కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా (1-16)

        • సున్నం పూసిన గోడలు పడిపోతాయి (10-12)

      • అబద్ధాలు ప్రవచించే స్త్రీలకు వ్యతిరేకంగా (17-23)

యెహెజ్కేలు 13:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 3:5; జెఫ 3:4
  • +యిర్మీ 14:14; 23:16

యెహెజ్కేలు 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1999, పేజీలు 13-14

    5/1/1997, పేజీ 8

యెహెజ్కేలు 13:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 2:12; యోవే 1:15
  • +యెహె 22:30

యెహెజ్కేలు 13:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:31, 32

యెహెజ్కేలు 13:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 22:28

యెహెజ్కేలు 13:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 14:14; 28:15, 16; 29:8, 9
  • +యెహె 6:13; 11:10

యెహెజ్కేలు 13:10

అధస్సూచీలు

  • *

    అంటే, ఒక బలహీనమైన లోపలి గోడను కట్టి, అది బలంగా కనిపించేలా చేయడానికి సున్నం వేస్తున్నారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:13, 14
  • +యెష 30:10; యెహె 22:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1999, పేజీలు 13-14

యెహెజ్కేలు 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 27:8

యెహెజ్కేలు 13:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 37:19

యెహెజ్కేలు 13:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 30:12, 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1997, పేజీ 8

యెహెజ్కేలు 13:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:13, 14; 28:1-4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1997, పేజీ 8

యెహెజ్కేలు 13:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 3:11
  • +యిర్మీ 23:14

యెహెజ్కేలు 13:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 6:13

యెహెజ్కేలు 13:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:14
  • +యిర్మీ 23:14
  • +యిర్మీ 23:16, 17

యెహెజ్కేలు 13:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:10, 14; యిర్మీ 27:9; మీకా 3:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 13:2మీకా 3:5; జెఫ 3:4
యెహె. 13:2యిర్మీ 14:14; 23:16
యెహె. 13:3యిర్మీ 23:32
యెహె. 13:5యెష 2:12; యోవే 1:15
యెహె. 13:5యెహె 22:30
యెహె. 13:6యిర్మీ 29:31, 32
యెహె. 13:8యెహె 22:28
యెహె. 13:9యిర్మీ 14:14; 28:15, 16; 29:8, 9
యెహె. 13:9యెహె 6:13; 11:10
యెహె. 13:10యిర్మీ 6:13, 14
యెహె. 13:10యెష 30:10; యెహె 22:28
యెహె. 13:11యెష 27:8
యెహె. 13:12యిర్మీ 37:19
యెహె. 13:15యెష 30:12, 13
యెహె. 13:16యిర్మీ 6:13, 14; 28:1-4
యెహె. 13:19మీకా 3:11
యెహె. 13:19యిర్మీ 23:14
యెహె. 13:21యెహె 6:13
యెహె. 13:22యిర్మీ 27:14
యెహె. 13:22యిర్మీ 23:14
యెహె. 13:22యిర్మీ 23:16, 17
యెహె. 13:23ద్వితీ 18:10, 14; యిర్మీ 27:9; మీకా 3:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 13:1-23

యెహెజ్కేలు

13 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించు,+ సొంత ఆలోచనల్ని ప్రవచనాలుగా చెప్పేవాళ్లతో+ ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేది వినండి. 3 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఏ దర్శనం చూడకపోయినా, సొంత ఆలోచనల ప్రకారం ప్రవచించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ!+ 4 ఇశ్రాయేలూ, నీ ప్రవక్తలు శిథిలాల మధ్య ఉన్న నక్కల్లా తయారయ్యారు. 5 యెహోవా రోజున జరిగే యుద్ధంలో+ ఇశ్రాయేలు స్థిరంగా నిలబడేలా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల కోసం మీరు రాతి గోడల్లోని పగుళ్ల దగ్గరికి వెళ్లి వాటిని బాగుచేయరు.”+ 6 “వాళ్లు వ్యర్థమైన దర్శనాలు చూసి, అబద్ధాన్ని ప్రవచించారు; యెహోవా వాళ్లను పంపకపోయినా, ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్లు అంటున్నారు; అంతేకాదు తమ మాటలు నెరవేరతాయని ఎదురుచూశారు.+ 7 నేను ఏమీ చెప్పకపోయినా, మీరు ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని అంటున్నప్పుడు మీరు చూసిన దర్శనాలు వ్యర్థమైన దర్శనాలు కావా? మీరు ప్రవచించింది అబద్ధాన్ని కాదా?” ’

8 “ ‘అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘మీ మాటలు, మీ దర్శనాలు అబద్ధం కాబట్టి నేను మీకు వ్యతిరేకంగా ఉన్నాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”+ 9 వ్యర్థమైన దర్శనాలు చూసే, అబద్ధాన్ని ప్రవచించే ప్రవక్తలకు+ వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతాను. నా సన్నిహిత ప్రజల గుంపులో వాళ్లు ఉండరు; ఇశ్రాయేలు ఇంటివాళ్ల జాబితాలో వాళ్ల పేర్లు ఉండవు; వాళ్లు ఇశ్రాయేలు దేశానికి తిరిగిరారు; అప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 10 శాంతి లేకపోయినా, “శాంతి ఉంది!” అని చెప్తూ+ వాళ్లు నా ప్రజల్ని తప్పుదారి పట్టించారు కాబట్టే ఇదంతా జరుగుతుంది. బలహీనమైన మధ్యగోడ కట్టబడినప్పుడు, వాళ్లు దానికి సున్నం పూస్తున్నారు.’*+

11 “అది పడిపోతుందని సున్నం పూసేవాళ్లకు చెప్పు. కుండపోత వర్షం కురుస్తుంది, వడగండ్లు పడతాయి, బలమైన ఈదురు గాలులు దానిని పడగొడతాయి.+ 12 గోడ పడిపోయినప్పుడు, ‘మీరు పూసిన సున్నం పూత ఏమైంది?’ అని మిమ్మల్ని అడుగుతారు.+

13 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నేను ఆగ్రహంతో బలమైన ఈదురు గాలుల్ని, కోపంతో కుండపోత వర్షాన్ని, ఉగ్రతతో నాశనం చేసే వడగండ్లను రప్పిస్తాను. 14 మీరు సున్నం పూసిన గోడను నేను పడగొట్టి నేలమట్టం చేస్తాను, దాని పునాదులు బయటికి కనిపిస్తాయి. నగరం నాశనమైనప్పుడు మీరు దానిలోనే నశించిపోతారు; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’

15 “ ‘నేను గోడమీద, దానికి సున్నం పూసినవాళ్ల మీద నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కినప్పుడు, నేను మీతో ఇలా అంటాను: “గోడా లేదు, దానికి సున్నం పూసినవాళ్లూ లేరు.+ 16 యెరూషలేము గురించి ప్రవచించి, దానికి శాంతి లేకపోయినా శాంతి ఉన్నట్టు దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రవక్తలు+ ఇక లేరు” ’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.

17 “మానవ కుమారుడా, సొంత ఆలోచనల్ని ప్రవచనాలుగా చెప్పే నీ ప్రజల్లోని స్త్రీలకు వ్యతిరేకంగా ముఖం తిప్పుకొని, వాళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు. 18 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ప్రజల ప్రాణాల్ని వేటాడడానికి, ప్రతీ ఒక్కరి చేతికి తగ్గట్టుగా తాయెత్తులు, రకరకాల తలలకు సరిపోయేలా ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ! మీరు నా ప్రజల ప్రాణాల్ని వేటాడుతూ, మీ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారా? 19 మీరు మీ అబద్ధాల్ని వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పడం ద్వారా బ్రతకాల్సినవాళ్లను చంపుతూ, బ్రతకకూడనివాళ్లను సజీవంగా ఉంచుతూ గుప్పెడు బార్లీ గింజల కోసం, రొట్టె ముక్కల కోసం+ నా ప్రజల మధ్య నన్ను అపవిత్రపరుస్తారా?” ’+

20 “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘స్త్రీలారా, పక్షుల్ని వేటాడినట్టు ప్రజల్ని వేటాడడానికి మీరు ఉపయోగించే మీ తాయెత్తులకు నేను వ్యతిరేకంగా ఉన్నాను; నేను వాటిని మీ చేతుల నుండి తెంచేసి, మీరు పక్షుల్ని వేటాడినట్టు వేటాడుతున్న వాళ్లను విడిపిస్తాను. 21 మీ ముసుగుల్ని చించేసి, మీ చేతిలో నుండి నా ప్రజల్ని రక్షిస్తాను; మీరిక వాళ్లను వేటాడి పట్టుకోలేరు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 22 నీతిమంతునికి బాధ కలిగించాలనే ఉద్దేశం నాకు లేకపోయినా మీరు అతనికి అబద్ధాలు చెప్పి+ అతని ధైర్యాన్ని పోగొట్టారు; మీరు దుష్టుడి చేతుల్ని బలపర్చారు,+ అలా అతను తన చెడు మార్గం నుండి పక్కకుమళ్లి, జీవించకుండా చేశారు.+ 23 కాబట్టి స్త్రీలారా, మీరు ఇక అబద్ధ దర్శనాలు చూడరు, సోదె చెప్పరు;+ నేను నా ప్రజల్ని మీ చేతుల్లో నుండి రక్షిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి