కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 35
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • శేయీరు పర్వతాలకు వ్యతిరేకంగా ప్రవచనం (1-15)

యెహెజ్కేలు 35:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:3; ద్వితీ 2:5
  • +యిర్మీ 49:8; యెహె 25:8, 9; ఓబ 1

యెహెజ్కేలు 35:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 25:12, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 7/2017, పేజీ 1

యెహెజ్కేలు 35:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 1:3

యెహెజ్కేలు 35:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:41; ఆమో 1:11
  • +కీర్త 137:7; ఓబ 10

యెహెజ్కేలు 35:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఓబ 15

యెహెజ్కేలు 35:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 25:13

యెహెజ్కేలు 35:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:17, 18; యెహె 25:13; మలా 1:4

యెహెజ్కేలు 35:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 36:5; ఓబ 13

యెహెజ్కేలు 35:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 1:11

యెహెజ్కేలు 35:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఓబ 3

యెహెజ్కేలు 35:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 4:21; ఓబ 12, 15
  • +యెష 34:5; యెహె 25:12, 13; 36:5

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 35:2ఆది 32:3; ద్వితీ 2:5
యెహె. 35:2యిర్మీ 49:8; యెహె 25:8, 9; ఓబ 1
యెహె. 35:3యెహె 25:12, 13
యెహె. 35:4మలా 1:3
యెహె. 35:5ఆది 27:41; ఆమో 1:11
యెహె. 35:5కీర్త 137:7; ఓబ 10
యెహె. 35:6ఓబ 15
యెహె. 35:7యెహె 25:13
యెహె. 35:9యిర్మీ 49:17, 18; యెహె 25:13; మలా 1:4
యెహె. 35:10యెహె 36:5; ఓబ 13
యెహె. 35:11ఆమో 1:11
యెహె. 35:13ఓబ 3
యెహె. 35:15విలా 4:21; ఓబ 12, 15
యెహె. 35:15యెష 34:5; యెహె 25:12, 13; 36:5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 35:1-15

యెహెజ్కేలు

35 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, శేయీరు+ పర్వత ప్రాంతం వైపు నీ ముఖం తిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించు.+ 3 దానితో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “శేయీరు పర్వత ప్రాంతమా, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. నేను నీ మీదికి నా చెయ్యి చాపి, నిన్ను పనికిరాని నిర్జన ప్రదేశంగా మారుస్తాను.+ 4 నేను నీ నగరాల్ని శిథిలాలుగా మారుస్తాను, నువ్వు పనికిరాని నిర్జన ప్రదేశంగా తయారౌతావు;+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. 5 ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలీయుల మీద ఎడతెగని శత్రుత్వం చూపించావు;+ వాళ్ల మీదికి విపత్తు వచ్చినప్పుడు, వాళ్ల చివరి శిక్షా సమయంలో నువ్వు వాళ్లను ఖడ్గానికి అప్పగించావు.” ’+

6 “ ‘కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతం కోసం సిద్ధం చేస్తాను, అది నిన్ను వెంటాడుతుంది.+ నువ్వు రక్తాన్ని ద్వేషించావు, కాబట్టి రక్తపాతమే నిన్ను వెంటాడుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 7 ‘నేను శేయీరు పర్వత ప్రాంతాన్ని పనికిరాని నిర్జన ప్రదేశంగా చేసి,+ దానిలో ఎవరూ తిరగకుండా, దానిలోకి ఎవరూ తిరిగిరాకుండా చేస్తాను. 8 దాని పర్వతాల్ని శవాలతో నింపేస్తాను; ఖడ్గంతో చంపబడినవాళ్లు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగులన్నిట్లో పడివుంటారు. 9 నువ్వు ఎప్పటికీ నిర్జనంగా పడివుండేలా చేస్తాను, నీ నగరాల్లో ఎవరూ నివసించరు;+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’

10 “యెహోవాయే స్వయంగా అక్కడ ఉన్నా కూడా నువ్వు, ‘ఈ రెండు జనాలు, ఈ రెండు దేశాలు నా సొంతమౌతాయి, మనం వాటిని స్వాధీనం చేసుకుందాం’+ అని అన్నావు కాబట్టి, 11 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నా జీవం తోడు, నువ్వు వాళ్లపట్ల ద్వేషంతో వాళ్లమీద ఎంత కోపం, ఈర్ష్య చూపించావో నేను కూడా నీతో అలాగే వ్యవహరిస్తాను;+ నేను నీకు తీర్పు తీర్చినప్పుడు వాళ్ల మధ్య నన్ను నేను తెలియజేసుకుంటాను. 12 నువ్వు ఇశ్రాయేలు పర్వతాల గురించి, “అవి నిర్జనంగా పడివున్నాయి, వాటిని నాశనం చేసే అవకాశం మనకు దొరికింది” అంటూ పలికిన అవమానకరమైన మాటలన్నిటినీ యెహోవానైన నేనే స్వయంగా విన్నానని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. 13 మీరు అహంకారంతో నాకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు,+ అవన్నీ నేను విన్నాను.’

14 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను పనికిరాని నిర్జన ప్రదేశంగా చేసినప్పుడు భూమంతా సంతోషిస్తుంది. 15 ఇశ్రాయేలు ఇంటివాళ్ల స్వాస్థ్యం నిర్జనంగా పడివున్నప్పుడు నువ్వు సంతోషించావు కాబట్టి నేను కూడా నీతో అలాగే వ్యవహరిస్తాను.+ శేయీరు పర్వత ప్రాంతమా, నువ్వు, అవును ఎదోము అంతా శిథిలాలుగా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి