కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • అపవిత్రుల్ని దూరంగా ఉంచడం (1-4)

      • తప్పు ఒప్పుకోవడం, పరిహారం చెల్లించడం (5-10)

      • వ్యభిచారం చేసినట్టు అనుమానం వస్తే నీళ్లతో పరీక్ష (11-31)

సంఖ్యాకాండం 5:2

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాణిని.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 13:45, 46
  • +లేవీ 15:2
  • +లేవీ 22:4; సం 19:11

సంఖ్యాకాండం 5:3

అధస్సూచీలు

  • *

    లేదా “గుడారంలోనైతే నివసిస్తున్నానో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:8; లేవీ 26:11
  • +సం 19:22

సంఖ్యాకాండం 5:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:1, 17

సంఖ్యాకాండం 5:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:5; యెహో 7:19; యాకో 5:16
  • +లేవీ 6:4, 5

సంఖ్యాకాండం 5:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:16; 6:6, 7; 7:7

సంఖ్యాకాండం 5:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:14, 17; 7:1, 6; 10:12, 13
  • +నిర్గ 29:27, 28; సం 18:8; ద్వితీ 18:3; యెహె 44:29; 1కొ 9:13

సంఖ్యాకాండం 5:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:20; ద్వితీ 5:18

సంఖ్యాకాండం 5:15

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

సంఖ్యాకాండం 5:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 17:10; హెబ్రీ 13:4

సంఖ్యాకాండం 5:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 5:15, 25
  • +సం 5:22, 24

సంఖ్యాకాండం 5:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 7:2

సంఖ్యాకాండం 5:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:20; 1కొ 6:9, 10

సంఖ్యాకాండం 5:21

అధస్సూచీలు

  • *

    పునరుత్పత్తి అవయవాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

  • *

    లేదా “వ్యర్థమైపోయేలా.” ఇది, పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుండవచ్చు.

సంఖ్యాకాండం 5:22

అధస్సూచీలు

  • *

    పునరుత్పత్తి అవయవాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

  • *

    లేదా “వ్యర్థమైపోయేలా.” ఇది, పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుండవచ్చు.

  • *

    లేదా “అలాగే జరగాలి! అలాగే జరగాలి!”

సంఖ్యాకాండం 5:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 5:15

సంఖ్యాకాండం 5:26

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాతినిధ్య.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:9

సంఖ్యాకాండం 5:27

అధస్సూచీలు

  • *

    పునరుత్పత్తి అవయవాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

  • *

    లేదా “వ్యర్థమైపోతుంది.” ఇది, పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుండవచ్చు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2004, పేజీ 24

సంఖ్యాకాండం 5:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 5:14, 15

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 5:2లేవీ 13:45, 46
సంఖ్యా. 5:2లేవీ 15:2
సంఖ్యా. 5:2లేవీ 22:4; సం 19:11
సంఖ్యా. 5:3నిర్గ 25:8; లేవీ 26:11
సంఖ్యా. 5:3సం 19:22
సంఖ్యా. 5:6లేవీ 5:1, 17
సంఖ్యా. 5:7లేవీ 5:5; యెహో 7:19; యాకో 5:16
సంఖ్యా. 5:7లేవీ 6:4, 5
సంఖ్యా. 5:8లేవీ 5:16; 6:6, 7; 7:7
సంఖ్యా. 5:9లేవీ 6:14, 17; 7:1, 6; 10:12, 13
సంఖ్యా. 5:9నిర్గ 29:27, 28; సం 18:8; ద్వితీ 18:3; యెహె 44:29; 1కొ 9:13
సంఖ్యా. 5:13లేవీ 18:20; ద్వితీ 5:18
సంఖ్యా. 5:16యిర్మీ 17:10; హెబ్రీ 13:4
సంఖ్యా. 5:18సం 5:15, 25
సంఖ్యా. 5:18సం 5:22, 24
సంఖ్యా. 5:19రోమా 7:2
సంఖ్యా. 5:20లేవీ 18:20; 1కొ 6:9, 10
సంఖ్యా. 5:25సం 5:15
సంఖ్యా. 5:26లేవీ 2:9
సంఖ్యా. 5:29సం 5:14, 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 5:1-31

సంఖ్యాకాండం

5 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 2 “కుష్ఠువ్యాధి ఉన్న ప్రతీ వ్యక్తిని,+ స్రావం ఉన్న ప్రతీ వ్యక్తిని,+ చనిపోయిన వ్యక్తిని* ముట్టుకోవడం వల్ల అపవిత్రుడైన ప్రతీ వ్యక్తిని+ పాలెంలో నుండి బయటికి పంపించేయమని నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. 3 అది పురుషుడైనా, స్త్రీ అయినా వాళ్లను బయటికి పంపించేయాలి. నేను ఎవరి మధ్యైతే నివసిస్తున్నానో*+ ఆ ప్రజల పాలెం అంతటినీ వాళ్లు మలినపర్చకుండా ఉండేలా+ వాళ్లను పాలెంలో నుండి బయటికి పంపించేయాలి.” 4 కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు, వాళ్లను పాలెంలో నుండి బయటికి పంపించేశారు. యెహోవా మోషేకు చెప్పినట్టే ఇశ్రాయేలీయులు చేశారు.

5 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 6 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఒక పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదైనా పాపం చేసి యెహోవా పట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తిస్తే, వాళ్లు దోషులు అవుతారు.+ 7 వాళ్లు తాము చేసిన పాపాన్ని ఒప్పుకుని,+ తమ దోషానికి తగిన పూర్తి నష్టపరిహారం చెల్లించాలి; అలాగే దానికి ఐదోవంతు కలిపి ఇవ్వాలి.+ వాళ్లు ఎవరి విషయంలో తప్పు చేశారో వాళ్లకు దాన్ని ఇవ్వాలి. 8 అయితే ఆ నష్టపరిహారాన్ని తీసుకోవడానికి బాధితులకు దగ్గరి బంధువులు ఎవరూ లేకపోతే, దాన్ని యెహోవాకు తిరిగిచ్చేయాలి; అది యాజకునిది అవుతుంది. వాళ్ల పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి అర్పించే పొట్టేలుతో పాటు అది యాజకునిది అవుతుంది.+

9 “ ‘ఇశ్రాయేలీయులు యాజకుని దగ్గరికి తీసుకొచ్చే ప్రతీ పవిత్రమైన కానుక+ అతనికే చెందాలి.+ 10 వాళ్లలో ఒక్కొక్కరు కానుకగా ఇచ్చే పవిత్రమైన వస్తువులు అతనికి చెందినవిగానే ఉంటాయి. వాళ్లు యాజకునికి ఇచ్చేదేదైనా అది ఆ యాజకునికే చెందుతుంది.’ ”

11 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 12 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఒక వ్యక్తి భార్య తప్పుదారి పట్టి అతనికి నమ్మకద్రోహం చేసిందనుకోండి, 13 అంటే వేరే పురుషుడు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు+ అనుకోండి; కానీ ఆ విషయం ఆమె భర్తకు తెలీదు, అది బయటపడలేదు; అలా ఆమె తనను తాను అపవిత్రపర్చుకున్నా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు, ఆమె పట్టుబడలేదు; అలాంటప్పుడు ఇలా చేయాలి: 14 ఆమె తనను తాను అపవిత్రపర్చుకున్నప్పుడు ఆమె భర్త రోషం తెచ్చుకొని, ఆమె నమ్మకత్వాన్ని అనుమానిస్తే; లేదా ఆమె తనను తాను అపవిత్రపర్చుకోకపోయినా ఆమె భర్త రోషం తెచ్చుకొని, ఆమె నమ్మకత్వాన్ని అనుమానిస్తే, 15 ఆ వ్యక్తి తన భార్యను యాజకుని దగ్గరికి తీసుకురావాలి, అలాగే ఆమె కోసం అర్పణగా ఈఫాలో పదోవంతు* బార్లీ పిండిని తీసుకురావాలి. అతను దానిమీద నూనె పోయకూడదు, సాంబ్రాణి పెట్టకూడదు. ఎందుకంటే అది రోషంతో కూడిన ధాన్యార్పణ, దోషాన్ని గుర్తుచేసే ధాన్యార్పణ.

16 “ ‘యాజకుడు ఆమెను ముందుకు తీసుకొచ్చి యెహోవా ఎదుట నిలబెడతాడు.+ 17 యాజకుడు ఒక మట్టిపాత్రలో పవిత్రమైన నీళ్లు తీసుకొని, గుడారపు నేల నుండి కొంత మట్టి తీసి ఆ నీళ్లలో వేస్తాడు. 18 యాజకుడు ఆ స్త్రీని యెహోవా ముందు నిలబెట్టి, ఆమె తలవెంట్రుకల్ని విప్పి, దోషాన్ని గుర్తుచేసే ధాన్యార్పణను అంటే రోషంతో కూడిన ధాన్యార్పణను+ ఆమె అరచేతుల్లో పెడతాడు; శాపాన్ని తీసుకొచ్చే చేదు నీళ్లను యాజకుడు తన చేతిలో ఉంచుకుంటాడు.+

19 “ ‘తర్వాత యాజకుడు ఇలా అంటూ ఆమెతో ప్రమాణం చేయిస్తాడు: “నువ్వు నీ భర్త అధికారం కింద ఉన్నప్పుడు వేరే ఏ పురుషుడూ నీతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోయుంటే,+ నువ్వు తప్పుదారి పట్టి నిన్ను నువ్వు అపవిత్రం చేసుకోకపోయుంటే, శాపాన్ని తీసుకొచ్చే ఈ చేదు నీళ్లు నీకు ఏ హానీ చేయవు. 20 కానీ నువ్వు నీ భర్త అధికారం కింద ఉన్నప్పుడు నిన్ను నువ్వు అపవిత్రపర్చుకుని తప్పుదారి పట్టి ఉంటే, నీ భర్తతో కాకుండా వేరే పురుషునితో లైంగిక సంబంధాలు పెట్టుకొని+ ఉంటే—” 21 తర్వాత యాజకుడు ఆ స్త్రీతో, శాపంతో కూడిన ఒక ఒట్టు వేయించి ప్రమాణం చేయిస్తాడు; యాజకుడు ఆ స్త్రీతో ఇలా అంటాడు: “యెహోవా నీ తొడ* పడిపోయేలా,* నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేస్తాడు; ఆ విధంగా నీ ప్రజలు శపించేటప్పుడు, ఒట్టు వేసేటప్పుడు నీ పేరు ఉపయోగించేలా యెహోవా చేస్తాడు. 22 శాపాన్ని తీసుకొచ్చే ఈ నీళ్లు నీ పేగుల్లోకి వెళ్లి నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా, నీ తొడ* పడిపోయేలా* చేస్తాయి.” దానికి ఆ స్త్రీ, “ఆమేన్‌! ఆమేన్‌!”* అనాలి.

23 “ ‘తర్వాత యాజకుడు ఆ శాపాల్ని గ్రంథంలో రాసి, వాటిని చేదు నీళ్లతో తుడిచేయాలి. 24 తర్వాత అతను శాపాన్ని తీసుకొచ్చే ఆ నీళ్లను ఆ స్త్రీతో తాగిస్తాడు, అప్పుడు శాపాన్ని తీసుకొచ్చే ఆ నీళ్లు ఆమె లోపలికి వెళ్లి చేదును పుట్టిస్తాయి. 25 యాజకుడు రోషంతో కూడిన ధాన్యార్పణను+ ఆమె చేతిలో నుండి తీసుకొని యెహోవా ఎదుట దాన్ని ముందుకు, వెనుకకు కదిలిస్తాడు; తర్వాత అతను దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకొస్తాడు. 26 యాజకుడు ఆ ధాన్యార్పణలో నుండి పిడికెడు పిండిని జ్ఞాపకార్థ* భాగంగా తీసుకొని, బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు;+ తర్వాత అతను ఆ నీళ్లను ఆమెతో తాగిస్తాడు. 27 అతను ఆమెతో ఆ నీళ్లు తాగించినప్పుడు, ఒకవేళ ఆమె తనను తాను అపవిత్రపర్చుకుని తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, శాపాన్ని తీసుకొచ్చే నీళ్లు ఆమె లోపలికి వెళ్లి చేదు అవుతాయి; దానివల్ల ఆమె పొత్తికడుపు ఉబ్బిపోతుంది, ఆమె తొడ* పడిపోతుంది;* ప్రజలు శపించేటప్పుడు ఆమె పేరును ఉపయోగిస్తారు. 28 కానీ ఆ స్త్రీ తనను తాను అపవిత్రపర్చుకోకుండా పవిత్రంగా ఉండివుంటే, ఆ శిక్ష ఆమె మీదికి రాదు; ఆమె గర్భం దాల్చి, పిల్లల్ని కనగలుగుతుంది.

29 “ ‘ఇది రోషాన్ని గురించిన నియమం;+ అంటే, ఒక స్త్రీ తన భర్త అధికారం కింద ఉండగా తప్పుదారి పట్టి తనను తాను అపవిత్రపర్చుకున్నప్పుడు, 30 లేదా ఒక పురుషుడు రోషంతో తన భార్య నమ్మకత్వాన్ని అనుమానించినప్పుడు పాటించాల్సిన నియమం. ఆమె భర్త ఆమెను యెహోవా ముందు నిలబెట్టాలి, అప్పుడు యాజకుడు ఈ నియమంలో ఉన్నదంతా ఆమెకు చేయాలి.31 భర్త మీద ఏ దోషం ఉండదు, భార్య మాత్రం తన దోషానికి తాను శిక్ష అనుభవిస్తుంది.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి