కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • 4వ దర్శనం: ప్రధానయాజకుని వస్త్రాల్ని మార్చడం (1-10)

        • ప్రధానయాజకుడైన యెహోషువను సాతాను ఎదిరించడం (1)

        • ‘మొలక అనే నా సేవకుణ్ణి తీసుకొస్తాను!’ (8)

జెకర్యా 3:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 5:2; హగ్గ 1:14
  • +యోబు 1:6

జెకర్యా 3:2

అధస్సూచీలు

  • *

    అంటే, యెహోషువ.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యూదా 9

జెకర్యా 3:4

అధస్సూచీలు

  • *

    లేదా “అపరాధాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:2

జెకర్యా 3:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:6

జెకర్యా 3:7

అధస్సూచీలు

  • *

    లేదా “అధికారిగా ఉంటావు; కాపలా కాస్తావు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 2:7

జెకర్యా 3:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 42:1; 52:13
  • +యెష 11:1; 53:2, 11; యిర్మీ 23:5; 33:15; జెక 6:12

జెకర్యా 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:20

జెకర్యా 3:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 4:25; హోషే 2:18; మీకా 4:4

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 3:1ఎజ్రా 5:2; హగ్గ 1:14
జెక. 3:1యోబు 1:6
జెక. 3:2యూదా 9
జెక. 3:4నిర్గ 28:2
జెక. 3:5నిర్గ 29:6
జెక. 3:7మలా 2:7
జెక. 3:8యెష 42:1; 52:13
జెక. 3:8యెష 11:1; 53:2, 11; యిర్మీ 23:5; 33:15; జెక 6:12
జెక. 3:9యిర్మీ 50:20
జెక. 3:101రా 4:25; హోషే 2:18; మీకా 4:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 3:1-10

జెకర్యా

3 తర్వాత ఆయన నాకు యెహోవా దూత ముందు నిలబడిన ప్రధానయాజకుడైన యెహోషువను+ చూపించాడు, అతన్ని ఎదిరించడానికి సాతాను+ అతని కుడిపక్కన నిలబడి ఉన్నాడు. 2 అప్పుడు యెహోవా దూత సాతానుతో ఇలా అన్నాడు: “సాతానూ, యెహోవా నిన్ను గద్దించాలి!+ అవును, యెరూషలేమును ఎంచుకున్న యెహోవా నిన్ను గద్దించాలి! ఇతను* మంటల్లో నుండి లాగబడిన కొయ్యే  కదా?”

3 అప్పుడు యెహోషువ మురికి వస్త్రాలతో దేవదూత ముందు నిలబడి ఉన్నాడు. 4 దేవదూత అక్కడున్న వాళ్లతో, “అతని మురికి వస్త్రాల్ని తీసేయండి” అని చెప్పాడు. తర్వాత దేవదూత అతనితో “ఇదిగో, నేను నీ దోషాన్ని* తీసేశాను, నీకు శ్రేష్ఠమైన వస్త్రాలు తొడగబడతాయి”+ అన్నాడు.

5 కాబట్టి నేను, “అతని తలపై ఒక శుభ్రమైన తలపాగా పెట్టండి”+ అన్నాను. అప్పుడు వాళ్లు అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టి, అతనికి వస్త్రాలు తొడిగారు; యెహోవా దూత ఆ దగ్గర్లో నిలబడి ఉన్నాడు. 6 తర్వాత యెహోవా దూత యెహోషువకు ఇలా ప్రకటించాడు: 7 “సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘నువ్వు నా మార్గాల్లో నడుస్తూ, నా ముందు నీ బాధ్యతల్ని నెరవేరిస్తే, నువ్వు నా మందిరంలో న్యాయమూర్తిగా సేవచేస్తావు,+ నా ప్రాంగణాల్ని చూసుకుంటావు;* ఇక్కడ నిల్చున్న వాళ్లలాగే నీకు కూడా నా సన్నిధిలోకి వచ్చే అవకాశం  ఇస్తాను.’

8 “ ‘ప్రధానయాజకుడివైన యెహోషువా, దయచేసి నువ్వూ, నీ ముందు కూర్చునే నీ సహచరులూ వినండి, ఎందుకంటే మీరు ఒక సూచనగా ఉన్నారు; ఇదిగో! నేను నా సేవకుణ్ణి+ తీసుకొస్తున్నాను, అతని పేరు మొలక!+ 9 యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని చూడు! ఆ రాయి మీద ఏడు కళ్లు ఉన్నాయి; నేను ఆ రాయి మీద ఒక మాట చెక్కుతున్నాను, నేను ఈ దేశపు అపరాధాన్ని ఒక్కరోజులో తీసేస్తాను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.

10 “ ‘ఆ రోజున, మీలో ప్రతీ ఒక్కరు మీ ద్రాక్షచెట్టు కిందికి, అంజూర చెట్టు కిందికి రమ్మని మీ పొరుగువాళ్లను ఆహ్వానిస్తారు’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి