కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • పొరుగువాళ్ల జంతువుల పట్ల గౌరవం (1-4)

      • స్త్రీ పురుషుడి వస్త్రాలు, పురుషుడు స్త్రీ వస్త్రాలు వేసుకోకూడదు (5)

      • జంతువుల పట్ల దయ (6, 7)

      • పైకప్పుకు పిట్టగోడ (8)

      • వేర్వేరు వాటిని కలపకూడదు (9-11)

      • బట్టలకు కుచ్చు ముడులు (12)

      • లైంగిక పాపాలకు సంబంధించిన నియమాలు (13-30)

ద్వితీయోపదేశకాండం 22:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:4

ద్వితీయోపదేశకాండం 22:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 7:12

ద్వితీయోపదేశకాండం 22:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:5; లేవీ 19:18; లూకా 10:27; గల 6:10

ద్వితీయోపదేశకాండం 22:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 52

    కావలికోట (అధ్యయన),

    9/2016, పేజీ 18

ద్వితీయోపదేశకాండం 22:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 22:28; కీర్త 145:9; సామె 12:10; మత్త 10:29

ద్వితీయోపదేశకాండం 22:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 11:2; అపొ 10:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2001, పేజీలు 4-5

ద్వితీయోపదేశకాండం 22:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:19

ద్వితీయోపదేశకాండం 22:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 12:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2003, పేజీ 32

    11/15/1995, పేజీ 31

ద్వితీయోపదేశకాండం 22:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:19

ద్వితీయోపదేశకాండం 22:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 15:38; మత్త 23:2, 5

ద్వితీయోపదేశకాండం 22:13

అధస్సూచీలు

  • *

    లేదా “ఆమెను తిరస్కరించి.”

ద్వితీయోపదేశకాండం 22:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 4

ద్వితీయోపదేశకాండం 22:16

అధస్సూచీలు

  • *

    లేదా “తిరస్కరిస్తున్నాడు.”

ద్వితీయోపదేశకాండం 22:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:21; ద్వితీ 1:13; 16:18
  • +ద్వితీ 25:2; సామె 10:13; 19:29

ద్వితీయోపదేశకాండం 22:19

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 2:16

ద్వితీయోపదేశకాండం 22:21

అధస్సూచీలు

  • *

    లేదా “వేశ్యలా ప్రవర్తించి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 21:9
  • +హెబ్రీ 13:4
  • +లేవీ 11:45; 1కొ 5:13

ద్వితీయోపదేశకాండం 22:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 20:3; నిర్గ 20:14; లేవీ 20:10; 1కొ 6:9, 10, 18

ద్వితీయోపదేశకాండం 22:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:10; ద్వితీ 5:18; 1థె 4:3, 6; హెబ్రీ 13:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2019, పేజీ 14

ద్వితీయోపదేశకాండం 22:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2019, పేజీ 14

ద్వితీయోపదేశకాండం 22:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 4:8; సం 35:20, 21; యాకో 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2019, పేజీ 14

ద్వితీయోపదేశకాండం 22:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2019, పేజీ 14

ద్వితీయోపదేశకాండం 22:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 34:2, 5

ద్వితీయోపదేశకాండం 22:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 34:11, 12; నిర్గ 22:16

ద్వితీయోపదేశకాండం 22:30

అధస్సూచీలు

  • *

    లేదా “తన తండ్రి వస్త్రం తీసినట్టే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:8; 20:11; ద్వితీ 27:20; 1కొ 5:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 22:1నిర్గ 23:4
ద్వితీ. 22:2మత్త 7:12
ద్వితీ. 22:4నిర్గ 23:5; లేవీ 19:18; లూకా 10:27; గల 6:10
ద్వితీ. 22:6లేవీ 22:28; కీర్త 145:9; సామె 12:10; మత్త 10:29
ద్వితీ. 22:82స 11:2; అపొ 10:9
ద్వితీ. 22:9లేవీ 19:19
ద్వితీ. 22:10సామె 12:10
ద్వితీ. 22:11లేవీ 19:19
ద్వితీ. 22:12సం 15:38; మత్త 23:2, 5
ద్వితీ. 22:18నిర్గ 18:21; ద్వితీ 1:13; 16:18
ద్వితీ. 22:18ద్వితీ 25:2; సామె 10:13; 19:29
ద్వితీ. 22:19మలా 2:16
ద్వితీ. 22:21లేవీ 21:9
ద్వితీ. 22:21హెబ్రీ 13:4
ద్వితీ. 22:21లేవీ 11:45; 1కొ 5:13
ద్వితీ. 22:22ఆది 20:3; నిర్గ 20:14; లేవీ 20:10; 1కొ 6:9, 10, 18
ద్వితీ. 22:24లేవీ 20:10; ద్వితీ 5:18; 1థె 4:3, 6; హెబ్రీ 13:4
ద్వితీ. 22:26ఆది 4:8; సం 35:20, 21; యాకో 2:11
ద్వితీ. 22:28ఆది 34:2, 5
ద్వితీ. 22:29ఆది 34:11, 12; నిర్గ 22:16
ద్వితీ. 22:30లేవీ 18:8; 20:11; ద్వితీ 27:20; 1కొ 5:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 22:1-30

ద్వితీయోపదేశకాండం

22 “నీ సహోదరుని ఎద్దు గానీ, గొర్రె గానీ దారితప్పి తిరగడం నువ్వు చూస్తే, దాన్ని చూసి కూడా చూడనట్టు వదిలేయకూడదు.+ నువ్వు తప్పకుండా దాన్ని నీ సహోదరుని దగ్గరికి తీసుకెళ్లాలి. 2 కానీ నీ సహోదరుడు నీకు దగ్గర్లో నివసించకపోతుంటే లేదా అతను ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఆ జంతువును నీ ఇంటికి తెచ్చుకోవాలి. నీ సహోదరుడు దాని కోసం వెతుక్కుంటూ వచ్చేవరకు అది నీ దగ్గరే ఉంటుంది. అతను వచ్చినప్పుడు నువ్వు దాన్ని అతనికి తిరిగిచ్చేయాలి.+ 3 నీ సహోదరుడు పోగొట్టుకున్న గాడిద గానీ, వస్త్రం గానీ, ఇంకేదైనా గానీ నీకు దొరికితే నువ్వు అలాగే చేయాలి. నువ్వు దాన్ని చూసీచూడనట్టు వదిలేయకూడదు.

4 “నీ సహోదరుని గాడిద గానీ, ఎద్దు గానీ దారిలో కింద పడిపోవడం నువ్వు చూస్తే, దాన్ని చూసి కూడా చూడనట్టు వదిలేయకూడదు. ఆ జంతువును లేపడానికి నువ్వు నీ సహోదరునికి తప్పకుండా సహాయం చేయాలి.+

5 “స్త్రీ పురుషుడి బట్టలు వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ బట్టలు వేసుకోకూడదు. అలా వేసుకునే ప్రతీ ఒక్కరు నీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.

6 “నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు చెట్టు మీదే గానీ, నేల మీదే గానీ పక్షి పిల్లలు లేదా గుడ్లు ఉన్న ఒక పక్షిగూడు నీకు కనిపిస్తే, వాటి తల్లి ఆ పిల్లలమీద లేదా గుడ్ల మీద కూర్చొని ఉంటే, నువ్వు తల్లిని దాని పిల్లలతో పాటు తీసుకోకూడదు.+ 7 నువ్వు ఖచ్చితంగా ఆ తల్లి పక్షిని పంపించేయాలి, అయితే దాని పిల్లల్ని నువ్వు తీసుకోవచ్చు. అలాచేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఎక్కువకాలం బ్రతుకుతావు.

8 “నువ్వు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎవరైనా దాని మీద నుండి కిందపడి నీ ఇంటిమీదికి రక్తాపరాధం రాకుండా ఉండేలా నీ ఇంటి పైకప్పుకు పిట్టగోడ కట్టాలి.+

9 “నీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాల్ని విత్తకూడదు.+ లేదంటే, నువ్వు విత్తిన విత్తనం నుండి, నీ ద్రాక్షతోట నుండి వచ్చిన ప్రతీది జప్తు చేయబడి పవిత్రమైన స్థలానికి ఇవ్వబడుతుంది.

10 “నువ్వు ఎద్దును, గాడిదను జతచేసి భూమి దున్నకూడదు.+

11 “ఉన్ని, నార కలిపి నేయబడిన బట్టల్ని నువ్వు వేసుకోకూడదు.+

12 “నువ్వు వేసుకునే బట్టలకు నాలుగు అంచుల్లో కుచ్చు ముడులు తయారుచేసుకోవాలి.+

13 “ఒక వ్యక్తి ఒకామెను పెళ్లి చేసుకొని, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొని, ఆ తర్వాత అతను ఆమెను ద్వేషించడం మొదలుపెట్టి,* 14 ఆమె తప్పుడు ప్రవర్తనకు పాల్పడిందని ఆమె మీద నిందలు వేసి, ‘నేను ఈ స్త్రీని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు, ఈమె కన్య అనడానికి రుజువు కనిపించలేదు’ అని అంటూ ఆమె పేరు పాడుచేశాడనుకోండి. 15 ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమె కన్య అనడానికి గల రుజువును నగర ద్వారం దగ్గరున్న పెద్దలకు చూపించాలి. 16 ఆ అమ్మాయి తండ్రి ఆ పెద్దలతో ఇలా చెప్పాలి: ‘నేను ఇతనికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను, కానీ ఇతను ఆమెను ద్వేషిస్తున్నాడు.* 17 అంతేకాదు, “నీ కూతురు కన్య అనడానికి నాకు ఆమె దగ్గర రుజువు కనిపించలేదు” అని అంటూ ఆమె తప్పు చేసిందని నిందిస్తున్నాడు. ఇదిగోండి, నా కూతురు కన్య అనడానికి రుజువు ఇదే.’ తర్వాత వాళ్లు నగర పెద్దల ముందు ఆ బట్టను పరుస్తారు. 18 అప్పుడు ఆ నగర పెద్దలు+ అతన్ని పట్టుకొని, అతనికి క్రమశిక్షణ ఇస్తారు.+ 19 వాళ్లు అతనికి 100 వెండి షెకెల్‌ల* జరిమానా విధించి, ఆ సొమ్మును ఆ అమ్మాయి తండ్రికి ఇస్తారు. ఎందుకంటే అతను ఇశ్రాయేలులోని ఒక కన్య పేరు పాడుచేశాడు.+ తర్వాత ఆమె ముందులాగే అతనికి భార్యగా ఉంటుంది. అతను జీవించినంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

20 “కానీ ఒకవేళ ఆ నింద నిజమని తేలితే, ఆ అమ్మాయి కన్య అనడానికి రుజువేమీ లేకపోతే, 21 వాళ్లు ఆమెను ఆమె తండ్రి ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకురావాలి. తర్వాత, ఆ నగరంలోని పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే ఆమె తన తండ్రి ఇంట్లో లైంగిక పాపం చేసి*+ ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేసింది.+ కాబట్టి నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+

22 “ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొకరి భార్యతో పడుకొని ఉన్నప్పుడు పట్టుబడితే, వాళ్లిద్దర్నీ అంటే అలా పడుకున్న వ్యక్తిని, ఆ స్త్రీని చంపేయాలి.+ ఆ విధంగా నువ్వు ఇశ్రాయేలులో నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.

23 “పెళ్లి నిశ్చయమైన కన్యను ఇంకొక పురుషుడు నగరంలో చూసి, ఆమెతో పడుకుంటే, 24 మీరు వాళ్లిద్దర్నీ ఆ నగర ద్వారం దగ్గరికి తీసుకొచ్చి, నగరంలో గట్టిగా అరవనందుకు ఆ అమ్మాయిని, సాటిమనిషి భార్యను అవమానపర్చినందుకు అతన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి.+ అలా నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.

25 “కానీ ఒకవేళ అతను పెళ్లి నిశ్చయమైన ఆ అమ్మాయిని పొలంలో చూసి, బలవంతంగా ఆమెతో పడుకుంటే, ఆమెతో పడుకున్న ఆ వ్యక్తిని మాత్రమే చంపేయాలి; 26 కానీ ఆ అమ్మాయిని ఏమీ చేయకూడదు. ఎందుకంటే, ఆమె మరణశిక్షకు తగిన పాపం చేయలేదు. ఇది కూడా, ఒక వ్యక్తి తన సాటిమనిషి మీద దాడిచేసి హత్య చేయడం లాంటిదే.+ 27 ఎందుకంటే, అతను ఆమెను పొలంలో చూశాడు, పెళ్లి నిశ్చయమైన ఆ అమ్మాయి గట్టిగా అరిచింది, కానీ ఆమెను కాపాడడానికి అక్కడ ఎవరూ లేరు.

28 “ఒకవేళ ఒకతను పెళ్లి నిశ్చయంకాని ఒక కన్యను చూసి, ఆమెను పట్టుకొని, ఆమెతో పడుకున్నాడనుకోండి. ఆ విషయం బయటపడినప్పుడు+ 29 ఆమెతో పడుకున్న వ్యక్తి ఆ అమ్మాయి తండ్రికి 50 వెండి షెకెల్‌లు ఇవ్వాలి, అప్పుడామె అతని భార్య అవుతుంది.+ అతను ఆమెను అవమానపర్చాడు కాబట్టి, అతను తాను జీవించినంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

30 “ఎవ్వరూ తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలాచేస్తే అతను తన తండ్రిని అగౌరవపర్చినట్టే.*+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి