93 యెహోవా రాజయ్యాడు!+
ఆయన వైభవాన్ని వస్త్రంలా వేసుకున్నాడు;
యెహోవా బలాన్ని ధరించాడు.
ఆయన దాన్ని దట్టీలా కట్టుకున్నాడు.
భూమి స్థిరంగా స్థాపించబడింది;
దాన్ని కదిలించలేరు.
2 చాలాకాలం క్రితమే నీ సింహాసనం స్థిరపర్చబడింది;+
ఎప్పటినుండో నువ్వు ఉనికిలో ఉన్నావు.+
3 యెహోవా, నదులు ఉప్పొంగాయి,
నదులు ఉప్పొంగి ఘోషించాయి;
నదులు ఉప్పొంగుతూ హోరెత్తుతూ ఉన్నాయి.
4 అనేక జలాల శబ్దం కన్నా,
పోటెత్తే సముద్ర తరంగాల శక్తి కన్నా+
పరలోకంలో యెహోవా మహిమాన్వితుడు.+
5 నీ జ్ఞాపికలు ఎంతో నమ్మదగినవి.+
యెహోవా, పవిత్రత ఎల్లకాలం నీ మందిరాన్ని అలంకరిస్తుంది.+