కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “లిల్లీ పువ్వులు” అనే రాగంలో పాడాలి. జ్ఞాపకం చేయడానికి. ఆసాపు+ కీర్తన. శ్రావ్యగీతం.
80 యోసేపును మందలా నడిపిస్తున్న+
ఇశ్రాయేలు కాపరీ, విను.
4 సైన్యాలకు దేవుడివైన యెహోవా, ఎంతకాలం నీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా ఉంటావు?*+
5 నువ్వు వాళ్లకు కన్నీళ్లను ఆహారంగా ఇస్తున్నావు,
విస్తారమైన కన్నీళ్లను వాళ్లతో తాగిస్తున్నావు.
6 నువ్వు మా పొరుగువాళ్లు మా విషయంలో గొడవపడేలా చేశావు,
మా శత్రువులు ఇష్టమొచ్చినట్టు మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు.+
7 సైన్యాల దేవా, మళ్లీ మామీద దయ చూపించు;
మేము రక్షణ పొందేలా నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేయి.+
8 నువ్వు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షతీగను+ బయల్దేరజేశావు.
జనాల్ని వెళ్లగొట్టి వాళ్ల దేశంలో దాన్ని నాటావు.+
9 నువ్వు దాని కోసం ఒక స్థలం సిద్ధం చేశావు,
అది బలంగా నాటుకొని, దేశమంతా విస్తరించింది.+
10 దాని నీడ పర్వతాల్ని కప్పేసింది,
దాని తీగలు దేవుని దేవదారు చెట్ల మీదికి ఎగబాకాయి.
12 మరి, దారినపోయే వాళ్లంతా దాని పండ్లను తెంచుకునేలా+
ద్రాక్షతోట చుట్టూ ఉన్న రాతిగోడల్ని నువ్వెందుకు పడగొట్టావు?+
13 అడవి పందులు దాన్ని పాడుచేస్తున్నాయి,
అడవి జంతువులు దాన్ని తినేస్తున్నాయి.+
14 సైన్యాల దేవా, దయచేసి తిరిగి రా.
పరలోకం నుండి కిందికి చూడు!
16 దాన్ని నరికేసి, కాల్చేశారు.+
నువ్వు గద్దించినప్పుడు ప్రజలు నశించిపోతారు.
17 నీ కుడివైపున ఉన్న మనిషిని,
నీ కోసం నువ్వు బలపర్చిన మనిషిని నీ చెయ్యి ఆదుకోవాలి.+
18 అప్పుడు మేము నిన్ను విడిచివెళ్లం.
మేము నీ పేరున ప్రార్థించేలా మమ్మల్ని ప్రాణాలతో ఉంచు.
19 సైన్యాలకు దేవుడివైన యెహోవా, మళ్లీ మామీద దయ చూపించు;
మేము రక్షణ పొందేలా నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేయి.+