సామెతలు
30 ఇది యాకె కుమారుడైన ఆగూరు మాటల్లోని ముఖ్య సందేశం; ఈ మాటలు అతను ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పాడు.
2 నేను అందరికన్నా అజ్ఞానిని,+
మనుషులకు ఉండాల్సిన అవగాహన నాకు లేదు.
3 నేను తెలివిని నేర్చుకోలేదు,
అతి పవిత్రుడైన దేవుని జ్ఞానం నాకు లేదు.
4 ఆకాశానికి ఎక్కి కిందికి దిగింది ఎవరు?+
అరచేతులతో గాలిని పోగుచేసింది ఎవరు?
తన వస్త్రంలో నీళ్లను మూట కట్టింది ఎవరు?+
భూమి అంచుల్ని స్థిరపర్చింది ఎవరు?+
అతని పేరేంటో, అతని కుమారుడి పేరేంటో నీకు తెలిస్తే చెప్పు.
5 దేవుని ప్రతీ మాట స్వచ్ఛమైనది.*+
తనను ఆశ్రయించే వాళ్లకు ఆయన డాలు.+
7 దేవా, నేను రెండు విషయాలు నిన్ను కోరుకుంటున్నాను.
నేను బ్రతికున్నంత కాలం వాటిని నాకు దయచేయి చాలు.
8 అసత్యాన్ని, అబద్ధాల్ని నాకు దూరంగా ఉంచు.+
పేదరికాన్ని గానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వకు.
నాకు అవసరమైనంత ఆహారం నాకు దయచేయి చాలు.+
9 లేదంటే నేను తృప్తిచెంది, నిన్ను తిరస్కరించి, “యెహోవా ఎవరు?” అని అంటానేమో.+
అలాగే, నన్ను పేదవాణ్ణి కానివ్వకు; లేదంటే దొంగతనం చేసి నా దేవుని పేరుకు అపకీర్తి తెస్తానేమో.
10 సేవకుడి గురించి అతని యజమానికి లేనిపోనివి కల్పించి చెప్పకు,*
అలా చెప్తే అతను నిన్ను శపిస్తాడు, అప్పుడు నువ్వు దోషివి అవుతావు.+
11 తమ తండ్రిని శపిస్తూ, తల్లిని దీవించని తరం ఉంది.+
12 తమ దృష్టికి తామే శుద్ధులమని అనుకుంటూ,+
తమ మురికి* కడిగేయబడని తరం ఉంది.
13 గర్వంతో నిండిన కళ్లు,
అహంకార చూపులు+ కలిగిన తరం ఉంది.
14 ఖడ్గాల లాంటి పళ్లు,
వధించే కత్తుల లాంటి దవడలు గల తరం ఉంది;
వాళ్లు భూమ్మీది దీనుల్ని,
మనుషుల్లో పేదవాళ్లను మింగేస్తారు.+
15 జలగకు, “ఇవ్వు! ఇవ్వు!” అని అరిచే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తృప్తి చెందనివి మూడు ఉన్నాయి,
“చాలు!” అని ఎన్నడూ అననివి నాలుగు ఉన్నాయి. అవేంటంటే:
17 తండ్రిని వెక్కిరించి, తల్లికి లోబడనివాడి కళ్లను+
లోయ* కాకులు పీకుతాయి,
గద్ద పిల్లలు వాటిని తినేస్తాయి.+
18 నాకు అంతుపట్టని విషయాలు మూడు ఉన్నాయి,
నాకు అర్థంకానివి నాలుగు ఉన్నాయి. అవేంటంటే:
20 వ్యభిచార స్త్రీ పద్ధతి ఇలా ఉంటుంది:
ఆమె తిని, నోరు తుడుచుకుని,
ఆ తర్వాత, “నేను ఏ తప్పూ చేయలేదు” అంటుంది.+
21 భూమిని వణికించే విషయాలు మూడు ఉన్నాయి,
అది భరించలేని విషయాలు నాలుగు ఉన్నాయి, అవేంటంటే:
29 గంభీరంగా అడుగులు వేసేవి మూడు ఉన్నాయి,
ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి. అవేంటంటే:
30 ఎవ్వరికీ భయపడి వెనక్కి వెళ్లని
అత్యంత శక్తిగల జంతువైన సింహం;+
31 వేటకుక్క;* మేకపోతు;
తన సైన్యంతో ఉన్న రాజు.