కీర్తనలు
కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం. గీతం.
87 ఆయన నగర పునాది పవిత్ర పర్వతాల్లో ఉంది.+
2 యాకోబు డేరాలన్నిటి కన్నా
సీయోను ద్వారాలంటే యెహోవాకు చాలా ఇష్టం.+
3 సత్యదేవుని నగరమా, నీ గురించి గొప్పగొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు.+ (సెలా)
వాటి ప్రజల్లో ప్రతీ ఒక్కరి గురించి నేను, “ఇతను అక్కడ పుట్టాడు” అని అంటాను.
5 సీయోను గురించి ప్రజలు,
“ప్రతీ ఒక్కరు ఆ నగరంలో పుట్టారు” అని చెప్పుకుంటారు.
సర్వోన్నతుడు ఆ నగరాన్ని బలంగా స్థాపిస్తాడు.
6 ప్రజల పేర్లు నమోదు చేస్తున్నప్పుడు,
“ఇతను అక్కడ పుట్టాడు” అని యెహోవా ప్రకటిస్తాడు. (సెలా)