కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • హోరేబు దగ్గర నీళ్లు లేవని ఫిర్యాదు (1-4)

      • బండలో నుండి నీళ్లు (5-7)

      • అమాలేకీయులు యుద్ధం చేస్తారు, ఓడిపోతారు (8-16)

నిర్గమకాండం 17:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 33:12
  • +సం 33:2
  • +సం 33:14

నిర్గమకాండం 17:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 5:19, 21; సం 14:2, 3; 20:3
  • +సం 14:22; కీర్త 78:18, 22; 106:14

నిర్గమకాండం 17:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:2, 3

నిర్గమకాండం 17:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 7:20

నిర్గమకాండం 17:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 20:8; ద్వితీ 8:14, 15; నెహె 9:15; కీర్త 78:15; 105:41; 1కొ 10:1, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2018, పేజీలు 13-14

నిర్గమకాండం 17:7

అధస్సూచీలు

  • *

    “పరీక్షించడం; పరీక్ష” అని అర్థం.

  • *

    “గొడవపడడం” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:16; కీర్త 95:8, 9; హెబ్రీ 3:8, 9
  • +ద్వితీ 9:22
  • +కీర్త 81:7

నిర్గమకాండం 17:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:12
  • +ద్వితీ 25:17; 1స 15:2

నిర్గమకాండం 17:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2002, పేజీ 9

నిర్గమకాండం 17:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:15
  • +నిర్గ 24:13, 14

నిర్గమకాండం 17:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 11:12

నిర్గమకాండం 17:14

అధస్సూచీలు

  • *

    లేదా “జ్ఞాపికగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 24:20; ద్వితీ 25:19; 1ది 4:42, 43

నిర్గమకాండం 17:15

అధస్సూచీలు

  • *

    “యెహోవాయే నా ధ్వజస్తంభం” అని అర్థం.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 125

నిర్గమకాండం 17:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 19:1
  • +1స 15:20; ఎస్తే 9:24

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 17:1సం 33:12
నిర్గ. 17:1సం 33:2
నిర్గ. 17:1సం 33:14
నిర్గ. 17:2నిర్గ 5:19, 21; సం 14:2, 3; 20:3
నిర్గ. 17:2సం 14:22; కీర్త 78:18, 22; 106:14
నిర్గ. 17:3నిర్గ 16:2, 3
నిర్గ. 17:5నిర్గ 7:20
నిర్గ. 17:6సం 20:8; ద్వితీ 8:14, 15; నెహె 9:15; కీర్త 78:15; 105:41; 1కొ 10:1, 4
నిర్గ. 17:7ద్వితీ 6:16; కీర్త 95:8, 9; హెబ్రీ 3:8, 9
నిర్గ. 17:7ద్వితీ 9:22
నిర్గ. 17:7కీర్త 81:7
నిర్గ. 17:8ఆది 36:12
నిర్గ. 17:8ద్వితీ 25:17; 1స 15:2
నిర్గ. 17:9సం 11:28
నిర్గ. 17:10యెహో 11:15
నిర్గ. 17:10నిర్గ 24:13, 14
నిర్గ. 17:13యెహో 11:12
నిర్గ. 17:14సం 24:20; ద్వితీ 25:19; 1ది 4:42, 43
నిర్గ. 17:16ప్రక 19:1
నిర్గ. 17:161స 15:20; ఎస్తే 9:24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 17:1-16

నిర్గమకాండం

17 ఇశ్రాయేలీయులందరూ సీను ఎడారి నుండి బయల్దేరి+ యెహోవా ఆదేశం ప్రకారం ఒకచోటి నుండి ఇంకోచోటికి మారుతూ+ చివరికి రెఫీదీములో తమ డేరాలు వేసుకున్నారు.+ అయితే ప్రజలు తాగడానికి అక్కడ నీళ్లు లేవు.

2 కాబట్టి ప్రజలు, “తాగడానికి మాకు నీళ్లు ఇవ్వు” అంటూ మోషేతో గొడవపడడం మొదలుపెట్టారు.+ అయితే మోషే వాళ్లతో, “మీరెందుకు నాతో గొడవపడుతున్నారు? ఎందుకు యెహోవాను పరీక్షిస్తూ ఉన్నారు?”+ అన్నాడు. 3 అయితే అక్కడ ప్రజలకు చాలా దాహం వేసింది, దాంతో వాళ్లు మోషే మీద సణుగుతూ,+ “మమ్మల్ని, మా కుమారుల్ని, మా పశువుల్ని దాహంతో చంపడానికి మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చావు?” అని అంటూ ఉన్నారు. 4 చివరికి మోషే యెహోవాకు ఇలా మొరపెట్టాడు: “ఈ ప్రజలతో నేనేం చేయాలి? ఇంకాసేపైతే వాళ్లు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు!”

5 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు నైలు నదిని కొట్టిన నీ కర్రను+ తీసుకొని, ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని వెంటబెట్టుకొని ప్రజలకు ముందుగా వెళ్లు. నువ్వు ఆ కర్రను చేతిలో పట్టుకొని నడుస్తూ ఉండు. 6 ఇదిగో! నేను అక్కడ హోరేబులో బండ మీద నీ ముందు నిలబడి ఉంటాను. నువ్వు ఆ బండను కొట్టాలి, అప్పుడు దానిలో నుండి నీళ్లు వస్తాయి, ప్రజలు వాటిని తాగుతారు.”+ మోషే ఇశ్రాయేలు పెద్దల ముందు అలాగే చేశాడు. 7 ఇశ్రాయేలీయులు గొడవపడినందువల్ల, వాళ్లు “యెహోవా అసలు మన మధ్య ఉన్నాడా, లేడా?” అని అంటూ యెహోవాను పరీక్షించినందువల్ల+ అతను ఆ చోటికి మస్సా*+ అనీ మెరీబా*+ అనీ పేరు పెట్టాడు.

8 తర్వాత అమాలేకీయులు+ వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.+ 9 అప్పుడు మోషే యెహోషువతో+ ఇలా అన్నాడు: “మన తరఫున కొంతమంది పురుషుల్ని ఎంచుకొని వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు నేను సత్యదేవుని కర్రను నా చేతిలో పట్టుకొని కొండ పైన నిలబడతాను.” 10 అప్పుడు యెహోషువ సరిగ్గా మోషే చెప్పినట్టే చేసి,+ అమాలేకీయులతో యుద్ధం చేశాడు. మోషే, అహరోను, హూరు+ ఆ కొండ మీదికి ఎక్కివెళ్లారు.

11 మోషే తన చేతుల్ని ఎత్తి ఉంచినంతసేపు ఇశ్రాయేలీయులు గెలవసాగారు, కానీ అతను చేతులు దించగానే అమాలేకీయులు గెలవసాగారు. 12 మోషే చేతులు బరువెక్కినప్పుడు వాళ్లు ఒక రాయిని తీసుకొచ్చారు, అతను దానిమీద కూర్చున్నాడు. అప్పుడు అహరోను, హూరు అతనికి చెరో వైపున ఉండి అతని చేతుల్ని ఎత్తి పట్టుకున్నారు. దానివల్ల సూర్యాస్తమయం వరకు అతని చేతులు కదలకుండ అలాగే ఉన్నాయి. 13 అలా యెహోషువ అమాలేకీయుల్ని, వాళ్లతో ఉన్నవాళ్లను కత్తితో ఓడించాడు.+

14 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ మాటను జ్ఞాపకార్థంగా* గ్రంథంలో రాసి, యెహోషువకు కూడా ఇలా చెప్పు: ‘నేను ఆకాశం కింద నుండి అమాలేకీయుల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను, వాళ్లను ఇక ఎప్పటికీ ఎవరూ గుర్తుచేసుకోరు.’ ”+ 15 తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా-నిస్సీ* అని పేరు పెట్టి, 16 “అమాలేకు చెయ్యి యెహోవా* సింహాసనానికి విరోధంగా ఉంది+ కాబట్టి, యెహోవాకు తరతరాలపాటు అమాలేకుతో యుద్ధం ఉంటుంది”+ అన్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి