కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • 6వ దర్శనం: ఎగురుతున్న గ్రంథపుచుట్ట (1-4)

      • 7వ దర్శనం: ఈఫా పాత్ర (5-11)

        • పాత్ర లోపల దుష్టత్వం అనే స్త్రీ (8)

        • పాత్ర షీనారుకు తీసుకెళ్లబడడం (9-11)

జెకర్యా 5:2

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 22

జెకర్యా 5:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:15
  • +నిర్గ 20:7; లేవీ 19:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 12/2019, పేజీ 3

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 22

జెకర్యా 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీలు 22-24

జెకర్యా 5:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 24

జెకర్యా 5:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఈఫా.” ఇక్కడ ఒక ఈఫాను కొలిచే పాత్రను లేదా బుట్టను సూచిస్తోంది. అప్పట్లో ఒక ఈఫా 22 లీటర్లతో (13 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 24

జెకర్యా 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 24

జెకర్యా 5:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీలు 24-25

జెకర్యా 5:11

అధస్సూచీలు

  • *

    అంటే, బాబిలోనియా.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:8, 10; 11:1, 2; దాని 1:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీలు 24-25

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 5:3నిర్గ 20:15
జెక. 5:3నిర్గ 20:7; లేవీ 19:12
జెక. 5:11ఆది 10:8, 10; 11:1, 2; దాని 1:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 5:1-11

జెకర్యా

5 మళ్లీ నేను తల ఎత్తి చూశాను, ఎగురుతున్న ఒక గ్రంథపుచుట్ట నాకు కనిపించింది. 2 అతను నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు.

అందుకు నేను, “ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపిస్తోంది. అది 20 మూరల* పొడవు, 10 మూరల వెడల్పు ఉంది” అని చెప్పాను.

3 అప్పుడతను నాకు ఇలా చెప్పాడు: “ఇది భూమంతటి మీదికి వెళ్తున్న శాపం. ఎందుకంటే, దానికి ఒకవైపు రాసి ఉన్న ప్రకారం, దొంగిలించే వాళ్లందరికీ+ శిక్ష పడలేదు; దానికి ఇంకోవైపు రాసి ఉన్న ప్రకారం, అబద్ధ ప్రమాణం చేసే వాళ్లందరికీ+ శిక్ష పడలేదు. 4 ‘నేనే దాన్ని పంపించాను, అది దొంగ ఇంట్లోకి, నా పేరున అబద్ధ ప్రమాణం చేసేవాడి ఇంట్లోకి ప్రవేశించి, అందులోనే ఉండి ఆ ఇంటిని, దాని కలపను, దాని రాళ్లను నాశనం చేస్తుంది’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”

5 తర్వాత నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకొచ్చి, “దయచేసి నీ తల ఎత్తి, బయటికి వెళ్తున్నది ఏమిటో చూడు” అని నాతో అన్నాడు.

6 నేను, “అదేమిటి?” అని అడిగాను.

అందుకతను, “బయటికి వెళ్తున్నది ఈఫా పాత్ర”* అన్నాడు. తర్వాత అతను, “ఇది భూమంతటా ఉన్న చెడ్డ ప్రజల రూపం” అని చెప్పాడు. 7 ఆ తర్వాత నేను, దాని గుండ్రటి సీసపు మూత తీయబడడం, ఆ పాత్రలో ఒక స్త్రీ కూర్చొని ఉండడం చూశాను. 8 అప్పుడతను, “ఇది దుష్టత్వం” అని అన్నాడు. తర్వాత అతను ఆ స్త్రీని మళ్లీ ఆ ఈఫా పాత్రలోకి నెట్టేసి, దానిమీద సీసపు మూత పెట్టాడు.

9 తర్వాత నేను తల ఎత్తి చూసినప్పుడు, ఇద్దరు స్త్రీలు ముందుకు రావడం కనిపించింది, వాళ్లు గాలిలో ఎగురుతున్నారు. వాళ్లకు సంకుబుడి కొంగ రెక్కల్లాంటి రెక్కలు ఉన్నాయి. వాళ్లు ఆ పాత్రను భూమ్యాకాశాల మధ్యకు ఎత్తారు. 10 అప్పుడు నేను, “వాళ్లు ఈఫా పాత్రను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాను.

11 అందుకతను ఇలా చెప్పాడు: “ఆమె కోసం ఒక ఇల్లును కట్టడానికి షీనారు దేశానికి*+ తీసుకెళ్తున్నారు; అది కట్టడం పూర్తయినప్పుడు ఆమెను అక్కడ తగిన చోట పెడతారు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి