కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • కనానుకు 12 మంది వేగులవాళ్లను పంపడం (1-24)

      • పదిమంది వేగులవాళ్ల చెడ్డ నివేదిక (25-33)

సంఖ్యాకాండం 13:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:25; ద్వితీ 1:15
  • +ద్వితీ 1:22, 23

సంఖ్యాకాండం 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 12:16; ద్వితీ 1:19

సంఖ్యాకాండం 13:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:30; 14:30, 38; 34:18, 19; 1ది 4:15

సంఖ్యాకాండం 13:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:16; 14:30; 34:17

సంఖ్యాకాండం 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 48:5
  • +ఆది 48:17, 19

సంఖ్యాకాండం 13:16

అధస్సూచీలు

  • *

    “యెహోవాయే రక్షణ” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 17:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2002, పేజీ 11

సంఖ్యాకాండం 13:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:7

సంఖ్యాకాండం 13:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:8; ద్వితీ 8:7

సంఖ్యాకాండం 13:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:25; యెహె 20:6
  • +ద్వితీ 31:6; యెహో 1:6, 9
  • +సం 13:23

సంఖ్యాకాండం 13:21

అధస్సూచీలు

  • *

    లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:2, 3; యెహో 15:1
  • +సం 34:8
  • +2స 10:6, 8

సంఖ్యాకాండం 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:1, 2; యెహో 11:21
  • +న్యా 1:10
  • +ఆది 13:18; యెహో 15:13; 21:11, 12

సంఖ్యాకాండం 13:23

అధస్సూచీలు

  • *

    లేదా “వాగుకు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2006, పేజీ 16

సంఖ్యాకాండం 13:24

అధస్సూచీలు

  • *

    “ద్రాక్ష గుత్తి” అని అర్థం.

  • *

    లేదా “వాగు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2006, పేజీ 16

సంఖ్యాకాండం 13:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:33, 34

సంఖ్యాకాండం 13:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:19

సంఖ్యాకాండం 13:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:8; లేవీ 20:24

సంఖ్యాకాండం 13:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:27, 28

సంఖ్యాకాండం 13:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:12; 1స 15:3
  • +న్యా 1:21; 2స 5:6, 7
  • +ఆది 10:15, 16
  • +ఆది 10:19
  • +నిర్గ 23:23; ద్వితీ 7:1; 20:17

సంఖ్యాకాండం 13:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 14:7, 8

సంఖ్యాకాండం 13:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:9

సంఖ్యాకాండం 13:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 2:9

సంఖ్యాకాండం 13:33

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెఫీలీయుల్ని.”

  • *

    లేదా “గొల్లభామల్లా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:28; 9:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 133

    కావలికోట,

    7/15/2011, పేజీలు 10-11

    10/1/2006, పేజీ 16

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 13:2నిర్గ 18:25; ద్వితీ 1:15
సంఖ్యా. 13:2ద్వితీ 1:22, 23
సంఖ్యా. 13:3సం 12:16; ద్వితీ 1:19
సంఖ్యా. 13:6సం 13:30; 14:30, 38; 34:18, 19; 1ది 4:15
సంఖ్యా. 13:8సం 13:16; 14:30; 34:17
సంఖ్యా. 13:11ఆది 48:5
సంఖ్యా. 13:11ఆది 48:17, 19
సంఖ్యా. 13:16నిర్గ 17:9
సంఖ్యా. 13:17ద్వితీ 1:7
సంఖ్యా. 13:18నిర్గ 3:8; ద్వితీ 8:7
సంఖ్యా. 13:20నెహె 9:25; యెహె 20:6
సంఖ్యా. 13:20ద్వితీ 31:6; యెహో 1:6, 9
సంఖ్యా. 13:20సం 13:23
సంఖ్యా. 13:21సం 34:2, 3; యెహో 15:1
సంఖ్యా. 13:21సం 34:8
సంఖ్యా. 13:212స 10:6, 8
సంఖ్యా. 13:22ద్వితీ 9:1, 2; యెహో 11:21
సంఖ్యా. 13:22న్యా 1:10
సంఖ్యా. 13:22ఆది 13:18; యెహో 15:13; 21:11, 12
సంఖ్యా. 13:24ద్వితీ 1:24
సంఖ్యా. 13:25సం 14:33, 34
సంఖ్యా. 13:26ద్వితీ 1:19
సంఖ్యా. 13:27నిర్గ 3:8; లేవీ 20:24
సంఖ్యా. 13:28ద్వితీ 1:27, 28
సంఖ్యా. 13:29ఆది 36:12; 1స 15:3
సంఖ్యా. 13:29న్యా 1:21; 2స 5:6, 7
సంఖ్యా. 13:29ఆది 10:15, 16
సంఖ్యా. 13:29ఆది 10:19
సంఖ్యా. 13:29నిర్గ 23:23; ద్వితీ 7:1; 20:17
సంఖ్యా. 13:30యెహో 14:7, 8
సంఖ్యా. 13:31సం 32:9
సంఖ్యా. 13:32ఆమో 2:9
సంఖ్యా. 13:33ద్వితీ 1:28; 9:1, 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 13:1-33

సంఖ్యాకాండం

13 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న కనాను దేశాన్ని వేగుచూడడానికి మనుషుల్ని పంపించు. వాళ్ల పూర్వీకుల గోత్రాల్లో ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని పంపించాలి, వాళ్లలో ప్రతీ ఒక్కరు తన గోత్రంలో ప్రధానుడై+ ఉండాలి.”+

3 కాబట్టి మోషే యెహోవా ఆదేశం మేరకు పారాను ఎడారి+ నుండి వాళ్లను పంపించాడు. వాళ్లందరూ ఇశ్రాయేలీయుల పెద్దలే. 4 వాళ్లు ఎవరంటే: రూబేను గోత్రం నుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ; 5 షిమ్యోను గోత్రం నుండి హోరీ కుమారుడైన షాపాతు; 6 యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;+ 7 ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కుమారుడైన ఇగాలు; 8 ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడైన హోషేయ;+ 9 బెన్యామీను గోత్రం నుండి రాఫు కుమారుడైన పల్తీ; 10 జెబూలూను గోత్రం నుండి సోరీ కుమారుడైన గదీయేలు; 11 యోసేపు+ కుమారుడైన మనష్షే+ గోత్రం నుండి సూసీ కుమారుడైన గదీ; 12 దాను గోత్రం నుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు; 13 ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు; 14 నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కుమారుడైన నహబీ; 15 గాదు గోత్రం నుండి మాకీ కుమారుడైన గెయువేలు. 16 ఇవి కనాను దేశాన్ని వేగుచూడడానికి మోషే పంపించిన వాళ్ల పేర్లు. అయితే నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ*+ అని పేరు పెట్టాడు.

17 కనాను దేశాన్ని వేగుచూడడానికి వాళ్లను పంపిస్తున్నప్పుడు మోషే వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు నెగెబుకు చేరుకొని, అక్కడి నుండి కొండ ప్రాంతానికి వెళ్లండి.+ 18 మీరు దాన్ని చూసి, అది ఎలాంటి దేశమో,+ అక్కడ నివసించే ప్రజలు బలవంతులో బలహీనులో, వాళ్లు ఎక్కువమంది ఉన్నారో తక్కువమంది ఉన్నారో, 19 అది మంచి దేశమో కాదో, వాళ్లు నివసిస్తున్న నగరాలకు ప్రాకారాలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. 20 అది సంపన్న దేశమో పేద దేశమో,+ దానిలో చెట్లు ఉన్నాయో లేవో చూడండి. మీరు ధైర్యంగా ఉండాలి,+ అలాగే ఆ దేశంలోని పండ్లలో కొన్ని తీసుకురావాలి.” అది ద్రాక్షల ప్రథమఫలాల కాలం.+

21 కాబట్టి వాళ్లు వెళ్లి సీను ఎడారి+ నుండి లెబో-హమాతు*+ దగ్గరున్న రెహోబు+ వరకు ఆ దేశాన్ని వేగుచూశారు. 22 వాళ్లు నెగెబులోకి వెళ్లి అనాకీయులైన+ అహీమాను, షేషయి, తల్మయి+ నివసిస్తున్న హెబ్రోను+ నగరానికి వచ్చారు. ఈ హెబ్రోను నగరం, ఐగుప్తుకు చెందిన సోయను కన్నా ఏడేళ్లు ముందే నిర్మించబడింది. 23 వాళ్లు ఎష్కోలు లోయకు* వచ్చినప్పుడు, ద్రాక్ష గుత్తి ఉన్న ఒక తీగను కోశారు; దాన్ని ఇద్దరు వ్యక్తులు మోతకర్ర మీద మోయాల్సి వచ్చింది. అలాగే వాళ్లు కొన్ని దానిమ్మ పండ్లను, అంజూర పండ్లను కూడా కోశారు. 24 ఇశ్రాయేలీయులు అక్కడ ద్రాక్ష గుత్తిని కోశారు కాబట్టి వాళ్లు ఆ స్థలానికి ఎష్కోలు* లోయ*+ అని పేరు పెట్టారు.

25 వాళ్లు ఆ దేశాన్ని వేగుచూసి 40 రోజుల+ తర్వాత తిరిగొచ్చారు. 26 వాళ్లు కాదేషు+ దగ్గరికి, అంటే పారాను ఎడారిలో మోషే, అహరోను, ఇశ్రాయేలీయుల సమాజమంతా ఉన్న చోటికి తిరిగొచ్చారు. వాళ్లు ఆ సమాజమంతటి కోసం నివేదికను తీసుకొచ్చారు, ఆ దేశంలోని పండ్లను వాళ్లకు చూపించారు. 27 వాళ్లు మోషేకు ఇలా చెప్పారు: “నువ్వు మమ్మల్ని పంపించిన దేశంలోకి మేము వెళ్లాం, అది నిజంగానే పాలుతేనెలు ప్రవహించే దేశం;+ ఇవి దాని పండ్లు. 28 అయితే, ఆ దేశంలో నివసించే ప్రజలు చాలా బలవంతులు; వాళ్ల నగరాలు చాలా పెద్దవి, వాటికి ప్రాకారాలు ఉన్నాయి. అంతేకాదు అక్కడ మేము అనాకీయుల్ని చూశాం.+ 29 నెగెబు దేశంలో అమాలేకీయులు+ నివసిస్తున్నారు; కొండ ప్రాంతంలో హిత్తీయులు, యెబూసీయులు,+ అమోరీయులు+ నివసిస్తున్నారు; సముద్రం దగ్గర,+ అలాగే యొర్దాను తీరం వెంబడి కనానీయులు+ నివసిస్తున్నారు.”

30 అప్పుడు కాలేబు మోషే ముందు నిలబడిన ప్రజల్ని శాంతపర్చడానికి ప్రయత్నిస్తూ, “మనం వెంటనే అక్కడికి వెళ్దాం, మనం దాన్ని తప్పక స్వాధీనం చేసుకుంటాం; ఎందుకంటే మనం దాన్ని ఖచ్చితంగా జయించగలం” అన్నాడు.+ 31 అయితే అతనితో పాటు అక్కడికి వెళ్లొచ్చిన వాళ్లు, “మనం ఆ ప్రజలతో యుద్ధం చేయలేం, వాళ్లు మనకన్నా బలవంతులు” అన్నారు.+ 32 తాము వేగుచూసి వచ్చిన దేశం గురించి వాళ్లు ఇశ్రాయేలీయులకు చెడ్డ నివేదిక ఇస్తూ ఇలా అంటూ ఉన్నారు: “మేము వేగుచూడడానికి ఏ దేశానికైతే వెళ్లామో ఆ దేశం దాని నివాసుల్ని మింగేసే దేశం; అందులో మేము చూసిన ప్రజలంతా భారీకాయులు.+ 33 అక్కడ మేము అనాకు వంశస్థులైన+ భారీకాయుల్ని* చూశాం, వాళ్లు నెఫీలీయుల నుండి వచ్చారు; వాళ్లతో పోల్చుకున్నప్పుడు మేము మా కంటికీ వాళ్ల కంటికీ మిడతల్లా* కనిపించాం.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి