కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 29
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • ఫిలిష్తీయులు దావీదును నమ్మకపోవడం (1-11)

1 సమూయేలు 29:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:1
  • +యెహో 19:17, 18; 1స 29:11

1 సమూయేలు 29:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 28:2

1 సమూయేలు 29:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 27:7, 12

1 సమూయేలు 29:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 12:19
  • +1స 14:21

1 సమూయేలు 29:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:7; 21:11

1 సమూయేలు 29:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 21:10; 27:2
  • +1స 28:2
  • +1స 27:11, 12
  • +1స 29:3, 9

1 సమూయేలు 29:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 27:12

1 సమూయేలు 29:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:17, 18; 1స 29:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 29:11స 28:1
1 సమూ. 29:1యెహో 19:17, 18; 1స 29:11
1 సమూ. 29:21స 28:2
1 సమూ. 29:31స 27:7, 12
1 సమూ. 29:41ది 12:19
1 సమూ. 29:41స 14:21
1 సమూ. 29:51స 18:7; 21:11
1 సమూ. 29:61స 21:10; 27:2
1 సమూ. 29:61స 28:2
1 సమూ. 29:61స 27:11, 12
1 సమూ. 29:61స 29:3, 9
1 సమూ. 29:91స 27:12
1 సమూ. 29:11యెహో 19:17, 18; 1స 29:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 29:1-11

సమూయేలు మొదటి గ్రంథం

29 ఫిలిష్తీయులు+ తమ సైన్యాలన్నిటినీ ఆఫెకు దగ్గర సమకూర్చారు, ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని+ ఊట దగ్గర మకాం వేశారు. 2 ఫిలిష్తీయుల పాలకులు తమ వందల, వేల సైనికుల గుంపులతో ముందుకు సాగుతున్నారు. వాళ్ల వెనక దావీదు, అతని మనుషులు ఆకీషుతోపాటు ముందుకు సాగుతున్నారు.+ 3 కానీ ఫిలిష్తీయుల పాలకులు, “ఈ హెబ్రీయులు ఇక్కడ ఎందుకు ఉన్నారు?” అని అడిగారు. దానికి ఆకీషు వాళ్లతో, “ఇతను దావీదు, ఇశ్రాయేలు రాజైన సౌలు సేవకుడు, ఇతను సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం నుండే నా దగ్గర ఉంటున్నాడు.+ ఇతను తన రాజు దగ్గర నుండి పారిపోయి నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నాకు ఇతనిలో ఏ తప్పూ కనబడలేదు” అన్నాడు. 4 కానీ ఫిలిష్తీయుల పాలకులు ఆకీషు మీద కోప్పడి అతనితో ఇలా అన్నారు: “ఆ మనిషిని వెనక్కి పంపించేయి.+ నువ్వు అతనికి ఇచ్చిన స్థలానికి అతన్ని వెళ్లనివ్వు. అతన్ని మనతో కలిసి యుద్ధానికి రానివ్వొద్దు; లేకపోతే యుద్ధం జరుగుతున్నప్పుడు అతను మనమీద దాడిచేస్తాడు.+ మన మనుషుల తలల్ని తన ప్రభువు దగ్గరికి తీసుకెళ్లి అతని అనుగ్రహం పొందడానికి ఇంతకన్నా మంచి మార్గం ఏముంటుంది?

5 ‘సౌలు వెయ్యిమంది శత్రువుల్ని చంపాడు,

దావీదు పదివేలమంది శత్రువుల్ని చంపాడు’

అని వాళ్లు నాట్యం చేస్తూ పాడింది ఈ దావీదు గురించి కాదా?”+

6 దాంతో ఆకీషు+ దావీదును పిలిపించి ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, నువ్వు నిజాయితీపరుడివి, నువ్వు నా సైన్యంతో కలిసి యుద్ధానికి రావడం నాకు ఇష్టం.+ ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నీలో నాకు ఏ తప్పూ కనిపించలేదు.+ కానీ మిగతా పాలకులకు నీ మీద నమ్మకం లేదు.+ 7 కాబట్టి క్షేమంగా వెనక్కి వెళ్లు, ఫిలిష్తీయుల పాలకులకు ఇష్టంలేని ఏ పనీ చేయకు.” 8 అయితే దావీదు ఆకీషుతో, “ఎందుకు? నేనేమి చేశాను? నీ సేవకుడినైన నేను నీ దగ్గరికి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు నాలో నీకు ఏ తప్పు కనిపించింది? నా ప్రభువైన రాజు శత్రువులతో పోరాడడానికి నేను నీతోపాటు ఎందుకు రాకూడదు?” అని అన్నాడు. 9 అప్పుడు ఆకీషు దావీదుతో ఇలా అన్నాడు: “నా దృష్టిలో నువ్వు దేవుని దూత అంత మంచివాడివి.+ కానీ ఫిలిష్తీయుల పాలకులు, ‘అతన్ని మనతో కలిసి యుద్ధానికి రానివ్వొద్దు’ అన్నారు. 10 కాబట్టి నువ్వు, నీతో వచ్చిన మనుషులు ఉదయాన్నే లేవండి. పెందలాడే లేచి, వెలుతురు రాగానే బయల్దేరి వెళ్లండి.”

11 దాంతో దావీదు, అతని మనుషులు ఫిలిష్తీయుల దేశానికి తిరిగెళ్లిపోవడానికి ఉదయాన్నే లేచారు. తర్వాత ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు+ వెళ్లారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి