కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • విలాపవాక్యాలు 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

విలాపవాక్యాలు విషయసూచిక

      • యెరూషలేము మీద యెహోవా కోపం

        • ఏమాత్రం కనికరం చూపించలేదు (2)

        • యెహోవా ఆమెకు శత్రువులా ఉన్నాడు (5)

        • సీయోను గురించి కన్నీళ్లు (11-13)

        • ఒకప్పటి అందమైన నగరాన్ని దారిన వెళ్లేవాళ్లు ఎగతాళి చేయడం (15)

        • సీయోను పతనాన్ని చూసి శత్రువులు సంతోషించడం (17)

విలాపవాక్యాలు 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 2:15
  • +1ది 28:2; కీర్త 132:7; యెష 60:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 9

విలాపవాక్యాలు 2:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:52; మీకా 5:11
  • +యెష 39:7; 43:28; యెహె 21:26, 27

విలాపవాక్యాలు 2:3

అధస్సూచీలు

  • *

    లేదా “బలాన్నంతటినీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 74:10, 11
  • +ద్వితీ 32:22; యెష 42:25; యిర్మీ 7:20

విలాపవాక్యాలు 2:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “తొక్కాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:63; యెష 63:10; యిర్మీ 21:5
  • +2రా 25:21
  • +యిర్మీ 10:20
  • +యిర్మీ 4:4

విలాపవాక్యాలు 2:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 30:14

విలాపవాక్యాలు 2:6

అధస్సూచీలు

  • *

    లేదా “నాశనం చేశాడు.”

  • *

    లేదా “సబ్బాతును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:8, 9; 2ది 36:19; యెష 63:18; 64:11
  • +విలా 1:4
  • +యిర్మీ 52:24, 27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 9

విలాపవాక్యాలు 2:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:31; యిర్మీ 26:6; 52:12, 13; యెహె 24:21; మీకా 3:12
  • +2ది 36:19
  • +కీర్త 74:4

విలాపవాక్యాలు 2:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:10; యిర్మీ 39:8
  • +2రా 21:13; యెష 28:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీ 162

విలాపవాక్యాలు 2:9

అధస్సూచీలు

  • *

    లేదా “ఉపదేశం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 1:3; యిర్మీ 14:2
  • +ద్వితీ 28:15, 36; 2రా 24:15; 25:7; విలా 4:20; యెహె 12:13; దాని 1:3, 6
  • +కీర్త 74:9; యిర్మీ 23:16; యెహె 7:26

విలాపవాక్యాలు 2:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 3:26
  • +యిర్మీ 6:26; యెహె 7:18

విలాపవాక్యాలు 2:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “పేగులు.”

  • *

    బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.

  • *

    అక్ష., “నా కాలేయం భూమి మీదికి ఒలికింది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 3:48
  • +యిర్మీ 14:17
  • +యిర్మీ 11:22; విలా 2:19; 4:4

విలాపవాక్యాలు 2:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “ధాన్యం, ద్రాక్షారసం ఎక్కడ?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:49, 51; 2రా 25:3; యెష 3:1; యిర్మీ 18:21

విలాపవాక్యాలు 2:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 14:17; దాని 9:12
  • +యిర్మీ 30:12

విలాపవాక్యాలు 2:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:8; 27:14; యెహె 13:2, 3
  • +యిర్మీ 23:14
  • +యిర్మీ 23:32; 27:9; మీకా 3:5; జెఫ 3:4

విలాపవాక్యాలు 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 25:2, 6
  • +1రా 9:8; యిర్మీ 25:9
  • +కీర్త 48:2; యెహె 16:14

విలాపవాక్యాలు 2:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 51:34
  • +మీకా 4:11
  • +ఓబ 13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 9

విలాపవాక్యాలు 2:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్మును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:11; మీకా 2:3
  • +లేవీ 26:14, 17; ద్వితీ 28:15
  • +2రా 23:27
  • +యెహె 5:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 9

విలాపవాక్యాలు 2:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ కనుపాపకు.”

విలాపవాక్యాలు 2:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “రాత్రివేళ, జాముల ఆరంభంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 51:20; విలా 4:9; యెహె 5:16

విలాపవాక్యాలు 2:20

అధస్సూచీలు

  • *

    లేదా “ఫలాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:29; ద్వితీ 28:53; యిర్మీ 19:9; విలా 4:10; యెహె 5:10
  • +యెహె 9:6, 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2007, పేజీ 9

విలాపవాక్యాలు 2:21

అధస్సూచీలు

  • *

    లేదా “యువతులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:49, 50; 2ది 36:17
  • +యిర్మీ 9:21; 18:21
  • +యిర్మీ 13:14; 21:7; విలా 3:43; యెహె 5:11; 9:6

విలాపవాక్యాలు 2:22

అధస్సూచీలు

  • *

    లేదా “ఆరోగ్యంగా కని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:16
  • +జెఫ 1:18
  • +ద్వితీ 28:18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

విలా. 2:1విలా 2:15
విలా. 2:11ది 28:2; కీర్త 132:7; యెష 60:13
విలా. 2:2ద్వితీ 28:52; మీకా 5:11
విలా. 2:2యెష 39:7; 43:28; యెహె 21:26, 27
విలా. 2:3కీర్త 74:10, 11
విలా. 2:3ద్వితీ 32:22; యెష 42:25; యిర్మీ 7:20
విలా. 2:4ద్వితీ 28:63; యెష 63:10; యిర్మీ 21:5
విలా. 2:42రా 25:21
విలా. 2:4యిర్మీ 10:20
విలా. 2:4యిర్మీ 4:4
విలా. 2:5యిర్మీ 30:14
విలా. 2:62రా 25:8, 9; 2ది 36:19; యెష 63:18; 64:11
విలా. 2:6విలా 1:4
విలా. 2:6యిర్మీ 52:24, 27
విలా. 2:7లేవీ 26:31; యిర్మీ 26:6; 52:12, 13; యెహె 24:21; మీకా 3:12
విలా. 2:72ది 36:19
విలా. 2:7కీర్త 74:4
విలా. 2:82రా 25:10; యిర్మీ 39:8
విలా. 2:82రా 21:13; యెష 28:17
విలా. 2:9నెహె 1:3; యిర్మీ 14:2
విలా. 2:9ద్వితీ 28:15, 36; 2రా 24:15; 25:7; విలా 4:20; యెహె 12:13; దాని 1:3, 6
విలా. 2:9కీర్త 74:9; యిర్మీ 23:16; యెహె 7:26
విలా. 2:10యెష 3:26
విలా. 2:10యిర్మీ 6:26; యెహె 7:18
విలా. 2:11విలా 3:48
విలా. 2:11యిర్మీ 14:17
విలా. 2:11యిర్మీ 11:22; విలా 2:19; 4:4
విలా. 2:12ద్వితీ 28:49, 51; 2రా 25:3; యెష 3:1; యిర్మీ 18:21
విలా. 2:13యిర్మీ 14:17; దాని 9:12
విలా. 2:13యిర్మీ 30:12
విలా. 2:14యిర్మీ 2:8; 27:14; యెహె 13:2, 3
విలా. 2:14యిర్మీ 23:14
విలా. 2:14యిర్మీ 23:32; 27:9; మీకా 3:5; జెఫ 3:4
విలా. 2:15యెహె 25:2, 6
విలా. 2:151రా 9:8; యిర్మీ 25:9
విలా. 2:15కీర్త 48:2; యెహె 16:14
విలా. 2:16యిర్మీ 51:34
విలా. 2:16మీకా 4:11
విలా. 2:16ఓబ 13
విలా. 2:17యిర్మీ 18:11; మీకా 2:3
విలా. 2:17లేవీ 26:14, 17; ద్వితీ 28:15
విలా. 2:172రా 23:27
విలా. 2:17యెహె 5:11
విలా. 2:19యెష 51:20; విలా 4:9; యెహె 5:16
విలా. 2:20లేవీ 26:29; ద్వితీ 28:53; యిర్మీ 19:9; విలా 4:10; యెహె 5:10
విలా. 2:20యెహె 9:6, 7
విలా. 2:21ద్వితీ 28:49, 50; 2ది 36:17
విలా. 2:21యిర్మీ 9:21; 18:21
విలా. 2:21యిర్మీ 13:14; 21:7; విలా 3:43; యెహె 5:11; 9:6
విలా. 2:22ద్వితీ 16:16
విలా. 2:22జెఫ 1:18
విలా. 2:22ద్వితీ 28:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
విలాపవాక్యాలు 2:1-22

విలాపవాక్యాలు

א [ఆలెఫ్‌]

2 యెహోవా తన కోపం అనే మేఘంతో సీయోను కూతురిని కప్పేశాడు!

ఆయన ఇశ్రాయేలు సౌందర్యాన్ని ఆకాశం నుండి భూమ్మీదికి పడేశాడు.+

ఆయన తన ఉగ్రత రోజున తన పాదపీఠాన్ని+ గుర్తుచేసుకోలేదు.

ב [బేత్‌]

 2 యెహోవా ఏమాత్రం కనికరం లేకుండా యాకోబు నివాసాలన్నిటినీ మింగేశాడు.

తన కోపాన్ని బట్టి యూదా కూతురి ప్రాకారాలుగల స్థలాలన్నిటినీ పడగొట్టాడు.+

రాజ్యాన్ని, ఆమె అధిపతుల్ని నేలకూల్చి, అపవిత్రం చేశాడు.+

ג [గీమెల్‌]

 3 ఆయన కోపావేశంలో ఇశ్రాయేలు ప్రతీ కొమ్మును* నరికేశాడు.

శత్రువు సమీపించినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనక్కి తీసుకున్నాడు,+

చుట్టూ ఉన్న ప్రతీదాన్ని దహించేసే అగ్నిలా ఆయన కోపం యాకోబులో మండుతూ వచ్చింది.+

ד [దాలెత్‌]

 4 శత్రువులా ఆయన తన విల్లును వంచాడు;* విరోధిలా దాడి చేయడానికి తన కుడిచేతిని సిద్ధం చేశాడు;+

మా కళ్లకు ప్రియంగా ఉన్నవాళ్లందర్నీ చంపుతూ వచ్చాడు.+

సీయోను కూతురి డేరాలో+ తన కోపాన్ని అగ్నిలా కుమ్మరించాడు.+

ה [హే]

 5 యెహోవా మాకు శత్రువులా తయారయ్యాడు;+

ఆయన ఇశ్రాయేలును మింగేశాడు.

ఆమె బురుజులన్నిటినీ మింగేశాడు;

ప్రాకారాలుగల ఆమె స్థలాలన్నిటినీ నాశనం చేశాడు.

యూదా కూతురిలో ఏడుపు, ప్రలాపం ఎక్కువయ్యేలా చేశాడు.

ו [వావ్‌]

 6 తోటలోని గుడిసెను పడగొట్టినట్టు ఆయన తన పర్ణశాలను పడగొట్టాడు.+

తన పండుగను ఆపేశాడు.*+

యెహోవా సీయోనులో పండుగను, విశ్రాంతి రోజును* మర్చిపోయేలా చేశాడు,

తన విపరీతమైన కోపాన్ని బట్టి రాజును, యాజకుణ్ణి కూడా ఆయన లెక్క చేయట్లేదు.+

ז [జాయిన్‌]

 7 యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు;

తన పవిత్రమైన స్థలాన్ని నిరాకరించాడు.+

సీయోను పటిష్ఠమైన బురుజుల గోడల్ని శత్రువు చేతికి అప్పగించాడు.+

పండుగ రోజున కేకలు వేసినట్టు వాళ్లు యెహోవా మందిరంలో కేకలు వేశారు.+

ח [హేత్‌]

 8 యెహోవా సీయోను కూతురి ప్రాకారాల్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాడు.+

ఆయన కొలనూలుతో వాటిని కొలిచాడు.+

నాశనం రప్పించకుండా ఆయన తన చేతిని వెనక్కి తీసుకోలేదు.

ప్రాకారం, ప్రహరీగోడ విలపించేలా చేస్తున్నాడు.

అవి రెండూ పడిపోయాయి.

ט [తేత్‌]

 9 ఆమె ద్వారాలు భూమిలోకి కుంగిపోయాయి.+

ఆమె అడ్డగడియల్ని ఆయన నాశనం చేశాడు, విరగ్గొట్టాడు.

ఆమె రాజు, ఆమె అధిపతులు వేరే దేశాల్లో ఉన్నారు.+

ధర్మశాస్త్రం* లేదు; చివరికి ఆమె ప్రవక్తలకు కూడా యెహోవా నుండి ఎలాంటి దర్శనమూ రావట్లేదు.+

י [యోద్‌]

10 సీయోను కూతురి పెద్దలు మౌనంగా నేలమీద కూర్చున్నారు.+

వాళ్లు తలల మీద దుమ్ము పోసుకుంటున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు.+

యెరూషలేము కన్యలు నేల వరకు తమ తలలు వంచారు.

כ [కఫ్‌]

11 ఏడ్చీ ఏడ్చీ నా కళ్లు క్షీణించిపోయాయి.+

నా అంతరంగం* అల్లకల్లోలంగా ఉంది.

నా ప్రజల కూతురి* పతనాన్ని బట్టి నా గుండె పగిలిపోయింది,*+

ఎందుకంటే చిన్నపిల్లలు, పసివాళ్లు పట్టణ సంతవీధుల్లో సొమ్మసిల్లి పడిపోతున్నారు.+

ל [లామెద్‌]

12 వాళ్లు గాయపడిన వ్యక్తిలా నగర సంతవీధుల్లో సొమ్మసిల్లి పడిపోతూ,

తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తూ,

“అమ్మా, ఆకలేస్తోంది, దాహమేస్తోంది!”* అని అంటున్నారు.+

מ [మేమ్‌]

13 యెరూషలేము కూతురా, నేను దేన్ని సాక్ష్యంగా పెట్టను?

నువ్వు దేనిలా ఉన్నావని చెప్పను?

సీయోను కన్యా, నిన్ను ఓదార్చడానికి దేనితో నిన్ను పోల్చను?

నీ నాశనం సముద్రమంత గొప్పది.+ నిన్ను ఎవరు బాగుచేయగలరు?+

נ [నూన్‌]

14 నీ ప్రవక్తలు నీ గురించి చూసిన దర్శనాలు తప్పుడువి, వ్యర్థమైనవి,+

నువ్వు చెరలోకి వెళ్లకుండా ఉండేలా వాళ్లు నీ తప్పుల్ని బయటపెట్టలేదు,+

బదులుగా వాళ్లు నీకు తప్పుడు దర్శనాల్ని, మోసపూరిత దర్శనాల్ని చెప్తూ వచ్చారు.+

ס [సామెఖ్‌]

15 దారిన వెళ్లేవాళ్లందరూ నిన్ను ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతున్నారు.+

ఆశ్చర్యంతో ఈల వేస్తూ,+ యెరూషలేము కూతుర్ని చూసి తలలు ఆడిస్తూ ఇలా అంటున్నారు:

“ ‘అది పరిపూర్ణ సౌందర్యం గలది, భూమంతటికీ సంతోష కారణం’ అని ప్రజలు చెప్పుకున్న నగరం ఇదేనా?”+

פ [పే]

16 నీ శత్రువులంతా నీ వైపు నోళ్లు తెరిచారు.

వాళ్లు ఈల వేస్తూ, పళ్లు కొరుకుతూ ఇలా అంటున్నారు: “మనం దాన్ని మింగేశాం.+

ఈ రోజు కోసమే మనం ఎదురుచూశాం!+ అది వచ్చేసింది, మనం దాన్ని చూశాం!”+

ע [అయిన్‌]

17 యెహోవా తాను అనుకున్నది చేశాడు;+ తన మాటను,

చాలాకాలం క్రితం తాను ఆజ్ఞాపించిన దాన్ని+ నెరవేర్చాడు.+

ఆయన కనికరం చూపించకుండా నాశనం చేశాడు.+

శత్రువు నీ పతనాన్ని చూసి సంతోషించేలా ఆయన చేశాడు; ఆయన నీ విరోధుల బలాన్ని* హెచ్చించాడు.

צ [సాదె]

18 సీయోను కూతురి ప్రాకారమా, వాళ్ల హృదయం యెహోవాకు మొరపెడుతోంది.

రాత్రింబగళ్లు కన్నీళ్లు వరదలా ప్రవహించనీ.

ఏమాత్రం విరామం తీసుకోకు, నీ కంటికి* విశ్రాంతినివ్వకు.

ק [ఖొఫ్‌]

19 లే! రాత్రంతా* ఏడుస్తూ ఉండు.

నీ హృదయాన్ని యెహోవా ముఖం ఎదుట నీళ్లలా కుమ్మరించు.

కరువువల్ల ప్రతీ వీధి మూల దగ్గర సొమ్మసిల్లి పడిపోతున్న

నీ పిల్లల ప్రాణాల కోసం+ చేతులెత్తి ఆయన్ని వేడుకో.

ר [రేష్‌]

20 యెహోవా, ఇదిగో, నువ్వు ఎంతో కఠినంగా వ్యవహరించిన నీ ప్రజల వైపు చూడు.

స్త్రీలు తమ కన్న బిడ్డల్ని,* ఆరోగ్యంగా పుట్టిన తమ పిల్లల్ని తింటూనే ఉండాలా?+

యాజకులు, ప్రవక్తలు యెహోవా పవిత్రమైన స్థలంలో చంపబడాలా?+

ש [షీన్‌]

21 పిల్లలు, వృద్ధులు చనిపోయి వీధుల్లో నేలమీద పడివున్నారు.+

నా కన్యలు,* యువకులు కత్తి పాలయ్యారు.+

నీ ఉగ్రత రోజున నువ్వు వాళ్లను చంపావు; కనికరం లేకుండా వధించావు.+

ת [తౌ]

22 పండుగ రోజు కోసం అన్నట్టు,+ నువ్వు అన్నివైపుల నుండి భయాల్ని పిలిపిస్తున్నావు.

యెహోవా ఉగ్రత రోజున ఎవ్వరూ తప్పించుకోలేదు, బ్రతికి బయటపడలేదు;+

నేను కని,* పెంచిన వాళ్లను నా శత్రువు సమూలనాశనం చేశాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి