కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • సౌలు, అతని ముగ్గురు కుమారులు చనిపోవడం (1-13)

1 సమూయేలు 31:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:52; 29:1
  • +1స 28:4; 2స 1:21; 1ది 10:1-5

1 సమూయేలు 31:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 13:2
  • +1ది 8:33

1 సమూయేలు 31:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 1:4, 6

1 సమూయేలు 31:4

అధస్సూచీలు

  • *

    లేదా “అవమానకరంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:26; 2స 1:20
  • +1ది 10:4

1 సమూయేలు 31:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 26:10; 1ది 10:13

1 సమూయేలు 31:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:19; 1ది 10:6, 7

1 సమూయేలు 31:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 13:6

1 సమూయేలు 31:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:4; 31:1; 2స 1:6; 1ది 10:8-12

1 సమూయేలు 31:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:23
  • +2స 1:20

1 సమూయేలు 31:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:11; న్యా 1:27

1 సమూయేలు 31:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 11:1, 9-11

1 సమూయేలు 31:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 21:12
  • +2స 2:4, 5

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 31:11స 14:52; 29:1
1 సమూ. 31:11స 28:4; 2స 1:21; 1ది 10:1-5
1 సమూ. 31:21స 13:2
1 సమూ. 31:21ది 8:33
1 సమూ. 31:32స 1:4, 6
1 సమూ. 31:41స 17:26; 2స 1:20
1 సమూ. 31:41ది 10:4
1 సమూ. 31:51స 26:10; 1ది 10:13
1 సమూ. 31:61స 28:19; 1ది 10:6, 7
1 సమూ. 31:71స 13:6
1 సమూ. 31:81స 28:4; 31:1; 2స 1:6; 1ది 10:8-12
1 సమూ. 31:9న్యా 16:23
1 సమూ. 31:92స 1:20
1 సమూ. 31:10యెహో 17:11; న్యా 1:27
1 సమూ. 31:111స 11:1, 9-11
1 సమూ. 31:132స 21:12
1 సమూ. 31:132స 2:4, 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 31:1-13

సమూయేలు మొదటి గ్రంథం

31 ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నారు.+ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు, వాళ్లలో చాలామంది గిల్బోవ పర్వతం+ మీద చంపబడ్డారు. 2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారుల్ని తరుముతూ వాళ్ల దగ్గరికి వచ్చి, సౌలు కుమారులైన యోనాతానును,+ అబీనాదాబును, మెల్కీషూవను+ చంపారు. 3 ఫిలిష్తీయులు సౌలుతో తీవ్రంగా పోరాడుతున్నారు; బాణాలు వేసేవాళ్లు అతన్ని చూసి అతన్ని తీవ్రంగా గాయపర్చారు.+ 4 అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసే వ్యక్తితో, “నువ్వు నీ కత్తి దూసి నన్ను పొడువు, లేకపోతే సున్నతిలేని ఈ మనుషులు+ నాతో క్రూరంగా* వ్యవహరించి నన్ను చంపుతారు” అన్నాడు. కానీ అతను చాలా భయపడిపోయి అలా చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో సౌలు తన కత్తిని తీసుకుని దాని మీద పడ్డాడు.+ 5 సౌలు చనిపోయాడని+ అతని ఆయుధాలు మోసేవాడు చూసినప్పుడు, అతను కూడా తన కత్తి మీద పడి, సౌలుతోపాటు చనిపోయాడు. 6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని ఆయుధాలు మోసేవాడు, అతని మనుషులందరూ ఆ రోజే చనిపోయారు.+ 7 ఇశ్రాయేలు సైన్యం పారిపోవడం, సౌలు, అతని కుమారులు చనిపోవడం లోయ ప్రాంతంలోని, యొర్దాను ప్రాంతంలోని ఇశ్రాయేలీయులు చూసినప్పుడు వాళ్లు నగరాల్ని విడిచిపెట్టి పారిపోయారు;+ అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.

8 తర్వాతి రోజు, చనిపోయినవాళ్ల వస్తువుల్ని దోచుకోవడానికి ఫిలిష్తీయులు వచ్చారు; సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం+ మీద పడివుండడం వాళ్లు చూశారు. 9 దాంతో వాళ్లు అతని తల నరికి, అతని యుద్ధ కవచం తొలగించి ఆ వార్తను తమ విగ్రహాల+ గుళ్లలో, ప్రజల మధ్య చాటించమని+ ఫిలిష్తీయుల దేశమంతటికీ కబురు పంపించారు. 10 తర్వాత వాళ్లు అతని కవచాన్ని అష్తారోతు విగ్రహాలు ఉన్న గుడిలో పెట్టి అతని శవాన్ని బేత్షాను+ నగర ప్రాకారానికి వేలాడదీశారు. 11 ఫిలిష్తీయులు సౌలుకు చేసింది యాబేష్గిలాదు నివాసులు+ విన్నప్పుడు, 12 యోధులందరూ లేచి రాత్రంతా ప్రయాణించి బేత్షాను ప్రాకారానికి తగిలించివున్న సౌలు శవాన్ని, అతని కుమారుల శవాల్ని దించారు. వాళ్లు యాబేషుకు తిరిగొచ్చి అక్కడ వాటిని దహించారు. 13 తర్వాత వాళ్ల ఎముకల్ని+ తీసుకొని యాబేషులో+ పిచుల వృక్షం కింద పాతిపెట్టారు. వాళ్లు ఏడురోజులు ఉపవాసం ఉన్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి