బల్లలు ఉన్నాయి. అంతేకాదు ద్వారం వసారా అవతలి వైపు కూడా రెండురెండు బల్లలు ఉన్నాయి. 41 ద్వారానికి ఒక్కోవైపు నాలుగు బల్లల చొప్పున మొత్తం ఎనిమిది బల్లలు ఉన్నాయి, వాటిమీద బలి జంతువుల్ని వధిస్తారు. 42 సంపూర్ణ దహనబలుల కోసం ఉపయోగించే నాలుగు బల్లలు రాతి బల్లలు. వాటి పొడవు మూరన్నర, వెడల్పు మూరన్నర, ఎత్తు మూర. దహనబలి జంతువుల్ని, బలుల్ని వధించే పనిముట్లను వాటిమీద ఉంచుతారు. 43 లోపలి గోడల నిండా బెత్తెడు వెడల్పు ఉన్న పిడులు ఉన్నాయి; బల్లల మీద అర్పణల మాంసం ఉంచుతారు.
44 లోపలి ద్వారం బయట గాయకుల+ భోజనాల గదులు ఉన్నాయి; అవి లోపలి ప్రాంగణంలో ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాయి, వాటి గుమ్మాలు దక్షిణం వైపుకు ఉన్నాయి. తూర్పు ద్వారం దగ్గర మరో భోజనాల గది ఉంది, దాని గుమ్మం ఉత్తరం వైపుకు ఉంది.
45 అతను నాతో ఇలా అన్నాడు: “దక్షిణం వైపుకు గుమ్మం ఉన్న ఈ భోజనాల గది, ఆలయ సేవల్ని చూసుకునే యాజకులది.+ 46 ఉత్తరం వైపుకు గుమ్మం ఉన్న భోజనాల గది, బలిపీఠం దగ్గరి సేవల్ని చూసుకునే యాజకులది.+ వాళ్లు సాదోకు కుమారులు,+ యెహోవాను సమీపించి ఆయనకు పరిచారం చేయడానికి నియమించబడిన లేవీయులు.”+
47 తర్వాత అతను లోపలి ప్రాంగణాన్ని కొలిచాడు. దాని పొడవు 100 మూరలు, వెడల్పు 100 మూరలు; అది చతురస్రాకారంలో ఉంది. ఆలయం ముందు బలిపీఠం ఉంది.
48 తర్వాత అతను నన్ను ఆలయ వసారాలోకి+ తీసుకొచ్చి, వసారా ప్రవేశం దగ్గరున్న పక్కస్తంభాల్ని కొలిచాడు; ఒక్కో స్తంభం మందం ఐదు మూరలు, వెడల్పు మూడు మూరలు. ఒక స్తంభం కుడివైపున ఉంది, ఇంకో స్తంభం ఎడమవైపున ఉంది.
49 వసారా పొడవు 20 మూరలు, వెడల్పు 11* మూరలు. ప్రజలు మెట్లు ఎక్కి దానిలోకి వచ్చేవాళ్లు. రెండువైపులా ఉన్న ఆ పక్కస్తంభాల పక్కన మరో రెండు స్తంభాలు ఉన్నాయి.+
41 తర్వాత అతను నన్ను పవిత్రమైన స్థలం బయటి గదిలోకి* తీసుకొచ్చి, పక్కస్తంభాల్ని కొలిచాడు; ఒకటి కుడివైపున ఉంది, ఇంకొకటి ఎడమవైపున ఉంది. ప్రతీ స్తంభం మందం ఆరు మూరలు,* 2 వెడల్పు ఐదు మూరలు. ప్రవేశం వెడల్పు పది మూరలు. అతను ఆలయం పొడవును, వెడల్పును కొలిచాడు; దాని పొడవు 40 మూరలు, వెడల్పు 20 మూరలు.
3 తర్వాత అతను లోపలికి* వెళ్లి, ప్రవేశం రెండు పక్కస్తంభాల్ని కొలిచాడు; వాటి మందం రెండు మూరలు, వెడల్పు ఏడు మూరలు. ప్రవేశం వెడల్పు ఆరు మూరలు. 4 తర్వాత అతను పవిత్రమైన స్థలం బయటి గదికి ఎదురుగా ఉన్న గదిని కొలిచాడు; దాని పొడవు 20 మూరలు, వెడల్పు 20 మూరలు.+ అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఇది అతి పవిత్ర స్థలం.”+
5 తర్వాత అతను ఆలయ గోడను కొలిచాడు, దాని మందం ఆరు మూరలు. ఆలయం చుట్టూ ఉన్న గదుల వెడల్పు నాలుగు మూరలు.+ 6 పక్కన ఉన్న ఆ గదులు మూడు అంతస్తుల్లో ఉన్నాయి, ప్రతీ అంతస్తులో 30 గదులు ఉన్నాయి. ఆ పక్కగదుల దూలాలు ఆలయ గోడ లోపలికి చొచ్చుకెళ్లకుండా, అవి ఆలయ గోడకు ఉన్న ఆధారాల మీద ఆనుకున్నాయి.+ 7 కింది అంతస్తు నుండి పై అంతస్తులకు వెళ్లే కొద్దీ ఆ గదుల వెడల్పు పెరుగుతుంది.+ కింది అంతస్తు నుండి రెండో అంతస్తుకి, అక్కడి నుండి మూడో అంతస్తుకి వెళ్లడానికి ఆలయానికి రెండు వైపులా వలయాకారంలో మెట్లు ఉన్నాయి.
8 ఆలయం కింద, చుట్టూ ఎత్తైన గచ్చు ఉంది, దాని పక్కగదుల పునాదులు నేల నుండి పై మూల వరకు ఆరు మూరల కొలకర్ర అంత ఉన్నాయి. 9 పక్కగదుల బయటి గోడ మందం ఐదు మూరలు. ఆ గచ్చు మీద పక్కగదుల పొడవునా ఒక ఖాళీ స్థలం ఉంది,* అది కూడా ఆలయంలో భాగమే.
10 ఆలయానికి, భోజనాల గదులకు+ మధ్య రెండువైపులా 20 మూరల స్థలం ఉంది. 11 పక్కగదులకు, ఖాళీ స్థలానికి మధ్య ఉత్తరం వైపు ఒక ప్రవేశం ఉంది, అలాగే దక్షిణం వైపు ఇంకో ప్రవేశం ఉంది. చుట్టూ ఆ ఖాళీ స్థలం వెడల్పు ఐదు మూరలు ఉంది.
12 పడమటి వైపు ఖాళీ ప్రదేశానికి ఎదురుగా ఉన్న భవనం వెడల్పు 70 మూరలు, పొడవు 90 మూరలు; చుట్టూ ఆ భవనం గోడ మందం ఐదు మూరలు.
13 అతను ఆలయాన్ని కొలిచాడు, దాని పొడవు 100 మూరలు. ఖాళీ ప్రదేశం, ఆ భవనం,* దాని గోడలు కలిపి 100 మూరల పొడవు ఉన్నాయి. 14 తూర్పు వైపు ఆలయ ముందుభాగం, ఖాళీ ప్రదేశం మొత్తం వెడల్పు 100 మూరలు.
15 అతను వెనక ఖాళీ ప్రదేశం వైపు భవనం పొడవును కొలిచాడు, రెండువైపులా ఉన్న దాని వరండాలతో పాటు అది 100 మూరలు ఉంది.
అతను పవిత్రమైన స్థలం బయటి గదిని, పవిత్రమైన స్థలం లోపలి గదిని,+ ప్రాంగణ వసారాల్ని కూడా కొలిచాడు, 16 అలాగే గడపల్ని, కిటికీల్ని,*+ ఆ మూడు స్థలాల్లో ఉన్న వరండాల్ని కొలిచాడు. గడప దగ్గర నేల నుండి కిటికీల వరకు చెక్క పలకలతో+ కప్పబడివుంది, కిటికీలు కూడా కప్పబడివున్నాయి. 17 ప్రవేశం పైభాగం కొలతల్ని, ఆలయం లోపలి కొలతల్ని, బయటి కొలతల్ని, చుట్టూ ఉన్న గోడ కొలతల్ని తీసుకోవడం జరిగింది. 18 దాని మీద కెరూబులు,+ ఖర్జూర చెట్లు+ చెక్కబడివున్నాయి; ప్రతీ రెండు కెరూబుల మధ్య ఒక ఖర్జూర చెట్టు ఉంది, ప్రతీ కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి. 19 ఒకపక్క ఉన్న ఖర్జూర చెట్టు వైపు మనిషి ముఖం, ఇంకోపక్క ఉన్న ఖర్జూర చెట్టు వైపు సింహం ముఖం ఉన్నాయి.+ ఆలయం అంతటా అవి అలాగే చెక్కబడివున్నాయి. 20 అడుగుభాగం నుండి ప్రవేశం పైభాగం వరకు పవిత్రమైన స్థలం గోడ మీద కెరూబులు, ఖర్జూర చెట్లు చెక్కబడివున్నాయి.
21 పవిత్రమైన స్థల ద్వారబంధాలు* చతురస్రాకారంలో ఉన్నాయి.+ పవిత్ర స్థలం* ముందు భాగంలో, 22 చెక్క బలిపీఠం+ లాంటిది ఒకటి ఉంది; దాని ఎత్తు మూడు మూరలు, పొడవు రెండు మూరలు. దానికి మూల కర్రలు ఉన్నాయి; దాని అడుగుభాగం,* పక్క భాగాలు చెక్కతో చేయబడ్డాయి. అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఇది యెహోవా ఎదుట ఉన్న బల్ల.”+
23 పవిత్రమైన స్థలం బయటి గదికీ, అతి పవిత్ర స్థలానికీ రెండేసి తలుపులు ఉన్నాయి.+ 24 ఆ తలుపులకు మడత రెక్కలు ఉన్నాయి, ప్రతీ తలుపుకు రెండు రెక్కలు ఉన్నాయి. 25 గోడల మీద ఉన్నట్టే పవిత్రమైన స్థలం తలుపుల మీద కూడా కెరూబుల, ఖర్జూర చెట్ల రూపాలు చెక్కబడివున్నాయి.+ అంతేకాదు, వసారాకు బయటివైపు చెక్కతో చేసిన చూరు ఉంది. 26 వసారాకు రెండువైపులా, ఆలయ పక్కగదుల పొడవునా, చూరుల మీద కిటికీలు,*+ ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి.
42 అతను నన్ను ఉత్తరం వైపుగా బయటి ప్రాంగణంలోకి తీసుకొచ్చాడు.+ తర్వాత అతను ఖాళీ ప్రదేశం పక్కన, భవనానికి ఉత్తరం వైపున్న+ భోజనశాల+ దగ్గరికి నన్ను తీసుకొచ్చాడు. 2 ఉత్తర ప్రవేశం దగ్గర దాని పొడవు 100 మూరలు,* వెడల్పు 50 మూరలు. 3 అది లోపలి ప్రాంగణానికీ, బయటి ప్రాంగణం దారికీ మధ్యలో ఉంది. ఈ లోపలి ప్రాంగణం వెడల్పు 20 మూరలు.+ భోజనశాల వరండాలు ఒకదానికొకటి ఎదురెదురుగా, మూడు అంతస్తుల్లో ఉన్నాయి. 4 భోజనశాల గదుల ముందు నడవడానికి ఒక దారి ఉంది;+ దాని వెడల్పు 10 మూరలు, పొడవు 100 మూరలు.* ఆ గదుల గుమ్మాలు ఉత్తరం వైపుకు ఉన్నాయి. 5 వరండాల వల్ల భవనం పై అంతస్తులో ఉన్న భోజనాల గదులు కింది, మధ్య అంతస్తుల్లో ఉన్న భోజనాల గదుల కన్నా కాస్త ఇరుకుగా ఉన్నాయి. 6 ఎందుకంటే అవి మూడు అంతస్తుల్లో ఉన్నాయి, కానీ ప్రాంగణాలకు ఉన్నలాంటి స్తంభాలు వాటికి లేవు. అందుకే పై అంతస్తుల్లోని గదులు, కింది అంతస్తుల్లోని గదుల కన్నా తక్కువ స్థలంలో కట్టబడ్డాయి.
7 బయటి ప్రాంగణం వైపున్న భోజనాల గదుల పక్కన ఉన్న రాతిగోడ 50 మూరల పొడవు ఉంది, ఆ గోడ ఇతర భోజనాల గదులకు ఎదురుగా ఉంది. 8 ఎందుకంటే, బయటి ప్రాంగణం వైపున్న భోజనాల గదుల వరుస 50 మూరల పొడవు ఉంది, కానీ పవిత్రమైన స్థలం వైపున్న భోజనాల గదుల వరుస 100 మూరల పొడవు ఉంది. 9 బయటి ప్రాంగణంలో నుండి ఆ భోజనాల గదుల్లోకి రావడానికి వాటికి తూర్పు వైపున ఒక ప్రవేశమార్గం ఉంది.
10 ప్రాంగణం రాతిగోడ లోపలివైపు,* తూర్పున ఖాళీ ప్రదేశానికీ భవనానికీ పక్కన కూడా కొన్ని భోజనాల గదులు ఉన్నాయి.+ 11 ఉత్తరం వైపున్న భోజనాల గదులకు ఉన్నట్టే వాటి ముందు కూడా నడవడానికి ఒక దారి ఉంది.+ వాటి పొడవు, వెడల్పు, బయటికి వెళ్లే దారులు, నమూనాలు కూడా మిగతావాటిలాగే ఉన్నాయి. వాటి ప్రవేశాలు 12 దక్షిణం వైపు గుమ్మాలు ఉన్న భోజనాల గదుల ప్రవేశాల్లా ఉన్నాయి. తూర్పు వైపున, రాతిగోడ ముందున్న దారి ప్రారంభంలో ఒక ప్రవేశమార్గం ఉంది, దానిగుండా లోపలికి వెళ్లవచ్చు.+
13 తర్వాత అతను నాతో ఇలా అన్నాడు: “ఖాళీ ప్రదేశం పక్కన ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఉన్న భోజనాల గదులు+ పవిత్రమైన భోజనాల గదులు. యెహోవాను సమీపించే యాజకులు అక్కడ అతి పవిత్రమైన అర్పణలు తింటారు.+ అది పవిత్రమైన చోటు కాబట్టి వాళ్లు అక్కడ అతి పవిత్రమైన అర్పణల్ని అంటే ధాన్యార్పణల్ని, పాపపరిహారార్థ బలుల్ని, అపరాధ పరిహారార్థ బలుల్ని పెడతారు.+ 14 యాజకులు లోపలికి ప్రవేశించాక, తాము పరిచారం చేస్తున్నప్పుడు వేసుకున్న బట్టలతో పవిత్ర స్థలంలో నుండి బయటి ప్రాంగణంలోకి వెళ్లకూడదు,+ ఎందుకంటే అవి పవిత్రమైన బట్టలు. ప్రజలకు అనుమతి ఉన్న స్థలాల్లోకి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు వేసుకుంటారు.”
15 అతను లోపలి ఆలయ ప్రాంతాన్ని కొలవడం ముగించాక, నన్ను తూర్పు ద్వారం గుండా బయటికి తీసుకొచ్చాడు;+ అతను ఆ ప్రాంతమంతా కొలిచాడు.
16 అతను తూర్పు వైపును కొలకర్రతో* కొలిచాడు. అది ఒకవైపు నుండి ఇంకోవైపు వరకు 500 కొలకర్రల పొడవు ఉంది.
17 అతను ఉత్తరం వైపును కొలకర్రతో కొలిచాడు, అది 500 కొలకర్రల పొడవు ఉంది.
18 అతను దక్షిణం వైపును కొలకర్రతో కొలిచాడు, అది 500 కొలకర్రల పొడవు ఉంది.
19 అతను పడమటి వైపును కొలకర్రతో కొలిచాడు, అది 500 కొలకర్రల పొడవు ఉంది.
20 అతను దాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన దాన్ని, సాధారణమైన దాన్ని వేరు చేయడానికి+ దాని చుట్టూ ఒక గోడ ఉంది;+ దాని పొడవు 500 కొలకర్రలు, వెడల్పు 500 కొలకర్రలు.+
43 తర్వాత అతను నన్ను తూర్పు ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు.+ 2 అక్కడ నేను ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు వైపు నుండి రావడం+ చూశాను, ఆయన స్వరం ప్రవాహాల శబ్దంలా ఉంది;+ ఆయన మహిమ వల్ల భూమి ప్రకాశించింది.+ 3 నేను చూసింది, నేను* నగరాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు చూసిన దర్శనంలా ఉంది. అది కెబారు నది దగ్గర నేను చూసిన దానిలా కనిపించింది;+ దాంతో నేను నేల మీద సాష్టాంగపడ్డాను.
4 అప్పుడు యెహోవా మహిమ తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.+ 5 ఒక శక్తి* నన్ను లేపి లోపలి ప్రాంగణంలోకి తీసుకొచ్చింది, ఆలయం యెహోవా మహిమతో నిండివుండడం నేను చూశాను.+ 6 అప్పుడు ఆలయంలో నుండి ఒక వ్యక్తి నాతో మాట్లాడడం నేను విన్నాను, ఆ మనిషి వచ్చి నా పక్కన నిలబడ్డాడు.+ 7 ఆయన నాతో ఇలా అన్నాడు:
“మానవ కుమారుడా, ఇది నా సింహాసనం ఉండే స్థలం,+ నేను నా పాదాలు నిలిపే స్థలం.+ ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎప్పటికీ నివసిస్తాను.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లూ, వాళ్ల రాజులూ తమ ఆధ్యాత్మిక వ్యభిచారంతో, వాళ్ల రాజులు చనిపోయినప్పుడు వాళ్ల కళేబరాలతో నా పవిత్రమైన పేరును ఇక అపవిత్రపర్చరు.+ 8 వాళ్లు నా గడప పక్కనే తమ గుళ్ల గడపల్ని, నా ద్వారబంధాల పక్కనే వాళ్ల గుళ్ల ద్వారబంధాల్ని పెట్టి తమ అసహ్యమైన పనులతో నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చారు; నాకూ వాటికీ మధ్య కేవలం ఒక గోడే అడ్డుగా ఉంది.+ వాళ్లు అలా చేశారు కాబట్టి నేను కోపంతో వాళ్లను తుడిచిపెట్టేశాను.+ 9 ఇప్పుడు వాళ్లు తమ ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని, తమ రాజుల కళేబరాల్ని నాకు దూరంగా పెట్టాలి, అలాచేస్తే నేను ఎప్పటికీ వాళ్ల మధ్య నివసిస్తాను.+
10 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ తప్పుల్ని బట్టి సిగ్గుపడేలా+ నువ్వు ఆలయం గురించి వాళ్లకు వివరంగా చెప్పు,+ వాళ్లు దాని నమూనాను పరిశీలించాలి.* 11 ఒకవేళ వాళ్లు తాము చేసిన దానంతటి గురించి సిగ్గుపడితే, నువ్వు వాళ్లకు ఆలయ రేఖాచిత్రాన్ని, దాని నమూనాను, బయటికీ లోపలికీ వెళ్లే దారుల్ని తెలియజేయాలి.+ వాళ్లకు దాని రేఖాచిత్రాలు, శాసనాలు, నియమాలు అన్నిటినీ చూపించు. వాళ్ల కళ్లముందు వాటిని రాయి. అప్పుడు వాళ్లు దాని రేఖాచిత్రాన్ని గమనించి, దాని శాసనాల్ని పాటించగలుగుతారు.+ 12 ఇది ఆలయానికి సంబంధించిన నియమం. పర్వతం మీద ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతమంతా అతి పవిత్రం.+ ఇదిగో! ఇది ఆలయానికి సంబంధించిన నియమం.
13 “ఇవి మూర (ప్రతీ మూరకు ఒక బెత్తెడు జతచేయబడింది)* కొలత ప్రకారం బలిపీఠానికి సంబంధించిన కొలతలు.+ దాని అడుగుభాగం ఒక మూర ఎత్తు, ఒక మూర వెడల్పు ఉంది. దానికి నాలుగువైపులా జేనడు* చూరు ఉంది. ఇది బలిపీఠం అడుగుభాగం. 14 నేలమీదున్న ఆ అడుగుభాగం మీద చుట్టూ ఒక అంచు ఉంది, దాని ఎత్తు రెండు మూరలు, వెడల్పు ఒక మూర. ఈ చిన్న అంచు మీద చుట్టూ పెద్ద అంచు ఉంది, దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర. 15 బలిపీఠం కొలిమి నాలుగు మూరల ఎత్తు ఉంది, బలిపీఠం కొలిమి నుండి నాలుగు కొమ్ములు పైకి ఉన్నాయి.+ 16 బలిపీఠం కొలిమి చతురస్రాకారంలో ఉంది, దాని పొడవు 12 మూరలు, వెడల్పు 12 మూరలు.+ 17 దాని చుట్టూ ఉన్న అంచు 14 మూరల పొడవు, 14 మూరల వెడల్పు ఉంది; దాని చుట్టూ ఉన్న చూరు అర మూర ఉంది, దాని అడుగుభాగం అన్నివైపులా ఒక మూర ఉంది.
“దాని మెట్లు తూర్పు వైపుకు ఉన్నాయి.”
18 తర్వాత అతను నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘సంపూర్ణ దహనబలులు అర్పించడానికి, రక్తాన్ని చిలకరించడానికి బలిపీఠాన్ని చేసేటప్పుడు ఈ నిర్దేశాలు పాటించాలి.’+
19 “ ‘నాకు పరిచారం చేయడానికి నన్ను సమీపించే సాదోకు వంశస్థులైన లేవి యాజకులకు+ నువ్వు పాపపరిహారార్థ బలిగా మందలో నుండి ఒక కోడెదూడను ఇవ్వాలి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 20 ‘నువ్వు దాని రక్తంలో కొంచెం తీసుకొని, బలిపీఠం నాలుగు కొమ్ముల మీద, దాని చుట్టూ ఉన్న అంచు నాలుగు మూలల మీద, అలాగే చుట్టూ ఉన్న చూరు మీద రాయాలి. అలా నువ్వు బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేసి, దానికి ప్రాయశ్చిత్తం చేస్తావు.+ 21 తర్వాత పాపపరిహారార్థ బలిని అంటే కోడెదూడను తీసుకుని, ఆలయంలో నిర్ణయించబడిన చోట, పవిత్రమైన స్థలం బయట దాన్ని కాల్చేయాలి.+ 22 రెండో రోజు నువ్వు ఏ లోపంలేని మేకపోతును పాపపరిహారార్థ బలిగా అర్పించాలి; వాళ్లు కోడెదూడతో శుద్ధి చేసినట్టే బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేస్తారు.’
23 “ ‘నువ్వు దాన్ని పాపం నుండి శుద్ధి చేశాక, మందలో నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడను, ఏ లోపంలేని పొట్టేలును అర్పించాలి. 24 నువ్వు వాటిని యెహోవా సన్నిధికి తేవాలి; అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి,+ యెహోవాకు సంపూర్ణ దహనబలిగా అర్పిస్తారు. 25 ఏడురోజుల పాటు నువ్వు ప్రతీరోజు ఒక మేకపోతును పాపపరిహారార్థ బలిగా అర్పించాలి,+ అలాగే మందలో నుండి ఒక కోడెదూడను, ఒక పొట్టేలును అర్పించాలి; నువ్వు ఏ దోషంలేని* జంతువుల్ని అర్పించాలి. 26 ఏడురోజుల పాటు వాళ్లు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వాళ్లు దాన్ని శుద్ధి చేసి ప్రతిష్ఠించాలి. 27 ఆ రోజులు పూర్తయ్యాక, ఎనిమిదో రోజున+ అలాగే అప్పటినుండి యాజకులు మీ* సంపూర్ణ దహనబలుల్ని, సమాధాన బలుల్ని బలిపీఠం మీద అర్పిస్తారు; నేను మీ విషయంలో సంతోషిస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
44 అతను నన్ను తూర్పు వైపున్న పవిత్రమైన స్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు,+ ఆ ద్వారం మూయబడివుంది.+ 2 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఈ ద్వారం మూయబడే ఉంటుంది. ఇది తెరవబడదు, ఏ మనిషీ దీని గుండా ప్రవేశించడు; ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దాని గుండా ప్రవేశించాడు.+ కాబట్టి అది మూయబడే ఉండాలి. 3 అయితే ప్రధానుడు యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి అందులో కూర్చుంటాడు,+ ఎందుకంటే అతను ప్రధానుడు. అతను ద్వారం వసారా గుండా లోపలికి వస్తాడు, దాని గుండా బయటికి వెళ్తాడు.”+
4 తర్వాత అతను ఉత్తర ద్వారం గుండా నన్ను ఆలయం ముందు భాగంలోకి తీసుకొచ్చాడు. నేను చూసినప్పుడు, యెహోవా ఆలయం యెహోవా మహిమతో నిండివుండడం కనిపించింది.+ దాంతో నేను నేలమీద సాష్టాంగపడ్డాను.+ 5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, మనసుపెట్టి గమనించు; యెహోవా ఆలయానికి సంబంధించిన శాసనాలు, నియమాల గురించి నేను నీకు చెప్పబోయే ప్రతీది జాగ్రత్తగా విను. ఆలయ ప్రవేశ ద్వారాన్ని, పవిత్రమైన స్థలం నుండి బయటికి వెళ్లే దారులన్నిటినీ జాగ్రత్తగా గమనించు.+ 6 నువ్వు తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఇప్పటివరకు మీరు చేసిన అసహ్యమైన పనులు చాలు. 7 మీరు హృదయంలోనూ శరీరంలోనూ సున్నతిలేని పరదేశుల్ని నా పవిత్రమైన స్థలంలోకి తీసుకొచ్చినప్పుడు, వాళ్లు నా ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఒకవైపు మీరు మీ హేయమైన పనులన్నిటితో నా ఒప్పందాన్ని భంగపరుస్తూ మరోవైపు నాకు రొట్టెను, కొవ్వును, రక్తాన్ని అర్పిస్తున్నారు. 8 మీరు నా పవిత్రమైన వాటిని చూసుకోలేదు.+ బదులుగా నా పవిత్రమైన స్థలంలోని బాధ్యతల్ని నిర్వహించడానికి మీరు వేరేవాళ్లను నియమిస్తున్నారు.” ’
9 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “హృదయంలోనూ శరీరంలోనూ సున్నతిలేని, ఇశ్రాయేలులో నివసించే ఏ పరదేశీ నా పవిత్రమైన స్థలంలోకి రాకూడదు.” ’
10 “ ‘తమ అసహ్యమైన విగ్రహాల్ని* అనుసరించడానికి ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టినప్పుడు నాకు దూరంగా వెళ్లిపోయిన లేవీయులు+ తమ దోషశిక్షను భరిస్తారు. 11 వాళ్లు నా పవిత్రమైన స్థలంలో పరిచారకులుగా ఉంటూ, ఆలయ ద్వారాల్ని పర్యవేక్షిస్తారు,+ ఆలయం దగ్గర పరిచారం చేస్తారు. వాళ్లు ప్రజల కోసం సంపూర్ణ దహనబలి జంతువుల్ని, బలి జంతువుల్ని వధిస్తారు, ప్రజల ముందు నిలబడి వాళ్లకు పరిచారం చేస్తారు. 12 వాళ్లు ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాల ఎదుట నిలబడి వాళ్లకు పరిచారం చేశారు, అలా వాళ్లు తడబడి పాపం చేసేందుకు కారణమయ్యారు+ కాబట్టి నేను వాళ్లకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాను, వాళ్లు ఖచ్చితంగా తమ దోషశిక్షను భరిస్తారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 13 ‘వాళ్లు నాకు యాజకులుగా సేవ చేయడానికి నన్ను సమీపించరు; నా పవిత్రమైన వాటి దగ్గరికి గానీ, అతి పవిత్రమైన వాటి దగ్గరికి గానీ రారు. తాము చేసిన అసహ్యమైన పనుల్ని బట్టి వాళ్లు అవమానం పొందుతారు. 14 కానీ నేను వాళ్లను ఆలయ బాధ్యతల్ని చూసుకునేవాళ్లుగా నియమిస్తాను; వాళ్లు ఆలయ సేవల్ని, అందులో జరగాల్సిన పనులన్నిటినీ చూసుకుంటారు.’+
15 “ ‘ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టినప్పుడు, నా పవిత్రమైన స్థలంలోని బాధ్యతల్ని చూసుకున్న సాదోకు వంశస్థులైన లేవి యాజకులు+ నాకు పరిచారం చేయడానికి నన్ను సమీపిస్తారు, వాళ్లు నాకు కొవ్వును,+ రక్తాన్ని అర్పించడానికి నా ముందు నిలబడతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 16 ‘వాళ్లే నా పవిత్రమైన స్థలంలోకి ప్రవేశిస్తారు, నా బల్ల దగ్గరికి వచ్చి నాకు పరిచారం చేస్తారు;+ నా విషయంలో తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు.+
17 “ ‘వాళ్లు లోపలి ప్రాంగణం ద్వారాల్లోకి ప్రవేశించేటప్పుడు నారవస్త్రాలు వేసుకోవాలి.+ వాళ్లు లోపలి ప్రాంగణం ద్వారాల్లో గానీ, దాని లోపల గానీ పరిచారం చేసేటప్పుడు ఎలాంటి ఉన్ని వస్త్రాలు వేసుకోకూడదు. 18 తమ తలలకు నార తలపాగాలు పెట్టుకోవాలి, పొడవైన నార లాగులు వేసుకోవాలి.+ చెమట పుట్టించేదేదీ వాళ్లు వేసుకోకూడదు. 19 వాళ్లు బయటి ప్రాంగణంలోకి, అంటే ప్రజలు ఉండే బయటి ప్రాంగణంలోకి వెళ్లేముందు, తాము పరిచారం చేస్తున్నప్పుడు వేసుకున్న బట్టల్ని తీసేసి,+ వాటిని పవిత్ర భోజనాల గదుల్లో పెట్టాలి.+ వాళ్లు తమ బట్టలతో ప్రజల్ని పవిత్రుల్ని చేయకుండా ఉండడం కోసం వేరే బట్టలు వేసుకోవాలి. 20 వాళ్లు తమ తలల్ని బోడి చేసుకోకూడదు,+ లేదా తలవెంట్రుకల్ని పొడుగ్గా పెరగనివ్వకూడదు, వాళ్లు తమ తలవెంట్రుకల్ని కత్తిరించుకోవాలి. 21 యాజకులు లోపలి ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు ద్రాక్షారసం తాగకూడదు.+ 22 వాళ్లు విధవరాలిని గానీ విడాకులైన స్త్రీని గానీ పెళ్లి చేసుకోకూడదు; అయితే ఇశ్రాయేలు సంతతికి చెందిన కన్యను గానీ, చనిపోయిన ఒక యాజకుడి భార్యను గానీ పెళ్లి చేసుకోవచ్చు.’+
23 “ ‘వాళ్లు పవిత్రమైన దానికీ, సాధారణమైన దానికీ ఉన్న తేడా నా ప్రజలకు నేర్పించాలి; అశుద్ధమైన దానికీ, శుద్ధమైన దానికీ మధ్య తేడా వాళ్లకు బోధించాలి.+ 24 వాళ్లు న్యాయమూర్తులుగా ఉంటూ వ్యాజ్యాల్ని పరిష్కరించాలి;+ నా న్యాయనిర్ణయాల ప్రకారం తీర్పు తీర్చాలి.+ నా పండుగలన్నిటికీ సంబంధించిన నా నియమాల్ని, శాసనాల్ని పాటించాలి; నా విశ్రాంతి రోజుల్ని పవిత్రపర్చాలి. 25 వాళ్లు అపవిత్రులు కాకుండా ఉండేలా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లకూడదు. అయితే తమ తండ్రి గానీ, తల్లి గానీ, కుమారుడు గానీ, కూతురు గానీ, సహోదరుడు గానీ, పెళ్లికాని సహోదరి గానీ చనిపోతే వాళ్లకోసం తమను తాము అపవిత్రపర్చుకోవచ్చు. 26 ఒక యాజకుడు శుద్ధుడైన తర్వాత, అతను మళ్లీ పరిచారం చేయాలంటే ఏడురోజులు ఆగాలి. 27 అతను పవిత్ర స్థలంలో సేవ చేయడానికి, పవిత్ర స్థలంలోకి, లోపలి ప్రాంగణంలోకి ప్రవేశించే రోజున అతను తన పాపపరిహారార్థ బలిని అర్పించాలి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
28 “ ‘వాళ్ల స్వాస్థ్యం ఇదే: నేనే వాళ్ల స్వాస్థ్యం.+ నువ్వు ఇశ్రాయేలులో వాళ్లకు ఏ ఆస్తీ ఇవ్వకూడదు, ఎందుకంటే నేనే వాళ్ల ఆస్తి. 29 వాళ్లు ధాన్యార్పణల్ని, పాపపరిహారార్థ బలుల్ని, అపరాధ పరిహారార్థ బలుల్ని తింటారు;+ ఇశ్రాయేలులో సమర్పించబడిన ప్రతీది వాళ్లదే అవుతుంది.+ 30 మీ మొదటి పంటలో, మీరు ఇచ్చే ప్రతీ విధమైన కానుకల్లో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి.+ మీ దంచిన ధాన్యంలో ప్రథమఫలాల్ని మీరు యాజకుడికి ఇవ్వాలి.+ దానివల్ల మీ ఇంటివాళ్లందరికీ దీవెన వస్తుంది.+ 31 చనిపోయిన లేదా చీల్చబడిన పక్షిని గానీ జంతువును గానీ యాజకులు తినకూడదు.’+
45 “ ‘మీరు దేశాన్ని స్వాస్థ్యంగా పంచి ఇచ్చేటప్పుడు,+ దేశంలో ఒక పవిత్రమైన భాగాన్ని యెహోవాకు కానుకగా ఇవ్వాలి.+ దాని పొడవు 25,000 మూరలు,* వెడల్పు 10,000 మూరలు ఉండాలి.+ ఆ* ప్రాంతమంతా పవిత్రమైన భాగంగా ఉంటుంది. 2 అందులో చతురస్రాకారంలో ఒక పవిత్ర స్థలం ఉంటుంది, దాని పొడవు 500 మూరలు, వెడల్పు 500 మూరలు;+ దానికి అన్నివైపులా 50 మూరల వెడల్పు గల ఒక పచ్చిక మైదానం ఉంటుంది.+ 3 ఈ ప్రాంతం నుండి నువ్వు 25,000 మూరల పొడవు, 10,000 మూరల వెడల్పు ఉన్న స్థలాన్ని కొలవాలి; అందులో ఆలయం* ఉంటుంది, అది అతి పవిత్రమైన స్థలం. 4 అది యాజకులకు, అంటే యెహోవాకు పరిచారం చేయడానికి ఆయన్ని సమీపించే ఆలయ* పరిచారకులకు+ చెందిన పవిత్రమైన భాగంగా ఉంటుంది.+ ఈ స్థలం వాళ్లు ఇళ్లు కట్టుకునే స్థలంగా, ఆలయం కోసం పవిత్ర స్థలంగా ఉంటుంది.
5 “ ‘అలాగే ఆలయంలో పరిచారం చేసే లేవీయుల కోసం 25,000 మూరల పొడవు, 10,000 మూరల వెడల్పు గల ఒక స్థలం ఉంటుంది;+ వాళ్లు 20 భోజనాల గదుల్ని+ తమ స్వాస్థ్యంగా పొందుతారు.
6 “ ‘నువ్వు నగర స్వాస్థ్యంగా 25,000 మూరల పొడవు (పవిత్రమైన కానుకకు సమాంతరంగా), అలాగే 5,000 మూరల వెడల్పు గల ఒక ప్రాంతాన్ని ఇవ్వాలి.+ అది ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ చెందుతుంది.
7 “ ‘పవిత్రమైన కానుకకు, నగరానికి నియమించబడిన స్థలానికీ రెండువైపులా ప్రధానుడి స్థలం ఉంటుంది. అది పవిత్రమైన కానుకకు, నగర స్వాస్థ్యానికి పక్కన ఉంటుంది. అది పడమటి వైపు, తూర్పు వైపు ఉంటుంది. పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు దాని పొడవు ఒక గోత్రానికి చెందిన ప్రాంతమంత ఉంటుంది.+ 8 ఈ ప్రాంతం ఇశ్రాయేలులో అతని స్వాస్థ్యంగా ఉంటుంది. నా ప్రధానులు ఇక నా ప్రజల్ని బాధించరు;+ వాళ్లవాళ్ల గోత్రాల ప్రకారం ఇశ్రాయేలు ఇంటివాళ్లకు దేశాన్ని ఇస్తారు.’+
9 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇశ్రాయేలు ప్రధానులారా, మీరు చాలా దూరం వెళ్లారు!’
“ ‘దౌర్జన్యం చేయడం, అణచివేయడం ఆపి, నీతిన్యాయాల్ని జరిగించండి.+ నా ప్రజల ఆస్తిని లాక్కోవడం మానేయండి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 10 ‘మీరు ఖచ్చితమైన త్రాసుల్ని, ఖచ్చితమైన ఈఫా కొలతను,* ఖచ్చితమైన బాత్ కొలతను* ఉపయోగించాలి.+ 11 ఈఫా కొలతకు, బాత్ కొలతకు ఖచ్చితమైన కొలమానం ఉండాలి. బాత్ కొలత హోమర్‌లో* పదోవంతు ఉండాలి, ఈఫా కొలత హోమర్‌లో పదోవంతు ఉండాలి. హోమర్ ప్రామాణిక కొలమానంగా ఉంటుంది. 12 ఒక షెకెల్*+ 20 గీరాలు* ఉండాలి. 20 షెకెల్‌లు, 25 షెకెల్‌లు, 15 షెకెల్‌లు కలిపి మీకు ఒక మనెగా* ఉండాలి.’
13 “ ‘మీరు అర్పించాల్సిన కానుక ఇది: ప్రతీ హోమర్ గోధుమల్లో నుండి ఈఫాలో ఆరోవంతు, ప్రతీ హోమర్ బార్లీలో నుండి ఈఫాలో ఆరోవంతు ఇవ్వాలి. 14 నూనెను బాత్ కొలత ప్రకారం ఇవ్వాలి. ఒక బాత్ ఒక కొర్‌లో* పదోవంతుతో సమానం, పది బాత్‌లు ఒక హోమర్ అవుతాయి, ఎందుకంటే పది బాత్‌లు ఒక హోమర్‌తో సమానం. 15 ఇశ్రాయేలు పశు సంపదలో, ప్రతీ 200 గొర్రెల్లో నుండి ఒక గొర్రెను ఇవ్వాలి. ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి+ ఇవి ధాన్యార్పణగా,+ సంపూర్ణ దహనబలిగా,+ సమాధాన బలులుగా+ ఉపయోగించబడతాయి’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
16 “ ‘దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని ప్రధానుడికి ఈ కానుక ఇవ్వాలి.+ 17 పండుగ సమయాల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతి రోజుల్లో,+ ఇశ్రాయేలు ఇంటివాళ్ల నియామక పండుగ రోజులన్నిట్లో+ అర్పించే సంపూర్ణ దహనబలుల,+ ధాన్యార్పణల,+ పానీయార్పణల+ బాధ్యత ఆ ప్రధానుడిదే. ఇశ్రాయేలు ఇంటివాళ్ల తరఫున ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారార్థ బలి, ధాన్యార్పణ, సంపూర్ణ దహనబలి, సమాధాన బలులు ఏర్పాటు చేయాల్సింది అతనే.’
18 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మొదటి నెల, మొదటి రోజున, నువ్వు మందలో నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడను తీసుకుని, పవిత్రమైన స్థలాన్ని పాపం నుండి శుద్ధి చేయాలి.+ 19 యాజకుడు పాపపరిహారార్థ బలి రక్తంలో నుండి కొంచెం తీసుకుని, దాన్ని ఆలయ ద్వారబంధాల+ మీద, బలిపీఠం చుట్టూ ఉన్న అంచు నాలుగు మూలల మీద, లోపలి ప్రాంగణ ద్వారపు ద్వారబంధం మీద పూస్తాడు. 20 పొరపాటున లేదా తెలియక పాపం చేసినవాళ్ల కోసం+ నువ్వు ఆ నెల ఏడో రోజున ఇలా చేయాలి; అలా నువ్వు ఆలయాన్ని శుద్ధి చేయాలి.+
21 “ ‘మొదటి నెల, 14వ రోజున మీరు పస్కా పండుగ ఆచరించాలి.+ మీరు ఏడురోజుల పాటు పులవని రొట్టెలు తినాలి.+ 22 ఆ రోజున ప్రధానుడు తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను ఇస్తాడు.+ 23 పండుగ జరిగే ఏడురోజుల్లో ప్రతీరోజు అతను ఏ లోపంలేని ఏడు కోడెదూడల్ని, ఏ లోపంలేని ఏడు పొట్టేళ్లను యెహోవాకు సంపూర్ణ దహనబలిగా ఇస్తాడు;+ అలాగే పాపపరిహారార్థ బలిగా ప్రతీరోజు ఒక మేకపోతును ఇస్తాడు. 24 అంతేకాదు అతను ధాన్యార్పణగా ప్రతీ కోడెదూడతో పాటు ఒక ఈఫా పిండిని, ప్రతీ పొట్టేలుతో పాటు ఒక ఈఫా పిండిని ఇవ్వాలి; అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్* నూనెను ఇవ్వాలి.
25 “ ‘ఏడో నెల 15వ రోజు నుండి, పండుగ జరిగే ఏడురోజుల పాటు+ అతను ఇలాంటి పాపపరిహారార్థ బలిని, సంపూర్ణ దహనబలిని, ధాన్యార్పణను, నూనెను ఇవ్వాలి.’ ”
46 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘తూర్పు వైపున్న లోపలి ప్రాంగణ ద్వారం+ ఆరు పనిరోజులూ+ మూయబడే ఉండాలి;+ అయితే విశ్రాంతి రోజున, అమావాస్య రోజున అది తెరవబడాలి. 2 ప్రధానుడు బయటి ప్రాంగణం నుండి ద్వారం వసారా గుండా లోపలికి వచ్చి,+ ద్వారపు ద్వారబంధం దగ్గర నిలబడతాడు. యాజకులు అతని సంపూర్ణ దహనబలిని, సమాధాన బలుల్ని అర్పిస్తారు; అతను ద్వారం గడప దగ్గర వంగి నమస్కారం చేసి వెళ్లిపోతాడు. అయితే సాయంత్రం వరకు ఆ ద్వారాన్ని మూయకూడదు. 3 దేశంలోని ప్రజలు కూడా విశ్రాంతి రోజుల్లో, అమావాస్య రోజుల్లో ఆ ద్వార ప్రవేశం దగ్గర యెహోవా ముందు వంగి నమస్కారం చేస్తారు.+
4 “ ‘విశ్రాంతి రోజున ఆ ప్రధానుడు యెహోవాకు అర్పించే సంపూర్ణ దహనబలిలో, ఏ లోపంలేని ఏడు మగ గొర్రెపిల్లలు, ఏ లోపంలేని ఒక పొట్టేలు ఉండాలి.+ 5 ధాన్యార్పణగా పొట్టేలుతో పాటు ఒక ఈఫా* పిండిని, మగ గొర్రెపిల్లలతో పాటు అతను ఇవ్వగలిగింది ఇవ్వాలి; అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్* నూనెను ఇవ్వాలి.+ 6 అమావాస్య రోజున అర్పించే అర్పణలో మంద నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడ, ఆరు మగ గొర్రెపిల్లలు, ఒక పొట్టేలు ఉండాలి; వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 7 అతను ధాన్యార్పణగా కోడెదూడతో పాటు ఒక ఈఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఈఫా పిండిని, మగ గొర్రెపిల్లలతో పాటేమో తాను ఇవ్వగలిగింది ఇవ్వాలి. అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్ నూనెను ఇవ్వాలి.
8 “ ‘ప్రధానుడు లోపలికి ప్రవేశించేటప్పుడు, ద్వారం వసారా గుండా రావాలి, అదే దారిలో బయటికి వెళ్లాలి.+ 9 అయితే దేశ ప్రజలు పండుగలప్పుడు యెహోవాను ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు,+ ఉత్తర ద్వారం+ గుండా వచ్చేవాళ్లు దక్షిణ ద్వారం+ గుండా బయటికి వెళ్లాలి; దక్షిణ ద్వారం గుండా వచ్చేవాళ్లు ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్లాలి; ఎవ్వరూ తాము వచ్చిన ద్వారం గుండా బయటికి వెళ్లకూడదు, బదులుగా దానికి ఎదురుగా ఉన్న ద్వారం గుండా బయటికి వెళ్లాలి. 10 అయితే వాళ్ల మధ్య ఉన్న ప్రధానుడి విషయానికొస్తే, ప్రజలు లోపలికి వచ్చినప్పుడు అతను లోపలికి రావాలి, వాళ్లు బయటికి వెళ్లేటప్పుడు అతను బయటికి వెళ్లాలి. 11 పండుగలప్పుడు, పండుగ సమయాల్లో ధాన్యార్పణగా కోడెదూడతో పాటు ఒక ఈఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఈఫా పిండిని, మగ గొర్రెపిల్లలతో పాటేమో తాను ఇవ్వగలిగింది ఇవ్వాలి. అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్ నూనెను ఇవ్వాలి.+
12 “ ‘ఒకవేళ ప్రధానుడు యెహోవాకు స్వేచ్ఛార్పణగా సంపూర్ణ దహనబలిని+ గానీ సమాధాన బలుల్ని గానీ ఇస్తే, తూర్పు ద్వారాన్ని అతని కోసం తెరవాలి; అతను విశ్రాంతి రోజున ఇచ్చినట్టే తన సంపూర్ణ దహనబలిని, తన సమాధాన బలుల్ని ఇస్తాడు.+ అతను బయటికి వెళ్లిపోయిన తర్వాత, ఆ ద్వారాన్ని మూసేయాలి.+
13 “ ‘ప్రతీరోజు ఏ లోపంలేని ఒక ఏడాది మగ గొర్రెపిల్లను యెహోవాకు సంపూర్ణ దహనబలిగా ఇవ్వాలి.+ ప్రతీ ఉదయం అలా చేయాలి. 14 దానితోపాటు, ప్రతీ ఉదయం ధాన్యార్పణగా ఈఫాలో ఆరోవంతు పిండిని ఇవ్వాలి; అలాగే ఆ మెత్తని పిండి మీద చల్లడానికి హిన్‌లో మూడోవంతు నూనెను ఇవ్వాలి; ఇది యెహోవాకు ఎప్పుడూ అర్పించే ధాన్యార్పణ. ఇది శాశ్వత శాసనం. 15 ఎప్పుడూ అర్పించే సంపూర్ణ దహనబలిగా ప్రతీ ఉదయం ఒక మగ గొర్రెపిల్లను, ధాన్యార్పణను, నూనెను ఇవ్వాలి.’
16 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఒకవేళ ప్రధానుడు తన కుమారుల్లో ప్రతీ ఒక్కరికి భూమిని స్వాస్థ్యంగా బహుమతి ఇస్తే, అది అతని కుమారుల ఆస్తి అవుతుంది. అది వాళ్లకు వారసత్వ ఆస్తి. 17 అయితే ఒకవేళ అతను తన సేవకుల్లో ఒకరికి తన స్వాస్థ్యంలో నుండి బహుమతి ఇస్తే, అది విడుదల సంవత్సరం+ వరకే ఆ సేవకుడిది అవుతుంది; ఆ తర్వాత అది ప్రధానుడికి తిరిగొస్తుంది. అతని కుమారుల స్వాస్థ్యం మాత్రమే శాశ్వతంగా వాళ్లకు ఉండిపోతుంది. 18 ప్రధానుడు ప్రజల్లో ఎవ్వర్నీ వాళ్ల స్వాస్థ్యం నుండి బలవంతంగా వెళ్లగొట్టి దాన్ని సొంతం చేసుకోకూడదు. అతను తన ఆస్తిలో నుండే తన కుమారులకు స్వాస్థ్యం ఇవ్వాలి. అలా నా ప్రజల్లో ఏ ఒక్కరూ తమ స్వాస్థ్యం నుండి వెళ్లగొట్టబడకుండా ఉంటారు.’ ”
19 తర్వాత అతను నన్ను ఉత్తరం వైపు+ గుమ్మాలున్న యాజకుల పవిత్ర భోజనాల గదులకు వెళ్లే ద్వారం పక్కనున్న ప్రవేశ మార్గం+ గుండా లోపలికి తీసుకొచ్చాడు, అక్కడ పడమటి వైపు వెనక భాగంలో నాకు ఒక స్థలం కనిపించింది. 20 అతను నాతో ఇలా అన్నాడు: “యాజకులు ఇక్కడే అపరాధ పరిహారార్థ బలి మాంసాన్ని, పాపపరిహారార్థ బలి మాంసాన్ని ఉడకబెడతారు,+ ధాన్యార్పణను కాలుస్తారు. దానివల్ల వాళ్లు దేన్నీ బయటి ప్రాంగణంలోకి తీసుకెళ్లకుండా, అలా ప్రజల్ని పవిత్రుల్ని చేయకుండా ఉంటారు.”+
21 అతను నన్ను బయటి ప్రాంగణంలోకి తీసుకొచ్చి, ప్రాంగణం నాలుగు మూలలకూ నడిపించాడు. అప్పుడు నాకు బయటి ప్రాంగణం నాలుగు మూలల్లో ప్రాంగణాలు కనిపించాయి. 22 ప్రాంగణం నాలుగు మూలల్లో నాలుగు చిన్న ప్రాంగణాలు ఉన్నాయి; వాటి పొడవు 40 మూరలు,* వెడల్పు 30 మూరలు. నాలుగు ప్రాంగణాల కొలతలు ఒక్కటే. 23 ఆ నాలుగు ప్రాంగణాల్లో చుట్టూ అరుగులు ఉన్నాయి, వాటి కింద అర్పణల మాంసాన్ని ఉడకబెట్టడానికి పొయ్యిలు కట్టబడివున్నాయి. 24 అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఇవి ఆలయ పరిచారకులు ప్రజల బలుల మాంసాన్ని ఉడకబెట్టే స్థలాలు.”+
47 తర్వాత అతను నన్ను మళ్లీ ఆలయ ప్రవేశం+ దగ్గరికి తీసుకొచ్చాడు; ఆలయ గడప కింద నుండి తూర్పు వైపు నీళ్లు ప్రవహించడం నాకు అక్కడ కనిపించింది,+ ఎందుకంటే ఆలయ ముందుభాగం తూర్పు వైపుకు ఉంది. ఆ నీళ్లు ఆలయ కుడివైపు నుండి కిందికి, బలిపీఠానికి దక్షిణం వైపుగా ప్రవహిస్తున్నాయి.
2 తర్వాత అతను నన్ను ఉత్తర ద్వారం+ గుండా బయటికి తీసుకెళ్లాడు; అతను నన్ను బయటికి నడిపించి, చుట్టూ తిప్పి తూర్పు వైపున్న బయటి ద్వారం+ దగ్గరికి తీసుకొచ్చాడు; అక్కడ నేను కుడివైపు నుండి నీళ్లు కారడం చూశాను.
3 ఆ మనిషి కొలనూలు చేతపట్టుకొని+ తూర్పు వైపు నడుస్తూ 1,000 మూరలు* కొలిచాడు; తర్వాత నన్ను ఆ నీళ్ల గుండా నడిపించాడు; అవి చీలమండ లోతున్నాయి.
4 తర్వాత అతను ఇంకో 1,000 మూరలు కొలిచి, నన్ను ఆ నీళ్ల గుండా నడిపించాడు; అవి మోకాలు లోతున్నాయి.
తర్వాత అతను ఇంకో 1,000 మూరలు కొలిచి, నన్ను ఆ నీళ్ల గుండా నడిపించాడు; అవి నడుము లోతున్నాయి.
5 తర్వాత అతను ఇంకో 1,000 మూరలు కొలిచాడు. అవి నేను నడవలేనంత పెద్ద ప్రవాహంలా ఉన్నాయి; ఆ నీళ్లు ఎంత లోతుగా ఉన్నాయంటే ఈత కొడితే తప్ప నడుస్తూ వాటిని దాటలేం.
6 అతను నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇది చూశావా?”
తర్వాత అతను నన్ను ఆ ప్రవాహంలో నుండి ఒడ్డుకు నడిపించాడు. 7 నేను తిరిగొచ్చినప్పుడు, ఆ ప్రవాహం ఒడ్డున రెండువైపులా ఎన్నో చెట్లు కనిపించాయి.+ 8 అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఈ నీళ్లు తూర్పు ప్రాంతం వైపు అరాబా*+ మీదుగా ప్రవహించి సముద్రంలో* కలుస్తాయి. అవి సముద్రంలో కలిసినప్పుడు+ అక్కడి నీళ్లు మంచినీళ్లు అవుతాయి. 9 ఈ నీళ్లు వెళ్లిన ప్రతీచోట జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్లు ప్రవహించడం వల్ల అక్కడ విస్తారంగా చేపలు ఉంటాయి. సముద్రంలోని నీళ్లు మంచినీళ్లు అవుతాయి, ఆ ప్రవాహం వెళ్లిన ప్రతీచోట అన్నీ బ్రతుకుతాయి.
10 “ఏన్గెదీ+ నుండి ఏనెగ్లాయీము వరకు జాలరులు ఆ సముద్రం ఒడ్డున నిలబడివుంటారు, అక్కడ వలలు ఆరబెట్టుకోవడానికి ఒక స్థలం ఉంటుంది. మహా సముద్రంలో*+ ఉన్నట్టు దానిలో రకరకాల చేపలు సమృద్ధిగా ఉంటాయి.
11 “అయితే దాని దగ్గర చిత్తడినేలలు, బురద స్థలాలు ఉంటాయి, అవి బాగవ్వవు. వాటిలోని ఉప్పు అలాగే ఉండిపోతుంది.+
12 “ప్రవాహం ఒడ్డున రెండువైపులా ఆహారం ఇచ్చే అన్నిరకాల పండ్ల చెట్లు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు; ఆ చెట్లు ఫలించకుండా ఉండవు. అవి ప్రతీ నెల కాపు కాస్తాయి, ఎందుకంటే పవిత్రమైన స్థలం నుండి ప్రవహించే నీళ్లు+ వాటికి అందుతున్నాయి. వాటి పండ్లు ఆహారం కోసం, వాటి ఆకులు స్వస్థత కోసం ఉపయోగపడతాయి.”+
13 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు ఇశ్రాయేలు 12 గోత్రాలకు స్వాస్థ్యంగా పంచి ఇచ్చే ప్రాంతం ఇదే, యోసేపుకు రెండు భాగాలు వస్తాయి.+ 14 మీరు దాన్ని స్వాస్థ్యంగా పొందుతారు, అందరికీ సమాన వాటాలు వస్తాయి.* నేను ఈ దేశాన్ని మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేశాను,+ ఇప్పుడది మీకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వబడింది.
15 “ఇది ఆ దేశం ఉత్తర సరిహద్దు: ఇది మహా సముద్రం నుండి హెత్లోను+ మార్గంలో, సెదాదు+ మీదుగా, 16 హమాతు,+ బేరోతా,+ దమస్కు-హమాతు ప్రాంతాల మధ్య ఉన్న సిబ్రయీము మీదుగా, హవ్రాను+ సరిహద్దు దగ్గర ఉన్న హాజేర్-హత్తికోను వరకు వెళ్తుంది. 17 కాబట్టి ఆ సరిహద్దు సముద్రం నుండి ఉత్తరం వైపు దమస్కు సరిహద్దు మీదుగా, హమాతు+ సరిహద్దు మీదుగా హసరేనాను+ వరకు ఉంటుంది. ఇది ఉత్తర సరిహద్దు.
18 “తూర్పు సరిహద్దు హవ్రాను, దమస్కుల మధ్యగా, అలాగే గిలాదుకు,+ ఇశ్రాయేలు దేశానికి మధ్య ఉన్న యొర్దాను మీదుగా సాగుతుంది. నువ్వు ఉత్తర సరిహద్దు నుండి తూర్పు సముద్రం* వరకు కొలవాలి. ఇది తూర్పు సరిహద్దు.
19 “దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబాతు-కాదేషు నీళ్ల+ వరకు, అక్కడి నుండి వాగు* వరకు, అక్కడి నుండి మహా సముద్రం వరకు ఉంటుంది.+ ఇది దక్షిణ సరిహద్దు.
20 “పడమటి వైపు, దక్షిణ సరిహద్దు నుండి లెబో-హమాతు*+ ఎదురుగా ఉన్న చోటు వరకు మహా సముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు.”
21 “మీరు ఈ దేశాన్ని మీ మధ్య అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్య పంచుకోవాలి. 22 మీరు దీన్ని స్వాస్థ్యంగా పంచుకోవాలి, అలాగే మీ మధ్య ఉంటూ పిల్లల్ని కన్న పరదేశులకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వాలి. మీరు పరదేశుల్ని కూడా మీ మధ్య పుట్టిన ఇశ్రాయేలీయుల్లాగే ఎంచాలి. వాళ్లు మీతోపాటు ఇశ్రాయేలు గోత్రాల్లో స్వాస్థ్యం పొందుతారు. 23 ఒక పరదేశి ఏ గోత్రంలో స్థిరపడ్డాడో ఆ గోత్రానికి చెందిన ప్రాంతంలోనే అతనికి స్వాస్థ్యం ఇవ్వాలి” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
48 “ఇవి, ఉత్తర కొనతో మొదలుపెట్టి గోత్రాల పేర్లు: దాను భూభాగం+ హెత్లోను మార్గం మీదుగా లెబో-హమాతు* వరకు,+ హసరేనాను వరకు, హమాతు+ పక్కన ఉత్తరం వైపు దమస్కు సరిహద్దు వరకు ఉంటుంది; అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 2 ఆషేరు భూభాగం+ దాను సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 3 నఫ్తాలి భూభాగం+ ఆషేరు సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 4 మనష్షే భూభాగం+ నఫ్తాలి సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 5 ఎఫ్రాయిము భూభాగం మనష్షే సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 6 రూబేను భూభాగం ఎఫ్రాయిము సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 7 యూదా భూభాగం రూబేను సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 8 యూదా సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు మీరు ఒక కానుకను ప్రత్యేకించాలి. దాని వెడల్పు 25,000 మూరలు* ఉండాలి.+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఈ భూభాగం పొడవు, వేరే గోత్రాల భూభాగాల పొడవుతో సమానంగా ఉంటుంది. దాని మధ్యలో పవిత్రమైన స్థలం* ఉంటుంది.
9 “మీరు యెహోవా కోసం ప్రత్యేకించాల్సిన కానుక 25,000 మూరల పొడవు, 10,000 మూరల వెడల్పు ఉంటుంది. 10 ఇది యాజకుల కోసం పవిత్రమైన కానుకగా ఉంటుంది.+ ఇది ఉత్తరం వైపు 25,000 మూరలు, దక్షిణం వైపు 25,000 మూరలు, తూర్పు వైపు 10,000 మూరలు, పడమటి వైపు 10,000 మూరలు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా పవిత్రమైన స్థలం ఉంటుంది. 11 ఈ భూభాగం సాదోకు కుమారులైన ప్రతిష్ఠిత యాజకులకు చెందుతుంది;+ ఇశ్రాయేలీయులు, లేవీయులు పక్కదారి పట్టినప్పుడు+ వాళ్లు నన్ను విడిచిపెట్టకుండా నా విషయంలో తమకున్న బాధ్యతల్ని నిర్వర్తించారు. 12 కానుకగా ఇవ్వబడిన భూమిలో లేవీయుల సరిహద్దును ఆనుకొని వాళ్లకు ఒక భూభాగం ఉంటుంది, అది అతి పవిత్రమైనదిగా ప్రత్యేకించబడుతుంది.
13 “యాజకుల ప్రాంతం పక్కనే లేవీయులకు ఒక భూభాగం ఉంటుంది, దాని పొడవు 25,000 మూరలు, వెడల్పు 10,000 మూరలు ఉంటుంది. (దాని మొత్తం పొడవు 25,000 మూరలు, వెడల్పు 10,000 మూరలు.) 14 వాళ్లు దేశంలోని ఈ శ్రేష్ఠమైన భూమిలో కొంచెం కూడా ఎవరికీ అమ్మకూడదు, మార్పిడి చేసుకోకూడదు, బదిలీ చేయకూడదు; ఎందుకంటే అది యెహోవాకు పవిత్రమైనది.
15 “25,000 మూరల సరిహద్దును ఆనుకొని 5,000 మూరల వెడల్పు ఉన్న మిగతా భూమి నగర సాధారణ ఉపయోగం కోసం+ అంటే ఇళ్ల కోసం, మేతస్థలాల కోసం ఉంటుంది. నగరం దాని మధ్యలో ఉంటుంది.+ 16 ఇవి ఆ నగరం కొలతలు: ఉత్తర సరిహద్దు 4,500 మూరలు, దక్షిణ సరిహద్దు 4,500 మూరలు, తూర్పు సరిహద్దు 4,500 మూరలు, పడమటి సరిహద్దు 4,500 మూరలు. 17 నగరం పచ్చిక మైదానం ఉత్తరం వైపు 250 మూరలు, దక్షిణం వైపు 250 మూరలు, తూర్పు వైపు 250 మూరలు, పడమటి వైపు 250 మూరలు ఉంటుంది.
18 “మిగిలిన భూభాగం పొడవు పవిత్రమైన కానుకకు సమానంగా ఉంటుంది,+ అంటే తూర్పు వైపు 10,000 మూరలు, పడమటి వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పవిత్రమైన కానుకకు సమానంగా ఉంటుంది, దానిలో పండే పంట ఆ నగరానికి సేవ చేసేవాళ్లకు ఆహారం అవుతుంది. 19 నగరానికి సేవ చేసే ఇశ్రాయేలు గోత్రాల వాళ్లందరూ దీన్ని సాగుచేస్తారు.+
20 “మొత్తం కానుక 25,000 మూరల పొడవుతో, 25,000 మూరల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంటుంది. మీరు నగర స్వాస్థ్యంతో పాటు దీన్ని పవిత్రమైన కానుకగా ప్రత్యేకించాలి.
21 “పవిత్రమైన కానుకకు, నగర స్వాస్థ్యానికి రెండువైపులా మిగిలిన భూభాగం ప్రధానుడికి చెందుతుంది.+ కానుకకు తూర్పు వైపు, పడమటి వైపు ఉన్న 25,000 మూరల సరిహద్దుల్ని ఆనుకొని అది ఉంటుంది. దాని సరిహద్దు, దాని పక్కనున్న రెండు గోత్రాల సరిహద్దుతో సమానం, అది ప్రధానుడిది అవుతుంది. ఆ భూభాగం మధ్యలో పవిత్రమైన కానుక, మందిర పవిత్రమైన స్థలం ఉంటాయి.
22 “లేవీయుల స్వాస్థ్యం, నగర స్వాస్థ్యం ప్రధానుడికి చెందిన ఈ భూభాగం మధ్యలో ఉంటాయి. ప్రధానుడి ప్రాంతం యూదా సరిహద్దుకు,+ బెన్యామీను సరిహద్దుకు మధ్యలో ఉంటుంది.
23 “మిగతా గోత్రాల విషయానికొస్తే, బెన్యామీను భూభాగం తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.+ 24 షిమ్యోను భూభాగం బెన్యామీను సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 25 ఇశ్శాఖారు భూభాగం+ షిమ్యోను సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 26 జెబూలూను భూభాగం ఇశ్శాఖారు సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.+ 27 గాదు భూభాగం జెబూలూను సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 28 దక్షిణ సరిహద్దు గాదు సరిహద్దు మీదుగా తామారు నుండి+ మెరీబాతు-కాదేషు నీళ్ల+ వరకు, అక్కడి నుండి వాగు* వరకు,+ అక్కడి నుండి మహా సముద్రం* వరకు ఉంటుంది.
29 “మీరు ఇశ్రాయేలు గోత్రాలకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వాల్సిన దేశం ఇదే,+ ఇవి వాళ్ల భూభాగాలుగా ఉంటాయి”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
30 “నగరం నుండి బయటికి వెళ్లే దారులు ఇవి: ఉత్తర సరిహద్దు 4,500 మూరలు ఉంటుంది.+
31 “నగర ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టబడతాయి. ఉత్తరం వైపు మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి రూబేను ద్వారం, ఒకటి యూదా ద్వారం, ఒకటి లేవి ద్వారం.
32 “తూర్పు సరిహద్దు 4,500 మూరల పొడవు ఉంటుంది, దానికి మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి యోసేపు ద్వారం, ఒకటి బెన్యామీను ద్వారం, ఒకటి దాను ద్వారం.
33 “దక్షిణ సరిహద్దు 4,500 మూరలు ఉంటుంది, దానికి మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి షిమ్యోను ద్వారం, ఒకటి ఇశ్శాఖారు ద్వారం, ఒకటి జెబూలూను ద్వారం.
34 “పడమటి సరిహద్దు 4,500 మూరల పొడవు ఉంటుంది, దానికి మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి గాదు ద్వారం, ఒకటి ఆషేరు ద్వారం, ఒకటి నఫ్తాలి ద్వారం.
35 “దాని చుట్టుకొలత 18,000 మూరలు ఉంటుంది. ఆ రోజు నుండి, ‘యెహోవా అక్కడ ఉన్నాడు’+ అనేది ఆ నగరం పేరుగా ఉంటుంది.”
“దేవుడు బలపరుస్తాడు” అని అర్థం.
వెండిబంగారాల మిశ్రమ లోహం.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
ఒకే అక్షం మీద 90 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి జతచేయబడి ఉండవచ్చు.
లేదా “నిటారుగా చాపబడివున్నాయి” అయ్యుంటుంది.
వెండిబంగారాల మిశ్రమ లోహం.
“మానవ కుమారుడు”; ఈ మాట యెహెజ్కేలు పుస్తకంలో 93 సార్లు కనిపిస్తుంది, ఇది మొదటిసారి.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
లేదా “ఈ ప్రజలు మొండిగా, గుచ్చుకునే వాటిలా ఉన్నా” అయ్యుంటుంది.
అక్ష., “నీకు దొరికినదాన్ని.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
లేదా “లెక్క అడుగుతాను.”
లేదా “అన్యాయం.”
లేదా “లెక్క అడుగుతాను.”
లేదా “ఇనుప పెనం.”
అక్ష., “దాని మీద,” అంటే యెహెజ్కేలు ఎడమవైపు మీద.
ఇవి ప్రాచీన ఐగుప్తులో పండే తక్కువ రకం గోధుమలు.
దాదాపు 230 గ్రాములు. అనుబంధం B14 చూడండి.
దాదాపు 600 మి.లీ. అనుబంధం B14 చూడండి.
అక్ష., “రొట్టెల కర్రల్ని విరగ్గొడుతున్నాను.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.
అక్ష., “ఆమె.”
లేదా “చెంగున.”
అక్ష., “ప్రతీ గాలికి.”
లేదా “నీ సంఖ్య తగ్గిస్తాను.”
అక్ష., “ప్రతీ గాలికి.”
అక్ష., “మీ రొట్టెల కర్రల్ని విరగ్గొట్టి.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
పదకోశం చూడండి.
లేదా “పూలదండ” అయ్యుంటుంది.
లేదా “పూలదండ” అయ్యుంటుంది.
అంటే, నాశనం అందరి మీదికి వస్తుంది కాబట్టి ఆస్తిని కొనేవాడు గానీ అమ్మేవాడు గానీ లాభం పొందడు.
లేదా “తన దోషం ద్వారా” అయ్యుంటుంది.
అంటే, భయంతో మూత్ర విసర్జన వల్ల.
అంటే, దుఃఖంతో గుండు చేసుకుంటారు.
అంటే, వాళ్ల వెండిబంగారాలు.
అంటే, తమ వెండిబంగారు వస్తువులతో.
అంటే, విగ్రహాలు చేయడానికి ఉపయోగించిన వాళ్ల వెండిబంగారాల్ని.
యెహోవా పవిత్రమైన స్థలంలోని అత్యంత లోపలి భాగాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
అంటే, చెరగా తీసుకెళ్లడానికి.
లేదా “ధర్మశాస్త్రం.”
లేదా “ఆలోచన.”
వెండిబంగారాల మిశ్రమ లోహం.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
విగ్రహారాధనలో ఉపయోగించే కొమ్మను సూచిస్తుందని తెలుస్తోంది.
లేదా “లేఖికుడి.”
అక్ష., “సిరా కొమ్ము.”
అక్ష., “ఆ జీవినే.”
అక్ష., “ఆ జీవి.”
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
అక్ష., “ఈ జీవినే.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
లేదా “నగరానికి వ్యతిరేకంగా.”
అక్ష., “ఈమె,” అంటే యూదులు తాము సురక్షితంగా ఉంటామని అనుకున్న యెరూషలేము నగరం.
లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్ర.”
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
లేదా “ఐక్య.”
అంటే, దేవుని నిర్దేశానికి స్పందించే హృదయం.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
అక్ష., “ఇంటివాళ్లు.”
అంటే, ఒక బలహీనమైన లోపలి గోడను కట్టి, అది బలంగా కనిపించేలా చేయడానికి సున్నం వేస్తున్నారు.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అక్ష., “దాని రొట్టెల కర్రల్ని విరగ్గొడతాను.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.
లేదా “పిల్లల్ని.”
లేదా “చెంగును.”
లేదా “నిబంధన.”
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “సముద్రవత్సల (సీల్) చర్మం.”
లేదా “రాణిలా.”
అక్ష., “పేరు.”
లేదా “పురుషాంగాల్ని” అయ్యుంటుంది.
లేదా “శాంతపర్చే.”
అక్ష., “అగ్ని గుండా దాటించావు.”
అక్ష., “కనాను.”
లేదా “నేను నీమీద ఎంత ఆగ్రహంతో నిండిపోయానో” అయ్యుంటుంది.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అక్ష., “నీ ఎడమపక్కన.”
బహుశా చుట్టుపక్కల పట్టణాల్ని సూచిస్తుంది.
అక్ష., “నీ కుడిపక్కన.”
అక్ష., “కనాను.”
లేదా “విల్లో చెట్టులా.”
లేదా “ఈజిప్టుకు.”
అంటే, సిద్కియా.
అంటే, నెబుకద్నెజరు.
అక్ష., “ప్రతీ గాలికి.”
పదకోశం చూడండి.
లేదా “ఏ ప్రాణి.” పదకోశం చూడండి.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అక్ష., “రక్తానికి.”
లేదా “ఏ ప్రాణి.”
లేదా “అన్యాయం చేస్తే.”
పదకోశం చూడండి.
అక్ష., “నీ రక్తంలో ద్రాక్షవల్లిలా.”
లేదా “వాళ్లమీద తీర్పు ప్రకటించడానికి.”
అక్ష., “విత్తనంతో.”
లేదా “వేగుచూసిన.”
లేదా “ఆభరణంలా ఉండేది.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అంటే, ఇశ్రాయేలీయుల్ని.
అంటే, ఇశ్రాయేలీయులకు.
లేదా “సబ్బాతు రోజుల్ని.”
అంటే, ఇశ్రాయేలీయుల్ని.
లేదా “ఆభరణం లాంటి.”
అక్ష., “నా కన్ను.”
అంటే, ఇశ్రాయేలీయుల్ని.
అక్ష., “అగ్ని గుండా దాటించడం.”
లేదా “శాంతపర్చే.”
లేదా “విగ్రహాలతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడానికి.”
అక్ష., “అగ్ని గుండా దాటిస్తూ.”
లేదా “శాంతపర్చే.”
అంటే, భయంతో మూత్ర విసర్జన వల్ల.
అక్ష., “చెట్టును.”
అంటే, యెహోవా ఖడ్గం.
అక్ష., “గృహదేవతల.”
అంటే, యెరూషలేము నివాసులు.
లేదా “ఉన్నదాన్ని.”
లేదా “స్వాస్థ్యకర్త.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “అనాథను.”
అక్ష., “తమ తండ్రి మానాన్ని వెల్లడిచేసేవాళ్లు.”
లేదా “అక్రమ వడ్డీ కోసం.”
“ఆమె డేరా” అని అర్థం.
“నా డేరా ఆమెలో ఉంది” అని అర్థం.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “కేడెములతో.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
అంటే, హెల్మెట్.
అంటే, ఆధ్యాత్మిక వ్యభిచారం.
లేదా “విగ్రహాలతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడమే.”
అక్ష., “అగ్ని గుండా దాటించారు.”
లేదా “ఉపమానం.”
లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్రను.”
పదకోశం చూడండి.
లేదా “గుండెలు బాదుకోకూడదు.”
లేదా “పై పెదవిని.”
లేదా “ప్రాకారాలుగల శిబిరాలు.”
లేదా “దానికి ఆభరణంలా ఉన్న.”
అక్ష., “కూతుళ్లు.”
అక్ష., “నెబుకద్రెజరును.”
లేదా “దేశదేశాల.”
లేదా “దాడిచేసే.”
లేదా “ఖడ్గాలతో.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “ప్రధానులందరూ.”
లేదా “చేతుల్లేని నిలువుటంగీల్ని.”
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “సమాధిలోకి.”
లేదా “అలంకరిస్తాను.”
అంటే, జూనిపర్ చెట్లు.
లేదా “పర్షియా.”
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “ఎరుపు, బూడిదరంగు కలిసిన ఉన్ని.”
లేదా “చేత ఇనుమును.”
దాల్చినచెక్క చెట్టు జాతికి చెందిన ఒక చెట్టు.
ఒక సువాసన మొక్క.
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.
లేదా “అల్లిన బట్టతో తయారుచేసిన వస్త్రాల్ని.”
లేదా “మహిమతో” అయ్యుంటుంది.
లేదా “సమాధిలోకి.”
లేదా “అవినీతి.”
ఇక్కడ, ఇకముందు “నైలు” అనేది నైలు నదిని, దాని సాగునీటి కాలువల్ని సూచిస్తుంది.
అక్ష., “రెల్లు.”
అంటే, ఇశ్రాయేలు ప్రజలు.
అక్ష., “అతను.”
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “నెబుకద్రెజరుకు.”
అక్ష., “దాన్ని.”
లేదా “ఇశ్రాయేలు ఇంటివాళ్లకు బలాన్ని చేకూరుస్తాను.”
బహుశా, ఐగుప్తుతో పొత్తు పెట్టుకున్న ఇశ్రాయేలీయుల్ని సూచిస్తుండవచ్చు.
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “అమ్మేస్తాను.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “మెంఫిస్‌లో.”
లేదా “ప్రధానుడు.”
అంటే, థీబ్స్.
లేదా “మెంఫిస్.”
అంటే, హీలియోపొలిస్.
అంటే, బబులోను రాజు ముందు.
అక్ష., “నువ్వు.”
లేదా “సమాధిలోకి.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “సమాధిలోకి.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
అంటే, లెబాలోనులోని దేవదారు చెట్టు.
అక్ష., “బాహువుతో.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
అక్ష., “వాళ్ల నదుల్ని.”
లేదా “సమాధిలోకి.”
లేదా “షియోల్,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “సమాధి.”
లేదా “సమాధిలోకి.”
లేదా “సమాధిలోకి.”
అక్ష., “దాని.”
అక్ష., “దాని.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
బహుశా తమ కత్తితోపాటు సైనిక లాంఛనాలతో సమాధి చేయబడిన యోధుల్ని సూచిస్తుండవచ్చు.
లేదా “సమాధిలోకి.”
లేదా “నాయకులందరూ.”
లేదా “సమాధిలోకి.”
అక్ష., “కొమ్ము.”
అక్ష., “రక్తానికి.”
అక్ష., “రక్తానికి.”
లేదా “లెక్క అడుగుతాను.”
లేదా “అన్యాయం.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అంటే, దేవుని నిర్దేశానికి స్పందించే హృదయం.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
లేదా “దానిలో బలి ఇచ్చే గొర్రెల మందల్లా” అయ్యుంటుంది.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
లేదా “ఊపిరీ.” పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అక్ష., “కుమారులూ.”
లేదా “అధిపతిగా.”
లేదా “నివాస స్థలం; ఇల్లు.”
లేదా “వాళ్లమీద.”
లేదా “ప్రధాన అధిపతికి.”
లేదా “ప్రధాన అధిపతివైన.”
లేదా “కేడెములనూ.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
అక్ష., “కాపలావాడిగా.”
లేదా “నిన్ను రప్పిస్తాను.”
లేదా “కొదమ సింహాలన్నీ.”
లేదా “సరీసృపాలన్నీ.”
లేదా “ప్రధాన అధిపతివైన.”
లేదా “కేడెములతో.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
లేదా “దుడ్డుకర్రలతో” అయ్యుంటుంది. ఆయుధాలుగా ఉపయోగించే పదునైన మొన ఉన్న కర్రలు.
లేదా “గోగు సైన్యాల లోయ.”
“సైన్యాలు” అని అర్థం.
అనుబంధం B14 చూడండి.
అక్ష., “మందిరం.” 40-48 అధ్యాయాల్లో “మందిరం” అనే మాట ఆలయ భవన సముదాయాన్ని గానీ, అసలు ఆలయ భవనాన్ని గానీ సూచించినప్పుడు అలా చెప్పబడింది.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
కాపలాదారుల గది గోడ పైభాగాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “బయటివైపు ఇరుకుగా, లోపలివైపు వెడల్పుగా ఉండే కిటీకీలు.”
అక్ష., “వెడల్పు.”
లేదా “12” అయ్యుంటుంది.
అక్ష., “ఆలయం.” 41, 42 అధ్యాయాల్లో ఈ పదం పవిత్రమైన స్థలం బయటి గదిని (పవిత్ర స్థలాన్ని); లేదా పవిత్రమైన స్థలం మొత్తాన్ని (పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలంతో పాటు ఆలయాన్ని) సూచిస్తుంది.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
అంటే, పవిత్రమైన స్థలం లోపలి గదిలోకి, లేదా అతి పవిత్ర స్థలంలోకి.
ఆలయం చుట్టూ నడవడానికి సన్నని దారి అని తెలుస్తోంది.
అంటే, పవిత్రమైన స్థలానికి పడమటి వైపున్న భవనం.
లేదా “బయటివైపు ఇరుకుగా, లోపలివైపు వెడల్పుగా ఉండే కిటికీల్ని.”
అక్ష., “ద్వారబంధం.” ఇది పవిత్ర స్థలం గుమ్మాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
అతి పవిత్ర స్థలాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
అక్ష., “పొడవు.”
లేదా “బయటివైపు ఇరుకుగా, లోపలివైపు వెడల్పుగా ఉండే కిటికీలు.”
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
గ్రీకు సెప్టువజింటు ప్రకారం, “100 మూరల పొడవు.” హీబ్రూ మూలపాఠంలో, “ఒక మూర దారి” అని ఉంది. అనుబంధం B14 చూడండి.
అక్ష., “వెడల్పులో.”
అనుబంధం B14 చూడండి.
లేదా “ఆయన” అయ్యుంటుంది.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
అక్ష., “కొలవాలి.”
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
లేదా “పరిపూర్ణ.”
అంటే, ప్రజల.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
లేదా “దాని సరిహద్దుల లోపల ఉన్న.”
లేదా “పవిత్రమైన స్థలం.”
లేదా “పవిత్రమైన స్థలం.”
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
లేదా “మినా.” అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
లేదా “ఎడారి మైదానం.”
అంటే, మృత సముద్రం.
అంటే, మధ్యధరా సముద్రం.
లేదా “ప్రతీ వ్యక్తి తన సహోదరుడిలాగే స్వాస్థ్యం పొందుతాడు.”
అంటే, మృత సముద్రం.
అంటే, ఐగుప్తు వాగు.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
లేదా “ఆలయం.”
అంటే, ఐగుప్తు వాగు.
అంటే, మధ్యధరా సముద్రం.