కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 37
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఎండిపోయిన ఎముకల లోయ దర్శనం (1-14)

      • రెండు కర్రల్ని ఒక్కటి చేయడం (15-28)

        • ఒకే రాజు కింద ఒక్క రాజ్యంగా (22)

        • శాశ్వతమైన శాంతి ఒప్పందం (26)

యెహెజ్కేలు 37:1

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 21:10

యెహెజ్కేలు 37:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 37:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2016, పేజీలు 29-30

యెహెజ్కేలు 37:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:39; 1స 2:6

యెహెజ్కేలు 37:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:7; యెహె 37:14

యెహెజ్కేలు 37:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2016, పేజీలు 29-31

యెహెజ్కేలు 37:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2016, పేజీలు 29-31

యెహెజ్కేలు 37:9

అధస్సూచీలు

  • *

    లేదా “ఊపిరీ.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

యెహెజ్కేలు 37:10

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 11:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2016, పేజీలు 29-31

యెహెజ్కేలు 37:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 36:10
  • +యెష 49:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2016, పేజీలు 29-30

యెహెజ్కేలు 37:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 66:14
  • +యెహె 11:17; ఆమో 9:14

యెహెజ్కేలు 37:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 126:2

యెహెజ్కేలు 37:14

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 32:14, 15; యెహె 36:27

యెహెజ్కేలు 37:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 15:9; 30:11
  • +1రా 11:31; 12:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2022, పేజీ 22

    కావలికోట (అధ్యయన),

    1/2018, పేజీ 14

    కావలికోట (అధ్యయన),

    7/2016, పేజీలు 31-32

యెహెజ్కేలు 37:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:13; యిర్మీ 3:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2022, పేజీ 22

    కావలికోట (అధ్యయన),

    1/2018, పేజీ 14

    కావలికోట (అధ్యయన),

    7/2016, పేజీలు 31-32

యెహెజ్కేలు 37:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:4; జెక 10:6

యెహెజ్కేలు 37:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:12; యిర్మీ 16:14, 15; ఆమో 9:14

యెహెజ్కేలు 37:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 3:18; హోషే 1:11
  • +ఆది 49:10; కీర్త 2:6; యెష 9:6; యిర్మీ 23:5; లూకా 1:32
  • +యెహె 37:19

యెహెజ్కేలు 37:23

అధస్సూచీలు

  • *

    ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 13:2
  • +యిర్మీ 31:33

యెహెజ్కేలు 37:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:5; హోషే 3:5; లూకా 1:32
  • +యోహా 10:16; 1పే 5:4
  • +ద్వితీ 30:8-10; యిర్మీ 32:39; యెహె 36:27

యెహెజ్కేలు 37:25

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులూ.”

  • *

    లేదా “అధిపతిగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 60:21; యోవే 3:20
  • +లూకా 1:32

యెహెజ్కేలు 37:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 30:19; జెక 8:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2010, పేజీలు 27-28

    1/1/1992, పేజీలు 21-22

యెహెజ్కేలు 37:27

అధస్సూచీలు

  • *

    లేదా “నివాస స్థలం; ఇల్లు.”

  • *

    లేదా “వాళ్లమీద.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 11:19, 20; 43:7; హోషే 2:23; ప్రక 21:3

యెహెజ్కేలు 37:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 36:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1992, పేజీ 22

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 37:1ప్రక 21:10
యెహె. 37:2యెహె 37:11
యెహె. 37:3ద్వితీ 32:39; 1స 2:6
యెహె. 37:5ఆది 2:7; యెహె 37:14
యెహె. 37:10ప్రక 11:11
యెహె. 37:11యెహె 36:10
యెహె. 37:11యెష 49:14
యెహె. 37:12యెష 66:14
యెహె. 37:12యెహె 11:17; ఆమో 9:14
యెహె. 37:13కీర్త 126:2
యెహె. 37:14యెష 32:14, 15; యెహె 36:27
యెహె. 37:162ది 15:9; 30:11
యెహె. 37:161రా 11:31; 12:20
యెహె. 37:17యెష 11:13; యిర్మీ 3:18
యెహె. 37:19యిర్మీ 50:4; జెక 10:6
యెహె. 37:21యెష 11:12; యిర్మీ 16:14, 15; ఆమో 9:14
యెహె. 37:22యిర్మీ 3:18; హోషే 1:11
యెహె. 37:22ఆది 49:10; కీర్త 2:6; యెష 9:6; యిర్మీ 23:5; లూకా 1:32
యెహె. 37:22యెహె 37:19
యెహె. 37:23జెక 13:2
యెహె. 37:23యిర్మీ 31:33
యెహె. 37:24యిర్మీ 23:5; హోషే 3:5; లూకా 1:32
యెహె. 37:24యోహా 10:16; 1పే 5:4
యెహె. 37:24ద్వితీ 30:8-10; యిర్మీ 32:39; యెహె 36:27
యెహె. 37:25యెష 60:21; యోవే 3:20
యెహె. 37:25లూకా 1:32
యెహె. 37:26యిర్మీ 30:19; జెక 8:5
యెహె. 37:27యెహె 11:19, 20; 43:7; హోషే 2:23; ప్రక 21:3
యెహె. 37:28యెహె 36:23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 37:1-28

యెహెజ్కేలు

37 తర్వాత, యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది, యెహోవా తన పవిత్రశక్తి* ద్వారా నన్ను తీసుకుపోయి ఒక లోయ మైదానం మధ్యలో దించాడు,+ దాని నిండా ఎముకలు ఉన్నాయి. 2 ఆయన వాటికి అన్నివైపులా నన్ను నడిపించాడు, ఆ లోయ మైదానంలో లెక్కలేనన్ని ఎముకలు ఉన్నాయి. అవి బాగా ఎండిపోయి ఉన్నాయి.+ 3 ఆయన నన్ను, “మానవ కుమారుడా, ఈ ఎముకలు మళ్లీ బ్రతకగలవా?” అని అడిగాడు. అందుకు నేను, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.+ 4 అప్పుడు ఆయన నాకు ఇలా చెప్పాడు: “ఈ ఎముకల గురించి ప్రవచించు, వాటితో ఇలా అను, ‘ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా చెప్పేది వినండి.

5 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఈ ఎముకలతో ఇలా అంటున్నాడు: “నేను మీలోకి ఊపిరి వచ్చేలా చేస్తాను, మీరు బ్రతుకుతారు.+ 6 నేను మీకు నరాల్ని, మాంసాన్ని ఇచ్చి చర్మంతో మిమ్మల్ని కప్పుతాను; మీలో ఊపిరి ఊదుతాను, మీరు బ్రతుకుతారు; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”

7 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను ప్రవచించాను. నేను ప్రవచిస్తుండగా, టపటప కొట్టుకుంటున్న శబ్దం వినిపించింది, ఆ ఎముకలు ఒకదాని దగ్గరికి ఒకటి రావడం మొదలుపెట్టాయి. 8 నేను ఇంకా చూస్తుండగా వాటి మీదికి నరాలు, మాంసం వచ్చాయి, చర్మం వాటిమీద కప్పుకుంది. కానీ వాటిలో ఇంకా ఊపిరి లేదు.

9 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “గాలితో ప్రవచించు. మానవ కుమారుడా, గాలితో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “గాలీ,* నలుదిక్కుల నుండి వచ్చి, చంపబడిన ఈ ప్రజలు బ్రతికేలా వాళ్ల మీద వీచు.” ’ ”

10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను ప్రవచించాను, అప్పుడు వాటిలోకి ఊపిరి* వచ్చింది; వాళ్లు బ్రతికి తమ పాదాల మీద నిలబడ్డారు,+ వాళ్లంతా పెద్ద సైన్యంగా ఉన్నారు.

11 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ+ ఈ ఎముకల్లా ఉన్నారు. వాళ్లు ఇలా అనుకుంటున్నారు, ‘మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ నశించిపోయింది.+ మనం పూర్తిగా వేరుచేయబడ్డాం.’ 12 కాబట్టి వాళ్లతో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరిచి,+ మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని లేపి, ఇశ్రాయేలు దేశానికి మిమ్మల్ని తీసుకొస్తాను.+ 13 నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరిచి, మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని లేపినప్పుడు, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’+ 14 ‘నేను నా పవిత్రశక్తిని* మీలో ఉంచుతాను, మీరు బ్రతుకుతారు,+ నేను మిమ్మల్ని మీ దేశంలో స్థిరపడేలా చేస్తాను; అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్పానని, నేనే దాన్ని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

15 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 16 “మానవ కుమారుడా, ఒక కర్ర తీసుకుని దానిమీద, ‘యూదాకు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెందినది’+ అని రాయి. ఇంకో కర్ర తీసుకుని దానిమీద, ‘ఎఫ్రాయిము కర్ర, యోసేపుకు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ చెందినది’+ అని రాయి. 17 తర్వాత, ఆ రెండు కర్రలు నీ చేతిలో ఒక్క కర్ర అయ్యేలా వాటిని కలిపి పట్టుకో.+ 18 నీ ప్రజలు, ‘వీటి అర్థం ఏంటో మాకు చెప్తావా?’ అని నిన్ను అడిగినప్పుడు, 19 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో ఉన్న ఇశ్రాయేలు గోత్రాల్ని తీసుకుని వాళ్లను యూదా కర్రతో కలుపుతాను; నేను వాటిని ఒకే కర్రగా చేస్తాను,+ అవి నా చేతిలో ఒకే కర్ర అవుతాయి.” ’ 20 నువ్వు రాసే కర్రలు వాళ్లు చూడగలిగేలా అవి నీ చేతిలో ఉండాలి.

21 “తర్వాత వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలీయుల్ని వాళ్లు వెళ్లిన జనాల్లో నుండి తీసుకొస్తాను, అన్ని దిక్కుల నుండి వాళ్లను సమకూర్చి వాళ్ల దేశానికి వాళ్లను తీసుకొస్తాను.+ 22 దేశంలో, ఇశ్రాయేలు పర్వతాల మీద వాళ్లను ఒకే జనాంగంగా చేస్తాను,+ వాళ్లందరి మీద ఒకే రాజు పరిపాలిస్తాడు,+ వాళ్లు ఇక రెండు జనాలుగా ఉండరు; రెండు రాజ్యాలుగా విడిపోయి ఉండరు.+ 23 ఇక తమ అసహ్యమైన విగ్రహాలతో,* హేయమైన పనులతో, తమ తప్పులన్నిటితో తమను తాము అపవిత్రపర్చుకోరు.+ వాళ్లు పాపం చేయడానికి కారణమైన వాళ్ల నమ్మకద్రోహం అంతటి నుండి నేను వాళ్లను కాపాడతాను, వాళ్లను శుద్ధి చేస్తాను. వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను.+

24 “ ‘ “నా సేవకుడైన దావీదు వాళ్లకు రాజుగా ఉంటాడు,+ వాళ్లందరికీ ఒకే కాపరి ఉంటాడు.+ వాళ్లు నా న్యాయనిర్ణయాల ప్రకారం నడుచుకుంటారు, నా శాసనాల్ని జాగ్రత్తగా పాటిస్తారు.+ 25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశంలో, అంటే మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్లు నివసిస్తారు; వాళ్లూ, వాళ్ల పిల్లలూ,* వాళ్ల పిల్లల పిల్లలూ ఎప్పటికీ అందులో నివసిస్తారు;+ నా సేవకుడైన దావీదు ఎప్పటికీ వాళ్ల ప్రధానుడిగా* ఉంటాడు.+

26 “ ‘ “నేను వాళ్లతో ఒక శాంతి ఒప్పందం చేస్తాను; అది శాశ్వత ఒప్పందంగా ఉంటుంది. నేను వాళ్లను స్థిరపర్చి, ఎక్కువమందిని చేస్తాను,+ నా పవిత్రమైన స్థలాన్ని ఎప్పటికీ వాళ్లమధ్య ఉంచుతాను. 27 నా డేరా* వాళ్లతోపాటు* ఉంటుంది, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.+ 28 నా పవిత్రమైన స్థలం ఎప్పటికీ వాళ్ల మధ్య ఉన్నప్పుడు, యెహోవానైన నేనే ఇశ్రాయేలును పవిత్రపరుస్తున్నానని జనాలు తెలుసుకుంటాయి.” ’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి