కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 43
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • ప్రజలు వినకుండా ఐగుప్తుకు వెళ్లడం (1-7)

      • ఐగుప్తులో యిర్మీయాకు యెహోవా వాక్యం (8-13)

యిర్మీయా 43:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 41:16; 42:1-3

యిర్మీయా 43:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 36:4; 45:1
  • +యిర్మీ 38:4, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2006, పేజీ 19

యిర్మీయా 43:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 40:11, 12

యిర్మీయా 43:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 39:10
  • +2రా 22:8
  • +2ది 34:20, 21; యిర్మీ 26:24
  • +2రా 25:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2006, పేజీ 19

యిర్మీయా 43:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:14, 16; 44:1; యెహె 30:4, 18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2006, పేజీ 19

యిర్మీయా 43:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:9; యెహె 29:19, 20
  • +దాని 2:21; 5:18

యిర్మీయా 43:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:17, 19; యెహె 29:19; 30:4, 18
  • +యెహె 5:12

యిర్మీయా 43:12

అధస్సూచీలు

  • *

    లేదా “సురక్షితంగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:25

యిర్మీయా 43:13

అధస్సూచీలు

  • *

    లేదా “సూర్య దేవాలయం,” అంటే హీలియోపొలిస్‌.

  • *

    లేదా “స్తూపాల్ని.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 43:2యిర్మీ 41:16; 42:1-3
యిర్మీ. 43:3యిర్మీ 36:4; 45:1
యిర్మీ. 43:3యిర్మీ 38:4, 6
యిర్మీ. 43:5యిర్మీ 40:11, 12
యిర్మీ. 43:6యిర్మీ 39:10
యిర్మీ. 43:62రా 22:8
యిర్మీ. 43:62ది 34:20, 21; యిర్మీ 26:24
యిర్మీ. 43:62రా 25:22
యిర్మీ. 43:7యిర్మీ 2:14, 16; 44:1; యెహె 30:4, 18
యిర్మీ. 43:10యిర్మీ 25:9; యెహె 29:19, 20
యిర్మీ. 43:10దాని 2:21; 5:18
యిర్మీ. 43:11యిర్మీ 25:17, 19; యెహె 29:19; 30:4, 18
యిర్మీ. 43:11యెహె 5:12
యిర్మీ. 43:12యిర్మీ 46:25
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 43:1-13

యిర్మీయా

43 యిర్మీయా ఆ ప్రజలందరితో వాళ్ల దేవుడైన యెహోవా నుండి వచ్చిన ఈ మాటలన్నీ, అంటే వాళ్లతో ఏ మాటలైతే చెప్పమని వాళ్ల దేవుడైన యెహోవా తనను పంపించాడో ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత, 2 హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను,+ అహంకారులైన మనుషులంతా యిర్మీయాతో ఇలా అన్నారు: “నువ్వు చెప్పేది అబద్ధం! మా దేవుడైన యెహోవా, ‘ఐగుప్తులో నివసించడానికి అక్కడికి వెళ్లకండి’ అని చెప్పమని నిన్ను పంపలేదు. 3 మమ్మల్ని కల్దీయుల చేతికి అప్పగించి చంపించాలనో, బబులోనుకు బందీలుగా పంపించాలనో నేరీయా కుమారుడైన బారూకు+ నిన్ను మాకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడు.”+

4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్యాధిపతులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండిపొమ్మని చెప్పిన యెహోవా స్వరానికి లోబడలేదు. 5 బదులుగా కారేహ కుమారుడైన యోహానాను, సైన్యాధిపతులందరూ యూదా ప్రజల్లో మిగిలినవాళ్లందర్నీ, అంటే తాము చెదిరిపోయిన దేశాలన్నిటి నుండి యూదా దేశంలో నివసించడానికి తిరిగొచ్చిన వాళ్లందర్నీ తమ వెంట తీసుకెళ్లారు.+ 6 వాళ్లు పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని, రాజు కూతుళ్లను, ప్రతీ ఒక్కర్ని, అంటే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ ఎవరినైతే షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యా+ కింద ఉంచాడో వాళ్లందర్నీ, అలాగే యిర్మీయా ప్రవక్తను, నేరీయా కుమారుడైన బారూకును తీసుకెళ్లారు. 7 వాళ్లు యెహోవా స్వరానికి లోబడకుండా ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి, తహపనేసు+ వరకు వెళ్లారు.

8 అప్పుడు తహపనేసులో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 9 “నువ్వు ఆ యూదులు చూస్తుండగా నీ చేతిలో పెద్దరాళ్లు తీసుకుని, తహపనేసులో ఫరో ఇంటి ప్రవేశం దగ్గర ఇటుకలతో కట్టిన బాటలో పాతిపెట్టి, సున్నంతో కప్పేయి. 10 తర్వాత వాళ్లకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును* పిలిపిస్తున్నాను,+ నేను పాతిపెట్టిన ఈ రాళ్లమీద అతని సింహాసనాన్ని ఉంచుతాను, అతను తన రాచ తివాచీని వాటిమీద పరుస్తాడు.+ 11 అతను వచ్చి, ఐగుప్తు దేశం మీద దాడిచేస్తాడు.+ ప్రాణాంతకమైన తెగులుకు నిర్ణయించబడినవాళ్లు ప్రాణాంతకమైన తెగులు వల్ల చనిపోతారు, బందీలుగా ఉండడానికి నిర్ణయించబడినవాళ్లు బందీలుగా వెళ్తారు, ఖడ్గానికి నిర్ణయించబడినవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు.+ 12 నేను ఐగుప్తు దేవుళ్ల గుళ్లకు నిప్పు అంటిస్తాను,+ అతను వాటిని కాల్చేసి, వాళ్లను బందీలుగా తీసుకెళ్తాడు. కాపరి తన వస్త్రాన్ని చుట్టుకున్నట్టు, అతను ఐగుప్తు దేశాన్ని చుట్టుకుని ప్రశాంతంగా* వెళ్లిపోతాడు. 13 అతను ఐగుప్తు దేశంలోని బేత్షెమెషు* స్తంభాల్ని* ముక్కలుముక్కలు చేస్తాడు, ఐగుప్తు దేవుళ్ల గుళ్లను అగ్నితో కాల్చేస్తాడు.” ’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి