కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 27
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • మొక్కుబడి చేసుకున్నవాటిని విడిపించడం (1-27)

        • మనుషులు (1-8)

        • జంతువులు (9-13)

        • ఇళ్లు (14, 15)

        • పొలాలు (16-25)

        • మొదటి సంతానం (26, 27)

      • యెహోవాకు బేషరతుగా సమర్పించినవి (28, 29)

      • పదోవంతుల్ని విడిపించడం (30-34)

లేవీయకాండం 27:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:21; న్యా 11:30, 31; 1స 1:11

లేవీయకాండం 27:3

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్ర షెకెల్‌.”

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేవీయకాండం 27:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:7, 11; 12:8; 14:21
  • +లూకా 21:2-4; 2కొ 8:12

లేవీయకాండం 27:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:25; ద్వితీ 14:7, 8

లేవీయకాండం 27:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:19

లేవీయకాండం 27:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:11, 12

లేవీయకాండం 27:16

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక హోమర్‌ 220 లీటర్లతో (దాదాపు 130 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

లేవీయకాండం 27:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:10

లేవీయకాండం 27:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:15, 16

లేవీయకాండం 27:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:8, 14

లేవీయకాండం 27:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:25

లేవీయకాండం 27:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:11, 12, 18

లేవీయకాండం 27:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:10, 28

లేవీయకాండం 27:25

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక గీరా 0.57 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేవీయకాండం 27:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:2; సం 18:17
  • +నిర్గ 22:30; ద్వితీ 15:19

లేవీయకాండం 27:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:11-13

లేవీయకాండం 27:28

అధస్సూచీలు

  • *

    లేదా “నాశనం చేయాల్సిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:8, 14

లేవీయకాండం 27:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:2
  • +యెహో 6:17; 1స 15:3, 18

లేవీయకాండం 27:30

అధస్సూచీలు

  • *

    లేదా “దశమభాగం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 14:20; 28:22; సం 18:21, 26; ద్వితీ 14:22; 2ది 31:5; నెహె 13:12; మలా 3:10; లూకా 11:42; హెబ్రీ 7:5

లేవీయకాండం 27:32

అధస్సూచీలు

  • *

    లేదా “తల.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2008, పేజీ 9

లేవీయకాండం 27:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:9, 10

లేవీయకాండం 27:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:1; సం 1:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 27:2ద్వితీ 23:21; న్యా 11:30, 31; 1స 1:11
లేవీ. 27:8లేవీ 5:7, 11; 12:8; 14:21
లేవీ. 27:8లూకా 21:2-4; 2కొ 8:12
లేవీ. 27:11లేవీ 20:25; ద్వితీ 14:7, 8
లేవీ. 27:13లేవీ 27:19
లేవీ. 27:14లేవీ 27:11, 12
లేవీ. 27:17లేవీ 25:10
లేవీ. 27:18లేవీ 25:15, 16
లేవీ. 27:21సం 18:8, 14
లేవీ. 27:22లేవీ 25:25
లేవీ. 27:23లేవీ 27:11, 12, 18
లేవీ. 27:24లేవీ 25:10, 28
లేవీ. 27:26నిర్గ 13:2; సం 18:17
లేవీ. 27:26నిర్గ 22:30; ద్వితీ 15:19
లేవీ. 27:27లేవీ 27:11-13
లేవీ. 27:28సం 18:8, 14
లేవీ. 27:29సం 21:2
లేవీ. 27:29యెహో 6:17; 1స 15:3, 18
లేవీ. 27:30ఆది 14:20; 28:22; సం 18:21, 26; ద్వితీ 14:22; 2ది 31:5; నెహె 13:12; మలా 3:10; లూకా 11:42; హెబ్రీ 7:5
లేవీ. 27:33లేవీ 27:9, 10
లేవీ. 27:34నిర్గ 3:1; సం 1:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 27:1-34

లేవీయకాండం

27 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా ఒక వ్యక్తి ఒక మనిషికి నిర్ణయించబడిన విలువను యెహోవాకు ఇస్తానని ప్రత్యేకమైన మొక్కుబడి చేసుకున్నాడనుకోండి.+ 3 అలాంటప్పుడు 20 నుండి 60 ఏళ్లలోపు పురుషునికి నిర్ణయించబడిన విలువ, పవిత్ర స్థల షెకెల్‌ * కొలమానం ప్రకారం 50 షెకెల్‌ల* వెండి. 4 స్త్రీకైతే, అలా నిర్ణయించబడిన విలువ 30 షెకెల్‌లు. 5 అలాగే 5 నుండి 20 ఏళ్లలోపు అబ్బాయికైతే నిర్ణయించబడిన విలువ 20 షెకెల్‌లు, అమ్మాయికైతే 10 షెకెల్‌లు. 6 అదే ఒక నెల నుండి ఐదేళ్ల లోపు పిల్లవాడికైతే నిర్ణయించబడిన విలువ ఐదు షెకెల్‌ల వెండి, పాపకైతే మూడు షెకెల్‌ల వెండి.

7 “ ‘60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న పురుషునికైతే, నిర్ణయించబడిన విలువ 15 షెకెల్‌లు, స్త్రీకైతే 10 షెకెల్‌లు. 8 ఒకవేళ అతను నిర్ణయించబడిన విలువను కట్టలేనంత పేదవాడైతే,+ అతను ఆ పురుషుణ్ణి లేదా స్త్రీని యాజకుని ముందు నిలబెట్టాలి, అప్పుడు యాజకుడు అతని లేదా ఆమె విలువను నిర్ణయిస్తాడు. మొక్కుబడి చేసుకుంటున్న వ్యక్తి స్తోమతను బట్టి+ యాజకుడు ఆ విలువను నిర్ణయిస్తాడు.

9 “ ‘ఒకవేళ అతను, యెహోవాకు అర్పించడానికి తగిన జంతువును ఇస్తానని మొక్కుబడి చేసుకొని ఉంటే, యెహోవాకు ఇచ్చేది ఏదైనా పవిత్రం అవుతుంది. 10 దాని స్థానంలో ఇంకోదాన్ని ఇచ్చే అవకాశం అతనికి ఉండదు; అలాగే చెడ్డదానికి బదులుగా మంచిదాన్ని, మంచిదానికి బదులుగా చెడ్డదాన్ని మార్చే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ అతను ఒక జంతువు స్థానంలో ఇంకో జంతువును మారిస్తే, అసలు జంతువుతో పాటు మార్చిన జంతువు కూడా పవిత్రం అవుతుంది. 11 ఒకవేళ అది యెహోవాకు అర్పించకూడని అపవిత్రమైన జంతువైతే,+ అతను ఆ జంతువును యాజకుడి ముందు నిలబెడతాడు. 12 ఆ జంతువు మంచిదా, చెడ్డదా అన్నదాన్ని బట్టి యాజకుడు దాని విలువను నిర్ణయిస్తాడు. అతను నిర్ణయించిన విలువే ఖాయమౌతుంది. 13 ఒకవేళ అతను ఎప్పుడైనా దాన్ని తిరిగి కొనాలనుకుంటే, అతను నిర్ణయించబడిన విలువకు ఐదోవంతును కలిపి ఇవ్వాలి.+

14 “ ‘ఎవరైనా తన ఇంటిని యెహోవాకు పవిత్రమైనదిగా ప్రతిష్ఠించాలనుకుంటే, అది మంచిదైనా, చెడ్డదైనా, యాజకుడు దాని విలువను నిర్ణయిస్తాడు. యాజకుడు నిర్ణయించిన విలువ ప్రకారం దాని వెల ఉంటుంది.+ 15 తన ఇంటిని ప్రతిష్ఠించిన వ్యక్తి దాన్ని తిరిగి కొనాలనుకుంటే, అతను నిర్ణయించబడిన విలువకు ఐదోవంతు కలిపి ఇవ్వాలి. అప్పుడది అతనిదౌతుంది.

16 “ ‘ఎవరైనా తన పొలంలో కొంత భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దానిలో విత్తడానికి అవసరమైన విత్తనాల్ని బట్టి దాని విలువను నిర్ణయించాలి: ఒక హోమర్‌* బార్లీ విత్తనాలకు 50 షెకెల్‌ల వెండి. 17 ఒకవేళ అతను తన పొలాన్ని సునాద సంవత్సరం+ నుండి ప్రతిష్ఠిస్తే, నిర్ణయించబడిన విలువే ఖాయమౌతుంది. 18 ఒకవేళ అతను తన పొలాన్ని సునాద సంవత్సరం తర్వాత ప్రతిష్ఠిస్తే, యాజకుడు మరుసటి సునాద సంవత్సరం వరకు మిగిలి ఉన్న సంవత్సరాల్ని పరిగణనలోకి తీసుకొని వాటి ప్రకారం తక్కువ వెలను నిర్ణయించాలి.+ 19 ఒకవేళ దాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి ఎప్పుడైనా దాన్ని తిరిగి కొనాలనుకుంటే, నిర్ణయించబడిన విలువకు ఐదోవంతు కలిపి ఇవ్వాలి, అప్పుడది అతనిదౌతుంది. 20 ఒకవేళ అతను దాన్ని తిరిగి కొనకపోతే, అది వేరేవాళ్లకు అమ్మబడి ఉంటే, దాన్ని తిరిగి కొనే అవకాశం ఇక ఉండదు. 21 ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదలైనప్పుడు, అది యెహోవాకు పవిత్రమైనది అవుతుంది, ఎందుకంటే అది ఆయనకు సమర్పించినది. అది యాజకుల ఆస్తి అవుతుంది.+

22 “ ‘ఎవరైనా తాను కొన్న పొలాన్ని అంటే తన వారసత్వపు ఆస్తికాని దాన్ని+ యెహోవాకు ప్రతిష్ఠిస్తే, 23 యాజకుడు అతని కోసం సునాద సంవత్సరం వరకు మిగిలివున్న సంవత్సరాల ఆధారంగా లెక్క కడతాడు, ఆ రోజున అతను నిర్ణయించబడిన విలువను చెల్లిస్తాడు.+ అది యెహోవాకు పవిత్రమైనది. 24 సునాద సంవత్సరంలో ఆ పొలం, అతను దాన్ని ఎవరి దగ్గరైతే కొన్నాడో, అది ఎవరిదో ఆ వ్యక్తికి తిరిగెళ్లిపోతుంది.+

25 “ ‘ప్రతీ విలువను పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం నిర్ణయించాలి. ఆ షెకెల్‌ విలువ 20 గీరాలు.*

26 “ ‘అయితే, ఎవ్వరూ జంతువుల్లో మొదటి సంతానాన్ని ప్రతిష్ఠించకూడదు, ఎందుకంటే మొదటి సంతానం యెహోవాదే.+ అది ఎద్దే గానీ గొర్రే గానీ, అది అప్పటికే యెహోవాకు చెందినది.+ 27 ఒకవేళ అది అపవిత్రమైన జంతువుల్లో ఒకటైతే, దానికి నిర్ణయించబడిన వెల ఇచ్చి అతను దాన్ని విడిపించాలనుకుంటే, అతను దాని విలువకు ఐదోవంతును కలిపి ఇవ్వాలి.+ కానీ అతను దాన్ని తిరిగి కొనకపోతే, నిర్ణయించబడిన విలువ ప్రకారం అది అమ్మబడుతుంది.

28 “ ‘ఒక వ్యక్తి తనకున్న వాటిలో నుండి యెహోవాకు బేషరతుగా సమర్పించిన* దాన్ని, అది మనిషైనా, జంతువైనా, పొలమైనా, దాన్ని అమ్మే అవకాశం గానీ, తిరిగి కొనే అవకాశం గానీ ఉండదు. సమర్పించిన ప్రతీది యెహోవాకు అతి పవిత్రమైనది.+ 29 అంతేకాదు శిక్ష విధించబడి, నాశనం కోసం వేరుగా ఉంచబడిన వ్యక్తిని విడిపించే అవకాశం ఉండదు.+ అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.+

30 “ ‘భూమిలో పండిన ప్రతీదానిలో పదోవంతు*+ అంటే పొలంలోదే గానీ, చెట్ల ఫలాల్లోదే గానీ, అది యెహోవాకు చెందుతుంది. అది యెహోవాకు పవిత్రమైనది. 31 ఒక వ్యక్తి ఎప్పుడైనా తన పదోవంతును తిరిగి కొనాలనుకుంటే, అతను దాని విలువకు ఐదోవంతు కలిపి ఇవ్వాలి. 32 అయితే పశువుల్లో గానీ మందలో గానీ ప్రతీ పదోవంతు, అంటే కాపరి కర్ర కింద నుండి వెళ్లేవాటిలో ప్రతీ పదో జంతువు* యెహోవాకు పవిత్రమైనది అవుతుంది. 33 అది మంచిదా కాదా అని అతను చూడకూడదు, దాన్ని మార్చకూడదు. ఒకవేళ అతను ఎప్పుడైనా దాన్ని మారిస్తే అసలు జంతువుతో పాటు మార్చిన జంతువు కూడా పవిత్రమైనది అవుతుంది.+ దాన్ని తిరిగి కొనే అవకాశం ఉండదు.’ ”

34 ఇవి యెహోవా ఇశ్రాయేలీయుల కోసం సీనాయి పర్వతం మీద మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి