సంఖ్యాకాండం
24 ఇశ్రాయేలును దీవించడం యెహోవాకు నచ్చిందని* బిలాము గ్రహించినప్పుడు అతను మళ్లీ శకునాలు చూడడానికి వెళ్లలేదు,+ బదులుగా అతను ఎడారి వైపు తన ముఖం తిప్పుకున్నాడు. 2 బిలాము తల ఎత్తి, ఇశ్రాయేలీయులు తమతమ గోత్రాల ప్రకారం డేరాలు వేసుకొని నివసించడం+ చూసినప్పుడు, దేవుని పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది.+ 3 అప్పుడతను కావ్యరూపంలో ఇలా అన్నాడు:+
“బెయోరు కుమారుడైన బిలాము ఇలా అంటున్నాడు,
తన కళ్లు తెరవబడిన వ్యక్తి ఇలా అంటున్నాడు,
4 దేవుని మాటలు వింటున్న వ్యక్తి,
సర్వశక్తిమంతుడి దర్శనం చూసిన వ్యక్తి,
కళ్లు తెరవబడి సాష్టాంగపడిన వ్యక్తి ఇలా అంటున్నాడు:+
5 యాకోబూ, నీ డేరాలు ఎంత అందంగా ఉన్నాయి!
ఇశ్రాయేలూ, నీ నివాసాలు ఎంత చక్కగా ఉన్నాయి!+
6 లోయల్లా* అవి చాలాదూరం విస్తరించాయి,+
నది పక్కన తోటల్లా,
యెహోవా నాటిన అగరు మొక్కల్లా,
నీళ్ల పక్కన ఉన్న దేవదారు చెట్లలా అవి చాలాదూరం విస్తరించాయి.
7 అతని రెండు పాత్రల్లో నుండి నీళ్ల చుక్కలు పడుతూ ఉంటాయి,
8 దేవుడే వాళ్లను ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నాడు;
ఆయన వాళ్లకు అడవి ఎద్దు కొమ్ముల లాంటివాడు.
దేశాల్ని, తన శత్రువుల్ని అతను దహించేస్తాడు,+
వాళ్ల ఎముకల్ని కొరుకుతాడు, తన బాణాలతో వాళ్లను చెదరగొడతాడు.
9 అతను పొంచివున్నాడు, సింహంలా పడుకొని ఉన్నాడు,
అతను సింహం లాంటివాడు, అతన్ని లేపే సాహసం ఎవరు చేయగలరు?
నిన్ను దీవించేవాళ్లు దీవించబడతారు,
నిన్ను శపించేవాళ్లు శపించబడతారు.”+
10 అప్పుడు బాలాకుకు బిలాము మీద పిచ్చికోపం వచ్చింది. బాలాకు కోపంతో తన చేతులు చరుచుకొని బిలాముతో ఇలా అన్నాడు: “నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను పిలిపించాను,+ నువ్వేమో ఈ మూడుసార్లు వాళ్లను దీవించావు. 11 నువ్వు వెంటనే ఇంటికి వెళ్లిపో. నేను నిన్ను గొప్పగా సన్మానించాలని అనుకున్నాను,+ కానీ ఇదిగో! యెహోవా అది నీకు దక్కకుండా చేశాడు.”
12 బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: “నువ్వు పంపిన సందేశకులతో నేను ఇలా చెప్పలేదా? 13 ‘బాలాకు తన ఇంటిని వెండిబంగారాలతో నింపి ఇచ్చినా, యెహోవా ఆదేశాన్ని మీరి నా అంతట నేను ఏమీ చేయలేను; అది మంచే గానీ, చెడే గానీ. యెహోవా నాకు ఏం చెప్తే నేను అదే చెప్తాను.’+ 14 ఇప్పుడు నేను నా ప్రజల దగ్గరికి వెళ్లిపోతున్నాను. అయితే రానున్న రోజుల్లో* ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో నీకు చెప్తాను.” 15 అప్పుడతను కావ్యరూపంలో ఇలా అన్నాడు:+
“బెయోరు కుమారుడైన బిలాము ఇలా అంటున్నాడు,
తన కళ్లు తెరవబడిన వ్యక్తి ఇలా అంటున్నాడు,+
16 దేవుని మాటలు వింటున్న వ్యక్తి,
సర్వోన్నతుడి గురించిన జ్ఞానం ఉన్న వ్యక్తి,
తన కళ్లు తెరవబడి సాష్టాంగపడుతున్నప్పుడు
సర్వశక్తిమంతుడి దర్శనం చూసిన వ్యక్తి ఇలా అంటున్నాడు:
17 నేను అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు;
నేను అతన్ని చూస్తాను, కానీ వెంటనే కాదు.
18 ఇశ్రాయేలు తన పరాక్రమాన్ని చూపిస్తున్నప్పుడు
ఎదోము స్వాధీనం చేసుకోబడుతుంది,+
19 యాకోబు నుండి వచ్చిన ఒక వ్యక్తి జయిస్తూ వెళ్తాడు,+
ఆ నగర నాశనాన్ని తప్పించుకునే ప్రతీ ఒక్కర్ని అతను చంపేస్తాడు.”
20 అమాలేకును చూసినప్పుడు అతను కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు:
21 కేనీయుల్ని+ చూసినప్పుడు అతను కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు:
“నీ నివాస స్థలం సురక్షితంగా ఉంది, అది కొండ పైనున్న గూడులా ఉంది.
22 అయితే కేయీను* కాల్చివేయబడతాడు.
అష్షూరు నిన్ను ఖైదీగా తీసుకెళ్లడానికి ఇంకెంతకాలం?”
23 అతను కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు:
“అయ్యో! దేవుడు అలా చేసినప్పుడు ఎవరు తప్పించుకుంటారు?
అయితే అతను కూడా పూర్తిగా నాశనమౌతాడు.”
25 తర్వాత బిలాము+ లేచి తన చోటికి తిరిగెళ్లిపోయాడు. బాలాకు కూడా తన దారిన వెళ్లిపోయాడు.