కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • ధాన్యార్పణ (1-16)

లేవీయకాండం 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:17; సం 15:2-4
  • +నిర్గ 29:1-3; లేవీ 6:14, 15; సం 7:13

లేవీయకాండం 2:2

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాతినిధ్య.”

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 5:25, 26

లేవీయకాండం 2:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:9, 10
  • +లేవీ 10:12; సం 18:9

లేవీయకాండం 2:4

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:26, 28; సం 6:13, 19

లేవీయకాండం 2:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:20, 21

లేవీయకాండం 2:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 28:9

లేవీయకాండం 2:9

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాతినిధ్య.”

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:2; 5:11, 12
  • +నిర్గ 29:38-41; సం 28:4-6

లేవీయకాండం 2:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:9

లేవీయకాండం 2:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:14, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2020, పేజీ 2

    కావలికోట,

    5/15/2004, పేజీ 22

లేవీయకాండం 2:12

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:19; సం 15:20; 2ది 31:5; సామె 3:9

లేవీయకాండం 2:13

అధస్సూచీలు

  • *

    లేదా “నిబంధనను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 43:23, 24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 22

    8/15/1999, పేజీ 32

లేవీయకాండం 2:14

అధస్సూచీలు

  • *

    లేదా “పచ్చని వెన్నుల్లోని గింజల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:16; 34:22; సం 28:26

లేవీయకాండం 2:16

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాతినిధ్య.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:11, 12; 6:14, 15

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 2:1లేవీ 9:17; సం 15:2-4
లేవీ. 2:1నిర్గ 29:1-3; లేవీ 6:14, 15; సం 7:13
లేవీ. 2:2సం 5:25, 26
లేవీ. 2:3లేవీ 7:9, 10
లేవీ. 2:3లేవీ 10:12; సం 18:9
లేవీ. 2:4లేవీ 8:26, 28; సం 6:13, 19
లేవీ. 2:5లేవీ 6:20, 21
లేవీ. 2:6సం 28:9
లేవీ. 2:9లేవీ 2:2; 5:11, 12
లేవీ. 2:9నిర్గ 29:38-41; సం 28:4-6
లేవీ. 2:10సం 18:9
లేవీ. 2:11లేవీ 6:14, 17
లేవీ. 2:12నిర్గ 23:19; సం 15:20; 2ది 31:5; సామె 3:9
లేవీ. 2:13యెహె 43:23, 24
లేవీ. 2:14నిర్గ 23:16; 34:22; సం 28:26
లేవీ. 2:16లేవీ 5:11, 12; 6:14, 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 2:1-16

లేవీయకాండం

2 “ ‘ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ+ అర్పించాలనుకుంటే అతను మెత్తని పిండిని తీసుకురావాలి. అతను దానిమీద నూనె పోసి, దానిపైన సాంబ్రాణి పెట్టాలి.+ 2 తర్వాత అతను దాన్ని యాజకులైన అహరోను కుమారుల దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు యాజకుడు పిడికెడు పిండిని, నూనెను, ఆ సాంబ్రాణి అంతటినీ తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తూ జ్ఞాపకార్థ* భాగంగా+ దాన్ని అర్పించాలి. ఇది అగ్నితో అర్పించే అర్పణ, యెహోవాకు ఇంపైన* సువాసన. 3 ధాన్యార్పణలో మిగిలిందంతా అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.+ అది అగ్నితో యెహోవాకు అర్పించే వాటిలోనిది, అతి పవిత్రమైనది.+

4 “ ‘ఒకవేళ నువ్వు పొయ్యిలో కాల్చిన వాటిని ధాన్యార్పణగా అర్పించాలనుకుంటే, అవి మెత్తని పిండితో చేసినవై ఉండాలి. అవి పులవని పిండితో చేసి నూనె కలిపిన భక్ష్యాలు* గానీ నూనె పూసిన అప్పడాలు గానీ అయ్యుండాలి.+

5 “ ‘ఒకవేళ నువ్వు పెనం మీద కాల్చిన వాటిని ధాన్యార్పణగా అర్పించాలనుకుంటే,+ అవి పులవని మెత్తని పిండిలో నూనె కలిపి చేసినవై ఉండాలి. 6 వాటిని ముక్కలుముక్కలుగా విరవాలి, నువ్వు వాటిమీద నూనె పోయాలి.+ ఇది ధాన్యార్పణ.

7 “ ‘ఒకవేళ నువ్వు మూకుడులో కాల్చిన వాటిని ధాన్యార్పణగా అర్పించాలనుకుంటే, అవి నూనె కలిపి మెత్తని పిండితో చేసినవై ఉండాలి. 8 వాటితో తయారుచేసిన ధాన్యార్పణను నువ్వు యెహోవా దగ్గరికి తీసుకురావాలి; దాన్ని నువ్వు యాజకునికి ఇవ్వాలి. అతను దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. 9 యాజకుడు ధాన్యార్పణలో నుండి కొంత జ్ఞాపకార్థ* భాగంగా తీసుకొని,+ బలిపీఠం మీద పొగ పైకిలేచేలా దాన్ని కాలుస్తాడు. అది అగ్నితో అర్పించే అర్పణ, యెహోవాకు ఇంపైన* సువాసన.+ 10 ధాన్యార్పణలో మిగిలిందంతా అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. అది అగ్నితో యెహోవాకు అర్పించే వాటిలోనిది, అతి పవిత్రమైనది.+

11 “ ‘పులిసిన దేన్నీ యెహోవాకు ధాన్యార్పణగా అర్పించకూడదు.+ యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా పులిసిన పిండిని గానీ తేనెను గానీ పొగ పైకిలేచేలా కాల్చకూడదు.

12 “ ‘నువ్వు వాటిని యెహోవాకు ప్రథమఫలాలుగా అర్పించవచ్చు,+ కానీ ఆయనకు ఇంపైన* సువాసనగా వాటిని బలిపీఠం మీద అర్పించకూడదు.

13 “ ‘నువ్వు అర్పించే ప్రతీ ధాన్యార్పణలో ఉప్పు కలపాలి; దేవుని ఒప్పందాన్ని* గుర్తుచేసే ఉప్పును నువ్వు నీ ధాన్యార్పణలన్నిట్లో ఖచ్చితంగా కలపాలి. నువ్వు అర్పించే ప్రతీ ధాన్యార్పణతో పాటు ఉప్పు అర్పించాలి.+

14 “ ‘నువ్వు మొదట పండిన పంటలో నుండి యెహోవాకు ధాన్యార్పణను అర్పించాలనుకుంటే, కొత్త ధాన్యాన్ని* మంట మీద వేయించి, పైపైన దంచి తీసుకురావాలి. అది మొదట పండిన నీ పంటలో నుండి నువ్వు అర్పించే ధాన్యార్పణ.+ 15 నువ్వు దానిమీద నూనె పోసి, దానిపైన సాంబ్రాణి పెట్టాలి. ఇది ధాన్యార్పణ. 16 పైపైన దంచిన ఆ ధాన్యంలో కొంత భాగాన్ని, నూనెను, సాంబ్రాణి అంతటినీ తీసుకొని యాజకుడు పొగ పైకిలేచేలా జ్ఞాపకార్థ* భాగంగా దాన్ని కాలుస్తాడు.+ ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి