కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; షెమినీతు* స్వరంలో తంతివాద్యాలతో పాడాలి. దావీదు శ్రావ్యగీతం.
6 యెహోవా, నీ కోపంతో నన్ను గద్దించకు,
నీ ఆగ్రహంతో నన్ను సరిదిద్దకు.+
2 యెహోవా, నేను కృశించిపోతున్నాను, నా మీద అనుగ్రహం* చూపించు.
యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను బాగుచేయి.+
6 నా మూల్గులతో నేను నీరసించిపోయాను;+
రాత్రంతా నా పరుపు కన్నీళ్లతో తడిచిపోతోంది;
నా మంచం కన్నీళ్లలో మునిగిపోతోంది.+
7 దుఃఖంతో నా కళ్లు బలహీనమయ్యాయి;
నన్ను వేధించేవాళ్లందరి వల్ల నా చూపు మందగించింది.
8 దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్లారా, నా దగ్గర నుండి వెళ్లిపోండి,
యెహోవా నా రోదనను వింటాడు.+
9 అనుగ్రహం కోసం నేను చేసే విన్నపాన్ని యెహోవా వింటాడు;+
నా ప్రార్థనకు యెహోవా జవాబిస్తాడు.
10 నా శత్రువులంతా అవమానించబడతారు, కలవరపడతారు;
వాళ్లు హఠాత్తుగా సిగ్గుతో వెనక్కి తిరిగి పారిపోతారు.+