కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 28
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యిర్మీయా, అబద్ధ ప్రవక్త హనన్యా (1-17)

యిర్మీయా 28:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:17; 2ది 36:10
  • +యెహో 11:19; 2స 21:2

యిర్మీయా 28:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:4, 8

యిర్మీయా 28:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:11, 13; యిర్మీ 27:16; దాని 1:2

యిర్మీయా 28:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 23:36; 24:6
  • +2రా 24:8; 25:27; యిర్మీ 37:1
  • +2రా 24:12, 14; యిర్మీ 24:1

యిర్మీయా 28:6

అధస్సూచీలు

  • *

    లేదా “అలాగే జరగాలి!”

యిర్మీయా 28:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:2

యిర్మీయా 28:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 28:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 4/2017, పేజీ 6

యిర్మీయా 28:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:2

యిర్మీయా 28:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:48; యిర్మీ 5:19
  • +దాని 2:37, 38

యిర్మీయా 28:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 28:1
  • +యిర్మీ 14:14; 27:15; యెహె 13:3

యిర్మీయా 28:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:5; 18:20; యిర్మీ 29:32

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 28:12రా 24:17; 2ది 36:10
యిర్మీ. 28:1యెహో 11:19; 2స 21:2
యిర్మీ. 28:2యిర్మీ 27:4, 8
యిర్మీ. 28:32రా 24:11, 13; యిర్మీ 27:16; దాని 1:2
యిర్మీ. 28:42రా 23:36; 24:6
యిర్మీ. 28:42రా 24:8; 25:27; యిర్మీ 37:1
యిర్మీ. 28:42రా 24:12, 14; యిర్మీ 24:1
యిర్మీ. 28:10యిర్మీ 27:2
యిర్మీ. 28:11యిర్మీ 28:4
యిర్మీ. 28:13యిర్మీ 27:2
యిర్మీ. 28:14ద్వితీ 28:48; యిర్మీ 5:19
యిర్మీ. 28:14దాని 2:37, 38
యిర్మీ. 28:15యిర్మీ 28:1
యిర్మీ. 28:15యిర్మీ 14:14; 27:15; యెహె 13:3
యిర్మీ. 28:16ద్వితీ 13:5; 18:20; యిర్మీ 29:32
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 28:1-17

యిర్మీయా

28 అదే సంవత్సరం, అంటే యూదా రాజైన సిద్కియా+ పరిపాలన ఆరంభంలోని నాలుగో సంవత్సరం, ఐదో నెలలో గిబియోనుకు+ చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకుల ముందు, ప్రజలందరి ముందు నాతో ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను.+ 3 బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలం నుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటినీ నేను రెండు సంవత్సరాల్లోనే వెనక్కి తీసుకొస్తున్నాను.’ ”+ 4 “ ‘యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను,+ బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదా వాళ్లందర్నీ+ నేను వెనక్కి తీసుకొస్తాను. ఎందుకంటే, నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

5 అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడివున్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు హనన్యా ప్రవక్తతో మాట్లాడాడు. 6 యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు: “ఆమేన్‌!* యెహోవా అలాగే చేయాలి! యెహోవా మందిరంలోని పాత్రల్ని, బందీలుగా వెళ్లిన ప్రజలందర్నీ బబులోను నుండి ఈ స్థలానికి తీసుకురావడం ద్వారా నువ్వు చెప్పిన ప్రవచనాన్ని యెహోవా నెరవేర్చాలి! 7 అయితే, దయచేసి నీ ముందు, ఈ ప్రజలందరి ముందు నేను చెప్తున్న ఈ సందేశాన్ని విను. 8 చాలాకాలం క్రితం, నాకన్నా, నీకన్నా ముందున్న ప్రవక్తలు ఎన్నో దేశాల మీదికి, గొప్ప రాజ్యాల మీదికి యుద్ధం, విపత్తు, తెగులు రావడం గురించి ప్రవచించారు. 9 ఒక ప్రవక్త శాంతి గురించి ప్రవచించినప్పుడు, ఆ ప్రవక్త మాట నెరవేరితే, అప్పుడు యెహోవాయే నిజంగా ఆ ప్రవక్తను పంపించాడని రుజువౌతుంది.”

10 అప్పుడు హనన్యా ప్రవక్త యిర్మీయా ప్రవక్త మెడ మీది నుండి కాడిని తీసేసి, దాన్ని విరగ్గొట్టాడు.+ 11 హనన్యా ప్రజలందరి ముందు ఇలా అన్నాడు: “యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదేవిధంగా నేను రెండు సంవత్సరాల్లోనే బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని దేశాలన్నిటి మెడ మీది నుండి విరగ్గొడతాను.’ ”+ తర్వాత యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.

12 హనన్యా ప్రవక్త యిర్మీయా ప్రవక్త మెడ మీది నుండి కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా నుండి యిర్మీయా దగ్గరికి ఈ సందేశం వచ్చింది: 13 “నువ్వు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు చెక్కతో చేసిన కాడిని విరగ్గొట్టావు,+ అయితే దాని స్థానంలో ఇనుప కాడి వస్తుంది.” 14 ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవచేయడానికి ఈ దేశాలన్నిటి మెడ మీద నేను ఇనుప కాడిని పెడతాను, వాళ్లు ఖచ్చితంగా అతనికి సేవచేయాలి.+ చివరికి జంతువుల్ని కూడా అతనికి అప్పగిస్తాను.” ’ ”+

15 తర్వాత యిర్మీయా ప్రవక్త హనన్యా+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “హనన్యా, దయచేసి విను! యెహోవా నిన్ను పంపలేదు, అయితే నువ్వు ఈ ప్రజలు అబద్ధాన్ని నమ్మేలా చేశావు.+ 16 కాబట్టి యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదిగో! నేను నిన్ను భూమ్మీద లేకుండా చేయబోతున్నాను. ఈ సంవత్సరం నువ్వు చనిపోతావు. ఎందుకంటే, నువ్వు యెహోవా మీదికి తిరుగుబాటును రేపావు.’ ”+

17 కాబట్టి హనన్యా ప్రవక్త ఆ సంవత్సరం, ఏడో నెలలో చనిపోయాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి