కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 43
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఆలయం యెహోవా మహిమతో నిండిపోవడం (1-12)

      • బలిపీఠం (13-27)

యెహెజ్కేలు 43:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 40:6; 44:1

యెహెజ్కేలు 43:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 9:3; 11:23
  • +యెహె 1:24; యోహా 12:28, 29
  • +యెష 6:3; యెహె 10:4

యెహెజ్కేలు 43:3

అధస్సూచీలు

  • *

    లేదా “ఆయన” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 1:3, 4

యెహెజ్కేలు 43:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 10:19; 44:1, 2

యెహెజ్కేలు 43:5

అధస్సూచీలు

  • *

    ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:34; 1రా 8:10

యెహెజ్కేలు 43:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 40:3

యెహెజ్కేలు 43:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 6:1; యిర్మీ 3:17; యెహె 1:26
  • +1ది 28:2
  • +నిర్గ 29:45; కీర్త 68:16; 132:14; యోవే 3:17
  • +యెహె 39:7; జెక 13:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2007, పేజీ 10

    యెషయా ప్రవచనం II, పేజీ 397

యెహెజ్కేలు 43:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 8:3
  • +దాని 9:12

యెహెజ్కేలు 43:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 37:23, 26; 2కొ 6:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2007, పేజీ 10

    3/1/1999, పేజీలు 9, 12-13

    యెషయా ప్రవచనం II, పేజీ 397

యెహెజ్కేలు 43:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొలవాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:63
  • +యెహె 40:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    9/2017, పేజీ 2

    ప్రకటన ముగింపు, పేజీ 162

యెహెజ్కేలు 43:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 44:5
  • +యెహె 11:19, 20; 36:27

యెహెజ్కేలు 43:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 93:5; యెహె 40:2; 42:20

యెహెజ్కేలు 43:13

అధస్సూచీలు

  • *

    ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.

  • *

    దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 27:1; 2ది 4:1

యెహెజ్కేలు 43:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 27:2; ప్రక 9:13

యెహెజ్కేలు 43:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 38:1; 2ది 4:1

యెహెజ్కేలు 43:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:29; లేవీ 1:5; 8:18-21; యెహె 45:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1999, పేజీలు 19-20

యెహెజ్కేలు 43:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 40:46; 44:15; 48:11
  • +నిర్గ 29:10; లేవీ 8:14

యెహెజ్కేలు 43:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:36, 37; లేవీ 8:15; హెబ్రీ 9:23

యెహెజ్కేలు 43:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:14; లేవీ 8:17; హెబ్రీ 13:11

యెహెజ్కేలు 43:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:13

యెహెజ్కేలు 43:25

అధస్సూచీలు

  • *

    లేదా “పరిపూర్ణ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:35

యెహెజ్కేలు 43:27

అధస్సూచీలు

  • *

    అంటే, ప్రజల.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:1
  • +యెహె 20:40

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 43:1యెహె 40:6; 44:1
యెహె. 43:2యెహె 9:3; 11:23
యెహె. 43:2యెహె 1:24; యోహా 12:28, 29
యెహె. 43:2యెష 6:3; యెహె 10:4
యెహె. 43:3యెహె 1:3, 4
యెహె. 43:4యెహె 10:19; 44:1, 2
యెహె. 43:5నిర్గ 40:34; 1రా 8:10
యెహె. 43:6యెహె 40:3
యెహె. 43:7యెష 6:1; యిర్మీ 3:17; యెహె 1:26
యెహె. 43:71ది 28:2
యెహె. 43:7నిర్గ 29:45; కీర్త 68:16; 132:14; యోవే 3:17
యెహె. 43:7యెహె 39:7; జెక 13:2
యెహె. 43:8యెహె 8:3
యెహె. 43:8దాని 9:12
యెహె. 43:9యెహె 37:23, 26; 2కొ 6:16
యెహె. 43:10యెహె 16:63
యెహె. 43:10యెహె 40:4
యెహె. 43:11యెహె 44:5
యెహె. 43:11యెహె 11:19, 20; 36:27
యెహె. 43:12కీర్త 93:5; యెహె 40:2; 42:20
యెహె. 43:13నిర్గ 27:1; 2ది 4:1
యెహె. 43:15నిర్గ 27:2; ప్రక 9:13
యెహె. 43:16నిర్గ 38:1; 2ది 4:1
యెహె. 43:18నిర్గ 40:29; లేవీ 1:5; 8:18-21; యెహె 45:19
యెహె. 43:19యెహె 40:46; 44:15; 48:11
యెహె. 43:19నిర్గ 29:10; లేవీ 8:14
యెహె. 43:20నిర్గ 29:36, 37; లేవీ 8:15; హెబ్రీ 9:23
యెహె. 43:21నిర్గ 29:14; లేవీ 8:17; హెబ్రీ 13:11
యెహె. 43:24లేవీ 2:13
యెహె. 43:25నిర్గ 29:35
యెహె. 43:27లేవీ 9:1
యెహె. 43:27యెహె 20:40
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 43:1-27

యెహెజ్కేలు

43 తర్వాత అతను నన్ను తూర్పు ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు.+ 2 అక్కడ నేను ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు వైపు నుండి రావడం+ చూశాను, ఆయన స్వరం ప్రవాహాల శబ్దంలా ఉంది;+ ఆయన మహిమ వల్ల భూమి ప్రకాశించింది.+ 3 నేను చూసింది, నేను* నగరాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు చూసిన దర్శనంలా ఉంది. అది కెబారు నది దగ్గర నేను చూసిన దానిలా కనిపించింది;+ దాంతో నేను నేల మీద సాష్టాంగపడ్డాను.

4 అప్పుడు యెహోవా మహిమ తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.+ 5 ఒక శక్తి* నన్ను లేపి లోపలి ప్రాంగణంలోకి తీసుకొచ్చింది, ఆలయం యెహోవా మహిమతో నిండివుండడం నేను చూశాను.+ 6 అప్పుడు ఆలయంలో నుండి ఒక వ్యక్తి నాతో మాట్లాడడం నేను విన్నాను, ఆ మనిషి వచ్చి నా పక్కన నిలబడ్డాడు.+ 7 ఆయన నాతో ఇలా అన్నాడు:

“మానవ కుమారుడా, ఇది నా సింహాసనం ఉండే స్థలం,+ నేను నా పాదాలు నిలిపే స్థలం.+ ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎప్పటికీ నివసిస్తాను.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లూ, వాళ్ల రాజులూ తమ ఆధ్యాత్మిక వ్యభిచారంతో, వాళ్ల రాజులు చనిపోయినప్పుడు వాళ్ల కళేబరాలతో నా పవిత్రమైన పేరును ఇక అపవిత్రపర్చరు.+ 8 వాళ్లు నా గడప పక్కనే తమ గుళ్ల గడపల్ని, నా ద్వారబంధాల పక్కనే వాళ్ల గుళ్ల ద్వారబంధాల్ని పెట్టి తమ అసహ్యమైన పనులతో నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చారు; నాకూ వాటికీ మధ్య కేవలం ఒక గోడే అడ్డుగా ఉంది.+ వాళ్లు అలా చేశారు కాబట్టి నేను కోపంతో వాళ్లను తుడిచిపెట్టేశాను.+ 9 ఇప్పుడు వాళ్లు తమ ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని, తమ రాజుల కళేబరాల్ని నాకు దూరంగా పెట్టాలి, అలాచేస్తే నేను ఎప్పటికీ వాళ్ల మధ్య నివసిస్తాను.+

10 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ తప్పుల్ని బట్టి సిగ్గుపడేలా+ నువ్వు ఆలయం గురించి వాళ్లకు వివరంగా చెప్పు,+ వాళ్లు దాని నమూనాను పరిశీలించాలి.* 11 ఒకవేళ వాళ్లు తాము చేసిన దానంతటి గురించి సిగ్గుపడితే, నువ్వు వాళ్లకు ఆలయ రేఖాచిత్రాన్ని, దాని నమూనాను, బయటికీ లోపలికీ వెళ్లే దారుల్ని తెలియజేయాలి.+ వాళ్లకు దాని రేఖాచిత్రాలు, శాసనాలు, నియమాలు అన్నిటినీ చూపించు. వాళ్ల కళ్లముందు వాటిని రాయి. అప్పుడు వాళ్లు దాని రేఖాచిత్రాన్ని గమనించి, దాని శాసనాల్ని పాటించగలుగుతారు.+ 12 ఇది ఆలయానికి సంబంధించిన నియమం. పర్వతం మీద ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతమంతా అతి పవిత్రం.+ ఇదిగో! ఇది ఆలయానికి సంబంధించిన నియమం.

13 “ఇవి మూర (ప్రతీ మూరకు ఒక బెత్తెడు జతచేయబడింది)* కొలత ప్రకారం బలిపీఠానికి సంబంధించిన కొలతలు.+ దాని అడుగుభాగం ఒక మూర ఎత్తు, ఒక మూర వెడల్పు ఉంది. దానికి నాలుగువైపులా జేనడు* చూరు ఉంది. ఇది బలిపీఠం అడుగుభాగం. 14 నేలమీదున్న ఆ అడుగుభాగం మీద చుట్టూ ఒక అంచు ఉంది, దాని ఎత్తు రెండు మూరలు, వెడల్పు ఒక మూర. ఈ చిన్న అంచు మీద చుట్టూ పెద్ద అంచు ఉంది, దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర. 15 బలిపీఠం కొలిమి నాలుగు మూరల ఎత్తు ఉంది, బలిపీఠం కొలిమి నుండి నాలుగు కొమ్ములు పైకి ఉన్నాయి.+ 16 బలిపీఠం కొలిమి చతురస్రాకారంలో ఉంది, దాని పొడవు 12 మూరలు, వెడల్పు 12 మూరలు.+ 17 దాని చుట్టూ ఉన్న అంచు 14 మూరల పొడవు, 14 మూరల వెడల్పు ఉంది; దాని చుట్టూ ఉన్న చూరు అర మూర ఉంది, దాని అడుగుభాగం అన్నివైపులా ఒక మూర ఉంది.

“దాని మెట్లు తూర్పు వైపుకు ఉన్నాయి.”

18 తర్వాత అతను నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘సంపూర్ణ దహనబలులు అర్పించడానికి, రక్తాన్ని చిలకరించడానికి బలిపీఠాన్ని చేసేటప్పుడు ఈ నిర్దేశాలు పాటించాలి.’+

19 “ ‘నాకు పరిచారం చేయడానికి నన్ను సమీపించే సాదోకు వంశస్థులైన లేవి యాజకులకు+ నువ్వు పాపపరిహారార్థ బలిగా మందలో నుండి ఒక కోడెదూడను ఇవ్వాలి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 20 ‘నువ్వు దాని రక్తంలో కొంచెం తీసుకొని, బలిపీఠం నాలుగు కొమ్ముల మీద, దాని చుట్టూ ఉన్న అంచు నాలుగు మూలల మీద, అలాగే చుట్టూ ఉన్న చూరు మీద రాయాలి. అలా నువ్వు బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేసి, దానికి ప్రాయశ్చిత్తం చేస్తావు.+ 21 తర్వాత పాపపరిహారార్థ బలిని అంటే కోడెదూడను తీసుకుని, ఆలయంలో నిర్ణయించబడిన చోట, పవిత్రమైన స్థలం బయట దాన్ని కాల్చేయాలి.+ 22 రెండో రోజు నువ్వు ఏ లోపంలేని మేకపోతును పాపపరిహారార్థ బలిగా అర్పించాలి; వాళ్లు కోడెదూడతో శుద్ధి చేసినట్టే బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేస్తారు.’

23 “ ‘నువ్వు దాన్ని పాపం నుండి శుద్ధి చేశాక, మందలో నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడను, ఏ లోపంలేని పొట్టేలును అర్పించాలి. 24 నువ్వు వాటిని యెహోవా సన్నిధికి తేవాలి; అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి,+ యెహోవాకు సంపూర్ణ దహనబలిగా అర్పిస్తారు. 25 ఏడురోజుల పాటు నువ్వు ప్రతీరోజు ఒక మేకపోతును పాపపరిహారార్థ బలిగా అర్పించాలి,+ అలాగే మందలో నుండి ఒక కోడెదూడను, ఒక పొట్టేలును అర్పించాలి; నువ్వు ఏ దోషంలేని* జంతువుల్ని అర్పించాలి. 26 ఏడురోజుల పాటు వాళ్లు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వాళ్లు దాన్ని శుద్ధి చేసి ప్రతిష్ఠించాలి. 27 ఆ రోజులు పూర్తయ్యాక, ఎనిమిదో రోజున+ అలాగే అప్పటినుండి యాజకులు మీ* సంపూర్ణ దహనబలుల్ని, సమాధాన బలుల్ని బలిపీఠం మీద అర్పిస్తారు; నేను మీ విషయంలో సంతోషిస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి