కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • బూటకపు ఉపవాసాల్ని యెహోవా ఖండించడం (1-14)

        • “మీరు నిజంగా నా కోసమే ఉపవాసం ఉన్నారా?” (5)

        • ‘న్యాయంగా, విశ్వసనీయ ప్రేమతో, ​కరుణతో ప్రవర్తించండి’ (9)

జెకర్యా 7:1

అధస్సూచీలు

  • *

    అనుబంధం B15 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 6:14; జెక 1:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1826, 1924

జెకర్యా 7:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “నేను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:8-10; యిర్మీ 52:12-14

జెకర్యా 7:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:11; జెక 1:12
  • +యిర్మీ 41:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/1996, పేజీ 5

జెకర్యా 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:15

జెకర్యా 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 21:3; యిర్మీ 21:12
  • +సామె 16:6; హోషే 10:12; మీకా 6:8

జెకర్యా 7:10

అధస్సూచీలు

  • *

    లేదా “అనాథల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:22; ద్వితీ 24:17; యెష 1:17
  • +నిర్గ 23:9; మలా 3:5
  • +సామె 22:22
  • +జెక 8:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా మహా దినం, పేజీలు 113-115

జెకర్యా 7:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 33:10; యిర్మీ 6:10
  • +నెహె 9:29
  • +2రా 17:13, 14; యెష 6:10; యిర్మీ 25:7

జెకర్యా 7:12

అధస్సూచీలు

  • *

    లేదా “ఏదైనా ఒక గట్టి రాయిలా” అయ్యుంటుంది.

  • *

    లేదా “ఉపదేశానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 3:7
  • +నెహె 9:30; అపొ 7:51
  • +2ది 36:15, 16; యిర్మీ 21:5

జెకర్యా 7:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆయన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:15; 50:2; విలా 3:44

జెకర్యా 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:64; యిర్మీ 5:15
  • +లేవీ 26:22, 33; 2ది 36:20, 21

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 7:1ఎజ్రా 6:14; జెక 1:1
జెక. 7:32రా 25:8-10; యిర్మీ 52:12-14
జెక. 7:5యిర్మీ 25:11; జెక 1:12
జెక. 7:5యిర్మీ 41:1, 2
జెక. 7:72ది 36:15
జెక. 7:9సామె 21:3; యిర్మీ 21:12
జెక. 7:9సామె 16:6; హోషే 10:12; మీకా 6:8
జెక. 7:10నిర్గ 22:22; ద్వితీ 24:17; యెష 1:17
జెక. 7:10నిర్గ 23:9; మలా 3:5
జెక. 7:10సామె 22:22
జెక. 7:10జెక 8:17
జెక. 7:112ది 33:10; యిర్మీ 6:10
జెక. 7:11నెహె 9:29
జెక. 7:112రా 17:13, 14; యెష 6:10; యిర్మీ 25:7
జెక. 7:12యెహె 3:7
జెక. 7:12నెహె 9:30; అపొ 7:51
జెక. 7:122ది 36:15, 16; యిర్మీ 21:5
జెక. 7:13యెష 1:15; 50:2; విలా 3:44
జెక. 7:14ద్వితీ 28:64; యిర్మీ 5:15
జెక. 7:14లేవీ 26:22, 33; 2ది 36:20, 21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 7:1-14

జెకర్యా

7 దర్యావేషు రాజు పరిపాలన నాలుగో సంవత్సరం, కిస్లేవు* అనే తొమ్మిదో నెల, నాలుగో రోజు యెహోవా వాక్యం జెకర్యా దగ్గరికి వచ్చింది.+ 2 బేతేలులోని ప్రజలు యెహోవా అనుగ్రహం పొందడానికి షెరెజెరును, రెగెమ్మెలెకునూ అతని మనుషుల్నీ పంపించి, 3 సైన్యాలకు అధిపతైన యెహోవా మందిరంలోని యాజకుల్ని, అలాగే ప్రవక్తల్ని ఇలా అడిగారు: “ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నట్టే, ఈ సంవత్సరం కూడా ఐదో నెలలో+ మేము* ఉపవాసం ఉంటూ దుఃఖించాలా?”

4 సైన్యాలకు అధిపతైన యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 5 “దేశంలోని ప్రజలందరితో, యాజకులతో ఇలా చెప్పు: ‘మీరు 70 ఏళ్లు+ ఐదో నెలలో, ఏడో నెలలో+ ఉపవాసం ఉండి, గట్టిగా ఏడ్చినప్పుడు, మీరు నిజంగా నా కోసమే ఉపవాసం ఉన్నారా? 6 మీరు తిన్నప్పుడు, తాగినప్పుడు మీరు తిన్నది, తాగింది మీ కోసం కాదా? 7 యెరూషలేము, దాని చుట్టుపక్కల నగరాల్లో ప్రజలు నివసించినప్పుడు, వాళ్లు ప్రశాంతంగా జీవించినప్పుడు; నెగెబులో, షెఫేలాలో ప్రజలు నివసించినప్పుడు, యెహోవా అప్పటి ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలకు మీరు లోబడాలి కదా?’ ”+

8 యెహోవా వాక్యం మళ్లీ జెకర్యా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 9 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీరు తీర్పు తీరుస్తున్నప్పుడు న్యాయంగా తీర్పుతీర్చండి,+ ఒకరితో ఒకరు విశ్వసనీయ ప్రేమతో,+ కరుణతో ప్రవర్తించండి. 10 విధవరాళ్లను, తండ్రిలేని పిల్లల్ని,*+ పరదేశుల్ని,+ పేదవాళ్లను+ దగా చేయకండి; హాని చేయడానికి మీ హృదయాల్లో ఒకరి మీద ఒకరు కుట్ర పన్నకండి.’+ 11 అయితే వాళ్లు ఎప్పుడూ ఆ మాటల్ని పట్టించుకోలేదు,+ వాళ్లు మొండిగా తయారయ్యారు,+ వాటిని వినకూడదని తమ చెవులు మూసుకున్నారు.+ 12 వాళ్లు తమ హృదయాల్ని వజ్రంలా* కఠినపర్చుకున్నారు,+ సైన్యాలకు అధిపతైన యెహోవా తన పవిత్రశక్తి ద్వారా అప్పటి ప్రవక్తలతో చెప్పించిన ధర్మశాస్త్రానికి,* మాటలకు లోబడలేదు.+ కాబట్టి సైన్యాలకు అధిపతైన యెహోవా నుండి గొప్ప ఉగ్రత వాళ్ల మీదికి వచ్చింది.”+

13 “ ‘నేను* పిలిచినప్పుడు వాళ్లు విననట్టే, వాళ్లు పిలిచినప్పుడు నేను కూడా వినను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. 14 ‘నేను వాళ్లను తుఫాను గాలితో వాళ్లకు తెలియని దేశాలన్నిటికీ చెదరగొట్టాను;+ ఆ దేశం గుండా రాకపోకలు లేనందువల్ల అది నిర్మానుష్యం అయిపోయింది;+ ఎందుకంటే, వాళ్లు అందమైన దేశాన్ని భయంకరమైన దేశంగా మార్చారు.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి