కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt యెషయా 1:1-66:24
  • యెషయా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెషయా
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెషయా

యెషయా

1 ఉజ్జియా,+ యోతాము,+ ఆహాజు,+ హిజ్కియా+ రాజులు యూదాను పరిపాలించిన రోజుల్లో+ యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయా* చూసిన దర్శనం:+

 2 ఆకాశమా, విను! భూమీ, ఆలకించు!+

యెహోవా ఇలా అంటున్నాడు:

“నేను కుమారుల్ని పెంచి పెద్ద చేశాను,+

కానీ వాళ్లు నాకు ఎదురుతిరిగారు.+

 3 ఎద్దుకు తన యజమాని తెలుసు,

గాడిదకు తన యజమాని మేత పెట్టే చోటు తెలుసు;

కానీ ఇశ్రాయేలుకు నేను* తెలీదు,+

నా సొంత ప్రజలు అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు.”

 4 పాపిష్ఠి జనమా, మీకు శ్రమ,+

మీ దోషం చాలా బరువుగా ఉంది,

మీరు దుష్ట సంతానం, నాశనకరమైన పిల్లలు!

మీరు యెహోవాను విడిచిపెట్టేశారు;+

ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి అవమానించారు;

ఆయన్ని విడిచి వెళ్లిపోయారు.

 5 మీరు ఇంకా తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఈసారి మిమ్మల్ని ఎక్కడ కొట్టాలి?+

మీ తల అంతా రోగంతో నిండిపోయింది,

గుండె అంతటికీ వ్యాధి సోకింది.+

 6 అరికాలి నుండి నడినెత్తి వరకు ఏదీ ఆరోగ్యంగా లేదు.

ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లే.

ఎవరూ వాటికి చికిత్స చేయలేదు,* కట్టు కట్టలేదు, నూనె రాయలేదు.+

 7 మీ దేశం నిర్మానుష్యం అయింది.

మీ నగరాలు అగ్నితో కాల్చేయబడ్డాయి.

పరదేశులు మీ కళ్లముందే మీ దేశాన్ని మింగేస్తున్నారు.+

అది పరదేశులు నాశనం చేసిన పనికిరాని భూమిలా తయారైంది.+

 8 సీయోను కూతురు ద్రాక్షతోటలోని మంచెలా,*

దోసకాయ పొలంలోని గుడిసెలా,

ముట్టడి వేయబడిన నగరంలా వదిలేయబడింది.+

 9 సైన్యాలకు అధిపతైన యెహోవా మనలో కొంతమందిని మిగల్చకపోయి ఉంటే,

మనం అచ్చం సొదొమలా అవ్వాల్సిన వాళ్లం,

గొమొర్రాలా ఉండేవాళ్లం.+

10 సొదొమ+ నియంతలారా,* యెహోవా చెప్పే మాట వినండి,

గొమొర్రా ప్రజలారా,+ మన దేవుని ధర్మశాస్త్రాన్ని* ఆలకించండి.

11 “మీరు అర్పించే బలులన్నీ నాకెందుకు?”+ అని యెహోవా అంటున్నాడు.

“మీ దహనబలి పొట్టేళ్ల+ మీద, బాగా మేపిన జంతువుల కొవ్వు+ మీద నాకు విరక్తి కలిగింది;

కోడెదూడల+ రక్తం,+ గొర్రెపిల్లల రక్తం, మేకల+ రక్తం నన్ను సంతోషపెట్టవు.

12 నా సన్నిధిలో కనిపించడానికి+ రమ్మని,

ఇలా నా ఆలయ ప్రాంగణాల్ని తొక్కమని

మిమ్మల్ని ఎవరు అడిగారు?+

13 పనికిరాని ధాన్యార్పణల్ని తేవడం ఇక ఆపేయండి.

మీ ధూపం నాకు అసహ్యం.+

మీరు అమావాస్య రోజుల్ని,+ విశ్రాంతి రోజుల్ని*+ ఆచరిస్తారు; సమావేశాల కోసం చాటింపు+ వేస్తారు.

మీరు ఒకవైపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూనే మరోవైపు ఇంద్రజాల శక్తిని ఉపయోగించడం నేను సహించలేను.+

14 మీ అమావాస్య రోజులు, పండుగలు అంటే నాకు అసహ్యం.

అవి నాకు భారంగా తయారయ్యాయి;

వాటిని మోసీ మోసీ నేను అలసిపోయాను.

15 మీరు ప్రార్థించడానికి చేతులు చాపినప్పుడు,

నేను నా కళ్లను పక్కకు తిప్పుకుంటాను.+

మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నా,+

నేను వినట్లేదు;+

మీ చేతుల నిండా రక్తమే.+

16 మిమ్మల్ని మీరు కడుక్కొని శుభ్రం చేసుకోండి;

మీ దుష్ట పనుల్ని నా కళ్లముందు నుండి తీసేయండి;

చెడు చేయడం మానండి.+

17 మంచి చేయడం నేర్చుకోండి, న్యాయం జరిగించండి,+

అణచివేసే వాళ్లను సరిదిద్దండి,

తండ్రిలేని పిల్లల* హక్కుల్ని కాపాడండి,

విధవరాళ్ల పక్షాన వాదించండి.”+

18 “రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నాడు.+

“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,

మంచు అంత తెల్లగా అవుతాయి;+

అవి ముదురు ఎరుపు రంగులో ఉన్నా,

ఉన్ని అంత తెల్లగా అవుతాయి.

19 మీరు వినడానికి సిద్ధంగా ఉంటే,

దేశంలోని మంచివాటిని తింటారు.+

20 కానీ మీరు ఒప్పుకోకుండా తిరుగుబాటు చేస్తే,

ఖడ్గం మిమ్మల్ని హతం చేస్తుంది;+

ఎందుకంటే ఈ మాట యెహోవా నోటి నుండి వచ్చింది.”

21 నమ్మకమైన నగరం+ ఎలా వేశ్య అయిందో చూడండి!

ఒకప్పుడు ఆమె న్యాయంతో నిండి ఉండేది;+

నీతి ఆమెలో నివసించేది;+

కానీ ఇప్పుడు హంతకులు నివసిస్తున్నారు.+

22 నీ వెండి మష్టులా తయారైంది,+

నీ మద్యం* నీళ్లు కలిసి పలుచబడింది.

23 నీ అధిపతులు మొండివాళ్లు, దొంగలకు జతగాళ్లు.+

లంచం అంటే వాళ్లకు మహా ఇష్టం, వాళ్లు బహుమతుల వెనక పరుగులు తీస్తారు.+

తండ్రిలేని పిల్లలకు* వాళ్లు న్యాయం చేయరు,

విధవరాలి వ్యాజ్యం వాళ్లదాకా వెళ్లనే వెళ్లదు.+

24 కాబట్టి నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ

ఇశ్రాయేలు శక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“ఇదిగో! నేను నా విరోధుల అడ్డు తొలగించుకుంటాను,

నా శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాను.+

25 నా చేతిని నీకు వ్యతిరేకంగా తిప్పుతాను,

సబ్బుతో కడిగినట్టు నీ మష్టును కడిగేస్తాను,*

నీ మలినాలన్నీ తీసేస్తాను.+

26 మొదట్లోలాగే నీకు మళ్లీ న్యాయమూర్తుల్ని ఇస్తాను,

అప్పటిలాగే నీకు సలహాదారుల్ని ఇస్తాను.+

ఆ తర్వాత నువ్వు నీతిగల నగరం అని, నమ్మకమైన పట్టణం అని పిలవబడతావు.+

27 సీయోను న్యాయం వల్ల విడిపించబడుతుంది,+

తిరిగొచ్చే ఆమె ప్రజలు నీతి వల్ల విడిపించబడతారు.

28 తిరుగుబాటుదారులు, పాపులు కలిసి నాశనమౌతారు,+

యెహోవాను విడిచిపెట్టే వాళ్లు అంతమౌతారు.+

29 నువ్వు ఆశించిన మహావృక్షాల్ని+ బట్టి ప్రజలు సిగ్గుపడతారు,

నువ్వు ఎంచుకున్న తోటల్ని*+ బట్టి నువ్వు అవమానాలపాలు అవుతావు.

30 నువ్వు ఆకులు వాడిపోతున్న చెట్టులా,+

నీళ్లులేని తోటలా తయారౌతావు.

31 బలవంతుడు నారపీచు* అవుతాడు,

అతని పని నిప్పురవ్వ అవుతుంది.

అతనూ అతని పనీ మంటల్లో కాలిపోతాయి,

ఆ మంటల్ని ఆర్పేవాళ్లు ఎవరూ ఉండరు.”

2 ఆమోజు కుమారుడైన యెషయా యూదా గురించి, యెరూషలేము గురించి దర్శనంలో చూసిన విషయాలు:+

 2 ఆ రోజుల చివర్లో*

యెహోవా మందిర పర్వతం

పర్వత శిఖరాల పైన దృఢంగా స్థాపించబడుతుంది,+

కొండల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది,

అన్నిదేశాల వాళ్లు ప్రవాహంలా అక్కడికి వస్తారు.+

 3 దేశదేశాల ప్రజలు వచ్చి ఇలా చెప్పుకుంటారు:

“రండి, మనం యెహోవా పర్వతం మీదికి,

యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం,+

ఆయన తన మార్గాల గురించి మనకు నేర్పిస్తాడు,

మనం ఆయన త్రోవల్లో నడుద్దాం.”+

ఎందుకంటే, సీయోను నుండి ధర్మశాస్త్రం,*

యెరూషలేము నుండి యెహోవా వాక్యం బయల్దేరతాయి.+

 4 దేశాల మధ్య ఆయన న్యాయం తీరుస్తాడు,

దేశదేశాల ప్రజలకు సంబంధించిన విషయాల్ని చక్కదిద్దుతాడు.*

వాళ్లు తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా,

తమ ఈటెల్ని మచ్చుకత్తులుగా* సాగగొడతారు.+

దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు,

వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.+

 5 యాకోబు ఇంటివాళ్లారా, రండి,

మనం యెహోవా వెలుగులో నడుద్దాం.+

 6 దేవా, నీ ప్రజలైన యాకోబు ఇంటివాళ్లను నువ్వు వదిలేశావు,+

ఎందుకంటే వాళ్ల దేశం తూర్పుకు సంబంధించిన ఆచారాలతో నిండిపోయింది;

ఫిలిష్తీయుల్లా వాళ్లు ఇంద్రజాలాన్ని చేస్తున్నారు,+

వాళ్ల దేశం పరదేశుల పిల్లలతో నిండిపోయింది.

 7 వాళ్ల దేశం వెండిబంగారాలతో నిండిపోయింది,

వాళ్ల సంపదలకు అంతు లేదు.

వాళ్ల దేశం గుర్రాలతో నిండిపోయింది,

వాళ్ల రథాల సంఖ్యకు పరిమితి లేదు.+

 8 వాళ్ల దేశం వ్యర్థమైన దేవుళ్లతో నిండిపోయింది.+

వాళ్లు తమ సొంత చేతులతో చేసిన వాటికి,

తమ వేళ్లతో మలిచిన వాటికి వంగి నమస్కారం చేస్తారు.

 9 కాబట్టి మనిషి తగ్గించబడతాడు, అవమానాలపాలు అవుతాడు,

నువ్వు వాళ్లను మన్నించలేవు.

10 యెహోవా భీకర ప్రత్యక్షతను బట్టి,

ఆయన మహిమాన్విత వైభవాన్ని బట్టి

మీరంతా బండ సందుల్లోకి దూరండి, మట్టిలో దాక్కోండి.+

11 గర్విష్ఠుల తలలు వంచబడతాయి,

మనుషుల అహంకారం అణచివేయబడుతుంది.

ఆ రోజు యెహోవా మాత్రమే హెచ్చించబడతాడు.

12 ఎందుకంటే అది సైన్యాలకు అధిపతైన యెహోవాకు చెందిన రోజు.+

అది గర్విష్ఠులందరి మీదికి, అహంకారులందరి మీదికి,

గొప్పవాళ్లయినా సామాన్యులైనా ప్రతీ ఒక్కరి మీదికి వస్తుంది.+

13 లెబానోనులో ఉన్న ఎత్తైన, గొప్పగొప్ప దేవదారు చెట్లన్నిటి మీదికి,

బాషానులో ఉన్న సింధూర వృక్షాలన్నిటి మీదికి,

14 గొప్పగొప్ప పర్వతాలన్నిటి మీదికి,

ఎత్తైన కొండలన్నిటి మీదికి,

15 ఎత్తైన ప్రతీ బురుజు మీదికి, బలమైన ప్రతీ ప్రాకారం మీదికి,

16 తర్షీషు ఓడలన్నిటి+ మీదికి,

అందమైన పడవలన్నిటి మీదికి అది వస్తుంది.

17 మనిషి గర్వం అణచబడుతుంది,

మనుషుల అహంకారం తగ్గించబడుతుంది.

ఆ రోజు యెహోవా మాత్రమే హెచ్చించబడతాడు.

18 వ్యర్థమైన దేవుళ్లు ఇక ఎక్కడా కనిపించరు.+

19 భూమిని భయంతో వణికిపోయేలా చేయడానికి యెహోవా లేచినప్పుడు,

ఆయన భీకర ప్రత్యక్షతను బట్టి,

ఆయన మహిమాన్విత వైభవాన్ని బట్టి+

ప్రజలు బండ గుహల్లోకి,

నేల బొరియల్లోకి దూరతారు.+

20 ఆ రోజు మనుషులు వెండిబంగారాలతో చేసిన తమ వ్యర్థమైన దేవుళ్లను,

తాము వంగి నమస్కరించడానికి చేసుకున్న దేవుళ్లను తీసుకొని,

చుంచెలుకల* ముందు, గబ్బిలాల ముందు పారేస్తారు.+

21 భూమిని భయంతో వణికిపోయేలా చేయడానికి యెహోవా లేచినప్పుడు,

ఆయన భీకర ప్రత్యక్షతను బట్టి,

ఆయన మహిమాన్విత వైభవాన్ని బట్టి

బండ సందుల్లోకి, కొండ గుహల్లోకి దూరడం కోసం

వాళ్లు అలా పారేస్తారు.

22 మీ మంచి కోసం చెప్తున్నాను, మనిషి మీద నమ్మకం పెట్టుకోవడం మానేయండి,

అతను కేవలం తన ముక్కురంధ్రాల్లో ఉన్న ఊపిరితో సమానం.*

అతన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవాలి?

3 ఇదిగో! నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా

యెరూషలేము నుండి, యూదా నుండి ప్రతీ విధమైన ఆధారాన్ని, సరఫరాను తీసేస్తున్నాడు;

అంటే ఆహారాన్ని, నీళ్లను,+

 2 బలవంతుణ్ణి, యోధుణ్ణి,

న్యాయమూర్తిని, ప్రవక్తను;+ సోదె చెప్పేవాణ్ణి, పెద్దను,

 3 50 మంది మీద ఉన్న ప్రధానుణ్ణి,+ ఉన్నతాధికారిని, సలహాదారుణ్ణి,

ఇంద్రజాలంలో ఆరితేరినవాణ్ణి, నైపుణ్యంగల మాంత్రికుణ్ణి*+ తీసేస్తున్నాడు.

 4 నేను బాలల్ని వాళ్లకు అధికారులుగా చేస్తాను,

నిలకడలేనివాడు వాళ్లను పరిపాలిస్తాడు.

 5 ప్రజలు ఒకరినొకరు అణచివేసుకుంటారు,

ప్రతీ వ్యక్తి తన తోటివాణ్ణి అణచివేస్తాడు.+

బాలుడు వృద్ధుడి మీదికి లేస్తాడు,

నీచుడు గౌరవనీయుణ్ణి తిరస్కరిస్తాడు.+

 6 ప్రతీ వ్యక్తి తన తండ్రి ఇంట్లో తన సహోదరుణ్ణి పట్టుకొని,

“నీ దగ్గర అంగీ ఉంది కాబట్టి నువ్వు మాకు అధిపతిగా ఉండు.

ఈ శిథిలాల కుప్ప మీద అధికారం చెలాయించు” అంటాడు.

 7 కానీ ఆ రోజున అతను ఒప్పుకోకుండా,

“నేను మీ గాయాలకు కట్టుకట్టేవాడిగా* ఉండను;

నా ఇంట్లో ఆహారం గానీ, బట్టలు గానీ లేవు.

నన్ను ప్రజలకు అధిపతిగా చేయొద్దు” అంటాడు.

 8 ఎందుకంటే యెరూషలేము తడబడింది,

యూదా పడిపోయింది,

వాళ్ల మాటలు, పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల అలా జరిగింది;

ఆయన మహిమాన్విత సన్నిధి* ముందు వాళ్లు తిరుగుబాటు చేస్తున్నారు.+

 9 వాళ్ల ముఖకవళికలు వాళ్లమీద సాక్ష్యం చెప్తున్నాయి,

వాళ్లు సొదొమలా తమ పాపాన్ని చాటుకుంటున్నారు;+

దాన్ని దాచడానికి ప్రయత్నించడం లేదు.

వాళ్లకు శ్రమ! ఎందుకంటే వాళ్లు తమ మీదికి తామే విపత్తును తెచ్చుకుంటున్నారు.

10 నీతిమంతులకు మంచి జరుగుతుందని చెప్పండి;

వాళ్లు తమ పనులకు ప్రతిఫలం పొందుతారు.+

11 దుష్టుడికి శ్రమ!

అతని మీదికి విపత్తు వస్తుంది,

అతను ఇతరులకు చేసినట్టే వాళ్లు అతనికి చేస్తారు!

12 నా ప్రజల విషయానికొస్తే,

వాళ్లతో పనులు చేయించేవాళ్లు కఠినులు,

స్త్రీలు వాళ్లను పరిపాలిస్తున్నారు.

నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని దారితప్పి తిరిగేలా చేస్తున్నారు,

వాళ్లు మీ త్రోవల్ని తారుమారు చేస్తున్నారు.+

13 తన వ్యాజ్యాన్ని వినిపించడానికి యెహోవా నిలబడ్డాడు;

జనాల మీద తీర్పు ప్రకటించడానికి ఆయన లేచి నిలబడుతున్నాడు.

14 తన ప్రజల పెద్దలకు, అధికారులకు యెహోవా తీర్పు ప్రకటించబోతున్నాడు.

“మీరు ద్రాక్షతోటను కాల్చేశారు,

పేదవాళ్ల దగ్గర మీరు దొంగిలించింది మీ ఇళ్లలోనే ఉంది.+

15 నా ప్రజల్ని నలగ్గొట్టడానికి,

పేదవాళ్ల ముఖాల్ని నేలకేసి రుద్దడానికి మీకెంత ధైర్యం?”+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.

16 యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోను కూతుళ్లు గర్విష్ఠులు,

వాళ్లు తమ తలలు పైకెత్తి,*

ఓర చూపులు చూస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తూ

వయ్యారంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి

17 యెహోవా సీయోను కూతుళ్ల తలల్ని పక్కులతో మొత్తుతాడు,

యెహోవా వాళ్ల నుదుటిని బోడి చేస్తాడు.+

18 ఆ రోజు యెహోవా వాళ్ల అలంకారాన్ని తీసేస్తాడు;

వాళ్ల కడియాల్ని, బాసికాల్ని, చంద్రవంకల్ని,+

19 చెవిపోగుల్ని,* గాజుల్ని, మేలిముసుగుల్ని,

20 అలంకార కిరీటాల్ని, పట్టీల్ని, ఒడ్డాణాల్ని,*

అత్తరు బుడ్డీల్ని, తాయెత్తుల్ని,

21 ఉంగరాల్ని, ముక్కుపోగుల్ని,

22 ఉత్సవ వస్త్రాల్ని, ఉత్తరీయాల్ని,* శాలువల్ని, డబ్బు సంచుల్ని,

23 చేతి అద్దాల్ని,+ నారవస్త్రాల్ని,*

తలపాగాల్ని, మేలిముసుగుల్ని తీసేస్తాడు.

24 వాళ్ల ఒంటి నుండి సాంబ్రాణి తైలం+ సువాసనకు బదులు దుర్వాసన వస్తుంది;

వాళ్లు దట్టీకి బదులు తాడు కట్టుకుంటారు;

అల్లిక జడలు పోయి బోడి తల వస్తుంది;+

ఖరీదైన వస్త్రానికి బదులు గోనెపట్ట వేసుకుంటారు;+

అందానికి బదులు వాత ఉంటుంది.

25 నీ పురుషులు ఖడ్గానికి బలౌతారు,

నీ యోధులు యుద్ధంలో చనిపోతారు.+

26 సీయోను ప్రవేశ ద్వారాలు దుఃఖిస్తాయి, విలపిస్తాయి;+

ఆమె అన్నీ పోగొట్టుకొని నేలమీద కూర్చుంటుంది.”+

4 ఆ రోజు ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని,+

“మేము మా ఆహారమే తింటాం,

మా సొంత బట్టలే వేసుకుంటాం;

మా అవమానాన్ని* తీసేసుకోవడానికి+

మమ్మల్ని నీ పేరుతో పిలవబడనివ్వు చాలు” అని అంటారు.

2 ఆ రోజు యెహోవా మొలిపించేవాటి వైభవం, మహిమ గొప్పగా ఉంటుంది; దేశంలోని పంట, ప్రాణాలతో తప్పించుకున్న ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా, అలంకారంగా ఉంటుంది.+ 3 సీయోనులో శేషించినవాళ్లు, యెరూషలేములో మిగిలినవాళ్లు, అంటే యెరూషలేములో జీవించేలా పేర్లు రాయబడిన వాళ్లందరు+ పవిత్రులని పిలవబడతారు.

4 యెహోవా యెరూషలేము మీద తన ఉగ్రతను చూపించి,+ ఆమెకు తీర్పు తీర్చి, సీయోను కూతుళ్ల మలినాన్ని* కడిగేసినప్పుడు,+ యెరూషలేములో నుండి రక్తపాతాన్ని తీసేసినప్పుడు, 5 యెహోవా సీయోను పర్వతమంతటి మీద, ఆమె సమావేశ ప్రాంతమంతటి మీద పగలు మేఘాన్ని, పొగను, రాత్రి తేజోవంతంగా మండే అగ్నిని కలగజేస్తాడు.+ మహిమగల దేశమంతటి మీద సంరక్షించే కప్పు ఉంటుంది. 6 పగలు ఎండకు నీడగా,+ గాలివానలు వచ్చినప్పుడు ఆశ్రయంగా+ ఒక పందిరి ఉంటుంది.

5 నా ప్రియుడి కోసం నేనొక పాట పాడతాను,

నా ప్రియుడి గురించి, అతని ద్రాక్షతోట+ గురించి ఒక పాట పాడతాను.

ఫలవంతమైన కొండ ప్రాంతంలో నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉండేది.

 2 అతను నేలను తవ్వి రాళ్లను తీసి పారేశాడు.

శ్రేష్ఠమైన ఎర్ర ద్రాక్షతీగల్ని అందులో నాటాడు,

దాని మధ్యలో ఒక బురుజు కట్టాడు,

ద్రాక్షతొట్టి తొలిచాడు.+

తర్వాత అతను ద్రాక్షకాయలు కాస్తాయని ఎదురుచూస్తూ ఉన్నాడు,

కానీ అది పనికిరాని ద్రాక్షల్ని మాత్రమే కాసింది.+

 3 “యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా,

దయచేసి ఇప్పుడు నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం తీర్చండి.+

 4 ఇప్పటివరకు నేను నా ద్రాక్షతోటకు చేయనిది,

ఇంకా చేయాల్సింది ఏదైనా ఉందా?+

మరైతే, నేను ద్రాక్షల కోసం ఎదురుచూసినప్పుడు

అది అడవి ద్రాక్షల్ని మాత్రమే ఎందుకు కాసింది?

 5 ఇప్పుడు నేను నా ద్రాక్షతోటకు ఏం చేస్తానో

దయచేసి మీకు చెప్పనివ్వండి:

నేను దాని కంచెను తీసేస్తాను,

అది కాల్చేయబడుతుంది.+

నేను దాని రాతిగోడను కూలగొడతాను,

అది తొక్కబడుతుంది.

 6 నేను దాన్ని పాడుబడ్డ భూమిగా చేస్తాను;+

దాని కొమ్మల్ని ఎవరూ కత్తిరించరు, పారతో దాన్ని తవ్వరు.

ముళ్లపొదలు, కలుపు మొక్కలు అందులో ఏపుగా  పెరుగుతాయి.+

దానిమీద వర్షం కురిపించొద్దని నేను మేఘాలకు ఆజ్ఞాపిస్తాను.+

 7 ఇశ్రాయేలు ఇంటివాళ్లే సైన్యాలకు అధిపతైన యెహోవా ద్రాక్షతోట;+

యూదా ప్రజలు ఆయనకు బాగా నచ్చిన మొక్కలు.

ఆయన న్యాయం కోసం చూస్తూ వచ్చాడు,+

కానీ అన్యాయమే కనిపించింది!

నీతి కోసం చూస్తూ వచ్చాడు,

కానీ రోదనే వినిపించింది!”+

 8 దేశంలో మీరు మాత్రమే నివసించేలా,

స్థలం అనేదే మిగలకుండా పోయేవరకు

ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటిని ఆక్రమిస్తూ

ఒక పొలానికి ఇంకో పొలాన్ని కలుపుకుంటూ+ పోతున్న మీకు శ్రమ!+

 9 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రమాణం చేయడం నేను విన్నాను:

గొప్పగా, అందంగా ఉన్న చాలా ఇళ్లు పాడైపోతాయి;

వాటిని చూసి ప్రజలు జడుసుకుంటారు,

వాటిలో ఒక్కరు కూడా నివసించరు.+

10 పది ఎకరాల* ద్రాక్షతోట నుండి ఒక్క బాత్‌ కొలత* ద్రాక్షారసమే వస్తుంది;

ఒక హోమర్‌ కొలత* విత్తనాలు నాటితే, ఒక్క ఈఫా* ధాన్యమే పండుతుంది.+

11 మద్యం తాగాలని పొద్దున్నే లేచేవాళ్లకు శ్రమ!+

మత్తెక్కేలా చాలా రాత్రి వరకు మద్యం తాగుతూ ఉండేవాళ్లకు శ్రమ!

12 వాళ్ల విందుల్లో వీణ,* తంతివాద్యం,

కంజీర,* పిల్లనగ్రోవి,* ద్రాక్షారసం ఉంటాయి;

కానీ వాళ్లు యెహోవా కార్యాల గురించి ఆలోచించరు,

ఆయన చేతి పనుల్ని చూడరు.

13 కాబట్టి నా ప్రజలు చెరలోకి వెళ్తారు,

ఎందుకంటే వాళ్లకు జ్ఞానం లేదు;+

వాళ్ల ఘనులు ఆకలితో బాధపడతారు,+

వాళ్ల ప్రజలందరు దాహంతో ఎండిపోతారు.

14 కాబట్టి సమాధి* పెద్దదిగా తయారైంది

అది అపరిమితంగా నోరు తెరిచింది;+

దాని వైభవం,* దాని సమూహాలు, దాని అల్లరి, అలాగే ఉత్సాహధ్వని

అందులోకి దిగిపోతాయి.

15 మనిషి అణచివేయబడతాడు,

అతను తగ్గించబడతాడు,

గర్విష్ఠుల తలలు వంచబడతాయి.

16 సైన్యాలకు అధిపతైన యెహోవా తన తీర్పు* ద్వారా హెచ్చించబడతాడు;

సత్యదేవుడు, పవిత్రుడైన దేవుడు+ నీతి+ ద్వారా తనను తాను పవిత్రపర్చుకుంటాడు.

17 గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో మేసినట్టు అక్కడ మేస్తాయి;

బాగా మేపబడిన జంతువులు ఒకప్పుడు మేసిన నిర్జన ప్రదేశాల్లో పరదేశులు ఆహారం తింటారు.

18 మోసమనే తాళ్లతో తమ దోషాన్ని,

బండి తాళ్లతో తమ పాపాన్ని లాగేవాళ్లకు శ్రమ;

19 వాళ్లు ఇలా అంటారు: “ఆయన్ని తన పనిని వేగవంతం చేయనివ్వండి;

మనం చూడగలిగేలా అది త్వరగా జరగాలి.

ఇశ్రాయేలు పవిత్ర దేవుని సంకల్పం* నెరవేరాలి,

అప్పుడు మనం దాన్ని తెలుసుకోవచ్చు!”+

20 మంచిని చెడు అని, చెడును మంచి అని చెప్పేవాళ్లకు,+

వెలుగు స్థానంలో చీకటిని, చీకటి స్థానంలో వెలుగును ఉంచేవాళ్లకు,

తీపి స్థానంలో చేదును, చేదు స్థానంలో తీపిని పెట్టేవాళ్లకు శ్రమ!

21 తాము తెలివిగల వాళ్లమని,

బుద్ధిగల వాళ్లమని అనుకునేవాళ్లకు+ శ్రమ!

22 మద్యం తాగే విషయంలో వీరులుగా ఉన్నవాళ్లకు,

మద్యపానీయాలు కలపడంలో నిపుణులైన వాళ్లకు+ శ్రమ!

23 లంచం తీసుకొని దుష్టుణ్ణి విడిచిపెట్టే వాళ్లకు,+

నీతిమంతులకు న్యాయం చేయని వాళ్లకు శ్రమ!+

24 అగ్ని కొయ్యకాలును* కాల్చేసినట్టు,

ఎండుగడ్డి మంటల్లో కాలిపోయినట్టు,

వాళ్ల వేరు కుళ్లిపోతుంది,

వాళ్ల పూలు ధూళిలా చెదిరిపోతాయి;

ఎందుకంటే వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవా ధర్మశాస్త్రాన్ని* తిరస్కరించారు,

ఇశ్రాయేలు పవిత్ర దేవుని మాటను అగౌరవపర్చారు.+

25 అందుకే యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంటుంది,

ఆయన తన చేతిని వాళ్లకు వ్యతిరేకంగా చాపి వాళ్లను శిక్షిస్తాడు.+

పర్వతాలు కంపిస్తాయి,

వాళ్ల శవాలు వీధుల్లో పెంటలా పడివుంటాయి.+

ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,

వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.

26 దూర దేశాన్ని+ పిలవడానికి ఆయన ఒక ధ్వజాన్ని* నిలబెట్టాడు;

భూమి కొనల నుండి వాళ్లను రప్పించడానికి ఆయన ఈల వేశాడు;+

ఇదిగో! వాళ్లు శరవేగంతో దూసుకొస్తున్నారు.+

27 వాళ్లలో ఎవరూ అలసిపోలేదు, ఎవరూ తడబడడం లేదు.

ఎవరూ మగతగా లేరు, ఎవరూ నిద్రపోరు.

వాళ్ల నడుము చుట్టూ ఉన్న దట్టీ ఇంకా బిగించే ఉంది,

వాళ్ల చెప్పుల తాళ్లు తెగిపోలేదు.

28 వాళ్ల బాణాలన్నీ వాడిగలవి,

వాళ్ల విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి.

వాళ్ల గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్లలా ఉన్నాయి,

వాళ్ల చక్రాలు సుడిగాలిలా ఉన్నాయి.+

29 వాళ్ల గర్జన సింహగర్జనలా ఉంది;

వాళ్లు కొదమ సింహాల్లా గర్జిస్తారు.+

వాళ్లు గుర్రుమంటూ తమ వేటను పట్టుకుంటారు,

దాన్ని లాక్కెళ్తున్నప్పుడు విడిపించేవాళ్లు ఎవరూ ఉండరు.

30 ఆ రోజున సముద్రం ఘోషించినట్టు+

వాళ్లు దాన్ని చూసి గర్జిస్తారు.

ఎవరైనా దేశాన్ని చూసినప్పుడు దుఃఖం, అంధకారం కనిపిస్తాయి;

మేఘాల వల్ల చివరికి వెలుగు కూడా చీకటైపోయింది.+

6 ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరంలో,+ యెహోవా ఒక ఉన్నతమైన గొప్ప సింహాసనం మీద కూర్చొని ఉండడం నేను చూశాను;+ ఆయన చొక్కా అంచులతో ఆలయం నిండిపోయింది. 2 ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు; వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాళ్లు రెండు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, రెండు రెక్కలతో తమ పాదాల్ని కప్పుకున్నారు, మిగతా రెండు రెక్కలతో ఎగురుతారు.

 3 వాళ్లు ఒకరితో ఒకరు, “సైన్యాలకు అధిపతైన యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.+

భూమంతా ఆయన మహిమతో నిండిపోయింది” అని బిగ్గరగా అంటూ ఉన్నారు.

4 ఆ ధ్వనికి* గడపల కమ్ములు కదిలాయి, మందిరం పొగతో నిండిపోయింది.+

 5 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, నాకు శ్రమ!

నేను చచ్చినవాడితో సమానం.

ఎందుకంటే, అపవిత్రమైన పెదాలుగల నేను,

అపవిత్రమైన పెదాలుగల ప్రజల+ మధ్య నివసిస్తున్న నేను

రాజూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాను కళ్లారా చూశాను!”

6 అప్పుడు ఒక సెరాపు నా దగ్గరికి ఎగురుకుంటూ వచ్చాడు, బలిపీఠం నుండి పట్టుకారుతో తీసిన ఒక నిప్పుకణిక+ అతని చేతిలో ఉంది.+ 7 అతను దానితో నా నోటిని ముట్టి ఇలా అన్నాడు:

“ఇదిగో! ఇది నీ పెదాల్ని తాకింది.

కాబట్టి నీ దోషం పోయింది,

నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది.”

8 అప్పుడు యెహోవా స్వరం, “నేను ఎవర్ని పంపాలి? మా కోసం+ ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను. దానికి నేను, “నేనున్నాను! నన్ను పంపు!”+ అన్నాను.

 9 అప్పుడాయన ఇలా అన్నాడు: “వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు:

‘మీరు మళ్లీమళ్లీ వింటారు,

కానీ మీకు అర్థంకాదు;

మీరు మళ్లీమళ్లీ చూస్తారు,

కానీ ఏమీ నేర్చుకోరు.’+

10 ఈ ప్రజలు తమ కళ్లతో చూసి,

చెవులతో విని,

హృదయంతో గ్రహించి,

మనసు మార్చుకొని స్వస్థత పొందకుండా ఉండేలా

వాళ్ల హృదయాల్ని మొద్దుబారేలా చేయి,+

వాళ్ల చెవుల్ని మందంగా చేయి,+

వాళ్ల కళ్లను మూసేయి.”*+

11 అందుకు నేను, “యెహోవా, ఎంతకాలం పాటు?” అని అడిగాను. దానికి ఆయన ఇలా అన్నాడు:

“నివాసులు లేక నగరాలు పాడైపోయే వరకు,

ఇళ్లలో ప్రజలు లేకుండాపోయే వరకు,

దేశం పాడై నిర్మానుష్యంగా తయారయ్యే వరకు;+

12 యెహోవా మనుషుల్ని దూరంగా తరిమేసే వరకు,+

దేశంలో చాలా ప్రాంతాలు నిర్మానుష్యమయ్యే వరకు.

13 “అయితే దేశంలో పదోవంతు మంది మిగిలివుంటారు, అది మళ్లీ కాల్చేయబడుతుంది; వాళ్లు మహావృక్షంలా, సింధూర వృక్షంలా ఉంటారు; వాటిని నరికేసిన తర్వాత కూడా మొద్దు మిగిలివుంటుంది; ఆ మొద్దుకు ఒక పవిత్రమైన మొలక* వస్తుంది.”*

7 ఉజ్జియా మనవడూ యోతాము కుమారుడూ అయిన ఆహాజు+ యూదాను పరిపాలిస్తున్న రోజుల్లో, సిరియా రాజైన రెజీను, అలాగే ఇశ్రాయేలు రాజూ రెమల్యా కుమారుడూ అయిన పెకహు+ యెరూషలేము మీద యుద్ధానికి వచ్చారు. కానీ అతను* దాన్ని జయించలేకపోయాడు.+ 2 “సిరియా ఎఫ్రాయిముతో* చేతులు కలిపింది” అని దావీదు ఇంటివాళ్లకు కబురు అందింది.

దాంతో ఆహాజు, అతని ప్రజలు భయపడిపోయారు. అడవిలోని చెట్లు గాలికి ఊగినట్టు వాళ్ల గుండెలు వణికిపోయాయి.

3 అప్పుడు యెహోవా యెషయాకు ఇలా చెప్పాడు: “దయచేసి నువ్వూ, నీ కుమారుడు షెయార్యాషూబు*+ వెళ్లి, చాకలివాడి పొలానికి వెళ్లే రహదారి పక్కనున్న పైకొలను కాలువ+ కొన దగ్గర ఆహాజును కలుసుకోండి. 4 నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘నువ్వు ప్రశాంతంగా ఉండు. సిరియా రాజు రెజీను, రెమల్యా కుమారుడు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న రెండు మండుతున్న మొద్దులు మాత్రమే. వాళ్ల మండే కోపాన్ని చూసి భయపడకు, నీ గుండె జారిపోనివ్వకు.+ 5 సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కుమారుడు కలిసి నీకు హాని చేయడానికి కుట్రపన్నారు. వాళ్లు ఇలా అనుకున్నారు: 6 “మనం యూదా మీదికి వెళ్లి దాన్ని చీల్చేసి,* దాన్ని స్వాధీనం చేసుకొని,* టాబెయేలు కుమారుణ్ణి దానిమీద రాజుగా నియమిద్దాం.”+

7 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“వాళ్ల ఆలోచన సఫలం కాదు,

అలా జరగనే జరగదు.

 8 సిరియా రాజధాని దమస్కు,

దమస్కు రాజు రెజీను.

కేవలం 65 ఏళ్లలో

ఎఫ్రాయిము పూర్తిగా పగలగొట్టబడుతుంది, అది ఇక జనంగా ఉండదు.+

 9 ఎఫ్రాయిము రాజధాని సమరయ,+

సమరయ రాజు రెమల్యా కుమారుడు.+

నీకు బలమైన విశ్వాసం లేకపోతే,

నువ్వు దృఢంగా స్థాపించబడవు.” ’ ”

10 యెహోవా ఆహాజుతో ఇంకా ఇలా అన్నాడు: 11 “నీ దేవుడైన యెహోవా నుండి ఒక సూచన అడుగు;+ అది సమాధి* అంత లోతైనదైనా సరే, ఆకాశం అంత ఎత్తైనదైనా సరే.” 12 కానీ ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.

13 అప్పుడు యెషయా ఇలా అన్నాడు: “దావీదు ఇంటివాళ్లారా, దయచేసి వినండి. మీరు మనుషుల ఓపికను పరీక్షిస్తున్నారు, అది చాలదా? దేవుని ఓపికను కూడా పరీక్షించాలా?+ 14 కాబట్టి యెహోవాయే మీకొక సూచన ఇస్తాడు: ఇదిగో! యువతి* గర్భవతి అయ్యి, కుమారుణ్ణి కని,+ ఆయనకు ఇమ్మానుయేలు* అని పేరు పెడుతుంది.+ 15 చెడును తిరస్కరించి మంచిని ఎంచుకోవడం ఎలాగో ఆయనకు తెలిసే సమయంకల్లా ఆయన వెన్నను, తేనెను తినడం మొదలుపెడతాడు. 16 చెడును తిరస్కరించి మంచిని ఎంచుకోవడం ఎలాగో ఆ పిల్లవాడికి తెలిసేలోపే, నువ్వు భయపడుతున్న ఆ ఇద్దరు రాజుల దేశం పూర్తిగా విడిచిపెట్టబడుతుంది.+ 17 యెహోవా నీ మీదికి, నీ ప్రజల మీదికి, నీ తండ్రి ఇంటివాళ్ల మీదికి ఒక కష్టకాలాన్ని తీసుకొస్తాడు; అది ఎలాంటి కష్టకాలం అంటే, ఎఫ్రాయిము యూదా నుండి విడిపోయిన రోజు+ నుండి ఇప్పటివరకు అలాంటిది రాలేదు. ఎందుకంటే ఆయన అష్షూరు రాజును రప్పిస్తాడు.+

18 “ఆ రోజు యెహోవా సుదూరాన ఉన్న ఐగుప్తు* నైలు కాలువల నుండి ఈగల్ని, అష్షూరు దేశంలోని కందిరీగల్ని ఈల వేసి పిలుస్తాడు. 19 అవన్నీ వచ్చి లోతైన లోయల్లో,* బండల సందుల్లో, ముళ్లపొదలన్నిటి మీద, నీటి మడుగులన్నిటి మీద వాలతాయి.

20 “యెహోవా ఆ రోజు నదీ* ప్రాంతం నుండి కిరాయికి తెచ్చిన మంగలికత్తితో, అంటే అష్షూరు రాజు+ ద్వారా తలవెంట్రుకల్ని, కాళ్ల మీది వెంట్రుకల్ని గొరిగేస్తాడు. అది గడ్డాన్ని కూడా గీసేస్తుంది.

21 “ఆ రోజు ఒక వ్యక్తి తన పశువుల్లో నుండి చిన్న ఆవును,* రెండు గొర్రెల్ని సజీవంగా ఉంచుతాడు. 22 పాలు సమృద్ధిగా ఉండడం వల్ల అతను వెన్న తింటాడు; దేశంలో మిగిలివున్న ప్రతీ ఒక్కరు వెన్నను, తేనెను తింటారు.

23 “ఒకప్పుడు 1,000 వెండి రూకల విలువచేసే 1,000 ద్రాక్షతీగలు ఉన్న ప్రతీచోట ఆ రోజు ముళ్లపొదలు, కలుపు మొక్కలు మాత్రమే ఉంటాయి. 24 దేశం ముళ్లపొదలతో, కలుపు మొక్కలతో నిండి ఉండడం వల్ల మనుషులు విల్లును, బాణాల్ని తీసుకొని అక్కడికి వెళ్తారు. 25 ఒకప్పుడు పారతో కలుపు మొక్కలు తీసేసిన పర్వతాల దగ్గర ముళ్లపొదలు, కలుపు మొక్కలు పెరుగుతాయి; వాటికి భయపడి మీరు వాటి దగ్గరికి కూడా వెళ్లరు; అవి ఎద్దులకు, గొర్రెలకు మేత స్థలంగా తయారౌతాయి.”

8 యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఒక పెద్ద పలక+ తీసుకొని దానిమీద మామూలు కలంతో ‘మహేరు-షాలాల్‌-హాష్‌-బజ్‌’* అని రాయి. 2 నమ్మకమైన సాక్షులతో, అంటే యాజకుడైన ఊరియాతో,+ యెబెరెక్యా కుమారుడైన జెకర్యాతో నా కోసం దాన్ని రాతపూర్వకంగా ఖరారు చేయించు.”*

3 నేను ప్రవక్త్రితో* కలిసినప్పుడు* ఆమె గర్భవతి అయ్యి కొంతకాలానికి ఒక కుమారుణ్ణి కన్నది.+ అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “అతనికి మహేరు-షాలాల్‌-హాష్‌-బజ్‌ అని పేరు పెట్టు; 4 ఎందుకంటే, ఆ అబ్బాయికి ‘నాన్నా!’ ‘అమ్మా!’ అని పిలవడం రాకముందే దమస్కు వనరులు, సమరయ దోపుడుసొమ్ము అష్షూరు రాజు ముందుకు తీసుకెళ్లబడతాయి.”+

5 యెహోవా మళ్లీ నాతో మాట్లాడి ఇలా అన్నాడు:

 6 “ఈ ప్రజలు ప్రశాంతంగా పారే షిలోయా* నీళ్లను తిరస్కరించి,+

రెజీను విషయంలో, రెమల్యా కుమారుడి+ విషయంలో సంతోషిస్తున్నారు కాబట్టి,

 7 ఇదిగో! యెహోవా వాళ్ల మీదికి

శక్తివంతమైన, విస్తారమైన నది* నీళ్లను,

అంటే అష్షూరు రాజును,+ అతని మహిమ అంతటినీ రప్పిస్తాడు.

అతను తన కాలువలన్నిటి మీదుగా వచ్చి,

తీరాలన్నిటి మీదుగా పొంగిపొర్లి

 8 యూదాను తుడిచిపెట్టేస్తాడు.

అతను ఉప్పొంగి, పీకల లోతు వరకు ప్రవహిస్తాడు;+

ఇమ్మానుయేలూ,*+

చాపబడిన అతని రెక్కలు నీ దేశమంతటినీ కప్పుతాయి!”

 9 జనాల్లారా, హాని చేయండి; కానీ మీరు ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతారు.

భూమి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మీరంతా వినండి!

యుద్ధానికి సిద్ధంకండి,* అయితే మీరు ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతారు!+

యుద్ధానికి సిద్ధంకండి, అయితే మీరు ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతారు!

10 పన్నాగం పన్నండి, కానీ అది భగ్నం చేయబడుతుంది!

ఏమంటారో అనండి, కానీ మీరన్నట్టు జరగదు,

ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు!*+

11 యెహోవా తన బలమైన చేతిని నా మీద ఉంచి, ఈ ప్రజల మార్గాన్ని అనుసరించొద్దని నన్ను హెచ్చరించడానికి ఇలా అన్నాడు:

12 “ఈ ప్రజలు కుట్ర అని పిలిచేదాన్ని నువ్వు కుట్ర అని పిలవొద్దు!

వాళ్లు భయపడేదానికి నువ్వు భయపడొద్దు;

దాన్ని చూసి నువ్వు వణికిపోవద్దు.

13 సైన్యాలకు అధిపతైన యెహోవానే నువ్వు పవిత్రుడిగా ఎంచాలి,+

ఆయనకే నువ్వు భయపడాలి,

ఆయన్ని చూసే నువ్వు వణకాలి.”+

14 ఆయన ఒక పవిత్రమైన స్థలం అవుతాడు,

కానీ ఇశ్రాయేలు రెండు ఇళ్ల వాళ్లకు

ఆయన ఒక తగిలే రాయిగా,

తడబడేలా చేసే బండరాయిగా ఉంటాడు;+

యెరూషలేము నివాసులకు

ఒక ఉరిగా, ఉచ్చుగా ఉంటాడు.

15 చాలామంది తడబడి పడిపోతారు, గాయాలపాలౌతారు;

ఉచ్చులో చిక్కుకొని పట్టబడతారు.

16 రాతపూర్వకంగా ఖరారు చేసినదాన్ని* చుట్టేయి;

నా శిష్యుల మధ్య ధర్మశాస్త్రానికి* ముద్ర వేయి!

17 యాకోబు ఇంటివాళ్ల నుండి తన ముఖాన్ని తిప్పుకున్న యెహోవా+ కోసం నేను ఎదురుచూస్తూ* ఉంటాను,+ ఆయన మీదే నేను ఆశపెట్టుకుంటాను.

18 ఇదిగో! నేనూ, యెహోవా నాకిచ్చిన పిల్లలూ+ సీయోను పర్వతం మీద నివసించే సైన్యాలకు అధిపతైన యెహోవా నుండి వచ్చిన సూచనలుగా,+ అద్భుతాలుగా ఇశ్రాయేలు మధ్య ఉన్నాం.

19 ఒకవేళ వాళ్లు నిన్ను, “చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్ల దగ్గర, కిచకిచలాడే-గొణిగే జ్యోతిష్యుల దగ్గర విచారణ చేయి” అని అడిగారనుకో. ఒక జనం విచారణ చేయాల్సింది తమ దేవుని దగ్గర కాదా? వాళ్లు బ్రతికున్నవాళ్ల గురించి చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేయడం సరైనదేనా?+ 20 బదులుగా వాళ్లు ధర్మశాస్త్రంలో, రాతపూర్వకంగా ఖరారు చేసినదానిలో* విచారణ చేయాలి!

వాళ్లు ఈ మాట ప్రకారం మాట్లాడనప్పుడు వాళ్లకు వెలుగు* ఉండదు.+ 21 ప్రతీ వ్యక్తి వేదనతో, ఆకలితో దేశం గుండా సంచరిస్తాడు;+ అతను ఆకలిగా, కోపంగా ఉన్నందువల్ల తన రాజును, పైకి చూసినప్పుడు తన దేవుణ్ణి శపిస్తాడు. 22 తర్వాత అతను భూమి వైపు చూసినప్పుడు విపత్తు, చీకటి, అంధకారం, కష్టకాలాలు, గాఢాంధకారం కనిపిస్తాయి, వెలుగు ఉండదు.

9 కానీ ఆ అంధకారం, దేశం మీదికి కష్టం వచ్చినప్పటి అంధకారంలా ఉండదు; అంటే జెబూలూను దేశం, నఫ్తాలి దేశం నీచంగా చూడబడినప్పటి+ అంధకారంలా ఉండదు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన దానికి, అంటే సముద్రం వైపున్న మార్గాన యొర్దాను ప్రాంతంలో ఉన్న అన్యజనుల గలిలయకు ఘనతను కలగజేస్తాడు.

 2 చీకట్లో నడుస్తున్న ప్రజలు

గొప్ప వెలుగును చూశారు.

గాఢాంధకారంలో నివసించే ప్రజల మీద

వెలుగు ప్రకాశించింది.+

 3 నువ్వు ఆ దేశ జనాభాను ఎక్కువ చేశావు,

దాని సంతోషాన్ని అధికం చేశావు.

ప్రజలు కోతకాలంలో సంతోషించినట్టు,

దోపుడుసొమ్మును పంచుకునేవాళ్లు సంతోషించినట్టు

వాళ్లు నీ ముందు సంతోషిస్తారు.

 4 మిద్యాను ఓడిపోయిన రోజున+ చేసినట్టే,

వాళ్ల బరువైన కాడిని నువ్వు విరగ్గొట్టావు,

అంటే వాళ్ల భుజాల మీదున్న కర్రను, వాళ్ల యజమాని* దండాన్ని విరగ్గొట్టావు.

 5 కవాతు చేస్తూ భూమిని అదిరేలా చేసిన ప్రతీ కాలిజోడు,

రక్తంలో నానిన ప్రతీ వస్త్రం

అగ్నిచేత దహించబడుతుంది.

 6 ఎందుకంటే మనకు ఒక శిశువు పుట్టాడు,+

మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు;

ఆయన భుజం మీద రాజ్యాధికారం* ఉంటుంది.+

అద్భుతమైన సలహాదారుడు,+ బలవంతుడైన దేవుడు,+ నిత్యుడైన తండ్రి, శాంతికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది.

 7 ఆయన రాజ్యాధికారం* పెరుగుతూ పోతుంది,

అంతులేని శాంతి ఉంటుంది.+

ఇప్పటినుండి సదాకాలం వరకు

నీతిన్యాయాలతో+

దాన్ని సుస్థిరం చేయడానికి,+ బలపర్చడానికి

దావీదు సింహాసనం+ మీద, అతని రాజ్యం మీద ఆయన పరిపాలన చేస్తాడు.

సైన్యాలకు అధిపతైన యెహోవా ఆసక్తితో దీన్ని జరిగిస్తాడు.

 8 యెహోవా యాకోబుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశాడు,

అది ఇశ్రాయేలు మీదికి వచ్చింది.+

 9 దాని గురించి ప్రజలందరికీ,

అంటే ఎఫ్రాయిముకు, సమరయ నివాసులకు తెలుస్తుంది.

గర్వంతో, పొగరెక్కిన హృదయంతో వాళ్లు ఇలా అనుకుంటున్నారు:

10 “ఇటుకలు కూలిపోయాయి,

అయితే ఏంటి? చెక్కిన రాళ్లతో కడదాం.+

అత్తి చెట్లు నరికేయబడ్డాయి,

అయితే ఏంటి? వాటి స్థానంలో దేవదారు చెట్లు నాటుదాం.”

11 యెహోవా రెజీను విరోధుల్ని అతనికి వ్యతిరేకంగా నిలబెడతాడు,

అతని శత్రువుల్ని ఆయన రేపుతాడు.

12 తూర్పు నుండి సిరియా, పడమటి నుండి* ఫిలిష్తీయులు+

నోరు తెరిచి ఇశ్రాయేలును మింగేస్తారు.+

ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,

వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+

13 ఎందుకంటే, ప్రజలు తమను శిక్షిస్తున్న దేవుని దగ్గరికి తిరిగిరాలేదు,

వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవాను వెదకలేదు.+

14 యెహోవా ఇశ్రాయేలు నుండి ఒకేరోజున

తలను, తోకను; రెమ్మను, రెల్లును* నరికేస్తాడు.+

15 బాగా గౌరవించబడే పెద్ద, తల లాంటివాడు,

తప్పుడు ఉపదేశమిచ్చే ప్రవక్త, తోక లాంటివాడు.+

16 ఈ ప్రజల్ని నడిపించేవాళ్లే వాళ్లను దారితప్పి తిరిగేలా చేస్తున్నారు,

అలా నడుస్తున్నవాళ్లు అయోమయంలో ఉన్నారు.

17 అందుకే వాళ్ల యువకుల్ని చూసి యెహోవా సంతోషించడు,

వాళ్లలోని తండ్రిలేని పిల్లల* మీద, విధవరాళ్ల మీద ఆయన కరుణ చూపించడు,

ఎందుకంటే వాళ్లంతా మతభ్రష్టులు, చెడు చేసే ప్రజలు;+

ప్రతీ నోరు అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతోంది.

ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,

వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+

18 ఎందుకంటే దుష్టత్వం అగ్నిలా మండుతుంది,

అది ముళ్లపొదల్ని, పిచ్చి చెట్లను కాల్చేస్తుంది.

అది అడవిలోని దట్టమైన పొదల్ని తగలబెడుతుంది,

వాటి పొగ మేఘాల్లా పైకి లేస్తుంది.

19 సైన్యాలకు అధిపతైన యెహోవా కోపాగ్నితో

దేశం మండిపోతూ ఉంది,

ప్రజలు ఆ అగ్నిలో దహించుకుపోతారు.

ఏ వ్యక్తీ కనీసం తన సహోదరుని మీద కూడా జాలి చూపించడు.

20 ఒక వ్యక్తి తన కుడిపక్కను నరికేసుకుంటాడు

కానీ అతని ఆకలి తీరదు;

అతను తన ఎడమపక్క మాంసాన్ని తింటాడు,

అప్పటికీ అతని కడుపు నిండదు.

ప్రతీ వ్యక్తి తన సొంత బాహువు మాంసాన్ని మింగుతాడు.

21 మనష్షే ఎఫ్రాయిమును మింగుతాడు,

ఎఫ్రాయిము మనష్షేను మింగుతాడు.

వాళ్లిద్దరూ కలిసి యూదాకు వ్యతిరేకంగా తిరుగుతారు.+

ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,

వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+

10 హానికరమైన నియమాల్ని రూపొందించే వాళ్లకు+ శ్రమ,

అదేపనిగా అణచివేసే చట్టాల్ని తయారుచేసే వాళ్లకు శ్రమ.

 2 అలా వాళ్లు పేదవాళ్ల వ్యాజ్యాన్ని తృణీకరిస్తారు,

నా ప్రజల్లో దీనులకు న్యాయం జరగకుండా చేస్తారు;+

వాళ్లు విధవరాళ్లను దోపుడుసొమ్ముగా,

తండ్రిలేని పిల్లల్ని* కొల్లసొమ్ముగా చేసుకుంటారు!+

 3 మరైతే లెక్క అప్పజెప్పాల్సిన* రోజున,+

దూరం నుండి నాశనం వచ్చినప్పుడు+ మీరు ఏంచేస్తారు?

సహాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు?+

మీ సంపదను* ఎక్కడ విడిచివెళ్తారు?

 4 ఖైదీల మధ్య దాక్కోవడం,

హతులైనవాళ్ల మధ్య పడిపోవడం తప్ప ఇంకేమీ చేయలేరు.

ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,

వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+

 5 “అష్షూరును+ చూడండి!

అది నా కోపాన్ని చూపించే కర్ర,+

వాళ్ల చేతిలో ఉన్న దండం నా ఉగ్రతను వెళ్లగక్కుతుంది!

 6 మతభ్రష్ట జనం మీదికి,

నాకు విపరీతమైన కోపం తెప్పించిన జనం మీదికి నేను అతన్ని పంపిస్తాను;+

విస్తారమైన కొల్లసొమ్మును, విస్తారమైన దోపుడుసొమ్మును తీసుకోమని,

వీధుల్లో మట్టిని తొక్కినట్టు వాళ్లను తొక్కమని నేను అతనికి ఆజ్ఞాపిస్తాను.+

 7 కానీ అతని ధ్యాస దీనిమీద ఉండదు,

అతని హృదయం ఈ విధంగా పన్నాగం పన్నదు;

కొన్ని జనాల్ని కాదు అనేక జనాల్ని సమూలంగా నాశనం చేయాలి,

వాటిని నిర్మూలించాలి అనే ఆలోచన అతని హృదయంలో ఉంది.

 8 అతను ఇలా అంటున్నాడు:

‘నా అధిపతులందరూ రాజులు కాదా?+

 9 కల్నో+ కర్కెమీషు+ లాంటిది కాదా?

హమాతు+ అర్పాదు+ లాంటిది కాదా?

సమరయ+ దమస్కు+ లాంటిది కాదా?

10 వ్యర్థమైన దేవుళ్లను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి;

యెరూషలేములో, సమరయలో కన్నా ఎక్కువ విగ్రహాలు* వాళ్ల దగ్గర ఉన్నాయి!+

11 నేను సమరయకు, దాని వ్యర్థమైన దేవుళ్లకు చేసినట్టే

యెరూషలేముకు, దాని విగ్రహాలకు చేయలేనా?’+

12 “సీయోను పర్వతం మీద, యెరూషలేములో యెహోవా తన పనంతటినీ పూర్తిచేసినప్పుడు, ఆయన* అష్షూరు రాజును శిక్షిస్తాడు; అతని హృదయ గర్వాన్ని బట్టి, అహంకారంతో నిండిన అతని పొగరుబోతు చూపును బట్టి+ అతన్ని శిక్షిస్తాడు. 13 ఎందుకంటే అతను ఇలా అంటున్నాడు,

‘నేను నా చేతి బలంతో దీన్ని చేస్తాను,

నేను తెలివిగలవాణ్ణి కాబట్టి నా తెలివితో దీన్ని చేస్తాను.

నేను జనాల సరిహద్దుల్ని చెరిపేస్తాను,+

వాళ్ల సంపదల్ని కొల్లగొడతాను,+

బలవంతుడిలా వాటి నివాసుల్ని లోబర్చుకుంటాను.+

14 ఒక వ్యక్తి పక్షి గూటిలో చెయ్యి పెట్టినట్టు

నేను నా చేతితో జనాల వనరుల్ని పట్టుకుంటాను;

వదిలేసిన గుడ్లను పోగుచేసినట్టు

భూమంతటినీ పోగుచేస్తాను!

ఎవరూ రెక్కలు ఆడించరు, నోరు తెరవరు, కిచకిచలాడరు.’ ”

15 గొడ్డలి, తనతో నరికేవాడి కన్నా తానే గొప్ప అనుకుంటుందా?

రంపం, తనతో కోసేవాడి కన్నా తానే గొప్ప అనుకుంటుందా?

దండం,+ తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలదా?

కర్ర, తనను ఉపయోగించేవాణ్ణి పైకి లేపగలదా?

16 కాబట్టి నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా

అతని ప్రజల్లో కొవ్వుపట్టినవాళ్లను కృశించిపోయేలా చేస్తాడు,+

అతని మహిమ కింద, మండుతూ ఉండే అగ్నిని రగిలిస్తాడు.+

17 ఇశ్రాయేలు వెలుగు+ అగ్ని అవుతుంది,+

పవిత్రుడైన అతని దేవుడు జ్వాల అవుతాడు;

అది రగులుకొని, ఒక్కరోజులో అతని పిచ్చిచెట్లను, ముళ్లపొదల్ని దహించేస్తుంది.

18 అతని అడవి శోభను, పండ్లతోట శోభను ఆయన పూర్తిగా తీసేస్తాడు;

రోగి క్షీణించిపోయినట్టు అది క్షీణించిపోతుంది.+

19 అతని అడవిలో మిగిలే చెట్లు ఎంత తక్కువగా ఉంటాయంటే,

ఒక పిల్లవాడు వాటి సంఖ్యను రాయగలుగుతాడు.

20 ఆ రోజు ఇశ్రాయేలులో మిగిలినవాళ్లు,

యాకోబు ఇంటివాళ్లలో తప్పించుకున్నవాళ్లు

ఇక తమమీద దాడి చేసినవాని మీద ఆధారపడరు;+

కానీ వాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన యెహోవా మీద

నిజాయితీగా ఆధారపడతారు.

21 శేషం మాత్రమే, అంటే యాకోబు వంశస్థుల్లో మిగిలినవాళ్లు మాత్రమే

శక్తిమంతుడైన దేవుని దగ్గరికి తిరిగొస్తారు.+

22 ఇశ్రాయేలూ, నీ ప్రజలు

సముద్రపు ఇసుక రేణువులంత మంది ఉన్నా,

వాళ్లలో కొంతమంది మాత్రమే తిరిగొస్తారు.+

సమూలనాశనం జరగాలని నిర్ణయించబడింది,+

న్యాయం* వాళ్లను చుట్టుముడుతుంది.+

23 అవును, సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నిర్ణయించిన సమూలనాశనం

దేశమంతటి మీదికి వస్తుంది.+

24 కాబట్టి సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, మిమ్మల్ని కర్రతో శిక్షించి ఐగుప్తులా+ మీ మీద తన దండం ఎత్తిన అష్షూరును+ చూసి భయపడకండి. 25 ఎందుకంటే అతిత్వరలోనే ఉగ్రత తీరిపోతుంది, వాళ్లను నాశనం చేయడానికి నా కోపం వాళ్లమీదికి మళ్లుతుంది.+ 26 సైన్యాలకు అధిపతైన యెహోవా ఓరేబు బండరాయి దగ్గర మిద్యానును ఓడించినప్పుడు+ చేసినట్టే అతని మీద కొరడా ఝళిపిస్తాడు.+ ఆయన దండం సముద్రం మీద ఉంటుంది, ఆయన ఐగుప్తు విషయంలో చేసినట్టు దాన్ని పైకెత్తుతాడు.+

27 ఆ రోజు, నీ భుజం మీది నుండి అతని బరువు,+

నీ మెడ మీది నుండి అతని కాడి దిగిపోతాయి;

తైలం వల్ల కాడి విరగ్గొట్టబడుతుంది.”+

28 అతను ఆయాతుకు+ వచ్చాడు;

మిగ్రోను గుండా వెళ్లాడు;

మిక్మషు+ దగ్గర తన సామాన్లు పెడతాడు.

29 వాళ్లు రేవును దాటారు;

గెబా+ దగ్గర రాత్రి గడుపుతారు;

రామా వణికిపోతుంది, సౌలు నగరమైన గిబియా+ పారిపోయింది.

30 గల్లీము కూతురా, అరువు, కేకలు వేయి!

లాయిషా, శ్రద్ధగా విను!

అయ్యో అనాతోతు!+

31 మద్మేనా పారిపోయింది.

గెబీము నివాసులు ఆశ్రయం కోసం వెతికారు.

32 ఈ రోజే అతను నోబులో+ ఆగుతాడు.

సీయోను కూతురి పర్వతం దగ్గర, యెరూషలేము కొండ దగ్గర

అతను తన పిడికిలి ఆడిస్తూ బెదిరిస్తాడు.

33 ఇదిగో! నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా

కొమ్మల్ని భయంకరమైన శబ్దంతో నరికేస్తున్నాడు;+

ఎత్తైన వృక్షాలు నరికేయబడుతున్నాయి,

గొప్పగొప్పవి నేలమట్టం చేయబడుతున్నాయి.

34 ఇనుప పనిముట్టుతో* ఆయన అడవిలోని దట్టమైన పొదల్ని నరికేస్తాడు,

లెబానోను శక్తిమంతుడి చేతిలో కూలుతుంది.

11 యెష్షయి+ మొద్దు నుండి చిగురు+ వస్తుంది,

అతని వేర్ల నుండి వచ్చిన ఒక మొలక+ ఫలిస్తుంది.

 2 యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది,+

అది ఆయనకు తెలివిని,+ అవగాహనను ఇస్తుంది,

ఆ పవిత్రశక్తి వల్ల ఆయన మంచి సలహా ఇస్తాడు, బలవంతుడిగా ఉంటాడు,+

ఆ పవిత్రశక్తి వల్ల ఆయనకు చాలా జ్ఞానం, యెహోవా పట్ల భయభక్తులు* ఉంటాయి.

 3 యెహోవా పట్ల భయభక్తులు* కలిగివుండడం అంటే ఆయనకు ఇష్టం.+

ఆయన కంటికి కనిపించేదాన్ని బట్టి తీర్పుతీర్చడు,

కేవలం చెవులతో విన్నదాన్ని బట్టి గద్దింపు ఇవ్వడు.+

 4 ఆయన పక్షపాతం లేకుండా* దీనులకు తీర్పుతీరుస్తాడు,

భూమ్మీదున్న సాత్వికుల తరఫున న్యాయంగా గద్దింపు ఇస్తాడు.

తన నోటి నుండి వచ్చే కర్రతో భూమిని కొడతాడు+

తన పెదాల ఊపిరితో* దుష్టుల్ని చంపేస్తాడు.+

 5 నీతి ఆయనకు నడికట్టులా ఉంటుంది,

నమ్మకత్వం ఆయన తుంట్ల మీద దట్టీలా ఉంటుంది.+

 6 తోడేలు గొర్రెపిల్లతో పాటు నివసిస్తుంది,*+

చిరుతపులి మేకపిల్లతో పాటు పడుకుంటుంది,

దూడ, సింహం, కొవ్విన జంతువు అన్నీ ఒకే చోట ఉంటాయి;*+

చిన్న పిల్లవాడు వాటిని తోలుతాడు.

 7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి,

వాటి పిల్లలు కలిసి పడుకుంటాయి.

ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.+

 8 పాలు తాగే పసిపిల్ల నాగుపాము పుట్టమీద ఆడుకుంటుంది,

పాలు విడిచిన పిల్లవాడు విషసర్పం పుట్టమీద చెయ్యి పెడతాడు.

 9 నా పవిత్ర పర్వతమంతటి మీద

అవి హాని గానీ నాశనం గానీ చేయవు,+

ఎందుకంటే సముద్రం నీళ్లతో నిండివున్నట్టు

భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.+

10 ఆ రోజు యెష్షయి వేరు+ జనాల కోసం ధ్వజంలా* నిలబడతాడు.+

దేశాలు నిర్దేశం కోసం ఆయన వైపు చూస్తాయి,*+

ఆయన విశ్రాంతి స్థలం మహిమతో నిండిపోతుంది.

11 ఆ రోజు యెహోవా తన ప్రజల్లో మిగిలినవాళ్లను అష్షూరు నుండి, ఐగుప్తు నుండి,+ పత్రోసు నుండి,+ కూషు నుండి,+ ఏలాము నుండి,+ షీనారు* నుండి, హమాతు నుండి, సముద్ర ద్వీపాల నుండి+ సమకూర్చడానికి రెండోసారి తన చెయ్యి అందిస్తాడు. 12 ఆయన దేశాల కోసం ఒక ధ్వజాన్ని* నిలబెట్టి చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని సమకూరుస్తాడు,+ అలాగే చెదిరిపోయిన యూదా ప్రజల్ని భూమి నలుమూలల నుండి సమకూరుస్తాడు.+

13 ఎఫ్రాయిము అసూయ మాయమైపోతుంది,+

యూదా పట్ల శత్రుభావం చూపించినవాళ్లు లేకుండా పోతారు.

ఎఫ్రాయిము యూదా మీద అసూయపడదు,

యూదాకు ఎఫ్రాయిము పట్ల శత్రుభావం ఉండదు.+

14 వాళ్లు పడమటి దిక్కున ఉన్న ఫిలిష్తీయుల ఏటవాలు ప్రాంతాల* మీదికి అకస్మాత్తుగా ఎగురుకుంటూ వెళ్తారు;

వాళ్లిద్దరూ కలిసి తూర్పున ఉన్న ప్రజల్ని కొల్లగొడతారు.

వాళ్లు ఎదోము+ మీద, మోయాబు+ మీద తమ చెయ్యి చాపుతారు,*

అమ్మోనీయులు వాళ్లకు లొంగిపోతారు.+

15 యెహోవా ఐగుప్తు సముద్ర సింధుశాఖను* విభజిస్తాడు*+

నది*+ మీద తన చేతిని ఆడిస్తాడు.

తన ఊపిరి* సెగతో దాని ఏడు కాలువల్ని కొడతాడు,*

ప్రజలు చెప్పులతోనే దాన్ని దాటేలా చేస్తాడు.

16 ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజున ఉన్నట్టే

ఆయన ప్రజల్లో మిగిలిన వాళ్లు అష్షూరు నుండి బయటికి రావడానికి+ ఒక రాజమార్గం ఉంటుంది.+

12 ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఇలా అంటావు:

“యెహోవా, నువ్వు నా మీద కోపగించుకున్నా,

నీ కోపం మెల్లమెల్లగా తగ్గిపోయింది, నువ్వు నన్ను ఓదార్చావు,+

నీకు కృతజ్ఞతలు.

 2 ఇదిగో! దేవుడే నా రక్షణ.+

నేను ఆయన మీద నమ్మకముంచి నిర్భయంగా జీవిస్తాను;+

ఎందుకంటే యెహోవా* యెహోవాయే నా శక్తి, నా బలం;

ఆయనే నా రక్షణ అయ్యాడు.”+

 3 రక్షణ ఊటల నుండి

నువ్వు సంతోషంగా నీళ్లు చేదుకుంటావు.+

 4 ఆ రోజు నువ్వు ఇలా అంటావు:

“యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన పేరున ప్రార్థించండి,

దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలు తెలియజేయండి!+

ఆయన పేరు ఎంత ఘనమైనదో ప్రకటించండి.+

 5 యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి,*+ ఆయన గొప్పగొప్ప పనులు చేశాడు.+

ఈ విషయాన్ని భూమంతటా చాటండి.

 6 సీయోను నివాసీ,* ఆనందంతో బిగ్గరగా కేకలు వేయి,

ఎందుకంటే నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు గొప్పవాడు.”

13 ఆమోజు కుమారుడైన యెషయాకు+ బబులోను గురించి దర్శనంలో వెల్లడైన ప్రకటన:+

 2 “చెట్లులేని పర్వతం మీద ధ్వజాన్ని* నిలబెట్టండి.+

ప్రముఖుల ప్రవేశ ద్వారాల్లోకి రమ్మని

వాళ్లను పిలవండి, చెయ్యి ఊపండి.

 3 నేను నియమించిన* వాళ్లకు ఆజ్ఞ జారీచేశాను.+

నా కోపాన్ని వ్యక్తం చేసే యోధుల్ని పిలిపించాను,

వాళ్లు గర్వంతో సంతోషిస్తున్నారు.

 4 వినండి! పర్వతాల్లో సమూహ ధ్వని వినిపిస్తోంది;

అది ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్న శబ్దం!

రాజ్యాల కోలాహలం వినండి!

అది సమకూడిన దేశాల+ శబ్దం!

సైన్యాలకు అధిపతైన యెహోవా యుద్ధం కోసం సైన్యాన్ని సమకూరుస్తున్నాడు.+

 5 భూమంతటినీ నాశనం చేయడానికి+

సుదూర దేశం నుండి, ఆకాశం అంచు నుండి

యెహోవా తన కోపాన్ని వ్యక్తం చేసే ఆయుధాలతో పాటు వస్తున్నాడు.+

 6 బిగ్గరగా ఏడ్వండి, ఎందుకంటే యెహోవా రోజు దగ్గరపడింది!

అది సర్వశక్తిమంతుడి దగ్గర నుండి నాశనంలా వస్తుంది.+

 7 అందుకే ప్రతీ చెయ్యి చచ్చుబడిపోతుంది,

ప్రతీ మనిషి హృదయం భయంతో నీరుగారిపోతుంది.+

 8 ప్రజలు భయాందోళనలకు గురౌతారు.+

పురిటినొప్పులు పడుతున్న స్త్రీలా

వాళ్లు నొప్పితో అల్లాడిపోతారు.

వాళ్లు భయంతో హడలిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు,

వేదనతో వాళ్ల ముఖాలు ఎర్రబడతాయి.

 9 ఇదిగో! యెహోవా రోజు వస్తోంది,

దేశాన్ని చూసి ప్రజలు హడలిపోయేలా చేయడానికి,+

దేశంలో ఉన్న పాపుల్ని సమూలంగా నాశనం చేయడానికి

అది క్రూరమైన ఆగ్రహంతో, మండే కోపంతో వస్తోంది.

10 ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాశులు*+

తమ వెలుగు ఇవ్వవు;

ఉదయించినప్పుడు సూర్యుణ్ణి చీకటి కమ్ముకుంటుంది,

చంద్రుడు కూడా తన వెలుగు ఇవ్వడు.

11 భూలోకంలో ఉన్న చెడును బట్టి నేను భూమిని లెక్క అడుగుతాను,+

తమ దోషాన్ని బట్టి దుష్టుల్ని లెక్క అడుగుతాను.

అహంకారుల పొగరును నేను అంతం చేస్తాను,

క్రూర పరిపాలకుల గర్వాన్ని అణచివేస్తాను.+

12 మేలిమి బంగారం కన్నా, ఓఫీరు బంగారం+ కన్నా

మనుషులు అరుదుగా కనిపించేలా చేస్తాను.+

13 అందుకే సైన్యాలకు అధిపతైన యెహోవా కోపాగ్ని మండే రోజున

ఆ ఆగ్రహానికి ఆకాశం వణికిపోయేలా,

భూమి కదిలి దాని స్థానం తప్పేలా చేస్తాను.+

14 వేటాడబడిన కొండజింకలా, కాపరిలేని మందలా

ప్రతీ వ్యక్తి తన సొంత ప్రజల దగ్గరికి తిరిగెళ్తాడు;

ప్రతీ వ్యక్తి తన స్వదేశానికి పారిపోతాడు.+

15 దొరికినవాళ్లు పొడవబడతారు,

పట్టుబడినవాళ్లు కత్తితో చంపబడతారు.+

16 వాళ్ల కళ్లముందే వాళ్ల పిల్లల్ని విసిరికొట్టి ముక్కలుముక్కలు చేస్తారు,+

వాళ్ల ఇళ్లను దోచుకుంటారు,

వాళ్ల భార్యల్ని చెరుపుతారు.

17 ఇదిగో, నేను వాళ్ల మీదికి మాదీయుల్ని రప్పిస్తున్నాను,+

వాళ్లు వెండిని అస్సలు లెక్కచేయరు,

బంగారాన్ని బట్టి సంతోషించరు.

18 వాళ్ల విల్లులు యువకుల్ని చెదరగొడతాయి;+

గర్భఫలం మీద వాళ్లు జాలి చూపించరు,

పిల్లల మీద కరుణ చూపించరు.

19 అత్యంత మహిమగల రాజ్యమైన* బబులోను,+

కల్దీయుల సొగసూ గర్వకారణమూ అయిన బబులోను+

దేవుడు నాశనం చేసిన సొదొమ, గొమొర్రాల్లా తయారౌతుంది.+

20 దానిలో ఎప్పటికీ ప్రజలు నివసించరు,

తరతరాలపాటు ఎప్పటికీ అది నివాస స్థలంగా ఉండదు.+

అరబీయుల్లో ఎవరూ అక్కడ తమ డేరా వేసుకోరు,

గొర్రెల కాపరులు ఎవరూ తమ మందల్ని అక్కడ పడుకోనివ్వరు.

21 ఎడారి ప్రాణులు అక్కడ పడుకుంటాయి;

వాళ్ల ఇళ్లు గుడ్లగూబలతో నిండిపోతాయి.

నిప్పుకోళ్లు అక్కడ నివసిస్తాయి,+

కొండమేకలు* అక్కడ గంతులు వేస్తాయి.

22 దాని బురుజుల్లో జంతువులు అరుస్తాయి,

దాని విలాసవంతమైన భవనాల్లో నక్కలు ఊలలు వేస్తాయి.

దాని సమయం దగ్గరపడింది, దాని రోజులు పొడిగించబడవు.”+

14 యెహోవా యాకోబు మీద కరుణ చూపిస్తాడు,+ ఆయన ఇశ్రాయేలును మళ్లీ ఎంచుకుంటాడు;+ వాళ్లు తమ దేశంలో స్థిరపడేలా చేస్తాడు,*+ పరదేశులు వాళ్లతో చేరుతారు, వాళ్లు యాకోబు ఇంటివాళ్లతో ఒక్కటౌతారు.+ 2 జనాలు వాళ్లను వాళ్ల సొంత దేశానికి తీసుకొస్తారు; యెహోవా దేశంలో ఇశ్రాయేలు ఇంటివాళ్లకు వాళ్లు దాసులు-దాసురాళ్లు అవుతారు;+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమను బందీలుగా చేసుకున్నవాళ్లను బందీలుగా చేసుకుంటారు, తమతో బలవంతంగా పని చేయించినవాళ్ల మీద అధికారం చెలాయిస్తారు.

3 నీ బాధ నుండి, కష్టం నుండి, కఠినమైన బానిసత్వం నుండి యెహోవా నీకు విశ్రాంతి కలగజేసిన రోజున,+ 4 నువ్వు బబులోను రాజు గురించి కావ్యరూపంలో ఇలా అంటావు:*

“ఇతరులతో బలవంతంగా పని చేయించిన వ్యక్తి ఎలా నాశనమయ్యాడో చూడండి!

అణచివేత ఎలా ముగిసిపోయిందో చూడండి!+

 5 యెహోవా దుష్టుల కర్రను విరగ్గొట్టాడు,

పరిపాలకుల దండాన్ని విరగ్గొట్టాడు.+

 6 వాళ్లు కోపంతో జనాల్ని కొడుతూ వచ్చారు,+

ఆగ్రహంతో, ఆగని హింసతో దేశాల్ని లోబర్చుకుంటూ వచ్చారు.+

 7 భూమంతా నెమ్మదితో విశ్రమిస్తోంది.

ప్రజలు సంతోషంతో కేకలు వేస్తున్నారు.+

 8 నీకు జరిగింది చూసి సరళవృక్షాలు* కూడా సంతోషిస్తున్నాయి,

లెబానోనులోని దేవదారు చెట్లతో పాటు అవి సంతోషిస్తున్నాయి.

అవి ఇలా అంటున్నాయి, ‘నువ్వు పడిపోయినప్పటి నుండి

కట్టెలు కొట్టేవాళ్లు ఎవ్వరూ మా మీదికి రాలేదు.’

 9 నువ్వు వచ్చినప్పుడు నిన్ను కలవాలని

కిందున్న సమాధిలో* కూడా కలకలం రేగింది.

అది నిన్ను చూసి, మరణనిద్రలో ఉన్నవాళ్లను,

అంటే ప్రజల్ని అణచివేసిన భూపాలకులందర్నీ* నిద్ర లేపుతుంది.

దేశాల రాజులందర్నీ తమ సింహాసనాల మీది నుండి లేపుతుంది.

10 వాళ్లంతా మాట్లాడడం మొదలుపెట్టి నీతో ఇలా అంటారు,

‘నువ్వు కూడా మాలాగే బలహీనుడివి అయ్యావా?

నువ్వూ మాలాగే తయారయ్యావా?

11 నీ గర్వం, నీ తంతివాద్యాల శబ్దం

సమాధిలోకి* తీసుకురాబడ్డాయి.+

పురుగులు నీ కింద పరుపులా పరుచుకున్నాయి,

కీటకాలు దుప్పటిలా నిన్ను కప్పేశాయి.’

12 మెరిసే నక్షత్రమా, వేకువ పుత్రుడా!

నువ్వు ఆకాశం నుండి ఎలా కిందపడ్డావు!

దేశాల్ని పడగొట్టిన నువ్వు

ఎలా నేలమట్టం చేయబడ్డావు!+

13 నీ హృదయంలో నువ్విలా అనుకున్నావు, ‘నేను ఆకాశానికి ఎక్కివెళ్తాను.+

దేవుని నక్షత్రాల కన్నా పైకి నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను,+

ఉత్తర దిక్కున ఉన్న మారుమూల ప్రాంతాల్లో

సమావేశ పర్వతం+ మీద నేను కూర్చుంటాను.

14 నేను మేఘాల కన్నా పైకి వెళ్తాను;

నన్ను నేను సర్వోన్నతుడైన దేవునిలా చేసుకుంటాను.’

15 కానీ నువ్వు సమాధిలోకి,*

గోతిలోని మూలల్లోకి తోసేయబడతావు.

16 నిన్ను చూసేవాళ్లు నిన్ను తేరి చూస్తారు.

వాళ్లు నిన్ను పరిశీలనగా చూసి ఇలా అంటారు:

‘భూమిని కుదిపేస్తూ వచ్చిందీ,

రాజ్యాల్ని వణికించిందీ ఇతనేనా?+

17 భూలోకాన్ని ఎడారిలా* మార్చేసి,

దాని నగరాల్ని పడగొట్టి,+

ఖైదీలను స్వదేశానికి తిరిగెళ్లనివ్వని వ్యక్తి ఇతనేనా?’+

18 దేశాల మిగతా రాజులందరూ

అవును, వాళ్లందరూ ఘనంగా పడుకున్నారు,

ప్రతీ రాజు తన సమాధిలో* పడుకున్నాడు.

19 కానీ నువ్వు మాత్రం సమాధి చేయబడలేదు,

తిరస్కరించబడిన మొలకలా* నువ్వు పారేయబడ్డావు;

ఖడ్గంతో చంపబడి,

గోతిలోని రాళ్ల దగ్గరికి దిగిపోయేవాళ్లతో నువ్వు కప్పబడ్డావు;

నువ్వు కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు.

20 నువ్వు సమాధిలో వాళ్లను కలుసుకోవు,

ఎందుకంటే నువ్వు నీ సొంత దేశాన్ని నాశనం చేశావు,

నీ సొంత ప్రజల్ని చంపావు.

దుష్టుల పిల్లల పేర్లను ప్రజలు ఇంకెప్పుడూ జ్ఞాపకం చేసుకోరు.

21 అతని కుమారుల కోసం వధశాలను సిద్ధం చేయండి

వాళ్ల పూర్వీకుల దోషాన్ని బట్టి అలా చేయండి;

అప్పుడు వాళ్లు లేచి భూమిని స్వాధీనం చేసుకోకుండా,

దేశాన్ని తమ నగరాలతో నింపకుండా ఉంటారు.”

22 “నేను వాళ్ల మీదికి లేస్తాను”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

“నేను బబులోను నుండి పేరును, శేషాన్ని; వంశస్థుల్ని, వంశాన్ని తుడిచిపెట్టేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.

23 “నేను దాన్ని ముళ్లపందుల నివాస స్థలంగా, చిత్తడినేలగా చేస్తాను; సమూలనాశనం అనే చీపురుతో దాన్ని ఊడ్చేస్తాను”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

24 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రమాణం చేశాడు:

“నేను అనుకున్నట్టు జరిగి తీరుతుంది,

నేను నిర్ణయించింది నిజమౌతుంది.

25 నేను అష్షూరును నా దేశంలో నలగ్గొడతాను,

నా పర్వతాల మీద అతన్ని తొక్కుతాను.+

అతని కాడి వాళ్ల మీద నుండి తీసేయబడుతుంది,

వాళ్ల భుజాల మీద నుండి అతని బరువు తొలగించబడుతుంది.”+

26 భూమంతటి గురించి తీసుకున్న నిర్ణయం ఇదే,

దేశాలన్నిటి మీద చాపబడిన* చెయ్యి ఇదే.

27 సైన్యాలకు అధిపతైన యెహోవా నిర్ణయించాడు,

దాన్ని ఎవరు అడ్డుకోగలరు?+

ఆయన చెయ్యి చాపబడి ఉంది,

దాన్ని ఎవరు వెనక్కి తిప్పగలరు?+

28 ఆహాజు చనిపోయిన సంవత్సరంలో+ ఈ సందేశం వచ్చింది:

29 “ఫిలిష్తియా, నిన్ను కొడుతున్నవాడి దండం విరగ్గొట్టబడిందని

ఏమాత్రం సంతోషించకు.

ఎందుకంటే, సర్పం వేరు+ నుండి విషసర్పం+ వస్తుంది,

దాని సంతానం, మంటపుట్టించే విషమున్న ఎగిరే సర్పం.*

30 దీనుల మొదటి సంతానం భోంచేస్తున్నప్పుడు,

పేదవాళ్లు సురక్షితంగా పడుకున్నప్పుడు,

నేను నీ వేరును కరువుతో నాశనం చేస్తాను,

నీలో మిగిలి ఉన్నది చంపబడుతుంది.+

31 నగర ద్వారమా, గగ్గోలు పెట్టు! నగరమా, కేకలు వేయి!

ఫిలిష్తియా, నీ ప్రజలందరి గుండెలు జారిపోతాయి!

ఎందుకంటే ఉత్తరం వైపు నుండి ఒక పొగ వస్తోంది,

అతని దండులో వెనకబడ్డవాళ్లు ఎవరూ లేరు.”

32 దేశాల సందేశకులకు వాళ్లు ఏమని జవాబు చెప్పాలి?

యెహోవా సీయోనుకు పునాది వేశాడని,+

ఆయన ప్రజల్లోని దీనులు దానిలో ఆశ్రయం పొందుతారని చెప్పాలి.

15 మోయాబు గురించిన సందేశం:+

మోయాబులోని ఆరు+ రాత్రికిరాత్రే నాశనం చేయబడింది,

అందుకే అది నిశ్శబ్దంగా ఉంది.

మోయాబులోని కీరు+ రాత్రికిరాత్రే నాశనం చేయబడింది,

అందుకే అది నిశ్శబ్దంగా ఉంది.

 2 అతను ఏడ్వడం కోసం గుడికి, దీబోనుకు,+

ఉన్నత స్థలాలకు ఎక్కివెళ్లాడు.

మోయాబు నెబో+ గురించి, మేదెబా+ గురించి బోరున ఏడుస్తోంది.

ప్రతీ తల బోడి చేయబడింది,+ ప్రతీ గడ్డం కత్తిరించబడింది.+

 3 దాని వీధుల్లో వాళ్లు గోనెపట్ట కట్టుకున్నారు.

తమ పైకప్పుల మీద, సంతవీధుల్లో దుఃఖిస్తున్నారు;

వాళ్లు ఏడుస్తూ కిందికి దిగుతున్నారు.+

 4 హెష్బోను, ఏలాలే+ కేకలు వేస్తున్నాయి;

వాటి స్వరం యాహజు+ వరకు వినిపిస్తోంది.

అందుకే ఆయుధాలు ధరించిన మోయాబు సైనికులు అరుస్తున్నారు.

అతను భయంతో వణికిపోతున్నాడు.

 5 మోయాబు గురించి నా హృదయం విలపిస్తోంది.

దాని శరణార్థులు సోయరు+ వరకు, ఎగ్లాత్‌-షలీషియా+ వరకు పారిపోయారు.

వాళ్లు లూహీతుకు ఎక్కివెళ్లే మార్గంలో ఏడుస్తూ నడుస్తున్నారు;

హొరొనయీముకు వెళ్లే మార్గంలో నడుస్తూ విపత్తును బట్టి కేకలు వేస్తున్నారు.+

 6 ఎందుకంటే నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి;

పచ్చగడ్డి ఎండిపోయింది,

గడ్డి లేకుండా పోయింది, పచ్చనిదేదీ మిగల్లేదు.

 7 అందుకే వాళ్లు తమ గోదాముల్లో, తమ సంపదల్లో మిగిలినవాటిని మోసుకెళ్తున్నారు;

నిరవంజి చెట్ల లోయను* దాటివెళ్తున్నారు.

 8 వాళ్ల రోదన మోయాబు ప్రాంతమంతటా+ మారుమోగుతోంది.

ఆ ఏడ్పు ఎగ్లయీము వరకు,

బెయేరేలీము వరకు వినిపిస్తోంది.

 9 ఎందుకంటే దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి,

నేను దీమోనుకు చేయాల్సింది ఇంకా ఉంది:

మోయాబులో తప్పించుకున్న వాళ్ల కోసం,

దేశంలో మిగిలివున్న వాళ్ల కోసం నేను ఒక సింహాన్ని రప్పిస్తాను.+

16 దేశ పరిపాలకుడికి ఒక పొట్టేలును పంపండి,

సెల నుండి ఎడారి గుండా

సీయోను కూతురి పర్వతానికి దాన్ని పంపండి.

 2 అర్నోను+ రేవుల దగ్గర మోయాబు కూతుళ్లు

తన గూడు నుండి వెళ్లగొట్టబడిన పక్షిలా ఉంటారు.+

 3 “సలహా ఇవ్వు, నిర్ణయాన్ని అమలు చేయి.

నీ మిట్టమధ్యాహ్న నీడను రాత్రిలా చేయి.

చెదిరిపోయిన వాళ్లను దాచిపెట్టు, పారిపోతున్న వాళ్లను అప్పగించకు.

 4 మోయాబూ, చెదిరిపోయిన నా వాళ్లను నీలో నివసించనివ్వు.

నాశనం చేసేవాడి+ నుండి తప్పించుకునేలా వాళ్లకు దాక్కునే స్థలంగా ఉండు.

అణచివేసే వ్యక్తి అంతమౌతాడు,

నాశనం ముగింపుకొస్తుంది,

ఇతరుల్ని తొక్కేసేవాళ్లు భూమ్మీద లేకుండా నాశనమౌతారు.

 5 అప్పుడు విశ్వసనీయ ప్రేమ వల్ల సింహాసనం దృఢంగా స్థాపించబడుతుంది.

దావీదు ఇంట్లో* దానిమీద కూర్చునే వ్యక్తి నమ్మకమైనవాడై ఉంటాడు;+

ఆయన నిష్పక్షపాతంగా న్యాయం తీరుస్తాడు, వేగంగా నీతిని జరిగిస్తాడు.”+

 6 మేము మోయాబు గర్వం గురించి విన్నాం, అతను చాలా గర్విష్ఠి;+

అతని గర్వం, పొగరు, కోపం+ గురించి మేము విన్నాం;

కానీ అతని వ్యర్థమైన మాటలు ఎప్పటికీ నిజమవ్వవు.

 7 కాబట్టి మోయాబు తనమీదికి వచ్చిన విపత్తును బట్టి ఏడుస్తుంది;

వాళ్లందరూ ఏడుస్తారు.+

కొట్టబడినవాళ్లు కీర్హరెశెతు+ ఎండుద్రాక్ష రొట్టెల కోసం మూల్గుతారు.

 8 హెష్బోను+ తోటలు ఎండిపోయాయి,

సిబ్మా+ ద్రాక్షతీగ వాడిపోయింది,

దేశాల పరిపాలకులు దాని ఎర్రని కొమ్మల్ని* తొక్కేశారు;

అవి యాజెరు+ వరకు వ్యాపించాయి;

ఎడారిలోకి విస్తరించాయి.

దాని రెమ్మలు వ్యాపించి సముద్రం వరకు చేరుకున్నాయి.

 9 అందుకే నేను యాజెరు గురించి ఏడ్చినట్టు సిబ్మా ద్రాక్షతీగ గురించి ఏడుస్తాను.

హెష్బోనూ! ఏలాలే!+ నా కన్నీళ్లతో మిమ్మల్ని తడుపుతాను,

ఎందుకంటే మీ వేసవికాల పంటను బట్టి, కోతను బట్టి వేసే కేకలు ఆగిపోయాయి.*

10 పండ్ల తోటలో నుండి సంతోషం, ఆనందం తీసేయబడ్డాయి,

ద్రాక్షతోటల్లో సంతోష గానాలు, కేకలు వినిపించడం లేదు.+

ద్రాక్షారసం కోసం ద్రాక్షతొట్లను తొక్కే వ్యక్తి ఇక వాటిని తొక్కడం లేదు;

ఎందుకంటే నేను, సంతోషంగా వేసే కేకల్ని ఆగిపోయేలా చేశాను.+

11 అందుకే వీణ* తంతుల్లా,

మోయాబు గురించి నేను లోలోపల వణికిపోతున్నాను,+

కీర్హరెశెతు+ గురించి నా అంతరంగం వణికిపోతుంది.

12 మోయాబు ఉన్నత స్థలానికి వెళ్లి ఆయాసపడినా, గుడికి వెళ్లి ప్రార్థించినా దానివల్ల ఒరిగేదేమీ ఉండదు.+

13 మోయాబు గురించి యెహోవా అంతకుముందు చెప్పిన మాట అది. 14 ఇప్పుడు యెహోవా ఇలా చెప్తున్నాడు: “కూలివాడి సంవత్సరాల్లా,* మూడు సంవత్సరాల్లో* మోయాబు మహిమ పోయి అవమానం, అన్నిరకాల అల్లర్లు కనిపిస్తాయి; చాలా తక్కువమంది అందులో మిగిలివుంటారు, అది కూడా బలహీనులు.”+

17 దమస్కు గురించిన సందేశం:+

“ఇదిగో! దమస్కు నగరంగా ఉండకుండా పోతుంది,

అది శిథిలాల కుప్ప అవుతుంది.+

 2 అరోయేరు+ నగరాలు విడిచిపెట్టబడతాయి;

అవి మందలు పడుకునే స్థలాలుగా మారిపోతాయి,

వాటిని భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.

 3 ఎఫ్రాయిములో+ ప్రాకారాలుగల నగరాలు,

దమస్కులో+ రాజ్యం లేకుండాపోతాయి;

సిరియాలో మిగిలినవాళ్లు

ఇశ్రాయేలీయుల* మహిమలా తయారౌతారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

 4 “ఆ రోజు యాకోబు వైభవం తగ్గిపోతుంది,

పుష్టిగా ఉన్న అతని శరీరం* బక్కచిక్కిపోతుంది.

 5 అప్పుడు పరిస్థితి, కోతకోసే వ్యక్తి పొలంలో ధాన్యాన్ని సమకూరుస్తున్నప్పటిలా,

అతని బాహువు వెన్నుల్ని కోసినప్పటిలా ఉంటుంది;

రెఫాయీము లోయలో+ ఒక వ్యక్తి పరిగెను ఏరుకుంటున్నప్పటిలా ఉంటుంది.

 6 పరిగె మాత్రమే మిగులుతుంది,

అది ఒలీవ చెట్టు నుండి పండ్లను రాలగొట్టినప్పటిలా ఉంటుంది:

దాని చిటారుకొమ్మ మీద రెండుమూడు ఒలీవ పండ్లు,

బాగా కాసే దాని కొమ్మల మీద నాలుగైదు పండ్లు మాత్రమే మిగిలి ఉంటాయి”+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అంటున్నాడు.

7 ఆ రోజు మనిషి తన సృష్టికర్త వైపు చూస్తాడు, అతని కళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుని వైపు చూస్తాయి. 8 తన చేతులతో చేసిన+ బలిపీఠాల+ వైపు అతను చూడడు; అంతేకాదు, తన వేళ్లతో చేసినవాటి వైపు అంటే పూజా కర్రల* వైపు గానీ ధూపస్తంభాల వైపు గానీ అతను చూడడు.

 9 ఆ రోజు, కోటలుగల అతని నగరాలు అడవిలో వదిలేయబడిన నివాస స్థలంలా,+

ఇశ్రాయేలీయుల ముందు వదిలేయబడిన కొమ్మలా తయారౌతాయి,

అది పనికిరాని భూమి అవుతుంది.

10 ఎందుకంటే రక్షకుడైన నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు,+

ఆశ్రయదుర్గమైన*+ నీ కోటను నువ్వు గుర్తుచేసుకోలేదు.

అందుకే నువ్వు అందమైన* తోటలు వేసి,

అందులో అపరిచితుడి* కొమ్మను నాటుతున్నావు.

11 ఆ రోజు నువ్వు దాని చుట్టూ జాగ్రత్తగా కంచె వేశావు,

ఉదయం విత్తనాలు మొలకెత్తేలా చేశావు,

కానీ వ్యాధి, తీరని వేదన ఉండే రోజున పంట అంతా మాయమైపోతుంది.+

12 వినండి! చాలా జనాల కోలాహలం వినిపిస్తోంది,

వాటి ఘోష సముద్రాల ఘోషలా ఉంది!

దేశాల గర్జన వినండి,

అది గొప్ప ప్రవాహాల ధ్వనిలా ఉంది!

13 దేశాలు విస్తారమైన జలాల్లా గర్జిస్తాయి.

ఆయన వాళ్లను గద్దిస్తాడు, వాళ్లు దూరంగా పారిపోతారు,

కొండ ప్రాంతంలోని పొట్టు గాలికి కొట్టుకుపోయినట్టు వాళ్లు కొట్టుకుపోతారు,

సుడిగాలికి ముళ్లకొమ్మ గిరగిర తిరిగినట్టు తిరుగుతారు.

14 సాయంకాలం భయం ఆవరిస్తుంది.

తెల్లారేసరికి వాళ్లు ఇక ఉండరు.

మమ్మల్ని కొల్లగొట్టే వాళ్లకు దక్కే భాగం ఇదే,

మమ్మల్ని దోచుకునే వాళ్లకు పట్టే గతి ఇదే.

18 ఇతియోపియా నదుల ప్రాంతంలోని

తటతట కొట్టుకునే రెక్కలుగల దేశానికి శ్రమ!+

 2 అది సముద్రం మీద ప్రతినిధుల్ని పంపుతుంది,

నీళ్ల మీద జమ్ము* పడవల్లో వాళ్లను పంపుతూ ఇలా చెప్తుంది:

“వేగంగా వెళ్లే సందేశకులారా,

నున్నని చర్మంగల ఎత్తైన మనుషులుండే దేశానికి,

అన్ని ప్రాంతాల ప్రజలు భయపడే జనం దగ్గరికి,+

జయిస్తూ వెళ్లే బలమైన దేశం దగ్గరికి,

నదుల వల్ల నేల కొట్టుకుపోయిన దేశం దగ్గరికి మీరు వెళ్లండి.”

 3 దేశ నివాసులారా, భూమ్మీద నివసించే ప్రజలారా,

మీరు చూసేది, పర్వతాల మీద నిలబెట్టిన ధ్వజంలా* ఉంటుంది,

బూర* శబ్దం లాంటి ధ్వని మీకు వినిపిస్తుంది.

 4 ఎందుకంటే యెహోవా నాతో ఇలా చెప్పాడు:

“పగలు సూర్యకాంతిలో వెచ్చగా ఉన్నట్టు,

వేడిగా ఉండే కోతకాలంలో మంచు పడినట్టు,

నేను ప్రశాంతంగా ఉండి, స్థాపించబడిన నా స్థలాన్ని* చూస్తాను.

 5 ఎందుకంటే కోతకాలం రాకముందే,

పూత వాడిపోయి ద్రాక్షకాయలు పక్వం అవుతుండగానే,

కత్తెరలతో కొమ్మల్ని కత్తిరించేస్తారు,

నులితీగల్ని తుంచేసి పారేస్తారు.

 6 అవన్నీ పర్వతాల్లోని వేట పక్షుల కోసం,

భూమ్మీది మృగాల కోసం వదిలేయబడతాయి.

వేట పక్షులు వాటితో వేసవికాలాన్ని గడిపేస్తాయి,

భూమ్మీది మృగాలు వాటితో కోతకాలాన్ని గడిపేస్తాయి.

 7 ఆ సమయంలో సైన్యాలకు అధిపతైన యెహోవాకు

నున్నని చర్మంగల ఎత్తైన మనుషులుండే దేశం నుండి,

అన్ని ప్రాంతాల ప్రజలు భయపడే జనం నుండి,

జయిస్తూ వెళ్లే బలమైన దేశం నుండి,

నదుల వల్ల నేల కొట్టుకుపోయిన దేశం నుండి ఒక బహుమతి తీసుకురాబడుతుంది,

సైన్యాలకు అధిపతైన యెహోవా పేరు పెట్టబడిన స్థలానికి, అంటే సీయోను పర్వతం+ దగ్గరికి అది తీసుకురాబడుతుంది.”

19 ఐగుప్తు గురించిన సందేశం:+

ఇదిగో! వేగంగా కదిలే మేఘం మీద యెహోవా ఐగుప్తులోకి వస్తున్నాడు.

వ్యర్థమైన ఐగుప్తు దేవుళ్లు ఆయన ముందు వణికిపోతారు,+

ఐగుప్తీయుల గుండెలు భయంతో నీరుగారిపోతాయి.

 2 “నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయుల్ని రేపుతాను,

వాళ్లు ఒకరితో ఒకరు పోరాడతారు,

ప్రతీ వ్యక్తి తన సహోదరునితో, తన పొరుగువానితో పోరాడతాడు,

నగరం మీదికి నగరం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి.

 3 ఐగుప్తు కంగారుపడుతుంది,

నేను దాని పన్నాగాల్ని తారుమారు చేస్తాను.+

వాళ్లు వ్యర్థమైన దేవుళ్లను ఆశ్రయిస్తారు,

మాంత్రికుల్ని,* చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, జ్యోతిష్యులను ఆశ్రయిస్తారు.+

 4 నేను ఐగుప్తును కఠినుడైన యజమాని చేతికి అప్పగిస్తాను,

క్రూరుడైన రాజు వాళ్లను పరిపాలిస్తాడు”+ అని నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.

 5 సముద్రంలోని నీళ్లు ఇంకిపోతాయి,

నది ఎండిపోయి పొడినేల అవుతుంది.+

 6 నదులు కంపుకొడతాయి;

ఐగుప్తులోని నైలు నది కాలువల నీటిమట్టం తగ్గుతుంది, అవి ఎండిపోతాయి.

రెల్లు, తుంగలు కుళ్లిపోతాయి.+

 7 నైలు నది వెంబడి, అది సముద్రంలో కలిసే చోట ఉన్న మొక్కలన్నీ ఎండిపోతాయి,

నైలు నది ఒడ్డున ఉన్న సాగుభూమంతా+ ఎండిపోతుంది.+

అది గాలికి కొట్టుకుపోతుంది, ఇక ఉండదు.

 8 జాలర్లు దుఃఖిస్తారు,

నైలు నదిలో గాలం వేసేవాళ్లు విలపిస్తారు,

నీళ్ల మీద తమ వలలు వేసేవాళ్లు తగ్గిపోతారు.

 9 దువ్వబడిన జనుపనారతో+ పనిచేసేవాళ్లు

మగ్గం మీద తెల్లని వస్త్రం నేసేవాళ్లు అవమానించబడతారు.

10 దాని నేతగాళ్లు చితగ్గొట్టబడతారు;

కూలి పనివాళ్లంతా దుఃఖిస్తారు.

11 సోయను+ అధిపతులు తెలివితక్కువవాళ్లు.

ఫరో అత్యంత తెలివిగల సలహాదారులు పనికిరాని సలహా ఇస్తారు.+

“నేను జ్ఞానుల వంశానికి చెందినవాణ్ణి,

ప్రాచీనకాల రాజుల వంశస్థుణ్ణి” అని

నువ్వు ఫరోతో ఎలా చెప్పగలవు?

12 నీ జ్ఞానులు+ ఎక్కడ?

వాళ్లకు తెలిస్తే, సైన్యాలకు అధిపతైన యెహోవా ఐగుప్తు విషయంలో ఏం నిర్ణయించాడో నీకు చెప్పమను.

13 సోయను అధిపతులు తెలివితక్కువగా ప్రవర్తించారు;

నోఫు*+ అధిపతులు మోసగించబడ్డారు;

ఐగుప్తు గోత్రాల ప్రధానులు ఐగుప్తును తప్పుదారి పట్టించారు.

14 యెహోవా దాన్ని అయోమయంలో పడేశాడు;+

ఐగుప్తు చేసిన ప్రతీ పనిలో వాళ్లు దాన్ని పక్కదారి పట్టించారు,

బాగా తాగిన వ్యక్తి తన వాంతిలో తూలినట్టు దాన్ని తూలేలా చేశారు.

15 చేయడానికి ఐగుప్తుకు ఏ పనీ ఉండదు,

తలకే గానీ తోకకే గానీ, రెమ్మకే గానీ రెల్లుకే గానీ* ఏ పనీ ఉండదు.

16 ఆ రోజు సైన్యాలకు అధిపతైన యెహోవా ఐగుప్తు మీదికి తన చెయ్యి చాపడం వల్ల ఐగుప్తీయులు భయపడుతూ, వణికిపోతూ స్త్రీలలా అవుతారు.+ 17 వాళ్లు యూదా దేశాన్ని బట్టి హడలిపోతారు. తమకు వ్యతిరేకంగా సైన్యాలకు అధిపతైన యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, యూదా పేరు ఎత్తితే చాలు వాళ్లు భయపడిపోతారు.+

18 ఆ రోజు కనాను భాష మాట్లాడే, సైన్యాలకు అధిపతైన యెహోవాకు విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేసే ఐదు నగరాలు ఐగుప్తు దేశంలో ఉంటాయి.+ ఒక నగరం నాశనపురం అని పిలవబడుతుంది.

19 ఆ రోజు ఐగుప్తు దేశం మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది, దాని సరిహద్దున యెహోవా గౌరవార్థం ఒక స్తంభం ఉంటుంది. 20 అది ఐగుప్తు దేశంలో సైన్యాలకు అధిపతైన యెహోవా గురించిన ఒక సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది; ఎందుకంటే తమను అణచివేసే వాళ్లను బట్టి వాళ్లు యెహోవాకు మొరపెడతారు, ఆయన వాళ్లను రక్షించే ఒక గొప్ప రక్షకుణ్ణి పంపిస్తాడు. 21 యెహోవా ఐగుప్తీయులకు తనను తాను తెలియజేసుకుంటాడు, ఆ రోజు ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుంటారు, వాళ్లు బలుల్ని, కానుకల్ని అర్పించి, యెహోవాకు మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లిస్తారు. 22 యెహోవా ఐగుప్తును కొడతాడు;+ ఆయన దాన్ని కొడతాడు, బాగుచేస్తాడు. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగొస్తారు, ఆయన వాళ్ల మొరల్ని విని వాళ్లను బాగుచేస్తాడు.

23 ఆ రోజు ఐగుప్తు నుండి అష్షూరు వరకు ఒక రాజమార్గం+ ఉంటుంది. అప్పుడు అష్షూరు ఐగుప్తులోకి వస్తుంది, ఐగుప్తు అష్షూరులోకి వస్తుంది, ఐగుప్తు అష్షూరుతో కలిసి దేవుణ్ణి సేవిస్తుంది. 24 ఆ రోజు ఇశ్రాయేలు జనం ఐగుప్తు, అష్షూరులతో పాటు మూడో జనం అయ్యి+ భూమికి దీవెనగా ఉంటుంది. 25 ఎందుకంటే సైన్యాలకు అధిపతైన యెహోవా, “నా జనమైన ఐగుప్తూ, నా చేతిపనైన అష్షూరూ, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలూ దీవెన పొందండి”+ అని అంటూ అప్పటికే దాన్ని దీవించేసి ఉంటాడు.

20 అష్షూరు రాజైన సర్గోను తర్తానును* అష్డోదుకు+ పంపించిన సంవత్సరంలో అతను అష్డోదు మీద యుద్ధం చేసి, దాన్ని చెరపట్టాడు.+ 2 ఆ సమయంలో, యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా+ ద్వారా మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “నువ్వు వెళ్లి, నీ నడుం మీదున్న గోనెపట్టను, నీ కాళ్లకున్న చెప్పుల్ని తీసేయి.” కాబట్టి అతను వాటిని తీసేసి బట్టలు లేకుండా,* వట్టికాళ్లతో తిరిగాడు.

3 తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “నా సేవకుడైన యెషయా ఐగుప్తుకు,+ ఇతియోపియాకు+ సూచనగా,+ హెచ్చరికగా మూడు సంవత్సరాల పాటు బట్టలు లేకుండా, వట్టికాళ్లతో నడిచినట్టే, 4 అష్షూరు రాజు కూడా చెరపట్టబడిన ఐగుప్తీయుల్ని,+ ఇతియోపియా ఖైదీలను, అంటే వాళ్లలోని అబ్బాయిల్ని, ముసలివాళ్లను బట్టలు లేకుండా, వట్టికాళ్లతో, పిరుదులు కనిపించేలా నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అవును ఐగుప్తు అవమానాలపాలు అవుతుంది. 5 వాళ్లు భయపడిపోతారు; తమ నిరీక్షణయైన ఇతియోపియాను బట్టి, తమ గర్వకారణమైన ఐగుప్తును* బట్టి సిగ్గుపడతారు. 6 ఆ రోజు ఈ సముద్రతీర ప్రాంతంలో నివసించే ప్రజలు ఇలా అనుకుంటారు: ‘మనం ఆశపెట్టుకున్న దానికి ఏమైందో చూడండి! సహాయం కోసం, అష్షూరు రాజు నుండి రక్షణ కోసం మనం దేని దగ్గరికైతే పారిపోయామో దానికి ఏమైందో చూడండి! ఇప్పుడు మనం ఎలా తప్పించుకుంటాం?’ ”

21 సముద్రతీరాన ఉన్న ఎడారి* గురించిన సందేశం:+

దక్షిణాన విసిరే సుడిగాలిలా అది వస్తోంది,

ఎడారి నుండి, భీకర దేశం నుండి అది వస్తోంది.+

 2 ఒక కఠినమైన దర్శనం నాకు చూపబడింది:

మోసగాడు మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాడు,

నాశకుడు నాశనం చేస్తున్నాడు.

ఏలామూ, వెళ్లు! మాదీయా, ముట్టడివేయి!+

అది కలిగించిన వేదన అంతటినీ నేను అంతం చేస్తాను.+

 3 అందుకే నేను తీవ్రంగా బాధపడుతున్నాను,*+

ప్రసవించే స్త్రీకి వచ్చేలాంటి నొప్పులు

నాకు వచ్చాయి.

వేదన వల్ల నేను ఏమీ వినలేకపోతున్నాను;

దిగులు వల్ల ఏమీ చూడలేకపోతున్నాను.

 4 నా హృదయం తడబడుతోంది, నేను భయంతో వణికిపోతున్నాను.

నేను ఎంతగానో కోరుకున్న సంధ్య వెలుగు నన్ను వణికిస్తోంది.

 5 బల్లను సిద్ధం చేయండి, కూర్చోవడానికి ఏర్పాట్లు చేయండి!

తినండి, తాగండి!+

అధిపతులారా, లేచి డాలును అభిషేకించండి!*

 6 ఎందుకంటే, యెహోవా నాకు ఇలా చెప్పాడు:

“వెళ్లి ఒక కావలివాణ్ణి నిలబెట్టు, అతనికి ఏం కనిపిస్తుందో చెప్పమను.”

 7 ఒక జత గుర్రాలు లాగుతున్న యుద్ధ రథం ఒకటి,

గాడిదలు లాగుతున్న యుద్ధ రథం ఒకటి,

ఒంటెలు లాగుతున్న యుద్ధ రథం ఒకటి అతనికి కనిపించాయి.

అతను జాగ్రత్తగా, చాలా తీక్షణంగా చూశాడు.

 8 తర్వాత అతను సింహంలా గట్టిగా ఇలా అరిచాడు:

“యెహోవా, నేను రోజంతా కావలిబురుజు మీద నిలబడుతున్నాను,

ప్రతీ రాత్రి నేను నా కావలి స్థలం దగ్గర ఉండి కాపలా కాస్తున్నాను.+

 9 చూడండి! గుర్రాల జత లాగుతున్న ఒక యుద్ధ రథంలో

సైనికులు వస్తున్నారు.”+

తర్వాత అతను ఇలా అన్నాడు:

“ఆమె కూలిపోయింది! బబులోను కూలిపోయింది!+

ఆమె దేవుళ్ల విగ్రహాలన్నిటినీ* ఆయన పగలగొట్టి నేలమట్టం చేశాడు!”+

10 నూర్చబడిన నా ప్రజలారా,

నా కళ్లంలో* నూర్చబడిన ధాన్యమా,+

సైన్యాలకు అధిపతీ ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా నుండి నేను విన్నది మీకు చెప్పాను.

11 దూమా* గురించిన సందేశం:

శేయీరు+ నుండి ఎవరో నన్ను ఇలా అడుగుతున్నారు:

“కావలివాడా, రాత్రి ఎంత సమయమైంది?

కావలివాడా, రాత్రి ఎంత సమయమైంది?”

12 కావలివాడు ఇలా చెప్పాడు:

“తెల్లవారుతోంది, అలాగే రాత్రి కూడా వస్తోంది.

మీరు అడగాలనుకుంటే అడగండి.

మళ్లీ రండి!”

13 ఎడారి మైదానం గురించిన సందేశం:

దెదాను+ ప్రయాణికులారా,

ఎడారి మైదానంలోని అడవిలో మీరు రాత్రి గడుపుతారు.

14 తేమా+ దేశ నివాసులారా,

దాహంగా ఉన్న వ్యక్తి కోసం నీళ్లు తీసుకురండి,

పారిపోతున్న వ్యక్తి కోసం రొట్టె తీసుకురండి.

15 ఎందుకంటే వాళ్లు ఖడ్గం నుండి, దూసిన ఖడ్గం నుండి పారిపోయి వచ్చారు,

ఎక్కుపెట్టిన విల్లు నుండి, క్రూరమైన యుద్ధం నుండి పారిపోయి వచ్చారు.

16 ఎందుకంటే యెహోవా నాతో ఇలా అన్నాడు: “కూలివాడి సంవత్సరాల్లా,* ఒక్క సంవత్సరంలో* కేదారు+ ఘనత అంతా మాయమైపోతుంది. 17 కేదారు యోధుల్లో కొంతమంది విలుకాండ్రే మిగులుతారు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ మాట చెప్పాడు.”

22 దర్శన లోయ* గురించిన సందేశం:+

మీకు ఏమైంది? మీరంతా ఇంటి పైకప్పుల మీదికి ఎందుకు వెళ్లారు?

 2 నువ్వు అల్లరితో నిండివుండే దానివి,

కోలాహలం నిండిన నగరానివి, ఉల్లసించే పట్టణానివి.

నీలో హతులైనవాళ్లు ఖడ్గం వల్ల హతమవ్వలేదు,

వాళ్లు యుద్ధంలో చనిపోలేదు.+

 3 నీ నియంతలంతా కలిసి పారిపోయారు.+

విల్లు అవసరం లేకుండానే వాళ్లను ఖైదీలుగా తీసుకెళ్లారు.

దొరికిన వాళ్లందర్నీ ఖైదీలుగా తీసుకెళ్లారు,+

చాలాదూరం పారిపోయినా పట్టుకొని తీసుకెళ్లారు.

 4 అందుకే నేనిలా అన్నాను: “మీ దృష్టి నా మీద నుండి పక్కకు తిప్పండి,

నేను వెక్కివెక్కి ఏడుస్తాను.+

నా ప్రజల కూతురి* నాశనాన్ని బట్టి నేను బాధపడుతున్నాను,

నన్ను ఓదార్చడానికి అదేపనిగా ప్రయత్నించకండి.+

 5 ఎందుకంటే అది దర్శన లోయలో

అయోమయం, ఓటమి, భయాందోళన+ ఉండే రోజు,

అది సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నుండి వస్తుంది.

ప్రాకారం కూలగొట్టబడుతుంది,+

పర్వతం వరకు అరుపు వినిపిస్తుంది.

 6 ఏలాము+ అంబులపొది తీసుకొని

సైనికులున్న రథాలతో, గుర్రాలతో* వస్తోంది;

కీరు+ డాలును బయటికి తీస్తుంది.*

 7 నీ శ్రేష్ఠమైన లోయలు

యుద్ధ రథాలతో నిండిపోతాయి,

నగర ద్వారం దగ్గర గుర్రాలు* వాటివాటి స్థానాల్లో నిలబడతాయి.

 8 యూదా ముసుగు* తీసేయబడుతుంది.

“ఆ రోజు నువ్వు అడవి గృహంలోని+ ఆయుధశాల వైపు చూస్తావు. 9 దావీదు నగర ప్రాకారంలో మీకు చాలా బీటలు కనిపిస్తాయి.+ దిగువ కోనేరులో+ మీరు నీళ్లు నిల్వచేస్తారు. 10 మీరు యెరూషలేములోని ఇళ్లను లెక్కపెడతారు, దాని ప్రాకారాన్ని దృఢపర్చడానికి ఆ ఇళ్లను కూలగొడతారు. 11 పాత కోనేరులోని నీళ్ల కోసం ప్రాకారపు రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని కడతారు, కానీ దాని మహాగొప్ప నిర్మాణకుడి* వైపు మీరు చూడరు; చాలాకాలం ముందు దాన్ని నిర్మించిన దేవుణ్ణి మీరు చూడరు.

12 ఆ రోజు సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా

ఏడ్వమని, దుఃఖించమని చెప్తాడు,+

గుండు గీయించుకోమని, గోనెపట్ట కట్టుకోమని చెప్తాడు.

13 కానీ ప్రజలు సంబరాలు చేసుకుంటూ సంతోషిస్తున్నారు,

పశువుల్ని, గొర్రెల్ని వధిస్తున్నారు,

మాంసం తింటూ ద్రాక్షారసం తాగుతున్నారు.+

‘ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం’+ అని చెప్పుకుంటున్నారు.”

14 అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవా నా చెవుల్లో ఈ విషయాన్ని వెల్లడిచేశాడు: “ ‘మీరు చనిపోయేవరకు, మీరు చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు’+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.”

15 సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా చెప్పేదేమిటంటే: “గృహనిర్వాహకుడిగా, రాజభవనం మీద పర్యవేక్షకుడిగా ఉన్న షెబ్నా+ దగ్గరికి వెళ్లి నువ్విలా చెప్పు: 16 ‘నీకు ఇక్కడ ఏం పనుంది? ఇక్కడ నీకు ఎవరు ఉన్నారని నీ కోసం ఇక్కడ సమాధి తొలిపించుకున్నావు?’ అతను ఎత్తైన స్థలంలో తనకోసం ఒక సమాధి తొలిపించుకుంటున్నాడు; ఒక బండలో తన కోసం విశ్రాంతి స్థలాన్ని* తొలిపించుకుంటున్నాడు. 17 ‘ఓ మనిషీ, ఇదిగో! యెహోవా నిన్ను బలంగా కిందికి విసిరేసి, బలవంతంగా నిన్ను పట్టుకుంటాడు. 18 ఆయన నిన్ను గట్టిగా చుట్టి, బంతిని విసిరేసినట్టు విశాలమైన దేశంలోకి విసిరేస్తాడు. నువ్వు అక్కడే చనిపోతావు, ఘనమైన నీ రథాలు కూడా అక్కడే ఉండిపోతాయి; అది నీ యజమాని ఇంటికి అవమానం. 19 నీ పదవి నుండి నిన్ను దించేస్తాను, నీ ఉద్యోగంలో నుండి నిన్ను తీసిపారేస్తాను.

20 “ ‘ఆ రోజు నేను హిల్కీయా కుమారుడూ నా సేవకుడూ అయిన ఎల్యాకీమును+ పిలుస్తాను, 21 నీ నిలువుటంగీని అతనికి తొడుగుతాను, నీ దట్టీని అతని నడుము చుట్టూ గట్టిగా కడతాను,+ నీ అధికారాన్ని* అతని చేతుల్లో పెడతాను. యెరూషలేము నివాసులకు, యూదా ఇంటివాళ్లకు అతను తండ్రిగా ఉంటాడు. 22 దావీదు ఇంటి తాళంచెవిని+ నేను అతని భుజాల మీద పెడతాను. అతను తెరిస్తే ఎవ్వరూ మూయలేరు; అతను మూస్తే ఎవ్వరూ తెరవలేరు. 23 కదలని చోట మేకును దిగగొట్టినట్టు నేను అతన్ని స్థిరపరుస్తాను; అతని తండ్రి ఇంటికి అతను మహిమగల సింహాసనం అవుతాడు. 24 అతని తండ్రి ఇంటి మహిమ* అంతటినీ, అంటే అతని వంశస్థుల మహిమను, సంతానపు* మహిమను, చిన్న పాత్రలన్నిటి మహిమను, గుండ్రటి గిన్నెల మహిమను, పెద్ద చెంబులన్నిటి మహిమను వాళ్లు అతని మీద వేలాడదీస్తారు.

25 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజు, కదలని చోట దిగగొట్టబడిన మేకు తీసేయబడుతుంది,+ అది పడిపోయి నాశనమౌతుంది, దానికి తగిలించిన బరువు పడిపోయి నాశనమౌతుంది; ఎందుకంటే యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.’ ”

23 తూరు గురించిన సందేశం:+

తర్షీషు ఓడలారా,+ విలపించండి!

ఓడరేవు నాశనం చేయబడింది; అందులోకి ప్రవేశించడం వీలుకాదు.

కిత్తీము+ దేశం నుండి ఈ వార్త వాళ్లకు అందింది.

 2 సముద్రతీర నివాసులారా, మౌనంగా ఉండండి.

సముద్రాన్ని దాటే సీదోను వర్తకుల సంపదలతో నువ్వు నిండిపోయావు.

 3 షీహోరు*+ ధాన్యం, నైలు నది పంట

అంటే, తూరు ఆదాయమంతా

అనేక జలాల మీద వెళ్లి దేశాలకు లాభాలు తీసుకొచ్చింది.+

 4 సముద్ర ఆశ్రయదుర్గమైన సీదోనూ, సిగ్గుపడు.

ఎందుకంటే సముద్రం ఇలా అంది:

“నేను పురిటినొప్పులు పడలేదు, బిడ్డను కనలేదు,

యువకుల్ని, యువతుల్ని* పెంచి పెద్దచేయలేదు.”+

 5 ఐగుప్తు గురించిన కబురు విన్నప్పుడు+ వేదనపడినట్టే,

తూరు గురించిన కబురు విన్నప్పుడు ప్రజలు వేదనపడతారు.+

 6 సముద్రం మీద ప్రయాణించి తర్షీషుకు వెళ్లండి!

సముద్రతీర నివాసులారా, విలపించండి!

 7 పూర్వకాలం నుండి, దాని తొలినాళ్ల నుండి ఎంతో ఉల్లాసంగా ఉన్న మీ నగరం ఇదేనా?

వేరే దేశాల్లో నివసించేలా దాని పాదాలు దాన్ని దూర దేశాలకు నడిపించేవి.

 8 తూరు కిరీటాలు ఇస్తూ ఉండేది;

దాని వ్యాపారులు అధిపతులు;

దాని వర్తకుల్ని లోకమంతా గౌరవించేది.+

అలాంటి తూరుకు ఇలా జరగాలని నిర్ణయించింది ఎవరు?

 9 సైన్యాలకు అధిపతైన యెహోవాయే అలా నిర్ణయించాడు;

దాని గర్వాన్ని, దాని సౌందర్యాన్ని హీనపర్చడానికి,

లోకమంతటా గౌరవించబడిన వాళ్లను అవమానపర్చడానికి అలా చేశాడు.+

10 తర్షీషు కూతురా, నైలు నదిలా నీ దేశాన్ని దాటివెళ్లు.

ఇక దానిలో నౌకా కేంద్రం* అనేదే లేదు.+

11 ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపాడు;

రాజ్యాల్ని కుదిపేశాడు.

ఫేనీకే బలమైన దుర్గాల్ని సమూలంగా నాశనం చేయమని యెహోవా ఆదేశించాడు.+

12 ఆయన ఇలా అంటున్నాడు: “అణచివేయబడిన సీదోను కన్యా,

నువ్విక ఎంతమాత్రం సంతోషించవు.+

లే, సముద్రం మీద కిత్తీముకు+ పారిపో.

కానీ అక్కడ కూడా నీకు నెమ్మది ఉండదు.”

13 ఇదిగో! కల్దీయుల+ దేశాన్ని చూడండి.

అష్షూరు+ కాదు ఈ ప్రజలే

దాన్ని* ఎడారి ప్రాణులు తిరిగే స్థలంగా చేశారు.

వాళ్లు ముట్టడి బురుజుల్ని కట్టి,

దాని పటిష్ఠమైన బురుజుల్ని కూలగొట్టి,+

దాన్ని శిథిలాల కుప్పగా మార్చేశారు.

14 తర్షీషు ఓడలారా, విలపించండి,

ఎందుకంటే మీ బలమైన దుర్గం నాశనం చేయబడింది.+

15 ఆ రోజు తూరు 70 సంవత్సరాల పాటు, అంటే ఒక రాజు జీవితకాలమంత సమయం మరవబడుతుంది.+ ఆ 70 సంవత్సరాల ముగింపులో, ఈ వేశ్య పాటలో ఉన్నట్టు దానికి జరుగుతుంది:

16 “మరవబడిన వేశ్యా, వీణ* తీసుకొని నగరమంతా తిరుగు.

నైపుణ్యంతో నీ వీణను వాయించు;

వాళ్లు నిన్ను గుర్తుచేసుకునేలా

చాలా పాటలు పాడు.”

17 ఆ 70 సంవత్సరాల ముగింపులో యెహోవా తూరు మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు; అది మళ్లీ పడుపుసొమ్ము సంపాదించడం కోసం భూమ్మీదున్న రాజ్యాలన్నిటితో వ్యభిచారం చేస్తుంది. 18 అయితే దాని లాభం, దాని పడుపుసొమ్ము యెహోవాకు ప్రతిష్ఠితం అవుతాయి. ఆ సొమ్మును కూడబెట్టడం గానీ, పక్కనపెట్టడం గానీ జరగదు; ఎందుకంటే యెహోవా సన్నిధిలో నివసించేవాళ్లు కడుపునిండా తినేలా, ప్రశస్తమైన బట్టలు వేసుకునేలా ఆ సొమ్ము వాళ్లకోసం ఉపయోగించబడుతుంది.+

24 ఇదిగో! యెహోవా దేశాన్ని* ఖాళీ చేయించి దాన్ని నిర్జనం చేస్తున్నాడు.+

ఆయన దాన్ని తలకిందులు చేసి,+ దాని నివాసుల్ని చెదరగొడతాడు.+

 2 అందరి పరిస్థితి ఒకేలా ఉంటుంది:

ప్రజలకు, యాజకుడికి,

దాసుడికి, యజమానికి,

దాసురాలికి, యజమానురాలికి,

అమ్మేవాడికి, కొనేవాడికి,

అప్పు ఇచ్చేవాడికి, అప్పు తీసుకునేవాడికి,

వడ్డీ తీసుకునేవాడికి, వడ్డీ కట్టేవాడికి అందరికీ ఒకేలా జరుగుతుంది.+

 3 దేశం పూర్తిగా ఖాళీ చేయబడుతుంది;

అది పూర్తిగా దోచుకోబడుతుంది,+

ఎందుకంటే యెహోవా ఈ మాట చెప్పాడు.

 4 దేశం శోకిస్తోంది;*+ అది పాడైపోతోంది.

పండే భూమి బీడుబారిపోతోంది; అది వాడిపోతోంది.

దేశంలోని ప్రముఖులు కృశించిపోతున్నారు.

 5 నివాసులు దేశాన్ని కలుషితం చేశారు,+

వాళ్లు ఆజ్ఞలు మీరారు,+

నియమాలు మార్చారు,+

శాశ్వతమైన* ఒప్పందానికి*+ కట్టుబడి ఉండలేదు.

 6 అందుకే శాపం దేశాన్ని మింగేస్తోంది,+

దాని నివాసులు దోషులుగా ఎంచబడుతున్నారు.

దానివల్లే దేశ నివాసుల సంఖ్య తగ్గిపోయింది,

చాలా కొద్దిమందే మిగిలారు.+

 7 కొత్త ద్రాక్షారసం దుఃఖిస్తోంది,* ద్రాక్షవల్లి వాడిపోతోంది,+

హృదయం సంతోషంగా ఉన్నవాళ్లంతా నిట్టూరుస్తున్నారు.+

 8 కంజీరల* సంతోషనాదం ఆగిపోయింది;

ఉల్లసించేవాళ్ల శబ్దం ఇక వినబడడం లేదు;

వీణల* సంతోషనాదం ఆగిపోయింది.+

 9 వాళ్లు పాటలు లేకుండా ద్రాక్షారసం తాగుతున్నారు,

మద్యం తాగేవాళ్లకు అది చేదుగా అనిపిస్తోంది.

10 నిర్జనమైన పట్టణం కూలగొట్టబడింది;+

ఎవరూ ప్రవేశించకుండా ప్రతీ ఇంటి తలుపు మూసేయబడింది.

11 వాళ్లు ద్రాక్షారసం కోసం వీధుల్లో కేకలు వేస్తున్నారు.

సంతోషమంతా కనుమరుగైపోయింది;

దేశంలోని ఆనందమంతా ఆవిరైపోయింది.+

12 నగరం శిథిలమైపోయింది;

నగర ద్వారం రాళ్లకుప్పగా మారింది.+

13 జనాల మధ్య దేశం పరిస్థితి

ఒలీవ చెట్టునుండి పండ్లను రాలగొట్టినప్పటిలా,+

ద్రాక్షల కోత ముగిసి పరిగె ఏరుకునేటప్పటిలా ఉంటుంది.+

14 వాళ్లు తమ గొంతెత్తి

సంతోషంతో కేకలు వేస్తారు.

పడమటి* నుండి వాళ్లు యెహోవా గొప్పతనాన్ని చాటిస్తారు.+

15 అందుకే వాళ్లు తూర్పు* ప్రాంతంలో+ యెహోవాను మహిమపరుస్తారు;

సముద్ర ద్వీపాల్లో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరును మహిమపరుస్తారు.+

16 భూమి అంచుల నుండి ఇలా పాటలు వినబడుతున్నాయి:

“నీతిమంతుడైన దేవునికి+ మహిమ* కలగాలి!”

కానీ నేనిలా అన్నాను: “నేను క్షీణించిపోతున్నాను, క్షీణించిపోతున్నాను!

అయ్యో, నాకు శ్రమ! మోసగాళ్లు మోసపూరితంగా ప్రవర్తించారు;

వాళ్లు మోసంతో మోసపూరితంగా ప్రవర్తించారు.”+

17 దేశ నివాసీ! నీ కోసం విపరీతమైన భయం, గోతులు, ఉచ్చులు వేచివున్నాయి.+

18 భయం పుట్టించే శబ్దం విని పారిపోతున్న వ్యక్తి గోతిలో పడతాడు,

గోతిలో నుండి పైకి వచ్చే వ్యక్తి ఉచ్చులో చిక్కుకుంటాడు.+

ఆకాశ తూములు* తెరవబడతాయి,

నేల పునాదులు కంపిస్తాయి.

19 భూమి బద్దలైపోయింది;

అది కుదిపేయబడింది;

అది విపరీతంగా కంపిస్తోంది.+

20 బాగా తాగిన వ్యక్తిలా భూమి తూలుతోంది,

గాలికి గుడిసె ఊగినట్టు అది అటూఇటూ ఊగుతోంది.

దాని పాపం దాని మీద చాలా బరువుగా ఉంది,+

అది మళ్లీ లేవడం వీలుకాని విధంగా పడిపోతుంది.

21 ఆ రోజు యెహోవా, పైనున్న స్థలాల్లోని సైన్యం మీదికి,

కిందున్న భూరాజుల మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు.

22 ఖైదీలను గుంటలోకి సమకూర్చినట్టు,

వాళ్లను సమకూర్చి,

చెరసాలలో వేసి, దాన్ని మూసేస్తారు;

చాలా రోజుల తర్వాత ఆయన వాళ్లమీదికి తన దృష్టిని మళ్లిస్తాడు.

23 నిండు చంద్రుడు చీకటి అవుతాడు,

ప్రకాశించే సూర్యుడు వెలవెలబోతాడు,+

ఎందుకంటే సైన్యాలకు అధిపతైన యెహోవా సీయోను పర్వతం+ మీద, యెరూషలేములో రాజయ్యాడు;+

ఆయన తన ప్రజల పెద్దల* ముందు మహిమతో పరిపాలిస్తాడు.+

25 యెహోవా, నువ్వే నా దేవుడివి.

నేను నిన్ను ఘనపరుస్తాను, నీ పేరును స్తుతిస్తాను,

ఎందుకంటే నువ్వు అద్భుతమైన పనులు చేశావు,+

పురాతన కాలంలో ఉద్దేశించిన* వాటిని+

విశ్వసనీయతతో,+ నమ్మకత్వంతో నెరవేర్చావు.

 2 నువ్వు నగరాన్ని రాళ్లకుప్పగా చేశావు,

ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలాలుగా మార్చావు.

పరదేశుల బురుజు ఇక ఎంతమాత్రం కోటలా లేదు;

అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.

 3 అందుకే బలమైన జనం నిన్ను మహిమపరుస్తుంది;

నిరంకుశ జనాల నగరం నీకు భయపడుతుంది.+

 4 ఎందుకంటే నువ్వు దీనులకు బలమైన కోటగా

కష్టాల్లో ఉన్న పేదవాడికి బలమైన దుర్గంగా,+

తుఫాను వచ్చినప్పుడు ఆశ్రయంగా,

ఎండలో నీడగా ఉన్నావు.+

నిరంకుశ పాలకుల కోపం, గోడను ఢీకొట్టే తుఫానులా,

 5 ఎండిపోయిన దేశంలోని వేడిలా ఉన్నప్పుడు,

అపరిచితుల అల్లకల్లోలాన్ని నువ్వు అణచివేస్తావు.

మేఘం నీడ వల్ల వేడి అణచివేయబడినట్టు

నిరంకుశ పాలకుల పాట అణచివేయబడుతుంది.

 6 సైన్యాలకు అధిపతైన యెహోవా ఈ పర్వతం+ మీద అన్ని జనాలకు

శ్రేష్ఠమైన వంటకాలతో విందు ఏర్పాటు చేస్తాడు;+

శ్రేష్ఠమైన ద్రాక్షారసంతో,*

మూలుగతో నిండిన శ్రేష్ఠమైన వంటకాలతో,

వడగట్టిన శ్రేష్ఠమైన ద్రాక్షారసంతో విందు ఏర్పాటు చేస్తాడు.

 7 ఈ పర్వతం మీద, ఆయన అన్ని జనాల మీదున్న ముసుగును,

దేశాలన్నిటినీ కప్పుతున్న తెరను తీసేస్తాడు.*

 8 ఇక ఎప్పుడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడు,+

సర్వోన్నత ప్రభువైన యెహోవా, ప్రజలందరి ముఖాల మీది కన్నీళ్లను తుడిచేస్తాడు.+

భూమంతటా ఉన్న తన ప్రజల నిందను ఆయన తీసేస్తాడు,

యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.

 9 ఆ రోజు వాళ్లు ఇలా చెప్పుకుంటారు:

“ఇదిగో! ఈయనే మన దేవుడు!+

మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం,+

ఈయనే మనల్ని రక్షిస్తాడు.+

ఈయనే యెహోవా!

మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం.

ఆయన దయచేసే రక్షణను బట్టి మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం.”+

10 ఎందుకంటే యెహోవా చెయ్యి ఈ పర్వతం మీద ఉంటుంది,+

గడ్డిని తొక్కి ఎరువుకుప్పగా చేసినట్టు

మోయాబు దాని స్థలంలో తొక్కబడుతుంది.+

11 ఈతగాడు ఈతకొట్టడానికి తన చేతులు చాపినట్టు

ఆయన దానిలోకి తన చేతులు చాపుతాడు,

తన చేతుల్ని నేర్పుగా తిప్పుతూ

దాని అహంకారాన్ని అణచివేస్తాడు.+

12 ప్రాకారాలుగల నగరాన్ని, దాని ఎత్తైన రక్షణగోడలతో పాటు కూలగొడతాడు;

ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు, మట్టిలో కలిపేస్తాడు.

26 ఆ రోజు యూదా దేశంలో+ ఈ పాట పాడతారు:+

“మనకొక బలమైన నగరం+ ఉంది.

ఆయన, రక్షణను దానికి ప్రాకారాలుగా, కోట గోడలుగా చేస్తాడు.+

 2 నీతిగల జనం, నమ్మకమైన ప్రవర్తనగల జనం

ప్రవేశించేలా నగర ద్వారాలు తెరవండి.+

 3 నీ మీద పూర్తిగా ఆధారపడేవాళ్లను* నువ్వు కాపాడతావు;

నువ్వు వాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తావు,+

ఎందుకంటే వాళ్లు నిన్నే నమ్ముకున్నారు.+

 4 ఎల్లప్పుడూ యెహోవా మీద నమ్మకం ఉంచండి,+

ఎందుకంటే యెహోవా* యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం.*+

 5 ఎత్తైన చోట, అంటే ఉన్నతమైన నగరంలో నివసించేవాళ్లను ఆయన కిందికి దించాడు.

ఆయన దాన్ని కిందికి దించుతాడు,

నేల మీదికి రప్పిస్తాడు;

ధూళిలోకి విసిరేస్తాడు.

 6 పాదం దాన్ని తొక్కుతుంది,

కష్టాల్లో ఉన్నవాళ్ల పాదాలు, దీనుల అడుగులు దాన్ని తొక్కుతాయి.”

 7 నీతిమంతుల దారి తిన్నగా* ఉంటుంది.

నువ్వు నిజాయితీపరుడివి కాబట్టి

నీతిమంతుల మార్గాన్ని చదును చేస్తావు.

 8 యెహోవా, నీ తీర్పుల మార్గాన్ని మేము అనుసరిస్తున్నప్పుడు

మేము నీ మీదే ఆశపెట్టుకుంటున్నాం.

నీ కోసం, నీ పేరు కోసం* మా ప్రాణం తపిస్తోంది.

 9 రాత్రిపూట నా ప్రాణం నీ కోసం తపిస్తోంది,

అవును, లోలోపల నేను నీ కోసం చూస్తూ ఉన్నాను;+

నువ్వు భూమికి తీర్పులు జారీ చేసినప్పుడు,

దేశ నివాసులు నీతి+ గురించి నేర్చుకుంటారు.

10 అయితే దుష్టుడి మీద దయ చూపించినా

అతను నీతిని నేర్చుకోడు.+

నిజాయితీపరుల దేశంలో కూడా అతను చెడ్డగానే ప్రవర్తిస్తాడు,+

యెహోవా గొప్పతనాన్ని అతను చూడడు.+

11 యెహోవా, నీ చెయ్యి ఎత్తబడి ఉంది, అయినా వాళ్లు దాన్ని చూడరు.+

నీ ప్రజల విషయంలో నీకున్న ఆసక్తిని చూసి వాళ్లు సిగ్గుపడతారు.

అవును, నీ అగ్ని నీ విరోధుల్ని దహించేస్తుంది.

12 యెహోవా, నువ్వు మాకు శాంతిని దయచేస్తావు,+

ఎందుకంటే, మేము చేసినవన్నీ

నువ్విచ్చిన బలంతోనే చేశాం.

13 యెహోవా, మా దేవా, నువ్వు కాకుండా వేరే యజమానులు మమ్మల్ని పరిపాలించారు,+

కానీ నీ పేరునే మేము స్మరించుకుంటున్నాం.+

14 వాళ్లు చనిపోయారు; ఇక బ్రతకరు.

వాళ్లు చనిపోయి శక్తిహీనంగా ఉన్నారు, ఇక లేవరు.+

ఎందుకంటే వాళ్లను సమూలంగా నాశనం చేసి, వాళ్ల పేరును పూర్తిగా తుడిచిపెట్టాలని

నువ్వు వాళ్ల మీదికి నీ దృష్టి మళ్లించావు.

15 యెహోవా, నువ్వు దేశాన్ని విశాలం చేశావు,

దేశాన్ని పెద్దదిగా చేశావు;

నిన్ను నువ్వు మహిమపర్చుకున్నావు.+

దేశ సరిహద్దులన్నిటినీ నువ్వు ఎంతగానో విస్తరింపజేశావు.+

16 యెహోవా, కష్టం వచ్చినప్పుడు వాళ్లు నీ వైపు తిరిగారు;

నువ్వు వాళ్లను సరిదిద్దినప్పుడు వాళ్లు మౌనంగా, పట్టుదలతో ప్రార్థించారు.+

17 యెహోవా, నీ వల్ల మా పరిస్థితి

బిడ్డను కనబోతున్న గర్భిణీ స్త్రీ

పురిటినొప్పులు వచ్చినప్పుడు వేదనతో కేకలు వేసినట్టు ఉంది.

18 మేము గర్భం ధరించాం, పురిటినొప్పులు పడ్డాం,

కానీ గాలిని కన్నట్టే ఉంది.

మేము దేశానికి రక్షణ తీసుకురాలేదు,

దేశంలో నివసించడానికి ఎవరూ పుట్టలేదు.

19 “చనిపోయిన నీవాళ్లు బ్రతుకుతారు.

నావాళ్ల శవాలు లేస్తాయి.+

మట్టిలో నివసిస్తున్న వాళ్లారా,+

లేవండి, సంతోషంతో అరవండి!

ఎందుకంటే నీ మంచు తెల్లవారుజాము* మంచులా ఉంది,

భూమి తనలో ఉన్న మృతుల్ని సజీవుల్ని చేస్తుంది.

20 నా ప్రజలారా, వెళ్లండి, లోపలి గదుల్లోకి ప్రవేశించి

తలుపులు వేసుకోండి.+

దేవుని కోపం దాటివెళ్లే వరకు

కాసేపు దాక్కోండి.+

21 ఎందుకంటే, ఇదిగో! దేశ నివాసుల దోషాన్ని బట్టి వాళ్లను లెక్క అడగడం కోసం

యెహోవా తన నివాస స్థలం నుండి వస్తున్నాడు;

దేశం తనలో హతులైన వాళ్లను కప్పిపెట్టకుండా

తనలో జరిగిన రక్తపాతాన్ని బయటపెడుతుంది.”

27 ఆ రోజు యెహోవా కఠినమైన, గొప్పదైన, బలమైన తన ఖడ్గంతో+

లివ్యాతన్‌* అనే పాకే సర్పం మీదికి,

వంకర సర్పమైన లివ్యాతన్‌ మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు.

సముద్రంలోని ఆ భారీ ప్రాణిని ఆయన చంపేస్తాడు.

 2 ప్రజలారా, ఆ రోజు ఆమె* మీద ఈ పాట పాడండి:

“పులిసిన ద్రాక్షారసం ఉన్న ద్రాక్షతోట!+

 3 యెహోవా అనే నేను దాన్ని కాపాడుతున్నాను.+

ప్రతీక్షణం దానికి నీళ్లు పెడుతున్నాను.+

ఎవరూ దానికి హాని చేయకుండా

రాత్రింబగళ్లు దాన్ని సంరక్షిస్తున్నాను.+

 4 నాకు ఏ కోపం లేదు.+

ముళ్లపొదలతో, పిచ్చి మొక్కలతో ఎవరు నామీదికి యుద్ధానికి వస్తారు?

నేను వాటిని తొక్కేస్తాను, అన్నిటికీ కలిపి నిప్పంటిస్తాను.

 5 కాబట్టి, అతను నా బలమైన దుర్గాన్ని గట్టిగా పట్టుకోవాలి.

అతను నాతో సమాధానపడాలి;

నాతో శాంతి కుదుర్చుకోవాలి.”

 6 రాబోయే రోజుల్లో యాకోబు వేళ్లూనుకుంటాడు,

ఇశ్రాయేలు చిగిర్చి పూతపూస్తాడు,+

వాళ్లు దేశాన్ని పంటతో నింపుతారు.+

 7 అతన్ని కొట్టే వ్యక్తి కొట్టినట్టుగా అతన్ని కొట్టాలా?

అతని ప్రజలు వధించబడి హతులైనట్టుగా అతన్ని చంపాలా?

 8 ఆమెను పంపించేసేటప్పుడు నువ్వు గట్టిగా అరిచి ఆమెతో పోరాడతావు.

తూర్పు గాలి వీచే రోజున ఆయన తీవ్రమైన కోపంతో ఆమెను వెళ్లగొడతాడు.+

 9 యాకోబు దోషానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం జరుగుతుంది,+

అతని పాపం తీసేయబడినప్పుడు అతనికి దక్కే పూర్తి ప్రతిఫలం ఇదే:

ఆయన, బలిపీఠం రాళ్లన్నిటినీ

నలగ్గొట్టిన సున్నపురాళ్లలా చేస్తాడు,

పూజా కర్రలు,* ధూపస్తంభాలు ఏవీ మిగలవు.

10 ఎందుకంటే, బలమైన ప్రాకారాలుగల నగరం నిర్జనమైపోతుంది;

పచ్చికబయళ్లు ఎడారిలా వదిలేయబడతాయి, విడిచిపెట్టబడతాయి.+

అక్కడే దూడ మేత మేసి పడుకుంటుంది,

దాని కొమ్మల్ని తినేస్తుంది.+

11 దాని చిగుర్లు ఎండిపోయినప్పుడు

స్త్రీలు వచ్చి వాటిని విరిచేసి,

వాటితో నిప్పు అంటిస్తారు.

ఎందుకంటే ఈ ప్రజలకు అవగాహన లేదు.+

అందుకే వాళ్ల సృష్టికర్త వాళ్లమీద కరుణ చూపించడు,

వాళ్లను రూపొందించిన దేవుడు వాళ్లమీద అనుగ్రహం చూపించడు.+

12 ఇశ్రాయేలు ప్రజలారా, ఆ రోజు యెహోవా, ప్రవహించే నదీ* కాలువ నుండి ఐగుప్తు వాగు*+ వరకు ఉన్న పండ్లను రాలగొడతాడు, ఒక్కో పండును ఏరి సమకూర్చినట్టు మిమ్మల్ని సమకూరుస్తాడు.+ 13 ఆ రోజు గొప్ప బూర* ఊదబడుతుంది;+ అష్షూరు దేశంలో నశించిపోతున్నవాళ్లు,+ ఐగుప్తు దేశంలో చెదిరిపోయినవాళ్లు+ యెరూషలేములోని పవిత్ర పర్వతం దగ్గరికి వచ్చి యెహోవాకు వంగి నమస్కారం చేస్తారు.+

28 ఎఫ్రాయిము+ తాగుబోతుల ఆడంబరమైన* కిరీటానికి* శ్రమ!

వాడిపోతున్న పువ్వు లాంటి దాని మహిమాన్విత సౌందర్యానికి శ్రమ!

అది, ద్రాక్షారసం మత్తులో ఉన్నవాళ్లు నివసించే సారవంతమైన లోయ తలమీద ఉంది.

 2 ఇదిగో! శక్తిమంతుడూ బలవంతుడూ అయిన ఒక వ్యక్తి యెహోవాకు ఉన్నాడు.

ఉరిమే వడగండ్ల వానలా, నాశనకరమైన గాలివానలా,

శక్తివంతమైన ప్రవాహాలతో కూడిన ఉరుముల తుఫానులా

ఆయన దాన్ని బలంగా భూమ్మీదికి విసిరేస్తాడు.

 3 ఎఫ్రాయిము తాగుబోతుల ఆడంబరమైన* కిరీటాలు

కాళ్ల కింద తొక్కబడతాయి.+

 4 సారవంతమైన లోయ తలమీద ఉన్న

వాడిపోతున్న పువ్వు లాంటి దాని మహిమాన్విత సౌందర్యం

వేసవికాలం రాకముందే కాసిన తొలి అంజూర పండులా ఉంటుంది.

ఎవరైనా దాన్ని చూస్తే, వెంటనే దాన్ని తెంపి మింగేస్తారు.

5 ఆ రోజు సైన్యాలకు అధిపతైన యెహోవా తన ప్రజల్లో మిగిలినవాళ్లకు+ మహిమాన్విత కిరీటం, అందమైన పూలదండ అవుతాడు. 6 న్యాయం తీర్చడానికి కూర్చున్నవాళ్లకు న్యాయం గురించిన అవగాహనను, నగర ద్వారం దగ్గర దాడిని ఎదిరించేవాళ్లకు బలాన్ని ఇస్తాడు.+

 7 వీళ్లు కూడా ద్రాక్షారసం వల్ల పక్కదారి పడుతున్నారు;

వాళ్ల మత్తుపానీయాలు వాళ్లను తూలేలా చేస్తున్నాయి.

మద్యం వల్ల యాజకుడు, ప్రవక్త తప్పుదారి పడుతున్నారు;

ద్రాక్షారసం వాళ్లను అయోమయంలో పడేస్తోంది,

మద్యం తాగి వాళ్లు తూలుతున్నారు;

వాళ్ల దర్శనం వాళ్లను పక్కదారి పట్టిస్తోంది,

న్యాయం తీర్చే విషయంలో వాళ్లు తడబడుతున్నారు.+

 8 వాళ్ల బల్లలు అసహ్యమైన వాంతితో నిండిపోయాయి,

అది లేని చోటంటూ లేదు.

 9 ఎవరికి జ్ఞానం నేర్పిస్తారు?

ఎవరికి సందేశాన్ని వివరిస్తారు?

అప్పుడే పాలు మానేసిన వాళ్లకా?

అప్పుడే చన్ను విడిచిన వాళ్లకా?

10 ఎందుకంటే అతని మాటలు వాళ్లకు, “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,

నియమం వెంట నియమం, నియమం వెంట నియమం,*+

కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ” అన్నట్టు ఉన్నాయి.

11 కాబట్టి ఆయన ఈ ప్రజలతో నత్తివాళ్ల ద్వారా మాట్లాడతాడు, విదేశీ భాషలో మాట్లాడతాడు.+ 12 ఆయన ఒకసారి వాళ్లతో ఇలా అన్నాడు: “ఇదే విశ్రాంతి స్థలం. అలసిపోయిన వ్యక్తిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇదే సేదదీరే చోటు.” కానీ వాళ్లు వినలేదు.+ 13 కాబట్టి వాళ్ల విషయంలో యెహోవా మాట ఏమిటంటే:

“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,

నియమం వెంట నియమం, నియమం వెంట నియమం,*+

కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ.”

దానివల్ల, వాళ్లు నడుస్తున్నప్పుడు

తడబడి, వెనక్కి పడిపోయి,

గాయపడి, ఉచ్చులో చిక్కుకొని, పట్టబడతారు.+

14 కాబట్టి యెరూషలేములోని ఈ ప్రజల పరిపాలకులారా,

గొప్పలు చెప్పుకుంటున్న మీరంతా యెహోవా మాట వినండి.

15 మీరు ఇలా చెప్పుకుంటున్నారు:

“మేము మరణంతో ఒప్పందం చేసుకున్నాం,+

సమాధితో* ఒడంబడిక చేసుకున్నాం.*

అకస్మాత్తుగా ప్రచండమైన ప్రవాహం దాటివెళ్లేటప్పుడు

అది మా దాకా రాదు;

ఎందుకంటే మేము అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్నాం,

మోసం కింద దాక్కున్నాం.”+

16 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో, నేను పరీక్షించబడిన ఒక రాయిని సీయోనులో పునాదిగా వేస్తాను,+

సుస్థిరమైన పునాదికి+ అది అమూల్యమైన మూలరాయి.+

దానిమీద విశ్వాసం చూపించే వాళ్లెవరూ కంగారుపడరు.+

17 నేను న్యాయాన్ని కొలనూలుగా,+

నీతిని లంబసూత్రంగా* చేస్తాను.+

వడగండ్లు అబద్ధాల ఆశ్రయాన్ని తుడిచిపెట్టేస్తాయి,

దాక్కునే చోటు నీళ్ల ప్రవాహంలో కొట్టుకుపోతుంది.

18 మరణంతో మీరు చేసుకున్న ఒప్పందం రద్దౌతుంది,

సమాధితో* మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు.+

అకస్మాత్తుగా ప్రచండమైన ప్రవాహం దాటివెళ్లినప్పుడు

దానివల్ల మీరు చితికిపోతారు.

19 అది దాటివెళ్లిన ప్రతీసారి

మిమ్మల్ని ఊడ్చేస్తుంది;+

ఎందుకంటే, ప్రతీ ఉదయం అది దాటివెళ్తుంది,

పగలూ రాత్రీ ప్రవహిస్తుంది.

విపరీతమైన భయం వల్ల మాత్రమే వాళ్లు తాము విన్నదాన్ని గ్రహిస్తారు.”*

20 చాచుకొని పడుకోవడానికి పరుపు పొడవు సరిపోదు,

చుట్టుకొని పడుకోవడానికి దుప్పటి వెడల్పు సరిపోదు.

21 ఎందుకంటే యెహోవా పెరాజీము కొండ మీద లేచినట్టు లేస్తాడు;

గిబియోను దగ్గరున్న లోయలో రేపుకున్నట్టు తనను తాను రేపుకుంటాడు,+

తన కార్యాన్ని, అంటే తన వింతైన కార్యాన్ని చేయడానికి

తన పనిని, అంటే అసాధారణమైన తన పనిని నెరవేర్చడానికి+ అలా లేస్తాడు.

22 కాబట్టి మీ కట్లు ఇంకా గట్టిగా బిగించబడకుండా ఉండేలా

అపహాస్యం చేయకండి,+

ఎందుకంటే దేశమంతా* సమూలంగా నాశనమవ్వాలని నిర్ణయించబడినట్టు+

నేను సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా దగ్గర విన్నాను.

23 నేను చెప్పేది చెవిపెట్టి వినండి;

నా మాటలు శ్రద్ధగా ఆలకించండి.

24 దున్నేవాడు అసలు విత్తనాలే విత్తకుండా రోజంతా దున్నుతూ ఉంటాడా?

అస్తమానం నేలను చీలుస్తూ, దాన్ని గుల్ల చేస్తూ ఉంటాడా?+

25 అతను నేలను చదును చేయగానే

నల్ల జీలకర్రను, జీలకర్రను చల్లడా?

గోధుమల్ని, సజ్జల్ని, బార్లీ గింజల్ని వాటివాటి స్థలాల్లో నాటడా?

అంచుల చుట్టూ పొడుగు గోధుమల్ని*+ వేయడా?

26 ఎందుకంటే దేవుడే అతనికి సరైన మార్గం బోధిస్తాడు;*

అతని దేవుడే అతనికి ఉపదేశమిస్తాడు.+

27 నూర్చే పనిముట్టుతో+ నల్ల జీలకర్రను నూర్చరు,

జీలకర్ర మీదికి బండి చక్రాన్ని ఎక్కించరు.

బదులుగా నల్ల జీలకర్రను కట్టెతో,

జీలకర్రను చువ్వతో దుళ్లగొడతారు.

28 ఒక వ్యక్తి రొట్టె కోసం ధాన్యాన్ని నలగ్గొడతాడా?

లేదు, అతను అదేపనిగా దాన్ని నూర్చడు.+

అతను తన గుర్రాలతో తన బండి చక్రాన్ని దానిమీద నడిపినప్పుడు

అతను దాన్ని నలగ్గొట్టడు.+

29 ఇది కూడా సైన్యాలకు అధిపతైన యెహోవా వల్లే కలుగుతుంది,

ఆయన ఆలోచన* అద్భుతంగా ఉంటుంది,

ఆయన సాధించేవి గొప్పగా ఉంటాయి.*+

29 “అరీయేలుకు* శ్రమ, దావీదు డేరాలు వేసుకున్న అరీయేలు నగరానికి+ శ్రమ!

సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి;

వార్షిక పండుగల్ని+ జరుపుకుంటూ ఉండండి.

 2 అయితే నేను అరీయేలు మీదికి కష్టాలు తీసుకొస్తాను,+

దానిలో దుఃఖం, ప్రలాపం ఉంటాయి,+

అది నాకు దేవుని బలిపీఠపు కొలిమిలా తయారౌతుంది.+

 3 నేను అన్నివైపులా డేరాలు వేసి నిన్ను చుట్టుముడతాను,

కర్రలతో నీ చుట్టూ కోట కట్టి

ముట్టడిగోడలు నిలబెడతాను.+

 4 నువ్వు అణచివేయబడతావు;

నేల నుండి మాట్లాడతావు,

నీ మాటలు ధూళిలో నుండి మెల్లగా వినిపిస్తాయి.

చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్ల స్వరంలా

నీ స్వరం నేల నుండి వినిపిస్తుంది,+

నీ మాటలు ధూళిలో నుండి కిచకిచలాడినట్టు వినిపిస్తాయి.

 5 నీ శత్రువుల* సమూహం సన్నని ధూళిలా ఉంటుంది,+

ఆ నిరంకుశ పాలకుల సమూహం ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది.+

అదంతా ఒక్కసారిగా, అకస్మాత్తుగా జరుగుతుంది.+

 6 సైన్యాలకు అధిపతైన యెహోవా నీ మీద దృష్టి పెడతాడు;

ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో,

సుడిగాలితో, తుఫానుతో, దహించే అగ్ని జ్వాలలతో నీ మీద దృష్టి పెడతాడు.”+

 7 అప్పుడు అరీయేలు మీద యుద్ధం చేసే దేశాలన్నిటి సమూహం+

అంటే, దానితో యుద్ధం చేసేవాళ్లంతా,

దాని చుట్టూ ఉన్న ముట్టడి బురుజులు,

దానిమీదికి కష్టాలు తీసుకొచ్చే వాళ్లు

ఒక కలలా, రాత్రి కలిగే దర్శనంలా అవుతారు.

 8 అవును, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆకలిగా ఉన్న వ్యక్తి భోజనం చేస్తున్నట్టు కలగంటాడు,

కానీ లేచినప్పుడు ఇంకా ఆకలిగానే ఉంటాడు,

దాహంగా ఉన్న వ్యక్తి నీళ్లు తాగుతున్నట్టు కలగంటాడు,

కానీ లేచినప్పుడు ఇంకా నీరసంగానే, దాహంగానే ఉంటాడు.

సీయోను పర్వతంతో యుద్ధం చేసే

దేశాలన్నిటి సమూహం విషయంలో కూడా అలాగే జరుగుతుంది.+

 9 అవాక్కవ్వండి, ఆశ్చర్యపోండి;+

మిమ్మల్ని మీరు గుడ్డివాళ్లుగా చేసుకోండి, అంధులవ్వండి.+

వాళ్లు మత్తుగా ఉన్నారు, కానీ ద్రాక్షారసం వల్ల కాదు;

వాళ్లు తూలుతున్నారు, కానీ మద్యం వల్ల కాదు.

10 ఎందుకంటే యెహోవా మీకు గాఢనిద్ర కలగజేశాడు;+

మీ కళ్లకు, అంటే ప్రవక్తలకు గుడ్డితనం కలగజేశాడు,+

మీ తలలకు, అంటే దర్శనాలు చూసేవాళ్లకు ముసుగు వేశాడు.+

11 ప్రతీ దర్శనం మీకొక ముద్రవేసిన గ్రంథంలా+ తయారౌతుంది. ఎవరైనా దాన్ని ఒక చదువువచ్చిన వ్యక్తికి ఇచ్చి, “దయచేసి దీన్ని బయటికి చదువు” అని అంటే, అతను “ఇది నేను చదవలేను, ఎందుకంటే దీనికి ముద్రవేసి ఉంది” అంటాడు. 12 వాళ్లు దాన్ని చదువురాని ఒక వ్యక్తికి ఇచ్చి, “దయచేసి దీన్ని చదువు” అని అంటే, అతను “నాకసలు చదవడమే రాదు” అంటాడు.

13 యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రజలు నా దగ్గరికి వస్తామని నోటితో చెప్తున్నారు,

పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,+

కానీ వీళ్ల హృదయం నాకు చాలా దూరంగా ఉంది;

వీళ్లు కేవలం తాము నేర్చుకున్న మనుషుల ఆజ్ఞల్ని బట్టి నాకు భయపడుతున్నారు.+

14 కాబట్టి ఈ ప్రజల విషయంలో నేనే మళ్లీ అద్భుతమైన పనులు చేస్తాను,+

ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన పనులు చేస్తూనే ఉంటాను;

వీళ్ల జ్ఞానుల తెలివి నశించిపోతుంది,

వీళ్లలోని బుద్ధిగల వాళ్ల అవగాహన కనుమరుగైపోతుంది.”+

15 యెహోవా నుండి తమ పథకాలు* దాచడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లకు శ్రమ.+

వాళ్లు చీకటి స్థలంలో తమ పనులు చేస్తూ,

“మమ్మల్ని ఎవరు చూస్తారు?

మా గురించి ఎవరికి తెలుసు?” అని చెప్పుకుంటున్నారు.+

16 మీరెంత వంకరగా ఆలోచిస్తున్నారు!*

కుమ్మరిని, బంకమట్టిని ఒకేలా చూడొచ్చా?+

చేయబడిన వస్తువు తనను చేసిన వ్యక్తి గురించి

“ఇతను నన్ను చేయలేదు” అనొచ్చా?+

రూపించబడిన వస్తువు తన రూపకర్త గురించి

“ఇతనికి ఏమీ తెలీదు” అని అంటుందా?+

17 కొద్ది సమయంలోనే లెబానోను ఒక పండ్ల తోటలా తయారౌతుంది,+

ఆ పండ్ల తోట అడవిగా ఎంచబడుతుంది.+

18 ఆ రోజు, చెవిటివాళ్లు ఆ గ్రంథంలోని మాటలు వింటారు,

గుడ్డివాళ్ల కళ్లు చీకట్లో నుండి, అంధకారంలో నుండి చూస్తాయి.+

19 సాత్వికులు యెహోవాను బట్టి ఎంతో సంతోషిస్తారు,

పేదవాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి బట్టి చాలా ఆనందిస్తారు.+

20 ఎందుకంటే నిరంకుశ పాలకుడు ఇక ఉండడు,

గొప్పలు చెప్పుకున్న వ్యక్తి అంతమైపోతాడు,

హానిచేయాలని కాచుకొని కూర్చున్న వాళ్లంతా నాశనం చేయబడతారు,+

21 అబద్ధాలతో ఇతరుల్ని దోషులుగా చేసేవాళ్లు,

నగర ద్వారం దగ్గర గద్దించే* వ్యక్తి కోసం ఉచ్చు పన్నేవాళ్లు,+

అర్థంపర్థంలేని వాదనలతో నీతిమంతుడికి న్యాయం జరగకుండా చేసేవాళ్లు+ లేకుండా పోతారు.

22 కాబట్టి, అబ్రాహామును+ విడిపించిన యెహోవా యాకోబు ఇంటివాళ్లతో ఇలా అంటున్నాడు:

“ఇక మీదట యాకోబు సిగ్గుపడడు,

అతని ముఖం ఇక ఎంతమాత్రం పాలిపోదు.*+

23 ఎందుకంటే, అతను నా చేతిపనైన తన పిల్లల్ని

తన మధ్య చూసినప్పుడు,+

వాళ్లు నా పేరును పవిత్రపరుస్తారు;

అవును, యాకోబు పవిత్ర దేవుణ్ణి వాళ్లు పవిత్రపరుస్తారు,

ఇశ్రాయేలు దేవుణ్ణి బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనౌతారు.+

24 ఆలోచన పక్కదారి పట్టినవాళ్లు అవగాహనను పొందుతారు,

ఫిర్యాదు చేసేవాళ్లు ఉపదేశాన్ని స్వీకరిస్తారు.”

30 యెహోవా ఇలా అంటున్నాడు: “లోబడని మొండి పిల్లలకు+ శ్రమ,

వాళ్లు నావి కాని ఉద్దేశాల్ని నెరవేరుస్తున్నారు,+

నా ఇష్టానికి విరుద్ధంగా దేశాలతో సంధి చేసుకుంటున్నారు,*

అలా వాళ్లు పాపం మీద పాపం మూటగట్టుకుంటున్నారు.

 2 నన్ను సంప్రదించకుండా+ వాళ్లు ఐగుప్తుకు వెళ్తున్నారు,+

ఫరో సంరక్షణలో ఉండడానికి,

ఐగుప్తు నీడలో ఆశ్రయం పొందడానికి వాళ్లు వెళ్తున్నారు!

 3 అయితే ఫరో సంరక్షణలో ఉండడం వల్ల మీరు సిగ్గుపడాల్సి వస్తుంది,

ఐగుప్తు నీడలో ఆశ్రయం పొందడం వల్ల మీరు అవమానాలపాలు అవుతారు.+

 4 అతని అధిపతులు సోయనులో+ ఉన్నారు,

అతని ప్రతినిధులు హానేసుకు చేరుకున్నారు.

 5 తమకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేని ప్రజల వల్ల,

సిగ్గు, అవమానం తీసుకురావడం తప్ప సహాయం గానీ, మేలు గానీ చేయలేని ప్రజల వల్ల

వాళ్లంతా సిగ్గుపడతారు.”+

 6 దక్షిణాన ఉన్న మృగాల గురించిన సందేశం:

కష్టాలూ కన్నీళ్లతో నిండిన దేశం గుండా,

అంటే సింహం, గర్జించే సింహం నివసించే దేశం గుండా,

విషసర్పం, మంటపుట్టించే విషమున్న ఎగిరే సర్పం* నివసించే దేశం గుండా వెళ్తూ

గాడిదల మీద వాళ్లు తమ సంపదను,

ఒంటెల వీపుల మీద తమ సామాన్లను మోసుకెళ్తున్నారు.

కానీ అవి ప్రజలకు ఉపయోగపడవు.

 7 ఎందుకంటే ఐగుప్తు సహాయం దేనికీ పనికిరాదు.+

అందుకే నేను దాన్ని “ఏమీ చేయకుండా కూర్చున్న రాహాబు”*+ అని పిలిచాను.

 8 “ఇప్పుడు నువ్వు వెళ్లి, వాళ్ల సమక్షంలో ఈ విషయాన్ని పలక మీద చెక్కు,

పుస్తకంలో దాన్ని రాయి,+

అలా అది భవిష్యత్తులో ఏదో ఒక రోజు

శాశ్వతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది.+

 9 ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు,+ మోసం చేసే పిల్లలు,+

వాళ్లు యెహోవా ధర్మశాస్త్రాన్ని* వినడానికి ఇష్టపడరు.+

10 వాళ్లు దీర్ఘదర్శులతో ‘చూడొద్దు’ అని అంటారు.

దర్శనాలు చూసేవాళ్లతో వాళ్లిలా అంటారు: ‘నిజమైన దర్శనాల గురించి మాకు చెప్పకండి.+

మాకు నచ్చేవాటినే మాకు చెప్పండి; మోసపూరితమైన మాయా దర్శనాలు చూడండి.+

11 దారిలో నుండి పక్కకు తప్పుకోండి; వేరే దారిలో వెళ్లండి.

ఇశ్రాయేలు పవిత్ర దేవుని గురించి మాతో మాట్లాడడం మానేయండి.’ ”+

12 అందుకే ఇశ్రాయేలు పవిత్ర దేవుడు ఇలా అంటున్నాడు:

“మీరు ఈ మాటను తిరస్కరించి+

వంచనను, మోసాన్ని నమ్ముకుంటున్నారు,

వాటి మీద ఆధారపడుతున్నారు;+

13 కాబట్టి ఈ తప్పు మీకు పగిలిన గోడలా,

ఉబ్బిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎత్తైన గోడలా తయారౌతుంది.

అది అకస్మాత్తుగా, ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది.

14 కుమ్మరివాడి పెద్ద కుండ పగలగొట్టబడినట్టు అది పగలగొట్టబడుతుంది,

అది ఎంతగా నలగ్గొట్టబడుతుందంటే,

పొయ్యిలో నుండి నిప్పులు లాగడానికి గానీ

గుంటలో* నుండి నీళ్లు తీసుకోవడానికి గానీ ఒక్క పెంకు కూడా మిగలదు.”

15 ఎందుకంటే సర్వోన్నత ప్రభువూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“నా దగ్గరికి తిరిగొచ్చి విశ్రాంతి తీసుకుంటే మీరు రక్షించబడతారు;

మీరు కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”+

కానీ అది మీకు నచ్చలేదు.+

16 మీరు, “అలా కాదు, మేము గుర్రాల మీద పారిపోతాం!” అన్నారు.

కాబట్టి నిజంగానే మీరు పారిపోతారు.

“వేగంగా పరుగెత్తే గుర్రాలమీద మేము వెళ్లిపోతాం!” అని మీరు అన్నారు.+

కాబట్టి తరిమేవాళ్లు మిమ్మల్ని వేగంగా తరుముతారు.+

17 ఒక్క వ్యక్తి బెదిరిస్తే మీలో వెయ్యిమంది వణికిపోతారు;+

ఐదుగురు బెదిరిస్తే మీరంతా పారిపోతారు.

మీలో మిగిలినవాళ్లు పర్వత శిఖరం మీద ఉన్న స్తంభంలా,

కొండ మీదున్న ధ్వజస్తంభంలా అయ్యేవరకు అలా జరుగుతుంది.+

18 అయితే మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు,*+

మీ మీద కరుణ చూపించడానికి ఆయన లేస్తాడు.+

ఎందుకంటే యెహోవా న్యాయవంతుడైన దేవుడు.+

ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నవాళ్లంతా* సంతోషంగా ఉంటారు.+

19 ప్రజలు సీయోనులో, అంటే యెరూషలేములో నివసించినప్పుడు+ నువ్వు అస్సలు ఏడ్వవు.+ సహాయం కోసం నువ్వు పెట్టే మొర వినబడగానే ఆయన తప్పకుండా నీ మీద అనుగ్రహం చూపిస్తాడు; నీ మొర విన్న వెంటనే నీకు జవాబిస్తాడు.+ 20 యెహోవా నీకు కష్టాల రూపంలో రొట్టెను, అణచివేత రూపంలో నీళ్లను ఇచ్చినా,+ నీ మహాగొప్ప ఉపదేశకుడు ఇకమీదట దాక్కోడు, నువ్వు కళ్లారా నీ మహాగొప్ప ఉపదేశకుణ్ణి చూస్తావు.+ 21 నువ్వు కుడివైపు గానీ ఎడమవైపు గానీ తిరిగితే,+ “ఇదే దారి.+ ఇందులో నడువు” అని నీ వెనక నుండి ఒక శబ్దం రావడం నీ చెవులారా వింటావు.

22 నీ చెక్కుడు విగ్రహాల మీది వెండి రేకును, నీ పోత* విగ్రహాల మీది బంగారు పూతను నువ్వు అపవిత్రపరుస్తావు.+ వాటిని మైలగుడ్డలా* పారేసి, “పొండి!” అని అంటావు.*+ 23 నువ్వు నేలలో విత్తే విత్తనాల కోసం ఆయన వర్షం కురిపిస్తాడు,+ అప్పుడు నేల నుండి శ్రేష్ఠమైన ఆహారం సమృద్ధిగా పండుతుంది.+ ఆ రోజు నీ పశువులు, మందలు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేత మేస్తాయి.+ 24 నేలను దున్నే పశువులు-గాడిదలు, పారతో పంగలకర్రతో చెరిగి పుల్లటి ఆకుకూరలతో కలిపిన మేతను మేస్తాయి. 25 గొప్ప వధ జరిగే రోజున బురుజులు కూలిపోయినప్పుడు ఎత్తైన ప్రతీ పర్వతం మీద, ఎత్తుగా ఉన్న ప్రతీ కొండ మీద వాగులు, కాలువలు పారతాయి.+ 26 యెహోవా తన ప్రజల విరిగిన ఎముకలకు కట్టుకట్టి, తాను కొట్టడం వల్ల ఏర్పడిన గాయాన్ని మాన్పే+ రోజున నిండు చంద్రుడి వెలుగు సూర్యుడి వెలుగులా ఉంటుంది; సూర్యుడి వెలుగు ఏడంతలు పెరుగుతుంది,+ అది ఏడురోజుల వెలుగులా ఉంటుంది.

27 ఇదిగో! దూరం నుండి యెహోవా వస్తున్నాడు,*

మండే కోపంతో, దట్టమైన మేఘాలతో ఆయన వస్తున్నాడు.

ఆయన పెదాలు ఉగ్రతతో నిండిపోయాయి,

ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.+

28 ఆయన శ్వాస* మెడ లోతు వరకు ప్రవహించే వాగులా ఉంది,

అది నాశనమనే జల్లెడలో* దేశాల్ని జల్లెడపడుతుంది.

జనాల్ని తప్పుదారి పట్టించే ఒక కళ్లెం వాళ్ల దవడలకు ఉంటుంది.+

29 నీ పాట, పండుగ+ కోసం సిద్ధపడుతున్నప్పుడు*

రాత్రిపూట పాడే పాటలా ఉంటుంది;

నీ హృదయం, పిల్లనగ్రోవి ఊదుతూ*

యెహోవా పర్వతానికి, అంటే ఇశ్రాయేలు ఆశ్రయదుర్గం*+ దగ్గరికి

వెళ్లే వ్యక్తి సంతోషించినట్టు సంతోషిస్తుంది.

30 యెహోవా గంభీరమైన తన స్వరాన్ని+ వినిపిస్తాడు,

దహించే అగ్ని జ్వాలతో,+

కుండపోత వర్షంతో,+ ఉరుముల తుఫానుతో, వడగండ్లతో+

కోపాగ్నితో దిగివస్తున్న తన బాహువును+ ఆయన వెల్లడిచేస్తాడు.

31 యెహోవా స్వరం విని అష్షూరు భయంతో హడలిపోతుంది;+

ఆయన కర్రతో దాన్ని కొడతాడు.+

32 యెహోవా అష్షూరును శిక్షించడానికి

దానిమీదికి తన కర్రను ఎత్తిన ప్రతీసారి,

యుద్ధంలో ఆయన వాళ్ల మీద తన బాహువును ఆడిస్తుండగా+

కంజీరల* నాదం, వీణల*+ నాదం వినిపిస్తాయి.

33 ఎందుకంటే అతని తోఫెతు*+ ఇప్పటికే సిద్ధంగా ఉంది;

అది రాజు కోసం కూడా సిద్ధం చేయబడింది.+

ఆయన ఆ చోటును విశాలంగా, లోతుగా చేశాడు;

దానిలో మంటలు, కట్టెలు సమృద్ధిగా ఉన్నాయి.

గంధకపు వాగులా యెహోవా శ్వాస

దానికి నిప్పు అంటిస్తుంది.

31 సహాయం కోసం ఐగుప్తుకు వెళ్లేవాళ్లకు+ శ్రమ!

వాళ్లు గుర్రాల మీద ఆధారపడుతున్నారు,+

చాలా ఉన్నాయని యుద్ధ రథాల్ని,

బలంగా ఉన్నాయని యుద్ధ అశ్వాల్ని* నమ్ముకుంటున్నారు.

కానీ వాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుని వైపు చూడట్లేదు,

యెహోవా కోసం వెదకట్లేదు.

 2 అయితే, ఆయన కూడా తెలివిగలవాడే,

ఆయన తప్పకుండా విపత్తు తీసుకొస్తాడు, తన మాటల్ని వెనక్కి తీసుకోడు.

దుష్టుల ఇంటి మీదికి,

తప్పుచేసేవాళ్లకు సహకరించే వాళ్ల మీదికి ఆయన లేస్తాడు.+

 3 అయినా ఐగుప్తీయులు మామూలు మనుషులే, వాళ్లు దేవుడు కాదు;

వాళ్ల గుర్రాలు మామూలు జంతువులే, అవి అదృశ్య శక్తులు కావు.+

యెహోవా తన చెయ్యి చాపినప్పుడు,

సహాయం చేసే వ్యక్తి తడబడతాడు,

సహాయం పొందిన వ్యక్తి పడిపోతాడు;

వాళ్లంతా ఒకేసారి నాశనమౌతారు.

 4 ఎందుకంటే యెహోవా నాతో ఇలా చెప్పాడు:

“జంతువు తనకు చిక్కినప్పుడు సింహం గర్జించినట్టు, బలమైన కొదమ సింహం గుర్రుమన్నట్టు,

దాన్ని వెళ్లగొట్టడానికి కాపరులందర్నీ పిలిచినప్పుడు

వాళ్ల శబ్దానికి భయపడకుండా,

ఆ కోలాహలానికి బెదిరిపోకుండా అది గుర్రుమన్నట్టు

సైన్యాలకు అధిపతైన యెహోవా యుద్ధం చేయడానికి

సీయోను పర్వతం మీదికి, దాని కొండ మీదికి దిగివస్తాడు.

 5 అకస్మాత్తుగా దూసుకొచ్చే పక్షిలా సైన్యాలకు అధిపతైన యెహోవా వేగంగా వచ్చి యెరూషలేమును కాపాడతాడు.+

ఆయన దాన్ని కాపాడతాడు, రక్షిస్తాడు.

దాన్ని దాటివెళ్తూ దాన్ని తప్పిస్తాడు.”

6 “ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎవరిమీదైతే ఘోరంగా తిరుగుబాటు చేశారో ఆయన దగ్గరికి తిరిగిరండి.+ 7 ఆ రోజు ప్రతీ వ్యక్తి వెండితో చేయబడిన తన వ్యర్థమైన దేవుళ్లను, బంగారంతో చేయబడిన తన విలువలేని దేవుళ్లను తిరస్కరిస్తాడు; ఆ దేవుళ్లను మీరే స్వయంగా మీ చేతులతో చేసుకొని పాపం మూటగట్టుకున్నారు.

 8 అష్షూరీయులు ఖడ్గంతో చంపబడతారు, కానీ అది మనిషి ఖడ్గం కాదు;

మనుషులది కాని ఖడ్గం వాళ్లను మింగేస్తుంది.+

ఖడ్గాన్ని చూసి వాళ్లు పారిపోతారు,

వాళ్ల యువకులు బానిసలౌతారు.

 9 విపరీతమైన భయం వల్ల అతని ఆశ్రయదుర్గం* నాశనమైపోతుంది,

ధ్వజస్తంభాన్ని చూసి అతని అధిపతులు భయంతో వణికిపోతారు” అని యెహోవా అంటున్నాడు.

ఆయన నిప్పు సీయోనులో, ఆయన కొలిమి యెరూషలేములో ఉన్నాయి.

32 ఇదిగో! రాజు+ నీతి కోసం* రాజ్యపాలన చేస్తాడు,+

అధిపతులు న్యాయం కోసం* పరిపాలన చేస్తారు.

 2 ప్రతీ ఒక్కరు గాలికి చాటైన చోటులా,*

తుఫాను నుండి దాక్కునే చోటులా,*

నీళ్లులేని దేశంలో నీళ్ల కాలువలా,+

ఎండిపోయిన దేశంలో పెద్ద బండ నీడలా ఉంటారు.

 3 అప్పుడు, చూసేవాళ్ల కళ్లు మూయబడవు,

వినేవాళ్ల చెవులు శ్రద్ధగా ఆలకిస్తాయి.

 4 తొందరపాటు పనులు చేసేవాళ్ల హృదయం జ్ఞానయుక్తమైన విషయాల గురించి ఆలోచిస్తుంది,

నత్తివాళ్ల నాలుక తడబడకుండా స్పష్టంగా మాట్లాడుతుంది.+

 5 తెలివిలేని వాణ్ణి ఇక ఎంతమాత్రం ఉదారస్వభావి అని పిలవరు,

నీతినియమాల్లేని వాణ్ణి గొప్పవాడని అనరు.

 6 ఎందుకంటే తెలివిలేనివాడు అర్థంపర్థంలేని మాటలు మాట్లాడతాడు,

అతని హృదయం హానిచేయాలని కుట్ర పన్నుతుంది;+

భక్తిహీనంగా ప్రవర్తించడానికి,* యెహోవా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడానికి,

ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం దొరకకుండా చేయడానికి,

దాహంగా ఉన్నవాళ్లకు నీళ్లు దొరకకుండా చేయడానికి అతను పథకాలు వేస్తాడు.

 7 నీతినియమాలు లేనివాడి విధానాలు చెడ్డవి;+

పేదవాళ్లు చెప్పేది సరిగ్గా ఉన్నాసరే,

కష్టాల్లో ఉన్నవాళ్లను అబద్ధాలతో నాశనం చేయడానికి+

అతను అవమానకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తాడు.

 8 అయితే ఉదారస్వభావి ఉద్దేశాలు ఉదారంగా ఉంటాయి,

అతను పట్టుదలతో ఉదారమైన* పనులు చేస్తూ ఉంటాడు.

 9 “చీకూచింతా లేని స్త్రీలారా, లేచి నా స్వరం వినండి!

నిశ్చింతగా ఉన్న కూతుళ్లారా,+ నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించండి!

10 నిశ్చింతగా ఉన్న మీరు ఒక్క సంవత్సరం గడవగానే వణికిపోతారు,

ఎందుకంటే, ద్రాక్ష కోత ముగిసేసరికి ఒక్క ద్రాక్షపండు కూడా సమకూర్చబడదు.+

11 చీకూచింతా లేని స్త్రీలారా, వణకండి!

నిశ్చింతగా ఉన్నవాళ్లారా, ఊగిపోండి!

మీ బట్టలు తీసేసి*

నడుము చుట్టూ గోనెపట్ట కట్టుకోండి.+

12 రమ్యమైన పొలాల్ని బట్టి, బాగా పండే ద్రాక్షతీగల్ని బట్టి

దుఃఖంతో గుండెలు బాదుకోండి.

13 ఎందుకంటే నా ప్రజల నేల ముళ్లతో, ముళ్లపొదలతో కప్పబడుతుంది;

ఉల్లసించే ఇళ్లన్నిటినీ,

అవును, సంతోషంగా ఉండే నగరమంతటినీ+ అవి కప్పేస్తాయి.

14 ఎందుకంటే పటిష్ఠమైన బురుజు వదిలేయబడింది;

సందడిగా ఉండే నగరం విడిచిపెట్టబడింది.+

ఓపెలు,+ కావలిబురుజు ఎప్పటికీ పనికిరాని స్థలంగా తయారయ్యాయి,

అవి అడవి గాడిదలు సంతోషించే స్థలంగా,

మందలు మేత మేసే స్థలంగా మారిపోయాయి.+

15 పైనుండి మన మీద పవిత్రశక్తి కుమ్మరించబడి+

ఎడారి పండ్ల తోటలా మారేవరకు,

పండ్ల తోట అడవిలా మారేవరకు+ పరిస్థితి అలాగే ఉంటుంది.

16 అప్పుడు ఎడారిలో న్యాయం నివసిస్తుంది,

పండ్ల తోటలో నీతి నివసిస్తుంది.+

17 నిజమైన నీతి వల్ల శాంతి కలుగుతుంది,+

నిజమైన నీతికి ఫలం శాశ్వతమైన నెమ్మది, భద్రత.+

18 నా ప్రజలు ప్రశాంతమైన నివాస స్థలంలో,

సురక్షితమైన నివాసాల్లో, నెమ్మదిగల విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.+

19 అయితే వడగండ్లు అడవిని నేలమట్టం చేస్తాయి,

నగరం పూర్తిగా చదును చేయబడుతుంది.

20 చాలా నీళ్లున్న చోట విత్తనాలు విత్తే మీరు,

పొలంలో ఎద్దును, గాడిదను వదిలే+ మీరు సంతోషంగా ఉంటారు.”

33 నాశనం చేయబడని నాశకుడా,+

మోసగించబడని మోసగాడా, నీకు శ్రమ!

నువ్వు నాశనం చేయడం పూర్తికాగానే, నిన్ను నాశనం చేస్తారు.+

నువ్వు మోసం చేయడం పూర్తికాగానే, నిన్ను మోసం చేస్తారు.

 2 యెహోవా, మా మీద అనుగ్రహం చూపించు.+

నీ మీదే మేము ఆశపెట్టుకున్నాం.

ప్రతీ ఉదయం నువ్వు మా బలానివి* అవ్వు,+

అవును, కష్టకాలంలో మా రక్షణవి అవ్వు.+

 3 నీ గర్జన విని జనాలు పారిపోతాయి.

నువ్వు లేచినప్పుడు దేశాలు చెల్లాచెదురైపోతాయి.+

 4 తిండిబోతు మిడతలు పోగైనట్టుగా మీ దోపుడుసొమ్ము పోగుచేయబడుతుంది;

మిడతల దండ్లు వచ్చినట్టు ప్రజలు వేగంగా దాని మీదికి వస్తారు.

 5 యెహోవా హెచ్చించబడతాడు,

ఎందుకంటే ఆయన అత్యున్నత స్థలాల్లో నివసిస్తాడు.

ఆయన సీయోనును న్యాయంతో, నీతితో నింపుతాడు.

 6 నీ కాలాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది ఆయనే;

రక్షణను,+ తెలివిని, జ్ఞానాన్ని, యెహోవా పట్ల భయభక్తుల్ని+ సమృద్ధిగా ఇచ్చేది ఆయనే;

ఇదే అతని సంపద.*

 7 ఇదిగో! వాళ్ల శూరులు వీధుల్లో కేకలు వేస్తున్నారు;

శాంతి సందేశకులు బోరున ఏడుస్తున్నారు.

 8 రహదారులు నిర్మానుష్యం అయ్యాయి;

దారుల్లో ఎవరూ ప్రయాణించట్లేదు.

అతను* ఒప్పందాన్ని మీరాడు;

నగరాల్ని తృణీకరించాడు;

మనుషులంటే అతనికి లెక్కే లేదు.+

 9 దేశం దుఃఖిస్తూ* వాడిపోతోంది.

లెబానోను అవమానాలపాలైంది;+ అది కుళ్లిపోయింది.

షారోను ఎడారిలా మారింది,

బాషాను, కర్మెలు ఊగుతూ ఆకులు రాలుస్తున్నాయి.+

10 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇప్పుడు నేను లేస్తాను,

ఇప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటాను;+

ఇప్పుడు నన్ను నేను ఘనపర్చుకుంటాను.

11 మీరు ఎండుగడ్డిని గర్భం దాల్చి కొయ్యకాలును* కంటారు.

మీ మనోవైఖరే* అగ్నిలా మిమ్మల్ని దహించేస్తుంది.+

12 జనాలు కాలుతున్న సున్నంలా తయారౌతారు.

నరికేసిన ముళ్లలా వాళ్లు అగ్నితో కాల్చేయబడతారు.+

13 దూరంగా ఉన్న ప్రజలారా, నేను ఏం చేయబోతున్నానో వినండి!

దగ్గర్లో ఉన్న ప్రజలారా, నా బలాన్ని గుర్తించండి!

14 సీయోనులోని పాపులు భయపడుతున్నారు;+

మతభ్రష్టులు భయంతో వణికిపోతున్నారు.

‘దహించే అగ్ని ఉన్న చోట మనలో ఎవరు నివసించగలరు?+

ఆర్పలేని మంటలున్న చోట మనలో ఎవరు నివసించగలరు?’ అని వాళ్లు అనుకుంటున్నారు.

15 ఎప్పుడూ నీతిగా నడుచుకుంటూ,+

నిజాయితీగా మాట్లాడుతూ,+

అన్యాయం వల్ల, మోసం వల్ల వచ్చే లాభాన్ని తిరస్కరిస్తూ,

లంచం తీసుకోవడానికి చేతులు చాపకుండా ఉండే వ్యక్తి,+

రక్తపాతం గురించిన మాటలు వినకుండా తన చెవిని,

చెడును చూడకుండా తన కళ్లను మూసుకునే వ్యక్తి

16 ఎత్తైన స్థలాల్లో నివసిస్తాడు;

అతని సురక్షితమైన ఆశ్రయం* బలమైన రాతి కోటల్లో ఉంటుంది;

అతనికి ఆహారం దొరుకుతుంది,

అతని నీటి సరఫరా ఎప్పటికీ ఆగదు.”+

17 నీ కళ్లు మహిమాన్విత రాజును చూస్తాయి;

అవి సుదూరాన ఉన్న దేశాన్ని చూస్తాయి.

18 నీ హృదయం భయంకరమైన సంగతిని గుర్తుచేసుకుంటుంది:*

“కార్యదర్శి ఎక్కడ?

కప్పం కట్టేవాడు ఎక్కడ?+

బురుజుల్ని లెక్కపెట్టేవాడు ఎక్కడ?”

19 అహంకారులైన* ప్రజల్ని నువ్విక చూడవు,

వాళ్ల భాష గ్రహించలేనంత కష్టంగా* ఉంటుంది,

వాళ్ల నత్తి మాటలు నీకు అర్థంకావు.+

20 సీయోనును చూడండి, మన పండుగలకు నెలవైన నగరాన్ని+ చూడండి!

యెరూషలేము ప్రశాంతమైన నివాస స్థలంగా,

ఎప్పటికీ కదిలించబడని గుడారంలా+ ఉండడం నీ కళ్లు చూస్తాయి.

ఆ గుడారం మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు,

దాని తాళ్లలో ఒక్కటి కూడా ఎప్పటికీ తెంచేయబడదు.

21 మహిమాన్వితుడైన యెహోవా

అక్కడ మనకు నదులు, విశాలమైన కాలువలు పారే ప్రాంతంగా ఉంటాడు;

తెడ్ల ఓడల సమూహమేదీ అక్కడికి వెళ్లదు,

వైభవోపేతమైన ఓడలేవీ అటుగా వెళ్లవు.

22 ఎందుకంటే యెహోవా మన న్యాయమూర్తి,+

యెహోవా మన శాసనకర్త,+

యెహోవా మన రాజు;+

మనల్ని రక్షించేది ఆయనే.+

23 నీ శత్రువుల ఓడల తాళ్లు వదులుగా వేలాడతాయి;

అవి ఓడ కొయ్యను పట్టివుంచలేవు, దాని తెరచాపను విప్పలేవు.

ఆ సమయంలో విస్తారమైన దోపుడుసొమ్మును పంచుకుంటారు;

కుంటివాడు కూడా చాలా దోపుడుసొమ్ము తీసుకుంటాడు.+

24 అందులో నివసించే వాళ్లెవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు.+

అందులో నివసించే ప్రజల దోషం క్షమించబడుతుంది.+

34 దేశాల్లారా, దగ్గరికి వచ్చి వినండి,

జనాల్లారా, ఆలకించండి.

భూమి, అందులో ఉన్నవన్నీ,

అలాగే నేల, దానిలో పండేదంతా వినాలి.

 2 ఎందుకంటే దేశాలన్నిటి మీద యెహోవా కోపంగా ఉన్నాడు,+

వాటి సైన్యమంతటి మీద ఆయన చాలా కోపంగా ఉన్నాడు.+

ఆయన వాటిని సమూలంగా నాశనం చేస్తాడు;

ఆయన వాటిని వధకు అప్పగిస్తాడు.+

 3 వాళ్లలో హతులైన వాళ్లను విసిరిపారేస్తారు,

ఆ కళేబరాల కంపు పైకి లేస్తుంది;+

వాళ్ల రక్తంలో పర్వతాలు కరిగిపోతాయి.*+

 4 ఆకాశ సైన్యమంతా కుళ్లిపోతుంది,

గ్రంథపుచుట్ట చుట్టబడినట్టు ఆకాశం చుట్టబడుతుంది.

వాడిపోయిన ఆకు ద్రాక్షతీగ నుండి రాలినట్టు,

ముడుచుకుపోయిన అంజూర పండు అంజూర చెట్టు నుండి రాలిపడినట్టు

వాటి సైన్యమంతా వాడిపోయి రాలిపోతుంది.

 5 “ఎందుకంటే, ఆకాశంలో నా ఖడ్గం రక్తంతో తడిసిపోతుంది.+

అది న్యాయానికి అనుగుణంగా ఎదోము మీదికి,+

అంటే నేను సమూలంగా నాశనం చేయాలనుకున్న ప్రజల మీదికి దిగివస్తుంది.

 6 యెహోవాకు ఒక ఖడ్గం ఉంది; అది రక్తసిక్తమౌతుంది.

అది కొవ్వుతో కప్పబడుతుంది,+

మగ గొర్రెపిల్లల రక్తంతో, మేకల రక్తంతో తడిసిపోతుంది,

పొట్టేళ్ల మూత్రపిండాల మీది కొవ్వుతో అది కప్పబడుతుంది.

ఎందుకంటే బొస్రాలో యెహోవాకు ఒక బలి ఉంది,

ఎదోము దేశంలో గొప్ప వధ జరగబోతుంది.+

 7 వాటితో పాటు అడవి దున్నలు,

బలమైనవాటితో పాటు కోడెదూడలు కిందికి దిగుతాయి.

దేశం రక్తంతో తడిసి ముద్దౌతుంది,

దాని ధూళి కొవ్వులో నానుతుంది.”

 8 ఎందుకంటే, పగ తీర్చుకునే ఒక రోజు యెహోవాకు ఉంది,+

అది సీయోను తరఫున చట్టపరమైన వివాదం విషయంలో ప్రతీకారం చేసే సంవత్సరం.+

 9 దాని* కాలువలు కీలులా,

దాని మట్టి గంధకంలా,

దాని నేల మండుతున్న కీలులా తయారౌతుంది.

10 రాత్రైనా, పగలైనా అది ఆరిపోదు;

దాని పొగ ఎప్పటికీ పైకి లేస్తూనే ఉంటుంది.

తరతరాలపాటు అది పాడైన స్థితిలోనే ఉండిపోతుంది.

ఎవ్వరూ ఎన్నడూ దాని గుండా వెళ్లరు.+

11 గూడబాతు,* ముళ్లపంది దాన్ని ఆక్రమించుకుంటాయి,

పొడుగు చెవుల గుడ్లగూబలు, కాకులు దానిలో నివసిస్తాయి.

శూన్యం అనే కొలనూలుతో,

వ్యర్థత అనే లంబసూత్రంతో* ఆయన దాన్ని కొలుస్తాడు.

12 దాని ప్రముఖుల్లో ఎవ్వరూ రాజరికం కోసం పిలవబడరు,

దాని అధిపతులంతా లేకుండాపోతారు.

13 దాని పటిష్ఠమైన బురుజుల్లో ముళ్లు పెరుగుతాయి,

దాని కోటల్లో దురదగొండి మొక్కలు, ముళ్ల మొక్కలు పెరుగుతాయి.

అది నక్కలు నివసించే చోటుగా,+

నిప్పుకోళ్లకు నివాసంగా తయారౌతుంది.

14 ఎడారి ప్రాణులు, ఊల వేసే జంతువులు అక్కడ కలుసుకుంటాయి,

కొండమేక* తన జత కోసం అరుస్తుంది.

అవును, నిశాచర పక్షి అక్కడ స్థిరపడుతుంది, విశ్రాంతి స్థలం చూసుకుంటుంది.

15 ఎగిరే పాము అక్కడ గూడు కట్టి, గుడ్లు పెడుతుంది,

వాటిని పొదిగి, తన నీడలో వాటిని సమకూరుస్తుంది.

అవును, ప్రతీ గద్ద తన జతతో అక్కడికి చేరుతుంది.

16 యెహోవా గ్రంథంలో వెతికి, దాన్ని బిగ్గరగా బయటికి చదవండి.

వాటిలో ఒక్కటి కూడా లేకుండా పోదు;

వాటిలో ప్రతీ దానికి జత ఉంటుంది,

ఎందుకంటే యెహోవాయే స్వయంగా తన నోటితో ఆదేశించాడు,

ఆయన పవిత్రశక్తే* వాటిని సమకూర్చింది.

17 వాటికోసం చీటి* వేసింది ఆయనే,

వాటికి స్థలాన్ని కొలిచి నియమించింది* ఆయన చెయ్యే.

అది ఎప్పటికీ వాటి సొంతమౌతుంది;

తరతరాలపాటు ఎప్పటికీ అవి అందులోనే నివసిస్తాయి.

35 ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి,+

ఎడారి మైదానం సంతోషించి కుంకుమ* పువ్వులా వికసిస్తుంది.+

 2 అది తప్పకుండా వికసిస్తుంది;+

సంతోషంతో ఆనందంగా కేకలు వేస్తుంది.

లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,+

కర్మెలు,+ షారోనుల+ వైభవం దానికి ఉంటుంది.

యెహోవా మహిమను, మన దేవుని వైభవాన్ని వాళ్లు చూస్తారు.

 3 బలహీనంగా ఉన్న చేతుల్ని బలపర్చండి,

వణుకుతున్న మోకాళ్లను దృఢపర్చండి.+

 4 హృదయంలో ఆందోళనపడుతున్న వాళ్లతో ఇలా చెప్పండి:

“ధైర్యంగా ఉండండి. భయపడకండి.

ఇదిగో! స్వయంగా మీ దేవుడే పగ తీర్చుకోవడానికి వస్తాడు.

ప్రతీకారం చేయడానికి దేవుడు వస్తాడు.+

ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”+

 5 అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి,+

చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి.+

 6 కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు,+

మూగవాళ్ల నాలుక సంతోషంతో కేకలు వేస్తుంది.+

ఎడారిలో నీళ్లు ఉబుకుతాయి,

ఎడారి మైదానంలో కాలువలు పారతాయి.

 7 ఎండిన నేల జమ్ము మడుగు అవుతుంది,

దాహంగా ఉన్న నేలలో నీటి ఊటలు పుడతాయి.+

నక్కలు విశ్రాంతి తీసుకున్న చోట+

పచ్చగడ్డి, రెల్లు, జమ్ము* పెరుగుతాయి.

 8 ఒక రాజమార్గం ఉంటుంది,+

అవును, పవిత్ర మార్గం అనే దారి ఉంటుంది.

అపవిత్రులు దానిలో ప్రయాణించరు.+

అర్హులైనవాళ్లు మాత్రమే అందులో నడుస్తారు;

మూర్ఖులెవ్వరూ దారితప్పి ఆ మార్గంలోకి వెళ్లరు.

 9 సింహాలేవీ అక్కడ ఉండవు,

క్రూరమైన అడవి మృగాలేవీ ఆ దారిలోకి రావు.

అవి అక్కడ కనిపించవు;+

తిరిగి కొనబడినవాళ్లు మాత్రమే అక్కడ నడుస్తారు.+

10 యెహోవా విడిపించినవాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ సీయోనుకు తిరిగొస్తారు.+

వాళ్ల తలల మీద శాశ్వత ఆనందం అనే కిరీటం ఉంటుంది.+

ఉల్లాసం, సంతోషం వాళ్ల సొంతమౌతాయి,

దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి.+

36 హిజ్కియా రాజు పరిపాలనలోని 14వ సంవత్సరంలో, అష్షూరు+ రాజైన సన్హెరీబు ప్రాకారాలుగల యూదా నగరాలన్నిటి మీదికి వచ్చి, వాటిని స్వాధీనం చేసుకున్నాడు.+ 2 తర్వాత అష్షూరు రాజు ఒక పెద్ద సైన్యంతో రబ్షాకేను*+ లాకీషు+ నుండి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు దగ్గరికి పంపాడు. వాళ్లు వచ్చి, చాకలివాడి పొలానికి వెళ్లే రహదారి పక్కనున్న పైకొలను కాలువ+ దగ్గర నిలబడ్డారు.+ 3 దాంతో హిల్కీయా కుమారుడూ రాజభవనం* మీద అధికారీ అయిన ఎల్యాకీము,+ కార్యదర్శి షెబ్నా,+ ఆసాపు కుమారుడూ వివరాలు నమోదు చేసేవాడూ అయిన యోవాహు అతన్ని కలుసుకోవడానికి వెళ్లారు.

4 అప్పుడు రబ్షాకే వాళ్లతో ఇలా అన్నాడు: “దయచేసి హిజ్కియాతో ఈ మాట చెప్పండి, ‘గొప్ప రాజైన అష్షూరు రాజు ఏమంటున్నాడంటే: “ఏం చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు?+ 5 నువ్వు, ‘యుద్ధం చేయడానికి వ్యూహం, శక్తి నా దగ్గర ఉన్నాయి’ అని అంటున్నావు; అవన్నీ వట్టి మాటలు. ఎవర్ని నమ్ముకొని నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు?+ 6 ఇదిగో! నలిగిన రెల్లు లాంటి ఈ ఐగుప్తు ఆదుకుంటుందని నువ్వు నమ్ముతున్నావు, ఎవరైనా దాన్ని ఆనుకుంటే అది వాళ్ల అరచేతిలో గుచ్చుకుంటుంది. తనను నమ్ముకునే వాళ్లందరికీ ఐగుప్తు రాజైన ఫరో అలాంటివాడే.+ 7 ఒకవేళ నువ్వు, ‘మేము మా దేవుడైన యెహోవాను నమ్ముకున్నాం’ అంటావేమో; ‘మీరు ఈ బలిపీఠం ముందు మాత్రమే వంగి నమస్కరించాలి’ అని యూదాతో, యెరూషలేముతో చెప్తూ హిజ్కియా తొలగించింది ఆయన ఉన్నత స్థలాల్ని, బలిపీఠాల్ని+ కాదా?” ’+ 8 కాబట్టి ఇప్పుడు దయచేసి నా ప్రభువైన అష్షూరు రాజుతో+ ఒక పందెం కాయి: నేను నీకు 2,000 గుర్రాల్ని ఇస్తాను, నీకు చేతనైతే వాటికి సరిపోయేంత మంది రౌతుల్ని తీసుకురా. 9 అలాంటిది, రథాల కోసం, రౌతుల కోసం ఐగుప్తు మీద నమ్మకం పెట్టుకున్న నువ్వు నా ప్రభువు సేవకుల్లో అత్యల్పుడైన ఒక్క అధిపతినైనా ఎలా తరిమికొట్టగలవు? 10 యెహోవా ఆదేశం లేకుండానే నేను ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చానా? ‘ఈ దేశం మీదికి వెళ్లి దాన్ని నాశనం చేయి’ అని యెహోవాయే స్వయంగా నాతో చెప్పాడు.”

11 అప్పుడు ఎల్యాకీము, షెబ్నా,+ యోవాహు రబ్షాకేతో+ ఇలా అన్నారు: “దయచేసి నీ సేవకులమైన మాతో అరామిక్‌* భాషలో+ మాట్లాడు, మాకు ఆ భాష అర్థమౌతుంది; ప్రాకారం మీదున్న ప్రజలకు వినిపించేలా యూదుల భాషలో మాతో మాట్లాడకు.”+ 12 కానీ రబ్షాకే ఇలా అన్నాడు: “కేవలం మీ ప్రభువుకు, మీకు మాత్రమే ఈ మాటలు చెప్పమని నా ప్రభువు నన్ను పంపించాడా? ఈ ప్రాకారం మీద కూర్చున్నవాళ్లతో కూడా అతను ఈ మాటలు చెప్పమన్నాడు. మీతో పాటు వాళ్లు కూడా తమ మలాన్ని తింటారు, తమ మూత్రాన్ని తాగుతారు.”

13 అప్పుడు రబ్షాకే నిలబడి యూదుల భాషలో బిగ్గరగా ఇలా అన్నాడు:+ “గొప్ప రాజైన అష్షూరు రాజు చెప్పేది వినండి.+ 14 రాజు ఇలా చెప్తున్నాడు, ‘హిజ్కియా మాటలు విని మోసపోకండి, అతను మిమ్మల్ని కాపాడలేడు.+ 15 “యెహోవా తప్పకుండా మనల్ని రక్షిస్తాడు, ఈ నగరం అష్షూరు రాజు చేతికి అప్పగించబడదు” అని హిజ్కియా చెప్తున్న మాటల్ని విని యెహోవా మీద నమ్మకం పెట్టుకోకండి.+ 16 హిజ్కియా చెప్పేది వినకండి, ఎందుకంటే అష్షూరు రాజు ఇలా అంటున్నాడు: “నాతో సంధి చేసుకొని లొంగిపోండి, అప్పుడు మీలో ప్రతీ ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు పండ్లను, సొంత అంజూర చెట్టు పండ్లను తింటారు, సొంత బావిలోని నీళ్లు తాగుతారు. 17 తర్వాత నేను వచ్చి, మిమ్మల్ని మీ దేశం లాంటి దేశానికి, అంటే ధాన్యం, కొత్త ద్రాక్షారసం, ఆహారం, ద్రాక్షతోటలు ఉండే దేశానికి తీసుకెళ్తాను.+ 18 ‘యెహోవా మనల్ని రక్షిస్తాడు’ అని అంటూ హిజ్కియా చెప్పే మాటలు విని మోసపోకండి. దేశాలు పూజించే దేవుళ్లలో ఏ దేవుడైనా అష్షూరు రాజు చేతిలో నుండి తన దేశాన్ని రక్షించుకోగలిగాడా?+ 19 హమాతు, అర్పాదు దేవుళ్లు ఏమయ్యారు?+ సెపర్వయీము+ దేవుళ్లు ఏమయ్యారు? వాళ్లు నా చేతిలో నుండి సమరయను రక్షించారా?+ 20 యెహోవా యెరూషలేమును నా చేతిలో నుండి కాపాడతాడని నమ్మడానికి, ఈ దేశాలు పూజించిన దేవుళ్లలో ఎవరు తమ దేశాన్ని నా చేతిలో నుండి రక్షించారు?” ’ ”+

21 అయితే వాళ్లు ఒక్కమాట కూడా అతనికి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు; ఎందుకంటే, “మీరు అతనికి బదులివ్వకూడదు” అని రాజు ఆదేశించాడు.+ 22 హిల్కీయా కుమారుడూ రాజభవనం* మీద అధికారీ అయిన ఎల్యాకీము, కార్యదర్శి అయిన షెబ్నా,+ ఆసాపు కుమారుడూ వివరాలు నమోదు చేసేవాడూ అయిన యోవాహు తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే మాటల్ని అతనికి చెప్పారు.

37 హిజ్కియా రాజు ఆ మాటలు వినగానే తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.+ 2 తర్వాత అతను రాజభవనం* మీద అధికారైన ఎల్యాకీమును, కార్యదర్శి షెబ్నాను, యాజకుల్లో పెద్దల్ని ఆమోజు కుమారుడైన యెషయా+ ప్రవక్త దగ్గరికి పంపించాడు. వాళ్లు గోనెపట్ట కట్టుకొని వెళ్లి, 3 అతనితో ఇలా అన్నారు: “హిజ్కియా ఇలా చెప్తున్నాడు, ‘ఈ రోజు శ్రమ, దూషణ,* అవమానం ఉన్న రోజు; ప్రసవించే సమయం వచ్చింది, కానీ కనడానికి శక్తి చాలట్లేదు.+ 4 నీ దేవుడైన యెహోవా బహుశా రబ్షాకే మాటల్ని విని, నీ దేవుడైన యెహోవా తాను విన్న మాటల్ని బట్టి అతన్ని శిక్షిస్తాడేమో. జీవంగల దేవుణ్ణి దూషించడానికి+ అతని ప్రభువైన అష్షూరు రాజే అతన్ని పంపించాడు. కాబట్టి బ్రతికున్న మిగతా ప్రజల+ కోసం ప్రార్థన చేయి.’ ”+

5 హిజ్కియా రాజు సేవకులు యెషయా దగ్గరికి వెళ్లినప్పుడు,+ 6 యెషయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మీ ప్రభువుతో ఇలా చెప్పాలి, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నువ్వు విన్న మాటల్ని బట్టి, అంటే అష్షూరు రాజు సేవకులు+ నన్ను దూషిస్తూ అన్న మాటల్ని బట్టి భయపడకు.+ 7 నేను అతని మనసులో ఒక ఆలోచన పెడుతున్నాను, ఒక వార్త విని అతను తన దేశానికి తిరిగెళ్లిపోతాడు;+ అతను తన స్వదేశంలోనే కత్తితో చంపబడేలా నేను చేస్తాను.” ’ ”+

8 అష్షూరు రాజు లాకీషు నుండి వెళ్లిపోయాడని రబ్షాకే విన్నప్పుడు అతను రాజు దగ్గరికి తిరిగెళ్లాడు. అప్పుడు రాజు లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడు.+ 9 ఇతియోపియా రాజైన తిర్హాకా తనతో యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరు రాజుకు కబురు అందింది. అది విన్నప్పుడు అతను మళ్లీ హిజ్కియా దగ్గరికి సందేశకుల్ని పంపించి+ ఇలా అన్నాడు: 10 “యూదా రాజైన హిజ్కియాతో మీరు ఇలా చెప్పాలి: ‘ “యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడదు” అని నువ్వు నమ్ముకున్న నీ దేవుడు చెప్పే మాటలు విని మోసపోవద్దు.+ 11 ఇదిగో! అష్షూరు రాజులు దేశాలన్నిటికీ ఏం చేశారో, వాటిని ఎలా సమూలంగా నాశనం చేశారో నువ్వు విన్నావు కదా.+ నువ్వు మాత్రం తప్పించుకుంటావని అనుకుంటున్నావా? 12 నా పూర్వీకులు నాశనం చేసిన దేశాల దేవుళ్లు వాటిని కాపాడగలిగారా?+ గోజాను, హారాను,+ రెజెపు ఏమయ్యాయి? తెలశ్శారులో నివసించిన ఏదెను ప్రజలు ఏమయ్యారు? 13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము,+ హేన, ఇవ్వా నగరాల రాజులు ఎక్కడ?’ ”

14 హిజ్కియా ఆ సందేశకుల చేతిలో నుండి ఉత్తరాల్ని తీసుకొని చదివాడు. తర్వాత హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లి వాటిని* యెహోవా ముందు పరిచాడు.+ 15 తర్వాత హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థించాడు:+ 16 “సైన్యాలకు అధిపతివైన యెహోవా,+ ఇశ్రాయేలు దేవా, కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న దేవా, భూమ్మీదున్న రాజ్యాలన్నిట్లో నువ్వు మాత్రమే సత్యదేవుడివి. భూమ్యాకాశాల్ని నువ్వే చేశావు. 17 యెహోవా, దయచేసి చెవిపెట్టి విను!+ యెహోవా, దయచేసి కళ్లు తెరిచి చూడు!+ జీవంగల దేవుణ్ణి దూషించడానికి సన్హెరీబు పంపిన మాటలన్నిటినీ విను.+ 18 యెహోవా, అష్షూరు రాజులు తమ స్వదేశంతో సహా దేశాలన్నిటినీ నాశనం చేసిన మాట నిజమే.+ 19 వాళ్లు ఆ దేశాల దేవుళ్లను అగ్నిలో కాల్చేశారు.+ ఎందుకంటే అవి దేవుళ్లు కావు, కేవలం మనుషుల చేతిపనులు;+ చెక్కలు, రాళ్లు మాత్రమే. అందుకే వాళ్లు వాటిని నాశనం చేయగలిగారు. 20 అయితే ఇప్పుడు యెహోవా, మా దేవా, దయచేసి అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. యెహోవా, అప్పుడు భూమ్మీదున్న రాజ్యాలన్నీ నువ్వు మాత్రమే దేవుడివని తెలుసుకుంటాయి.”+

21 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఈ సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నువ్వు ప్రార్థించావు కదా,+ 22 యెహోవా అతని గురించి ఈ మాట చెప్పాడు:

“సీయోను కన్య నిన్ను తిరస్కరిస్తుంది, ఆమె నిన్ను హేళన చేస్తుంది.

యెరూషలేము కూతురు నిన్ను చూసి తల ఆడిస్తుంది.

23 నువ్వు నిందించింది, దూషించింది ఎవర్ని?+

నీ గొంతునూ, అహంకారంతో నిండిన నీ కళ్లనూ పైకెత్తింది ఎవరి మీద?+

ఇశ్రాయేలు పవిత్ర దేవుని మీదే కదా!+

24 నీ సేవకుల ద్వారా నువ్వు యెహోవాను నిందించి+ ఇలా అన్నావు:

‘నా యుద్ధ రథాల సమూహంతో

నేను పర్వత శిఖరాల మీదికి ఎక్కుతాను,+

లెబానోను మారుమూల ప్రాంతాల్ని చేరుకుంటాను.

దాని ఎత్తైన దేవదారు చెట్లను, దాని శ్రేష్ఠమైన సరళవృక్షాల్ని నరికేస్తాను.

దాని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోకి, దాని దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తాను.

25 నేను బావులు తవ్వి నీళ్లు తాగుతాను;

అరికాళ్లతో ఐగుప్తు వాగుల్ని* ఎండిపోజేస్తాను.’

26 నువ్వు వినలేదా? నేను దీన్ని ఎప్పుడో నిర్ణయించాను.*

చాలాకాలం క్రితమే దాన్ని సిద్ధం చేశాను.*+

ఇప్పుడు అది జరిగేలా చేస్తాను.+

ప్రాకారాలుగల నగరాల్ని నువ్వు శిథిలాల కుప్పలుగా మారుస్తావు.+

27 వాటి నివాసులు నిస్సహాయులౌతారు;

వాళ్లు భయపడిపోతారు, అవమానాలపాలు అవుతారు.

వాళ్లు పొలంలోని మొక్కల్లా, పచ్చగడ్డిలా తయారౌతారు,

తూర్పు గాలికి వాడిపోయిన పైకప్పుల మీది గడ్డిలా అవుతారు.

28 అయితే నువ్వు ఎప్పుడు కూర్చుంటావో, ఎప్పుడు బయటికి వెళ్తావో, ఎప్పుడు లోపలికి వస్తావో,

ఎప్పుడు నా మీద కోపంగా ఉంటావో నాకు బాగా తెలుసు.+

29 ఎందుకంటే నా మీద నీకున్న కోపం గురించి,+ నీ రంకెల గురించి నాకు వినబడింది.+

కాబట్టి నేను నా కొక్కెం నీ ముక్కుకు తగిలించి, నీ నోటికి కళ్లెం+ వేసి

నువ్వు వచ్చిన దారినే నిన్ను వెనక్కి నడిపిస్తాను.”

30 “ ‘ఇది నీకు* సూచనగా ఉంటుంది: ఈ సంవత్సరం మీరు దానంతటదే పండే పంటను* తింటారు; రెండో సంవత్సరం, దాని నుండి మొలిచిన ధాన్యాన్ని తింటారు; అయితే మూడో సంవత్సరం మాత్రం మీరు విత్తనాలు విత్తి పంట కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు. 31 యూదా ఇంటివాళ్లలో తప్పించుకున్నవాళ్లు, అంటే మిగిలినవాళ్లు+ కిందికి వేరు తన్ని, పైకి ఎదిగి ఫలిస్తారు. 32 ఎందుకంటే మిగిలినవాళ్లు యెరూషలేము నుండి, తప్పించుకున్నవాళ్లు సీయోను పర్వతం నుండి బయల్దేరతారు.+ సైన్యాలకు అధిపతైన యెహోవా ఆసక్తితో దీన్ని జరిగిస్తాడు.+

33 “ ‘కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా ఇలా చెప్తున్నాడు:+

“అతను ఈ నగరంలోకి రావడం గానీ,+

ఒక బాణం వేయడం గానీ,

డాలుతో ఎదిరించడం గానీ,

ముట్టడిదిబ్బ కట్టడం గానీ జరగదు.” ’+

34 ‘అతను వచ్చిన దారినే వెళ్లిపోతాడు;

అతను ఈ నగరంలో అడుగుపెట్టడు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

35 ‘నేను నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం+

ఈ నగరాన్ని కాపాడి సంరక్షిస్తాను.’ ”+

36 తర్వాత యెహోవా దూత బయల్దేరి, అష్షూరీయుల శిబిరంలో 1,85,000 మంది పురుషుల్ని చంపేశాడు. ప్రజలు పొద్దున్నే లేచి చూసినప్పుడు అన్నీ శవాలే కనిపించాయి.+ 37 కాబట్టి అష్షూరు రాజైన సన్హెరీబు అక్కడి నుండి బయల్దేరి, నీనెవెకు+ తిరిగెళ్లి అక్కడే ఉండిపోయాడు.+ 38 అతను తన దేవుడైన నిస్రోకు గుడిలో వంగి నమస్కారం చేస్తున్నప్పుడు, అతని సొంత కుమారులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి,+ అరారాతు+ దేశానికి పారిపోయారు. తర్వాత అతని కుమారుడు ఏసర్హద్దోను+ అతని స్థానంలో రాజయ్యాడు.

38 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నాడు.+ అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా+ ప్రవక్త వచ్చి అతనితో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు ఈ జబ్బు నుండి కోలుకోవు, నువ్వు చనిపోతావు. కాబట్టి నీ ఇంటివాళ్లకు అవసరమైన నిర్దేశాలివ్వు.’ ”+ 2 దాంతో హిజ్కియా గోడవైపు ముఖం తిప్పుకొని యెహోవాకు ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: 3 “యెహోవా, నిన్ను బ్రతిమాలుతున్నాను. నేను సంపూర్ణ హృదయంతో నీ ముందు ఎలా నమ్మకంగా నడుచుకున్నానో+ దయచేసి గుర్తుచేసుకో;+ నీ దృష్టిలో ఏది మంచిదో అదే నేను చేశాను.” తర్వాత హిజ్కియా విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు.

4 అప్పుడు యెహోవా వాక్యం యెషయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 5 “నువ్వు వెనక్కి వెళ్లి హిజ్కియాతో ఇలా చెప్పు,+ ‘నీ పూర్వీకుడైన దావీదు దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ప్రార్థన విన్నాను.+ నీ కన్నీళ్లు చూశాను.+ ఇదిగో, నేను నీ ఆయుష్షును ఇంకో 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను;+ 6 అంతేకాదు నిన్నూ, ఈ నగరాన్నీ అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను, ఈ నగరాన్ని కాపాడతాను.+ 7 యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తాడని నీకు చూపించడానికి యెహోవా ఈ సూచన ఇచ్చాడు:+ 8 ఇదిగో, ఆహాజు మెట్ల* మీద దిగిపోతున్న నీడను నేను పది మెట్లు వెనక్కి వెళ్లేలా చేస్తాను.” ’ ”+ దాంతో, అప్పటికే కిందికి దిగిన సూర్యుడి నీడ పది మెట్లు వెనక్కి వెళ్లింది.

9 యూదా రాజైన హిజ్కియా జబ్బుపడి కోలుకున్న సమయంలో రాసిన* మాటలు.

10 నేను ఇలా అనుకున్నాను: “నా ఆయుష్షు తీరకుండానే

నేను సమాధి* ద్వారాల్లోకి వెళ్లాల్సి వస్తుంది.

నాకు మిగిలిన ఆయుష్షు నా నుండి లాగివేయబడుతుంది.”

11 నేను ఇలా అనుకున్నాను: “నేను యెహోవాను* చూడలేను, సజీవుల దేశంలో యెహోవాను* చూడలేను.+

జీవంలేని చోట* నివసించేవాళ్లతో నేను ఉన్నప్పుడు

నేనిక మనుషుల్ని చూడలేను.

12 గొర్రెల కాపరి డేరా లాగివేయబడినట్టు

నా సొంత నివాసం నా దగ్గర నుండి లాగివేయబడి తీసేయబడింది.+

మగ్గం పనివాడిలా నేను నా జీవితాన్ని చుట్టేశాను;

వస్త్రపు నిలువు పోగుల్ని కత్తిరించినట్టు ఆయన నన్ను కత్తిరించేస్తాడు.

ఉదయం నుండి రాత్రివరకు నువ్వు నన్ను చావుకు దగ్గర చేస్తూ ఉన్నావు.+

13 తెల్లారేవరకు నన్ను నేను సముదాయించుకుంటున్నాను.

సింహంలా ఆయన నా ఎముకలన్నీ విరగ్గొడుతూ ఉన్నాడు;

ఉదయం నుండి రాత్రివరకు నువ్వు నన్ను చావుకు దగ్గర చేస్తూ ఉన్నావు.+

14 మంగలకత్తి పిట్టలా, మైనా పిట్టలా* నేను కిచకిచలాడుతూ ఉన్నాను;+

పావురంలా మూల్గుతూ ఉన్నాను.+

నా కళ్లు నీరసంగా పైకి చూస్తున్నాయి:+

‘యెహోవా, నేను పెద్ద ఆపదలో ఉన్నాను;

నన్ను ఆదుకో!’*+

15 నేను ఏమని చెప్పను?

ఆయన నాతో మాట్లాడాడు, చర్య తీసుకున్నాడు.

నాకు వచ్చిన ఘోరమైన కష్టాన్ని బట్టి

నా జీవితకాలమంతా నేను వినయంగా* నడుచుకుంటాను.

16 ‘యెహోవా, వీటి* వల్ల ప్రతీ మనిషి బ్రతుకుతాడు,

వాటిలోనే నా జీవశక్తి* ఉంది.

నువ్వు మళ్లీ నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి, నన్ను ప్రాణాలతో ఉంచుతావు.+

17 ఇదిగో! నెమ్మదితో కాకుండా తీవ్రమైన వేదనతో నేను నిండిపోయాను;

నా ప్రాణం మీద నీకున్న ఇష్టం వల్ల,

నాశనమనే గోతిలోకి వెళ్లకుండా నన్ను కాపాడావు.+

నా పాపాలన్నిటినీ నీ వెనక పారేశావు.*+

18 ఎందుకంటే సమాధి* నిన్ను మహిమపర్చలేదు,+

మరణం నిన్ను స్తుతించలేదు.+

గోతిలోకి దిగిపోయేవాళ్లు నీ నమ్మకత్వం మీద ఆశపెట్టుకోలేరు.+

19 బ్రతికున్నవాళ్లు, అవును బ్రతికున్నవాళ్లే

ఈ రోజు నేను చేస్తున్నట్టుగా నిన్ను స్తుతించగలరు.

నీ నమ్మకత్వం గురించి తండ్రులు తమ కుమారులకు వివరించగలరు.+

20 యెహోవా, నన్ను రక్షించు;

అప్పుడు మేము జీవించినంత కాలం యెహోవా మందిరంలో+

తంతివాద్యాలతో నా పాటల్ని వాయిస్తాం.’ ”+

21 అప్పుడు యెషయా, “ఎండు అంజూర పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టండి, అప్పుడతను బాగౌతాడు” అని చెప్పాడు.+ 22 అంతకుముందు హిజ్కియా, “నేను యెహోవా మందిరానికి వెళ్తాను అనడానికి సూచన ఏంటి?” అని యెషయాను అడిగాడు.+

39 ఆ సమయంలో బబులోను రాజూ బలదాను కుమారుడూ అయిన మెరోదక్బలదాను హిజ్కియా జబ్బుపడి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాల్ని, కానుకను పంపాడు.+ 2 హిజ్కియా సంతోషంగా వాళ్లను ఆహ్వానించి* తన ధనాగారాన్ని+ చూపించాడు. అతను వాళ్లకు వెండిబంగారాల్ని, సాంబ్రాణి తైలాన్ని, ప్రశస్తమైన వేరే తైలాన్ని, తన ఆయుధశాల అంతటినీ, తన ఖజానాల్లో ఉన్నవన్నీ చూపించాడు. తన రాజభవనంలో, తన రాజ్యమంతటిలో హిజ్కియా వాళ్లకు చూపించనిదంటూ ఏదీ లేదు.

3 తర్వాత యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, “ఆ మనుషులు నీతో ఏం మాట్లాడారు? వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. దానికి హిజ్కియా, “వాళ్లు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని చెప్పాడు.+ 4 యెషయా అతన్ని, “వాళ్లు నీ రాజభవనంలో ఏమి చూశారు?” అని అడిగాడు. దానికి హిజ్కియా, “వాళ్లు నా రాజభవనంలో ఉన్న ప్రతీది చూశారు. నా ఖజానాల్లో నేను వాళ్లకు చూపించనిదంటూ ఏదీ లేదు” అన్నాడు.

5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు: “సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్న ఈ మాట విను. 6 ‘ఇదిగో! నీ రాజభవనంలో ఉన్నవన్నీ, ఈ రోజు వరకు నీ పూర్వీకులు కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్లబడే రోజులు రాబోతున్నాయి. ఏదీ మిగలదు’+ అని యెహోవా అంటున్నాడు.+ 7 ‘వాళ్లు నీ సొంత కుమారుల్ని, అంటే నీకు పుట్టబోయే కుమారుల్లో కొందర్ని తీసుకెళ్లిపోతారు; వాళ్లు బబులోను రాజభవనంలో ఆస్థాన అధికారులు అవుతారు.’ ”+

8 దానికి హిజ్కియా యెషయాతో, “నువ్వు చెప్పిన యెహోవా మాట మంచిదే” అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “ఎందుకంటే నేను బ్రతికినంత కాలం* శాంతి, భద్రత* ఉంటాయి.”+

40 “ఓదార్చండి, నా ప్రజల్ని ఓదార్చండి” అని మీ దేవుడు అంటున్నాడు.+

 2 “యెరూషలేముకు ఊరట కలిగేలా మాట్లాడండి,

ఆమె సైనిక సేవ పూర్తైందని,

ఆమె దోషానికి పరిహారం దొరికిందని+ ఆమెకు ప్రకటించండి.

తన పాపాలన్నిటిని బట్టి ఆమె యెహోవా చేతి నుండి పూర్తి శిక్ష* పొందింది.”+

 3 ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు:

“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి!+

మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని+ ఏర్పాటు చేయండి.+

 4 ప్రతీ లోయ ఎత్తు చేయబడాలి,

ప్రతీ పర్వతం, ప్రతీ కొండ అణచబడాలి.

గరుకైన నేల చదును చేయబడాలి,

ఎత్తుపల్లాలు ఉన్న నేల లోయ మైదానంగా చేయబడాలి.+

 5 యెహోవా మహిమ వెల్లడి చేయబడుతుంది,+

మనుషులంతా దాన్ని చూస్తారు,+

ఎందుకంటే, ఆ మాట యెహోవా నోటి నుండి వచ్చింది.”

 6 వినండి! ఒకతను, “చాటించండి!” అని అంటున్నాడు;

ఇంకొకతను, “ఏమని చాటించాలి?” అని అడుగుతున్నాడు.

“మనుషులంతా పచ్చగడ్డి లాంటివాళ్లే.

వాళ్ల విశ్వసనీయ ప్రేమంతా గడ్డి పువ్వు లాంటిదే.+

 7 యెహోవా తన ఊపిరిని* ఊదినప్పుడు

పచ్చగడ్డి ఎండిపోతుంది,

దాని పువ్వు వాడిపోతుంది.+

నిజంగా ప్రజలు కేవలం పచ్చగడ్డి లాంటివాళ్లే.

 8 పచ్చగడ్డి ఎండిపోతుంది,

దాని పువ్వు వాడిపోతుంది,

కానీ మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది.”+

 9 సీయోనుకు శుభవార్త తెస్తున్న ఓ స్త్రీ,

ఎత్తైన పర్వతం మీదికి ఎక్కివెళ్లు,

యెరూషలేముకు శుభవార్త తెస్తున్న ఓ స్త్రీ,+

నీ స్వరాన్ని బిగ్గరగా వినిపించు,

నీ స్వరాన్ని పెంచు, భయపడకు.

“ఇదిగో, నీ దేవుడు ఇక్కడ ఉన్నాడు” అని యూదా నగరాలకు ప్రకటించు.+

10 ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా తన శక్తితో వస్తాడు,

ఆయన బాహువు ఆయన తరఫున పరిపాలిస్తుంది.+

ఇదిగో! ఆయనిచ్చే ప్రతిఫలం ఆయన దగ్గరే ఉంది,

ఆయనిచ్చే జీతం ఆయన ముందే ఉంది.+

11 గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు.*+

గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు,

వాటిని తన గుండెల మీద మోస్తాడు.

పాలిచ్చే వాటిని ఆయన నిదానంగా నడిపిస్తాడు.+

12 తన దోసిట్లో జలాల్ని కొలిచింది ఎవరు?+

తన జేనతో* ఆకాశం కొలతలు తీసుకుంది ఎవరు?

భూమ్మీది మట్టిని కొలపాత్రలోకి పోగుచేసింది ఎవరు?+

త్రాసులో పర్వతాల్ని,

తూకంలో కొండల్ని తూచింది ఎవరు?

13 యెహోవా చురుకైన శక్తిని* కొలిచింది* ఎవరు?

ఆయనకు సలహాదారుడిగా ఉండి ఎవరు ఆయనకు ఉపదేశించగలరు?+

14 అవగాహన కోసం ఆయన ఎవర్ని సంప్రదించాడు?

న్యాయ మార్గాన్ని ఎవరు ఆయనకు బోధించగలరు?

జ్ఞానాన్ని ఆయనకు ఎవరు నేర్పగలరు?

నిజమైన అవగాహన మార్గాన్ని ఆయనకెవరు చూపించగలరు?+

15 ఇదిగో! దేశాలు చేద నుండి జారే నీటిబొట్టులా ఉన్నాయి,

అవి త్రాసు మీది దుమ్ము పొరలా ఉన్నాయి.+

ఇదిగో! సన్నని ధూళిని లేపినట్టు ఆయన ద్వీపాల్ని లేపుతాడు.

16 నిప్పు మండుతూ ఉండడానికి లెబానోను కూడా సరిపోదు,*

దహనబలి కోసం దాని అడవి జంతువులు సరిపోవు.

17 దేశాలన్నీ ఆయన ముందు ఉనికిలో లేనట్టే ఉన్నాయి;+

ఆయన వాటిని శూన్యంగా, వ్యర్థమైనవిగా ఎంచుతాడు.+

18 మీరు దేవుణ్ణి ఎవరితో పోల్చగలరు?+

ఆయన దేనిలా ఉన్నాడని చెప్పగలరు?+

19 చేతిపనివాడు విగ్రహాన్ని పోతపోస్తాడు,

కంసాలి దానికి బంగారు రేకు తొడుగుతాడు,+

తర్వాత వెండి గొలుసులు చేస్తాడు.

20 అతను కానుక కోసం ఒక చెట్టును ఎంచుకుంటాడు,+

కుళ్లిపోని చెట్టును అతను ఎంచుకుంటాడు.

ఒరిగిపోకుండా ఉండే చెక్కుడు విగ్రహం తయారుచేయడానికి

అతను నైపుణ్యంగల చేతిపనివాడి కోసం వెతుకుతాడు.+

21 నీకు తెలీదా?

నువ్వు వినలేదా?

మొదటినుండి ఎవరూ నీకు చెప్పలేదా?

భూమి పునాదులు వేయబడినప్పటి నుండి నీకది అర్థంకాలేదా?+

22 దేవుడు భూగోళానికి* పైన నివసిస్తున్నాడు,+

దాని నివాసులు మిడతల్లా* ఉన్నారు.

పలుచని తెరను విప్పినట్టు ఆయన ఆకాశాన్ని విప్పుతున్నాడు,

నివసించడం కోసం డేరాను చాపినట్టు దాన్ని చాపుతాడు.+

23 ఉన్నతాధికారుల్ని ఆయన కిందికి దించుతాడు,

భూమ్మీది న్యాయమూర్తుల్ని* వ్యర్థమైన వాళ్లుగా చేస్తాడు.

24 వాళ్లు ఇంకా సరిగ్గా నాటబడలేదు,

ఇంకా సరిగ్గా విత్తబడలేదు,

వాళ్ల కాండం ఇంకా భూమిలో వేరు తన్నలేదు,

వాళ్లమీద ఊదగానే వాళ్లు ఎండిపోతారు,

కొయ్యకాలు* గాలికి ఎగిరిపోయినట్టు వాళ్లు ఎగిరిపోతారు.+

25 “నన్ను ఎవరితో పోలుస్తారు, నేను ఎవరితో సమానమని చెప్తారు?” అని పవిత్రుడైన దేవుడు అడుగుతున్నాడు.

26 “మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి.

వీటిని ఎవరు సృష్టించారు?+

వాటిలో ఒక్కోదాన్ని లెక్కపెడుతూ వాటి సైన్యాన్ని బయటికి తీసుకొస్తున్న దేవుడే కదా;

ఆయన వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు.+

ఆయనకు అపారమైన శక్తి,* సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం ఉన్నాయి+ కాబట్టి

వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు.

27 యాకోబూ, నువ్వెందుకు ఇలా అంటున్నావు?

ఇశ్రాయేలూ, ‘నా మార్గం యెహోవాకు కనిపించదు,

దేవుని వల్ల నాకు న్యాయం జరగదు’ అని నువ్వెందుకు అంటున్నావు?+

28 నీకు తెలీదా? నువ్వు వినలేదా?

భూమి అంచుల్ని సృష్టించిన యెహోవా ఎప్పటికీ దేవుడే.+

ఆయన ఎప్పుడూ సొమ్మసిల్లడు, అలసిపోడు.+

ఆయన అవగాహనను శోధించడం సాధ్యంకాదు.+

29 అలసిపోయిన వాళ్లకు ఆయన శక్తినిస్తాడు,

బలం* లేనివాళ్లకు పూర్తి బలాన్ని ఇస్తాడు.+

30 బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు,

యువకులు తొట్రిల్లి పడిపోతారు.

31 అయితే యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు.

గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు.+

అలసిపోకుండా పరుగెత్తుతారు;

సొమ్మసిల్లకుండా నడుచుకుంటూ వెళ్తారు.”+

41 “ద్వీపాల్లారా, మౌనంగా ఉండి నేను చెప్పేది వినండి;

దేశాలు మళ్లీ బలం పుంజుకోవాలి.

అవి నా దగ్గరికి రావాలి; తర్వాత అవి మాట్లాడాలి.+

తీర్పు కోసం మనం సమావేశమౌదాం రండి.

 2 దేశాల్ని అతని చేతికి అప్పగించాలని,

రాజుల్ని అతనికి లోబర్చాలని+

సూర్యోదయం* వైపు నుండి ఒక వ్యక్తిని బయల్దేరజేసింది ఎవరు?+

న్యాయం జరిగించడానికి తన పాదాల దగ్గరికి* అతన్ని పిలిచింది ఎవరు?

అతని ఖడ్గం ముందు వాళ్లను మట్టికరిపించేది ఎవరు?

అతని విల్లు ముందు వాళ్లను గాలికి ఎగిరే కొయ్యకాలుగా* చేసేది ఎవరు?

 3 తన పాదాలు ఎప్పుడూ నడవని త్రోవల్లో

అతను ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్లను తరుముతూ వెళ్తాడు.

 4 మొదటి నుండి తరాల్ని రప్పిస్తూ

ఈ పనికి పూనుకొని దాన్ని చేసింది ఎవరు?

నేనే, యెహోవాను, నేను మొదటివాణ్ణి;+

చివరివాళ్లతో కూడా నేను ఇలాగే ఉంటాను.”+

 5 అది చూసి ద్వీపాలు భయపడిపోయాయి.

భూమి కొనలు వణకడం మొదలుపెట్టాయి.

అవి కలుసుకొని ముందుకు వస్తున్నాయి.

 6 ప్రతీ వ్యక్తి తన తోటివాడికి సహాయం చేస్తున్నాడు,

తన సహోదరునితో, “ధైర్యంగా ఉండు” అని చెప్తున్నాడు.

 7 చేతిపనివాడు కంసాలిని+ బలపరుస్తున్నాడు;

సుత్తితో సాగగొట్టేవాడు

దాగలి* మీద కొట్టేవాడిని బలపరుస్తున్నాడు.

అతను టంకం పని* గురించి, “అది బాగుంది” అంటున్నాడు.

తర్వాత అది ఒరిగి పడిపోకుండా మేకులతో దాన్ని బిగిస్తారు.

 8 “అయితే ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి,+

యాకోబూ, నేను నిన్ను ఎంచుకున్నాను,+

నువ్వు నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం,*+

 9 నేను భూమి అంచుల నుండి నిన్ను చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాను,+

భూమి సుదూర ప్రాంతాల నుండి నిన్ను పిలిచాను.

నేను నీతో ఇలా అన్నాను: ‘నువ్వు నా సేవకుడివి;+

నేను నిన్ను ఎంచుకున్నాను; నేను నిన్ను తిరస్కరించలేదు.+

10 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+

ఆందోళనపడకు,* ఎందుకంటే నేను నీ దేవుణ్ణి.+

నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను,+

నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.’

11 ఇదిగో! నీ మీద కోపగించుకునే వాళ్లంతా సిగ్గుపడతారు, అవమానాలపాలు అవుతారు.+

నీతో పోరాడేవాళ్లు లేకుండా పోతారు, నాశనమౌతారు.+

12 నీతో పోరాడేవాళ్ల కోసం నువ్వు వెతుకుతావు, కానీ వాళ్లు నీకు కనిపించరు;

నీతో యుద్ధం చేసేవాళ్లు ఉనికిలో లేకుండా పోతారు, ఎక్కడా ఉండరు.+

13 ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను,

‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.+

14 పురుగులాంటి* యాకోబూ,+ భయపడకు,

ఇశ్రాయేలు జనమా, నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ అంటున్నాడు.

15 “ఇదిగో! నేను నిన్ను నూర్చే పనిముట్టులా చేశాను,+

పదునైన కొత్త నూర్చే పరికరంలా చేశాను.

నువ్వు పర్వతాల్ని తొక్కి పిండి చేస్తావు,

కొండల్ని పొట్టులా చేస్తావు.

16 నువ్వు వాటిని తూర్పారబడతావు,

అవి గాలికి కొట్టుకుపోతాయి;

సుడిగాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది.

నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు,+

ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి బట్టి గొప్పలు చెప్పుకుంటావు.”+

17 “అవసరంలో ఉన్నవాళ్లు, పేదవాళ్లు నీళ్ల కోసం వెతుకుతున్నారు, కానీ ఎక్కడా నీళ్లు లేవు.

దాహంతో వాళ్ల నాలుక ఎండిపోతోంది.+

యెహోవా అనే నేను వాళ్లకు జవాబిస్తాను.+

ఇశ్రాయేలు దేవుడినైన నేను వాళ్లను విడిచిపెట్టను.+

18 నేను చెట్లులేని కొండల్లో నదులు పారేలా,+

లోయ మైదానాల్లో ఊటలు ప్రవహించేలా చేస్తాను.+

నేను ఎడారిని జమ్ము మడుగులా,

నీళ్లులేని దేశాన్ని నీటి ఊటలుగా చేస్తాను.+

19 ఎడారిలో దేవదారు చెట్టును,

తుమ్మ చెట్టును, గొంజి చెట్టును, పైన్‌ చెట్టును నాటుతాను.+

ఎడారి మైదానంలో సరళవృక్షాన్ని,

యాష్‌ చెట్టును,* తమాల వృక్షాన్ని నాటుతాను.+

20 దానివల్ల, యెహోవా చెయ్యి దాన్ని చేసిందని,

ఇశ్రాయేలు పవిత్ర దేవుడే దాన్ని కలగజేశాడని

ప్రజలందరూ చూసి తెలుసుకుంటారు,

శ్రద్ధగా విని అర్థం చేసుకుంటారు.”+

21 “మీ వ్యాజ్యాన్ని నా ముందు పెట్టండి” అని యెహోవా అంటున్నాడు.

“మీ వాదనలు వినిపించండి” అని యాకోబుకు రాజైన దేవుడు అంటున్నాడు.

22 “రుజువులు ప్రవేశపెట్టండి, జరగబోయే వాటి గురించి మాకు తెలియజేయండి.

మునుపటి* విషయాల గురించి మాకు చెప్పండి,

అప్పుడు మేము వాటి గురించి ఆలోచించి,* వాటివల్ల చివరికి ఏమౌతుందో తెలుసుకుంటాం.

లేదా ముందుముందు జరగబోతున్న వాటి గురించి మాకు ప్రకటించండి.+

23 మీరు దేవుళ్లని మేము తెలుసుకునేలా

భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మాకు చెప్పండి.+

అవును, మంచో చెడో ఏదో ఒకటి చేయండి.

అప్పుడు మేము దాన్ని చూసి ఆశ్చర్యపోతాం.+

24 ఇదిగో! అసలు మీరు ఉనికిలోనే లేరు,

మీరు సాధించింది అంటూ ఏమీ లేదు.+

మిమ్మల్ని ఎంచుకునేవాళ్లు అసహ్యులు.+

25 ఉత్తరం వైపు నుండి నేనొక వ్యక్తిని బయల్దేరజేశాను, అతను వస్తాడు,+

సూర్యోదయం* వైపు నుండి వచ్చే వ్యక్తి+ నా పేరును మహిమపరుస్తాడు.

అతను బంకమట్టిని తొక్కినట్టు పరిపాలకుల్ని* తొక్కుతాడు,

కుమ్మరి బంకమట్టిని తొక్కినట్టు అతను వాళ్లను తొక్కుతాడు.

26 మేము తెలుసుకునేలా మొదటి నుండి దాని గురించి చెప్పిందెవరు?

‘అతను సరిగ్గా చెప్పాడు’ అని మేము అనేలా గడిచిన కాలాల నుండి వాటిని ఎవరు చెప్పారు?+

నిజానికి, ఎవరూ దాని గురించి ప్రకటించలేదు!

ఎవరూ దాని గురించి చెప్పలేదు!

మీ నుండి ఎవరూ ఏమీ వినలేదు!”+

27 “ఇదిగో! వాళ్లు ఇక్కడ ఉన్నారు!” అని సీయోనుకు మొదట చెప్పింది నేనే.+

మంచివార్త మోసుకొచ్చే వ్యక్తిని నేను యెరూషలేముకు పంపుతాను.+

28 నేను చూస్తూ వచ్చాను, కానీ ఎవరూ లేరు;

వాళ్లలో సలహా ఇచ్చేవాళ్లు ఒక్కరు కూడా లేరు.

బదులు చెప్పమని నేను వాళ్లను అడుగుతూ వచ్చాను.

29 ఇదిగో! వాళ్లంతా మాయ.*

వాళ్ల పనులన్నీ వట్టివి.

వాళ్ల పోత* విగ్రహాలు గాలి లాంటివి, వ్యర్థమైనవి.+

42 ఇదిగో! నేను ఆదుకునే నా సేవకుడు!+

నేను ఆయన్ని ఎంచుకున్నాను,+ ఆయన్ని చూసి సంతోషిస్తున్నాను!*+

నా పవిత్రశక్తిని ఆయనలో ఉంచాను;+

ఆయన దేశాలకు న్యాయం చేస్తాడు.+

 2 ఆయన కేకలు వేయడు, అరవడు,

వీధుల్లో తన స్వరం వినబడనివ్వడు.+

 3 ఆయన నలిగిన రెల్లును విరవడు,

ఆరిపోబోతున్న వత్తిని ఆర్పడు.+

ఆయన నమ్మకంగా న్యాయాన్ని జరిగిస్తాడు.+

 4 భూమ్మీద న్యాయాన్ని స్థాపించేవరకు ఆయన అలసిపోడు, చితికిపోడు;+

ద్వీపాలు ఆయన ఉపదేశం* కోసం వేచిచూస్తూ ఉంటాయి.

 5 యెహోవాయే సత్యదేవుడు, ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు.

దాన్ని విస్తరింపజేసిన మహాగొప్ప దేవుడు ఆయనే.+

ఆయనే భూమిని, దాని పంటను పరిచాడు.+

దానిమీదున్న ప్రజలకు ఊపిరిని, దానిలో నడిచేవాళ్లకు జీవశక్తిని* ఇస్తున్నది ఆయనే.+

ఆయనిలా అంటున్నాడు:

 6 “యెహోవా అనే నేను నీతితో నిన్ను పిలిచాను;

నేను నీ చేతిని పట్టుకున్నాను.

నిన్ను కాపాడి, ప్రజలకు నిన్ను ఒప్పందంగా,+

దేశాలకు వెలుగుగా చేస్తాను.+

 7 నువ్వు గుడ్డివాళ్ల కళ్లను తెరవాలని,+

బందీగృహంలో నుండి ఖైదీలను బయటికి తేవాలని,

చీకట్లో కూర్చున్నవాళ్లను చెరసాల నుండి విడిపించాలని అలా చేస్తాను.+

 8 నేను యెహోవాను. ఇదే నా పేరు;

నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను,*

నాకు రావాల్సిన స్తుతిని చెక్కిన విగ్రహాలకు చెందనివ్వను.+

 9 చూడండి, ముందు చెప్పిన సంగతులు జరిగిపోయాయి;

ఇప్పుడు కొత్త సంగతులు చెప్తున్నాను.

అవి పుట్టకముందే, వాటి గురించి నేను మీకు చెప్తున్నాను.”+

10 సముద్రంలో ప్రయాణించేవాళ్లారా, సముద్రంలోని సమస్తమా,

ద్వీపాల్లారా, వాటి నివాసులారా,+

యెహోవాకు కొత్త పాట పాడండి,+

భూమి కొనల నుండి ఆయనకు స్తుతిగీతాలు పాడండి.+

11 ఎడారి, దాని నగరాలు,

కేదారు+ నివాస ప్రాంతాలు తమ స్వరాన్ని పెంచాలి.+

బండరాళ్ల మధ్య నివసించేవాళ్లు సంతోషంతో కేకలు వేయాలి;

పర్వత శిఖరాల మీద నుండి వాళ్లు బిగ్గరగా అరవాలి.

12 వాళ్లు యెహోవాకు మహిమ ఆపాదించాలి,

ద్వీపాల్లో ఆయనకు స్తుతులు చెల్లించాలి.+

13 యెహోవా బలశాలిలా బయల్దేరతాడు.+

యోధుడిలా+ ఆయన తన ఆసక్తిని పురికొల్పుకుంటాడు.

ఆయన బిగ్గరగా అరుస్తాడు, అవును, యుద్ధకేక వినిపిస్తాడు;

తన శత్రువుల కన్నా తాను బలవంతుణ్ణని నిరూపించుకుంటాడు.+

14 “చాలాకాలం నేను మౌనంగా ఉన్నాను.

నిశ్శబ్దంగా ఉండి ఓపిక పట్టాను.

ప్రసవిస్తున్న స్త్రీలా ఒక్కసారిగా నేను

మూల్గుతూ, ఒగరుస్తూ, రొప్పుతాను.

15 నేను పర్వతాల్ని, కొండల్ని నాశనం చేస్తాను;

వాటిమీదున్న మొక్కలన్నిటినీ ఎండిపోజేస్తాను.

నదుల్ని ద్వీపాలుగా* మారుస్తాను

జమ్ము మడుగుల్ని ఎండిపోజేస్తాను.+

16 గుడ్డివాళ్లను వాళ్లకు తెలియని దారిలో నడిపిస్తాను,+

అంతగా పరిచయం లేని దారుల్లో వాళ్లు నడిచేలా చేస్తాను.+

వాళ్ల ముందున్న చీకటిని వెలుగుగా మారుస్తాను,+

ఎగుడుదిగుడు ప్రదేశాన్ని చదునైన నేలగా చేస్తాను.+

నేను వాళ్లకు ఇవన్నీ చేస్తాను, వాళ్లను విడిచిపెట్టను.”

17 చెక్కిన విగ్రహాల మీద నమ్మకం పెట్టుకునేవాళ్లు,

పోత* విగ్రహాలతో, “మీరే మా దేవుళ్లు” అని చెప్పేవాళ్లు

వెనక్కి తిరిగెళ్లిపోతారు, పూర్తిగా అవమానాలపాలు అవుతారు.+

18 చెవిటివాళ్లారా, వినండి;

గుడ్డివాళ్లారా, కళ్లు తెరిచి చూడండి.+

19 నా సేవకుడు తప్ప గుడ్డివాళ్లు ఎవరు?

నేను పంపే సందేశకుని అంత చెవిటివాళ్లు ఎవరు?

నేను ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి అంత గుడ్డివాళ్లు ఎవరు?

యెహోవా సేవకుని అంత గుడ్డివాళ్లు ఎవరు?+

20 మీరు చాలా విషయాలు చూశారు, కానీ వాటిని పట్టించుకోలేదు.

మీ చెవులు తెరుచుకునే ఉన్నాయి కానీ మీరు వినలేదు.+

21 యెహోవా తన నీతి కోసం

తన ధర్మశాస్త్రాన్ని* ఘనపర్చడంలో, దాన్ని మహిమపర్చడంలో సంతోషించాడు.

22 కానీ ఈ ప్రజలు దోచుకోబడినవాళ్లు, కొల్లగొట్టబడినవాళ్లు;+

వాళ్లంతా గుహల్లో ఇరుక్కుపోయారు, చెరసాలల్లో దాచబడ్డారు.+

వాళ్లు దోచుకోబడ్డారు కానీ రక్షించేవాళ్లు ఎవ్వరూ లేరు.+

వాళ్లు కొల్లగొట్టబడ్డారు కానీ “వాళ్లను వెనక్కి తీసుకురండి!” అని చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు.

23 ఎవరు దీన్ని వింటారు?

రాబోయే కాలం కోసం ఎవరు మనసుపెట్టి ఆలకిస్తారు?

24 కొల్లగొట్టడానికి యాకోబును,

దోచుకునేవాళ్లకు ఇశ్రాయేలును అప్పగించింది ఎవరు?

మనం ఎవరికి విరుద్ధంగా పాపం చేశామో ఆ యెహోవా కాదా?

ఆయన మార్గాల్లో నడవడానికి వాళ్లు ఇష్టపడలేదు,

ఆయన ధర్మశాస్త్రానికి* వాళ్లు లోబడలేదు.+

25 కాబట్టి ఆయన తన ఆగ్రహాన్ని,

కోపాగ్నిని, యుద్ధ క్రోధాన్ని అతని మీద కుమ్మరిస్తూ వచ్చాడు.+

అది అతని చుట్టూ ఉన్న వాటన్నిటిని దహించేసింది, కానీ అతను పట్టించుకోలేదు.+

అది అతని మీద రగులుకుంది, కానీ అతను దానిమీద మనసు పెట్టలేదు.+

43 యెహోవా ఇలా అంటున్నాడు,

యాకోబూ నీ సృష్టికర్త, ఇశ్రాయేలూ నిన్ను తయారుచేసిన దేవుడు ఇలా అంటున్నాడు:+

“భయపడకు, నేను నిన్ను తిరిగి కొన్నాను.+

పేరు పెట్టి నిన్ను పిలిచాను.

నువ్వు నాకు చెందినవాడివి.

 2 నువ్వు జలాల గుండా వెళ్లేటప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను;+

నువ్వు నదుల గుండా వెళ్లినప్పుడు, అవి నిన్ను ముంచెత్తవు.+

అగ్ని గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు,

అగ్ని జ్వాల వల్ల కమిలిపోవు.

 3 ఎందుకంటే నేను నీ దేవుడైన యెహోవాను,

ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి, నీ రక్షకుణ్ణి.

నిన్ను విడిపించడానికి ఐగుప్తును మూల్యంగా చెల్లించాను,

నీ కోసం ఇతియోపియాను, సెబాను చెల్లించాను.

 4 ఎందుకంటే నువ్వు నా దృష్టిలో అమూల్యమైనవాడివి,+

నేను నిన్ను ఘనపర్చాను, నేను నిన్ను ప్రేమించాను.+

కాబట్టి నీకు బదులుగా ప్రజల్ని,

నీ ప్రాణానికి బదులుగా దేశాల్ని ఇస్తాను.

 5 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+

నీ సంతానాన్ని* తూర్పు నుండి తీసుకొస్తాను,

పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.+

 6 ఉత్తర దిక్కుతో, ‘వాళ్లను ఇచ్చేయి!’ అని చెప్తాను.+

దక్షిణ దిక్కుతో నేనిలా అంటాను: ‘వాళ్లను నీ దగ్గరే ఉంచుకోవద్దు.

దూరం నుండి నా కుమారుల్ని, భూమి కొనల నుండి నా కూతుళ్లను తీసుకురా;+

 7 నా పేరుతో పిలవబడే ప్రతీ ఒక్కర్ని,+

నా మహిమ కోసం నేను సృష్టించినవాళ్లను,

నేను తయారుచేసి రూపించినవాళ్లను+ తీసుకురా.’

 8 కళ్లు ఉండి కూడా గుడ్డివాళ్లలా ఉన్నవాళ్లను,

చెవులు ఉండి కూడా చెవిటివాళ్లలా ఉన్నవాళ్లను+ తీసుకురండి.

 9 దేశాలన్నీ ఒకచోట సమావేశమవ్వాలి,

జనాలు సమకూడాలి.+

వాళ్లలో ఎవరు దీన్ని చెప్పగలరు?

లేదా మొదటి సంగతుల్ని* ఎవరు మాకు వినిపించగలరు?+

తాము నిర్దోషులమని రుజువు చేసుకోవడానికి వాళ్లు తమ సాక్షుల్ని ప్రవేశపెట్టాలి,

లేదా విని, ‘ఇదే సత్యం!’ అని ఒప్పుకోవాలి.”+

10 “మీరే నా సాక్షులు”+ అని యెహోవా అంటున్నాడు,

“అవును, నేను ఎంచుకున్న నా సేవకుడివి నువ్వు.+

నువ్వు తెలుసుకొని, నా మీద విశ్వాసముంచి,*

నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నానని+ అర్థం చేసుకునేలా నేను నిన్ను ఎంచుకున్నాను.

నాకన్నా ముందు ఏ దేవుడూ లేడు,

నా తర్వాత కూడా ఏ దేవుడూ లేడు.+

11 నేను నేనే యెహోవాను,+ నేను తప్ప వేరే రక్షకుడు లేడు.”+

12 “మీ మధ్య ఏ అన్య దేవుడూ లేనప్పుడు+

ప్రకటించింది నేనే, రక్షించింది నేనే, తెలియజేసింది నేనే.

కాబట్టి మీరే నా సాక్షులు” అని యెహోవా అంటున్నాడు, “నేనే దేవుణ్ణి.+

13 అంతేకాదు, నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను;+

నా చేతిలో నుండి ఎవ్వరూ ఏదీ లాక్కోలేరు.+

నేను చర్య తీసుకున్నప్పుడు ఎవరు దాన్ని అడ్డుకోగలరు?”+

14 నీ విమోచకుడూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ+ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు:

“మీ కోసం నేను వాళ్లను బబులోనుకు పంపించి, దాని ద్వారాల అడ్డగడియలన్నిటినీ విరగ్గొడతాను,+

తమ ఓడల్లో ఉన్న కల్దీయులు ఆర్తనాదాలు పెడతారు.+

15 నేను యెహోవాను, నీ పవిత్ర దేవుణ్ణి,+ ఇశ్రాయేలు సృష్టికర్తను,+ నీ రాజును.”+

16 సముద్రం గుండా దారిని,

అల్లకల్లోల జలాల మధ్య త్రోవను ఏర్పాటు చేసే+

యెహోవా ఇలా అంటున్నాడు;

17 అవును, యుద్ధ రథాల్ని, గుర్రాల్ని,

సైన్యాన్ని, బలమైన యోధుల్ని నడిపే దేవుడు+ ఇలా అంటున్నాడు:

“వాళ్లు పడుకొని తిరిగి లేవరు.+

వాళ్లు ఆర్పేయబడతారు, కాలుతున్న వత్తిలా ఊదేయబడతారు.”

18 “పాత సంగతుల్ని గుర్తుచేసుకోకండి,

గతం గురించి అదేపనిగా ఆలోచించకండి.

19 ఇదిగో! నేనొక కొత్త పని చేయబోతున్నాను;+

ఇప్పటికే అది మొదలైంది.

మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారా?

నేను ఎడారి గుండా దారిని ఏర్పాటు చేస్తాను,+

ఎడారి గుండా నదులు పారేలా చేస్తాను.+

20 అడవి జంతువులు నన్ను ఘనపరుస్తాయి,

నక్కలు, నిప్పుకోళ్లు నన్ను గౌరవిస్తాయి;

ఎందుకంటే నేను ఎంచుకున్న నా ప్రజలు+ తాగడానికి

ఎడారిలో నీళ్లను,

ఎడారిలో నదుల్ని దయచేస్తాను.+

21 నా కీర్తిని చాటడానికి

నా కోసం నేను రూపొందించుకున్న ప్రజలు వాళ్లు.+

22 అయితే యాకోబూ నువ్వు నాకు ప్రార్థించలేదు,+

ఎందుకంటే, ఇశ్రాయేలూ నువ్వు నా విషయంలో విసిగిపోయావు.+

23 నువ్వు సంపూర్ణ దహనబలులు అర్పించడానికి నా దగ్గరికి గొర్రెల్ని తేలేదు,

నీ బలులతో నన్ను మహిమపర్చలేదు.

నాకు కానుక తెమ్మని నేను నిన్ను బలవంతం చేయలేదు,

సాంబ్రాణి తీసుకురావాల్సిందే అంటూ నిన్ను విసిగించనూ లేదు.+

24 నీ డబ్బులతో నా కోసం సువాసన వెదజల్లే మొక్కను కొనలేదు,

నీ బలుల కొవ్వుతో నన్ను తృప్తిపర్చలేదు.+

బదులుగా నీ పాపాల భారాన్ని నా మీద మోపావు,

నీ దోషాలతో నన్ను విసిగించావు.+

25 నేను, అవును నేనే నా పేరు కోసం+ నీ దోషాల్ని* తుడిచేస్తున్నాను,+

నీ పాపాల్ని నేను గుర్తుచేసుకోను.+

26 నువ్వు నాకు గుర్తుచేయి; మన మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడుకుందాం;

నువ్వు నిర్దోషివని నిరూపించడానికి నీ వాదన వినిపించు.

27 నీ మొట్టమొదటి పూర్వీకుడు పాపం చేశాడు,

నీ మధ్యవర్తులు* నా మీద తిరుగుబాటు చేశారు.+

28 కాబట్టి పవిత్ర స్థల అధిపతుల్ని నేను అపవిత్రపరుస్తాను,

యాకోబును నాశనానికి అప్పగిస్తాను,

ఇశ్రాయేలు గురించి ఎగతాళిగా మాట్లాడుకునేలా చేస్తాను.+

44 “నా సేవకుడివైన యాకోబూ,

నేను ఎంచుకున్న ఇశ్రాయేలూ,+ విను.

 2 నిన్ను రూపొందించి, తయారుచేసి,

గర్భంలో ఉన్నప్పటి* నుండి నీకు సహాయం చేసిన+

యెహోవా ఇలా అంటున్నాడు:

‘నా సేవకుడివైన యాకోబూ,

నేను ఎంచుకున్న యెషూరూనూ*+ భయపడకు.+

 3 ఎందుకంటే నేను దాహంగా ఉన్న వాళ్ల* మీద నీళ్లను,

ఎండిన నేల మీద నీటి ప్రవాహాల్ని కుమ్మరిస్తాను.+

నీ సంతానం* మీద నా పవిత్రశక్తిని,

నీ వంశస్థుల మీద నా దీవెనను కుమ్మరిస్తాను.+

 4 వాళ్లు పచ్చగడ్డి మధ్య నాటబడిన మొక్కల్లా,

నీటి కాలువల పక్కన నాటబడిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.+

 5 ఒకతను, “నేను యెహోవాకు చెందినవాణ్ణి” అంటాడు.+

ఇంకొకతను యాకోబు పేరు పెట్టుకుంటాడు,

మరొకతను “నేను యెహోవాకు చెందినవాణ్ణి” అని తన చేతిమీద రాసుకుంటాడు.

అతను ఇశ్రాయేలు అనే మారుపేరు పెట్టుకుంటాడు.’

 6 ఇశ్రాయేలు రాజైన యెహోవా,+

అతని విమోచకుడూ,+ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

‘నేనే మొదటివాణ్ణి, నేనే చివరివాణ్ణి.+

నేను తప్ప వేరే దేవుడు లేడు.+

 7 నాలాంటి వాళ్లు ఎవరున్నారు?+

ఉంటే, అతను బిగ్గరగా మాట్లాడాలి, దాన్ని నాకు నిరూపించాలి!+

పురాతన కాలంలోని ప్రజల్ని స్థాపించినప్పటి నుండి నేను చేసినట్టు,

జరగబోతున్న సంగతుల్ని,

అలాగే ఇంకా జరగనివాటిని వాళ్లు చెప్పాలి.

 8 భయపడకండి,

భయంతో చచ్చుబడిపోకండి.+

మీలో ప్రతీ ఒక్కరికి నేను దాని గురించి ముందే చెప్పలేదా, ముందే ప్రకటించలేదా?

మీరే నా సాక్షులు.+

నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా?

లేడు, నేను తప్ప వేరే ఆశ్రయదుర్గం* లేడు;+ ఉన్నట్టు నాకు తెలీదు.’ ”

 9 చెక్కిన విగ్రహాలు తయారుచేసేవాళ్లు పనికిరానివాళ్లు,

వాళ్ల ప్రియమైన వస్తువుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు.+

అవి* సాక్ష్యం చెప్పలేవు, ఎందుకంటే అవి ఏమీ చూడలేవు, వాటికి ఏమీ తెలీదు,+

కాబట్టి వాటిని తయారుచేసిన వాళ్లు అవమానాలపాలు అవుతారు.+

10 ఏ ప్రయోజనం చేకూర్చని

దేవుణ్ణి లేదా పోత* విగ్రహాన్ని+ ఎవరు తయారుచేస్తారు?

11 ఇదిగో! అతని సహవాసులంతా అవమానాలపాలు అవుతారు!+

చేతిపనివాళ్లు కేవలం మనుషులు.

వాళ్లందర్నీ వచ్చి నిలబడమనండి.

వాళ్లు భయపడతారు, అంతా కలిసి అవమానాలపాలు అవుతారు.

12 కమ్మరి తన పనిముట్టుతో* నిప్పుల మీద ఇనుప వస్తువును తయారుచేస్తాడు.

తన శక్తివంతమైన బాహువు ఉపయోగించి

సుత్తితో దాన్ని మలుస్తాడు.+

తర్వాత అతనికి ఆకలేస్తుంది, అతని బలం క్షీణిస్తుంది;

నీళ్లు తాగకపోవడం వల్ల అతను నీరసించిపోతాడు.

13 వడ్రంగి కొలనూలు చాపి ఎర్రని సుద్ద ముక్కతో ఆకారం గీస్తాడు.

ఉలితో దాన్ని చెక్కి, వృత్తలేఖినితో దాన్ని సరిచూస్తూ ఉంటాడు.

దాన్ని గుడిలో కూర్చోబెట్టడానికి

మనిషి ఆకారంలో,+

మనిషి లాంటి సౌందర్యంతో దాన్ని చేస్తాడు.+

14 ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పని దేవదారు చెట్లను నరకడం.

అతను ఒక రకమైన చెట్టును, అంటే సింధూర చెట్టును ఎంచుకుంటాడు,

తర్వాత అడవిలోని చెట్ల+ మధ్య దాన్ని బలంగా ఎదగనిస్తాడు.

అతనొక తమాల వృక్షాన్ని నాటుతాడు, వర్షం దాన్ని పెంచుతుంది.

15 తర్వాత అది పొయ్యిలో పెట్టే కట్టెలుగా మారుతుంది.

కొన్ని కట్టెలతో అతను చలికాచుకుంటాడు;

మంట వెలిగించి, రొట్టె కాల్చుకుంటాడు.

అయితే అతను ఒక దేవుణ్ణి కూడా తయారుచేసుకొని, దాన్ని పూజిస్తాడు.

దానితో చెక్కుడు విగ్రహం తయారుచేసి, దానికి వంగి నమస్కారం చేస్తాడు.+

16 వాటిలో సగం కట్టెల్ని అతను అగ్నిలో కాలుస్తాడు;

ఆ సగం కట్టెలతో అతను మాంసాన్ని కాల్చుకొని తిని తృప్తి చెందుతాడు.

అంతేకాదు అతను చలికాచుకొని,

“ఆహా! ఈ మంటను చూస్తే వెచ్చగా ఉంది” అంటాడు.

17 మిగతావాటితో అతను ఒక దేవుణ్ణి, అంటే తన చెక్కుడు విగ్రహాన్ని తయారుచేసుకుంటాడు.

దానికి వంగి నమస్కారం చేసి, దాన్ని పూజిస్తాడు.

దానికి ప్రార్థిస్తూ,

“నన్ను కాపాడు, ఎందుకంటే నువ్వే నా దేవుడివి”+ అంటాడు.

18 వాళ్లకు ఏమీ తెలీదు, ఏమీ అర్థంకాదు,+

ఎందుకంటే వాళ్ల కళ్లు గట్టిగా మూయబడ్డాయి, వాళ్లు చూడలేరు,

వాళ్ల హృదయానికి లోతైన అవగాహన లేదు.

19 ఎవరూ తమ హృదయాల్లో ఆలోచించట్లేదు;

“సగం కట్టెల్ని మంటల్లో కాల్చాను,

దాని నిప్పుల్లో రొట్టెను, మాంసాన్ని కాల్చుకొని తిన్నాను.

అలాంటిది, మిగతా కట్టెలతో నేను అసహ్యమైన దాన్ని చేయడం ఏంటి?+

చెట్టు నుండి తీయబడిన చెక్కముక్కకు* మొక్కడం ఏంటి?”

అని ఆలోచించడానికి ఎవరికీ జ్ఞానం గానీ అవగాహన గానీ లేదు.

20 అతను బూడిద తింటాడు.

మోసపోయిన అతని హృదయమే అతన్ని తప్పుదారి పట్టించింది.

అతను తనను తాను కాపాడుకోలేడు,

“నా కుడిచేతిలో ఉన్నది అబద్ధం కదా?” అని అనుకోడు.

21 “యాకోబూ, ఇశ్రాయేలూ, ఈ సంగతులు గుర్తుంచుకో,

ఎందుకంటే నువ్వు నా సేవకుడివి.

నేనే నిన్ను తయారుచేశాను, నువ్వు నా సేవకుడివి.+

ఇశ్రాయేలూ, నేను నిన్ను మర్చిపోను.+

22 మేఘంతో కప్పేసినట్టు నీ దోషాల్ని,

దట్టమైన మేఘంతో కప్పేసినట్టు నీ పాపాల్ని నేను తుడిచేస్తాను.+

నా దగ్గరికి తిరిగి రా, ఎందుకంటే నేను నిన్ను తిరిగి కొంటాను.+

23 ఆకాశమా, సంతోషంతో కేకలు వేయి,

ఎందుకంటే యెహోవా చర్య తీసుకున్నాడు!

భూమి అగాధ స్థలాల్లారా, విజయోత్సాహంతో కేకలు వేయండి!

పర్వతాల్లారా, సంతోషంతో కేకలు వేయండి!+

అడవీ! నువ్వూ, నీలోని వృక్షాలన్నీ సంతోషంతో కేకలు వేయాలి!

ఎందుకంటే, యెహోవా యాకోబును తిరిగి కొన్నాడు,

ఇశ్రాయేలు మీద తన వైభవాన్ని కనబరుస్తున్నాడు.”+

24 తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నిన్ను రూపొందించిన

నీ విమోచకుడైన యెహోవా+ ఇలా అంటున్నాడు:

“నేను యెహోవాను, సమస్తాన్ని సృష్టించింది నేనే.

నేనే స్వయంగా ఆకాశాన్ని విస్తరింపజేశాను,+

నేనే భూమిని పరిచాను.+

అప్పుడు నాతో ఎవరున్నారు?

25 వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ల* సూచనల్ని నేను వమ్ము చేస్తున్నాను,

సోదె చెప్పేవాళ్లు మూర్ఖుల్లా ప్రవర్తించేట్టు చేస్తున్నది నేనే;+

తెలివిగలవాళ్లను గందరగోళంలో పడేసి

వాళ్ల జ్ఞానాన్ని మూర్ఖత్వంగా మారుస్తున్నది నేనే;+

26 తన సేవకుని మాటను నిజమయ్యేలా చేస్తున్నది

తన సందేశకుల ప్రవచనాల్ని పూర్తిగా నెరవేరుస్తున్నది నేనే;+

యెరూషలేము గురించి, ‘అది నివాస స్థలమౌతుంది’ అని చెప్తున్నది,+

యూదా నగరాల గురించి, ‘అవి తిరిగి కట్టబడతాయి,+

దాని శిథిలాల్ని నేను బాగుచేస్తాను’+ అని చెప్తున్నది నేనే;

27 అగాధ జలాలతో ‘ఆవిరైపోండి,

నేను మీ నదులన్నిటినీ ఎండిపోజేస్తాను’+ అని చెప్తున్నది నేనే;

28 కోరెషు+ గురించి, ‘ఇతను నా మంద కాపరి,

ఇతను నా ఇష్టాన్నంతా పూర్తిగా నెరవేరుస్తాడు’+ అని చెప్తున్నది నేనే;

యెరూషలేము గురించి, ‘అది తిరిగి కట్టబడుతుంది’ అనీ,

దాని ఆలయం గురించి, ‘నీ పునాది వేయబడుతుంది’ అనీ చెప్తున్నది నేనే.”+

45 కోరెషును అభిషేకించి,

దేశాల్ని అతనికి అప్పగించడానికి,+

రాజుల బలాన్ని తీసేయడానికి,*

ద్వారాలు మూయబడకుండా

అతని ఎదుట తలుపులు తెరవడానికి

అతని కుడిచేతిని పట్టుకొనివున్న+ యెహోవా అతనితో ఇలా అంటున్నాడు:+

 2 “నేను నీకు ముందుగా వెళ్తూ+

కొండల్ని చదును చేస్తాను.

రాగి తలుపుల్ని ముక్కలుముక్కలు చేస్తాను,

ఇనుప అడ్డగడియల్ని విరగ్గొడతాను.+

 3 నేను చీకట్లో ఉన్న సంపదల్ని,

రహస్య స్థలాల్లో ఉన్న గుప్తనిధుల్ని నీకు ఇస్తాను;+

అప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని,

నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నది నేనే+ అని నువ్వు తెలుసుకుంటావు.

 4 నా సేవకుడైన యాకోబు కోసం, నేను ఎంచుకున్న ఇశ్రాయేలు కోసం

నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను.

నేనెవరో నీకు తెలియకపోయినా నేను నీకు గొప్ప పేరును ఇస్తున్నాను.

 5 నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.

నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు.+

నేనెవరో నీకు తెలియకపోయినా నేను నిన్ను బలపరుస్తాను,*

 6 నేను కాకుండా మరెవ్వరూ లేరని,

తూర్పు నుండి పడమర* వరకున్న

ప్రజలు తెలుసుకునేలా నేను నిన్ను బలపరుస్తాను.+

నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+

 7 వెలుగును, చీకటిని సృష్టించేది నేనే.+

శాంతిని, విపత్తును కలగజేసేది నేనే;+

యెహోవానైన నేనే వీటన్నిటిని చేస్తున్నాను.

 8 ఆకాశమా, పైనుండి వర్షాన్ని కురిపించు;+

మేఘాలు నీతిని కుమ్మరించాలి.

భూమి నోరు తెరిచి రక్షణను ఫలించాలి,

అదే సమయంలో అది నీతిని మొలిపించాలి.+

యెహోవానైన నేనే దాన్ని సృష్టించాను.”

 9 తనను సృష్టించిన* దేవునితో వాదించే* వాడికి శ్రమ!

ఎందుకంటే, అతను నేలమీద పడివున్న కుండ పెంకుల్లో

ఒక పెంకు మాత్రమే!

బంకమట్టి కుమ్మరివాడితో,* “నువ్వు ఏం తయారు చేస్తున్నావు?” అని అనొచ్చా?+

నువ్వు చేసిన వస్తువు, “ఇతనికి చేతులు లేవు” అని అనొచ్చా?*

10 ఒక తండ్రితో, “నువ్వు ఎవరికి తండ్రివయ్యావు?” అని,

ఒక స్త్రీతో, “నువ్వు ఎవర్ని కన్నావు?”* అని అనేవాడికి శ్రమ!

11 ఇశ్రాయేలును రూపొందించిన అతని పవిత్ర దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:

“జరగబోయేవాటి గురించి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా?

నా కుమారుల+ గురించి, నా చేతి పనుల గురించి నాకు ఆజ్ఞాపిస్తావా?

12 నేనే భూమిని తయారుచేశాను,+ దానిమీద మనిషిని సృష్టించాను.+

నేనే స్వయంగా నా చేతులతో ఆకాశాన్ని విస్తరింపజేశాను,+

వాటి సైన్యమంతటికీ+ నేనే ఆదేశాలిస్తాను.”

13 “నేను నీతితో ఒక మనిషిని బయల్దేరజేశాను,+

నేను అతని దారులన్నిటినీ చదును చేస్తాను.

అతనే నా నగరాన్ని కడతాడు,+

మూల్యం గానీ లంచం గానీ తీసుకోకుండానే+ చెరలో ఉన్న నా వాళ్లను విడిపిస్తాడు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

14 యెహోవా ఇలా చెప్తున్నాడు:

“ఐగుప్తు లాభం,* ఇతియోపియా వర్తకం* నీవి అవుతాయి;

ఎత్తుగా ఉండే సెబాయీయులు నీ దగ్గరికి వచ్చి నీవాళ్లు అవుతారు.

వాళ్లు సంకెళ్లతో నీ వెనక నడుస్తారు.

వాళ్లు వచ్చి, నీకు వంగి నమస్కారం చేస్తారు.+

వాళ్లు భక్తితో ఇలా అంటారు: ‘నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు,+

ఆయన కాకుండా ఇంకెవ్వరూ లేరు; ఆయన తప్ప వేరే ఏ దేవుడూ లేడు.’ ”

15 ఇశ్రాయేలు దేవా, రక్షకుడా,

నిజంగా నువ్వు నీ మార్గాల్ని దాచివుంచే దేవుడివి.+

16 వాళ్లంతా సిగ్గుపర్చబడతారు, అవమానాలపాలు అవుతారు;

విగ్రహాల్ని చేసేవాళ్లంతా తలవంపుతో వెళ్లిపోతారు.+

17 కానీ యెహోవా ఇశ్రాయేలును శాశ్వతంగా కాపాడతాడు.+

నువ్వు ఎప్పటికీ సిగ్గుపర్చబడవు, అవమానాలపాలు కావు.+

18 యెహోవా ఆకాశాన్ని సృష్టించాడు,+ ఆయనే సత్యదేవుడు;

ఆయన భూమిని నిర్మించి, దాన్ని రూపొందించి, బలంగా స్థిరపర్చాడు;+

ఆయన భూమిని ఊరికే* చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు;+

ఆయన ఇలా అంటున్నాడు:

“నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.

19 నేను రహస్య స్థలంలో, చీకటిగల దేశంలో మాట్లాడలేదు;+

‘ఊరికే* నన్ను వెదకండి’ అని

నేను యాకోబు సంతానంతో* అనలేదు.

నేను యెహోవాను, నేను నీతిగల మాటలు మాట్లాడతాను, నిజాయితీగల విషయాలు ప్రకటిస్తాను.+

20 మీరంతా సమకూడి రండి.

దేశాల నుండి తప్పించుకున్నవాళ్లారా,+ అందరూ కలిసి రండి.

చెక్కిన విగ్రహాల్ని మోసుకెళ్తూ,

తమను కాపాడలేని దేవునికి ప్రార్థించే వాళ్లకు+ ఏమీ తెలీదు.

21 మీ నివేదికను తయారు చేయండి, మీ వ్యాజ్యాన్ని వినిపించండి.

వాళ్లందర్నీ కలిసి చర్చించుకోనివ్వండి.

ఎవరు దీని గురించి పూర్వకాలంలోనే ప్రవచించారు?

ఎవరు పురాతన కాలాల నుండే దీన్ని ప్రకటిస్తూ వచ్చారు?

యెహోవానైన నేను కాదా?

నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు;

నేను నీతిగల దేవుణ్ణి, రక్షకుణ్ణి,+ నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+

22 భూమి అంచుల్లో నివసిస్తున్న ప్రజలారా, మీరంతా నా వైపు తిరిగి, రక్షణ పొందండి,+

ఎందుకంటే నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+

23 నా తోడు అని నేను ప్రమాణం చేశాను;

నీతిగల మాట నా నోటి నుండి బయల్దేరింది,

అది ఖచ్చితంగా నెరవేరుతుంది:+

ప్రతీ మోకాలు నా ముందు వంగుతుంది,

ప్రతీ నాలుక విశ్వసనీయతను ప్రమాణం చేస్తూ+

24 ఇలా అంటుంది, ‘అవును, నిజమైన నీతి, బలం యెహోవా సొంతం.

ఆయన మీద కోపగించుకున్న వాళ్లందరూ అవమానంతో ఆయన ముందుకు వస్తారు.

25 యెహోవాను బట్టి, ఇశ్రాయేలు సంతానమంతా* చేసింది సరైనదని నిరూపించబడుతుంది,+

ఆయన్ని బట్టే వాళ్లు గొప్పలు చెప్పుకుంటారు.’ ”

46 బేలు వంగుతోంది,+ నెబో తొంగి చూస్తోంది.

వాటి విగ్రహాలు జంతువుల మీద, బరువులు మోసే పశువుల మీద పెట్టబడ్డాయి,+

అవి అలసిన జంతువుల మీద బరువైన సామానులా ఉన్నాయి.

 2 అవన్నీ కలిసి తొంగి చూస్తున్నాయి, వంగుతున్నాయి;

అవి ఆ బరువుల్ని* విడిపించుకోలేవు,

స్వయంగా అవే చెరలోకి వెళ్తాయి.

 3 “యాకోబు ఇంటివాళ్లారా, ఇశ్రాయేలు ఇంటివాళ్లలో మిగిలినవాళ్లారా,+ మీరంతా నా మాట వినండి,

మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని కాపాడుతూ వచ్చాను, గర్భంలో ఉన్నప్పటి నుండి మిమ్మల్ని మోస్తూ వచ్చాను.+

 4 మీరు ముసలివాళ్లు అయ్యేవరకు నేను ఒకేలా ఉంటాను;+

మీ తల నెరిసే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను.

ఇప్పటివరకు చేసినట్టే, నేను మిమ్మల్ని మోస్తాను, ఎత్తుకుంటాను, కాపాడతాను.+

 5 మేము ఒకేలా ఉన్నామని మీరు నన్ను ఎవరితో పోలుస్తారు?+

నన్ను ఎవరితో సమానం చేస్తారు? నేను ఎవరిలా ఉన్నానని అంటారు?+

 6 తమ సంచుల్లో నుండి విస్తారంగా బంగారాన్ని బయటికి తీసేవాళ్లు ఉన్నారు;

వాళ్లు త్రాసులో వెండిని తూకం వేస్తారు.

కంసాలిని కూలికి తెచ్చుకుంటారు, అతను దానితో ఒక దేవుణ్ణి చేస్తాడు.+

తర్వాత వాళ్లు దానికి సాష్టాంగ నమస్కారం చేస్తారు; అవును, దాన్ని పూజిస్తారు.*+

 7 వాళ్లు దాన్ని భుజాల మీదికి ఎత్తుకుంటారు;+

దాన్ని మోసుకెళ్లి, దాని స్థలంలో ఉంచుతారు, అది అక్కడే ఉండిపోతుంది.

దాని చోటు నుండి అది కదలదు.+

వాళ్లు దానికి మొరపెట్టుకుంటారు, కానీ అది జవాబివ్వదు;

అది ఎవ్వర్నీ కష్టాల్లో నుండి తప్పించలేదు.+

 8 దీన్ని గుర్తుంచుకోండి, ధైర్యం తెచ్చుకోండి.

దోషులారా, దీని గురించి ఆలోచించండి.

 9 పూర్వకాలం నాటి పాత* సంగతుల్ని గుర్తుచేసుకోండి,

నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు అని జ్ఞాపకముంచుకోండి.

నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు.

10 మొదటి నుండి నేనే చివరికి ఏమౌతుందో చెప్తున్నాను,

ఎప్పటినుండో నేనే ఇంకా జరగని సంగతుల్ని చెప్తున్నాను.+

‘నా నిర్ణయం* నిలుస్తుంది,+

నాకు ఏది ఇష్టమో అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.+

11 నేను తూర్పు* నుండి వేట పక్షిని పిలుస్తున్నాను,+

సుదూర దేశం నుండి నా నిర్ణయాన్ని* అమలు చేసే వ్యక్తిని పిలుస్తున్నాను.+

నేను చెప్పాను, దాన్ని జరిగిస్తాను.

నేను దాన్ని సంకల్పించాను, దాన్ని నెరవేరుస్తాను కూడా.+

12 మొండి హృదయంగల ప్రజలారా,

నీతికి దూరంగా ఉన్న ప్రజలారా, నా మాట వినండి.

13 నేను నా నీతిని దగ్గరికి తీసుకొచ్చాను;

అది దూరంలో లేదు,

నేను దయచేసే రక్షణ ఆలస్యం అవ్వదు.+

నేను సీయోనులో రక్షణను కలగజేస్తాను, ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తాను.”+

47 బబులోను కన్యా,+

కిందికి దిగివచ్చి ధూళిలో కూర్చో.

కల్దీయుల కుమారీ,

సింహాసనం లేని చోట నేలమీద కూర్చో.+

ఎందుకంటే, ప్రజలు ఇంకెప్పుడూ నిన్ను సుకుమారి, గారాలపట్టి అని అనరు.

 2 తిరుగలి తీసుకొని పిండి విసురు.

నీ ముసుగు తీసేయి.

నీ కాళ్ల మీద వేలాడుతున్న వస్త్రం పైకెత్తి

నదులు దాటు.

 3 నువ్వు దిగంబరిగా చేయబడతావు.

నీకు కలిగే అవమానాన్ని అందరూ చూస్తారు.

నేను పగ తీర్చుకుంటాను,+ నా దారికి ఎవరూ అడ్డురారు.*

 4 “మమ్మల్ని తిరిగి కొంటున్నది

ఇశ్రాయేలు పవిత్ర దేవుడు;

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.”+

 5 కల్దీయుల కూతురా,

నువ్వు అక్కడ మౌనంగా కూర్చొని, చీకట్లోకి వెళ్లు;+

ప్రజలు ఇంకెప్పుడూ నిన్ను రాజ్యాలకు దొరసాని* అని అనరు.+

 6 నా ప్రజల మీద నాకు చాలా కోపమొచ్చింది.+

నేను నా స్వాస్థ్యాన్ని మలినపర్చాను,+

వాళ్లను నీ చేతికి అప్పగించాను.+

కానీ నువ్వు వాళ్ల మీద కరుణ చూపించలేదు.+

ముసలివాళ్ల మీద కూడా నువ్వు బరువైన కాడిని మోపావు.+

 7 “నేను ఎప్పటికీ దొరసానిగానే* ఉంటాను” అని నువ్వు అనుకున్నావు.+

నువ్వు ఈ విషయాల మీద మనసు పెట్టలేదు;

చివరికి ఏమౌతుందో ఆలోచించలేదు.

 8 సుఖాల్ని ప్రేమించేదానా,+

సురక్షితంగా కూర్చొని, “నాలాంటివాళ్లు ఎవ్వరూ లేరు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు.+

నేను విధవరాలిని అవ్వను.

నాకు ఎన్నడూ పుత్రశోకం కలగదు” అని హృదయంలో అనుకుంటున్నదానా,+

ఈ మాటలు విను.

 9 వైధవ్యం, పుత్రశోకం రెండూ

అకస్మాత్తుగా, ఒకేరోజు నీకు కలుగుతాయి.+

నువ్వు ఎన్నో మంత్రతంత్రాలు చేస్తున్నావు, శక్తివంతమైన మంత్రాలు పలుకుతున్నావు+ కాబట్టి,*

అవి పూర్తిస్థాయిలో నీ మీదికి వస్తాయి.+

10 నువ్వు నీ దుష్టత్వాన్ని నమ్ముకున్నావు.

“ఎవరూ నన్ను చూడట్లేదు” అనుకున్నావు.

నీ తెలివి, జ్ఞానమే నిన్ను తప్పుదారి పట్టించాయి,

“నాలాంటివాళ్లు ఎవ్వరూ లేరు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు” అని నీ హృదయంలో అనుకుంటున్నావు.

11 కానీ నీ మీదికి విపత్తు ముంచుకొస్తుంది,

నీ మంత్రాలేవీ దాన్ని ఆపలేవు.*

నీకు పెద్ద కష్టం వస్తుంది; నువ్వు దాన్ని తప్పించుకోలేవు.

నీకెన్నడూ తెలియని నాశనం హఠాత్తుగా నీ మీదికి వస్తుంది.+

12 కాబట్టి, నువ్వు బాల్యం నుండి కష్టపడి చేస్తూ ఉన్న

మంత్రాల్ని, ఎన్నో మంత్రవిద్యల్ని+ చేస్తూనే ఉండు.

అవి నీకు మేలు చేస్తాయేమో;

వాటితో నువ్వు ప్రజల్ని భయపెట్టగలుగుతావేమో.

13 అనేకమంది సలహాదారుల వల్ల నువ్వు అలసిపోయావు.

ఇప్పుడు వాళ్లను లేచి నిన్ను కాపాడమను.

వాళ్లు ఆకాశాన్ని పూజిస్తారు,* నక్షత్రాల్ని గమనిస్తారు,+

నీ మీదికి రాబోయేవాటి గురించిన సంగతుల్ని

అమావాస్య రోజుల్లో నీకు తెలియజేస్తారు.

14 ఇదిగో! వాళ్లు కొయ్యకాలు* లాంటివాళ్లు.

అగ్ని వాళ్లను దహించేస్తుంది.

వాళ్లు అగ్నిజ్వాల శక్తి నుండి తమను తాము కాపాడుకోలేరు.

అవి వెచ్చదనమిచ్చే బొగ్గులు కాదు,

అది చలి కాచుకునే మంట కాదు.

15 నీ బాల్యం నుండి నువ్వు ఎవరితోనైతే శ్రమించావో

ఆ మంత్రగాళ్లు* నీ విషయంలో అలా తయారౌతారు.

వాళ్లు దారితప్పి, చెదిరిపోయి ఒక్కొక్కరు ఒక్కో వైపు* వెళ్లిపోతారు.

నిన్ను కాపాడేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+

48 యాకోబు ఇంటివాళ్లారా, ఈ మాట వినండి.

మీరు ఇశ్రాయేలు పేరు పెట్టుకుంటారు,+

మీరు యూదా జలాల నుండి* వచ్చినవాళ్లు;

మీరు యెహోవా పేరున ప్రమాణం చేస్తారు,+

ఇశ్రాయేలు దేవునికి ప్రార్థిస్తారు,

కానీ సత్యంతో, నీతితో కాదు.+

 2 ఈ ప్రజలు పవిత్ర నగరవాసులమని చెప్పుకుంటారు,+

ఇశ్రాయేలు దేవుని సహాయాన్ని కోరతారు,+

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.

 3 “నేను పాత* సంగతుల్ని చాలాకాలం క్రితమే మీకు చెప్పాను.

అవి స్వయంగా నా నోటి నుండే వచ్చాయి,

నేనే వాటిని తెలియజేశాను.+

నేను అకస్మాత్తుగా చర్య తీసుకున్నాను, అవి జరిగిపోయాయి.+

 4 మీరు చాలా మొండివాళ్లని,

మీ మెడ ఇనుప నరమని, మీ నొసలు రాగిదని నాకు తెలుసు+ కాబట్టి,

 5 చాలాకాలం క్రితమే నేను మీకు చెప్పాను.

అది జరగకముందే, నేను దాన్ని మీకు వినిపించాను,

‘మా విగ్రహం దీన్ని చేసింది; మా చెక్కుడు విగ్రహం, మా పోత* విగ్రహం దీన్ని ఆజ్ఞాపించాయి’

అని మీరు అనకుండా ఉండాలని అలా చెప్పాను.

 6 అదంతా మీరు విన్నారు, చూశారు.

మీరు దాన్ని ప్రకటించరా?+

ఇప్పటినుండి నేను మీకు కొత్త సంగతుల్ని

అంటే మీకు తెలియని వాటిని, భద్రంగా దాచివుంచిన వాటిని మీకు ప్రకటిస్తున్నాను.+

 7 చాలాకాలం క్రితం కాదు ఇప్పుడే అవి సృష్టించబడుతున్నాయి,

ఈ రోజుకు ముందు మీరెప్పుడూ వాటి గురించి వినలేదు,

కాబట్టి, ‘ఇదిగో! అవి మాకు ముందే తెలుసు’ అని మీరు అనలేరు.

 8 మీరు వాటి గురించి విననే వినలేదు,+ మీకు అవి తెలీదు,

గతంలో మీ చెవులు తెరవబడలేదు.

మీరు వట్టి నమ్మకద్రోహులని నాకు తెలుసు,+

పుట్టినప్పటి నుండే మీకు దోషులనే పేరుంది.+

 9 కానీ నా పేరు కోసం, నేను నా కోపాన్ని అదుపు చేసుకుంటాను,+

నా సొంత మహిమ కోసం నన్ను నేను అణుచుకుంటాను,

నేను మిమ్మల్ని తుడిచిపెట్టను.+

10 ఇదిగో! నేను మిమ్మల్ని శుద్ధి చేశాను, కానీ వెండిలా కాదు.+

కష్టాల కొలిమిలో నేను మిమ్మల్ని పరీక్షించాను.*+

11 నా కోసం, అవును, నా కోసమే నేను చర్య తీసుకుంటాను,+

ఎందుకంటే, నా పేరును నేనెలా అపవిత్రం కానిస్తాను?+

నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను.*

12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను.

నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను.+ నేనే మొదటివాణ్ణి; నేనే చివరివాణ్ణి కూడా.+

13 నా చెయ్యే భూమికి పునాది వేసింది,+

నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరిచింది.+

నేను పిలిచినప్పుడు, అవన్నీ కలిసి నిలబడతాయి.

14 మీరంతా కలిసి ఒక్కచోటికి చేరి వినండి.

ఆ దేవుళ్లలో* ఎవరు వీటిని ప్రకటించారు?

యెహోవా అతన్ని ప్రేమించాడు.+

అతను బబులోను విషయంలో ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాడు,+

అతని బాహువు కల్దీయుల మీదికి వస్తుంది.+

15 నేనే స్వయంగా అలా చెప్పాను, నేనే అతన్ని పిలిచాను.+

నేనే అతన్ని తీసుకొచ్చాను, అతను చేసేది సఫలమౌతుంది.+

16 నా దగ్గరికి వచ్చి, ఇది విను.

మొదటి నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు.+

అది జరిగినప్పటి నుండి నేను అక్కడ ఉన్నాను.”

ఇప్పుడు సర్వోన్నత ప్రభువైన యెహోవా నన్ను పంపించాడు, తన పవిత్రశక్తిని కూడా నాకు ఇచ్చాడు.

17 నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు:

“యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి.

నీకు ప్రయోజనం కలిగేలా* నేనే నీకు బోధిస్తున్నాను,+

నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.+

18 నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది!+

అప్పుడు నీ శాంతి నదిలా,+

నీ నీతి సముద్ర తరంగాల్లా+ ఉంటుంది.

19 నీ సంతానం* ఇసుకంత విస్తారంగా తయారౌతుంది,

నీ వంశస్థులు ఇసుక రేణువులంతమంది అవుతారు.+

వాళ్ల పేరు నా ముందు నుండి ఎన్నడూ కొట్టివేయబడదు, తుడిచిపెట్టబడదు.”

20 బబులోను నుండి బయటికి వెళ్లండి!+

కల్దీయుల నుండి పారిపోండి!

సంతోషంతో కేకలు వేస్తూ దాన్ని చాటించండి! ప్రకటించండి!+

భూమి అంచుల వరకు దాన్ని తెలియజేయండి.+

ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడైన యాకోబును తిరిగి కొన్నాడు.+

21 ఆయన వాళ్లను ఎడారి ప్రాంతాల గుండా నడిపించినప్పుడు వాళ్లకు దాహం వేయలేదు.+

ఆయన వాళ్ల కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశాడు;

ఆయన బండను చీల్చి నీళ్లు పెల్లుబికేలా చేశాడు.”+

22 “దుష్టులకు మనశ్శాంతి ఉండదు” అని యెహోవా చెప్తున్నాడు.+

49 ద్వీపాల్లారా, నా మాట వినండి,

సుదూర దేశాల్లారా,+ శ్రద్ధగా ఆలకించండి,

నేను పుట్టకముందే* యెహోవా నన్ను పిలిచాడు.+

నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నా పేరును ప్రస్తావించాడు.

 2 ఆయన నా నోటిని పదునైన ఖడ్గంలా చేశాడు;

తన చేతి నీడలో నన్ను దాచివుంచాడు.+

ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేశాడు;

తన అంబులపొదిలో నన్ను దాచాడు.

 3 ఆయన నాతో, “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి,+

నీ ద్వారా నేను నా వైభవాన్ని కనబరుస్తాను”+ అన్నాడు.

 4 కానీ నేనిలా అన్నాను: “నేను వృథాగా ప్రయాసపడ్డాను.

బూటకమైన దాని కోసం నా బలాన్ని వ్యర్థంగా ఉపయోగించాను.

అయితే ఖచ్చితంగా యెహోవా నాకు న్యాయం తీరుస్తాడు,

నా దేవుడే నాకు జీతాన్ని* ఇస్తాడు.”+

 5 నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నన్ను తన సేవకునిగా నిర్మించిన యెహోవా

ఇశ్రాయేలు తన దగ్గరికి చేర్చబడేలా

యాకోబును తన దగ్గరికి తిరిగి తీసుకురమ్మని ఇప్పుడు నాకు చెప్పాడు.+

నేను యెహోవా దృష్టిలో మహిమపర్చబడతాను,

నా దేవుడే నా బలం అవుతాడు.

 6 ఆయనిలా అన్నాడు: “యాకోబు గోత్రాల్ని ఉద్ధరించి,

ఇశ్రాయేలులో కాపాడబడిన వాళ్లను తిరిగి తీసుకొచ్చేలా

నేను నిన్ను నా సేవకునిగా మాత్రమే నియమించలేదు.

నా రక్షణ భూమి అంచుల వరకు చేరుకునేలా+

దేశాలకు వెలుగుగా కూడా నిన్ను ఇచ్చాను.”+

7 తృణీకరించబడిన,+ దేశం అసహ్యించుకున్న, పరిపాలకులకు సేవకునిగా ఉన్న వానితో ఇశ్రాయేలు విమోచకుడూ అతని పవిత్ర దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“నిన్ను ఎంచుకున్న+ నమ్మకమైన దేవుడూ,+

ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవాను బట్టి,

రాజులు చూసి, లేచి నిలబడతారు,

అధిపతులు వంగి నమస్కారం చేస్తారు.”

 8 యెహోవా ఇలా అంటున్నాడు:

“అనుకూల సమయంలో* నేను నీకు జవాబిచ్చాను,+

రక్షణ రోజున నేను నీకు సహాయం చేశాను;+

నిన్ను ప్రజలకు ఒక ఒప్పందంగా ఇవ్వడానికి,

దేశాన్ని తిరిగి నివాసయోగ్యంగా మార్చడానికి,

నిర్మానుష్యమైన తమ స్వాస్థ్యాలను వాళ్లు తిరిగి పొందేలా చేయడానికి+

నేను నిన్ను కాపాడుతూ వచ్చాను.+

 9 నువ్వు, ‘బయటికి రండి!’ అని ఖైదీలతో,+

‘బయటికి వచ్చి కనబడండి!’ అని చీకట్లో ఉన్నవాళ్లతో+ చెప్పడానికి అలా కాపాడుతూ వచ్చాను.

వాళ్లు దారుల వెంబడి భోజనం చేస్తారు,

పాతబడిన దారులన్నిట్లో* వాళ్ల పచ్చికబయళ్లు ఉంటాయి.

10 వాళ్లు ఆకలిదప్పులతో అలమటించరు,+

మండుటెండ వాళ్లను బాధించదు, వాళ్లకు వడదెబ్బ తగలదు.+

ఎందుకంటే, వాళ్లమీద కరుణ చూపించే దేవుడు వాళ్లను నడిపిస్తాడు,+

నీటి ఊటల దగ్గర వాళ్లను నడిపిస్తాడు.+

11 నేను నా పర్వతాలన్నిటినీ దారిగా మారుస్తాను,

నా రహదారులు ఎత్తు చేయబడతాయి.+

12 చూడండి! వీళ్లు చాలా దూరం నుండి వస్తున్నారు,+

ఇదిగో! వీళ్లు ఉత్తరం నుండి, పడమర నుండి వస్తున్నారు,

వీళ్లు సీనీము దేశం నుండి వస్తున్నారు.”+

13 ఆకాశమా, సంతోషంతో కేకలు వేయి; భూమీ, ఆనందించు.+

పర్వతాలు ఆనందంతో కేకలు వేస్తూ ఉల్లసించాలి.+

ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని ఓదార్చాడు,+

బాధల్లో ఉన్న తన సొంత ప్రజల మీద ఆయన కరుణ చూపిస్తాడు.+

14 కానీ సీయోను మాత్రం, “యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు,+

యెహోవా నన్ను మర్చిపోయాడు”+ అని అంటూ ఉంది.

15 స్త్రీ, పాలుతాగే తన చంటిబిడ్డను మర్చిపోతుందా?

తన కడుపున పుట్టిన బిడ్డ మీద కనికరం చూపించకుండా ఉంటుందా?

వాళ్లయినా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోను.+

16 ఇదిగో! నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను.

నీ ప్రాకారాలు ఎప్పుడూ నా ముందు ఉన్నాయి.

17 నీ కుమారులు త్వరత్వరగా తిరిగొస్తున్నారు.

నిన్ను పడగొట్టి, నాశనం చేసినవాళ్లు నీ దగ్గర నుండి వెళ్లిపోతారు.

18 నీ తల ఎత్తి చుట్టూ చూడు.

వాళ్లంతా ఒక్కచోటికి చేరుతున్నారు.+

వాళ్లు నీ దగ్గరికి వస్తున్నారు.

యెహోవా ఇలా అంటున్నాడు: “నా జీవం తోడు,

ఆభరణాల్ని ధరించుకున్నట్టు నువ్వు వాళ్లందర్నీ ధరించుకుంటావు,

పెళ్లికూతురిలా వాళ్లందర్నీ ఒడ్డాణంగా పెట్టుకుంటావు.

19 నీ స్థలాలు నాశనం చేయబడి నిర్మానుష్యంగా తయారైనా, నీ దేశం శిథిలాలుగా మారినా,+

ఇప్పుడది దాని నివాసులకు చాలా ఇరుకుగా తయారౌతుంది,+

నిన్ను మింగేసినవాళ్లు+ చాలా దూరంలో ఉంటారు.+

20 నీకు పుత్రశోకం కలిగిన తర్వాత పుట్టిన కుమారులు నీకు వినిపించేలా ఈ మాటలు అంటారు,

‘ఈ చోటు మాకు చాలా ఇరుకుగా ఉంది.

మేము ఇక్కడ నివసించడానికి స్థలం ఏర్పాటు చేయి.’+

21 నువ్వు నీ హృదయంలో ఇలా అనుకుంటావు,

‘నేను పుత్రశోకం కలిగిన స్త్రీని, గొడ్రాలిని,

బందీగా చెరలోకి వెళ్లినదాన్ని,

నాకు ఇవ్వబడిన వీళ్లు ఎవరి పిల్లలు? వీళ్ల తండ్రి ఎవరు?

వీళ్లను పెంచింది ఎవరు?+

ఇదిగో! నేను ఒంటరిగా వదిలేయబడినదాన్ని,+

మరి వీళ్లు ఎక్కడి నుండి వచ్చారు?’ ”+

22 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో! దేశాలు చూసేలా నా చెయ్యి ఎత్తుతాను,

జనాలకు కనిపించేలా నా ధ్వజాన్ని* నిలబెడతాను.+

వాళ్లు తమ బాహువుల* మీద నీ కుమారుల్ని,

తమ భుజాల మీద నీ కూతుళ్లను మోసుకొని వస్తారు.+

23 రాజులు నీ సంరక్షకులుగా ఉంటారు,+

వాళ్ల రాణులు నీకు దాదీలు అవుతారు.

వాళ్లు తమ తలలు నేలకు వంచి నీకు నమస్కారం చేస్తారు,+

నీ పాదాల ధూళిని నాకుతారు,+

అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు;

నా మీద ఆశపెట్టుకునేవాళ్లు సిగ్గుపర్చబడరు.”+

24 బలవంతుని చేతిలో నుండి చెరపట్టబడిన వాళ్లను విడిపించడం సాధ్యమేనా?

నిరంకుశ పాలకుని కింద ఉన్న బందీలను తప్పించడం సాధ్యమేనా?

25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు:

“బలవంతుని చేతిలో ఉన్న బందీలు కూడా విడిపించబడతారు.+

నిరంకుశ పాలకుడు చెరపట్టినవాళ్లు తప్పించబడతారు.+

నిన్ను ఎదిరించేవాళ్లను నేను ఎదిరిస్తాను,+

నీ సొంత కుమారుల్ని నేను కాపాడతాను.

26 నిన్ను బాధపెట్టినవాళ్లను తమ సొంత శరీర మాంసం తినేలా చేస్తాను,

తియ్యని ద్రాక్షారసంతో మత్తిల్లినట్టు, వాళ్లు తమ సొంత రక్తంతో మత్తిల్లుతారు.

నీ రక్షకుడూ,+ నీ విమోచకుడూ,+

యాకోబు శక్తిమంతుడూ+ అయిన

యెహోవాను నేనే అని ప్రజలందరూ తెలుసుకోవాలి.”+

50 యెహోవా ఇలా అంటున్నాడు:

“నేను పంపించేసిన మీ అమ్మ విడాకుల పత్రం+ ఏది?

నా అప్పుల వాళ్లలో ఎవరికి నేను మిమ్మల్ని అమ్మేశాను?

ఇదిగో! మీ సొంత తప్పుల్ని బట్టే+ మీరు అమ్మేయబడ్డారు,

మీ అపరాధాల వల్లే మీ అమ్మ పంపించేయబడింది.+

 2 మరైతే, నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఎవరూ లేరు?

నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ పలకలేదు?+

నా చెయ్యి విడిపించలేనంత చిన్నదా?

కాపాడే శక్తి నాకు లేదా?+

ఇదిగో! నేను గద్దిస్తే సముద్రం ఎండిపోతుంది;+

నేను నదుల్ని ఎడారిగా చేస్తాను.+

దాహం వల్ల వాటి చేపలు చచ్చిపోతాయి,

నీళ్లు లేనందువల్ల అవి కుళ్లిపోతాయి.

 3 నేను చీకటిని ఆకాశానికి వస్త్రంగా చేస్తాను,+

గోనెపట్టను దానికి బట్టలుగా చేస్తాను.”

 4 అలసిపోయిన వ్యక్తికి సరైన మాటలతో* ఎలా జవాబివ్వాలో* నాకు తెలిసేలా+

సర్వోన్నత ప్రభువైన యెహోవా, శిష్యునికి ఉండేలాంటి* నోటిని* నాకు ఇచ్చాడు.+

ప్రతీ ఉదయం ఆయన నన్ను లేపుతాడు;

శిష్యునిలా నేర్చుకోవడానికి ఆయన నా చెవిని మేల్కొల్పుతాడు.+

 5 సర్వోన్నత ప్రభువైన యెహోవా నా చెవిని తెరిచాడు,

నేను తిరుగుబాటు చేయలేదు,+

వ్యతిరేక దిశలో వెళ్లలేదు.+

 6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,

నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను.

నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+

 7 అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు.+

అందుకే నేను అవమానించబడినట్టు భావించను.

అందువల్లే నేను నా ముఖాన్ని చెకుముకిరాయిలా చేసుకున్నాను,+

నేను సిగ్గుపర్చబడనని నాకు తెలుసు.

 8 నన్ను నీతిమంతుడిగా ప్రకటించే దేవుడు దగ్గరగా ఉన్నాడు.

ఎవరు నా మీద నేరం మోపగలరు?*+

రండి, మనం ముఖాముఖిగా తలపడదాం.

నా మీద వ్యాజ్యం ఉన్నది ఎవరికి?

అతన్ని నా దగ్గరికి రమ్మనండి.

 9 ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు.

నేను దోషినని తీర్పు తీర్చేది ఎవరు?

ఇదిగో! వాళ్లంతా వస్త్రంలా పాతబడిపోతారు.

చిమ్మెట వాళ్లను తినేస్తుంది.

10 మీలో యెహోవాకు భయపడేది ఎవరు?

ఆయన సేవకుడి స్వరాన్ని వినేది ఎవరు?+

ఏమాత్రం వెలుగు లేకుండా కటిక చీకట్లో నడిచింది ఎవరు?

అతను యెహోవా పేరు మీద నమ్మకం పెట్టుకోవాలి, తన దేవుని మీద ఆధారపడాలి.*

11 “నిప్పు అంటిస్తున్న మీరంతా,

మంటల్ని రేపుతున్న మీరంతా చూడండి!

మీరు మీ నిప్పు వెలుగులో,

మీరు రాజేసిన మంటల మధ్య నడవండి.

నేను మీకు విధించే శిక్ష ఇదే:

మీరు విపరీతమైన నొప్పితో పడుకుంటారు.

51 “నీతిని వెంటాడుతున్న ప్రజలారా,

యెహోవాను వెతుకుతున్న ప్రజలారా, నేను చెప్పేది వినండి.

మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఆ బండ వైపు,

ఏ గని నుండి తవ్వి తీయబడ్డారో ఆ గని వైపు చూడండి.

 2 మీ తండ్రైన అబ్రాహాము వైపు,

పురిటినొప్పులతో మిమ్మల్ని కన్న శారా+ వైపు చూడండి.

నేను అతన్ని పిలిచినప్పుడు అతను ఒక్కడే,+

నేనే అతన్ని దీవించి, అతను చాలామంది అయ్యేలా చేశాను.+

 3 ఎందుకంటే, యెహోవా సీయోనుకు ఊరటనిస్తాడు.+

దాని శిథిలాలన్నిటికీ ఆయన ఊరట దయచేస్తాడు,+

ఆయన దాని ఎడారిని ఏదెనులా,+

దాని ఎడారి మైదానాన్ని యెహోవా తోటలా చేస్తాడు.+

ఉల్లాసం, సంతోషం దానిలో ఉంటాయి,

కృతజ్ఞతా స్తుతులు, శ్రావ్యమైన గీతాలు అందులో వినిపిస్తాయి.+

 4 నా ప్రజలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి,

నా జనమా,+ చెవిపెట్టి వినండి.

ఎందుకంటే నా దగ్గర నుండి ఒక చట్టం బయల్దేరుతుంది,+

నా న్యాయాన్ని జనాలకు వెలుగుగా స్థాపిస్తాను.+

 5 నా నీతి సమీపిస్తోంది.+

నా రక్షణ బయల్దేరుతుంది,+

నా బాహువులు జనాలకు తీర్పు తీరుస్తాయి.+

ద్వీపాలు నా మీద ఆశపెట్టుకుంటాయి,+

నా బాహువు* కోసం అవి వేచి ఉంటాయి.

 6 ఆకాశం వైపు మీ తలలు ఎత్తి చూడండి,

కిందున్న భూమిని చూడండి.

ఎందుకంటే ఆకాశం ముక్కలైపోయి పొగలా చెదిరిపోతుంది;

భూమి వస్త్రంలా పాతబడుతుంది,

దానిలో నివసించేవాళ్లు దోమల్లా చనిపోతారు.

కానీ నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది,+

నా నీతికి అంతం అనేదే ఉండదు.*+

 7 నీతి తెలిసిన ప్రజలారా,

హృదయంలో నా ధర్మశాస్త్రం* ఉన్న ప్రజలారా,+ నేను చెప్పేది వినండి.

నశించిపోయే మనుషుల బెదిరింపులకు భయపడకండి,

వాళ్ల దూషణలకు హడలిపోకండి.

 8 ఎందుకంటే వస్త్రాన్ని తినేసినట్టు చిమ్మెట వాళ్లను తినేస్తుంది,

బట్టల చిమ్మెట* ఉన్నిని మింగేసినట్టు వాళ్లను మింగేస్తుంది.+

కానీ నా నీతి ఎప్పటికీ ఉంటుంది,

నా రక్షణ తరతరాలపాటు ఉంటుంది.”+

 9 యెహోవా బాహువా,+

లే! లేచి బలాన్ని వస్త్రంలా తొడుక్కో!

ఒకప్పటి రోజుల్లో, ముందటి తరాల్లో లేచినట్టు లే.

రాహాబును*+ ముక్కలుముక్కలు చేసింది,

భారీ సముద్రప్రాణిని చీల్చేసింది నువ్వు కాదా?+

10 సముద్రాన్ని, అగాధ జలాల్ని ఎండిపోజేసింది,+

తిరిగి కొనబడినవాళ్లు దాటివెళ్లేలా సముద్ర గర్భంలో దారిని ఏర్పాటు చేసింది+ నువ్వు కాదా?

11 విడిపించబడిన యెహోవా ప్రజలు తిరిగొస్తారు.+

వాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ సీయోనుకు వస్తారు,+

వాళ్ల తలల మీద శాశ్వత ఆనందం అనే కిరీటం ఉంటుంది.+

ఉల్లాసం, సంతోషం వాళ్ల సొంతమౌతాయి,

వేదన, నిట్టూర్పు ఎగిరిపోతాయి.+

12 “స్వయంగా నేనే నిన్ను ఓదారుస్తాను.+

చనిపోయి నశించిపోయే మనిషికి,

పచ్చగడ్డిలా వాడిపోయే మనిషికి నువ్వెందుకు భయపడాలి?+

13 నిన్ను తయారుచేసిన యెహోవాను,+

ఆకాశాన్ని విస్తరింపజేసి,+ భూమికి పునాది వేసిన దేవుణ్ణి నువ్వెందుకు మర్చిపోతున్నావు?

అణచివేసే* వ్యక్తి కోపాన్ని బట్టి నువ్వు రోజంతా అదేపనిగా భయపడుతున్నావు,

అతనేదో నిన్ను నాశనం చేసే స్థానంలో ఉన్నట్టు బెదిరిపోతున్నావు.

అణచివేసే వ్యక్తి కోపం ఇప్పుడు ఏమైంది?

14 సంకెళ్ల వల్ల వంగిపోయిన వాళ్లు త్వరలోనే విడుదల చేయబడతారు;+

వాళ్లు చనిపోరు, గోతిలోకి వెళ్లరు,

వాళ్లకు ఆహారం ఉండకుండా పోదు.

15 అయితే నేను నీ దేవుడైన యెహోవాను,

నేను సముద్రంలో అలజడి రేపి, దాని అలలు ఎగసిపడేలా చేస్తాను,+

సైన్యాలకు అధిపతైన యెహోవా నా పేరు.+

16 ఆకాశాన్ని దాని స్థానంలో పెట్టడానికి, భూమికి పునాది వేయడానికి,+

సీయోనుతో, ‘నువ్వు నా జనం’+ అని చెప్పడానికి

నేను నా మాటల్ని నీ నోట ఉంచుతాను,

నా చేతి నీడతో నిన్ను కప్పుతాను.+

17 యెహోవా చేతిలోని ఉగ్రతపాత్రలో ఉన్నదాన్ని తాగిన

యెరూషలేమా, లే! లేచి నిలబడు.+

నువ్వు ఆ గిన్నెలో ఉన్నదంతా తాగావు;

తూలేలా చేసే గిన్నెలోది నువ్వు పూర్తిగా తాగేశావు.+

18 ఆమె కన్న కుమారులందరిలో ఆమెకు దారి చూపించేవాళ్లు ఒక్కరూ లేరు,

ఆమె పెంచిన కుమారులందరిలో ఒక్కరు కూడా ఆమె చేతిని పట్టుకోలేదు.

19 నాశనం-వినాశనం, ఆకలి-ఖడ్గం!

ఈ రెండూ నీ మీదికి వచ్చాయి.+

ఎవరు నీ మీద సానుభూతి చూపిస్తారు?

ఎవరు నిన్ను ఓదారుస్తారు?+

20 నీ కుమారులు స్పృహ తప్పి పడిపోయారు.+

వలలో చిక్కుకున్న అడవి గొర్రెల్లా

వాళ్లు ప్రతీ వీధి మూల దగ్గర పడివున్నారు.

యెహోవా ఉగ్రత, నీ దేవుని గద్దింపు వాళ్ల మీద పూర్తిగా విరుచుకుపడ్డాయి.”

21 కాబట్టి కష్టాల్లో ఉన్న ఓ స్త్రీ, దయచేసి ఈ మాట విను,

నువ్వు మత్తుగా ఉన్నావు, కానీ ద్రాక్షారసం వల్ల కాదు.

22 నీ ప్రభువూ, తన ప్రజల్ని రక్షించే నీ దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో! తూలేలా చేసే గిన్నెను,+

అంటే ఆ పాత్రను, నా ఉగ్రతపాత్రను నేను నీ చేతిలో నుండి తీసేసుకుంటాను.

దానిలో ఉన్నది నువ్వు మళ్లీ ఎప్పుడూ తాగవు.+

23 నిన్ను హింసలు పెట్టినవాళ్ల చేతిలో నేను దాన్ని పెడతాను,+

వాళ్లు నీతో, ‘మేము నీ మీద నడిచివెళ్లేలా నేలకు వంగు!’ అన్నారు.

కాబట్టి నువ్వు నీ వీపును నేలగా చేశావు,

వాళ్లు నడిచివెళ్లడానికి దాన్నొక వీధిలా చేశావు.”

52 సీయోనూ! లే!+ లేచి, బలాన్ని+ వస్త్రంలా తొడుక్కో!

పవిత్ర నగరమైన యెరూషలేమా, నీ అందమైన వస్త్రాలు వేసుకో!+

ఎందుకంటే, ఇక మీదట సున్నతిలేని వాళ్లెవ్వరూ, అపవిత్రులెవ్వరూ నీలో ప్రవేశించరు.+

 2 యెరూషలేమా, నీ మీదున్న దుమ్ము దులిపేసుకొని, లేచి పైన కూర్చో.

బందీగా ఉన్న సీయోను కూతురా, నీ మెడకు ఉన్న కట్లు విప్పేసుకో.+

 3 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:

“నువ్వు డబ్బులకు కాకుండా ఊరికే అమ్మబడ్డావు,+

డబ్బులు చెల్లించకుండానే నువ్వు తిరిగి కొనబడతావు.”+

 4 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:

“మొదట్లో నా ప్రజలు పరదేశులుగా నివసించడానికి ఐగుప్తుకు వెళ్లారు;+

తర్వాత అష్షూరు ఏ కారణం లేకుండానే వాళ్లను అణచివేసింది.”

 5 “అలాంటప్పుడు నేనిక్కడ ఏంచేయాలి?” అని యెహోవా అంటున్నాడు.

“ఎందుకంటే, నా ప్రజల్ని ఊరికే తీసుకెళ్లిపోయారు.

వాళ్లమీద ఏలేవాళ్లు విజయగర్వంతో కేకలు వేస్తూ ఉన్నారు”+ అని యెహోవా అంటున్నాడు.

“వాళ్లు రోజంతా అదేపనిగా నా పేరును అవమానిస్తున్నారు.+

 6 అందుకే నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు;+

మాట్లాడుతున్నది నేనే అని ఆ రోజు వాళ్లు తెలుసుకుంటారు.

ఇదిగో, అది నేనే!”

 7 మంచివార్తను తెస్తూ,

శాంతిని ప్రకటిస్తూ,+

మేలైన విషయాల గురించిన మంచివార్తను తెస్తూ,

రక్షణను చాటిస్తూ,

“నీ దేవుడు రాజయ్యాడు!”+ అని సీయోనుతో చెప్పేవాళ్ల పాదాలు

పర్వతాల మీద ఎంత అందంగా ఉన్నాయి!+

 8 విను! నీ కావలివాళ్లు గొంతెత్తి అరుస్తున్నారు.

వాళ్లంతా ఏకస్వరంతో సంతోషంగా కేకలు వేస్తున్నారు,

ఎందుకంటే యెహోవా సీయోనును తిరిగి సమకూర్చినప్పుడు వాళ్లు దాన్ని స్పష్టంగా* చూస్తారు.

 9 యెరూషలేము శిథిలాల్లారా,+ సంతోషించండి, ఆనందంగా ముక్తకంఠంతో కేకలు వేయండి,

ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని ఓదార్చాడు;+ ఆయన యెరూషలేమును తిరిగి కొన్నాడు.+

10 దేశాలన్నిటి కళ్లముందు యెహోవా తన పవిత్రమైన బాహువును వెల్లడిచేశాడు;+

భూమి కొనల్లో ఉన్నవాళ్లంతా మన దేవుని రక్షణకార్యాల్ని* చూస్తారు.+

11 వెళ్లండి, వెళ్లండి, అక్కడి నుండి వెళ్లిపోండి,+ అపవిత్రమైన దేన్నీ ముట్టుకోకండి!+

యెహోవా మందిర పాత్రల్ని మోస్తున్న వాళ్లారా,+

దాని మధ్య నుండి వెళ్లిపోండి,+ మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి.

12 మీరు కంగారుకంగారుగా బయల్దేరరు,

పారిపోవాల్సిన అవసరం కూడా మీకు రాదు,

ఎందుకంటే యెహోవాయే మీ ముందు నడుస్తాడు,

ఇశ్రాయేలు దేవుడే మీ వెనక కాపలాగా ఉంటాడు.

13 ఇదిగో! నా సేవకుడు+ లోతైన అవగాహనతో పనిచేస్తాడు.

ఆయన చాలా పైకి ఎత్తబడతాడు,

ఆయన ఉన్నతపర్చబడతాడు, గొప్పగా హెచ్చించబడతాడు.+

14 ఆయన ఆకారం ఏ మనిషి ఆకారం కన్నా వికృతంగా,

ఆయన రూపం ఏ మనిషి రూపం కన్నా వికారంగా మారడం చూసి

ఎలాగైతే చాలామంది ఆశ్చర్యంతో ఆయన్ని చూస్తూ ఉండిపోయారో,

15 అలాగే ఆయన చాలా దేశాల్ని నిర్ఘాంతపోయేలా చేస్తాడు.

రాజులు ఆయన ముందు నోరు మూసుకుంటారు;*+

ఎందుకంటే, వాళ్లు తమకు చెప్పబడని వాటిని చూస్తారు,

తాము వినని వాటి గురించి ఆలోచిస్తారు.+

53 మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+

యెహోవా బాహువు ఎవరికి వెల్లడైంది?+

 2 చిగురులా,+ ఎండిన దేశంలో వేరులా ఆయన అతని* ముందు పైకివస్తాడు.

ఆయనకు చూడచక్కని రూపం గానీ, వైభవం గానీ లేవు;+

ఆయన్ని చూసినప్పుడు, ఆయన రూపం మనల్ని ఆకట్టుకోదు.*

 3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+

నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు.

ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.*

ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+

 4 నిజంగా, ఆయన మన రోగాల్ని మోశాడు,+

మన నొప్పుల్ని భరించాడు,+

మనం మాత్రం ఆయన్ని అంటువ్యాధి వచ్చినవాడిలా, దేవుడు శిక్షించి బాధపెట్టిన వ్యక్తిలా చూశాం.

 5 నిజానికి ఆయన మన దోషాల వల్ల+ పొడవబడ్డాడు;+

మన తప్పుల్ని బట్టి నలగ్గొట్టబడ్డాడు.+

మనం నెమ్మదితో ఉండాలని ఆయన శిక్ష అనుభవించాడు,+

ఆయన గాయాల వల్ల మనం బాగయ్యాం.+

 6 మనందరం గొర్రెల్లా దారితప్పి తిరిగాం,+

ప్రతీ ఒక్కరం నచ్చిన దారిలో వెళ్లిపోయాం,

అయితే యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు.+

 7 ఆయన అణచివేయబడ్డాడు,+ కష్టాలన్నీ భరించాడు,+

అయినా ఆయన నోరు తెరవలేదు.

వధించడానికి గొర్రెను తీసుకొచ్చినట్టు ఆయన్ని తీసుకొచ్చారు,+

బొచ్చు కత్తిరించే వాళ్లముందు ఆడగొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు,

ఆయన నోరు తెరవలేదు.+

 8 అన్యాయపు తీర్పు తీర్చి* ఆయన్ని తీసుకెళ్లిపోయారు;

ఆయన తరానికి* సంబంధించిన వివరాల గురించి ఎవరు ఆలోచిస్తారు?

ఎందుకంటే సజీవుల దేశం నుండి ఆయన కొట్టివేయబడ్డాడు;+

నా ప్రజల దోషం వల్ల ఆయన కొట్టబడ్డాడు.*+

 9 ఆయన ఏ తప్పూ* చేయకపోయినా,

ఆయన నోట ఎలాంటి మోసం లేకపోయినా,+

ఆయన చనిపోయినప్పుడు దుష్టులతో పాటు ఆయన్ని సమాధి చేశారు,*+

ఆయన ధనవంతుల* దగ్గర సమాధి చేయబడ్డాడు.+

10 అయితే ఆయన నలగ్గొట్టబడడం, బాధలుపడడం యెహోవాకు ఇష్టమైంది.*

నువ్వు ఆయన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తే,+

ఆయన తన సంతానాన్ని* చూస్తాడు, ఆయన ఆయుష్షు పెరుగుతుంది,+

ఆయన ద్వారా యెహోవా ఇష్టం* నెరవేరుతుంది.+

11 ఆయన తాను అనుభవించిన వేదన వల్ల, తాను చూసినదాన్ని బట్టి సంతృప్తి పొందుతాడు.

నీతిమంతుడు, అంటే నా సేవకుడు తన జ్ఞానం వల్ల,

చాలామంది నీతిమంతులయ్యేలా సహాయం చేస్తాడు,+

వాళ్ల తప్పుల్ని భరిస్తాడు.+

12 అందుకే, చాలామందితో పాటు నేను ఆయనకు భాగం నియమిస్తాను,

బలశాలులతో పాటు ఆయన దోపుడుసొమ్ము పంచుకుంటాడు;

ఎందుకంటే, ఆయన తన ప్రాణాన్ని ధారపోసి, చివరికి చనిపోయాడు,+

దోషుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు;+

ఆయన అనేకమంది పాపాల్ని మోశాడు,+

దోషుల తరఫున వేడుకున్నాడు.+

54 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, సంతోషంతో కేకలు వేయి!

ఎన్నడూ పురిటినొప్పులు పడనిదానా,+ సంతోషించు, ఆనందంతో కేకలు వేయి;+

ఎందుకంటే, భర్త* ఉన్న స్త్రీ పిల్లల* కన్నా

వదిలేయబడిన స్త్రీ పిల్లలే చాలా ఎక్కువమంది”+ అని యెహోవా అంటున్నాడు.

 2 “నీ డేరా స్థలాన్ని విశాలపర్చు.

నీ గొప్ప డేరా తెరల్ని పెద్దవి చేయి.

హద్దులు పెట్టుకోకు;

నీ డేరా తాళ్లను పొడుగ్గా, వాటి మేకుల్ని బలంగా చేయి.+

 3 ఎందుకంటే నువ్వు కుడివైపుకు, ఎడమవైపుకు విస్తరిస్తావు.

నీ సంతానం దేశాల్ని స్వాధీనం చేసుకుంటుంది,

వాళ్లు నిర్మానుష్యంగా ఉన్న నగరాల్లో నివసిస్తారు.+

 4 భయపడకు,+ ఎందుకంటే నువ్వు సిగ్గుపర్చబడవు;+

అవమానించబడినట్టు భావించకు, ఎందుకంటే నువ్వు నిరాశపర్చబడవు.

నీ యౌవనం నాటి అవమానాన్ని నువ్వు మర్చిపోతావు,

నువ్వు విధవరాలిగా ఉన్నప్పటి తలవంపుల్ని నువ్విక గుర్తుచేసుకోవు.”

 5 “ఎందుకంటే నీ మహాగొప్ప రూపకర్త+ నీకు భర్త* లాంటివాడు,+

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా,

ఇశ్రాయేలు పవిత్ర దేవుడే నీ విమోచకుడు.+

ఆయన భూమంతటికీ దేవుడు అని పిలవబడతాడు.+

 6 ఎందుకంటే వదిలేయబడి, పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్యను పిలిచినట్టు,+

యౌవనంలో పెళ్లయి, ఆ తర్వాత తిరస్కరించబడిన భార్యను పిలిచినట్టు యెహోవా నిన్ను పిలిచాడు” అని నీ దేవుడు అంటున్నాడు.

 7 “ఒక్క క్షణంపాటు నేను నిన్ను వదిలేశాను,

కానీ గొప్ప కరుణతో నిన్ను వెనక్కి తెచ్చుకుంటాను.+

 8 విపరీతమైన కోపంలో క్షణకాలం నీ నుండి నా ముఖాన్ని దాచుకున్నాను,+

కానీ శాశ్వతమైన విశ్వసనీయ ప్రేమతో నీ మీద కరుణ చూపిస్తాను”+ అని నీ విమోచకుడైన+ యెహోవా అంటున్నాడు.

 9 “ఇది నాకు నోవహు రోజుల లాంటిదే.+

నోవహు కాలంలోని జలాలు ఇకమీదట భూమిని ముంచెత్తవని నేను ప్రమాణం చేసినట్టే,+

ఇంకెప్పుడూ నీ మీద కోప్పడనని, నిన్ను గద్దించనని ప్రమాణం చేస్తున్నాను.+

10 పర్వతాలు తొలగిపోయినా,

కొండలు కదిలినా,

నీ మీద నాకున్న విశ్వసనీయ ప్రేమ తొలగిపోదు,+

నా శాంతి ఒప్పందం చెక్కుచెదరదు”+ అని నీ మీద కరుణ ఉన్న యెహోవా+ అంటున్నాడు.

11 “కష్టాల్లో ఉన్నదానా,+ తుఫాను బారినపడినదానా, ఓదార్పు దొరకనిదానా,+

నేను నీ రాళ్లను గట్టి సున్నంతో* కడతాను,

నీలం రాళ్లతో నీ పునాదిని వేస్తాను.+

12 నేను నీ కోట బురుజుల్ని మాణిక్యాలతో,

నీ ద్వారాల్ని మెరిసే రాళ్లతో,*

నీ సరిహద్దులన్నిటినీ ప్రశస్తమైన రాళ్లతో కడతాను.

13 నీ పిల్లలందరూ* యెహోవా చేత బోధించబడతారు,+

నీ పిల్లలకు* ఎంతో శాంతి ఉంటుంది.+

14 నీతి వల్ల నువ్వు దృఢంగా స్థాపించబడతావు.+

అణచివేత నీకు చాలా దూరంలో ఉంటుంది,+

నువ్వు దేనికీ భయపడవు, ఏదీ నిన్ను భయపెట్టలేదు,

ఎందుకంటే అది నీ దగ్గరికి కూడా రాదు.+

15 ఎవరైనా నీ మీద దాడిచేస్తే,

అది నా ఆదేశం వల్ల కాదు.

నీ మీద ఎవ్వరు దాడిచేసినా వాళ్లు ఓడిపోతారు.”+

16 “ఇదిగో! నిప్పుల్ని ఊదుతూ

ఆయుధం తయారుచేసే

చేతిపనివాడిని నేనే సృష్టించాను.

నాశనం చేసే నాశకుణ్ణి కూడా నేనే సృష్టించాను.+

17 నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు,+

న్యాయం తీర్చే సమయంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ నాలుకను నువ్వు ఖండిస్తావు.

ఇది యెహోవా సేవకుల వారసత్వ సంపద,*

నేను వాళ్లను నీతిమంతులుగా ఎంచుతున్నాను” అని యెహోవా అంటున్నాడు.+

55 దాహంగా ఉన్నవాళ్లారా,+ మీరంతా నీళ్ల దగ్గరికి రండి!+

డబ్బు లేనివాళ్లారా, వచ్చి కొనుక్కొని తినండి!

అవును, వచ్చి డబ్బులు ఇవ్వకుండానే ఉచితంగా+ ద్రాక్షారసాన్ని, పాలను+ కొనుక్కోండి.

 2 ఆహారంకాని దానికోసం మీరెందుకు డబ్బు చెల్లిస్తూ ఉన్నారు?

సంతృప్తినివ్వని దానికోసం మీ సంపాదనను* ఎందుకు ఖర్చు చేయాలి?

నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మంచి ఆహారాన్ని తినండి,+

అప్పుడు మీరు నిజంగా పుష్టికరమైన వాటిని తిని ఎంతో సంతోషిస్తారు.+

 3 చెవిపెట్టి విని నా దగ్గరికి రండి.+

నేను చెప్పేది వినండి, అలాచేస్తే మీరు జీవిస్తూనే ఉంటారు,

అప్పుడు నేను దావీదుకు వాగ్దానం చేసిన విశ్వసనీయ ప్రేమకు అనుగుణంగా

మీతో తప్పకుండా శాశ్వత ఒప్పందం చేస్తాను;+ ఆ వాగ్దానం నమ్మదగినది.*+

 4 ఇదిగో! నేను ఆయన్ని దేశాలకు సాక్షిగా,+

జనాలకు నాయకుడిగా,+ అధిపతిగా+ చేశాను.

 5 ఇదిగో! నీకు తెలియని జనాన్ని నువ్వు పిలుస్తావు,

నీకు తెలియని దేశానికి చెందిన ప్రజలు నీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తారు.

నీ దేవుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవాను బట్టి వాళ్లు అలా వస్తారు,+

ఎందుకంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు.+

 6 యెహోవా దొరికే సమయంలోనే ఆయన్ని వెదకండి.+

ఆయన దగ్గరగా ఉన్నప్పుడే ఆయన్ని వేడుకోండి.+

 7 దుష్టుడు తన మార్గాన్ని,

చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి;+

అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు,+

మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా* క్షమిస్తాడు.+

 8 “ఎందుకంటే నా ఆలోచనలు మీ ఆలోచనల లాంటివి కావు,+

మీ మార్గాలు నా మార్గాల లాంటివి కావు” అని యెహోవా అంటున్నాడు.

 9 “ఆకాశం భూమి కంటే ఎత్తుగా ఉన్నట్టు

నా మార్గాలు మీ మార్గాల కన్నా ఎత్తుగా ఉన్నాయి,

నా ఆలోచనలు మీ ఆలోచనల కన్నా ఉన్నతంగా ఉన్నాయి.+

10 వర్షం, మంచు ఆకాశం నుండి కురిసి,

భూమిని తడిపి, విత్తనాలు మొలిచి ఫలించేలా చేసి,

విత్తేవాడికి విత్తనాలు, తినేవాడికి ఆహారం ఇవ్వకుండా ఎలాగైతే తిరిగెళ్లవో

11 నా నోటి నుండి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది.+

అది ఫలితాలు సాధించకుండా నా దగ్గరికి తిరిగి రాదు;+

బదులుగా అది నాకు నచ్చిన ప్రతీదాన్ని* ఖచ్చితంగా నెరవేరుస్తుంది,+

నేను ఏ పని కోసం దాన్ని పంపించానో ఆ పనిని చేసి తీరుతుంది.

12 ఎందుకంటే మీరు సంతోషంతో బయల్దేరతారు,+

శాంతితో తిరిగి తీసుకురాబడతారు.+

మీ ముందు పర్వతాలు, కొండలు సంతోషిస్తాయి; ఆనందంతో కేకలు వేస్తాయి;+

పొలాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.+

13 ముళ్లపొదలకు బదులు సరళవృక్షాలు,+

దురదగొండి చెట్లకు బదులు గొంజి చెట్లు పెరుగుతాయి.

అది యెహోవాకు కీర్తిని* తెస్తుంది,+

ఎప్పటికీ నాశనంకాని శాశ్వతమైన సూచనగా పనిచేస్తుంది.”

56 యెహోవా ఇలా అంటున్నాడు:

“న్యాయాన్ని సమర్థించండి,+ సరైనది చేయండి,

ఎందుకంటే నా రక్షణ త్వరలోనే వస్తుంది,

నా నీతి వెల్లడి చేయబడుతుంది.+

 2 వీటిని చేసే వ్యక్తి,

వీటిని గట్టిగా పట్టుకునే మనిషి,

విశ్రాంతి రోజును పాటిస్తూ దాన్ని అపవిత్రపర్చకుండా ఉండే వ్యక్తి,+

ఎలాంటి చెడూ చేయకుండా తన చేతిని బిగబట్టుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.

 3 యెహోవాను ఆరాధించే పరదేశి,+

‘యెహోవా ఖచ్చితంగా తన ప్రజల్లో నుండి నన్ను వేరు చేస్తాడు’ అని అనుకోకూడదు.

అలాగే నపుంసకుడు,* ‘ఇదిగో! నేను ఎండిపోయిన చెట్టును’ అని అనుకోకూడదు.”

4 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు: “నా విశ్రాంతి రోజుల్ని పాటిస్తూ, నాకు నచ్చేవాటిని ఎంచుకుంటూ, నా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే నపుంసకులకు

 5 నా మందిరంలో, దాని గోడల లోపల ఒక స్మారక చిహ్నాన్ని, ఒక పేరును ఇస్తాను.

అది కుమారులు, కూతుళ్ల కంటే శ్రేష్ఠమైనది.

ఎప్పటికీ నిలిచివుండే పేరును వాళ్లకు ఇస్తాను,

అది తుడిచిపెట్టుకుపోదు.

 6 యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు పరిచారం చేయడానికి,

యెహోవా పేరును ప్రేమించడానికి,+

ఆయనకు సేవకులు అవ్వడానికి ముందుకొచ్చే పరదేశుల్ని,

అంటే విశ్రాంతి రోజును పాటిస్తూ దాన్ని అపవిత్రపర్చకుండా ఉండే,

నా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే పరదేశులందర్నీ

 7 నేను నా పవిత్ర పర్వతం దగ్గరికి తీసుకొస్తాను,+

నా ప్రార్థన మందిరంలో వాళ్లు సంతోషించేలా చేస్తాను.

నా బలిపీఠం మీద వాళ్లు అర్పించే సంపూర్ణ దహనబలుల్ని, బలుల్ని నేను అంగీకరిస్తాను.

ఎందుకంటే నా మందిరం అన్నిదేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని పిలవబడుతుంది.”+

8 ఇశ్రాయేలు ప్రజల్లో చెదిరిపోయిన వాళ్లను సమకూరుస్తున్న సర్వోన్నత ప్రభువైన యెహోవా+ ఇలా అంటున్నాడు:

“ఇప్పటికే సమకూర్చబడినవాళ్లు కాకుండా వేరేవాళ్లను కూడా నేను అతని దగ్గరికి సమకూరుస్తాను.”+

 9 అడవి జంతువులారా,

అడవిలోని మృగాల్లారా, ఆరగించడానికి మీరంతా రండి.+

10 అతని కావలివాళ్లు గుడ్డివాళ్లు,+ వాళ్లలో ఒక్కరు కూడా గమనించలేదు.+

వాళ్లంతా మూగ కుక్కలు, మొరగలేరు.+

వాళ్లు కూర్చొని రొప్పుతున్నారు; వాళ్లు నిద్ర ప్రియులు.

11 వాళ్లు తిండి కోసం ఎగబడే కుక్కలు;

వాళ్లు ఎన్నడూ తృప్తిపడరు.

వాళ్లు అవగాహన లేని కాపరులు.+

వాళ్లంతా ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు;

వాళ్లలో ప్రతీ ఒక్కరు అక్రమ లాభం కోసం పాకులాడుతూ ఇలా అంటారు:

12 “రండి, నేను కొంచెం ద్రాక్షారసం తెస్తాను,

మనం మత్తెక్కే వరకు మద్యం తాగుదాం.+

రేపు కూడా ఇవాళ్టి లాగే ఉంటుంది, చెప్పాలంటే ఇంకా చాలా బాగుంటుంది!”

57 నీతిమంతుడు నశించిపోయాడు,

కానీ ఎవరూ దాని గురించి ఆలోచించట్లేదు.

విశ్వసనీయులు తీసుకుపోబడుతున్నారు,*+

అయితే విపత్తు కారణంగా*

నీతిమంతుడు తీసుకుపోబడుతున్నాడని ఎవ్వరూ గ్రహించట్లేదు.

 2 అతను నెమ్మది పొందుతాడు.

నిజాయితీగా నడుచుకునే వాళ్లందరూ తమ పరుపుల మీద* విశ్రాంతి తీసుకుంటారు.

 3 “మంత్రగత్తె కుమారులారా,

వ్యభిచారికి, వేశ్యకు పుట్టిన పిల్లలారా,

దగ్గరికి రండి:

 4 మీరు ఎవర్ని గేలి చేస్తున్నారు?

ఎవర్ని వెక్కిరించడానికి మీ నోళ్లు పెద్దగా తెరుస్తున్నారు?

మీరు పాపులకు, అబద్ధాలాడే వాళ్లకు

పుట్టిన పిల్లలు+ కాదా?

 5 మహా వృక్షాల మధ్య,

పచ్చగా ఉండే ప్రతీ చెట్టు కింద+ కామంతో రగిలిపోతున్నది+ మీరు కాదా?

లోయల్లో,* బండల సందుల కింద

పిల్లల్ని వధించేది మీరు+ కాదా?

 6 నీ భాగం లోయల్లోని* నున్నని రాళ్లతో పాటు ఉంది.+

అవును, అవే నీకు వంతు.

చివరికి వాటికి కూడా నువ్వు పానీయార్పణలు, కానుకలు అర్పిస్తావు.+

వీటిని బట్టి నేను సంతృప్తి చెందాలా?*

 7 ఎత్తైన, ఉన్నతమైన పర్వతం మీద నువ్వు పరుపు వేసుకున్నావు,+

బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కివెళ్లావు.+

 8 తలుపు వెనక, గుమ్మం వెనక నీ జ్ఞాపకార్థ చిహ్నాన్ని నిలబెట్టావు.

నన్ను విడిచివెళ్లి నీ బట్టలు విప్పేశావు;

పైకి ఎక్కి నీ పరుపును వెడల్పు చేసుకున్నావు.

వాళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నావు.

వాళ్లతో కలిసి పడుకోవడమంటే నీకు చాలా ఇష్టం,+

వాళ్ల పురుషాంగాన్ని నువ్వు చూశావు.*

 9 నువ్వు తైలాన్ని, విస్తారమైన పరిమళ ద్రవ్యాన్ని

తీసుకొని మెలెకు* దగ్గరికి దిగివెళ్లావు.

నీ ప్రతినిధుల్ని దూరంగా పంపి,

సమాధిలోకి* దిగిపోయావు.

10 అనేక ప్రయాణాలు చేస్తూ చాలా కష్టపడ్డావు,

కానీ ‘దీనివల్ల ఉపయోగం లేదు!’ అని నువ్వు అనుకోలేదు.

నువ్వు మళ్లీ కొత్త బలం పొందావు.

అందుకే నువ్వు పట్టువిడవట్లేదు.*

11 నువ్వు ఎవరికి భయపడి, ఎవరికి బెదిరిపోయి

అబద్ధాలాడడం మొదలుపెట్టావు?+

నువ్వు నన్ను గుర్తుపెట్టుకోలేదు.+

దేని గురించీ ఆలోచించలేదు.+

నేను మౌనంగా ఉండి ఊరుకున్నాను.*+

అందుకే నువ్వు నాకు ఏమాత్రం భయపడలేదు.

12 నేను నీ బూటకపు నీతిని,+ నీ పనుల్ని+ బయటపెడతాను,

వాటివల్ల నీకు ప్రయోజనమేమీ ఉండదు.+

13 నువ్వు సహాయం కోసం మొరపెట్టినప్పుడు,

నువ్వు పోగేసుకున్న విగ్రహాలు నిన్ను తప్పించలేవు.+

అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి,

ఉఫ్‌ అని ఊదితే ఎగిరిపోతాయి;

అయితే నన్ను ఆశ్రయంగా చేసుకున్నవాళ్లు దేశాన్ని స్వాస్థ్యంగా పొందుతారు,

నా పవిత్ర పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.+

14 అప్పుడు ఇలా అంటారు: ‘ఎత్తు చేయండి, దారిని ఎత్తు చేయండి! మార్గాన్ని సిద్ధం చేయండి!+

నా ప్రజల దారిలో ఉన్న అడ్డంకులన్నీ తీసేయండి.’ ”

15 ఎందుకంటే మహా ఘనుడు, ఉన్నతుడు,

నిరంతరం జీవిస్తూ ఉండే* దేవుడు,+ పవిత్రమైన పేరు ఉన్న దేవుడు+ ఇలా అంటున్నాడు:

“నేను ఎత్తైన, పవిత్ర స్థలంలో నివసిస్తాను,+

అయితే నలిగిపోయిన వాళ్లతో, దీనమనస్సు గలవాళ్లతో కూడా నివసిస్తూ

దీనుల ప్రాణాలు తెప్పరిల్లేలా చేస్తాను,

నలిగిపోయిన వాళ్ల హృదయాలకు నూతనోత్తేజాన్ని ఇస్తాను.+

16 నేను నిరంతరం వాళ్లను వ్యతిరేకిస్తూ ఉండను,

లేదా ఎల్లకాలం వాళ్లమీద కోపం ఉంచుకోను;+

ఎందుకంటే నావల్ల మనిషి జీవశక్తి* క్షీణిస్తుంది,+

నేను సృష్టించిన శ్వాసించే ప్రాణులు బలహీనమౌతాయి.

17 అతను అక్రమ లాభం కోసం పరుగులు తీస్తూ పాపం చేయడం+ చూసి నాకు చాలా కోపమొచ్చింది,

అందుకే నేనతన్ని కొట్టాను, నా ముఖం దాచుకున్నాను, నాకు చాలా కోపమొచ్చింది.

అయినాసరే అతను తన హృదయం నడిపించిన దారిలోనే నడుస్తూ భ్రష్టుడిలా ప్రవర్తిస్తూ వచ్చాడు.+

18 నేను అతని మార్గాల్ని చూశాను,

అయితే నేనతన్ని బాగుచేస్తాను,+ ముందుండి అతన్ని నడిపిస్తాను,+

అతనికీ, దుఃఖిస్తున్న అతని వాళ్లకూ+ మళ్లీ ఊరటనిస్తాను.”*+

19 “నేనే పెదాల మీద స్తుతించే మాటలు పెడుతున్నాను.

దూరంగా ఉన్నవాళ్లకు, దగ్గరగా ఉన్నవాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తాను,+

నేనే అతన్ని బాగుచేస్తాను” అని యెహోవా అంటున్నాడు.

20 “అయితే దుష్టులు, అల్లకల్లోలంగా ఉండి నిమ్మళించని సముద్రంలా ఉంటారు,

దానిలోని నీళ్లు నాచును, బురదను పైకి ఎగదోస్తూ ఉంటాయి.

21 దుష్టులకు మనశ్శాంతి ఉండదు”+ అని నా దేవుడు చెప్తున్నాడు.

58 “నీ గొంతెత్తి వీలైనంత బిగ్గరగా చాటించు; మౌనంగా ఉండకు!

బూర* శబ్దంలా నీ స్వరాన్ని పెంచు.

నా ప్రజలకు వాళ్ల తిరుగుబాటు గురించి,+

యాకోబు ఇంటివాళ్లకు వాళ్ల పాపాల గురించి ప్రకటించు.

 2 తామేదో నీతిగా నడుచుకునే జనమైనట్టు,

తమ దేవుని న్యాయాన్ని విడిచిపెట్టని జనమైనట్టు

వాళ్లు ప్రతీరోజు నన్ను వెతుకుతున్నారు,

నా మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టం చూపిస్తున్నారు.+

దేవునికి దగ్గరవడం తమకు ఇష్టం అన్నట్టు

న్యాయంగా తీర్పు చెప్పమని నన్ను అడుగుతున్నారు.+

 3 ‘మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చూడవు?+

మమ్మల్ని మేము బాధించుకున్నప్పుడు నువ్వెందుకు గమనించవు?’ అని అంటున్నారు.+

నేను ఎందుకు చూడట్లేదంటే, మీరు ఉపవాసం ఉన్న రోజు మీరు మీ సొంత పనులు చేసుకుంటున్నారు,*

మీ పనివాళ్లను అణచివేస్తున్నారు.+

 4 మీ ఉపవాసం గొడవలతో, కొట్లాటలతో ముగుస్తుంది,

దుష్టత్వమనే పిడికిలితో మీరు గుద్దుకుంటారు.

మీరు ఇలా ఉపవాసం ఉంటే, పరలోకం నుండి నేను మీ స్వరం వినను.

 5 నేను చెప్పిన ఉపవాసం ఉండాల్సింది ఇలాగేనా?

ఒక వ్యక్తి రెల్లులా తన తల వంచుకొని

గోనెపట్టను, బూడిదను తన పరుపుగా చేసుకొని

తనను తాను బాధించుకునే రోజు ఉండాల్సింది ఇలాగేనా?

దీన్నేనా మీరు ఉపవాసం అని, యెహోవాను సంతోషపెట్టే రోజు అని పిలిచేది?

 6 అది కాదు, నేను చెప్పిన ఉపవాసం ఏమిటంటే:

దుష్టత్వపు సంకెళ్లను తీసేయడం,

కాడి కట్లను విప్పడం,+

అణచివేయబడిన వాళ్లను విడుదల చేయడం,+

ప్రతీ కాడిని విరగ్గొట్టడం;

 7 ఆకలిగా ఉన్నవాళ్లతో నీ ఆహారం పంచుకోవడం,+

పేదవాళ్లను, ఇల్లు లేనివాళ్లను నీ ఇంట్లోకి తెచ్చుకోవడం,

బట్టలు లేని వాళ్లు కనిపించినప్పుడు వాళ్లకు బట్టలు ఇవ్వడం,+

నీ సొంతవాళ్లకు ముఖం చాటేయకుండా ఉండడం.

 8 అప్పుడు, నీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది,+

నీకు త్వరగా స్వస్థత కలుగుతుంది.

నీ నీతి నీ ముందు నడుస్తుంది,

యెహోవా మహిమ నీ వెనక కాపలాగా ఉంటుంది.+

 9 అప్పుడు నువ్వు వేడుకుంటావు, యెహోవా నీకు జవాబిస్తాడు;

సహాయం కోసం మొరపెడతావు, ఆయన ‘నేనున్నాను!’ అంటాడు.

నువ్వు నీ మధ్య నుండి కాడిని తీసేస్తే,

వేలెత్తి చూపించడం, ఇతరుల పేరు పాడుచేసేలా అబద్ధాలు చెప్పడం మానేస్తే,+

10 నీకు నచ్చినదాన్ని ఆకలిగా ఉన్నవాళ్లకు కూడా ఇస్తే,+

కష్టాల్లో ఉన్నవాళ్ల బాగోగులన్నీ చూసుకుంటే,

నీ వెలుగు చీకట్లో కూడా ప్రకాశిస్తుంది,

నీ అంధకారం కూడా మధ్యాహ్నం వెలుగులా ఉంటుంది.+

11 యెహోవా ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తాడు,

ఎండిపోయిన దేశంలో కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు;+

నీ ఎముకలకు సత్తువ దయచేస్తాడు,

నువ్వు బాగా నీళ్లుపెట్టిన తోటలా తయారౌతావు,+

ఎప్పటికీ ఎండిపోని ఊటలా ఉంటావు.

12 నీ కోసం పురాతన శిథిలాల్ని తిరిగి కడతారు,+

పాత తరాల నాటి పునాదుల్ని నువ్వు తిరిగి నిలబెడతావు.

బీటల్ని బాగుచేసేవాడివని,

నివసించడం కోసం దారుల్ని తిరిగి నిర్మించేవాడివని నువ్వు పిలవబడతావు.+

13 ఒకవేళ నువ్వు విశ్రాంతి రోజును బట్టి, నా పవిత్రమైన రోజున నీ సొంత పనులు చేయకుండా* ఉంటూ,+

విశ్రాంతి రోజు చాలా సంతోషకరమైనదని, అది యెహోవాకు పవిత్రమైన రోజని, ఘనపర్చాల్సిన రోజని అంటూ,+

నీ సొంత పనులు చేసుకునే బదులు, వట్టి మాటలు మాట్లాడే బదులు ఆ రోజును మహిమపరిస్తే,

14 నువ్వు యెహోవాను బట్టి చాలా సంతోషిస్తావు,

నేను భూమ్మీది ఎత్తైన స్థలాల్ని నీ వశం చేస్తాను.+

నీ పూర్వీకుడైన యాకోబు స్వాస్థ్యంలో ఉన్నదాన్ని నువ్వు తినేలా* చేస్తాను,+

ఈ మాట యెహోవా నోటి నుండి వచ్చింది.”

59 ఇదిగో! యెహోవా చెయ్యి రక్షించలేనంత చిన్నగా లేదు,+

ఆయన చెవి వినలేనంత మందంగా లేదు.+

 2 మీ సొంత తప్పులే మీ దేవుని నుండి మిమ్మల్ని దూరం చేశాయి.

మీ పాపాల వల్లే ఆయన మీ నుండి తన ముఖాన్ని దాచుకున్నాడు,

ఆయన మీ ప్రార్థనలు వినడానికి ఇష్టపడట్లేదు.+

 3 ఎందుకంటే మీ అరచేతులు రక్తంతో,

మీ చేతి వేళ్లు దోషంతో మలినమైపోయాయి.+

మీ పెదాలు అబద్ధాలాడతాయి,+ మీ నాలుక అవినీతిని జపిస్తుంది.

 4 ఎవ్వరూ నీతి పక్షాన మాట్లాడట్లేదు,+

న్యాయస్థానానికి వెళ్లిన వాళ్లలో ఎవ్వరూ నిజం చెప్పట్లేదు.

వాళ్లు బూటకమైన దానిమీద నమ్మకం పెట్టుకొని+ పనికిరాని మాటలు మాట్లాడతారు.

వాళ్లు సమస్యను గర్భం దాల్చి హానికరమైనదాన్ని కంటారు.+

 5 వాళ్లు విషసర్పం గుడ్లను పొదుగుతారు,

సాలెగూడును అల్లుతారు.+

ఆ గుడ్లను తినేవాళ్లు చనిపోతారు,

ఎవరైనా ఒక గుడ్డును పగలగొడితే అందులో నుండి విషసర్పం వస్తుంది.

 6 వాళ్లు అల్లిన సాలెగూడు వస్త్రంలా ఉపయోగపడదు,

తాము తయారుచేసిన దాన్ని వాళ్లు కప్పుకోరు కూడా.+

వాళ్ల పనులు హానికరమైనవి,

వాళ్ల చేతులు దౌర్జన్యంతో నిండిపోయాయి.+

 7 వాళ్ల పాదాలు చెడు చేయడానికి పరుగెత్తుతాయి,

నిర్దోషుల రక్తం చిందించడానికి వాళ్లు ఆత్రంగా పరుగులు తీస్తారు.+

వాళ్ల ఆలోచనలు హానికరమైనవి;

వాళ్ల దారుల్లో నాశనం, దుఃఖం ఉన్నాయి.+

 8 శాంతి మార్గం వాళ్లకు తెలీదు,

వాళ్ల దారుల్లో న్యాయం అనేదే లేదు.+

వాళ్లు తమ త్రోవల్ని వంకరగా చేసుకుంటారు;

వాటిలో నడిచే వాళ్లెవ్వరికీ శాంతి ఉండదు.+

 9 అందుకే న్యాయం మనకు చాలా దూరంలో ఉంది,

నీతి మన దగ్గరికి రావట్లేదు.

మనం వెలుగు కోసం చూస్తూ ఉన్నాం, కానీ ఇదిగో! చీకటే ఉంది;

కాంతి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం, కానీ అంధకారంలోనే నడుస్తున్నాం.+

10 మనం గుడ్డివాళ్లలా గోడను తడుముకుంటూ వెళ్తున్నాం;

కళ్లులేని వాళ్లలా వెతుకులాడుతూ ఉన్నాం.+

సాయంత్రం చీకట్లో తడబడినట్టు మిట్టమధ్యాహ్న వేళ తడబడుతున్నాం;

బలాఢ్యుల మధ్య మనం చచ్చినవాళ్లలా ఉన్నాం.

11 మనమంతా ఎలుగుబంట్లలా గుర్రుమంటున్నాం,

పావురాల్లా దుఃఖంతో మూల్గుతున్నాం.

మనం న్యాయం కోసం చూస్తున్నాం, కానీ అది కనిపించట్లేదు;

రక్షణ కోసం ఎదురుచూస్తున్నాం, కానీ అది మనకు చాలా దూరంలో ఉంది.

12 ఎందుకంటే నీ ముందు మా తిరుగుబాట్లు అనేకం;+

మేము చేసిన ఒక్కో పాపం మా మీద సాక్ష్యం చెప్తోంది.+

మా తిరుగుబాట్లు మా వెన్నంటే ఉన్నాయి;

మా దోషాల గురించి మాకు బాగా తెలుసు.+

13 మేము తప్పు చేశాం, యెహోవాను కాదన్నాం;

మా దేవునికి దూరంగా వెళ్లాం.

అణచివేత గురించి, తిరుగుబాటు గురించి మేము మాట్లాడుకున్నాం;+

మా హృదయాల్లో అబద్ధాలు పెట్టుకొని, వాటి గురించి గుసగుసలాడుకున్నాం.+

14 న్యాయం వెనక్కి తరిమేయబడింది,+

నీతి దూరంగా నిలబడింది;+

ఎందుకంటే సంతవీధిలో సత్యం* తడబడింది,

సరైనది అందులో అడుగు పెట్టలేకపోతోంది.

15 సత్యం* కనుమరుగైపోయింది,+

చెడుకు దూరంగా ఉన్నవాళ్లు దోచుకోబడుతున్నారు.

యెహోవా దాన్ని చూశాడు, అది ఆయనకు నచ్చలేదు,*

ఎందుకంటే ఎక్కడా న్యాయం కనిపించట్లేదు.+

16 సహాయం చేయడానికి ఒక్క మనిషి కూడా లేకపోవడం,

వాళ్ల తరఫున మాట్లాడడానికి ఒక్కరు కూడా లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు,

అందుకే ఆయన బాహువే రక్షణను* తీసుకొచ్చింది,

ఆయన నీతే ఆయనకు ఆధారమైంది.

17 తర్వాత ఆయన నీతిని కవచంగా ధరించాడు,

రక్షణ* అనే శిరస్త్రాణాన్ని* తల మీద పెట్టుకున్నాడు.+

ప్రతీకార వస్త్రాలు తొడుక్కొని+

ఆసక్తిని పైవస్త్రంలా చుట్టుకున్నాడు.*

18 వాళ్లు చేసినదాన్ని బట్టి ఆయన వాళ్లకు ప్రతిదండన చేస్తాడు:+

తన విరోధుల మీద ఉగ్రత చూపిస్తాడు, తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు.+

ద్వీపాలకు తగిన శాస్తి చేస్తాడు.

19 సూర్యాస్తమయం వైపు ఉన్నవాళ్లు యెహోవా పేరుకు,

సూర్యోదయం వైపు ఉన్నవాళ్లు ఆయన మహిమకు భయపడతారు,

ఎందుకంటే ఆయన వేగంగా ప్రవహించే నదిలా దూసుకొస్తాడు,

యెహోవా పవిత్రశక్తే* దాన్ని ప్రవహింపజేస్తుంది.

20 యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోను దగ్గరికి,

తప్పులు చేయడం మానేసిన యాకోబు వంశస్థుల+ దగ్గరికి విమోచకుడు+ వస్తాడు.”+

21 “నా విషయానికొస్తే, వాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే”+ అని యెహోవా అంటున్నాడు. “నీ మీద నేను ఉంచిన నా పవిత్రశక్తి, నీ నోట నేను ఉంచిన మాటలు నీ నోటి నుండి గానీ, నీ పిల్లల నోటి నుండి గానీ, నీ మనవళ్ల నోటి నుండి గానీ ఎప్పటికీ తీసేయబడవు” అని యెహోవా అంటున్నాడు.

60 “ఓ స్త్రీ, లే!+ లేచి వెలుగు ప్రసరించు, ఎందుకంటే నీకు వెలుగు వచ్చేసింది.

యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తోంది.+

 2 ఇదిగో! చీకటి భూమిని కమ్ముకుంటుంది,

కటిక చీకటి దేశాల్ని కప్పేస్తుంది;

అయితే యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు,

ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.

 3 దేశాలు నీ వెలుగు దగ్గరికి వస్తాయి,+

తేజోవంతమైన నీ వైభవం* దగ్గరికి రాజులు+ వస్తారు.+

 4 తల ఎత్తి నీ చుట్టూ చూడు!

వాళ్లంతా సమకూర్చబడ్డారు; వాళ్లు నీ దగ్గరికే వస్తున్నారు.

నీ కుమారుల్ని చాలా దూరం నుండి తీసుకొస్తున్నారు,+

నీ కూతుళ్లను చంకనెత్తుకొని తీసుకొస్తున్నారు.+

 5 ఆ సమయంలో నువ్వు చూసినదాన్ని బట్టి నీ ముఖం వెలిగిపోతుంది,+

నీ గుండె కొట్టుకుంటుంది, ఉప్పొంగుతుంది,

ఎందుకంటే, సముద్ర సంపద నీ వైపు తరలించబడుతుంది;

దేశాల వనరులు నీ దగ్గరికి వస్తాయి.+

 6 ఒంటెల సమూహాలు,

మిద్యాను, ఏయిఫా+ దేశాల లేత మగ ఒంటెలు నీ దేశాన్ని* కప్పేస్తాయి.

షేబ దేశ వాసులంతా వస్తారు;

వాళ్లు బంగారాన్ని, సాంబ్రాణిని తీసుకొస్తారు.

వాళ్లు బహిరంగంగా యెహోవాకు స్తుతులు చెల్లిస్తారు.+

 7 కేదారు+ మందలన్నీ నీ దగ్గరికి సమకూర్చబడతాయి.

నెబాయోతు+ పొట్టేళ్లు నీకు సేవలు చేస్తాయి.

అవి నా బలిపీఠం మీదికి వస్తాయి, ఆమోదించబడతాయి,+

నేను నా మహిమాన్విత* మందిరాన్ని అందంగా చేస్తాను.+

 8 మేఘాల్లా, గూళ్లకు* చేరుకుంటున్న పావురాల్లా

ఎగురుకుంటూ వస్తున్న వీళ్లు ఎవరు?

 9 ద్వీపాలు నా మీద ఆశపెట్టుకుంటాయి;

తర్షీషు ఓడలు ముందు వరుసలో ఉన్నాయి,*

వాళ్లు నీ దేవుడైన యెహోవా పేరును, ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి స్తుతించడానికి

తమ వెండిబంగారాలతో పాటు

దూరం నుండి నీ కుమారుల్ని తీసుకొస్తున్నారు;+

ఎందుకంటే ఆయన నిన్ను మహిమపరుస్తాడు.*+

10 పరదేశులు నీ ప్రాకారాల్ని కడతారు,

వాళ్ల రాజులు నీకు పరిచారం చేస్తారు.+

ఎందుకంటే కోపంలో నేను నిన్ను కొట్టాను,

కానీ దయతో నీ మీద కరుణ చూపిస్తాను.+

11 నీ నగర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి;+

దేశాల వనరుల్ని నీ దగ్గరికి తీసుకొచ్చేలా

పగలు గానీ, రాత్రి గానీ అవి మూయబడవు,

వాళ్ల రాజులు ముందుండి వాటిని తీసుకొస్తారు.+

12 నిన్ను సేవించని ఏ దేశమైనా, రాజ్యమైనా నాశనమౌతుంది,

ఆ దేశాలు సర్వనాశనమౌతాయి.+

13 నా పవిత్రమైన స్థలాన్ని అందంగా చేయడానికి

లెబానోను మహిమ నీ దగ్గరికి వస్తుంది,+

సరళవృక్షం, యాష్‌ చెట్టు, తమాల వృక్షం కలిసి వస్తాయి;+

నేను నా పాదస్థలాన్ని మహిమపరుస్తాను.+

14 నిన్ను బాధించినవాళ్ల కుమారులు వచ్చి నీ ముందు వంగి నమస్కారం చేస్తారు;

నీ మీద గౌరవం లేనట్టు ప్రవర్తించే వాళ్లంతా నీ పాదాల మీద పడతారు,

వాళ్లు నిన్ను యెహోవా నగరం అని,

ఇశ్రాయేలు పవిత్ర దేవుని సీయోను అని పిలుస్తారు.+

15 నువ్వు విడిచిపెట్టబడ్డావు, ద్వేషించబడ్డావు, నీ గుండా ఎవరూ వెళ్లలేదు,+

అయితే నేను నిన్ను శాశ్వతమైన గర్వకారణంగా,

తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను.+

16 నువ్వు దేశాల పాలు తాగుతావు,+

రాజుల చనుపాలు తాగుతావు;+

యెహోవానైన నేనే నీ రక్షకుణ్ణని,

యాకోబు శక్తిమంతుడే నీ విమోచకుడని+ నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు.

17 నేను రాగికి బదులు బంగారాన్ని,

ఇనుముకు బదులు వెండిని,

కలపకు బదులు రాగిని,

రాళ్లకు బదులు ఇనుమును తీసుకొస్తాను;

శాంతిని నీకు పర్యవేక్షకులుగా,

నీతిని నీ మీద అధికారులుగా నియమిస్తాను.+

18 నీ దేశంలో దౌర్జన్యం అనే మాట గానీ,

నీ సరిహద్దుల లోపల నాశనం, వినాశనం అనే మాటలు గానీ ఇక వినిపించవు.+

నువ్వు నీ ప్రాకారాల్ని రక్షణ అని,+ నీ నగర ద్వారాల్ని స్తుతి అని పిలుస్తావు.

19 ఇక మీదట పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు,

చంద్రుడి కాంతి నీకు వెలుగు ఇవ్వదు,

ఎందుకంటే, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు,+

నీ దేవుడే నీకు సొగసుగా ఉంటాడు.+

20 ఇక మీదట నీ సూర్యుడు అస్తమించడు,

నీ చంద్రుడు క్షీణించిపోడు,

ఎందుకంటే, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు,+

నువ్వు దుఃఖించే రోజులు ముగిసిపోతాయి.+

21 నీ ప్రజలందరూ నీతిమంతులుగా ఉంటారు;

వాళ్లు శాశ్వతంగా దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

నాకు మహిమ* తెచ్చుకోవడానికి+

వాళ్లు నేను నాటిన మొక్క, నా చేతి పని.+

22 మీలో అల్పుడు వెయ్యిమంది అవుతాడు,

అందరికన్నా తక్కువవాడు బలమైన జనం అవుతాడు.

యెహోవానైన నేనే తగిన సమయంలో ఈ పనిని త్వరపెడతాను.”

61 సర్వోన్నత ప్రభువైన యెహోవా పవిత్రశక్తి నా మీద ఉంది,+

సాత్వికులకు మంచివార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.+

నలిగిన హృదయం గలవాళ్లను బాగుచేయడానికి,

బందీలకు విడుదలను ప్రకటించడానికి,

ఖైదీల కళ్లు పెద్దగా తెరవబడతాయని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు.+

 2 యెహోవా అనుగ్రహ సంవత్సరం గురించి,

మన దేవుని ప్రతీకార రోజు+ గురించి ప్రకటించడానికి,

దుఃఖించే వాళ్లందర్నీ ఓదార్చడానికి+ ఆయన నన్ను పంపాడు.

 3 సీయోను విషయంలో దుఃఖిస్తున్న వాళ్లకు

బూడిదకు బదులు అలంకార కిరీటాన్ని,

ఏడ్పుకు బదులు సంతోష తైలాన్ని,

కృంగిపోయిన మనసుకు బదులు స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన నన్ను పంపాడు.

వాళ్లు నీతి వృక్షాలు అని,

తనకు మహిమ* తెచ్చుకోవడానికి యెహోవా నాటిన చెట్లు అని పిలవబడతారు.+

 4 వాళ్లు పురాతన శిథిలాల్ని తిరిగి నిర్మిస్తారు;

ఒకప్పటి నిర్మానుష్య స్థలాల్ని మళ్లీ నిలబెడతారు,+

నాశనమైన నగరాల్ని,

తరతరాలపాటు నిర్మానుష్యంగా పడివున్న స్థలాల్ని+ బాగుచేస్తారు.+

 5 “అపరిచితులు వచ్చి మీ గొర్రెల మందల్ని కాస్తారు,

పరదేశులు+ మీ రైతులుగా, మీ ద్రాక్షతోటల కాపలావాళ్లుగా ఉంటారు.+

 6 మీరేమో యెహోవా యాజకులని పిలవబడతారు;+

వాళ్లు మిమ్మల్ని మన దేవుని పరిచారకులని పిలుస్తారు.

మీరు దేశాల వనరుల్ని అనుభవిస్తారు,+

వాళ్ల మహిమగల సంపదల్ని బట్టి మీరు గొప్పలు చెప్పుకుంటారు.

 7 మీరు అవమానానికి బదులు రెట్టింపు గౌరవం పొందుతారు,

అవమానం పాలయ్యే బదులు సంతోషంతో కేకలు వేస్తారు.

అవును, వాళ్లు తమ దేశంలో రెండుపాళ్లు పొందుతారు.+

నిత్య సంతోషం వాళ్ల సొంతమౌతుంది.+

 8 ఎందుకంటే యెహోవానైన నేను న్యాయాన్ని ప్రేమిస్తాను;+

దోపిడీ అన్నా, అవినీతి అన్నా నాకు అసహ్యం.+

నేను నమ్మకంగా వాళ్ల జీతం వాళ్లకు ఇస్తాను,

వాళ్లతో శాశ్వత ఒప్పందం చేస్తాను.+

 9 దేశాల మధ్య వాళ్ల సంతానం,*

జనాల మధ్య వాళ్ల వంశస్థులు సుప్రసిద్ధులౌతారు.+

వాళ్లను చూసేవాళ్లందరూ

వాళ్లు యెహోవా దీవించినవాళ్ల సంతానమని+ గుర్తుపడతారు.”

10 నేను యెహోవాను బట్టి చాలా సంతోషిస్తాను.

నా ప్రాణమంతా నా దేవుణ్ణి బట్టి సంతోషిస్తుంది.+

ఎందుకంటే ఆయన నాకు రక్షణ వస్త్రాలు తొడిగాడు;+

నీతి అనే చొక్కా* నాకు వేశాడు,

నేను, యాజకుడి లాంటి తలపాగాను పెట్టుకున్న+ పెళ్లికుమారుడిలా,

తన నగలతో అలంకరించుకున్న పెళ్లికూతురిలా ఉన్నాను.

11 ఎందుకంటే భూమి మొక్కల్ని మొలిపించినట్టు,

తోట తనలో నాటబడిన విత్తనాల్ని మొలకెత్తేలా చేసినట్టు,

సర్వోన్నత ప్రభువైన యెహోవా

దేశాలన్నిటి ముందు నీతి, స్తుతి మొలకెత్తేలా+ చేస్తాడు.+

62 సీయోను నీతి తేజోవంతమైన వెలుగులా ప్రకాశించేవరకు,+

దాని రక్షణ కాగడాలా మండేవరకు+

దాని విషయంలో నేను మౌనంగా ఉండను,+

యెరూషలేము విషయంలో నేను ఊరుకోను.

 2 “ఓ స్త్రీ, దేశాలు నీ నీతిని చూస్తాయి,+

రాజులందరూ నీ మహిమను చూస్తారు.+

యెహోవా స్వయంగా తన నోటితో పెట్టిన

కొత్త పేరుతో నువ్వు పిలవబడతావు.+

 3 నువ్వు యెహోవా చేతిలో సౌందర్య కిరీటంలా,

నీ దేవుని అరచేతిలో రాచ తలపాగాలా ఉంటావు.

 4 ఇకమీదట నువ్వు వదిలేయబడిన స్త్రీ అని పిలవబడవు,+

నీ దేశం నిర్జన ప్రదేశమని పిలవబడదు.+

నువ్వు, ‘దానిలోనే నా సంతోషం ఉంది’ అనే పేరుతో పిలవబడతావు,+

నీ దేశం ‘వివాహిత’ అని పిలవబడుతుంది.

ఎందుకంటే యెహోవా నిన్ను బట్టి సంతోషిస్తాడు,

నీ దేశం వివాహమైన స్త్రీలా ఉంటుంది.

 5 యువకుడు కన్యను పెళ్లిచేసుకున్నట్టు

నీ నివాసులు నిన్ను పెళ్లిచేసుకుంటారు.

పెళ్లికుమారుడు పెళ్లికూతురి విషయంలో సంతోషించినట్టు

నీ దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు.+

 6 యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలివాళ్లను నిలబెట్టాను.

పగలైనా, రాత్రైనా ఒక్క నిమిషం కూడా వాళ్లు మౌనంగా ఉండకూడదు.

యెహోవాను స్తుతించే ప్రజలారా,

విశ్రమించకండి,

 7 ఆయన యెరూషలేమును స్థిరంగా స్థాపించేవరకు,

అవును, దాన్ని భూమికి స్తుతిగా చేసేవరకు+ ఆయనకు ఏమాత్రం విశ్రాంతినివ్వకండి.”

 8 యెహోవా తన కుడిచేతితో, తన బలమైన బాహువుతో ఒట్టేసి ఇలా ప్రమాణం చేశాడు:

“ఇకమీదట నేను మీ ధాన్యాన్ని మీ శత్రువులకు ఆహారంగా ఇవ్వను,

మీరు ఎంతో కష్టపడి తయారుచేసుకున్న కొత్త ద్రాక్షారసాన్ని పరదేశులు తాగరు.+

 9 ఎవరైతే ధాన్యాన్ని సమకూర్చారో వాళ్లే దాన్ని తిని యెహోవాను స్తుతిస్తారు;

ద్రాక్షారసాన్ని సమకూర్చిన వాళ్లే దాన్ని నా పవిత్ర ప్రాంగణాల్లో తాగుతారు.”+

10 రండి, నగర ద్వారాల గుండా రండి.

ప్రజల కోసం దారిని సిద్ధం చేయండి.+

ఎత్తు చేయండి, రహదారిని ఎత్తు చేయండి.

దాని మీదున్న రాళ్లను తీసేయండి.+

జనాల కోసం ధ్వజాన్ని* నిలబెట్టండి.+

11 ఇదిగో! భూమి అంచుల్లో ఉన్న ప్రజలకు యెహోవా ఇలా చాటించాడు:

“సీయోను కూతురుకు ఇలా చెప్పండి:

‘ఇదిగో! నీ రక్షణ వస్తోంది.+

ఇదిగో! ఆయనిచ్చే ప్రతిఫలం ఆయన దగ్గరే ఉంది,

ఆయనిచ్చే జీతం ఆయన ముందే ఉంది.’ ”+

12 వాళ్లు పవిత్రమైన ప్రజలు అని, యెహోవా తిరిగి కొన్నవాళ్లు+ అని పిలవబడతారు,

నువ్వేమో ‘కోరదగినది’ అని, ‘వదిలేయబడని నగరం’+ అని పిలవబడతావు.

63 ఎదోము+ నుండి వస్తున్న ఈయన ఎవరు?

రంగురంగుల* వస్త్రాలు వేసుకొని బొస్రా+ నుండి వస్తున్న ఈయన ఎవరు?

వైభవోపేతమైన దుస్తులు ధరించి

మహాబలంతో నడిచి వస్తున్న ఈయన ఎవరు?

“నీతిగల మాటలు మాట్లాడే నేనే,

రక్షించే గొప్పశక్తి గల నేనే.”

 2 నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి?

నీ వస్త్రాలు ద్రాక్షతొట్టి తొక్కేవాళ్ల వస్త్రాల్లా ఎందుకున్నాయి?+

 3 “నేను ఒంటరిగా ద్రాక్షతొట్టి తొక్కాను.

జనాల్లో ఎవ్వరూ నాతోపాటు లేరు.

నేను కోపంతో వాళ్లను తొక్కుతూ ఉన్నాను,

ఆగ్రహంతో వాళ్లను తొక్కేస్తూ ఉన్నాను.+

వాళ్ల రక్తం నా వస్త్రాల మీద చిమ్మింది,

దాంతో వాటన్నిటికీ మరకలు అయ్యాయి.

 4 ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే రోజును నేను నిర్ణయించాను,+

వీళ్లను తిరిగి కొనే సంవత్సరం వచ్చేసింది.

 5 నేను చూశాను, కానీ సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరు;

మద్దతు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను.

కాబట్టి నా బాహువే రక్షణను* తీసుకొచ్చింది,+

నా ఆగ్రహమే నాకు మద్దతు ఇచ్చింది.

 6 నా కోపంలో జనాల్ని తొక్కాను,

నా ఆగ్రహంతో వాళ్లను మత్తిల్లజేశాను,+

వాళ్ల రక్తాన్ని నేలమీద ఒలికించాను.”

 7 యెహోవా మా కోసం చేసిన వాటన్నిటిని బట్టి,+

విశ్వసనీయ ప్రేమతో యెహోవా చేసిన కార్యాల్ని నేను ప్రకటిస్తాను,

యెహోవాను స్తుతిస్తాను.

తన కరుణ వల్ల, తన గొప్ప విశ్వసనీయ ప్రేమ వల్ల

ఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఎన్నో మేలులు చేశాడు.

 8 ఎందుకంటే ఆయన, “వాళ్లు నా ప్రజలు, నా పిల్లలు, ఎప్పటికీ నమ్మకద్రోహం చేయరు”+ అనుకున్నాడు.

వాళ్లకు రక్షకుడు అయ్యాడు.+

 9 వాళ్ల బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు.+

ఆయన సన్నిధి దూత* వాళ్లను రక్షించాడు.+

తన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన వాళ్లను తిరిగి కొన్నాడు,+

పాత రోజులన్నిట్లో వాళ్లను ఎత్తుకొని మోస్తూ వచ్చాడు.+

10 కానీ వాళ్లు తిరుగుబాటు చేశారు,+ ఆయన పవిత్రశక్తిని దుఃఖపెట్టారు.+

దాంతో ఆయన వాళ్లకు శత్రువు అయ్యాడు,+

వాళ్లతో పోరాడాడు.+

11 అప్పుడు వాళ్లు పాత రోజుల్ని,

అంటే ఆయన సేవకుడైన మోషే రోజుల్ని గుర్తుచేసుకొని ఇలా అన్నారు:

“తన ప్రజల కాపరులతో పాటు+ వాళ్లను సముద్రం గుండా బయటికి తీసుకొచ్చిన దేవుడు+ ఎక్కడ?

అతనిలో తన పవిత్రశక్తిని ఉంచిన దేవుడు+ ఎక్కడ?

12 మోషే కుడిచేతితో పాటు మహిమగల తన బాహువును పంపించిన దేవుడు+ ఎక్కడ?

తనకు శాశ్వతమైన పేరు కలిగేలా+

వాళ్ల ముందు నీళ్లను పాయలుగా చేసిన దేవుడు+ ఎక్కడ?

13 మైదానంలో గుర్రం నడిచినట్టు

వాళ్లు తొట్రుపడకుండా నడిచివెళ్లేలా

ఉప్పొంగే* జలాల గుండా వాళ్లను నడిపించిన దేవుడు ఎక్కడ?

14 లోయ మైదానంలోకి వెళ్లినప్పుడు పశువులు విశ్రాంతి తీసుకున్నట్టు

యెహోవా పవిత్రశక్తి వాళ్లకు విశ్రాంతినిచ్చింది.”+

నీకు ఘనమైన* పేరు తెచ్చుకోవడానికి+

నీ ప్రజల్ని నువ్వు అలా నడిపించావు.

15 పరలోకం నుండి, అంటే పవిత్రమైన, మహిమాన్వితమైన*

నీ ఉన్నత నివాసం నుండి చూడు.

నీ ఆసక్తి, నీ గొప్ప బలం ఏమయ్యాయి?

నీ కనికరం, నీ కరుణ+ నిన్ను కదిలించట్లేదా?+

నా మీద నువ్వు వాటిని చూపించట్లేదు.

16 ఎంతైనా నువ్వే మా తండ్రివి;+

అబ్రాహాముకు మేము తెలియకపోయినా,

ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా

యెహోవా, నువ్వే మా తండ్రివి.

ప్రాచీనకాలం నుండి మా విమోచకుడు అనే పేరు నీకుంది.+

17 యెహోవా, నీ మార్గాల నుండి మమ్మల్ని ఎందుకు తప్పిపోనిస్తున్నావు?*

నీకు భయపడకుండా ఉండేలా మా హృదయాల్ని ఎందుకు కఠినం కానిస్తున్నావు?*+

నీ సేవకుల కోసం,

నీ స్వాస్థ్యపు గోత్రాల కోసం తిరిగి రా.+

18 అది నీ పవిత్ర ప్రజల స్వాధీనంలో కొంతకాలం పాటే ఉంది.

మా శత్రువులు నీ పవిత్రమైన స్థలాన్ని తొక్కారు.+

19 మేము చాలా ఎక్కువకాలం పాటు,

నువ్వు ఎప్పుడూ పరిపాలించని ప్రజల్లా, నీ పేరుతో పిలవబడని ప్రజల్లా ఉన్నాం.

64 నీ ముందు పర్వతాలు కంపించేలా

నువ్వు ఆకాశాన్ని చీల్చుకొని కిందికి దిగివస్తే,

 2 అగ్ని గచ్చపొదల్ని కాల్చేసి

నీళ్లను మరిగించినట్టు నువ్వు దిగివస్తే,

నీ శత్రువులకు నీ పేరు తెలుస్తుంది,

దేశాలు నీ ముందు భయంతో వణుకుతాయి!

 3 మేము ఊహించడానికి కూడా భయపడే సంభ్రమాశ్చర్య కార్యాలు నువ్వు చేసినప్పుడు+

నువ్వు దిగివచ్చావు, నీ ముందు పర్వతాలు కంపించాయి.+

 4 తన కోసం కనిపెట్టుకొని* ఉన్నవాళ్ల తరఫున చర్య తీసుకునే

నీలాంటి దేవుడి గురించి ప్రాచీనకాలం నుండి ఎవ్వరూ వినలేదు, గమనించలేదు,

ఏ కన్నూ అలాంటి దేవుణ్ణి చూడలేదు.+

 5 నిన్ను గుర్తుపెట్టుకొని, నీ మార్గాల్ని అనుసరిస్తూ

సంతోషంగా సరైనవాటిని చేసేవాళ్లను+ కలుసుకోవడానికి నువ్వు వచ్చావు.

ఇదిగో! మేము పాపం చేస్తూ ఉన్నప్పుడు నీకు కోపమొచ్చింది,+

మేము చాలాకాలం పాటు అలా పాపాలు చేశాం.

రక్షణ పొందడానికి ఇప్పుడు మేము అర్హులమేనా?

 6 మేమంతా అపవిత్రుడైన వ్యక్తిలా తయారయ్యాం,

మా నీతికార్యాలన్నీ మైలగుడ్డలా* ఉన్నాయి.+

మేమంతా ఆకులా వాడిపోతాం,

మా తప్పులు గాలిలా మమ్మల్ని కొట్టుకొనిపోతాయి.

 7 నీ పేరు ఎత్తి ప్రార్థించేవాళ్లు ఎవరూ లేరు,

నిన్ను గట్టిగా పట్టుకునేలా తమను తాము పురికొల్పుకునేవాళ్లు ఎవరూ లేరు;

ఎందుకంటే, నువ్వు మా నుండి నీ ముఖాన్ని దాచుకున్నావు,+

మా తప్పుల వల్ల మేము కరిగిపోయేలా చేస్తున్నావు.

 8 కానీ యెహోవా, నువ్వే మా తండ్రివి.+

మేము బంకమట్టి, నువ్వు మా కుమ్మరివి;*+

మేమంతా నీ చేతి పని.

 9 యెహోవా, మా మీద మరీ అంత కోప్పడకు,+

మా తప్పుల్ని ఎల్లకాలం గుర్తుంచుకోకు.

దయచేసి మా వైపు చూడు, మేమంతా నీ ప్రజలమే కదా.

10 నీ పవిత్ర నగరాలు ఎడారిలా మారిపోయాయి.

సీయోను ఎడారిగా మారింది,

యెరూషలేము పాడుబడ్డ భూమిలా తయారైంది.+

11 పవిత్రమైన, మహిమాన్వితమైన* మా మందిరం,

మా పూర్వీకులు నిన్ను స్తుతించిన మందిరం,

అగ్నితో కాల్చేయబడింది,+

మాకు ప్రియమైనవన్నీ శిథిలాలుగా మిగిలాయి.

12 యెహోవా, ఇంత జరిగినా నువ్వు ఇంకా చర్య తీసుకోవా?

మౌనంగా ఉండి మమ్మల్ని ఇంతలా బాధలు పడనిస్తావా?+

65 “నా కోసం అడగని వాళ్లను నన్ను వెతకనిచ్చాను;

నన్ను వెతకని వాళ్లకు నేను దొరికాను.+

నా పేరు ఎత్తని జనంతో ‘నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను!’ అని అన్నాను.+

 2 మొండి ప్రజల+ కోసం,

తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తూ+

చెడ్డ మార్గంలో నడుస్తున్న ప్రజల+ కోసం రోజంతా నేను నా చేతులు చాపాను;

 3 తోటల్లో బలులు అర్పిస్తూ,+ ఇటుకల మీద ధూపం వేస్తూ

వాళ్లు అస్తమానం ముఖం మీదే నన్ను అవమానించారు.+

 4 వాళ్లు సమాధుల మధ్య కూర్చుంటారు,+

పందుల మాంసం తింటూ+

చాటుగా ఉన్న చోట్లలో* రాత్రి గడుపుతారు,

కంపుకొట్టేవాటి* పులుసు వాళ్ల పాత్రల్లో ఉంది.+

 5 వాళ్లు, ‘నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రావద్దు,

ఎందుకంటే నేను నీకన్నా పవిత్రుణ్ణి’* అంటారు.

వాళ్లు నా ముక్కురంధ్రాల్లో పొగలా, రోజంతా మండుతున్న నిప్పులా ఉన్నారు.

 6 ఇదిగో! అది నా ముందు రాయబడింది;

నేను ఊరికే నిలబడను,

వాళ్లకు ప్రతీకారం చేస్తాను,+

నేను వాళ్ల మీద పూర్తిగా పగతీర్చుకుంటాను.

 7 వాళ్ల తప్పుల్ని బట్టి, వాళ్ల పూర్వీకుల తప్పుల్ని బట్టి అలా చేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.

“వాళ్లు పర్వతాల మీద ధూపం వేసి

కొండల మీద నన్ను నిందించారు+ కాబట్టి

నేను ముందుగా వాళ్ల కూలిని వాళ్లకు పూర్తిగా లెక్క కట్టి ఇస్తాను.”

 8 యెహోవా ఇలా అంటున్నాడు:

“ద్రాక్షగుత్తిలో కొత్త ద్రాక్షారసం కనిపించినప్పుడు

‘దాన్ని పాడు చేయొద్దు, అందులో కాస్త మంచిది* ఉంది’ అని అంటారు కదా?

నా సేవకుల విషయంలో నేను కూడా అలాగే చేస్తాను;

నేను వాళ్లందర్నీ నాశనం చేయను.+

 9 నేను యాకోబు నుండి ఒక సంతానాన్ని* బయటికి తెస్తాను,

యూదా నుండి, నా పర్వతాల్ని స్వాస్థ్యంగా పొందే వ్యక్తిని బయటికి తెస్తాను;+

నేను ఎంచుకున్న వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకుంటారు,

నా సేవకులు అందులో నివసిస్తారు.+

10 షారోను+ గొర్రెలకు మేత స్థలం అవుతుంది,

ఆకోరు లోయ+ పశువులకు విశ్రాంతి స్థలం అవుతుంది,

నన్ను వెదికే నా ప్రజల కోసం అలా జరుగుతుంది.

11 కానీ మీరు యెహోవాను మర్చిపోయే ప్రజలు,+

మీరు నా పవిత్ర పర్వతాన్ని మర్చిపోయి+

అదృష్ట దేవతకు బల్లను సిద్ధం చేస్తారు,

విధి దేవుడికి పానీయార్పణలు అర్పిస్తారు.

12 కాబట్టి నేను మిమ్మల్ని ఖడ్గానికి అప్పగిస్తాను,+

వధించబడడం కోసం మీరంతా వంగుతారు,+

ఎందుకంటే నేను పిలిచాను, కానీ మీరు పలకలేదు,

నేను మాట్లాడాను, కానీ మీరు వినలేదు;+

మీరు నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తూ వచ్చారు,

నాకు నచ్చని వాటిని ఎంచుకున్నారు.”+

13 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో! నా సేవకులు భోజనం చేస్తారు, కానీ మీరు ఆకలిగా ఉంటారు.+

నా సేవకులు నీళ్లు తాగుతారు,+ కానీ మీరు దాహంగా ఉంటారు.

నా సేవకులు సంతోషిస్తారు,+ కానీ మీరు అవమానాలపాలు అవుతారు.+

14 ఇదిగో! నా సేవకులు హృదయానందంతో సంతోషంగా కేకలు వేస్తారు,

కానీ మీరు హృదయ వేదనతో ఏడుస్తారు,

కృంగిన మనసుతో* విలపిస్తారు.

15 మీరు విడిచివెళ్లే పేరును, నేను ఎంచుకున్న ప్రజలు శపించడానికి ఉపయోగిస్తారు,

సర్వోన్నత ప్రభువైన యెహోవా మీలో ప్రతీ ఒక్కర్ని హతమారుస్తాడు,

కానీ తన సేవకుల్ని ఆయన వేరే పేరుతో పిలుస్తాడు;+

16 దానివల్ల భూమ్మీద తమ కోసం దీవెనను వెదికే వాళ్లు

సత్యవంతుడైన* దేవుని చేత దీవించబడతారు,

భూనివాసుల్లో ఒట్టేసి ప్రమాణం చేసేవాళ్లు

సత్యవంతుడైన* దేవుని తోడని ప్రమాణం చేస్తారు.+

ఎందుకంటే పాత కష్టాలన్నీ మరవబడతాయి;

అవి నా కళ్లకు కనిపించకుండా దాచబడతాయి.+

17 ఎందుకంటే ఇదిగో! నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాను;+

పాత సంగతులు గుర్తుకురావు,

అవి హృదయంలో కూడా ఉండవు.*+

18 నేను సృష్టించేవాటిని బట్టి మీరు ఉల్లసించండి, ఎప్పటికీ సంతోషించండి.

ఎందుకంటే, ఇదిగో! నేను సీయోనును సంతోష కారణంగా చేయబోతున్నాను,

దాని ప్రజల్ని ఉల్లాస కారణంగా చేయబోతున్నాను.+

19 నేను యెరూషలేమును బట్టి ఆనందిస్తాను, నా ప్రజల్ని బట్టి చాలా సంతోషిస్తాను;+

ఏడ్పులు గానీ, ఆర్తనాదాలు గానీ ఇంకెప్పుడూ దానిలో వినిపించవు.”+

20 “పుట్టిన కొన్ని రోజులకే చనిపోయే పసిబిడ్డలు గానీ,

ఆయుష్షు నిండకుండానే చనిపోయే ముసలివాళ్లు గానీ అక్కడ ఇక ఉండరు.

ఎందుకంటే, నూరేళ్ల వయసులో చనిపోయే వ్యక్తి కూడా బాలుడిగానే ఎంచబడతాడు,

పాపం చేసిన వ్యక్తి వందేళ్లవాడైనా సరే శపించబడతాడు.*

21 వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు,+

ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు.+

22 వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు,

వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు.

ఎందుకంటే నా ప్రజల ఆయుష్షు వృక్ష ఆయుష్షు అంత ఉంటుంది,+

నేను ఎంచుకున్న ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు.

23 వాళ్లు వృథాగా ప్రయాసపడరు,+

అకస్మాత్తుగా వచ్చే అపాయానికి గురయ్యేలా పిల్లల్ని కనరు;

ఎందుకంటే వాళ్లు, వాళ్ల వంశస్థులు+

యెహోవా దీవించిన సంతానం.+

24 వాళ్లు వేడుకోకముందే నేను జవాబిస్తాను;

వాళ్లు మాట్లాడడం పూర్తికాక ముందే నేను వింటాను.

25 తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయి,

సింహం ఎద్దులా గడ్డి తింటుంది,+

పాముకు మట్టి ఆహారమౌతుంది.

నా పవిత్ర పర్వతమంతటా అవి ఏ హాని గానీ, నాశనం గానీ చేయవు”+ అని యెహోవా అంటున్నాడు.

66 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం.+

మరి మీరు నా కోసం ఎలాంటి మందిరం కట్టగలరు?+

నా విశ్రాంతి స్థలం ఎక్కడ?”+

 2 యెహోవా ఇలా అంటున్నాడు:

“స్వయంగా నా చేతులే వీటన్నిటినీ చేశాయి,

అవన్నీ అలాగే వచ్చాయి.+

అయితే వీళ్లను, అంటే

విరిగిన మనసు కలిగి, నా మాటకు భయపడే వినయస్థుల్ని నేను చూస్తాను.+

 3 ఎద్దును వధించేవాడు, మనిషిని చంపేవాడిలా ఉన్నాడు.+

గొర్రెను బలి ఇచ్చేవాడు, కుక్క మెడను విరగ్గొట్టేవాడిలా ఉన్నాడు.+

కానుక అర్పించేవాడు, పంది రక్తాన్ని అర్పించేవాడిలా ఉన్నాడు!+

సాంబ్రాణితో జ్ఞాపకార్థ అర్పణను అర్పించేవాడు,+ మంత్రాలతో దీవించేవాడిలా* ఉన్నాడు.+

వాళ్లు తమకు నచ్చిన దారుల్ని ఎంచుకున్నారు,

అసహ్యమైనవాటిని బట్టి సంతోషిస్తున్నారు.

 4 కాబట్టి నేను వాళ్లను శిక్షించడానికి మార్గాల్ని ఎంచుకుంటాను,+

వాళ్లు భయపడేవాటినే వాళ్లమీదికి రప్పిస్తాను.

ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవ్వరూ పలకలేదు;

నేను మాట్లాడినప్పుడు ఎవ్వరూ వినలేదు.+

వాళ్లు నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తూ వచ్చారు,

నాకు నచ్చని వాటిని ఎంచుకున్నారు.”+

 5 యెహోవా మాటకు భయపడేవాళ్లారా, ఆయన ఏం చెప్తున్నాడో వినండి:

“మిమ్మల్ని ద్వేషించి, నా పేరును బట్టి మిమ్మల్ని దూరం పెట్టే మీ సహోదరులు, ‘యెహోవా మహిమపర్చబడాలి!’ అని అంటున్నారు.+

కానీ ఆయన ప్రత్యక్షమై మీకు సంతోషం తెస్తాడు,

వాళ్లేమో అవమానాలపాలు అవుతారు.”+

 6 నగరంలో కోలాహలం వినిపిస్తోంది, ఆ శబ్దం ఆలయం నుండి వస్తోంది!

అది యెహోవా తన శత్రువులకు తగిన శాస్తి చేస్తున్న శబ్దం.

 7 పురిటినొప్పులు రాకముందే ఆమె బిడ్డను కన్నది.+

ప్రసవవేదన మొదలవ్వకముందే మగబిడ్డను కన్నది.

 8 అలా జరిగిందని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా?

అలాంటివాటిని ఎవరైనా చూశారా?

ఒక్కరోజులో ఒక దేశానికి జన్మనివ్వడం వీలౌతుందా?

ఒక్కసారిగా ఒక జనమంతా పుడుతుందా?

అయితే, సీయోనుకు ప్రసవవేదన మొదలవ్వగానే ఆమె కుమారుల్ని కన్నది.

 9 “నేను పురిటినొప్పులు కలిగించి, బిడ్డ పుట్టకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు.

“ప్రసవవేదన కలిగించి, గర్భం మూసుకుపోయేలా చేస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు.

10 యెరూషలేమును ప్రేమించేవాళ్లారా,+ మీరంతా ఆమెతోపాటు సంతోషించండి, ఆనందించండి.+

ఆమె గురించి దుఃఖిస్తున్నవాళ్లారా, మీరంతా ఆమెతో కలిసి అధికంగా ఉల్లసించండి.

11 ఎందుకంటే ఓదార్పు అనే ఆమె చనుపాలు తాగి మీరు పూర్తిగా తృప్తిపొందుతారు,

మీరు కడుపునిండా తాగి, ఆమె గొప్ప వైభవాన్ని బట్టి సంతోషిస్తారు.

12 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో, నేను నదిలా శాంతిని,+

ఉప్పొంగే ప్రవాహంలా దేశాల వైభవాన్ని ఆమెకు ఇస్తున్నాను.+

మీరు వాటి పాలు తాగుతారు, వాళ్లు మిమ్మల్ని చంకనెత్తుకొని తీసుకొస్తారు,

తమ మోకాళ్ల మీద మిమ్మల్ని ఆడిస్తారు.

13 తల్లి తన కుమారుణ్ణి ఓదార్చినట్టు

నేను మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాను;+

యెరూషలేము విషయంలో మీరు ఊరట పొందుతారు.+

14 మీరది చూస్తారు, మీ హృదయాలు సంతోషిస్తాయి,

మీ ఎముకలు లేతగడ్డిలా వర్ధిల్లుతాయి.

యెహోవా చెయ్యి* తన సేవకులకు వెల్లడౌతుంది,

కానీ తన శత్రువుల మీద ఆయన తన కోపాన్ని వెళ్లగక్కుతాడు.”+

15 “ఎందుకంటే మహాకోపంతో ప్రతీకారం చేయడానికి,

అగ్నిజ్వాలలతో గద్దించడానికి+

యెహోవా అగ్నిలా దిగివస్తాడు,+

ఆయన రథాలు సుడిగాలిలా ఉన్నాయి.+

16 ఎందుకంటే యెహోవా అగ్నితో తీర్పును అమలుచేస్తాడు,

అవును, ఖడ్గంతో మనుషులందర్నీ శిక్షిస్తాడు;

యెహోవా చేతిలో హతులైన వాళ్లు చాలామంది ఉంటారు.

17 “మధ్యలో ఉన్న వ్యక్తిని అనుసరిస్తూ తోటల్లోకి*+ ప్రవేశించడానికి తమను తాము పవిత్రపర్చుకుంటూ, శుద్ధీకరించుకుంటూ, పందుల మాంసాన్ని,+ అసహ్యమైన వాటిని, చుంచెలుకల్ని+ తినే వాళ్లంతా ఒకేసారి నాశనమౌతారు” అని యెహోవా అంటున్నాడు. 18 “వాళ్ల పనుల గురించి, వాళ్ల ఆలోచనల గురించి నాకు తెలుసు కాబట్టి, అన్ని దేశాలకు, భాషలకు చెందిన ప్రజల్ని సమకూర్చడానికి నేను వస్తున్నాను; వాళ్లు వచ్చి నా మహిమను చూస్తారు.”

19 “నేను వాళ్ల మధ్య ఒక సూచనను పెడతాను. తప్పించుకున్న వాళ్లలో కొందర్ని ఇప్పటివరకు నా గురించిన వార్త వినని, నా మహిమను చూడని దేశాలకు అంటే విలుకాండ్రు ఉండే తర్షీషు,+ పూలు, లూదు+ దేశాలకు; తుబాలుకు, యావానుకు,+ సుదూర ద్వీపాలకు పంపిస్తాను. వాళ్లు దేశాల మధ్య నా మహిమను ప్రకటిస్తారు.+ 20 ఇశ్రాయేలు ప్రజలు శుభ్రమైన పాత్రలో యెహోవా మందిరంలోకి కానుక తెచ్చినట్టు, వాళ్లు అన్నిదేశాల్లో నుండి మీ సహోదరులందర్నీ గుర్రాల మీద, రథాల మీద, కప్పు ఉన్న బండ్ల మీద, కంచర గాడిదల మీద, వేగంగా నడిచే ఒంటెల మీద ఎక్కించుకొని యెహోవాకు కానుకగా తీసుకొస్తారు;+ నా పవిత్ర పర్వతమైన యెరూషలేముకు వాళ్లను తీసుకొస్తారు” అని యెహోవా అంటున్నాడు.

21 “వాళ్లలో కొంతమందిని నేను యాజకులుగా, లేవీయులుగా తీసుకుంటాను” అని యెహోవా అంటున్నాడు.

22 “నేను చేయబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమి+ ఎలాగైతే నా ముందు ఎప్పటికీ నిలిచివుంటాయో, అలాగే నీ సంతానం,* నీ పేరు కూడా ఎప్పటికీ నిలిచివుంటాయి”+ అని యెహోవా అంటున్నాడు.

23 “అమావాస్య నుండి అమావాస్య వరకు, విశ్రాంతి రోజు నుండి విశ్రాంతి రోజు వరకు

నా ముందు వంగి నమస్కారం చేయడానికి* మనుషులందరూ వస్తారు”+ అని యెహోవా అంటున్నాడు.

24 “వాళ్లు బయటికి వెళ్లి, నా మీద తిరుగుబాటు చేసినవాళ్ల కళేబరాలు చూస్తారు;

వాటిమీదున్న పురుగులు చావవు,

వాటి అగ్ని ఆరిపోదు,+

ప్రజలందరూ వాటిని అసహ్యించుకుంటారు.”

“యెహోవా ఇచ్చే రక్షణ” అని అర్థం.

లేదా “దాని యజమాని.”

అక్ష., “వాటిని పిండలేదు.”

లేదా “పర్ణశాలలా; పాకలా.”

లేదా “పాలకులారా.”

లేదా “ఉపదేశాన్ని.”

లేదా “సబ్బాతు రోజుల్ని.”

లేదా “అనాథల.”

లేదా “గోధుమలతో తయారైన మద్యం.”

లేదా “అనాథలకు.”

లేదా “కరిగించేస్తాను.”

విగ్రహపూజకు సంబంధించిన వృక్షాలు, తోటలు అని తెలుస్తోంది.

మండే గుణం ఉన్న దారం లాంటి పోగు.

లేదా “చివరి రోజుల్లో.”

లేదా “ఉపదేశం.”

లేదా “సరిదిద్దుతాడు.”

అంటే, మొక్కల్ని కత్తిరించే కత్తెరలు.

తిండిబోతు చిన్న క్షీరదాలు.

లేదా “అతని ఊపిరి అతని ముక్కురంధ్రాల్లో ఉంటుంది.”

లేదా “పాములోడిని.”

లేదా “మిమ్మల్ని బాగుచేసేవాడిగా.”

లేదా “కళ్ల.”

అక్ష., “మెడ (గొంతు) చాచి.”

లేదా “లోలాకుల్ని.”

లేదా “దట్టీల్ని.”

లేదా “పైవస్త్రాల్ని.”

లేదా “లోదుస్తుల్ని.”

అంటే, పెళ్లి కాలేదనే, పిల్లలు లేరనే అవమానం.

అక్ష., “మలాన్ని.”

అక్ష., “పది జతల.” అంటే, పది జతల ఎద్దులు ఒక రోజులో దున్నేంత భూమి.

అనుబంధం B14 చూడండి.

అనుబంధం B14 చూడండి.

అనుబంధం B14 చూడండి.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

అంటే, గిలకల తప్పెట.

అంటే, ఫ్లూటు.

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

లేదా “ప్రముఖులు.”

లేదా “న్యాయం.”

లేదా “నిర్ణయం; ఆలోచన.”

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

లేదా “ఉపదేశాన్ని.”

లేదా “ధ్వజస్తంభాన్ని.”

అక్ష., “పిలుస్తున్న వ్యక్తి స్వరానికి.”

అక్ష., “అంటించు.”

లేదా “సంతానం.” అక్ష., “విత్తనం.”

అక్ష., “ఒక పవిత్రమైన విత్తనం దానికి మొద్దుగా ఉంటుంది.”

లేదా “వాళ్లు” అయ్యుంటుంది.

అంటే, ఇశ్రాయేలుతో.

“శేషం మాత్రమే తిరిగొస్తుంది” అని అర్థం.

లేదా “భయపెడదాం” అయ్యుంటుంది.

లేదా “దాని గోడల్లో సందు చేసుకొని.”

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

సెప్టువజింటులో “కన్య.”

“దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.

లేదా “ఈజిప్టు.”

లేదా “వాగుల్లో.”

అంటే, యూఫ్రటీసు.

లేదా “పెయ్యను.”

బహుశా “కొల్లసొమ్ము కోసం త్వరపడడం, దోపుడుసొమ్ము కోసం త్వరగా రావడం” అనే అర్థం ఉండవచ్చు.

లేదా “సాక్షి సంతకం చేయించు; ధృవీకరణ చేయించు.”

అంటే, యెషయా భార్య.

అక్ష., “దగ్గరికి వెళ్లినప్పుడు.”

షిలోయా అనేది ఒక నీటి కాలువ.

అంటే, యూఫ్రటీసు.

యెషయా 7:14 చూడండి.

లేదా “నడుం కట్టుకోండి.”

“దేవుడు మాతో ఉన్నాడు” అనే మాట కోసం హీబ్రూలో ఇమ్మానుయేలు అనే పదాన్ని ఉపయోగించారు. యెషయా 7:14; 8:8 చూడండి.

లేదా “ధృవీకరించినదాన్ని.”

లేదా “ఉపదేశానికి.”

లేదా “ఆత్రంగా ఎదురుచూస్తూ.”

లేదా “ధృవీకరించినదానిలో.”

అక్ష., “సూర్యోదయం.”

లేదా “పనులు చేయించే వ్యక్తి.”

లేదా “ప్రభుత్వం; రాచరికం.”

లేదా “ప్రభుత్వం; రాచరికం.”

అక్ష., “వెనుక నుండి.”

లేదా “తాటిమట్టను, జమ్మును” అయ్యుంటుంది.

లేదా “అనాథల.”

లేదా “అనాథల్ని.”

లేదా “శిక్షించే.”

లేదా “మహిమను.”

లేదా “చెక్కుడు విగ్రహాలు.”

అక్ష., “నేను.”

లేదా “శిక్ష.”

లేదా “గొడ్డలితో.”

లేదా “భయం.”

లేదా “భయం.”

లేదా “నీతితో.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “కాసేపు నివసిస్తుంది.”

లేదా “దూడ, సింహం కలిసి మేస్తాయి” అయ్యుంటుంది.

లేదా “ధ్వజస్తంభంలా.”

లేదా “దేశాలు ఆయన కోసం వెతుకుతాయి.”

అంటే, బాబిలోనియా.

లేదా “ధ్వజస్తంభాన్ని.”

అక్ష., “భుజం.”

లేదా “అధికారాన్ని విస్తరించుకుంటారు.”

అక్ష., “నాలుకను.”

లేదా “ఆరిపోజేస్తాడు” అయ్యుంటుంది.

అంటే, యూఫ్రటీసు.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “ఏడు కాలువలుగా విభజిస్తాడు” అయ్యుంటుంది.

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

లేదా “సంగీతం వాయించండి.”

అక్ష., “నివాసురాలా.” ఇక్కడ, జనాభా మొత్తం ఒక స్త్రీగా సూచించబడింది.

లేదా “ధ్వజస్తంభాన్ని.”

అక్ష., “ప్రతిష్ఠించబడిన నా.”

లేదా “కెసిల్‌ నక్షత్రరాశులు.” ఇవి బహుశా మృగశీర్ష నక్షత్రరాశిని, చుట్టుపక్కల నక్షత్రరాశుల్ని సూచిస్తుండవచ్చు.

లేదా “రాజ్యాలకు ఆభరణంలా ఉన్న.”

లేదా “మేకల్లాంటి చెడ్డదూతలు” అయ్యుంటుంది. పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.

లేదా “వాళ్లకు విశ్రాంతినిస్తాడు.”

లేదా “ఇలా ఎగతాళి చేస్తావు.”

అంటే, జూనిపర్‌ చెట్లు.

లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.

అక్ష., “మేకపోతులన్నిటినీ.”

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

పదకోశం చూడండి.

అక్ష., “ఇంట్లో.”

లేదా “కొమ్మలా.”

లేదా “కొట్టడానికి సిద్ధంగా ఉన్న.”

లేదా “వేగంగా కదిలే విషసర్పం.”

లేదా “వాగును.”

లేదా “డేరాలో.”

లేదా “ఎర్రని ద్రాక్షలతో బరువెక్కిన దాని కొమ్మల్ని.”

లేదా “మీ వేసవికాల పంట మీదికి, మీ కోత మీదికి యుద్ధకేక దిగివచ్చింది” అయ్యుంటుంది.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

లేదా “కూలివాడు లెక్కించినంత జాగ్రత్తగా లెక్కిస్తే.”

అంటే, సరిగ్గా మూడు సంవత్సరాల్లో.

అక్ష., “ఇశ్రాయేలు కుమారుల.”

అక్ష., “అతని శరీరంలోని కొవ్వు.”

పదకోశం చూడండి.

అక్ష., “బండరాయి అయిన.”

లేదా “ఆహ్లాదకరమైన.”

లేదా “అన్యదేవుడి.”

లేదా “పపైరస్‌.”

లేదా “ధ్వజస్తంభంలా.”

అక్ష., “కొమ్ము.”

లేదా “స్థలం నుండి” అయ్యుంటుంది.

లేదా “పాములోళ్లను.”

లేదా “మెంఫిస్‌.”

లేదా “తాటిమట్టకే గానీ జమ్ముకే గానీ” అయ్యుంటుంది.

లేదా “సైన్యాధికారిని.”

లేదా “చాలీచాలని బట్టలతో.”

లేదా “దేని సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారో ఆ ఐగుప్తును.”

ప్రాచీన బాబిలోనియా ప్రాంతాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.

అక్ష., “నా తుంట్లలో చాలా నొప్పిగా ఉంది.”

లేదా “డాలుకు తైలం పూయండి.”

లేదా “చెక్కుడు విగ్రహాలన్నిటినీ.”

పదకోశం చూడండి.

“నిశ్శబ్దం” అని అర్థం.

లేదా “కూలివాడు లెక్కించినంత జాగ్రత్తగా లెక్కిస్తే.”

అంటే, సరిగ్గా ఒక్క సంవత్సరంలో.

యెరూషలేమును సూచిస్తుందని స్పష్టమౌతోంది.

బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.

లేదా “గుర్రపురౌతులతో.”

లేదా “సిద్ధం చేస్తుంది.”

లేదా “గుర్రపురౌతులు.”

లేదా “రక్షణ.”

లేదా “రూపకర్త.”

అక్ష., “నివాసాన్ని.”

లేదా “ఆధిపత్యాన్ని.”

అక్ష., “బరువు.”

లేదా “చిగుర్ల.”

అంటే, నైలు నది శాఖ.

అక్ష., “కన్యల్ని.”

లేదా “ఓడరేవు” అయ్యుంటుంది.

ఇది బహుశా తూరును సూచిస్తుండవచ్చు.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

లేదా “భూమిని.”

లేదా “ఎండిపోతోంది” అయ్యుంటుంది.

లేదా “పురాతన.”

లేదా “నిబంధనకు.”

లేదా “ఎండిపోతోంది” అయ్యుంటుంది.

అంటే, గిలకల తప్పెట.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

అక్ష., “సముద్రం.”

అక్ష., “వెలుగు.”

లేదా “అలంకారం.”

లేదా “ప్రవాహ ద్వారాలు.”

అక్ష., “తన పెద్దల.”

లేదా “ఆలోచించిన.”

లేదా “మడ్డి మీద పేరుకున్న చిక్కని ద్రాక్షారసంతో.”

అక్ష., “మింగేస్తాడు.”

లేదా “స్థిరమైన మనసున్నవాళ్లను” అయ్యుంటుంది.

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

అక్ష., “బండరాయి.”

లేదా “సమతలంగా.”

అంటే, నువ్వూ నీ పేరూ జ్ఞాపకం చేసుకోబడాలని, తెలియజేయబడాలని.

లేదా “ఔషధ మొక్కల మీది” అయ్యుంటుంది.

పదకోశం చూడండి.

ఇశ్రాయేలును సూచిస్తుందని తెలుస్తోంది. అది ఇక్కడ ఒక స్త్రీగా, ద్రాక్షతోటగా వర్ణించబడింది.

పదకోశం చూడండి.

అంటే, యూఫ్రటీసు.

పదకోశం చూడండి.

అక్ష., “కొమ్ము.”

లేదా “అహంకారంతో నిండిన; గర్వంతో నిండిన.”

రాజధాని సమరయను సూచిస్తుందని తెలుస్తోంది.

లేదా “అహంకారంతో నిండిన; గర్వంతో నిండిన.”

లేదా “కొలనూలు వెంట కొలనూలు, కొలనూలు వెంట కొలనూలు.”

లేదా “కొలనూలు వెంట కొలనూలు, కొలనూలు వెంట కొలనూలు.”

లేదా “షియోల్‌తో,” అంటే మానవజాతి సాధారణ సమాధితో. పదకోశం చూడండి.

లేదా “సమాధితో పాటు దర్శనం చూశాం” అయ్యుంటుంది.

లేదా “మట్టపుగుండుగా.”

లేదా “షియోల్‌తో,” అంటే మానవజాతి సాధారణ సమాధితో. పదకోశం చూడండి.

లేదా “వాళ్లు గ్రహించినప్పుడు విపరీతంగా భయపడతారు” అయ్యుంటుంది.

లేదా “భూమంతా.”

ఇవి ప్రాచీన ఐగుప్తులో పండే తక్కువ రకం గోధుమలు.

లేదా “క్రమశిక్షణ ఇస్తాడు; శిక్షిస్తాడు.”

లేదా “సంకల్పం; ఉద్దేశం.”

లేదా “ఆయన ఆచరణాత్మక తెలివి గొప్పగా ఉంటుంది.”

బహుశా “దేవుని బలిపీఠపు కొలిమి” అనే అర్థం ఉండవచ్చు; ఇది యెరూషలేమును సూచిస్తుందని తెలుస్తోంది.

అక్ష., “అపరిచితుల.”

లేదా “ఆలోచన.”

లేదా “మీరెంత భ్రష్టులు!”

లేదా “వాదించే.”

అంటే, అవమానంతో, నిరాశతో.

అక్ష., “పానీయాన్ని అర్పణగా పోస్తున్నారు.” ఒప్పందం కుదుర్చుకోవడాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

లేదా “వేగంగా కదిలే విషసర్పం.”

పదకోశం చూడండి.

లేదా “ఉపదేశాన్ని.”

లేదా “బావిలో” అయ్యుంటుంది.

లేదా “కనిపెట్టుకొని ఉన్నాడు.”

లేదా “ఆత్రంగా ఎదురుచూసే వాళ్లంతా.”

లేదా “లోహపు.”

లేదా “రుతుస్రావపు గుడ్డలా.”

లేదా “మురికి అని పిలుస్తావు” అయ్యుంటుంది.

అక్ష., “యెహోవా పేరు వస్తోంది.”

లేదా “పవిత్రశక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “వ్యర్థత అనే జల్లెడలో.”

లేదా “పవిత్రపర్చుకుంటున్నప్పుడు.”

లేదా “శబ్దం విన్నప్పుడు.”

అక్ష., “బండరాయి.”

అంటే, గిలకల తప్పెట.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

ఇక్కడ “తోఫెతు” అనేది, మండే అలంకారిక స్థలంగా ఉపయోగించబడింది; అది నాశనాన్ని సూచిస్తుంది.

లేదా “గుర్రపురౌతుల్ని.”

అక్ష., “బండరాయి.”

లేదా “నీతి ప్రకారం.”

లేదా “న్యాయం ప్రకారం.”

లేదా “ఆశ్రయంలా.”

లేదా “ఆశ్రయంలా.”

లేదా “మతభ్రష్టత్వాన్ని పెంపొందించడానికి.”

లేదా “గొప్ప.”

అక్ష., “దిగంబరులై.”

అక్ష., “బాహువువి.”

లేదా “దేవుడిచ్చే సంపద” అయ్యుంటుంది.

ఇది శత్రువును సూచిస్తోంది.

లేదా “ఎండిపోయి” అయ్యుంటుంది.

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “ఎత్తైన స్థలం.”

లేదా “ధ్యానిస్తుంది.”

లేదా “అనాగరికులైన.”

అక్ష., “లోతుగా.”

లేదా “రక్తం పర్వతాల మీద ప్రవహిస్తుంది.”

ఎదోము రాజధాని బొస్రాను సూచిస్తుందని స్పష్టమౌతోంది.

అంటే, పెలికన్‌.

లేదా “మట్టపుగుండుతో.”

లేదా “మేకలాంటి చెడ్డదూత” అయ్యుంటుంది. పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

పదకోశం చూడండి.

అక్ష., “కొలనూలుతో వాటికి పంచి ఇచ్చింది.”

లేదా “కస్తూరి.”

లేదా “పపైరస్‌.”

లేదా “ప్రధాన పానదాయకుణ్ణి.”

లేదా “రాజు ఇంటివాళ్ల.”

లేదా “సిరియా.”

లేదా “రాజు ఇంటివాళ్ల.”

లేదా “రాజు ఇంటివాళ్ల.”

లేదా “నింద.”

అక్ష., “దాన్ని.”

లేదా “మధ్య” అయ్యుంటుంది.

లేదా “నైలు నది కాలువల్ని.”

అక్ష., “చేశాను.”

లేదా “తయారు చేశాను.”

అంటే, హిజ్కియాకు.

లేదా “కిందపడిన ధాన్యపు గింజల నుండి వచ్చే పంటను.”

బహుశా నీడ గడియారంలోలా ఈ మెట్లను సమయాన్ని కొలవడానికి ఉపయోగించి ఉండవచ్చు.

లేదా “కూర్చిన.”

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

లేదా “అంతా ఆగిపోయే చోట.”

లేదా “కొంగలా” అయ్యుంటుంది.

అక్ష., “నాకు జామీనుగా ఉండు.”

లేదా “నిష్ఠగా.”

అంటే, దేవుని మాటలు, పనులు.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “నా పాపాలన్నిటినీ నీ కళ్లముందు నుండి తొలగించేశావు.”

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

అక్ష., “వాళ్ల విషయంలో సంతోషించి.”

అక్ష., “నా రోజుల్లో.”

అక్ష., “సత్యం.”

లేదా “రెండంతలు.”

అక్ష., “వ్యక్తి స్వరం.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “మందను కాస్తాడు.”

అరచేతిని చాచినప్పుడు బొటన వేలి కొన నుండి చిటికెన వేలి కొన వరకు ఉండే దూరం. అనుబంధం B14 చూడండి.

లేదా “మనసును.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “అర్థం చేసుకుంది” అయ్యుంటుంది.

లేదా “కావల్సినన్ని కట్టెలు సరఫరా చేయలేదు.”

లేదా “గుండ్రటి భూమికి.”

లేదా “గొల్లభామల్లా.”

లేదా “పరిపాలకుల్ని.”

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

లేదా “చలనశక్తి.”

లేదా “చలనశక్తి.”

లేదా “తూర్పు.”

అంటే, తనను సేవించడానికి.

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

ఇది, కంసాలివాళ్లు లోహపు వస్తువుల్ని కాల్చి సాగగొట్టే ఇనుప దిమ్మె.

అంటే, లోహాల్ని అతికించడం.

అక్ష., “విత్తనం.”

లేదా “దిగులుపడకు.”

అంటే, ఏమాత్రం సంరక్షణలేని, దీనమైన.

15 మీటర్ల ఎత్తు దాకా పెరిగే ఒక పెద్ద చెట్టు. దానికి లేతపచ్చ ఆకులు, బూడిద రంగు రెమ్మలు ఉంటాయి.

అక్ష., “మొదటి.”

లేదా “వాటి మీద మనసుపెట్టి.”

లేదా “తూర్పు.”

లేదా “ఉప పాలకుల్ని.”

లేదా “అసలు ఉనికిలోనే లేరు.”

లేదా “లోహపు.”

లేదా “ఆయన్ని ఆమోదించాను!”

అక్ష., “ధర్మశాస్త్రం.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “ఎవ్వరితోనూ పంచుకోను.”

లేదా “తీరప్రాంతాలుగా.”

లేదా “లోహపు.”

లేదా “ఉపదేశాన్ని.”

లేదా “ఉపదేశానికి.”

అక్ష., “విత్తనాన్ని.”

భవిష్యత్తులో జరగబోయే మొదటి సంగతుల్ని సూచిస్తుండవచ్చు.

లేదా “నమ్మకముంచి.”

లేదా “తిరుగుబాట్లను.”

ధర్మశాస్త్ర బోధకుల్ని సూచిస్తుండవచ్చు.

లేదా “పుట్టినప్పటి.”

“నిజాయితీపరుడు” అని అర్థం. ఇది ఇశ్రాయేలుకు ఉపయోగించిన గౌరవపూర్వక బిరుదు.

లేదా “దేశం.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “బండరాయి.”

అంటే, ఆ విగ్రహాలు.

లేదా “లోహపు.”

అంటే, పెద్దవంపు కత్తి.

లేదా “ఎండిన చెక్కముక్కకు.”

లేదా “అబద్ధ ప్రవక్తల.”

అక్ష., “రాజుల నడికట్లను విప్పడానికి.”

అక్ష., “నీ నడుమును బలంగా బిగిస్తాను.”

లేదా “సూర్యోదయం నుండి సూర్యాస్తమయం.”

లేదా “రూపొందించిన.”

లేదా “పోరాడే.”

లేదా “తనను రూపొందించినవానితో.”

లేదా “బంకమట్టి, ‘నువ్వు చేసిన వస్తువుకు చేతులు లేవు’ అని అనొచ్చా?” అయ్యుంటుంది.

లేదా “నువ్వు ఎందుకోసం పురిటినొప్పులు పడ్డావు?”

లేదా “కూలీలు” అయ్యుంటుంది.

లేదా “వర్తకులు” అయ్యుంటుంది.

లేదా “ఖాళీగా ఉండాలని” అయ్యుంటుంది.

లేదా “వ్యర్థంగా.”

అక్ష., “విత్తనంతో.”

అక్ష., “విత్తనమంతా.”

అంటే, జంతువుల మీద పెట్టబడిన విగ్రహాల్ని.

అక్ష., “దానికి వంగి నమస్కారం చేస్తారు.”

అక్ష., “మొదటి.”

లేదా “సంకల్పం; ఆలోచన.”

అక్ష., “సూర్యోదయం వైపు.”

లేదా “సంకల్పాన్ని; ఆలోచనను.”

లేదా “నాకు ఎదురొచ్చే ఎవరి మీదా దయ చూపించను” అయ్యుంటుంది.

లేదా “రాణి.”

లేదా “రాణిగానే.”

లేదా “అయినా” అయ్యుంటుంది.

లేదా “ఏ మంత్రంతో దాన్ని ఆపాలో నీకు తెలీదు.”

లేదా “ఆకాశాన్ని విభజించే మనుషులు; జ్యోతిష్యులు” అయ్యుంటుంది.

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.

లేదా “పాములోళ్లు.”

అక్ష., “తమ సొంత ప్రాంతానికి.”

లేదా “వంశం నుండి” అయ్యుంటుంది.

అక్ష., “మొదటి.”

లేదా “లోహపు.”

లేదా “పరిశీలించాను.” లేదా “ఎంచుకున్నాను” అయ్యుంటుంది.

లేదా “ఎవ్వరితోనూ పంచుకోను.”

అక్ష., “వాళ్లలో.”

లేదా “నీ మంచి కోసమే.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “గర్భంలో ఉన్నప్పుడే.”

లేదా “ప్రతిఫలాన్ని.”

లేదా “నేను అనుగ్రహం చూపించే సమయంలో.”

లేదా “చెట్లులేని కొండలన్నిట్లో” అయ్యుంటుంది.

లేదా “ధ్వజస్తంభాన్ని.”

లేదా “గుండెల.”

అక్ష., “ఒక మాటతో.”

లేదా “బలపర్చాలో” అయ్యుంటుంది.

లేదా “చక్కగా శిక్షణ పొందిన.”

అక్ష., “నాలుకను.”

లేదా “నాతో పోరాడగలరు?”

లేదా “ఆనుకోవాలి.”

లేదా “శక్తి.”

లేదా “చెదిరిపోదు.”

లేదా “ఉపదేశం.”

లేదా “ఆ పురుగు” అయ్యుంటుంది.

పదకోశం చూడండి.

లేదా “చుట్టుముట్టే.”

లేదా “కళ్లారా.”

లేదా “విజయాన్ని.”

లేదా “మౌనంగా ఉండిపోతారు.”

లేదా “మేము విన్న” అయ్యుంటుంది.

“అతను” అనే పదం, చూసే వ్యక్తిని గానీ దేవుణ్ణి గానీ సూచించవచ్చు.

లేదా “మనం ఇష్టపడేలా ఆయన రూపంలో ప్రత్యేకమైందేదీ లేదు.”

లేదా “ప్రజలు చూసి ముఖం పక్కకు తిప్పుకునే వ్యక్తిలా ఆయన ఉన్నాడు” అయ్యుంటుంది.

అక్ష., “అణచివేత వల్ల, తీర్పు వల్ల.”

లేదా “ఆయన జీవనశైలికి.”

లేదా “చనిపోయేలా కొట్టబడ్డాడు.”

లేదా “దౌర్జన్యం.”

లేదా “ఆయనకు సమాధి స్థలం కేటాయిస్తారు.”

అక్ష., “ఒక ధనవంతుడి.”

లేదా “బట్టి యెహోవా సంతోషించాడు.”

అక్ష., “విత్తనాన్ని.”

లేదా “సంతోషం.”

లేదా “యజమాని.”

అక్ష., “కుమారుల.”

లేదా “యజమాని.”

ఇది సున్నం, ఇసుక, నీళ్ల మిశ్రమం.

లేదా “అగ్ని రాళ్లతో.”

అక్ష., “కుమారులందరూ.”

అక్ష., “కుమారులకు.”

లేదా “స్వాస్థ్యం.”

లేదా “చాలా కష్టపడి సంపాదించిన డబ్బును.”

లేదా “నమ్మకమైనది; ఆధారపడదగినది.”

లేదా “ధారాళంగా.”

లేదా “నా ఇష్టాన్నంతా.”

లేదా “పేరును.”

పదకోశం చూడండి.

అంటే, చనిపోతున్నారు.

లేదా “నుండి” అయ్యుంటుంది.

అంటే, సమాధిలో.

లేదా “వాగుల్లో.”

లేదా “వాగుల్లోని.”

లేదా “నన్ను నేను ఊరడించుకోవాలా?”

అబద్ధ ఆరాధనలో పురుషాంగం ప్రతిమల్ని ఉపయోగించడాన్ని సూచిస్తుండవచ్చు.

లేదా “రాజు” అయ్యుంటుంది.

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

అక్ష., “అలసిపోవట్లేదు.”

లేదా “విషయాల్ని దాచిపెట్టాను.”

లేదా “నిత్య నివాసియైన.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “ఊరటనిచ్చి పరిహారం చెల్లిస్తాను.”

అక్ష., “కొమ్ము.”

లేదా “ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు.”

లేదా “నీ ఇష్టాల్ని నెరవేర్చుకోకుండా.”

లేదా “అనుభవించేలా.”

లేదా “నిజాయితీ.”

లేదా “నిజాయితీ.”

అక్ష., “అది ఆయన కళ్లకు చెడ్డదిగా ఉంది.”

లేదా “ఆయనకు విజయాన్ని.”

లేదా “విజయం.”

అంటే, హెల్మెట్‌.

లేదా “చేతుల్లేని నిలువుటంగీలా వేసుకున్నాడు.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “నీ ఉదయకాంతి.”

అక్ష., “నిన్ను.”

లేదా “సుందరమైన.”

ఇవి పక్షుల కోసం మనుషులు చేసిన గూళ్లు.

లేదా “మొదట్లో ఉన్నట్టే ఉన్నాయి.”

లేదా “అందంగా చేస్తాడు.”

లేదా “సౌందర్యం.”

లేదా “సౌందర్యం.”

అక్ష., “విత్తనం.”

లేదా “చేతుల్లేని నిలువుటంగీ.”

లేదా “ధ్వజస్తంభాన్ని.”

లేదా “ముదురు ఎరుపు” అయ్యుంటుంది.

లేదా “విజయాన్ని.”

లేదా “వ్యక్తిగత సందేశకుడు.”

లేదా “అగాధ.”

లేదా “సుందరమైన.”

లేదా “సుందరమైన.”

లేదా “తప్పిపోయేలా చేస్తున్నావు?”

అక్ష., “చేస్తున్నావు?”

లేదా “ఓపిగ్గా ఎదురుచూస్తూ.”

లేదా “రుతుస్రావపు గుడ్డలా.”

లేదా “రూపకర్తవు.”

లేదా “సుందరమైన.”

లేదా “కాపలా గుడిసెల్లో” అయ్యుంటుంది.

లేదా “అపవిత్రమైనవాటి.”

లేదా “ఎందుకంటే నా పవిత్రతను నీకు బదిలీ చేస్తాను” అయ్యుంటుంది.

అక్ష., “దీవెన.”

అక్ష., “విత్తనాన్ని.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “నమ్మకమైన.” అక్ష., “ఆమేన్‌.”

లేదా “నమ్మకమైన.” అక్ష., “ఆమేన్‌.”

అక్ష., “హృదయంలోకి కూడా రావు.”

లేదా “వందేళ్లు నిండకుండానే చనిపోయే వ్యక్తి శాపగ్రస్తుడిగా ఎంచబడతాడు” అయ్యుంటుంది.

లేదా “విగ్రహాన్ని స్తుతించేవాడిలా” అయ్యుంటుంది.

లేదా “శక్తి.”

అంటే, విగ్రహపూజ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన తోటలు.

అక్ష., “విత్తనం.”

లేదా “నన్ను ఆరాధించడానికి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి