కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-36)

        • హెబ్రీ దాసుల గురించి (2-11)

        • తోటివాడి మీద దౌర్జన్యం చేయడం గురించి (12-27)

        • జంతువుల గురించి (28-36)

నిర్గమకాండం 21:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:3; ద్వితీ 4:14

నిర్గమకాండం 21:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:39, 40
  • +ద్వితీ 15:12

నిర్గమకాండం 21:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 15:12

నిర్గమకాండం 21:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 15:16, 17

నిర్గమకాండం 21:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2010, పేజీ 4

నిర్గమకాండం 21:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “విడిపించడానికి.”

నిర్గమకాండం 21:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 7:3

నిర్గమకాండం 21:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:6; సం 35:30; మత్త 5:21

నిర్గమకాండం 21:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:11, 22-25; ద్వితీ 4:42; 19:3-5; యెహో 20:7-9

నిర్గమకాండం 21:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 15:30
  • +ద్వితీ 19:11, 12; 1రా 1:50; 2:29; 1యో 3:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 8/2020, పేజీ 8

నిర్గమకాండం 21:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:12

నిర్గమకాండం 21:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 40:15
  • +ఆది 37:28
  • +ద్వితీ 24:7

నిర్గమకాండం 21:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:9; సామె 20:20; 30:11, 17; మత్త 15:4

నిర్గమకాండం 21:18

అధస్సూచీలు

  • *

    లేదా “ఒక పనిముట్టుతో” అయ్యుంటుంది.

నిర్గమకాండం 21:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:5, 6; లేవీ 24:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 8/2020, పేజీ 7

నిర్గమకాండం 21:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 8/2020, పేజీ 7

నిర్గమకాండం 21:22

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆమె పిల్లలు బయటికి వచ్చారు.”

  • *

    లేదా “తీవ్రమైన హాని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 139:16; యిర్మీ 1:5
  • +నిర్గ 18:25, 26; ద్వితీ 16:18; 17:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 162

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 38

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 95-96

    “దేవుని ప్రేమ”, పేజీలు 91-92

నిర్గమకాండం 21:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:6; లేవీ 24:17; సం 35:31; ప్రక 21:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 162

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 38

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 95-96

    “దేవుని ప్రేమ”, పేజీలు 91-92

నిర్గమకాండం 21:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 24:20; మత్త 5:38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 149

నిర్గమకాండం 21:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 6:9; కొలొ 4:1

నిర్గమకాండం 21:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:5; సం 35:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2010, పేజీ 29

నిర్గమకాండం 21:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2010, పేజీ 29

నిర్గమకాండం 21:30

అధస్సూచీలు

  • *

    లేదా “విమోచన క్రయధనం.”

నిర్గమకాండం 21:32

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

నిర్గమకాండం 21:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:6, 14; ద్వితీ 22:8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 21:1నిర్గ 24:3; ద్వితీ 4:14
నిర్గ. 21:2లేవీ 25:39, 40
నిర్గ. 21:2ద్వితీ 15:12
నిర్గ. 21:4ద్వితీ 15:12
నిర్గ. 21:5ద్వితీ 15:16, 17
నిర్గ. 21:101కొ 7:3
నిర్గ. 21:12ఆది 9:6; సం 35:30; మత్త 5:21
నిర్గ. 21:13సం 35:11, 22-25; ద్వితీ 4:42; 19:3-5; యెహో 20:7-9
నిర్గ. 21:14సం 15:30
నిర్గ. 21:14ద్వితీ 19:11, 12; 1రా 1:50; 2:29; 1యో 3:15
నిర్గ. 21:15నిర్గ 20:12
నిర్గ. 21:16ఆది 40:15
నిర్గ. 21:16ఆది 37:28
నిర్గ. 21:16ద్వితీ 24:7
నిర్గ. 21:17లేవీ 20:9; సామె 20:20; 30:11, 17; మత్త 15:4
నిర్గ. 21:20ఆది 9:5, 6; లేవీ 24:17
నిర్గ. 21:22కీర్త 139:16; యిర్మీ 1:5
నిర్గ. 21:22నిర్గ 18:25, 26; ద్వితీ 16:18; 17:8
నిర్గ. 21:23ఆది 9:6; లేవీ 24:17; సం 35:31; ప్రక 21:8
నిర్గ. 21:24లేవీ 24:20; మత్త 5:38
నిర్గ. 21:26ఎఫె 6:9; కొలొ 4:1
నిర్గ. 21:28ఆది 9:5; సం 35:33
నిర్గ. 21:34నిర్గ 22:6, 14; ద్వితీ 22:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 21:1-36

నిర్గమకాండం

21 “నువ్వు వాళ్లకు అందజేయాల్సిన న్యాయనిర్ణయాలు ఇవే:+

2 “నువ్వు ఒక హెబ్రీయుణ్ణి దాసుడిగా కొంటే,+ అతను ఆరు సంవత్సరాలు నీకు దాసుడిగా సేవ చేస్తాడు. అయితే ఏడో సంవత్సరం అతను ఏమీ చెల్లించకుండానే స్వతంత్రుడౌతాడు.+ 3 అతను ఒంటరిగా వచ్చివుంటే ఒంటరిగానే వెళ్లిపోతాడు. కానీ అతనికి భార్య ఉంటే, ఆమె కూడా అతనితోపాటు వెళ్లిపోవాలి. 4 ఒకవేళ అతని యజమానే అతనికి భార్యను ఇచ్చివుంటే, ఆమె అతనికి కుమారుల్ని గానీ కూతుళ్లను గానీ కనివుంటే, ఆ భార్య, ఆమె పిల్లలు ఆమె యజమానికి చెందుతారు, అతను ఒంటరిగా వెళ్లిపోతాడు.+ 5 కానీ ఆ దాసుడు, ‘నేను నా యజమానిని, నా భార్యను, నా కుమారుల్ని ప్రేమిస్తున్నాను; నాకు స్వతంత్రుణ్ణి అవ్వాలని లేదు’ అని అంటూ వెళ్లడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే,+ 6 అతని యజమాని అతన్ని సత్యదేవుని దగ్గరికి తీసుకురావాలి. తర్వాత యజమాని అతన్ని తలుపు దగ్గరికి గానీ గుమ్మం దగ్గరికి గానీ తీసుకొచ్చి కదురుతో అతని చెవిని గుచ్చుతాడు; అప్పుడు అతను జీవితాంతం ఆ యజమానికి దాసుడౌతాడు.

7 “ఒకవేళ ఒక వ్యక్తి తన కూతుర్ని దాసురాలిగా అమ్మేస్తే, ఒక దాసుడు స్వతంత్రుడయ్యే విధంగా ఆమె స్వతంత్రురాలు అవ్వదు. 8 ఆమె యజమానికి ఆమె నచ్చక, అతను ఆమెను ఉపపత్నిగా చేసుకోకపోతే, వేరే వ్యక్తి ఆమెను కొనుక్కోవడానికి* అతను అనుమతించవచ్చు. అయితే ఆమెను పరదేశులకు అమ్మే హక్కు అతనికి లేదు, ఎందుకంటే అతను ఆమెకు నమ్మకద్రోహం చేశాడు. 9 ఒకవేళ అతను తన కుమారుని కోసం ఆమెను ఎంచుకుంటే, కూతురికి ఉండే హక్కుల్నే ఆమెకూ కల్పించాలి. 10 ఒకవేళ అతను ఇంకొక స్త్రీని పెళ్లిచేసుకుంటే, ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, వివాహ ధర్మం+ విషయంలో మొదటి భార్యకు ఏమీ తక్కువ చేయకూడదు. 11 అతను ఆమెకు ఈ మూడు అవసరాలు తీర్చకపోతే, ఆమె ఏమీ చెల్లించకుండానే స్వతంత్రురాలు అవుతుంది.

12 “ఒక వ్యక్తి ఎవరినైనా కొట్టినప్పుడు అతను చనిపోతే, ఆ వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+ 13 కానీ అతను అనుకోకుండా అలాచేస్తే, సత్యదేవుడు అలా జరగనిస్తే, ఆ వ్యక్తి పారిపోవడానికి నేను మీ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను.+ 14 ఒక వ్యక్తి తోటివాడి మీద చాలా కోపంతో కావాలని అతన్ని చంపితే+ ఆ వ్యక్తిని చంపేయాలి. ఆ వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి నా బలిపీఠం దగ్గరికి వచ్చినా, అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లి చంపాలి.+ 15 అమ్మనైనా, నాన్ననైనా కొట్టే వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+

16 “ఒక వ్యక్తి ఎవరినైనా అపహరించి+ అతన్ని అమ్మేస్తే, లేదా అపహరించిన వ్యక్తి దగ్గర అతను దొరికితే,+ అపహరించిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+

17 “అమ్మనైనా, నాన్ననైనా శపించే వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+

18 “మనుషులు గొడవపడుతుండగా, ఒక వ్యక్తి తన తోటివాణ్ణి రాయితో లేదా పిడికిలితో* కొట్టాడనుకోండి, దానివల్ల అతను చనిపోలేదు కానీ మంచం పట్టాడనుకోండి. అప్పుడు ఇలా చేయాలి: 19 అతను లేచి, తన చేతికర్ర సాయంతో బయట తిరగగలిగితే, కొట్టిన వ్యక్తికి శిక్ష వేయకూడదు. అయితే, గాయపడిన వ్యక్తి పూర్తిగా బాగయ్యేవరకు ఎంతకాలం పనిచేయలేకపోయాడో దానికి సరిపడా నష్టపరిహారాన్ని మాత్రం అతను చెల్లించాలి.

20 “ఒక వ్యక్తి తన దాసుణ్ణి గానీ దాసురాలిని గానీ కర్రతో కొట్టినప్పుడు, ఆ దాసుడు లేదా దాసురాలు అతని చేతిలో చనిపోతే, అతనికి తప్పకుండా శిక్ష విధించాలి.+ 21 కానీ ఆ దాసుడు ఒకట్రెండు రోజులు బ్రతికితే, యజమానికి శిక్ష వేయకూడదు, ఎందుకంటే ఆ దాసుడు తన యజమాని సొత్తు.

22 “మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, నెలలు నిండకుండానే ఆమె బిడ్డను కన్నది*+ కానీ ప్రాణాపాయం* ఏమీ జరగలేదనుకోండి; అప్పుడు ఆమె భర్త మోపే నష్టపరిహారాన్ని గాయం చేసిన వ్యక్తి చెల్లించాలి. న్యాయమూర్తుల+ ద్వారా అతను దాన్ని చెల్లించాలి. 23 కానీ ప్రాణాపాయం జరిగితే, ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.+ 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు,+ 25 వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ చెల్లించాలి.

26 “ఒక వ్యక్తి తన దాసుని కంటిమీద గానీ, దాసురాలి కంటిమీద గానీ కొట్టి దాన్ని పోగొడితే, అందుకు నష్టపరిహారంగా అతను ఆ దాసుణ్ణి లేదా దాసురాలిని స్వతంత్రుల్ని చేయాలి.+ 27 అతను తన దాసుడి పంటిని గానీ, దాసురాలి పంటిని గానీ ఊడగొడితే, అందుకు నష్టపరిహారంగా అతను ఆ దాసుణ్ణి లేదా దాసురాలిని స్వతంత్రుల్ని చేయాలి.

28 “ఒక ఎద్దు పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ పొడవడం వల్ల అతను లేదా ఆమె చనిపోతే, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి,+ దాని మాంసం తినకూడదు; అయితే ఆ ఎద్దు యజమానికి శిక్ష పడదు. 29 ఒకవేళ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉండి, ఆ విషయం గురించి దాని యజమానిని హెచ్చరించినా అతను దాన్ని అదుపులో ఉంచకపోవడంవల్ల అది ఒక పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ చంపితే, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి; దాని యజమానికి కూడా మరణశిక్ష విధించాలి. 30 అతని మీద ఏదైనా నష్టపరిహారం* మోపబడితే, అతను తన మీద మోపబడినదంతా తన ప్రాణ విమోచన వెలగా చెల్లించాలి. 31 అది ఒక వ్యక్తి కుమారుణ్ణి గానీ కూతుర్ని గానీ పొడిస్తే, అప్పుడు కూడా ఆ ఎద్దు యజమానికి ఈ న్యాయనిర్ణయం ప్రకారమే చేయాలి. 32 ఒకవేళ ఆ ఎద్దు ఒక దాసుడినో, దాసురాలినో పొడిస్తే, అతను వాళ్ల యజమానికి 30షెకెల్‌లు* చెల్లించాలి, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

33 “ఒకవేళ ఒక వ్యక్తి, ఒక గుంట మీదున్న కప్పు తీసి లేదా గుంట తవ్వి దాన్ని మళ్లీ కప్పకపోవడం వల్ల ఒక ఎద్దు గానీ గాడిద గానీ అందులో పడిపోతే, 34 ఆ గుంట యజమాని నష్టపరిహారం చెల్లించాలి.+ అతను ఆ జంతువు యజమానికి దాన్ని చెల్లించాలి, చనిపోయిన జంతువు అతనిది అవుతుంది. 35 ఒక వ్యక్తి ఎద్దు ఇంకో వ్యక్తి ఎద్దును గాయపర్చడం వల్ల అది చనిపోతే, వాళ్లు బ్రతికున్న ఎద్దును అమ్మి, వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవాలి; చనిపోయిన జంతువును కూడా ఇద్దరూ పంచుకోవాలి. 36 కానీ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉందని తెలిసి కూడా దాని యజమాని దాన్ని అదుపులో ఉంచకపోతే, అతను ఎద్దుకు ఎద్దునిచ్చి నష్టపరిహారం చెల్లించాలి; చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి