కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • అంతం వచ్చింది (1-27)

        • ఒక అసాధారణ విపత్తు (5)

        • వెండిని వీధుల్లో పడేస్తారు (19)

        • ఆలయాన్ని అపవిత్రపరుస్తారు (22)

యెహెజ్కేలు 7:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 5:11
  • +యిర్మీ 16:18; యెహె 16:43
  • +యెహె 6:13

యెహెజ్కేలు 7:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:12; దాని 9:12

యెహెజ్కేలు 7:7

అధస్సూచీలు

  • *

    లేదా “పూలదండ” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెఫ 1:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2007, పేజీ 11

యెహెజ్కేలు 7:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 34:21
  • +యిర్మీ 7:20; యెహె 5:13

యెహెజ్కేలు 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 13:14
  • +యెష 66:6; యెహె 33:29

యెహెజ్కేలు 7:10

అధస్సూచీలు

  • *

    లేదా “పూలదండ” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెఫ 1:14

యెహెజ్కేలు 7:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 59:6; యిర్మీ 6:7; మీకా 6:12

యెహెజ్కేలు 7:12

అధస్సూచీలు

  • *

    అంటే, నాశనం అందరి మీదికి వస్తుంది కాబట్టి ఆస్తిని కొనేవాడు గానీ అమ్మేవాడు గానీ లాభం పొందడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెఫ 1:18

యెహెజ్కేలు 7:13

అధస్సూచీలు

  • *

    లేదా “తన దోషం ద్వారా” అయ్యుంటుంది.

యెహెజ్కేలు 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:5
  • +యిర్మీ 7:20; 12:12

యెహెజ్కేలు 7:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:25
  • +యిర్మీ 14:18; యెహె 5:12

యెహెజ్కేలు 7:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 59:11

యెహెజ్కేలు 7:17

అధస్సూచీలు

  • *

    అంటే, భయంతో మూత్ర విసర్జన వల్ల.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 21:7

యెహెజ్కేలు 7:18

అధస్సూచీలు

  • *

    అంటే, దుఃఖంతో గుండు చేసుకుంటారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 3:24
  • +యెష 22:12

యెహెజ్కేలు 7:19

అధస్సూచీలు

  • *

    అంటే, వాళ్ల వెండిబంగారాలు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:4; జెఫ 1:18

యెహెజ్కేలు 7:20

అధస్సూచీలు

  • *

    అంటే, తమ వెండిబంగారు వస్తువులతో.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:1, 7; యిర్మీ 7:30

యెహెజ్కేలు 7:21

అధస్సూచీలు

  • *

    అంటే, విగ్రహాలు చేయడానికి ఉపయోగించిన వాళ్ల వెండిబంగారాల్ని.

యెహెజ్కేలు 7:22

అధస్సూచీలు

  • *

    యెహోవా పవిత్రమైన స్థలంలోని అత్యంత లోపలి భాగాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:17
  • +2ది 36:19; విలా 1:10

యెహెజ్కేలు 7:23

అధస్సూచీలు

  • *

    అంటే, చెరగా తీసుకెళ్లడానికి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 39:6, 7; విలా 3:7
  • +2రా 21:16; 24:3, 4; యిర్మీ 2:34; యెహె 9:9
  • +యెష 59:6; మీకా 2:2

యెహెజ్కేలు 7:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:48-51; యెహె 21:31; హబ 1:6
  • +యిర్మీ 6:12; విలా 5:2
  • +యెహె 21:2

యెహెజ్కేలు 7:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 57:21; యిర్మీ 8:15

యెహెజ్కేలు 7:26

అధస్సూచీలు

  • *

    లేదా “ధర్మశాస్త్రం.”

  • *

    లేదా “ఆలోచన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 21:1, 2; 37:17
  • +కీర్త 74:9; విలా 2:9; యెహె 20:3

యెహెజ్కేలు 7:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 52:10
  • +యెహె 6:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 7:4యెహె 5:11
యెహె. 7:4యిర్మీ 16:18; యెహె 16:43
యెహె. 7:4యెహె 6:13
యెహె. 7:52రా 21:12; దాని 9:12
యెహె. 7:7జెఫ 1:14
యెహె. 7:82ది 34:21
యెహె. 7:8యిర్మీ 7:20; యెహె 5:13
యెహె. 7:9యిర్మీ 13:14
యెహె. 7:9యెష 66:6; యెహె 33:29
యెహె. 7:10జెఫ 1:14
యెహె. 7:11యెష 59:6; యిర్మీ 6:7; మీకా 6:12
యెహె. 7:12జెఫ 1:18
యెహె. 7:14యిర్మీ 4:5
యెహె. 7:14యిర్మీ 7:20; 12:12
యెహె. 7:15లేవీ 26:25
యెహె. 7:15యిర్మీ 14:18; యెహె 5:12
యెహె. 7:16యెష 59:11
యెహె. 7:17యెహె 21:7
యెహె. 7:18యెష 3:24
యెహె. 7:18యెష 22:12
యెహె. 7:19సామె 11:4; జెఫ 1:18
యెహె. 7:202రా 21:1, 7; యిర్మీ 7:30
యెహె. 7:22యిర్మీ 18:17
యెహె. 7:222ది 36:19; విలా 1:10
యెహె. 7:23యిర్మీ 39:6, 7; విలా 3:7
యెహె. 7:232రా 21:16; 24:3, 4; యిర్మీ 2:34; యెహె 9:9
యెహె. 7:23యెష 59:6; మీకా 2:2
యెహె. 7:24ద్వితీ 28:48-51; యెహె 21:31; హబ 1:6
యెహె. 7:24యిర్మీ 6:12; విలా 5:2
యెహె. 7:24యెహె 21:2
యెహె. 7:25యెష 57:21; యిర్మీ 8:15
యెహె. 7:26యిర్మీ 21:1, 2; 37:17
యెహె. 7:26కీర్త 74:9; విలా 2:9; యెహె 20:3
యెహె. 7:27యిర్మీ 52:10
యెహె. 7:27యెహె 6:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 7:1-27

యెహెజ్కేలు

7 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశం గురించి ఇలా అంటున్నాడు: ‘అంతం వచ్చింది! దేశం నలుమూలల మీదికి అంతం వచ్చేసింది. 3 అంతం ఇప్పుడు నీ మీదికి వచ్చేసింది, నేను నీ మీద నా ఆగ్రహాన్ని పూర్తిగా వెళ్లగక్కుతాను, నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను. 4 నా కన్ను నీ మీద జాలిపడదు, నేను కనికరపడను.+ నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను, నీ అసహ్యమైన పనుల పర్యవసానాల్ని నువ్వు అనుభవిస్తావు.+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’+

5 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇదిగో! ఒక విపత్తు, ఒక అసాధారణ విపత్తు వస్తోంది.+ 6 ఒక అంతం రాబోతుంది; అది వస్తుంది; అది హఠాత్తుగా నీ మీదికి వస్తుంది. ఇదిగో! అది వస్తోంది. 7 దేశ నివాసీ, నీ వంతు* వచ్చేసింది. ఆ సమయం వస్తోంది, ఆ రోజు దగ్గరపడింది.+ పర్వతాల మీద సంతోష కేకలకు బదులు అల్లకల్లోలం వినిపిస్తోంది.

8 “ ‘అతి త్వరలో నేను నీ మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను,+ నీ మీద నా ఆగ్రహాన్ని పూర్తిగా వెళ్లగక్కుతాను,+ నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను. 9 నా కన్ను జాలిపడదు, నేను కనికరపడను.+ నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను, నీ అసహ్యమైన పనుల పర్యవసానాల్ని నువ్వు అనుభవిస్తావు. అప్పుడు యెహోవానైన నేను నిన్ను శిక్షిస్తున్నానని నువ్వు తెలుసుకుంటావు.+

10 “ ‘ఇదిగో, ఆ రోజు! ఇదిగో, అది వస్తోంది!+ నీ వంతు* వచ్చేసింది; దండం మొగ్గ తొడిగింది, అహంకారం మొలకెత్తింది. 11 దౌర్జన్యం దుష్ట దండంగా మారింది.+ వాళ్లు గానీ, వాళ్ల సంపద గానీ, వాళ్ల సమూహాలు గానీ, వాళ్ల ఘనత గానీ మిగలవు. 12 ఆ సమయం వస్తుంది, ఆ రోజు వస్తుంది. కొనేవాడు సంతోషించకూడదు, అమ్మేవాడు ఏడ్వకూడదు, ఎందుకంటే వాళ్ల సమూహమంతటి మీద నా ఆగ్రహం రగులుకుంది.*+ 13 అమ్మినవాడు ప్రాణాలతో తప్పించుకున్నా తాను అమ్మినదాని దగ్గరికి తిరిగిరాడు, ఎందుకంటే ఈ దర్శనంలోని విషయాలు సమూహమంతటి మీదికి వస్తాయి. ఎవ్వరూ తిరిగిరారు, తన దోషం కారణంగా* ఎవ్వరూ ప్రాణాలు కాపాడుకోలేరు.

14 “ ‘వాళ్లు బాకా ఊదారు,+ ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవ్వరూ యుద్ధానికి వెళ్లడం లేదు; ఎందుకంటే నా ఆగ్రహం సమూహమంతటి మీద రగులుకుంది.+ 15 బయట ఖడ్గం ఉంది,+ లోపలేమో తెగులు, కరువు ఉన్నాయి. పొలంలో ఉన్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, నగరంలో ఉన్నవాళ్లను కరువు, తెగులు మింగేస్తాయి.+ 16 ఏదోరకంగా తప్పించుకున్నవాళ్లు పర్వతాలకు వెళ్తారు, లోయల్లో నివసించే పావురాల్లా ప్రతీ వ్యక్తి తన దోషాన్ని బట్టి మూల్గుతాడు.+ 17 వాళ్లందరి చేతులు చచ్చుబడిపోతాయి, వాళ్లందరి మోకాళ్ల మీదుగా నీళ్లు కారతాయి.*+ 18 వాళ్లు గోనెపట్ట కట్టుకున్నారు,+ వాళ్లకు భయం పట్టుకుంది. ప్రతీ ఒక్కరు అవమానాలపాలు అవుతారు, ప్రతీ తల బోడి అవుతుంది.*+

19 “ ‘వాళ్లు తమ వెండిని వీధుల్లో పడేస్తారు, తమ బంగారాన్ని అసహ్యించుకుంటారు. యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, బంగారం గానీ వాళ్లను రక్షించలేదు.+ వాళ్లకు తృప్తి ఉండదు, వాళ్ల కడుపు నిండదు, ఎందుకంటే అది* వాళ్లకు అడ్డుగా తయారై వాళ్ల దోషానికి కారణమైంది. 20 వాళ్లు తమ ఆభరణాల అందాన్ని చూసుకొని గర్వపడ్డారు, వాటితో* తమ అసహ్యమైన ప్రతిమల్ని, హేయమైన విగ్రహాల్ని చేసుకున్నారు.+ అందుకే వాళ్లు దాన్ని అసహ్యించుకునేలా చేస్తాను. 21 నేను దాన్ని* విదేశీయులకు దోపుడుసొమ్ముగా, భూమ్మీది దుష్టులకు కొల్లసొమ్ముగా ఇస్తాను, వాళ్లు దాన్ని అపవిత్రపరుస్తారు.

22 “ ‘నేను వాళ్ల నుండి నా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాను,+ వాళ్లు నా చాటైన చోటును* అపవిత్రపరుస్తారు, దోపిడీదారులు దానిలోకి ప్రవేశించి దాన్ని అపవిత్రపరుస్తారు.+

23 “ ‘సంకెళ్లు*+ తయారుచేయండి; ఎందుకంటే దేశం రక్తసిక్తమైన తీర్పులతో,+ నగరం దౌర్జన్యంతో నిండిపోయాయి.+ 24 జనాలన్నిట్లో అత్యంత ఘోరమైనవాళ్లను నేను రప్పిస్తాను,+ వాళ్లు దేశ నివాసుల ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు,+ నేను బలాఢ్యుల గర్వాన్ని పూర్తిగా అణచివేస్తాను, వాళ్ల పవిత్రమైన స్థలాలు అపవిత్రపర్చబడతాయి.+ 25 వేదన వచ్చినప్పుడు వాళ్లు శాంతి కోసం వెదుకుతారు, కానీ అది దొరకదు.+ 26 ఒక విపత్తు తర్వాత మరో విపత్తు, ఒక నివేదిక తర్వాత మరో నివేదిక వస్తుంటాయి, ప్రజలు ప్రవక్త దగ్గర దర్శనం కోసం చూస్తారు,+ అయితే యాజకుల దగ్గర ఉపదేశం,* పెద్దల దగ్గర సలహా* లేకుండా పోతాయి.+ 27 రాజు ఏడుస్తుంటాడు,+ ప్రధానుడు నిరాశలో మునిగిపోతాడు, దేశ ప్రజల చేతులు భయంతో వణికిపోతాయి. నేను వాళ్ల మార్గాల ప్రకారం వాళ్లతో వ్యవహరిస్తాను, వాళ్లు తీర్పు తీర్చినట్టే వాళ్లకు తీర్పు తీరుస్తాను. అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి