కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

న్యాయాధిపతులు విషయసూచిక

      • యూదా, షిమ్యోను గోత్రాలు ​జయించడం (1-20)

      • యెబూసీయులు యెరూషలేములోనే ​ఉండిపోవడం (21)

      • యోసేపు వంశస్థులు బేతేలును స్వాధీనం ​చేసుకోవడం (22-26)

      • కనానీయుల్ని పూర్తిగా వెళ్లగొట్టలేదు (27-36)

న్యాయాధిపతులు 1:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:29
  • +సం 27:18, 21; న్యా 20:18

న్యాయాధిపతులు 1:2

అధస్సూచీలు

  • *

    లేదా “అప్పగించాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:8; ద్వితీ 33:7; 1ది 5:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2005, పేజీ 24

న్యాయాధిపతులు 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:1; 19:1, 9

న్యాయాధిపతులు 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:6
  • +ఆది 15:18-21; నిర్గ 3:8; 1రా 9:20, 21

న్యాయాధిపతులు 1:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2005, పేజీ 24

న్యాయాధిపతులు 1:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:63; న్యా 1:21

న్యాయాధిపతులు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:16; 15:20, 33

న్యాయాధిపతులు 1:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:21; 15:13, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీ 7

న్యాయాధిపతులు 1:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:15

న్యాయాధిపతులు 1:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:3, 6; ద్వితీ 1:35, 36; యెహో 14:13
  • +యెహో 15:16-19

న్యాయాధిపతులు 1:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 4:13
  • +న్యా 3:9

న్యాయాధిపతులు 1:14

అధస్సూచీలు

  • *

    లేదా “ఆమె గాడిద మీద ఉండి చప్పట్లు కొట్టినప్పుడు” అయ్యుంటుంది.

న్యాయాధిపతులు 1:15

అధస్సూచీలు

  • *

    లేదా “నెగెబులో.”

  • *

    “నీటి మడుగులు” అని అర్థం.

న్యాయాధిపతులు 1:16

అధస్సూచీలు

  • *

    అంటే, యెరికో.

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:1; 4:18; 18:1; సం 10:29
  • +సం 24:21; న్యా 4:11
  • +ద్వితీ 34:3; న్యా 3:13
  • +సం 21:1
  • +సం 10:29-32

న్యాయాధిపతులు 1:17

అధస్సూచీలు

  • *

    “నాశనం కోసం ప్రతిష్ఠించడం” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:29; ద్వితీ 20:16
  • +యెహో 19:1, 4

న్యాయాధిపతులు 1:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:19; యెహో 11:22
  • +న్యా 14:19
  • +యెహో 13:1-3

న్యాయాధిపతులు 1:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇనుప రథాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 20:1

న్యాయాధిపతులు 1:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:24; యెహో 14:9
  • +సం 13:22

న్యాయాధిపతులు 1:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:63; 2స 5:6

న్యాయాధిపతులు 1:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 14:4
  • +ఆది 49:22, 24; యెహో 16:1; కీర్త 44:3

న్యాయాధిపతులు 1:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 35:6

న్యాయాధిపతులు 1:24

అధస్సూచీలు

  • *

    అక్ష., “విశ్వసనీయ ప్రేమ.”

న్యాయాధిపతులు 1:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:25; 1స 15:6

న్యాయాధిపతులు 1:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:8, 25; న్యా 5:19
  • +యెహో 17:11, 12

న్యాయాధిపతులు 1:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:25; 1రా 9:20, 21
  • +సం 33:55; ద్వితీ 7:2; 20:16

న్యాయాధిపతులు 1:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:10; 1రా 9:16

న్యాయాధిపతులు 1:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 20:17

న్యాయాధిపతులు 1:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:8
  • +యెహో 19:30, 31
  • +యెహో 21:8, 31

న్యాయాధిపతులు 1:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:2

న్యాయాధిపతులు 1:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:47; న్యా 18:1

న్యాయాధిపతులు 1:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:12
  • +యెహో 19:42, 48

న్యాయాధిపతులు 1:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:2, 4; యెహో 15:3, 12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

న్యాయా. 1:1యెహో 24:29
న్యాయా. 1:1సం 27:18, 21; న్యా 20:18
న్యాయా. 1:2ఆది 49:8; ద్వితీ 33:7; 1ది 5:2
న్యాయా. 1:3యెహో 15:1; 19:1, 9
న్యాయా. 1:5ఆది 10:6
న్యాయా. 1:5ఆది 15:18-21; నిర్గ 3:8; 1రా 9:20, 21
న్యాయా. 1:8యెహో 15:63; న్యా 1:21
న్యాయా. 1:9యెహో 11:16; 15:20, 33
న్యాయా. 1:10యెహో 11:21; 15:13, 14
న్యాయా. 1:11యెహో 15:15
న్యాయా. 1:12సం 13:3, 6; ద్వితీ 1:35, 36; యెహో 14:13
న్యాయా. 1:12యెహో 15:16-19
న్యాయా. 1:131ది 4:13
న్యాయా. 1:13న్యా 3:9
న్యాయా. 1:16నిర్గ 3:1; 4:18; 18:1; సం 10:29
న్యాయా. 1:16సం 24:21; న్యా 4:11
న్యాయా. 1:16ద్వితీ 34:3; న్యా 3:13
న్యాయా. 1:16సం 21:1
న్యాయా. 1:16సం 10:29-32
న్యాయా. 1:17లేవీ 27:29; ద్వితీ 20:16
న్యాయా. 1:17యెహో 19:1, 4
న్యాయా. 1:18ఆది 10:19; యెహో 11:22
న్యాయా. 1:18న్యా 14:19
న్యాయా. 1:18యెహో 13:1-3
న్యాయా. 1:19ద్వితీ 20:1
న్యాయా. 1:20సం 14:24; యెహో 14:9
న్యాయా. 1:20సం 13:22
న్యాయా. 1:21యెహో 15:63; 2స 5:6
న్యాయా. 1:22యెహో 14:4
న్యాయా. 1:22ఆది 49:22, 24; యెహో 16:1; కీర్త 44:3
న్యాయా. 1:23ఆది 35:6
న్యాయా. 1:25యెహో 6:25; 1స 15:6
న్యాయా. 1:27యెహో 21:8, 25; న్యా 5:19
న్యాయా. 1:27యెహో 17:11, 12
న్యాయా. 1:28ఆది 9:25; 1రా 9:20, 21
న్యాయా. 1:28సం 33:55; ద్వితీ 7:2; 20:16
న్యాయా. 1:29యెహో 16:10; 1రా 9:16
న్యాయా. 1:30ద్వితీ 20:17
న్యాయా. 1:31యెహో 11:8
న్యాయా. 1:31యెహో 19:30, 31
న్యాయా. 1:31యెహో 21:8, 31
న్యాయా. 1:33ద్వితీ 7:2
న్యాయా. 1:34యెహో 19:47; న్యా 18:1
న్యాయా. 1:35యెహో 10:12
న్యాయా. 1:35యెహో 19:42, 48
న్యాయా. 1:36సం 34:2, 4; యెహో 15:3, 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
న్యాయాధిపతులు 1:1-36

న్యాయాధిపతులు

1 యెహోషువ చనిపోయిన తర్వాత+ ఇశ్రాయేలీయులు* యెహోవాను, “కనానీయుల మీద యుద్ధం చేయడానికి ముందుగా మాలో ఎవరు వెళ్తారు?” అని అడిగారు.+ 2 దానికి యెహోవా, “యూదా గోత్రంవాళ్లు వెళ్తారు.+ ఇదిగో! నేను ఈ దేశాన్ని వాళ్ల చేతికి అప్పగిస్తున్నాను”* అని చెప్పాడు. 3 అప్పుడు యూదా గోత్రంవాళ్లు తమ సహోదరులైన షిమ్యోను గోత్రంవాళ్లతో, “కనానీయుల మీద యుద్ధం చేయడానికి మాతోపాటు మాకు ఇచ్చిన ప్రాంతంలోకి+ రండి. తర్వాత, మేము మీతోపాటు మీకు ఇచ్చిన ప్రాంతంలోకి వస్తాం” అన్నారు. దాంతో షిమ్యోనీయులు యూదావాళ్లతో కలిసి వెళ్లారు.

4 యూదా గోత్రంవాళ్లు యుద్ధానికి వెళ్లినప్పుడు యెహోవా కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని వాళ్ల చేతికి అప్పగించాడు; వాళ్లు బెజెకులో 10,000 మందిని ఓడించారు. 5 వాళ్లు బెజెకులో అదోనీబెజెకును కనుగొని అక్కడ అతనితో యుద్ధం చేశారు; వాళ్లు కనానీయుల్ని,+ పెరిజ్జీయుల్ని+ ఓడించారు. 6 అదోనీబెజెకు పారిపోయినప్పుడు వాళ్లు అతన్ని తరిమి పట్టుకుని అతని చేతుల, కాళ్ల బొటనవేళ్లు కోసేశారు. 7 అప్పుడు అదోనీబెజెకు ఇలా అన్నాడు: “తమ చేతుల, కాళ్ల బొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా బల్ల కింద భోజనం ఏరుకుంటున్నారు. నేను చేసినట్టే దేవుడు నాకు చేశాడు.” తర్వాత వాళ్లు అతన్ని యెరూషలేముకు తీసుకొచ్చారు, అతను అక్కడే చనిపోయాడు.

8 తర్వాత, యూదావాళ్లు యెరూషలేము మీద యుద్ధం చేసి+ దాన్ని స్వాధీనం చేసుకున్నారు; వాళ్లు అందులోని ప్రజల్ని కత్తితో చంపి ఆ నగరాన్ని తగలబెట్టారు. 9 దాని తర్వాత, యూదావాళ్లు పర్వత ప్రాంతంలో, నెగెబులో, షెఫేలాలో+ నివసిస్తున్న కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. 10 వాళ్లు హెబ్రోనులో (హెబ్రోనుకు అంతకుముందు కిర్యతర్బా అనే పేరు ఉండేది) నివసిస్తున్న కనానీయుల మీదికి వెళ్లారు; వాళ్లు షేషయిని, అహీమానును, తల్మయిని నాశనం చేశారు.+

11 వాళ్లు అక్కడి నుండి దెబీరు (దెబీరుకు అంతకుముందు కిర్యత్సేఫెరు అనే పేరు ఉండేది) నివాసుల మీదికి వెళ్లారు.+ 12 అప్పుడు కాలేబు,+ “కిర్యత్సేఫెరు మీద దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకునే వ్యక్తికి నా కూతురు అక్సాను ఇచ్చి పెళ్లిచేస్తాను”+ అని అన్నాడు. 13 అప్పుడు కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు+ ఒత్నీయేలు+ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి కాలేబు అతనికి తన కూతురు అక్సాను ఇచ్చి పెళ్లిచేశాడు. 14 ఆమె తన భర్త ఇంటికి వెళ్లేటప్పుడు, తన తండ్రిని ఒక పొలం అడగమని భర్తను తొందరపెట్టింది. ఆమె గాడిద మీద నుండి దిగినప్పుడు* కాలేబు, “నీకు ఏమి కావాలి?” అని ఆమెను అడిగాడు. 15 ఆమె అతనితో, “దయచేసి నాకు ఒక దీవెన ఇవ్వు. నువ్వు దక్షిణాన* నాకు ఒక భూమి ఇచ్చావు; గుల్లోతు-మయిము* కూడా ఇవ్వు” అని అంది. అప్పుడు కాలేబు ఆమెకు ఎగువ గుల్లోతును, దిగువ గుల్లోతును ఇచ్చాడు.

16 కేనీయుడైన మోషే మామ+ వంశస్థులు+ యూదావాళ్లతో కలిసి ఖర్జూర చెట్ల నగరం*+ నుండి అరాదుకు+ దక్షిణాన ఉన్న యూదా ఎడారికి* వచ్చారు. వాళ్లు అక్కడికి వచ్చి స్థానిక ప్రజల మధ్య స్థిరపడ్డారు.+ 17 అయితే యూదా గోత్రంవాళ్లు తమ సహోదరులైన షిమ్యోను గోత్రంవాళ్లతో కలిసి, జెఫతు నగరంలో నివసిస్తున్న కనానీయుల మీద దాడిచేసి ఆ నగరాన్ని నాశనం చేశారు.+ కాబట్టి వాళ్లు దానికి హోర్మా*+ అనే పేరు పెట్టారు. 18 తర్వాత యూదావాళ్లు గాజాను,+ దాని ప్రాంతాన్ని, అష్కెలోనును,+ దాని ప్రాంతాన్ని, ఎక్రోనును,+ దాని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 19 యెహోవా యూదావాళ్లకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్లు పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు; కానీ మైదానంలో నివసిస్తున్న ప్రజల్ని వెళ్లగొట్టలేకపోయారు, ఎందుకంటే ఆ ప్రజల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల యుద్ధ రథాలు* ఉన్నాయి.+ 20 మోషే వాగ్దానం చేసినట్టు వాళ్లు హెబ్రోనును కాలేబుకు ఇచ్చారు;+ అతను అనాకు ముగ్గురు కుమారుల్ని+ అక్కడి నుండి వెళ్లగొట్టాడు.

21 అయితే బెన్యామీనీయులు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయుల్ని వెళ్లగొట్టలేదు, కాబట్టి యెబూసీయులు ఈ రోజు వరకు బెన్యామీనీయులతో కలిసి యెరూషలేములోనే నివసిస్తున్నారు.+

22 ఈలోగా యోసేపు వంశస్థులు+ బేతేలు మీదికి వెళ్లారు, యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.+ 23 ఆ సమయంలో యోసేపు వంశస్థులు బేతేలును (ఈ నగరానికి అంతకుముందు లూజు అనే పేరు ఉండేది)+ వేగు చూస్తున్నారు, 24 ఒకతను నగరం నుండి బయటికి వెళ్లడం ఆ వేగులవాళ్లు చూశారు. వాళ్లు అతనితో, “దయచేసి ఈ నగరంలోకి వెళ్లే దారి మాకు చూపించు, మేము నీ మీద దయ* చూపిస్తాం” అన్నారు. 25 అతను వాళ్లకు నగరంలోకి వెళ్లే దారి చూపించాడు. అప్పుడు వాళ్లు ఆ నగరంలోని ప్రజల్ని కత్తితో చంపారు; కానీ అతన్ని, అతని కుటుంబాన్నంతటినీ వెళ్లిపోనిచ్చారు.+ 26 అతను హిత్తీయుల ప్రాంతానికి వెళ్లి ఒక నగరాన్ని కట్టి దానికి లూజు అని పేరు పెట్టాడు, ఈ రోజు వరకు దానికి అదే పేరు ఉంది.

27 మనష్షే గోత్రంవాళ్లు బేత్షెయానును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; తానాకును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని; దోరును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; ఇబ్లెయామును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; మెగిద్దోను, దాని చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకోలేదు.+ కనానీయులు మొండిగా అక్కడే ఉండిపోయారు. 28 ఇశ్రాయేలీయుల బలం పెరిగినప్పుడు వాళ్లు కనానీయుల చేత వెట్టిచాకిరి చేయించుకున్నారు,+ కానీ వాళ్లను పూర్తిగా వెళ్లగొట్టలేదు.+

29 అలాగే ఎఫ్రాయిమీయులు కూడా గెజెరులో నివసిస్తున్న కనానీయుల్ని వెళ్లగొట్టలేదు. కనానీయులు గెజెరులో వాళ్ల మధ్యే నివసిస్తూ వచ్చారు.+

30 జెబూలూను గోత్రంవాళ్లు కిత్రోనులో నివసిస్తున్నవాళ్లను, అలాగే నహలోలులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు. కనానీయులు వాళ్ల మధ్యే నివసిస్తూ వచ్చారు; జెబూలూను గోత్రంవాళ్లు వాళ్లచేత వెట్టిచాకిరి చేయించుకున్నారు.+

31 ఆషేరు గోత్రంవాళ్లు అక్కోలో నివసిస్తున్నవాళ్లను, అలాగే సీదోనులో,+ అహ్లాబులో, అక్జీబులో, హెల్బాలో, అఫెకులో,+ రెహోబులో+ నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు. 32 కాబట్టి ఆషేరీయులు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు, ఎందుకంటే ఆషేరీయులు వాళ్లను వెళ్లగొట్టలేదు.

33 నఫ్తాలి గోత్రంవాళ్లు బేత్షెమెషులో నివసిస్తున్నవాళ్లను, అలాగే బేతనాతులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు; అయితే వాళ్లు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు.+ బేత్షెమెషు, బేతనాతు ప్రజలు వాళ్లకు వెట్టిచాకిరి చేసేవాళ్లయ్యారు.

34 దాను గోత్రంవాళ్లను అమోరీయులు పర్వత ప్రాంతానికే పరిమితం చేశారు, ఎందుకంటే అమోరీయులు వాళ్లను దిగువనున్న మైదానంలోకి రానివ్వలేదు.+ 35 అమోరీయులు హెరెసు కొండ, అయ్యాలోను,+ షయల్బీము+ ప్రాంతాల్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయారు. అయితే యోసేపు వంశస్థుల బలం పెరిగినప్పుడు వాళ్లు అమోరీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు. 36 అక్రబ్బీము పర్వత మార్గం+ నుండి, సెల నుండి పైకి ఉన్నది అమోరీయుల ప్రాంతం.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి