కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • అనావృష్టి, కరువు, ఖడ్గం (1-12)

      • అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (13-18)

      • ప్రజల పాపాల్ని యిర్మీయా ఒప్పుకోవడం (19-22)

యిర్మీయా 14:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:24

యిర్మీయా 14:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 1:10

యిర్మీయా 14:3

అధస్సూచీలు

  • *

    లేదా “నీటి మడుగుల.”

యిర్మీయా 14:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:20; ద్వితీ 28:23

యిర్మీయా 14:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 12:4

యిర్మీయా 14:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:9; కీర్త 25:11
  • +ఎజ్రా 9:6; నెహె 9:33; దాని 9:5, 8

యిర్మీయా 14:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు! బ్రోషురు,

యిర్మీయా 14:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:14
  • +దాని 9:19

యిర్మీయా 14:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:23
  • +హోషే 8:13

యిర్మీయా 14:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 11:14

యిర్మీయా 14:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:15; 58:3; యెహె 8:18
  • +యెష 1:11
  • +యిర్మీ 9:16; యెహె 5:12

యిర్మీయా 14:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:10; 6:13, 14; 23:16, 17; 27:8-10; యెహె 13:10; మీకా 3:11

యిర్మీయా 14:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:21
  • +యిర్మీ 23:21; 27:15
  • +విలా 2:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2008, పేజీ 5

యిర్మీయా 14:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:12, 13; 23:15; యెహె 13:9

యిర్మీయా 14:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 79:2, 3; యిర్మీ 9:22
  • +యిర్మీ 4:18

యిర్మీయా 14:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 8:18, 21; 9:1
  • +విలా 1:15

యిర్మీయా 14:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 7:15
  • +విలా 5:10
  • +ద్వితీ 28:36

యిర్మీయా 14:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 12:8; విలా 5:22
  • +2ది 36:15, 16
  • +యిర్మీ 8:15

యిర్మీయా 14:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 9:7; దాని 9:5, 8

యిర్మీయా 14:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 36:22; దాని 9:15
  • +నిర్గ 32:13; లేవీ 26:41, 42; కీర్త 106:43-45

యిర్మీయా 14:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:12; యెష 30:23; యోవే 2:23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 14:1ద్వితీ 28:24
యిర్మీ. 14:2యోవే 1:10
యిర్మీ. 14:4లేవీ 26:20; ద్వితీ 28:23
యిర్మీ. 14:6యిర్మీ 12:4
యిర్మీ. 14:7యెహో 7:9; కీర్త 25:11
యిర్మీ. 14:7ఎజ్రా 9:6; నెహె 9:33; దాని 9:5, 8
యిర్మీ. 14:8కీర్త 106:21
యిర్మీ. 14:9ద్వితీ 23:14
యిర్మీ. 14:9దాని 9:19
యిర్మీ. 14:10యిర్మీ 2:23
యిర్మీ. 14:10హోషే 8:13
యిర్మీ. 14:11యిర్మీ 11:14
యిర్మీ. 14:12యెష 1:15; 58:3; యెహె 8:18
యిర్మీ. 14:12యెష 1:11
యిర్మీ. 14:12యిర్మీ 9:16; యెహె 5:12
యిర్మీ. 14:13యిర్మీ 4:10; 6:13, 14; 23:16, 17; 27:8-10; యెహె 13:10; మీకా 3:11
యిర్మీ. 14:14యిర్మీ 29:21
యిర్మీ. 14:14యిర్మీ 23:21; 27:15
యిర్మీ. 14:14విలా 2:14
యిర్మీ. 14:15యిర్మీ 5:12, 13; 23:15; యెహె 13:9
యిర్మీ. 14:16కీర్త 79:2, 3; యిర్మీ 9:22
యిర్మీ. 14:16యిర్మీ 4:18
యిర్మీ. 14:17యిర్మీ 8:18, 21; 9:1
యిర్మీ. 14:17విలా 1:15
యిర్మీ. 14:18యెహె 7:15
యిర్మీ. 14:18విలా 5:10
యిర్మీ. 14:18ద్వితీ 28:36
యిర్మీ. 14:19యిర్మీ 12:8; విలా 5:22
యిర్మీ. 14:192ది 36:15, 16
యిర్మీ. 14:19యిర్మీ 8:15
యిర్మీ. 14:20ఎజ్రా 9:7; దాని 9:5, 8
యిర్మీ. 14:21యెహె 36:22; దాని 9:15
యిర్మీ. 14:21నిర్గ 32:13; లేవీ 26:41, 42; కీర్త 106:43-45
యిర్మీ. 14:22ద్వితీ 28:12; యెష 30:23; యోవే 2:23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 14:1-22

యిర్మీయా

14 అనావృష్టి గురించి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం:+

 2 యూదా ఏడుస్తోంది,+ దాని ద్వారాలు పడిపోయాయి.

అవి విచారంతో నేలలోకి దిగిపోతున్నాయి,

యెరూషలేము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

 3 యజమానులు నీళ్ల కోసం సేవకుల్ని పంపిస్తున్నారు.

వాళ్లు బావుల* దగ్గరికి వెళ్లి, నీళ్లు లేకపోవడంతో

ఖాళీ కూజాలతో తిరిగొస్తున్నారు.

వాళ్లు సిగ్గుతో, నిరాశతో తలలు కప్పుకుంటున్నారు.

 4 దేశంలో వర్షం లేక నేల బీటలు వారింది,+

రైతులు దిగులుతో తలలు కప్పుకుంటున్నారు.

 5 చివరికి మైదానంలో పిల్లను ఈనిన దుప్పి కూడా

గడ్డి లేనందువల్ల దాన్ని వదిలేస్తోంది.

 6 అడవి గాడిదలు చెట్లులేని కొండలమీద నిలబడుతున్నాయి.

అవి నక్కల్లా రొప్పుతున్నాయి;

పచ్చిక లేకపోవడం వల్ల వాటి కళ్లు క్షీణించిపోతున్నాయి.+

 7 యెహోవా, మా తప్పులే మామీద సాక్ష్యం చెప్తున్నా,

నీ పేరు కోసం చర్య తీసుకో.+

ఎందుకంటే మా నమ్మకద్రోహ కార్యాలకు లెక్కేలేదు,+

మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం.

 8 ఇశ్రాయేలుకు నిరీక్షణగా ఉన్న దేవా, కష్టకాలంలో రక్షించే దేవా,+

నువ్వు దేశంలో అపరిచితుడిలా,

కేవలం ఒక రాత్రి బస చేయడానికి ఆగే యాత్రికుడిలా ఎందుకు ఉన్నావు?

 9 నువ్వు ఆశ్చర్యంలో మునిగిపోయిన వ్యక్తిలా,

రక్షించలేని శూరుడిలా ఎందుకున్నావు?

యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు,+

మేము నీ పేరుతో పిలవబడుతున్నాం.+

మమ్మల్ని విడిచిపెట్టకు.

10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లకు అటూఇటూ తిరగడమంటే చాలా ఇష్టం;+ వాళ్లు తమ పాదాల్ని అదుపులో పెట్టుకోలేదు. కాబట్టి యెహోవా వాళ్ల విషయంలో సంతోషించట్లేదు. ఇప్పుడు ఆయన వాళ్ల తప్పును గుర్తు చేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి లెక్క అడుగుతాడు.”+

11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఈ ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించకు.+ 12 వాళ్లు ఉపవాసం ఉన్నప్పుడు నేను వాళ్ల మొరల్ని వినను;+ వాళ్లు సంపూర్ణ దహనబలులు, ధాన్యార్పణలు అర్పించినప్పుడు వాటిని బట్టి సంతోషించను;+ నేను వాళ్లను ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నిర్మూలిస్తాను.”+

13 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ప్రవక్తలు వాళ్లతో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, కరువు మీ మీదికి రాదు, దేవుడు ఈ స్థలంలో మీకు నిజమైన శాంతిని దయచేస్తాడు’ అని చెప్తున్నారు.”+

14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఆ ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్నారు.+ నేను వాళ్లను పంపలేదు, వాళ్లకు ఆజ్ఞాపించలేదు, వాళ్లతో మాట్లాడనూ లేదు.+ వాళ్లు అబద్ధ దర్శనాన్ని, వ్యర్థమైన సోదెను, తమ హృదయాల్లో ఉన్న మోసాన్ని మీకు ప్రవచిస్తున్నారు.+ 15 నేను పంపకపోయినా నా పేరున ప్రవచిస్తూ, ఈ దేశం మీదికి ఖడ్గం గానీ కరువు గానీ రాదని చెప్తున్న ఆ ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు.+ 16 వాళ్లు ఎవరికైతే ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు, అంటే వాళ్లు, వాళ్ల భార్యలు, కుమారులు, కూతుళ్లు కరువు వల్ల, ఖడ్గం వల్ల యెరూషలేము వీధుల్లో పడేయబడతారు, వాళ్లను పాతిపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ ఎందుకంటే, నేను వాళ్లమీదికి తగిన విపత్తును రప్పిస్తాను.’+

17 “నువ్వు వాళ్లతో ఈ మాట చెప్పాలి:

‘రాత్రింబగళ్లు నా కళ్లలో నుండి ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి,+

ఎందుకంటే, నా ప్రజల కన్య పూర్తిగా నలగ్గొట్టబడింది, విరగ్గొట్టబడింది,+

ఆమెకు చాలా తీవ్రమైన గాయమైంది.

18 నేను పొలంలోకి వెళ్లి చూస్తే,

ఖడ్గం వల్ల హతమైనవాళ్లు కనిపిస్తున్నారు!+

నగరంలోకి వస్తే,

కరువు బాధితులు+ కనిపిస్తున్నారు!

ప్రవక్తలూ యాజకులూ తమకు తెలియని దేశంలో సంచరిస్తున్నారు.’ ”+

19 నువ్వు యూదాను పూర్తిగా తిరస్కరించావా? సీయోనును అసహ్యించుకున్నావా?+

మేము బాగవ్వలేనంతగా ఎందుకు మమ్మల్ని శిక్షించావు?+

మేము శాంతి కోసం ఎదురుచూశాం, కానీ ఏ మంచీ జరగలేదు,

బాగౌతుందని ఎదురుచూశాం, కానీ భయం అలుముకుంది!+

20 యెహోవా, మా దుష్టత్వాన్ని,

మా పూర్వీకుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం.

మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం.+

21 నీ పేరు కోసం, దయచేసి మమ్మల్ని తిరస్కరించకు;+

మహిమగల నీ సింహాసనాన్ని నీచంగా చూడకు.

నువ్వు మాతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకో, దాన్ని రద్దు చేయకు.+

22 దేశాలు పూజించే వ్యర్థమైన విగ్రహాల్లో ఏవైనా వర్షాన్ని కురిపించగలవా?

కనీసం ఆకాశమైనా దానంతటదే వర్షాన్ని కురిపించగలదా?

యెహోవా, మా దేవా, నువ్వు మాత్రమే దాన్ని చేయగలవు.+

మేము నీ మీదే ఆశపెట్టుకున్నాం,

ఎందుకంటే నువ్వే ఇవన్నీ చేస్తున్నావు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి