కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • యాజకులు పవిత్రులుగా ఉండాలి, మలినపర్చుకోకూడదు (1-9)

      • ప్రధానయాజకుడు తనను తాను మలినపర్చుకోకూడదు (10-15)

      • యాజకులకు శారీరక లోపాలు ​ఉండకూడదు (16-24)

లేవీయకాండం 21:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 19:14

లేవీయకాండం 21:3

అధస్సూచీలు

  • *

    లేదా “కన్యయైన.”

లేవీయకాండం 21:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:1
  • +లేవీ 19:27, 28

లేవీయకాండం 21:6

అధస్సూచీలు

  • *

    లేదా “ఆహారాన్ని.” ఇది బలుల్ని సూచిస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:44
  • +లేవీ 18:21; 19:12; 22:32
  • +యెష 52:11; 1పే 1:15, 16

లేవీయకాండం 21:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:29
  • +ద్వితీ 24:1; యెహె 44:22

లేవీయకాండం 21:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:41
  • +నిర్గ 28:36; లేవీ 11:45; 20:7, 8

లేవీయకాండం 21:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:14

లేవీయకాండం 21:10

అధస్సూచీలు

  • *

    లేదా “ఎవరి చేతులైతే అధికారంతో నింపబడతాయో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:12
  • +నిర్గ 28:2; 29:29; లేవీ 16:32
  • +ఆది 37:34; లేవీ 10:6

లేవీయకాండం 21:11

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాణి.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 6:7; 19:11, 14

లేవీయకాండం 21:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 10:7
  • +లేవీ 8:12

లేవీయకాండం 21:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 44:22

లేవీయకాండం 21:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 9:2

లేవీయకాండం 21:18

అధస్సూచీలు

  • *

    లేదా “ముఖరూపం చెడినవాడు.”

లేవీయకాండం 21:20

అధస్సూచీలు

  • *

    లేదా “బాగా బక్కచిక్కినవాడు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:1

లేవీయకాండం 21:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:10; 6:14, 16; 24:8, 9; సం 18:9
  • +లేవీ 22:10; సం 18:19

లేవీయకాండం 21:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:6
  • +నిర్గ 38:1
  • +నిర్గ 25:8
  • +నిర్గ 28:41

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 21:1సం 19:14
లేవీ. 21:5ద్వితీ 14:1
లేవీ. 21:5లేవీ 19:27, 28
లేవీ. 21:6నిర్గ 29:44
లేవీ. 21:6లేవీ 18:21; 19:12; 22:32
లేవీ. 21:6యెష 52:11; 1పే 1:15, 16
లేవీ. 21:7లేవీ 19:29
లేవీ. 21:7ద్వితీ 24:1; యెహె 44:22
లేవీ. 21:8నిర్గ 28:41
లేవీ. 21:8నిర్గ 28:36; లేవీ 11:45; 20:7, 8
లేవీ. 21:9లేవీ 20:14
లేవీ. 21:10లేవీ 8:12
లేవీ. 21:10నిర్గ 28:2; 29:29; లేవీ 16:32
లేవీ. 21:10ఆది 37:34; లేవీ 10:6
లేవీ. 21:11సం 6:7; 19:11, 14
లేవీ. 21:12లేవీ 10:7
లేవీ. 21:12లేవీ 8:12
లేవీ. 21:13యెహె 44:22
లేవీ. 21:15ఎజ్రా 9:2
లేవీ. 21:20ద్వితీ 23:1
లేవీ. 21:22లేవీ 2:10; 6:14, 16; 24:8, 9; సం 18:9
లేవీ. 21:22లేవీ 22:10; సం 18:19
లేవీ. 21:23నిర్గ 30:6
లేవీ. 21:23నిర్గ 38:1
లేవీ. 21:23నిర్గ 25:8
లేవీ. 21:23నిర్గ 28:41
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 21:1-24

లేవీయకాండం

21 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు యాజకులైన అహరోను కుమారులతో ఇలా చెప్పు: ‘తన ప్రజల్లో ఎవరైనా చనిపోతే యాజకుడు ఆ వ్యక్తి కోసం తనను తాను మలినపర్చుకోకూడదు.+ 2 కానీ చనిపోయిన వ్యక్తి తన సమీప రక్తసంబంధి అయితే, ఆ వ్యక్తి కోసం, అంటే తల్లి కోసం, తండ్రి కోసం, కుమారుడి కోసం, కూతురు కోసం, సహోదరుడి కోసం తనను తాను మలినపర్చుకోవచ్చు. 3 అంతేకాదు, తన దగ్గర ఉంటున్న పెళ్లికాని* సహోదరి కోసం అతను తనను తాను మలినపర్చుకోవచ్చు. 4 అయితే తన ప్రజల్లో ఒకరికి భార్యగా ఉన్న స్త్రీ కోసం అతను తనను తాను మలినపర్చుకోకూడదు, అపవిత్రపర్చుకోకూడదు. 5 వాళ్లు తమ తలను బోడి చేసుకోకూడదు,+ తమ గడ్డం పక్కల్ని కత్తిరించుకోకూడదు, తమ శరీరాన్ని కోసుకోకూడదు.+ 6 వాళ్లు తమ దేవుని కోసం పవిత్రంగా ఉండాలి,+ వాళ్లు తమ దేవుని పేరును అపవిత్రపర్చకూడదు;+ ఎందుకంటే వాళ్లు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్ని, అంటే తమ దేవుని రొట్టెను* అర్పిస్తున్నారు కాబట్టి వాళ్లు పవిత్రులుగా ఉండాలి.+ 7 యాజకుడు వేశ్యను+ గానీ, కన్యాత్వం కోల్పోయిన స్త్రీని గానీ, విడాకులైన స్త్రీని గానీ పెళ్లి చేసుకోకూడదు.+ ఎందుకంటే అతను తన దేవుని దృష్టిలో పవిత్రుడు. 8 అతను నీ దేవుని రొట్టెను అర్పించే వ్యక్తి కాబట్టి నువ్వు అతన్ని శుద్ధీకరించాలి.+ అతను నీ దృష్టిలో పవిత్రుడిగా ఉండాలి, ఎందుకంటే మిమ్మల్ని పవిత్రపరుస్తున్న యెహోవానైన నేను పవిత్రుణ్ణి.+

9 “ ‘ఒక యాజకుడి కూతురు వేశ్య అయ్యి తనను తాను అపవిత్రపర్చుకుంటే ఆమె తన తండ్రిని అపవిత్రపర్చినట్టే. ఆమెను మంటల్లో కాల్చేయాలి.+

10 “ ‘యాజకులైన తన సహోదరుల మధ్య ఎవరైతే ప్రధానయాజకుడిగా నియమించబడతాడో అంటే ఎవరి తలమీదైతే అభిషేక తైలం పోయబడుతుందో,+ ఎవరైతే ప్రత్యేకమైన యాజక వస్త్రాలు వేసుకోవడానికి ప్రతిష్ఠించబడతారో*+ అతను తన జుట్టును విరబోసుకోకూడదు, తన వస్త్రాల్ని చింపుకోకూడదు.+ 11 అతను చనిపోయిన ఏ వ్యక్తి* దగ్గరికీ వెళ్లకూడదు;+ ఆఖరికి తన తండ్రి కోసం లేదా తల్లి కోసం కూడా తనను తాను మలినపర్చుకోకూడదు. 12 అతను పవిత్రమైన స్థలం నుండి బయటికి వెళ్లకూడదు, తన దేవుని పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చకూడదు.+ ఎందుకంటే సమర్పణకు సూచనగా ఉన్న తన దేవుని అభిషేక తైలం+ అతని మీద ఉంది. నేను యెహోవాను.

13 “ ‘అతను కన్యగా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి.+ 14 అతను విధవరాలిని గానీ, విడాకులైన స్త్రీని గానీ, కన్యాత్వం కోల్పోయిన స్త్రీని గానీ, వేశ్యను గానీ పెళ్లి చేసుకోకూడదు; కానీ తన ప్రజల్లో నుండి ఒక కన్యను పెళ్లి చేసుకోవాలి. 15 అతను తన ప్రజల మధ్య తన సంతానాన్ని అపవిత్రపర్చుకోకూడదు;+ ఎందుకంటే నేను అతన్ని పవిత్రపరుస్తున్న యెహోవాను.’ ”

16 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 17 “అహరోనుతో ఇలా చెప్పు: ‘తరతరాలపాటు నీ సంతానంలో లోపం ఉన్న ఏ వ్యక్తీ తన దేవుని రొట్టెను అర్పించడానికి రాకూడదు. 18 లోపమున్న ఇలాంటివాళ్లు రొట్టెను అర్పించడానికి రాకూడదు: గుడ్డివాడు, కుంటివాడు, ముక్కిడివాడు,* చాలా పొడవాటి కాలు లేదా చెయ్యి ఉన్నవాడు, 19 కాలు లేదా చెయ్యి విరిగినవాడు, 20 గూనివాడు, మరగుజ్జువాడు,* కంటి సమస్య ఉన్నవాడు, గజ్జి ఉన్నవాడు, తామర ఉన్నవాడు, వృషణాలు నలిగినవాడు.+ 21 యాజకుడైన అహరోను సంతానంలో లోపమున్న ఏ పురుషుడూ యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణలు అర్పించడానికి రాకూడదు. అతనికి లోపం ఉంది కాబట్టి అతను తన దేవుని రొట్టెను అర్పించడానికి రాకూడదు. 22 అతను తన దేవుని రొట్టెను అంటే అతి పవిత్రమైన వాటిని,+ పవిత్రమైన వాటిని+ తినొచ్చు. 23 కానీ అతను తెర+ దగ్గరికి, బలిపీఠం+ దగ్గరికి రాకూడదు; ఎందుకంటే అతనికి లోపం ఉంది; అతను నా పవిత్రమైన స్థలాన్ని+ అపవిత్రపర్చకూడదు, ఎందుకంటే నేను వాళ్లను పవిత్రపరుస్తున్న+ యెహోవాను.’ ”

24 కాబట్టి మోషే అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి