కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • చిగురించిన అహరోను కర్ర సూచనగా ఉంటుంది (1-13)

సంఖ్యాకాండం 17:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:4, 16

సంఖ్యాకాండం 17:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:29
  • +నిర్గ 25:22; 30:36; లేవీ 16:2

సంఖ్యాకాండం 17:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 16:5
  • +సం 11:1; 14:2, 27; 16:11, 13, 41; 1కొ 10:6, 10

సంఖ్యాకాండం 17:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:4
  • +ద్వితీ 9:7; 31:27
  • +సం 16:38

సంఖ్యాకాండం 17:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:51; 18:4, 7
  • +సం 16:49

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 17:2సం 1:4, 16
సంఖ్యా. 17:4నిర్గ 34:29
సంఖ్యా. 17:4నిర్గ 25:22; 30:36; లేవీ 16:2
సంఖ్యా. 17:5సం 16:5
సంఖ్యా. 17:5సం 11:1; 14:2, 27; 16:11, 13, 41; 1కొ 10:6, 10
సంఖ్యా. 17:10హెబ్రీ 9:4
సంఖ్యా. 17:10ద్వితీ 9:7; 31:27
సంఖ్యా. 17:10సం 16:38
సంఖ్యా. 17:13సం 1:51; 18:4, 7
సంఖ్యా. 17:13సం 16:49
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 17:1-13

సంఖ్యాకాండం

17 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ఒక్కో పూర్వీకుల కుటుంబానికి ఒక కర్ర చొప్పున తీసుకో, ప్రతీ పూర్వీకుల కుటుంబ ప్రధానుడి+ నుండి ఒక కర్ర తీసుకో, అలా మొత్తం 12 కర్రలు తీసుకో. ఎవరి కర్ర మీద వాళ్ల పేరు రాయి. 3 లేవి గోత్రం కర్ర మీద నువ్వు అహరోను పేరు రాయాలి, ఎందుకంటే ఒక్కో పూర్వీకుల కుటుంబ పెద్ద కోసం ఒక్క కర్రే ఉంది. 4 ఆ కర్రల్ని నువ్వు ప్రత్యక్ష గుడారంలో సాక్ష్యపు మందసం ముందు,+ నేను ఎప్పుడూ నీకు ప్రత్యక్షమయ్యే చోట+ పెట్టు. 5 నేను ఎవరినైతే ఎంచుకుంటానో ఆ వ్యక్తి+ కర్ర చిగురిస్తుంది; అలా నేను, ఇశ్రాయేలీయులు నా మీద, మీ మీద సణుగుతున్న సణుగుల్ని ఆపుచేస్తాను.”+

6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు, అప్పుడు వాళ్ల ప్రధానులందరూ అతనికి కర్రలు ఇచ్చారు. ఒక్కో పూర్వీకుల కుటుంబ ప్రధానుడు ఒక్కో కర్ర చొప్పున మొత్తం 12 కర్రలు ఇచ్చారు; వాటిలో అహరోను కర్ర కూడా ఉంది. 7 అప్పుడు మోషే ఆ కర్రల్ని తీసుకొని సాక్ష్యపు గుడారంలో యెహోవా ముందు పెట్టాడు.

8 తర్వాతి రోజు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్లినప్పుడు, ఇదిగో! లేవి గోత్రానికి చెందిన అహరోను కర్ర చిగురించింది; దానికి మొగ్గలు, పూలు వచ్చాయి, బాదం పండ్లు కాశాయి. 9 తర్వాత మోషే, యెహోవా ముందున్న ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలందరి ముందుకు తీసుకొచ్చాడు. వాళ్లు వాటిని చూశారు, ప్రతీ వ్యక్తి తన కర్రను తీసుకున్నాడు.

10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను కర్రను+ తిరిగి సాక్ష్యపు మందసం ముందు పెట్టు, అది తిరుగుబాటుదారులకు+ సూచనగా+ ఎప్పటికీ అక్కడ ఉంటుంది. అలా వాళ్లు నా మీద సణుగుతున్న సణుగులు ఆగిపోతాయి, వాళ్లు చావకుండా ఉంటారు.” 11 మోషే వెంటనే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు చేశాడు. అతను సరిగ్గా అలాగే చేశాడు.

12 తర్వాత ఇశ్రాయేలీయులు మోషేతో ఇలా అన్నారు: “ఇప్పుడు మేము చనిపోతాం, మేము ఖచ్చితంగా నశించిపోతాం, మేమంతా నాశనం కాబోతున్నాం! 13 ఎవరైనా యెహోవా గుడారం దరిదాపుల్లోకి వచ్చినా చనిపోతారు!+ చివరికి మేము ఇలా చనిపోవాలా?”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి