కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • ఫిలిష్తీయుల ప్రాంతంలో మందసం (1-12)

        • దాగోనుకు అవమానం (1-5)

        • ఫిలిష్తీయులు బాధించబడడం (6-12)

1 సమూయేలు 5:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 4:11

1 సమూయేలు 5:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:23; 1ది 10:8-10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2003, పేజీ 25

1 సమూయేలు 5:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:12; 1ది 16:26; కీర్త 97:7
  • +యెష 46:6, 7

1 సమూయేలు 5:4

అధస్సూచీలు

  • *

    లేదా “చేపలా కనిపించే భాగం.”

1 సమూయేలు 5:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా చెయ్యి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 6:5, 6

1 సమూయేలు 5:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:4

1 సమూయేలు 5:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా చెయ్యి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 5:6

1 సమూయేలు 5:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 45; 2రా 1:2; ఆమో 1:8
  • +1స 5:7

1 సమూయేలు 5:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 5:6, 9

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 5:11స 4:11
1 సమూ. 5:2న్యా 16:23; 1ది 10:8-10
1 సమూ. 5:3నిర్గ 12:12; 1ది 16:26; కీర్త 97:7
1 సమూ. 5:3యెష 46:6, 7
1 సమూ. 5:61స 6:5, 6
1 సమూ. 5:81స 17:4
1 సమూ. 5:91స 5:6
1 సమూ. 5:10యెహో 15:20, 45; 2రా 1:2; ఆమో 1:8
1 సమూ. 5:101స 5:7
1 సమూ. 5:111స 5:6, 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 5:1-12

సమూయేలు మొదటి గ్రంథం

5 ఫిలిష్తీయులు సత్యదేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు,+ వాళ్లు దాన్ని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకొచ్చారు. 2 ఫిలిష్తీయులు సత్యదేవుని మందసాన్ని దాగోను గుడిలోకి తీసుకొచ్చి దాగోను విగ్రహం పక్కన పెట్టారు.+ 3 తర్వాతి రోజు ఉదయాన్నే అష్డోదీయులు లేచి చూసినప్పుడు, దాగోను విగ్రహం యెహోవా మందసం ఎదుట నేలమీద బోర్లా పడివుంది.+ దాంతో వాళ్లు ఆ విగ్రహాన్ని లేపి మళ్లీ దాని స్థానంలో పెట్టారు.+ 4 వాళ్లు ఆ తర్వాతి రోజు ఉదయాన్నే లేచి చూసినప్పుడు, దాగోను విగ్రహం మళ్లీ యెహోవా మందసం ఎదుట నేలమీద బోర్లా పడివుంది. ఆ విగ్రహం తల, రెండు అరచేతులు నరికేయబడి గుడి గడప దగ్గర పడివున్నాయి. దాని మొండెం* మాత్రమే మిగిలివుంది. 5 అందుకే ఈ రోజు వరకు దాగోను యాజకులు, అలాగే దాగోను గుడిలోకి వెళ్లే వాళ్లందరూ అష్డోదులోని దాగోను గుడి గడప మీద కాలుపెట్టరు.

6 యెహోవా* అష్డోదీయుల్ని శిక్షించాడు. ఆయన అష్డోదులో, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లను మొలలతో మొత్తి వాళ్లను తీవ్రంగా బాధించాడు.+ 7 జరుగుతున్న సంఘటనలు చూసి అష్డోదువాళ్లు, “ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మనతో ఉండనివ్వొద్దు; ఎందుకంటే ఆయన మనల్ని, మన దేవుడైన దాగోనును శిక్షించాడు” అన్నారు. 8 దాంతో వాళ్లు ఫిలిష్తీయుల పాలకులందర్నీ ఒక దగ్గరికి పిలిపించి, “ఇశ్రాయేలు దేవుని మందసం విషయంలో ఏమి చేద్దాం?” అని అడిగారు. దానికి వాళ్లు, “ఇశ్రాయేలు దేవుని మందసాన్ని గాతుకు+ పంపిద్దాం” అన్నారు. అప్పుడు వాళ్లు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని అక్కడికి తీసుకెళ్లారు.

9 వాళ్లు ఆ మందసాన్ని అక్కడికి తీసుకెళ్లాక, యెహోవా* ఆ నగరంలోని వాళ్లను శిక్షించి వాళ్లలో ఎంతో భయం పుట్టించాడు. ఆయన చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆ నగరంలోని వాళ్లందర్నీ మొత్తాడు, దాంతో వాళ్లకు మొలలు వచ్చాయి.+ 10 అప్పుడు వాళ్లు సత్యదేవుని మందసాన్ని ఎక్రోనుకు+ పంపించారు. కానీ సత్యదేవుని మందసం ఎక్రోనుకు రాగానే ఎక్రోనీయులు, “మనల్ని, మన ప్రజల్ని చంపడానికే వాళ్లు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు!”+ అని కేకలు వేయడం మొదలుపెట్టారు. 11 అప్పుడు వాళ్లు ఫిలిష్తీయుల పాలకులందర్నీ ఒక దగ్గరికి పిలిపించి, “ఇశ్రాయేలు దేవుని మందసాన్ని పంపించేయండి. మనం, మన ప్రజలు చంపబడకుండా ఆ మందసాన్ని దాని స్థలానికి పంపించండి” అని చెప్పారు. ఎందుకంటే మరణభయం ఆ నగరమంతా వ్యాపించింది; అక్కడ సత్యదేవుడు వాళ్లను శిక్షిస్తూ ఉన్నాడు,+ 12 చనిపోకుండా మిగిలినవాళ్లు మొలలతో బాధించబడ్డారు. ఆ నగర ప్రజలు సహాయం కోసం పెట్టిన కేకలు ఆకాశాన్నంటాయి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి