నహూము
1 నీనెవె గురించిన సందేశం.+ ఇది ఎల్కోషు వాడైన నహూముకు* వచ్చిన దర్శనాన్ని వివరించే పుస్తకం:
2 యెహోవా సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు,+ ప్రతీకారం తీర్చుకునే దేవుడు;
యెహోవా పగ తీర్చుకుంటాడు, ఆయన తన కోపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.+
యెహోవా తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు,
ఆయన తన విరోధుల కోసం కోపాన్ని నిల్వచేస్తాడు.
ఆయన దారి నాశనకరమైన గాలిలో, సుడిగాలిలో ఉంది.
మేఘాలు ఆయన పాదధూళి.
బాషాను, కర్మెలు వాడిపోతాయి,+
లెబానోను పూలు వడలిపోతాయి.
ఆయన ముందు భూమి కంపిస్తుంది,
లోకం, దానిలో నివసించే వాళ్లందరూ వణుకుతారు.+
6 ఆయన కోపం ముందు ఎవరు నిలవగలరు?
ఆయన కోపాగ్నిని ఎవరు తట్టుకోగలరు?+
ఆయన ఉగ్రత అగ్నిలా కుమ్మరించబడుతుంది,
ఆయన వల్ల బండలు బద్దలౌతాయి.
7 యెహోవా మంచివాడు,+ శ్రమ రోజున ఆయన బలమైన దుర్గం.+
తనను ఆశ్రయించే వాళ్లు ఆయనకు తెలుసు.*+
8 వరద ప్రవాహంతో ఆయన దాని* స్థలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు,
చీకటి ఆయన శత్రువుల్ని తరుముతుంది.
9 యెహోవాకు వ్యతిరేకంగా నువ్వు ఏం కుట్ర పన్నుతావు?
ఆయన సమూలనాశనం చేయబోతున్నాడు.
ఆపద రెండోసారి రాదు.+
10 వాళ్లు ముళ్లకంపల్లా అల్లుకుపోయారు,
మద్యం* తాగిన వాళ్లలా మత్తుగా ఉన్నారు;
అయితే వాళ్లు కొయ్యకాలులా* దహించేయబడతారు.
11 యెహోవాకు వ్యతిరేకంగా పన్నాగం పన్నే వ్యక్తి నీ నుండి వస్తాడు,
పనికిమాలిన సలహా ఇస్తాడు.
12 యెహోవా ఇలా అంటున్నాడు:
“వాళ్లు చాలా బలంగా, అసంఖ్యాకంగా ఉన్నా
నరికేయబడతారు, అంతమైపోతారు.*
నేను నిన్ను* కష్టపెట్టాను, కానీ ఇకమీదట అలా కష్టపెట్టను.
13 ఇప్పుడు నేను నీ మీదున్న అతని కాడిని విరగ్గొడతాను,+
నీ కట్లను తెంపేస్తాను.
నీ దేవుళ్ల గుడిలోని చెక్కిన విగ్రహాల్ని, పోత* విగ్రహాల్ని నాశనం చేస్తాను.
నేను నీకు సమాధి సిద్ధం చేస్తాను, ఎందుకంటే నువ్వు నీచుడివి.’
యూదా, నీ పండుగలు ఆచరించు,+ నీ మొక్కుబళ్లు చెల్లించు,
ఎందుకంటే, పనికిమాలినవాడు ఇంకెప్పుడూ నీ మధ్య నుండి వెళ్లడు.
అతను పూర్తిగా నాశనమౌతాడు.”