కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 34
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • కనాను సరిహద్దులు (1-15)

      • దేశాన్ని పంచి ఇవ్వడానికి పురుషుల్ని నియమించడం (16-29)

సంఖ్యాకాండం 34:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:18
  • +ఆది 10:19; యెహో 1:4

సంఖ్యాకాండం 34:3

అధస్సూచీలు

  • *

    అంటే, మృత సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:1, 2

సంఖ్యాకాండం 34:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:36
  • +సం 13:26
  • +యెహో 15:1, 3

సంఖ్యాకాండం 34:5

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:1, 4

సంఖ్యాకాండం 34:6

అధస్సూచీలు

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:4; 15:12

సంఖ్యాకాండం 34:8

అధస్సూచీలు

  • *

    లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 14:25
  • +యెహె 47:15

సంఖ్యాకాండం 34:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 47:17

సంఖ్యాకాండం 34:11

అధస్సూచీలు

  • *

    అంటే, గెన్నేసరెతు సరస్సు, లేదా గలిలయ సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:16, 17; యెహో 11:1, 2; యోహా 6:1

సంఖ్యాకాండం 34:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:1, 2

సంఖ్యాకాండం 34:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 14:2; 18:6; సామె 16:33

సంఖ్యాకాండం 34:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:12, 13; యెహో 13:8

సంఖ్యాకాండం 34:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:5, 32

సంఖ్యాకాండం 34:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:51

సంఖ్యాకాండం 34:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:4, 16

సంఖ్యాకాండం 34:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:1
  • +సం 14:30

సంఖ్యాకాండం 34:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:1

సంఖ్యాకాండం 34:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:11

సంఖ్యాకాండం 34:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:40

సంఖ్యాకాండం 34:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 48:5; యెహో 16:1
  • +యెహో 17:1

సంఖ్యాకాండం 34:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:5

సంఖ్యాకాండం 34:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:10

సంఖ్యాకాండం 34:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:17

సంఖ్యాకాండం 34:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:24

సంఖ్యాకాండం 34:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:32

సంఖ్యాకాండం 34:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:8; యెహో 19:51; అపొ 17:26

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 34:2ఆది 15:18
సంఖ్యా. 34:2ఆది 10:19; యెహో 1:4
సంఖ్యా. 34:3యెహో 15:1, 2
సంఖ్యా. 34:4న్యా 1:36
సంఖ్యా. 34:4సం 13:26
సంఖ్యా. 34:4యెహో 15:1, 3
సంఖ్యా. 34:5యెహో 15:1, 4
సంఖ్యా. 34:6యెహో 1:4; 15:12
సంఖ్యా. 34:82రా 14:25
సంఖ్యా. 34:8యెహె 47:15
సంఖ్యా. 34:9యెహె 47:17
సంఖ్యా. 34:11ద్వితీ 3:16, 17; యెహో 11:1, 2; యోహా 6:1
సంఖ్యా. 34:12యెహో 15:1, 2
సంఖ్యా. 34:13యెహో 14:2; 18:6; సామె 16:33
సంఖ్యా. 34:14ద్వితీ 3:12, 13; యెహో 13:8
సంఖ్యా. 34:15సం 32:5, 32
సంఖ్యా. 34:17యెహో 19:51
సంఖ్యా. 34:18సం 1:4, 16
సంఖ్యా. 34:19యెహో 15:1
సంఖ్యా. 34:19సం 14:30
సంఖ్యా. 34:20యెహో 19:1
సంఖ్యా. 34:21యెహో 18:11
సంఖ్యా. 34:22యెహో 19:40
సంఖ్యా. 34:23ఆది 48:5; యెహో 16:1
సంఖ్యా. 34:23యెహో 17:1
సంఖ్యా. 34:24యెహో 16:5
సంఖ్యా. 34:25యెహో 19:10
సంఖ్యా. 34:26యెహో 19:17
సంఖ్యా. 34:27యెహో 19:24
సంఖ్యా. 34:28యెహో 19:32
సంఖ్యా. 34:29ద్వితీ 32:8; యెహో 19:51; అపొ 17:26
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 34:1-29

సంఖ్యాకాండం

34 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులకు ఈ నిర్దేశాలు ఇవ్వు: ‘మీరు కనాను దేశంలోకి వెళ్లినప్పుడు,+ మీరు స్వాస్థ్యంగా పొందే దేశం, అంటే దాని సరిహద్దుల ప్రకారం మీరు సొంతం చేసుకునే కనాను దేశం ఇదే.+

3 “ ‘దక్షిణం వైపు మీ సరిహద్దు ఎదోము పక్కగా సీను ఎడారి దగ్గర నుండి మొదలౌతుంది; తూర్పు వైపున మీ దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం* కొన నుండి మొదలౌతుంది.+ 4 ఆ సరిహద్దు దిశ మారి అక్రబ్బీము పర్వత మార్గం+ దక్షిణం మీదుగా సీను ఎడారిలోకి వెళ్లి, కాదేషు-బర్నేయకు+ దక్షిణాన ముగుస్తుంది. అక్కడి నుండి అది హసరద్దారు+ మీదుగా అస్మోను వరకు వెళ్తుంది. 5 అస్మోను దగ్గర ఆ సరిహద్దు దిశ మారి ఐగుప్తు వాగు* వైపుగా వెళ్లి మహా సముద్రం* దగ్గర ఆగుతుంది.+

6 “ ‘పడమటి వైపు మీ సరిహద్దు మహా సముద్రం,* దాని తీరం. అది మీ పడమటి సరిహద్దుగా ఉంటుంది.+

7 “ ‘ఇది మీ ఉత్తర సరిహద్దు: మహా సముద్రం దగ్గర నుండి హోరు కొండ వరకు మీరు సరిహద్దు ఏర్పర్చుకోవాలి. 8 హోరు కొండ దగ్గర నుండి లెబో-హమాతు*+ వరకు సరిహద్దు ఏర్పర్చుకోవాలి, ఆ సరిహద్దు సెదాదు దగ్గర ఆగుతుంది.+ 9 ఆ సరిహద్దు జిప్రోను వరకు వెళ్లి హసరేనాను దగ్గర ముగుస్తుంది.+ ఇది మీ ఉత్తర సరిహద్దుగా ఉంటుంది.

10 “ ‘తర్వాత హసరేనాను నుండి షెపాము వరకు మీ తూర్పు సరిహద్దును ఏర్పర్చుకోవాలి. 11 ఆ సరిహద్దు షెపాము దగ్గర నుండి అయీనుకు తూర్పున ఉన్న రిబ్లా వరకు సాగి, అక్కడి నుండి కిందికి వెళ్లి, కిన్నెరెతు సముద్రం*+ తూర్పున ఉన్న కొండల మీదుగా ముందుకు సాగుతుంది. 12 ఆ సరిహద్దు యొర్దాను వరకు వెళ్లి ఉప్పు సముద్రం దగ్గర ఆగుతుంది.+ మీ దేశం, దాని సరిహద్దులు ఇవి.’ ”

13 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు ఈ నిర్దేశాలు ఇచ్చాడు: “యెహోవా తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని ఆజ్ఞాపించినట్టు, మీరు చీట్లు+ వేసి సొత్తుగా పంచుకోవాల్సిన దేశం ఇదే. 14 ఎందుకంటే, వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబం ప్రకారం రూబేనీయులు, వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబం ప్రకారం గాదీయులు, అలాగే మనష్షే అర్ధగోత్రం వాళ్లు ఇప్పటికే తమ స్వాస్థ్యాన్ని తీసుకున్నారు.+ 15 ఆ రెండున్నర గోత్రాల వాళ్లు యెరికో దగ్గర యొర్దానుకు తూర్పు వైపున ఉన్న ప్రాంతంలో, సూర్యుడు ఉదయించే వైపున ఇప్పటికే తమ స్వాస్థ్యాన్ని తీసుకున్నారు.”+

16 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 17 “మీరు సొత్తుగా పొందబోయే దేశాన్ని మీకు పంచి ఇచ్చే వాళ్ల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ.+ 18 అలాగే ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వడానికి మీరు ఒక్కో గోత్రం నుండి ఒక్కో ప్రధానుడిని తీసుకోవాలి.+ 19 వాళ్ల పేర్లు ఇవి: యూదా గోత్రం+ నుండి యెఫున్నె కుమారుడు కాలేబు;+ 20 షిమ్యోను వంశస్థుల గోత్రం+ నుండి అమీహూదు కుమారుడు షెమూయేలు; 21 బెన్యామీను గోత్రం+ నుండి కిస్లోను కుమారుడు ఎలీదాదు; 22 దాను వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, యొగ్లి కుమారుడూ అయిన బుక్కీ; 23 యోసేపు కుమారుడైన+ మనష్షే వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, ఏఫోదు కుమారుడూ అయిన హన్నీయేలు; 24 యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, షిప్తాను కుమారుడూ అయిన కెమూయేలు; 25 జెబూలూను వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, పర్నాకు కుమారుడూ అయిన ఎలీషాపాను; 26 ఇశ్శాఖారు వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, అజాను కుమారుడూ అయిన పల్తీయేలు; 27 ఆషేరు వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, షెలోమి కుమారుడూ అయిన అహీహూదు; 28 నఫ్తాలి వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, అమీహూదు కుమారుడూ అయిన పెదహేలు.” 29 కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు భూమిని పంచి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించింది వీళ్లకే.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి