కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • తెలివైన గిబియోనీయులు శాంతి కోసం చేసిన ప్రయత్నం (1-15)

      • గిబియోనీయుల మోసం బయటపడడం (16-21)

      • గిబియోనీయుల్ని కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా నియమించడం (22-27)

యెహోషువ 9:1

అధస్సూచీలు

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 12:7, 8
  • +సం 34:2, 6
  • +ఆది 15:18-21; నిర్గ 23:23; ద్వితీ 7:1

యెహోషువ 9:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:20
  • +యెహో 8:24
  • +యెహో 10:2

యెహోషువ 9:4

అధస్సూచీలు

  • *

    లేదా “యుక్తిగా.”

యెహోషువ 9:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 5:10

యెహోషువ 9:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:15, 17; 34:2
  • +ద్వితీ 7:2; 20:16-18

యెహోషువ 9:8

అధస్సూచీలు

  • *

    లేదా “దాసులం.”

యెహోషువ 9:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 20:10, 15
  • +నిర్గ 9:16; 15:13, 14; యెహో 2:9, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీలు 4-5

    కావలికోట,

    10/15/2004, పేజీ 18

యెహోషువ 9:10

అధస్సూచీలు

  • *

    అంటే, తూర్పు వైపున.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:21-24
  • +సం 21:33-35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీలు 4-5

యెహోషువ 9:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 20:10, 11
  • +యెహో 9:6

యెహోషువ 9:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:5

యెహోషువ 9:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:4

యెహోషువ 9:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 27:18, 21; 1స 30:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2011, పేజీ 8

యెహోషువ 9:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:19
  • +2స 21:2

యెహోషువ 9:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:2
  • +యెహో 18:11, 14; 1స 7:1; 1ది 13:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీలు 4-5

యెహోషువ 9:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 30:2; ద్వితీ 6:13

యెహోషువ 9:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 21:1; కీర్త 15:4; ప్రస 5:4, 6

యెహోషువ 9:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:6, 16

యెహోషువ 9:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:25, 26

యెహోషువ 9:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:1; 20:16
  • +ద్వితీ 2:25; 11:25; యెహో 5:1
  • +హెబ్రీ 11:31

యెహోషువ 9:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:29; 2ది 6:6
  • +యెహో 9:21
  • +1ది 9:2; ఎజ్రా 7:24; 8:17; నెహె 3:26; 7:60

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 9:1యెహో 12:7, 8
యెహో. 9:1సం 34:2, 6
యెహో. 9:1ఆది 15:18-21; నిర్గ 23:23; ద్వితీ 7:1
యెహో. 9:3యెహో 6:20
యెహో. 9:3యెహో 8:24
యెహో. 9:3యెహో 10:2
యెహో. 9:6యెహో 5:10
యెహో. 9:7ఆది 10:15, 17; 34:2
యెహో. 9:7ద్వితీ 7:2; 20:16-18
యెహో. 9:9ద్వితీ 20:10, 15
యెహో. 9:9నిర్గ 9:16; 15:13, 14; యెహో 2:9, 10
యెహో. 9:10సం 21:21-24
యెహో. 9:10సం 21:33-35
యెహో. 9:11ద్వితీ 20:10, 11
యెహో. 9:11యెహో 9:6
యెహో. 9:12యెహో 9:5
యెహో. 9:13యెహో 9:4
యెహో. 9:14సం 27:18, 21; 1స 30:7, 8
యెహో. 9:15యెహో 11:19
యెహో. 9:152స 21:2
యెహో. 9:17యెహో 10:2
యెహో. 9:17యెహో 18:11, 14; 1స 7:1; 1ది 13:5
యెహో. 9:18సం 30:2; ద్వితీ 6:13
యెహో. 9:202స 21:1; కీర్త 15:4; ప్రస 5:4, 6
యెహో. 9:22యెహో 9:6, 16
యెహో. 9:23ఆది 9:25, 26
యెహో. 9:24ద్వితీ 7:1; 20:16
యెహో. 9:24ద్వితీ 2:25; 11:25; యెహో 5:1
యెహో. 9:24హెబ్రీ 11:31
యెహో. 9:271రా 8:29; 2ది 6:6
యెహో. 9:27యెహో 9:21
యెహో. 9:271ది 9:2; ఎజ్రా 7:24; 8:17; నెహె 3:26; 7:60
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 9:1-27

యెహోషువ

9 యొర్దానుకు పడమటి+ వైపున్న పర్వత ప్రాంతంలో, షెఫేలాలో, మహా సముద్ర* తీరమంతటా+ అలాగే లెబానోనుకు ఎదురుగా ఉన్న ప్రాంతంలోని రాజులందరూ అంటే హిత్తీయుల, అమోరీయుల, కనానీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల రాజులు+ ఆ వార్త విన్నప్పుడు 2 వాళ్లు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఒక్కటయ్యారు.

3 యెహోషువ యెరికోకు,+ హాయికి చేసినదాన్ని+ గిబియోనీయులు+ కూడా విన్నారు. 4 కాబట్టి వాళ్లు తెలివిగా* ప్రవర్తించారు; వాళ్లు పాత సంచుల్లో ఆహారాన్ని, అలాగే చిరిగిపోయి బాగుచేయబడిన పాత ద్రాక్షతిత్తుల్ని తమ గాడిదలమీద వేసుకున్నారు; 5 అంతేకాదు వాళ్లు అతుకువేసిన పాత చెప్పులు తొడుక్కొని, పాత బట్టలు వేసుకున్నారు. ఎండిపోయి, ముక్కలుముక్కలైన రొట్టెలు వాళ్ల దగ్గర ఉన్నాయి. 6 వాళ్లు గిల్గాలులోని పాలెంలో+ ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి అతనితో, ఇశ్రాయేలీయులతో, “మేము దూరదేశం నుండి వచ్చాం. దయచేసి ఇప్పుడు మాతో ఒక ఒప్పందం చేయండి” అని అన్నారు. 7 అయితే ఇశ్రాయేలీయులు ఆ హివ్వీయులతో,+ “మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మేము మీతో ఎలా ఒప్పందం చేసుకోగలం?”+ అన్నారు. 8 అప్పుడు వాళ్లు యెహోషువతో, “మేము నీ సేవకులం”* అన్నారు.

యెహోషువ వాళ్లను, “మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. 9 దానికి వాళ్లు అతనితో ఇలా అన్నారు: “నీ సేవకులమైన మేము నీ దేవుడైన యెహోవా పేరుమీద ఉన్న గౌరవంతో ఎంతో దూరదేశం+ నుండి వచ్చాం. ఎందుకంటే మేము ఆయన కీర్తి గురించి, ఐగుప్తులో ఆయన చేసిన వాటన్నిటి గురించి విన్నాం;+ 10 యొర్దాను అవతల* ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అంటే హెష్బోను రాజైన సీహోనుకు,+ అష్తారోతులో ఉండే బాషాను రాజైన ఓగుకు+ ఆయన చేసినదంతా మేము విన్నాం. 11 అందుకే మా పెద్దలు, మా దేశ ప్రజలు మాకు ఇలా చెప్పారు: ‘ప్రయాణానికి కావాల్సిన ఆహారం తీసుకొని, వెళ్లి వాళ్లను కలిసి, “మేము మీ సేవకులుగా ఉంటాం;+ దయచేసి మాతో ఇప్పుడు ఒక ఒప్పందం చేయండి”+ అని వాళ్లతో చెప్పండి.’ 12 ఇక్కడ మీ దగ్గరికి రావడానికి మేము మా ఇళ్ల దగ్గర నుండి బయల్దేరినప్పుడు మేము తెచ్చుకున్న ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇవి ఎండిపోయి, ముక్కలైపోయాయి.+ 13 మేము ఈ ద్రాక్షతిత్తుల్ని నింపినప్పుడు ఇవి కొత్తవి, ఇప్పుడు ఇవి చిరిగిపోయాయి.+ చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి.”

14 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియోనీయులు తెచ్చుకున్న ఆహారంలో కొంత తీసుకొని పరిశీలించారు, అయితే వాళ్లు యెహోవా దగ్గర విచారణ చేయలేదు.+ 15 అప్పుడు యెహోషువ వాళ్లతో సంధి చేసుకొని+ వాళ్లను బ్రతకనిచ్చేలా ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు ఆ మాటకు కట్టుబడివుంటామని ప్రమాణం చేశారు.+

16 వాళ్లు గిబియోనీయులతో ఒప్పందం చేసిన మూడు రోజుల తర్వాత, ఆ గిబియోనీయులు దగ్గర్లోనే, తమ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంటున్నారని వాళ్లకు తెలిసింది. 17 అప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణించి మూడో రోజున గిబియోనీయుల నగరాలకు వచ్చారు; గిబియోను,+ కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము+ అనేవి వాళ్ల నగరాలు. 18 కానీ ఇశ్రాయేలీయులు వాళ్లమీద దాడి చేయలేదు. ఎందుకంటే సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున ఒట్టేసి వాళ్లకు ప్రమాణం చేశారు.+ కాబట్టి సమాజమంతా ఆ ప్రధానుల మీద సణగడం మొదలుపెట్టారు. 19 అప్పుడు ఆ ప్రధానులు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున ఒట్టేసి వాళ్లకు ప్రమాణం చేశాం; అందుకే మనం వాళ్లకు హాని చేయకూడదు. 20 మనం ఇలా చేద్దాం: మేము వాళ్లకు ఒట్టేసి ప్రమాణం చేశాం కాబట్టి దేవుని కోపం మనమీదికి రాకుండా ఉండేలా మనం వాళ్లను బ్రతకనిద్దాం.”+ 21 ప్రధానులు ఇంకా ఇలా అన్నారు: “వాళ్లను బ్రతకనిద్దాం. అయితే వాళ్లు సమాజమంతటి కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా ఉంటారు.” ప్రధానులు గిబియోనీయులకు ఆ విధంగానే మాట ఇచ్చారు.

22 అప్పుడు యెహోషువ గిబియోనీయుల్ని పిలిచి ఇలా అన్నాడు: “మీరు నిజానికి మాకు దగ్గర్లోనే నివసిస్తూ, ‘మీకు చాలా దూర ప్రాంతంలో ఉంటున్నాం’ అని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?+ 23 ఇప్పటినుండి మీరు శపించబడినవాళ్లు.+ మీరు ఎప్పుడూ దాసుని స్థానంలోనే ఉంటారు. మీరు నా దేవుని మందిరం కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా ఉంటారు.” 24 అప్పుడు వాళ్లు యెహోషువతో ఇలా అన్నారు: “మీకు ఈ దేశాన్నంతటినీ ఇవ్వమని, దానిలో ఉన్న నివాసులందర్నీ మీ ఎదుట నుండి నాశనం చేయమని మీ దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాడన్న విషయం+ నీ సేవకులైన మాకు తెలిసింది. అందుకే మీరు మమ్మల్ని చంపేస్తారనే భయంతో+ మేము ఇలా చేశాం.+ 25 ఇప్పుడు మేము నీ చేతుల్లో ఉన్నాం. నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే, ఏది సరైనదనిపిస్తే అది చేయి.” 26 అప్పుడు యెహోషువ అలాగే చేశాడు; అతను వాళ్లను ఇశ్రాయేలీయుల చేతుల్లో నుండి రక్షించాడు, వాళ్లు గిబియోనీయుల్ని చంపలేదు. 27 అయితే సమాజం కోసం, యెహోవా ఎంపిక చేసే స్థలంలో+ ఉండే ఆయన బలిపీఠం కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా ఆ రోజు యెహోషువ వాళ్లను నియమించాడు.+ ఈ రోజు వరకు వాళ్లు అదే పని చేస్తున్నారు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి