కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 26
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • చంపుతామని యిర్మీయాను బెదిరించడం (1-15)

      • యిర్మీయా తప్పించబడడం (16-19)

        • మీకా ప్రవచనాన్ని ఎత్తిచెప్పడం (18)

      • ఊరియా ప్రవక్త (20-24)

యిర్మీయా 26:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 23:34; 2ది 36:4; యిర్మీ 25:1; 35:1; 36:1

యిర్మీయా 26:2

అధస్సూచీలు

  • *

    లేదా “వంగి నమస్కరించడానికి.”

  • *

    లేదా “ప్రజలందరికి.”

యిర్మీయా 26:3

అధస్సూచీలు

  • *

    లేదా “విచారపడతాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 55:7; యిర్మీ 18:7, 8; 36:3; యెహె 18:27

యిర్మీయా 26:4

అధస్సూచీలు

  • *

    లేదా “ఉపదేశాన్ని.”

యిర్మీయా 26:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “పెందలకడే లేచి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:13, 14; యిర్మీ 7:12-14; 25:3

యిర్మీయా 26:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:60
  • +యిర్మీ 24:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2017, పేజీ 7

యిర్మీయా 26:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 26:2

యిర్మీయా 26:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 36:10

యిర్మీయా 26:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:19, 20
  • +యిర్మీ 38:4

యిర్మీయా 26:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:17

యిర్మీయా 26:13

అధస్సూచీలు

  • *

    లేదా “విచారపడతాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:3; 36:3; యెహె 18:32; యోనా 3:9

యిర్మీయా 26:18

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలయ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 29:1
  • +మీకా 1:1
  • +కీర్త 79:1; యిర్మీ 9:11
  • +మీకా 3:12

యిర్మీయా 26:19

అధస్సూచీలు

  • *

    లేదా “విచారపడలేదా?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:26

యిర్మీయా 26:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 60; 18:11, 14; 1స 7:2

యిర్మీయా 26:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 23:34; 2ది 36:5
  • +2ది 16:10

యిర్మీయా 26:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 36:11, 12

యిర్మీయా 26:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:30

యిర్మీయా 26:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 22:10
  • +2రా 22:12, 13; యిర్మీ 39:13, 14; 40:5
  • +1రా 18:4

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 26:12రా 23:34; 2ది 36:4; యిర్మీ 25:1; 35:1; 36:1
యిర్మీ. 26:3యెష 55:7; యిర్మీ 18:7, 8; 36:3; యెహె 18:27
యిర్మీ. 26:52రా 17:13, 14; యిర్మీ 7:12-14; 25:3
యిర్మీ. 26:6కీర్త 78:60
యిర్మీ. 26:6యిర్మీ 24:9
యిర్మీ. 26:7యిర్మీ 26:2
యిర్మీ. 26:10యిర్మీ 36:10
యిర్మీ. 26:11యిర్మీ 18:19, 20
యిర్మీ. 26:11యిర్మీ 38:4
యిర్మీ. 26:12యిర్మీ 1:17
యిర్మీ. 26:13యిర్మీ 7:3; 36:3; యెహె 18:32; యోనా 3:9
యిర్మీ. 26:182ది 29:1
యిర్మీ. 26:18మీకా 1:1
యిర్మీ. 26:18కీర్త 79:1; యిర్మీ 9:11
యిర్మీ. 26:18మీకా 3:12
యిర్మీ. 26:192ది 32:26
యిర్మీ. 26:20యెహో 15:20, 60; 18:11, 14; 1స 7:2
యిర్మీ. 26:212రా 23:34; 2ది 36:5
యిర్మీ. 26:212ది 16:10
యిర్మీ. 26:22యిర్మీ 36:11, 12
యిర్మీ. 26:23యిర్మీ 2:30
యిర్మీ. 26:242రా 22:10
యిర్మీ. 26:242రా 22:12, 13; యిర్మీ 39:13, 14; 40:5
యిర్మీ. 26:241రా 18:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 26:1-24

యిర్మీయా

26 యోషీయా కుమారుడూ, యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన ఆరంభంలో యెహోవా వాక్యం ఇలా చెప్పింది: 2 “యెహోవా ఇలా అంటున్నాడు, ‘నువ్వు యెహోవా మందిర ప్రాంగణంలో నిలబడి, యెహోవా మందిరంలో ఆరాధించడానికి* లోపలికి వస్తున్న యూదా నగరాల ప్రజలందరి గురించి* ప్రకటించు. నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్లకు చెప్పు; ఒక్కమాట కూడా విడిచిపెట్టకు. 3 బహుశా వాళ్లు విని, ప్రతీ ఒక్కరు తమ చెడ్డ మార్గం నుండి పక్కకు మళ్లుతారేమో. అప్పుడు నేను, వాళ్ల చెడ్డపనుల్ని బట్టి వాళ్లమీదికి తీసుకురావాలనుకున్న విపత్తు విషయంలో నా మనసు మార్చుకుంటాను.*+ 4 వాళ్లకు ఇలా చెప్పు: “యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీరు నా మాట వినకపోతే, అంటే నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని* పాటించకుండా, 5 నేను మీ దగ్గరికి పదేపదే* పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటల్ని ఇప్పటిలాగే వినకుండా ఉంటే,+ 6 నేను ఈ మందిరాన్ని షిలోహులా+ చేస్తాను, ఈ నగరాన్ని భూమ్మీదున్న దేశాలన్నీ శపించేలా చేస్తాను.’ ” ’ ”+

7 యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు చెప్పడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరు విన్నారు.+ 8 యిర్మీయా యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పడం పూర్తయిన తర్వాత, యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరు అతన్ని పట్టుకుని ఇలా అన్నారు: “నువ్వు ఖచ్చితంగా చస్తావు. 9 నువ్వు, ‘ఈ మందిరం షిలోహులా అవుతుంది, ఈ నగరం నాశనమైపోతుంది, దీనిలో ఎవ్వరూ నివసించరు’ అంటూ యెహోవా పేరున ఎందుకు ప్రవచించావు?” అప్పుడు ప్రజలందరూ యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు.

10 యూదా అధిపతులు ఈ విషయం గురించి విన్నప్పుడు, వాళ్లు యూదా రాజు రాజభవనం నుండి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిర కొత్త ద్వారం ప్రవేశం దగ్గర+ కూర్చున్నారు. 11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు అధిపతులతో, ప్రజలందరితో ఇలా అన్నారు: “ఈ మనిషి మరణశిక్షకు అర్హుడు.+ ఎందుకంటే, ఇతను ఈ నగరానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. ఆ మాటలు మీరే చెవులారా విన్నారు.”+

12 అప్పుడు యిర్మీయా అధిపతులందరితో, ప్రజలందరితో ఇలా అన్నాడు: “మీరు విన్న మాటల్ని, అంటే ఈ మందిరానికి, ఈ నగరానికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాటలన్నిటినీ ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపాడు.+ 13 కాబట్టి, ఇప్పుడు మీరు మీ మార్గాల్ని, మీ ప్రవర్తనను మార్చుకుని మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడండి. అప్పుడు యెహోవా మీకు వ్యతిరేకంగా చెప్పిన విపత్తు విషయంలో తన మనసు మార్చుకుంటాడు.*+ 14 ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను. మీకు ఏది మంచిదనిపిస్తే, ఏది సరైనదనిపిస్తే అది నాకు చేయండి. 15 అయితే ఒక్క విషయం తెలుసుకోండి: మీరు నన్ను చంపితే, ఒక నిర్దోషి రక్తాపరాధం మీ మీదికి, ఈ నగరం మీదికి, దాని నివాసుల మీదికి వస్తుంది. ఎందుకంటే, మీరు వింటుండగా ఈ మాటలన్నిటినీ చెప్పడానికి యెహోవాయే మీ దగ్గరికి నన్ను పంపించాడు, ఇది వాస్తవం.”

16 అప్పుడు అధిపతులు, ప్రజలందరు యాజకులతో, ప్రవక్తలతో ఇలా అన్నారు: “ఇతను మరణశిక్షకు తగినవాడు కాదు, ఎందుకంటే ఇతను మన దేవుడైన యెహోవా పేరున మనతో మాట్లాడాడు.”

17 అంతేకాదు, దేశంలోని పెద్దల్లో కొందరు లేచి, ప్రజలందరితో ఇలా అన్నారు: 18 “యూదా రాజైన హిజ్కియా+ రోజుల్లో మోరష్తీకి చెందిన మీకా+ ప్రవచించాడు, అతను యూదా ప్రజలందరితో ఇలా అన్నాడు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది,

యెరూషలేము శిథిలాల కుప్పల్లా మారుతుంది,+

మందిర* పర్వతం అడవిలోని ఎత్తైన స్థలాల్లా అవుతుంది.” ’+

19 “అప్పుడు యూదా రాజైన హిజ్కియా, యూదా ప్రజలందరూ అతన్ని చంపేశారా? అతను యెహోవాకు భయపడి, యెహోవా అనుగ్రహం కోసం వేడుకోలేదా? అప్పుడు యెహోవా వాళ్లకు వ్యతిరేకంగా చెప్పిన విపత్తు విషయంలో తన మనసు మార్చుకోలేదా?*+ కాబట్టి మనం మనమీదికి గొప్ప విపత్తును తెచ్చుకోబోతున్నాం.

20 “ఇంకో వ్యక్తి కూడా యెహోవా పేరున ప్రవచించాడు, అతను కిర్యత్యారీముకు+ చెందిన షెమయా కుమారుడైన ఊరియా. అతను కూడా యిర్మీయా లాంటి మాటలే అంటూ ఈ నగరానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. 21 అతని మాటల్ని యెహోయాకీము+ రాజు, అతని శూరులందరూ, అధిపతులందరూ విన్నారు; రాజు అతన్ని చంపాలని చూశాడు.+ ఊరియా దాని గురించి విన్నప్పుడు భయపడి ఐగుప్తుకు పారిపోయాడు. 22 అప్పుడు యెహోయాకీము రాజు అక్బోరు కుమారుడైన ఎల్నాతానును,+ అతనితో పాటు ఇంకొంతమందిని ఐగుప్తుకు పంపాడు. 23 వాళ్లు ఊరియాను ఐగుప్తు నుండి యెహోయాకీము రాజు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడతను ఊరియాను కత్తితో చంపి,+ అతని శవాన్ని సామాన్యుల సమాధి స్థలంలో పడేశాడు.”

24 అయితే షాఫాను+ కుమారుడైన అహీకాము+ యిర్మీయాకు సహాయం చేశాడు, కాబట్టి వాళ్లు అతన్ని చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి